District Educational Officer
-
బడులు తెరిచేలోగా పక్కా లెక్కలివ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బడులు తెరిచేలోగా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ సంవత్సరం దీని ఆధారంగానే స్కూళ్లకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం కూడా ఈ లెక్క ఆధారంగానే ఇవ్వనుంది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం యూనిఫైడ్ డి్రస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)ను రూపొందిస్తుంది. ఇందులో సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లు, మౌలిక సదుపాయాలను గుర్తిస్తారు. అయితే, ఈ గణాంకాలు సరిగా ఉండట్లేదనే విమర్శలున్నాయి. కచి్చతమైన వివరాలు పంపకపోవడం వల్ల ప్రణాళికలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈసారి సరైన పర్యవేక్షణతో యూడైస్ రూపొందించాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 50కి పైగా అంశాలు యూడైస్ పట్టికలో 50కిపైగా అంశాలుంటాయి. ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్ని నింపాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, తరగతి గదుల వివరాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ అనుసంధానమైన ప్రొజెక్టర్లు, టీవీ, ఫరి్నచర్, కిచెన్ షెడ్, ప్రహరీ వంటి అనేక వివరాలు పొందుపర్చాలి. దీంతోపాటే డిజిటల్ క్లాస్ రూమ్‌ల వివరాలు, నెట్ సదుపాయం కూడా ప్రత్యేకంగా చేర్చారు. హెచ్ఎంలు ఈ డేటాను మండల విద్యాశాఖాధికారికి అందిస్తే.. అక్కడ ఆన్లైన్లో పొందుపరుస్తారు. అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు ఈ వివరాలు వెళ్తాయి. వీటిని బట్టి ఈసారి మన ఊరు–మనబడి, మన బస్తీ–మనబడి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ బడులుంటే, ప్రస్తుతం 20 లక్షల మంది విద్యార్థులున్నారు. యూడైస్ లెక్కల ప్రకారమే వీరికి యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక పర్యవేక్షణ హెచ్ఎంల ద్వారా అందుతున్న డేటా ప్రకారం యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. యూడైస్‌లో కన్పించే లెక్క ఒకటైతే, వాస్తవ విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటోందని, ఫలితంగా యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వాటిలో చాలీచాలని పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. దీంతో హెచ్ఎంల డేటాను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, వారి నివేదికలు వచ్చాకే యూడైస్‌కు తుదిరూపం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. వీరితోపాటు మండల విద్యాశాఖ అధికారి నేతృత్వంలో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు వెళ్లాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతోంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. హెచ్ఎంలు కారణం కాదు బడుల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియే మొదలవ్వలేదు. పాఠశాలలు తెరిచినా రెండు నెలల వరకూ విద్యార్థులు చేరుతూనే ఉంటారు. కనీసం సెపె్టంబర్, అక్టోబర్ వరకు గానీ కచి్చతమైన లెక్క తేలదు. కానీ గత ఏడాది విద్యార్థుల లెక్కను యూడైస్‌కు ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. అయితే, ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడమో, తగ్గడమో జరుగుతోంది. ఇది హెచ్ఎంల తప్పు కాదు. కొంత ఆలస్యమైనా ఈ ఏడాది అడ్మిషన్ల లెక్కను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంగ్లిష్ మీడియం తెస్తున్న నేపథ్యంలో ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. – పిరాజాభాను చంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు) -
‘ఇంటర్ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు నోటీసులు’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఇంటర్ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ ప్రవేశాల కోసం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయన్నారు. తమ కాలేజీ విద్యార్థులే పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన కాలేజీలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. -
డీఈఓపై.. బదిలీ వేటు!
సాక్షి, నల్లగొండ : ఎట్టకేలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కొన్నాళ్లుగా జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ఏమీ పట్టనట్టు వ్యవహరించిన వారు ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టింగ్ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి పి.సరోజినీదేవిపై బదిలీ వేటు వేశారు. ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా విద్యాశాఖలో బాహాటంగా జరిగిన వ్యవహారాలను ‘సాక్షి’ రెండు వరుస కథనాలతో బట్టబయలు చేసింది. జిల్లా విద్యాశాఖను ఓ కుదుపు కుదిపిన ఈ కథనాలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం స్పందించక తప్పలేదు. జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం. మంగళ ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి పేర సిఫారసు లేఖను సృష్టించారు. ఈ సిఫారసు లేఖను అడ్డం పెట్టి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తనకు పోస్టింగ్ ఇచ్చినట్లుగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. వీటి ఆధారంగా ఆమె తిరిగి జిల్లా ఓపెన్స్ స్కూల్స్ కో–ఆర్డినేటర్‌గా నియామకం అయ్యారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ‘సాక్షి’ జిల్లా ఎడిషన్ లో ఈనెల 4వ తేదీన ‘పోస్టింగ్ కోసం ఫోర్జరీ’, 5వ తేదీన ‘ కదులుతున్న డొంక – పోస్టింగ్ లేఖ కూడా ఫోర్జరీ’ అన్న ప్రత్యేక కథనాలు ప్రచురించింది. కదిలిన ఉన్నతాధికారులు ఈ రెండు ప్రత్యేక కథనాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తొలుత అప్పటి కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ఓ నివేదిక తెప్పించుకుని ఉన్నతాధికారులకు సమర్పించారు. అదే సమయంలో డీఈఓ సైతం ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. ఆ వెంటనే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ‘మంత్రి కేటీఆర్ సిఫారసు లేఖను ఫోర్జరీ అని తేల్చారు. దీంతోపాటే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇచ్చినట్లుగా సృష్టించిన పోస్టింగ్ ఉత్తర్వులూ నకిలీదిగా గుర్తించారు. దీంతో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించి నకిలీ ఉత్తర్వుల కాపీ అంశంపై కో–ఆర్డినేటర్ మంగళపై నల్లగొండ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఆమె తన కో–ఆర్డినేటర్ పోస్టుకు రాజీనామా చేసి ఒరిజినల్ పోస్టు అయిన రావులపెంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నమోదైన ఈ కేసులో ఆమె వన్‌టౌన్ పోలీసుల ఎదుట సోమవారం నాడు లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. పూర్తి చర్యలకు సిఫారసు చేస్తూ డీఈఓ కార్యాలయం నుంచి ఆర్జేడీ కార్యాలయానికి నివేదిక పంపారు. అయితే, జిల్లా ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్‌గా మంగళను రెండోసారి కొనసాగించడానికి సహకరించడమే కాకుండా, కొత్తగా పోస్టింగ్ పొందిన సూర్యాపేట జిల్లాకు చెందిన హెచ్ఎంను విధుల్లో చేర్చుకోకుండా డీఈఓ తిప్పి పంపించారు. నకిలీ ఉత్తర్వుల ఆధారంగా మంగళను ఆపోస్టులో కొనసాగించారు. దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారని, ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే జి ల్లా విద్యాశాఖాధికారి పి.సరోజిదేవీపై బదిలీ వే టు వేశారని విద్యాశాఖ వర్గాలు విశ్లేషించాయి. -
విద్యాశాఖలో డెప్యుటేషన్ల గోల..!
సాక్షి, మచిలీపట్నం: ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం జిల్లా విద్యాశాఖలో కుదిపేస్తోంది. పాఠశాలల్లో అవసరం అనే పేరుతో కొంతమంది ఉపాధ్యాయులకు డెప్యుటేషన్ పేరిట ఇస్తున్న వర్క్ ఆర్డర్లు ఎవరికోసమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి పదోన్నతుల్లో భాగంగా కొత్తగా ఉపాధ్యాయులు వచ్చి చేరినప్పటకీ, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని ఇంకా అదే చోట కొనసాగిస్తుండటం విద్యాశాఖ పనితీరును ఎత్తిచూపిస్తోంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై, విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నప్పటకీ, జిల్లా విద్యాశాఖలో ఇంకా పాత విధానాలే అమలు అవుతున్నాయి. నూతన ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ నియామకాలు, పదోన్నతుల పర్వానికి పచ్చజెండా ఊపారు. ఇదే క్రమంలో జిల్లా విద్యాశాఖలో ఎస్జీటీల నంచి స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందారు. దీంతో జిల్లాలో సుమారుగా 330 సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్ పోస్టులు ఖాళీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. డీఈఓ పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సర్దుబాట్లు చేయాలనే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా వచ్చిన ఆదేశాలతో డీఈఓ కార్యాలయ అధికారులు అడ్డదారులకు తెరతీసినట్లుగా విమర్శలొస్తున్నాయి. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు.. విద్యార్థులు లేరనే సాకుతో టీడీపీ ప్రభుత్వం 2017లో చేపట్టిన రేషనలైజేషన్‌లో భాగంగా కొన్ని పాఠశాలలు పడగా, 53 మంది ఉపాధ్యాయులను పోస్టింగ్‌లు లేకుండా గాల్లో(డీఈఓ పూల్‌లో) ఉంచారు. అయితే జిల్లాలో ఖాళీ స్థానాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వగా, కొంతమందిని అవసరాల పేరుతో మరో పాఠశాలల్లో విధులు నిర్వహించేలా సర్దుబాటు చేశారు. వేతనాలు పొందేందుకు ఇదే వారికి సమస్యగా మారింది. డ్యూటీ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలనే దానిపై స్పష్టత లేకపోవటంతో చాలా మందికి సకాలంలో వేతనాలు రాని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలను మూసి వేసేందుకు శ్రద్ధ చూపిన అప్పటి టీడీపీ ప్రభుత్వం వీరికి శాశ్వత పోస్టుల్లో నియమించేందకు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవటంతో శాశ్వత పోస్టింగ్ కోసమని వీరికి రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పలేదు. ఇవేం సర్దుబాట్లు.. పదోన్నతులు ఇచ్చి ఇరువై రోజులకు పైగానే అవుతుంది. కానీ చాలా చోట్ల డెప్యుటేషన్లపై గతంలో పనిచేసిన వారు ఇంకా కొనసాగుతున్నారు. గతంలో సర్దుబాట్లు పేరుతో విద్యాశాఖాధికారులు చేసిన డెప్యూటేషన్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ తాజాగా అడ్డగోలు డెప్యుటేషన్లకు తెరతీస్తున్నట్లుగా తెలిసింది. అవసరం అనే సాకును చూపి డీఈఓను సైతం మాయజేసి, ఇక్కడి కొంతమంది సిబ్బంది చేస్తున్న పనులు పాలనకు మచ్చతెచ్చిపెడుతుంది. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెంలో పీఈటీ ఉండగా, ఇటీవల ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు ఉపాధ్యాయుడు వచ్చారు. కానీ ఇక్కడ ఇంకా అదే స్థానంలో సీఆర్పీని కొనసాగిస్తున్నారు . గూడూరు మండలం మళ్లవోలులో పీడీ, పీఈటీ ఉన్నారు. ఇక్కడ వలంటీర్ ఉన్నారు. పెనుమలూరు మండలం యనమలకుదరు బీసీ కాలనీ స్కూల్లో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఒక్క పోస్టులో ఏడాది కాలంగా ముగ్గురు ఎస్జీటీ ఉపాధ్యాయులు డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. రామవరప్పాడు మెయిన్ పాఠశాలలో ఎనిమిది పోస్టులకు గాను, ప్రస్తుతం ఏడుగురు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి పాఠశాల నిర్వహణకు ఇబ్బందేమీ లేకపోయినా ఓ ఉపాధ్యాయురాలిని డెప్యూటేషన్‌పై నియమించారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి బంధువు కావటం గమనార్హం. కలిదిండి మండలం భాస్కరరావు పేట జెడ్పీహెచ్ఎస్ నుంచి ఫిజికల్ సైన్సు బోధన కోసమని కాటూరుకు డిప్యుటేషన్‌పై నియమించారు. ఇటీవల పదోన్నతుల్లో కాటూరు పోస్టు భర్తీ అయింది. కానీ గతంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అదే చోట ఇంకా కొనసాగిస్తున్నారు. డీఈఓ పూల్‌లో ఉన్న వారికి న్యాయం చేయాలి డీఈఓ పూల్‌లో ఉన్న వారిని శాశ్వత పోస్టుల్లో వెంటనే నియమించాలి. అవసరం లేని చోట సర్దుబాటు పేరుతో ఇచ్చిన డెప్యుటేషన్లను రద్దు చేయాలి. ఉపాధ్యాయులు ఎక్కడ అవసరమనేది పక్కాగా గుర్తించి సర్దుబాట్లు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యాశాఖాధికారులు దానిపై దృష్టి పెట్టాలి. –ఎస్పీ మనోహర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సబ్జెక్టు టీచర్లను బోధనకే ఉపయోగించాలి సబ్జెక్టు టీచర్లను కార్యాలయ పనుల కోసమని డెప్యుటేషన్లను వేయటం సరైంది కాదు. విద్యార్థులకు మేలు చేసే పనులకు సంఘం మద్దతు తెలుపుతాం. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నాం. –మిర్జా హుస్సేన్, వైఎస్సార్ టీఎఫ్ ,రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వివరాలను పరిశీలిస్తున్నాం పాఠశాలల వారీగా ఖాళీలు, డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను తెప్పించుకుంటున్నాం. వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని జిల్లాలోని డెప్యూటీ డీఈఓ, ఎంఈవోలందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవసరం మేరకే డిప్యుటేషన్లు వేస్తున్నాం. డీఈఓ పూల్‌లో ఉన్న వారందరికీ శాశ్వత పోస్టులను కేటాయించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది. –ఎంవీ రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి -
మంత్రి గంటా ఊర్లోనే అందరికీ సంక్రాంతి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లి సరదాగా గడుపుదామని సంబరపడ్డ అధికారులు, ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు నివ్వెరపోయేలా చేశాయి. సంక్రాంతి పండుగనాడు సొంత ఊళ్లలో కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని కామేపల్లికి తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖాధికారి హుకుం జారీ చేశారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకుని కామేపల్లికి రావాలని ఆయన శనివారం ఉదయం 7 గంటలకే ఈ మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ చేరింది. అందులో పండుగ సందర్భంగా కామేపల్లిలో రంగోలి, పాటలు, డ్యాన్స్, ముగ్గుల పోటీలు నిర్వహించి పిల్లలకు, ఉపాధ్యాయులకు బహుమతులు ఇస్తారని పేర్కొన్నారు. దీనికోసం మంత్రి గంటా సోదరుడు, విద్యా శాఖను అన్నీ తానై నడిపిస్తున్న గంటా చిరంజీవి ఏకంగా ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచిపెట్టడం గమనార్హం. మంత్రి తీరుపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బహిరంగంగా విమర్శలు చేయలేక మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
పైసా వసూల్!
నెల క్రితం జిల్లాలోని ఓ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే విద్యాశాఖ కార్యాలయానికి చెందిన కొందరు శవాలపై పైసలెరుకునే చందంగా కేజీబీవీ ఉద్యోగుల నుంచి రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ పాఠశాలల అనుమతి కోసం కొంతమంది సెక్షన్ అధికారులు పైసలు ఇవ్వందే ఫైలు కదిలించడం లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కాసులిస్తే వసతులు లేకున్నా అనుమతి ఇట్టే ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆర్‌ఎంఎస్‌ఏ ఆడిట్ జరిగినప్పుడు కొంత మంది ప్రధానోపాధ్యాయులు యూసీలు సరిగా లేకపోవడంతో విద్యాశాఖ కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులు పలువురు హెచ్ఎంల నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. విద్యాశాఖలో అవినీతి తంతుకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఆదిలాబాద్‌టౌన్ : వేల రూపాయల్లో వేతనాలు.. అనుకూల పనివేళలు.. నిలకడ కలిగిన ఉద్యోగం.. అయినా అక్రమార్జనపై ఆశ.. లంచాలు ఇవ్వందే విద్యా శాఖలో పనులు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బు చూపిస్తే తప్పా కొందరు ఉద్యోగుల్లో చిరునవ్వు కానరావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాభివృద్ధికి సహకరించాల్సిన కొంతమంది కార్యాలయ ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి విధులను దుర్వినియోగపర్చుతున్నారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఒప్పంద ఉద్యోగుల జీతాలు, బిల్లులు, ప్రైవేట్ పాఠశాలల అనుమతులు.. ఇలా దేనిని వదలకుండా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని కార్యాలయ ఉద్యోగులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో కొంతమంది ఉద్యోగులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది. వారం క్రితం పాఠశాల విద్యాశాఖ రెగ్యులర్ డీఈవోగా జనార్దన్‌రావు నియమించినా ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. ఆయన జిల్లాకు రావడానికి అనాసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రతి పనికి ధరను నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతుండడంతో విద్యా శాఖ కార్యాలయం అంటే నే విరక్తి కలుగుతుందని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. కాసులిస్తేనే అనుమతి.. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలకు స్థలం, విశాలమైన తరగతి గదులు, మైదానం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, విద్యార్హతలున్న ఉపాధ్యాయులు, నీటి సదుపాయం, ఫైర్ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. కానీ జిల్లాలో చాలా వరకు ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటివరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పరిశీలనకు వెళ్లినప్పుడు అందినకాడికి దండుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది. కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ‘మామూలు’ తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల రెన్యువల్‌కు సంబంధించి వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవే ట్ పాఠశాలలు అదనపు సెక్షన్లు, ఎల్కేజీ, యూకేజీలకు కూడా అనుమతులు తీసుకోవా ల్సి ఉంటుంది. కానీ చాలా పాఠశాలల్లో ఎలాం టి అనుతులు లేకుండానే కొనసాగిస్తున్నారు. కొంతమంది విద్యాశాఖ ఉద్యోగులు వారికి ఫోన్ చేసి, పాఠశాలలకు తిరుగుతూ వసూలు చేసుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాశాఖ ఉద్యోగులతో పాటు కొం తమంది ఎంఈవోల తీరు కూడా అలాగే ఉం ది. మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి నెలకు ఎంతోకొంత డబ్బులు తీసుకుంటూ, విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. నెల క్రితం ఓ కేజీబీవీలో విద్యార్థిని అనార్యోగంతో మృతి చెందితే కేజీబీవీ ఉద్యోగి నుంచి కొంత మంది ఉద్యోగులు రూ.20వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంత జరగుతున్నా పట్టించుకునేవారు లేక విద్యాశాఖ అవినీతికి నిలయంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. సమయ పాలనేదీ? జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఇష్టమొచ్చినప్పుడు రావడం, నిర్దేశిత సమయానికి ముందే ఇంటిముఖం పట్టడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం వచ్చేవారికి ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లిన వారు మూడు గంటలు దాటితేకానీ కార్యాలయం ముఖం చూడరు. సాయంత్రం 5 అయ్యిందంటే కార్యాలయంలో ఉండని పరిస్థితి. కొత్త డీఈవో విధుల్లో చేరితేనే గాడిలో.. ప్రస్తుతం ఇన్చార్జి డీఈవోగా కార్యాలయ ఏడీ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ డీఈవో పదోన్నతిపై వెళ్లడంతో కొన్ని నెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. అలాగే డెప్యూ టీ ఈవో, ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈవో లు లేకపోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోందనే విమర్శలున్నాయి. వారం క్రితం నాగర్‌కర్నూల్‌లో విధులు నిర్వహిస్తున్న జనార్దన్‌రావుకు డీఈవోగా పదోన్నతి కల్పిస్తూ ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. రెగ్యులర్ డీఈవో లేని ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి విద్యాశాఖ కార్యాలయం లో అక్రమాలు పెరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఆయా సెక్షన్ల ఉద్యోగులు పాతుకుపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతోంది. దీర్ఘకాలికంగా పని చేస్తున్న వారి సెక్షన్లు మార్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు, కేజీబీవీల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై గతంలో ఇన్చార్జి డీఈవో రవికాంత్‌రావు దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. కొత్త డీఈవో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. – వృకోధర్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా దృష్టికి రాలేదు విద్యాశాఖ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. పని కోసం ఎవరైనా డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు సమయపాలన పాటించాలి. విధులను విస్మరిస్తే చర్యలు తప్పవు. – కిశోర్‌సింగ్, ఇన్చార్జి డీఈవో, ఆదిలాబాద్ -
ఉపాధ్యాయ ‘మిథ్య’
డైట్ కాలేజీల్లో కుంటుపడుతున్న బోధన - ఒకే గదిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు పాఠాలు - తెలుగు మీడియంలోనే బోధన.. ఇంగ్లిష్ మీడియం వారికి గందరగోళం - ఇలా తెలుగులో డీఎడ్ చేస్తే.. ఇంగ్లిష్‌లో బోధించేదెలా? - పట్టించుకోని ప్రభుత్వం, డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులనైనా భర్తీ చేయని వైనం - అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు.. 80% పోస్టులు ఖాళీ ఇది మహబూబ్‌నగర్‌లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లోని తరగతి గది. డీఎడ్ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థుల్లో ఒక వైపు ఉన్నది తెలుగు మీడియం వారుకాగా.. మరోవైపు ఉన్నది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. రెండు మీడియంల వారికి ఒకే తరగతి గదిలో తెలుగులోనే బోధన జరుగుతోంది. బోధించే అంశాలు అర్థంకావట్లేదు నేను ఏడో తరగతి నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నా. ఉపాధ్యాయ శిక్షణకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశం పొందాను. కాని రెండు మీడియంల విద్యార్థులను కలిపి కూర్చోబెట్టి.. తెలుగులో బోధించడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. సరిగా అర్థం కావడం లేదు కూడా.. - కె.చరణ్, వరంగల్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థి ప్రత్యేకంగా బోధించేలా చర్యలు.. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. గెస్ట్ లెక్చరర్లను నియమిస్తాం. అక్టోబర్, నవంబర్లలో ఓరియంటేషన్ తరగతులను నిర్వహించబోతున్నాం. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ అమల్లోకి వచ్చాక పదోన్నతులు ఇవ్వాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..’’ – బి.శేషుకుమారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదరాబాదరాగా మొదలు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. భవిష్యత్తులో వాటిల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించే ఉపాధ్యాయ అభ్యర్థుల అవసరాన్ని గుర్తించి.. ఈసారి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనూ డీఎడ్ కోర్సును ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా చేరారు. కానీ అధ్యాపకుల కొరత కారణంగా ఇంగ్లిష్ మీడియంలో బోధన జరపలేని పరిస్థితి నెలకొంది. తెలుగులోనే బోధన కొనసాగుతోంది. దీంతో ఈ అభ్యర్థులు ఇంగ్లిష్ మీడియం టీచర్లు ఎలా అవుతారు, విద్యార్థులకు ఎలా బోధిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్తగా ఒక్క పోస్టూ ఇవ్వని వైనం రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు కాకుండా 10 డైట్లు ఉన్నాయి. ఒక్కో డైట్లో 100 డీఎడ్ సీట్లు ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికిగాను వీటిలో 50 సీట్లను తెలుగు మీడియం విద్యార్థులతో, మరో 50 సీట్లను ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో భర్తీ చేశారు. కానీ ఇంగ్లిష్ మీడియం బోధనకు అధ్యాపకులను ఇవ్వడం మరచిపోయారు. విద్యాశాఖ ఆ కోర్సును బోధించేందుకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయలేదు. ఇప్పటికే అరకొరగా ఉన్న తెలుగు మీడియం లెక్చరర్లతోనే నెట్టుకొస్తోంది. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. వాస్తవానికి డైట్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాల్సిన పోస్టులకు సర్వీసు రూల్స్ సమస్య ఉంది. ఈ సమస్య లేని డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులనైనా భర్తీ చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం సరిపడా తాత్కాలిక లెక్చరర్లనైనా నియమించలేదు. దీంతో ఇంగ్లిష్ మీడియం డీఎడ్‌ను ప్రవేశపెట్టినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని డైట్ తరగతి గది ఇది. ఇక్కడా ఓవైపు తెలుగు మీడియం, మరోవైపు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు. లెక్చరర్ బోధిస్తున్నది తెలుగులోనే. రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో నెలకొన్న దుస్థితి ఇది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో డీఎడ్ కోర్సు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు కూడా తెలుగు మీడియమే దిక్కవుతోంది. డైట్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతే దీనికి కారణమవుతోంది. అంతేకాదు ఏకంగా 80 శాతం ఖాళీలు ఉండడంతో తెలుగు మీడియంలో బోధన కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఎస్సీఈఆర్టీ దృష్టికి తీసుకెళ్లాం అధ్యాపకుల కొరత కారణంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిం చాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బో«ధనకు 16 మంది కావాలి. ఎంత సర్దుబాటు చేసినా 8 మంది అయినా అవసరం. కానీ అందుబాటులో లేరు. రెండు మీడియంల విద్యార్థులతో కంబైన్డ్ క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన సూచన మేరకు బోధన కొనసాగిస్తున్నాం.. రవికుమార్ వరంగల్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ -
ఏదీ రథసారథి..
► రథసారథిలేని జిల్లా విద్యాశాఖ ► పరిహాసంగా మారిన ఇన్చార్జి బాధ్యతలు ఆరిలోవ: జిల్లా విద్యాశాఖ రథసారధి నియామకంలో ఉన్నతాధికారులు దోబూచులాడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేసిన వెంకటకృష్ణారెడ్డి ఆర్జేడీగా పదోన్నతిపై వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి ఎవరినీ డీఈవోగా నియమించలేదు. ఇన్చార్జి బాధ్యతలు డిప్యూటీ డీఈవోకు రేణుకకు అప్పగించారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడవకముందే ఉన్నతాధికారులు అర్బన్ డిప్యూటీ డీఈవో జి.నాగమణికి ఆ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అధికారులు మారినట్టయింది. సౌకర్యాలు సమకూరినా.. రూరల్ తహసీల్దారు కార్యాలయం పక్కన జాతీయ రహదారిని ఆనుకొని ఇటీవల నూతన డీఈఓ కార్యాలయం నిర్మించారు. దీని నిర్మాణం పనులు దగ్గరుండి చేపట్టిన అప్పటి డీఈఓ వెంకటకృష్ణారెడ్డి ఇక్కడ కుర్చీలో కూర్చోకుండానే పదోన్నతిపై ఫిబ్రవరిలో ఆర్జేడీగా రాజధానికి వెళ్లిపోయారు. దీంతో నూతన భవనంలో ఈ కుర్చీ ఖాళీ అయిపోయింది. ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. డిప్యూటీ డీఈఓలుగా పనిచేస్తున్న సీవీ రేణుక, జి.నాగమణిలలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలో సరిగా తేల్చుకోలేకపోయారు. అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేసిన నాగమణికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు వెంకటకృష్ణారెడ్డి రిలీవ్ కాబోయే ముందు రోజు ప్రకటించారు. రెండో రోజు ఆమె బాధ్యతలు స్వీకరిస్తారనుకొనే సమయంలో అదే రోజు అర్ధరాత్రి మళ్లీ ఉత్తర్వులు మారిపోయాయి. ఇన్చార్జ్ బాధ్యతలు రూరల్ పరిధిలో డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న సీవి రేణుకకు అప్పగించినట్లు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి పంపించారు. దీంతో రేణుక ఫిబ్రవరి 13న బాధ్యతలు తీసుకున్నారు. రేణుక తన సీనియారిటీని చూపించి ఉన్నతాధికారుల నుంచి రాత్రికి రాత్రే ఆర్డర్ తెప్పించుకోగలిగారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్నాను.. నాకూ సీనియారిటీ ఉంది. ఆ బాధ్యతలు నాకే అప్పగించాలని కోరుతూ నాగమణి విద్యాశాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. దీంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు ఆమె విన్నపాన్ని పునఃపరిశీలించి శుక్రవారం రాత్రి నాగమణికి పూర్తి ఇన్చార్జి (ఎఫ్ఐసీ) బాధ్యతలు అప్పగించి, రేణుకకు మళ్లీ డిప్యూటీ డీఈఓగా రూరల్ బాధ్యతలు చూడాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో శనివారం రేణుక.. నాగమణికి బాధ్యతలు అప్పగించారు. కాగా.. డీఈఓ భవనంలో కుర్చీ కోసం ఇంకెన్ని ఆటలు చూడాల్సి వస్తుందో, ఎవరు పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారోనని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. -
సమ్మేటివ్-1లో తప్పులకు మార్కులు
ఒంగోలు : సమ్మేటివ్-1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడంతో వాటికి మార్కులను కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీకి తప్పులు దొర్లాయంటూ అందిన సమాచారం మేరకు వాటిని పరిశీలించి విద్యార్థులకు మార్కులు కలిపేందుకు నిర్ణయించారు. తరగతులు వారీగా, సబ్జెక్టుల వారీగా వీటికి మార్కులను కలిపేలా ఉపాధ్యాయులకు సూచించాలని ఎస్సీఈఆర్టీ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సూచించింది. ► 6వ తరగతి ఇంగ్లీషులో 10, 11సి(2) ప్రశ్న స్పష్టంగా లేదని దానికి మార్కులు కలపనున్నారు. లెక్కలు పరీక్షలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి. ► 8వ తరగతిలో లెక్కలులో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి. ► 10వ తరగతి ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ హింట్స్ స్టోరీ సమ్మేటివ్–2 సిలబస్‌కు సంబంధించినది. లెక్కలు–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి. సమ్మేటివ్–2 సిలబస్ విడుదల సమ్మేటివ్–2 సిలబస్‌ను స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చి ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయి, 70 శాతం ప్రశ్నలను ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు. -
25న ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్ష
రాష్ట్రంలోని పాఠశాలల్లో వివిధ కేటగిరిలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొషెషనల్ అడ్వాన్సెమెంట్ టెస్ట్‌ను ఈ నెల25న గుంటూరులోని హిందూ కాలేజీలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వి.యస్.భార్గవ తెలిపారు. ఇతర సమాచారం కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని గాని, కార్యాలయపు వెబ్ సైట్లో గాని సంప్రదించాల్సిందిగా సంచాలకులు ప్రకటించారు. -
గాడితప్పిన విద్యాశాఖ
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు పేరుకుపోయాయి. స్కూళ్లు తెరిచి రెండు నెలలు అవుతున్నా నేటికీ ఒక్క విద్యార్థికి కూడా యూనిఫాం అందలేదు. పాఠ్యపుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో అందక విద్యార్థులు సతమతమవుతున్నారు. కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఇంగ్లిషు మీడియం పుస్తకాలు అందలేదు. ఈ ఏడాది మార్చి నుంచి నేటి వరకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు రాక వంట నిర్వాహకులు అప్పుల పాలయ్యారు. వంట గదులు లేక ఇక్కట్లు: జిల్లా వ్యాప్తంగా 1600 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయటే వంటలను చేస్తున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. పలు పాఠశాలల్లో సరిపడ తరగతి గదులు లేక వరండాలు, చెట్ల కింద కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 217 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేశారు. కానీ నేటికి వాటికి సరైన మౌలిక వసతులను కల్పించడంలో విఫలమయ్యారు. ఉపాధ్యాయులకు పర్మినెంట్ స్థానాలు కరువు: 2015 అక్టోబర్‌లో జరిగిన పాఠశాలల రేషనలైజేషన్‌లో విద్యార్థులు లేక 277 పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో 105 మంది ఉపాధ్యాయులు మిగిలిపోయారు. దీంతోపాటు 2014 డీఎస్సీలో నూతనంగా 125 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అలాగే అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా 36 మంది ఉపాధ్యాయులు జిల్లాకు వచ్చారు. వీరిలో రెషనలైజేషన్లో మిగిలిపోయిన 105 మందిలో 26 మందికి మాత్రమే పర్మినెంట్ స్థానాలను కేటాయించారు. మిగతా వారందరిని మూతబడిన పాఠశాలల్లో ఉన్నట్లే చూపిస్తూ మరో పాఠశాలలో పని చేపిస్తూ జీతాలను ఇస్తున్నారు. అలాగే నూతన డీఎస్సీలో వచ్చిన 125 మందికి గాను కేవలం 14 మందికి మాత్రమే పర్మినెంట్ స్థానాలను కల్పించారు. మిగతా వారందరికి పని ఒక చోట చేస్తే జీతం మరో చోట ఇస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల పరిస్థితి ఇంతే. రెగ్యులర్ ఎంఈఓల కొరత: జిల్లాలో 51 మండలాలకు గాను కేవలం 8 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా వారంతా హెచ్ఎంలే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా పలు సమస్యలు విద్యా శాఖలో తాండవిస్తున్నాయి. కడప జిల్లా పర్యటనకు వస్తున్న విద్యా కమిషనర్ సంధ్యారాణి చొరవ తీసుకుని పరిష్కరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పాఠశాలల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు కృషి చేయాలి
లక్కోర(వేల్పూర్) : పాఠశాలల అభివృద్ధికి పూ ర్వవిద్యార్థులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య పే ర్కొన్నారు. మండలంలోని లక్కోర ఉన్న త పాఠశాలకు చెందిన 1989–90 బ్యా చ్ ఏడవ తరగతి విద్యార్థులు, 2015– 16 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు విరాళం గా ఇచ్చిన ప్రొజెక్టర్, ప్రింటర్‌ను డీఈవో మంగళవారం పాఠశాలకు అందజేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 300 పా ఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు గణితం, సైన్స్ బోధించం డం, చార్టులు, పిక్చర్స్ చూపించడం వ ల్ల అన్ని అంశాలు విద్యార్థులకు బాగా గుర్తుంటాయన్నారు. ప్రొజెక్టరు, ప్రింట ర్ వితరణ చేసిన విద్యార్థులను డీఈవో సన్మానించారు. ఎంఈవో లింగమూర్తి, సర్పంచ్ తిరుమల శ్రీనివాస్, రిటైర్డు ఎంఈవో విద్యాసాగర్‌రెడ్డి,అమీనాపూర్ సర్పంచ్ కె. రాజాగౌడ్, ఎంపీటీసీ లో లం నర్సుగంగారాం, ప్రైమరీస్కూలు హెచ్ఎం సురేందర్, ఎ స్సెమ్సీ చైర్మన్ శారద, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయు లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అచ్చెన్నకు ‘గంటా’ చెక్!
ఒక్క సిఫారసూ అమలు చేయని వైనం శ్రీకాకుళం : జిల్లా విద్యాశాఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుకు చెక్ పెడుతూ వస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఎంపీగా ఉన్ననాటి నుంచి వారి కుటుంబంతో గంటాకు మంచి సంబంధాలు ఉండేవి. ఎర్రన్నాయుడు మర ణానంతరం అదే పంథాను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత శ్రీకాకుళం జెడ్పీ సీఈఓ నగేష్ నియామకం నుంచి అచ్చెన్నాయుడు, గంటాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే ప్రచారం ఉంది. నగేష్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్డీగా వ్యవహరించేవారు. అప్పట్లో విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పిన ఓ పనిని గంటాకు తెలియకుండా నగేష్ చేయడంతో ఆయను ఓఎస్డీగా తొలగించినట్లు అప్పట్లో వ్యాఖ్యానాలు ఉండేవి. అటు తరువాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు నగేష్‌ను శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా నియమించాలని యోచిస్తూ మంత్రి అచ్చెన్న అడుగగా దానికి ఆయన సమ్మతించడంతో నగేష్ సీఈఓగా శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. దీన్ని గంటా కాస్త సీరియస్‌గానే తీసుకున్నారని అప్పట్లో ఆయన అనుయాయులే చెప్పారు. అచ్చెన్నతో సజావుగా ఉంటున్నట్లు ప్రవర్తిస్తున్నా అనేక సందర్భాల్లో ఆయన చేసిన సిఫారసులు అమలుకు నోచుకోకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. వాటిని పరిశీలిస్తే.. రాజీవ్ విద్యా మిషన్ పీవోగా గతంలో రామచంద్రారెడ్డి పనిచేశారు. ఆయన్ని ఓ సందర్భంలో మంత్రి గం టా శ్రీనివాసరావు స్వయంగా మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఆయనను రిలీవ్ చేయకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రామచంద్రారెడ్డిని కొనసాగించేందుకు మంత్రి అచ్చెన్న ప్రయత్నాలు చేశారు. సుమారు రెండు నెలలపాటు రామచంద్రారెడ్డి ఆ పోస్టులో కొనసాగినా మంత్రి మాత్రం ఎవరి సిఫారసులకూ తలొగ్గకుండా సరెండర్కే కట్టుబడ్డారు. చేసేది లేక రెండు నెలల తరువాత రామచంద్రారెడ్డిని రిలీవ్ చేయాల్సి వచ్చింది. రాజీవ్ విద్యా మిషన్ ఎఫ్‌ఏఓగా మోహనరావు అనే వ్యక్తినినియమించారు. ఈయనను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని, ఆయనను మార్పు చేయిస్తామని మంత్రి కార్యాలయ వర్గాలు ఆర్వీఎం అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఆ పోస్టులో ఓ అనర్హుడిని ఆర్వీఎం ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని కొనసాగించారు. సుమారు 6 నెలల పాటు మోహనరావుకు బాధ్యతలు అప్పగించకుండా చేశారు. ఆయన బదిలీకి ఎన్ని సిఫారసులు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజుల క్రితం శ్రీకాకుళం ఆర్వీఎం ఎఫ్‌ఏఓగా మోహనరావుకు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జీసీడీఓగా ఓ ప్రధానోపాధ్యాయురాలిని నియమించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అధికారుల రేటిఫికేషన్ కోసం నివేదించారు. ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర అధికారుల నుంచి సమాధానం లేదు. జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఈ విషయంపై మంత్రి గంటాను ఆశ్రయించి అచ్చెన్నాయుడు సిఫారసులతో జీసీడీఓగా ఆమె చేరారని ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర అధికారుల నుంచి ఉత్తర్వులు రాకుండా నిలుపుదల చేయించినట్లు భోగట్టా. శ్రీకాకుళం విద్యాశాఖాధికారి దేవానందరెడ్డికి కృష్ణా లేని పక్షంలో కర్నూలు జిల్లాకు బదిలీ అవుతుందని మార్చి నెల నుంచి ప్రచారం జరుగుతోంది. కాగా ఆయనకు బదిలీ చేస్తే ఆ స్థానంలో ఓ ఉప విద్యాశాఖాధికారిని నియమించాలని అచ్చెన్న ద్వారా ఓ వర్గం ఓ పేరును ప్రతిపాదించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. డీఈఓను బదిలీ చేస్తే అచ్చెన్న సిఫారసు చేసిన వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందేమోనని డీఈఓ బదిలీనే నిలుపుదల చేయించినట్లు సమాచారం. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో డీఈఓకు బదిలీ చేయాల్సి వస్తే ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో నియమించేలా, ఆయన స్థానంలో సిఫారసులకు అతీతంగా వేరొక రి పేరును చేర్చాలని ఆ మేరకు ఫైలును సిద్ధం చేస్తే తాను విదేశాల నుంచి వచ్చిన తరువాత పరిశీలన చేస్తానని మంత్రి గంటా రాష్ట్ర ఉన్నతాధికారులతో అన్నట్లు తెలియవచ్చింది. శ్రీకాకుళం విద్యాశాఖాధికారిగా ఇదివరలో ఎస్.అరుణకుమారి పనిచేశారు. ఆమె బదిలీ వెనుక అచ్చెన్న హస్తం ఉందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. జిల్లా నుంచి రిలీవ్ అయిన అరుణకుమారి పాడేరులో బాధ్యతలు చేపట్టకుండా దీర్ఘకాలిక సెలవుపై ఉండిపోయారు. ఆమెను డీఈఓగా నియమించకుండా చూడాలని అచ్చెన్న వర్గం కృషిచేసింది. అయితే దానికి భిన్నంగా అరుణకుమారిని వారం రోజుల క్రితమే విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు. ఇలా అడుగడుగునా అచ్చెన్నకు గంటా చెక్ పెడుతూ వస్తున్నారు. -
డీఈవో కార్యాలయం ముట్టడి
ఆదిలాబాద్: జిల్లాలో నిబంధనలు పాటించకుండా ఇష్టారితీనా నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ప్రైవేటు పాఠశాలలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కో కన్వీనర్ మనోజ్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే ఎలాంటి అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న డీఈవో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీవో నంబర్ 1కు విరుద్దంగా ఫీజుల వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, షూలు, బెల్టులు, తదిర వస్తువులను విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. కాన్వెంట్, డీజీ, మాడల్, కాన్సెప్ట్, డిజిటల్ తదితర తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్శించి వారి నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ ‘మామూలు’గా తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరసనలో ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షాహజాది, జిల్లా నాయకులు రాజేష్, ప్రశాంత్, రవికాంత్, ప్రమోద్, నిఖిల్, సురేష్, కర్ణ, సర్వేష్, రత్నామాల పాల్గొన్నారు. -
విద్యాశాఖ కొరడా
విజయనగరం: గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. నగరంలోని ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు ప్రధాన అంశంగా విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇన్చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి సారధ్యంలో మండల విద్యాధికారులు 6 బృందాలుగా ఏర్పడి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. 58 పాఠశాలల్ని తనిఖీ చేసి అందులో 19 గుర్తింపు లేనివిగా నిర్థారించారు. వాటిని తక్షణమే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ లింగేశ్వరరెడ్డి సమక్షంలో అమర్ కాన్సెప్ట్ స్కూల్, వెంకటరమణ స్కూల్, బీఎస్ఎం స్కూళ్లకు తక్షణ చర్యలుగా తాళాలు వేశారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తం దాడులు చేస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకొని మరో నాలుగు స్కూళ్లలో యాజమాన్యాలు అనధికార అదనపు తరగతుల విభాలను మూసేశాయి. మూతబడిన పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి రెన్యువల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నవే అధికంగా ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలకు మాత్రమే గుర్తింపు తెచ్చుకొని ఉన్నత పాఠశాల తరగతులను అనధికారికంగా నిర్వహిస్తున్నవి మరికొన్ని ఉన్నాయి. 19 పాఠశాలల్లో పట్టణ పరిధిలోని ప్రసన్న ప్రాధమికోన్నత పాఠశాల, ఆల్ఫా స్కూల్, సరస్వతీ విద్యామందిర్, సాధుసుందరం, గురుదత్తా స్కూల్(కంటోన్మెంట్), ప్రతిభా స్కూల్, రవి స్కూల్, సాయిదుర్గ స్కూల్, సూర్య పబ్లిక్, లివింగ్డాల్ స్కూల్, వశిష్ట స్కూల్, విజయనగరం పబ్లిక్ స్కూల్, ఎయిమ్ ప్రైమరీ స్కూల్, విద్యాన్ యూపీ స్కూల్ ఉన్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గుర్తింపులేని స్కూళ్లలో చేరొద్దు గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను ఎట్టిపరిస్థితుల్లో చేర్పించవద్దని ఇన్చార్జ్ డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి సీసీఈ విధానం అమలు కాబోతోందని, గుర్తింపులేని పాఠశాలల్లో చదివిన వారికి ఈ విధానం ద్వారా పదోతరగతి ప్రైవేటుగా పరీక్షలకు పంపించడం వీలుపడదని వివరించారు. ఈ నేపధ్యంలో చదివించిన పాఠశాల గుర్తింపు అంశం తెలుసుకోవడంపై తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. -
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
* పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మిబాయి * తొలిరోజు 14,500 పత్రాల మూల్యాంకనం మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం ప్రారంభమైంది. ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పర్యవేక్షించారు. జూలైలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్పాట్‌కు సంబంధించిన ఉత్తర్వులు గతంలో పనిచేసిన పాఠశాలలకు వెళ్లడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. చివరికి విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక చొరవతో ఉత్తర్వులు అందజేశారు. పంచవటి విద్యాలయంలో మూల్యాం కనం ఏర్పాటు చేశారు. మొత్తం 5,87,289 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 20 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 200 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 1450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 500 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఎసీఓలకు ప్రతి రోజూ రూ.260, సీఈలకు రూ.240, ఏఈలకు ఒక్కో పేపర్‌కు రూ.11ల చొప్పున, స్పెషల్ అసిస్టెంట్లకు ప్రతిరోజు రూ.150 చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఏసీఓలకు, సీఈఓలకు, ఏఈలకు డీఏ రోజుకు రూ.300 చొప్పున అందజేయనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు పది నుంచి 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయగా తొలిరోజు 14,500 పూర్తయ్యాయి. మూల్యాంకన కేంద్రాన్ని క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరుగకుండా మూల్యాంకనం చేయాలని సూచించారు. టీఎస్‌ఎస్‌ఓ పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓలు మీరాజుల్లాఖాన్, రవీందర్‌గౌడ్ మూల్యాంకన కేంద్రంలో పర్యవేక్షించారు. -
కన్నవారికి ఆదుర్దా..చిన్నారులకు హైరానా..
రాయవరం : వేలమంది చిన్నారులకు ఆతృత, హైరానా. అంతకు రెట్టింపు సంఖ్యలో వారి తల్లిదండ్రులకు ఉద్వేగం, ఆదుర్దా. ఉన్నత విద్యాసౌధానికి పునాది వంటి పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 21 నుంచి) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదీ ఊరూవాడా అనేక ఇళ్లలో కనిపించే పరిస్థితి. పరీక్షలు వచ్చే నెల 7 వరకూ జరుగుతాయి. ఇదిలా ఉండగా.. పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. గతేడాది పదవ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2014 పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. ఈ ఏడాదీ ఆ విజయూన్నే జిల్లాకు సొంతం చేయూలన్నది అధికారుల తపన. జిల్లాలో మొత్తం 70,529 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 33,522 మంది బాలురు, 34,144 మంది బాలికలు రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయనుండగా, 2,863 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారు. 317 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సక్రమ నిర్వహణకు సుమారు 3,800 మంది ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక.. పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. డిసెంబరు మొదటి వారం నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. అందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 10 మార్కులకు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్ట్, వారాంతంలో 25 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఏడాది రెండు సార్లు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు సంబంధిత పోలీస్స్టేషన్లకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం మొదటి పేపర్ సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్లకు చేరుకోగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు వాటిని తీసుకుని ఆ స్టేషన్లలో భద్రపర్చారు. ఈ నెల 19, 23 తేదీల్లో మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు ఆయా పోలీస్స్టేషన్లకు చేరుకోనున్నాయి. 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలని.. 10కి 10 గ్రేడు పాయింట్లు సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రత్యేక సూచనలు, సలహాలతో అనుకున్న సాధిస్తాననే నమ్మకం ఉంది. - జి.విమల, 10వ తరగతి విద్యార్థిని, సోమేశ్వరం పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యా.. పదవ తరగతి పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యాను. మంచి గ్రేడు సాధించేందుకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అన్ని సబ్జెక్టుల్లో తీర్చిదిద్దారు. మంచి గ్రేడ్ సాధిస్తా. - వై.మనోజ్‌యాదవ్, 10వ తరగతి విద్యార్థి, రాయవరం -
కీచక ఉపాధ్యాయుడిపై వేటు
పెడన (కృష్ణా): విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు హనుమంతరావును సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని నందమూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులతో ఉపాధ్యాయుడు హనుమంతరావు అసభ్యంగా ప్రవర్తించగా... అతడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా డీవైఈవో పి.గిరికుమార్ నందమూరు జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లి విద్యార్థినుల నుంచి వివరాలు తెలుసుకుని డీఈవోకు నివేదిక అందజేశారు. దీంతో హనుమంతరావును సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెడన ఎంఈవో ఖాసిం షరీఫ్ ఉపాధ్యాయుడికి సస్పెన్షన్ ప్రతిని అందజేశారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
హాజరుకానున్న 1.16 లక్షల మంది విద్యార్థులు సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు జిల్లా విద్యాధికారి రమేశ్ పకడ్బందీగా ‘పది’ పరీక్షలు వికారాబాద్ రూరల్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. వికారాబాద్‌లోని మేరి ఏ నాట్స్ పాఠశాలలో సోమవారం ఆయన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై చ ర్చించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని తెలిపారు. మొత్తం 1.16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. సెంటర్ల వద్ద మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులదేనని పేర్కొన్నారు. సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలల ఆవరణలోకి ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. సెంటర్ల వద్ద విధిగా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియాను సెంటర్ల లోపలికి అనుమతించొద్దని తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్లు తీసుకురాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్నాయక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో ఉపాధ్యాయుల ధర్నా
అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ బుధవారం ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుకెక్కాయి. తనిఖీల పేరుతో డీఈవో ప్రతి పాఠశాల నుంచి రూ 10వేల నుంచి రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన వారు.. డీఈవో పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన టీచర్లు పాల్గొన్నారు. -
గాడిన పడని జిల్లా విద్యావ్యవస్థ
బాధ్యతలు చేపట్టి నెలరోజులు దాటినా కార్యాలయం దాటని డీఈఓ నజీమొద్దీన్ సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లా విద్యాశాఖ అధికారిగా నజీమొద్దీన్ నెలరోజుల క్రితం బాధ్యతలు చేపట్టినా జిల్లాలోని విద్యావ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. ఇంతవరకు ఆయన జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలను కూడా తనిఖీ చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యారు ్థలు వ చ్చినా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఉదయం పూట ప్రార్థనలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులను వివిధ కారణాలను సాకుగా చూపి, సంఘాల నాయకుల పైరవీలు, రాజ కీయ వత్తిళ్లు తెచ్చి బదిలీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ బదిలీల్లో జరిగిన అక్రమాలకు బాధ్యుడిగా చేస్తూ రాజేశ్వర్‌రావును గత నెల 3న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఆర్టీ విభాగంలో అసిస్టెంట్ డెరైక్టర్ గా పనిచేస్తున్న నజీమొద్దీన్ను డీఈఓ గా నియమించారు. విధిలేని పరిస్థితిలోనే తాను బాధ్యతలు తీసుకుంటున్నానని, ఎంతకాలం పనిచేస్తాననేది మాత్రం తెలియదని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలో పదవీ విరమణ చేయాల్సిన తాను విమర్శలను ఎదుర్కోవడం కంటే కార్యాలయంలోనే ఉంటూ పర్యవేక్షిస్తే సరిపోతుందనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకు డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అధికారులు మరుసటి రోజు నుంచే పాఠశాలల తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుత డీఈఓ మాత్రం కనీసం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉన్న పాఠశాలలను కూడా తనిఖీ చేయడంలేదు. జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధించడం కన్నా పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాఠశాలకు సెలవు పెట్టి రావాల్సిన ఉపాధ్యాయులు మరుసటి రోజున వెళ్లి సంతకాలు చేసి వస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌గారూ మీరైన దృష్టి పెట్టండి.. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రాస్ వారం రోజుల్లోనే వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వేటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిసారిస్తే ప్రభుత్వ పాఠశాలల పనితీరు కొంతమేరకైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డీఈఓ వివరణ .. పాఠశాలలను తనిఖీలు చేయకుండా కార్యాలయానికే పరిమితమయ్యారన్న విషయంపై డీఈఓను వివరణ కోరగా తాను జిల్లాపై అవగాహన పెంపొందించుకుంటున్నానని, వారం పది రోజుల్లో తనిఖీలు చేపడతానని పేర్కొన్నారు. -
మిథ్యాశాఖ
అస్తవ్యస్తంగా వ్యవస్థ.. - ఇప్పటికీ ఎంఈఓలు లేరు - పుస్తకాల్లేకుండానే పరీక్షలు - ఇంకా 4.40 లక్షల పుస్తకాలు అవసరం - అ‘డ్రెస్’లేని యూనిఫాం - చతికిలబడుతున్న చదువులు మెదక్: జిల్లా విద్యాశాఖ గాఢనిద్రలో జోగుతోంది. పాఠశాలలు ప్రారంభమైన ఇన్నాళ్లకు కూడా చదువులు గాడిన పడకపోగా, విద్యాశాఖ యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలకు పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. యూనిఫాం ఇవ్వలేదు. పాత ఎంఈఓలు బదిలీ అయి 46 రోజులైనా.. ఇప్పటికీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో చదువులు చతికిలబడుతున్నాయి. అంతా అస్తవ్యస్తం.. ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అవకతవకలతో కుదేలైన విద్యాశాఖ ఇప్పటికీ దిద్దుబాటుకు ఉపక్రమించలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాశాఖ పర్యవేక్షణలో మండల విద్యాధికారు (ఎంఈఓ)లదే కీలకపాత్ర. జూలై 7న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో జిల్లాలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 20 మంది హెచ్ఎంలు బదిలీపై వెళ్లారు. అదే నెల 9న వీరంతా కొత్త పాఠశాలల్లో చేరారు. అయితే వీరు ప్రధానోపాద్యాయుల బాధ్యత నుండి విడుదలైనా.. ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. కొంతమంది 60 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అక్కడి నుండే వీరు పాత మండలాల్లో ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పర్యవేక్షణ ఘోరం.. ఎంఈఓలుగా ఉన్న హెచ్ఎంలు పనిచేసే చోటు నుంచి దూరంగా ఉండటంతో వారానికోసారి మండల కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో పర్యవేక్షణ కరువై పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. కాంప్లెక్స్ సమావేశాల్లో, హరితహారం, గ్రామజ్యోతిలో కీలకపాత్ర వహించాల్సిన ఎంఈఓల జాడ కనిపించడం లేదు. ఆగస్టు 15న చాలాచోట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో అక్కడ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఎంఐఎస్‌లు జెండాలు ఎగురవేయడం గమనార్హం. త్వరలో పాఠశాలల్లో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రెగ్యులర్ ఎంఈఓలు అవసరం. ఇతర జిల్లాల్లో బదిలీలు జరిగిన వారం రోజుల్లో కొత్త ఎంఈఓలకు బాధ్యతలు అప్పగించినా.. జిల్లాలో మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. పుస్తకాలు లేకుండానే ‘పరీక్ష’కు.. పాఠశాలలు తెరచి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు 19,16,137 పుస్తకాలే వచ్చాయి. ఇంకా 4,40,600 పుస్తకాలు అవసరం. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకైతే కనీసం 45 శాతం పుస్తకాలు పంపిణీ కానట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఫార్మటీవ్ 2 టెస్ట్‌లు జరుగుతున్నాయి. మారిన సీసీఈ విధానంలో పుస్తకాలు లేకుండా ఈ టెస్ట్‌లు ఎలా రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బదిలీల సమయంలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేసినప్పటికీ వివిధ పాఠశాలల్లో ఇంకా 1100 పైచిలుకు టీచర్లు అవసరమని తెలుస్తుంది. రేషనలైజేషన్‌లో జరిగిన అక్రమాల వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (వాలంటీర్లు)ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూనిఫాం ఏదీ? ఆగస్టు నెల వచ్చేసినా.. ఇప్పటికీ విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు పంపిణీ కాలేదు. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయినా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. బియ్యంలో పురుగులు వస్తున్నాయని, అన్నం సరిగా ఉడకడం లేదన్న విమర్శలున్నాయి. మరి, విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ఎప్పటికి తీసుకుంటుందో?!. -
జిల్లావిద్యాశాఖలో నిఘానేత్రం
నల్లగొండ : ప్రభుత్వ పరిపాలన యంత్రాం గంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం కొత్త ఒరవడి సృష్టించింది. ప్రభుత్వ శాఖలు కనీ వినీ ఎరుగుని రీతిలో హైటెక్ పాలనకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పారదర్శక పాలనే ధ్యేయంగా ఉద్యోగులు క్రమశిక్షణ తప్పకుండా విధులు నిర్వర్తించేం దుకు సీసీ కెమెరాల వాడకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు వినియోగించడం ద్వారా విద్యాశాఖ నిఘా నీడలోకి చేరింది. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపడే విధంగా కార్యాలయంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం ఏర్పాటుచేసిన కెమెరాల నీడన పనిచేసేందుకు ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎంట్రెన్స్ టు చాంబర్... కార్యాలయంలోని ప్రధాన ముఖద్వారం నుంచి డీఈఓ చాంబర్ వరకు మొత్తం 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంట్లో మూడు కెమెరాలు ఆవరణలో ఏర్పాటు చేయగా...మిగిలిన కెమెరాలు ఉద్యోగులు పనిచేస్తున్న వివిధ విభాగాల్లో ఏర్పాటు చేశారు. మొదటి సీసీ కెమెరా పరీక్షల విభాగం కలిగిన భవనానికి పైభాగాన ఏర్పాటు చేశారు. కార్యాలయ ఆవరణలోకి అడుగుమోపగానే తొలుత ఈ కెమెరాలోనే రికార్డు అవుతారు. రెండో కెమెరా ‘బి’ వింగ్ భవనానికి పైబాగాన బయట ఉంచారు. మూడో కెమెరా డీఈఓ చాంబర్ పక్కనే ఉన్న ఆర్‌ఎంఎస్‌ఏ కార్యాలయానికి ఏర్పాటు చేశారు. మిగిలిన 13 కెమెరాలు ఉద్యోగులు పనిచేస్తున్న గదుల్లో ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్య.... విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ తర్వాతి హోదాలో ఇద్దరు ఏడీలు ఉన్నారు. కానీ వారినుంచి ఎలాంటి సహాయం తీసుకోలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో కూడా ఏడీల ప్రమేయం లేకుండానే చేశారు. దీంతో డీఈఓ తర్వాత కార్యాలయానికి పర్యవేక్షించే అధికారి మరొకరు లేకపోవడంతో గత్యంతర లేక సీసీ కెమెరాలను నమ్ముకోవాల్సి వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విధుల్లో భాగంగా డీఈఓ ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే కార్యాలయంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారు. వివిధ రకాల పనుల కోసం వచ్చేవారి నుంచి పలువురు ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కొంతమంది ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. గత ఘటన పునరావృతం కాకుండా.. ప్రధానంగా 2013 బదిలీల తర్వాత డీఈఓ కార్యాలయంలో ఇప్పుడున్న ‘బీ వింగ్’ భవనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుటించారు. పదోన్నతులు, బదిలీలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలన్నీ బీ వింగ్‌లో భద్రపరుస్తారు. దీంతో అప్పట్లో డీఈవో కార్యాలయం తగలబడటం జిల్లాలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బదిలీలకు సంబంధించిన ఫైళ్లన్నీ కూడా ‘బీ వింగ్’లోనే భద్రపర్చారు. అదీగాక వచ్చే ఏడాది మార్చితో డీఈఓ పదవీ కాలం ముగుస్తుండటంతో కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ఆయన ఈ సీసీ కెమెరాలను అమర్చాల్సి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఉద్యోగుల హాజరు నమోదు చేసేందుకు బయెమెట్రిక్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు డీఈఓ శుక్రవారం ప్రకటించారు. హైటెక్ పోకడలతో సీసీ కెమెరాల ప్రయోగం మిగిలిన శాఖలకు ఆదర్శంగా నిలుస్తుందా..? లేకుంటే.. ఉద్యోగుల నుంచి విమర్శలకు దారితీస్తుందా..? అన్నది వేచిచూడాల్సిందే. స్వీయ పర్యవేక్షణ కోసమే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమశిక్షణ పాటించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దీంతో స్వీయ పర్యవేక్షణ ఉండటం వల్ల ఉద్యోగులు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించుకునే అవకాశం ఉంది. గతంలో గుర్తుతెలియని వ్యక్తులు డీఈఓ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కెమెరాల వాడకం అవసరం. అప్పుడప్పుడు అల్లరి మూకలు కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారు. కొందరు అడ్డాగా మార్చుకుని కాలక్షేపం చేసేందుకు వచ్చిపోతున్నారు. విద్యాశాఖ జాయింట్ డెరైక్టర్, డీఆర్వో అనుమతి తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. - ఎస్.విశ్వనాథరావు, డీఈఓ -
డీఈఓ వెబ్సైట్లో టెన్త్ మోడల్ పేపర్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నాపత్రాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలు కొత్త విధానంలో నిర్వహిస్తున్నందున విద్యార్థులకు అవగాహన కోసం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఈఓరంగారెడ్డి.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు. -
పకడ్బందీగా పది
* ఫలితాల కోసం ప్రత్యేక కసరత్తు * విద్యార్థుల ప్రగతి అంచనా పనిలో విద్యాశాఖ * ప్రతి మండలానికి ఏడుగురు సభ్యుల కమిటీ * వెనుకబడిన వారిని గుర్తించేందుకు చర్యలు * ప్రత్యేక తరగతుల నిర్వహణకు సన్నాహాలు * అల్పాహారం కోసం ఉన్నతాధికారుల అనుమతి ఖమ్మం: పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం సిలబస్, పరీక్షా విధానం మారడంతో ఫలితాలు ఏలా ఉంటాయోనని పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గతంకంటే ఎక్కువ కష్టపడాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల స్థాయిని గుర్తించి..దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రముఖులతో జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల సమావేశమై కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేశారు. మండలానికో ఏడుగురు సభ్యుల కమిటీ విద్యార్థుల స్థాయిని గుర్తించేందుకు మండలానికో ఏడుగురు సభ్యులు కమిటీని ఏర్పాటు చేస్తారు. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌ను కమిటీ సభ్యులుగా తీసుకుంటారు. ఇలా ఏడుగురు సభ్యులు మండలంలోని హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారు. ప్రగతి అంచనా వేసేది ఇలా.. పదో తరగతిలో గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. రాష్ట్రంలో జిల్లాను ప్రథమంగా నిలపాలి అని జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు నూరుశాతం ఫలితాల సాధనకు ముందుగా విద్యార్థుల స్థాయిని అంచనా వేయాలని విద్యాశాఖాధికారులు భావించారు. ఈ ఏడుగురు సభ్యుల బృందం స్కూల్స్‌కు వెళ్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్, ప్రాజెక్టు వర్క్ వివరాలు, విద్యార్థి అవగాహన స్థాయి, సాధించిన ప్రగతి, ఇంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు సేకరిస్తుంది. ఈనెల చివరి వరకు ఈ బృందం సేకరించిన వివరాలతో ఓ నివేదిక తయారు చేస్తుంది. అనంతరం పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తారు. ఫిబ్రవరిలో ఇదంతా పూర్తి చేసి, మార్చిలో ఈ బృందం మళ్లీ పాఠశాలలకు వెళ్తుంది. విద్యార్థుల్లో వచ్చిన మార్పును గమనిస్తుంది. ఇంకా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక క్లాస్‌లు మళ్లీ నిర్వహిస్తుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. ఇందుకోసం పాఠశాల పనివేళల్లో కాకుండా ఉదయం, సాయంత్రం క్లాస్‌లు నిర్వహిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా సాయంత్రం వేళలో అల్పాహారం ఇస్తారు. దీనికోసం ఏజెన్సీలో ఐటీడీఏ, మైదాన ప్రాంతంలో జిల్లా పరిషత్ నుంచి అల్పాహారం తయారీకి నిధులు మంజూరు చేసేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. అల్పాహారం కోసం విద్యాకమిటీ చైర్మన్లు, సేవా సంఘాలు, వ్యాపార ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారం కూడా తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇవన్నీ పక డ్బందీగా అమలైతే రాష్ట్రంలోనే జిల్లా ముందుంటుందనడంలో అనుమానం లేదు. ఇందుకు ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీలు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఏవిధంగా సహకరిస్తారనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. -
టెన్ షన్
31 మండలాలకుఇన్చార్జ్ ఎంఈవోలు ఒక ఉప విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీ ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుందని ఆందోళన యలమంచిలి : జిల్లా విద్యావ్యవస్థలో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. శాశ్వత మండల విద్యాశాఖాధికారుల నియామకాలు పదేళ్లుగా జరకపోవడం, సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడం, ఉన్నత పాఠశాలల్లోనూ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులను నియమించి బోధన సాగించడం, తదితరాల ప్రభావం పదోతరగతి పరీక్షా ఫలితాలపై పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాలకే శాశ్వత ఎంఈవోలు ఉన్నారు. 31 మండలాలకు ఎంఈవోలుగా ఆయా మండలాల్లోని ఉన్నత పాఠశాలల సీనియర్ ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎంఈవోల స్థానాల్లో పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా నియమించారు. దాంతో ఎంఈవోలుగా ఉంటూనే తమ పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సిన రావడంతో ఒత్తిడికి గురవుతున్నామని పలువురు ఇన్చార్జ్ విద్యాశాఖాధికారులు అంటున్నారు. దీంతో పాటు పాడేరు, జిల్లా పరిషత్, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. పాడేరు ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు విశాఖపట్నం ఉప విద్యాశాఖాధికారిణి రేణుక, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి చూస్తున్నారు. దీంతో వీరిపై పని ఒత్తిడి పెరగడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపిస్తోంది. మరోవైపు ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాలు పూర్తికాక ఉపాధ్యాయుల్లో సమన్వయం లేక బోధన మూలకు చేరిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నివేదికలతోనే సరి... మండలాల్లో ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తూ పాఠశాలల పనితీరు, మధ్యాహ్న భోజనం పరిశీలన, పారదర్శక నిధులు వినియోగం, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన ఎస్‌ఎంసీల సమావేశాలు నిర్వహణ, విధులపై వారికి అవగాహన కల్పించడంలోనే సతమతమవుతుంటే.. ఉన్నతాధికారులు వివిధ నివేదికలు అందజేయాలంటూ వారానికి రెండుమూడుసార్లు సమావేశాలకు హాజరు కావాలంటూ జిల్లా కేంద్రానికి పిలిపించుకుంటుండటంతో పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కిందని ఎంఈవోలు చెబుతున్నారు. పాఠశాల ఆవాస ప్రణాళికలు, పాఠశాల వార్షిక అభివృద్ధి నివేదికలు, ఆధార్, 2005 నుంచి 2014 వరకూ మధ్యాహ్న భోజన ఖర్చుల నివేదిక, ఏకరూప దుస్తుల వివరాల నివేదికలు, జమ, వ్యయాలు సరిపోక తజ్జనభజ్జన పడుతున్నామని అంటున్నారు. అధికారాలు లేని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుల మాటను సిబ్బంది వినిపించుకోని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు తగు పర్యవేక్షణ లేకపోవడంతో తమకెందుకులే అన్నట్టు వారంతా మిన్నకుండిపోతున్నారు. మెరుగైన ఫలితాలు సాధ్యమేనా? గత మూడేళ్లలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 17, 14, 11 స్థానాల్లో ఉంది. ఈ ఏడాది దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారా ? చేతులెత్తేస్తారా? అన్న సందేశం విద్యాశాఖ ఉన్నతాధికారులనే కలవరపెడుతోంది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మారడం, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం, మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలు సమకూర్చకపోవడం తదితరాలతో తరగతి గదుల్లో బోధన నత్తనడకన సాగింది. కొన్ని నాన్పేనల్ హైస్కూళ్లలో కొన్ని సబ్జెక్టులకు ఏడాది పొడవునా ఉపాధ్యాయులే లేరు 31 మండలాలకు ఇన్చార్జ్ ఎంఈవోలు జిల్లాలో 31 మండలాలకు ఇన్చార్జ్ ఎం ఈవోలు ఉన్నారు. 8 మండలాలకు మాత్రమే శాశ్వత ఎంఈవోలు బాధ్యతలు చూస్తున్నారు. దీనివలన పాఠశాలల పర్యవేక్షణ కొంత వరకు ఇబ్బందే. అయినప్పటికీ పదో తరగతి ఫలితాలపై ఆ ప్రభావం లేకుండా చూస్తున్నాం. ప్రత్యే క పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. - ఎం.వెంకటకృష్ణారెడ్డి, డీఈవో -
పుస్తకాలు పక్కదారి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి లేకుండా అధికారుల కళ్లుగప్పి శుక్రవారం పుస్తకగోదాం అధికారిణి అక్రమంగా తరలించేందుకు యత్నించిన పుస్తకాలను స్థానికుల సమాచారంతో జిల్లా విద్యాశాఖాధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. జిల్లా విద్యాశాఖకు సంబంధించిన పుస్తకాలను నిల్వ ఉంచే గోదాంకు ఇన్చార్జిగా భారతి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈనెల 17న పశ్చిమబెంగాల్లో చదువుతున్న తెలుగు మీడియం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారి సూర్యప్రకాశ్‌రావు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, సెలవురోజైన శుక్రవారం రోజు పుస్తక గోదాం ఇన్చార్జి భారతి డీఈఓకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పుస్తకాలను తరలించేందుకు లారీలో లోడ్ వేయించింది. ఉత్తర్వుల్లో ఉన్నవి 3,630 మాత్రమే 1వ తరగతి 630, 2వ తరగతి 400, 3వ తరగతి 500, 4వ తరగతి 400, 4వ తరగతి(ఈవీఎస్టీఎం) 700, 5వ తరగతి తెలుగు రీడర్ 600, 5వ తరగతి తెలుగు మాథ్స్ 400 మొత్తం 3,630 పుస్తకాలు సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ గోదాం ఇన్చార్జి మాత్రం ప్రతి సంఖ్యకు చివరన ఁసున్న* చేర్చుతూ మొత్తం 36,300 పుస్తకాలకు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులో దిద్దింది. తరలించేందుకు లారీలో కూడా పుస్తకాలు నింపారు. విషయం తెలుసుకున్న మీడియా, అధికారులు అక్కడికి చేరుకోవడంతో సదరు అధికారిణి అవాక్కైంది. తనకు డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, డీఈఓకు సమాచారం ఇవ్వాలని తనకు తెలియదని డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఎంఈఓ వెంకట్రాముడుకు తెలిపింది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం పుస్తకాలు తరలించే విషయం నాకు ఎలాంటి సమాచారం లేదు. డెరైక్టర్‌తో మాట్లాడాను. తక్కువ పుస్తకాలు ఆర్డర్ ఇస్తే ఎక్కువ తరలిస్తున్నట్లు తెలిసింది. లారీలో నుంచి ఒక్క పుస్తకం కూడా తరలించకుండా అక్కడే ఉంచాలని ఆదేశించాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్ -
విద్యార్థి ఫెయిలైతే.. బాధ్యత హెచ్‌ఎందే!
‘పది’ కసరత్తులో భాగంగా డీఈవో స్పష్టీకరణ డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణ గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో వెనుకబడ్డ జిల్లా దిద్దుబాటు చర్యలో జిల్లా విద్యాశాఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో సదస్సులు పరీక్షలకు హాజరుకానున్న 54 వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పరీక్షలు ‘పదోతరగతి విద్యార్థి పరీక్షల్లో ఫెయిలైతే దానికి ప్రధానోపాధ్యాయులే బాధ్యులు..’ ఇవీ గుడివాడలో బుధవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నాగేశ్వరరావు చెప్పిన మాటలు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టిన జిల్లా విద్యాశాఖ ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆయన విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ : జిల్లా విద్యాశాఖ పదోతరగతి పరీక్షల కసరత్తు మొదలైంది. ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్షలు సవాలుగా మారాయి. ఈ క్రమంలో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధనతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సులు, పలు కార్యక్రమాలతో జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేసి కసరత్తు మొదలుపెట్టింది. ఫలితాల్లో వెనుకబాటు... చదువుల రాజధానిగా పేరొందిన జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబడింది. వరుసగా గత మూడేళ్లూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరగడంతో జిల్లాలోని విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని అయింది. దీంతో పదోతరగతి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి మూడు స్థానాల్లో నిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యాశాఖ కమిషనర్ కూడా పదో తరగతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యాశాఖ మొత్తం పదోతరగతి పైనే దృష్టి నిలిపింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు 54 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్థులు ఆరువేల మంది ఉన్నారు. 54 వేల మంది విద్యార్థుల్లో 20 వేల మంది ప్రెవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 850 పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల కిత్రం వరకు జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ నాలుగు నెలలకు ముందే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు... పదోతరగతి పరీక్షలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న క్రమంలో విద్యాశాఖ ఈనెల ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 45 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై రివిజన్తో పాటు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలకు సిద్ధమయ్యేలా తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికిగాను రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో 25 పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. డివిజన్ల వారీగా సమావేశాలు... మరోవైపు టీచర్లను కూడా పరీక్షలకు సమాయత్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు మచిలీపట్నం, నూజివీడు, గుడివాడలో సమావేశాలు నిర్వహించారు. బుధవారం నందిగామలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా అందరూ సమష్టిగా కష్టపడాలని సూచించారు. మరో వారం వ్యవధిలో విజయవాడ డివిజన్లో సమావేశం నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో సమావేశాలు, పదోతరగతి విద్యార్థులకు బోధించే టీచర్లకు ఒరియంటేషన్ తరగతులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 26 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పదోతరగతి పరీక్షలు మొదలవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ ప్రకటించారు. 26న మొదలై ఏప్రిల్ 11 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ క్రమంలో జనవరిలో అర్థసంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయం మరికొంత పెంచే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సంలో నూరు శాతం ఫలితాలు రాబట్టి జిల్లాను మొదటి మూడు స్థానాల్లో ఉంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. -
మార్చి 25 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
సంగారెడ్డి మున్సిపాలిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూలు డెరైక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విభాగం ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి రోజు ఉదయం 9-30 నుంచి 12-15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 25న తెలుగు పేపర్-1, 26న పేపర్-2, 27న హిందీ, 30న ఇంగ్లీష్ పేపర్-1, 31న పేపర్-2, ఏప్రిల్ 1న గణితం పేపర్-1, 2న పేపర్-2, 4న జనరల్ సైన్స్ పేపర్-1, 6న సైన్స్ పేపర్ -2, 7న సాంఘిక శాస్త్రం పేపర్-1, 8న పేపర్-2, పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు. -
‘క్రిసెంట్’ పాపం ఎవరిది..?
‘క్రిసెంట్’ కళాశాల వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ఉదాసీనత.. పర్యవేక్షణలోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మంది జీవితాలతో యూజమాన్యం ఆటలాడుకున్నా స్పందించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అనుమతి లేకుండా ఏడాదిపాటు తరగతుల నిర్వహణ కొనసాగినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లా కేంద్రంలో ఏకంగా జిల్లా విద్యాశాఖాధికారి ముద్రలు సృష్టించి అనుమతులున్నట్లు ప్రైవేట్ పాఠశాలలను నడిపిన విషయం మరువకముందే క్రిసెంట్ సంఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన విద్యాశాఖలో కొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడ్డారు. చేయరాని పనులు చేస్తూ పట్టుబడి సంబంధిత శాఖ పరువును బజారుకీడుస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. తలాపాపం.. జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండానే డీఈడీ కళాశాలను నిర్వహిస్తూ 50 మంది విద్యార్థుల వద్ద ఫీజుల పేరిట రూ.కోటికిపైగా వసూలుచేసింది క్రిసెంట్ యూజమాన్యం. 2013-14 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ అనుమతి లభించకున్నా 50 మందిని నాన్ మైనార్టీ ద్వారా భర్తీ చేసుకుంది. ఏడాదిపాటు తరగతులు కూడా నిర్వహించింది. ఇటీవలే ప్రాక్టికల్కోసం నగరంలోని సప్తగిరికాలనీ, ధన్గర్‌వాడీ తదితర ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో డీఎడ్ విద్యార్థులతో బోధన చేయించింది. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో హాల్ టికెట్ల కోసం రేపుమాపూ అంటూ యాజమాన్యం తిప్పుకుని బుధవారం పరీక్ష టైం వరకు చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు. అనుమతులేవీ... ఏదైనా విద్యాసంస్థ నెలకొల్పాలంటే క్రీడా మైదానం, మౌలిక వసతులు, ఫైర్సర్టిఫికెట్పాటు విద్యాశాఖకోరిన ధ్రువపత్రాలు సమర్పించాలి. అరుుతే అవేమీ లేకుండానే యూజమాన్యాలు అమ్యామ్యాలతో అధికారులను మచ్చిక చేసుకుని అనుమతి తీసుకుంటున్నారుు. తనిఖీల సమయంలో అధికారులు డబ్బులు తీసుకుని అంతా ఓకే అంటూ నివేదికలు ఇచ్చేస్తున్నారు. పరీక్షల సమయంలో తమకున్న పలుకుబడితో యథావిధిగా తమ పనులు ముగించుకోవడం విద్యాసంస్థలకు రివాజుగా మారింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు... డీఈడీ పరీక్షలకు హాజరుకాలేక విద్యాసంవత్సరం కోల్పోయిన క్రిసెంట్కళాశాలకు చెందిన 50మంది విద్యార్థులు గురువారం కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తల్లిదండ్రులతోపాటు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ నరేందర్‌కు కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని, విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేలా చూడాలని విద్యార్థులు వేడుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచారుు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నాయకులు బండారి శేఖర్, నాగరాజు, బోనగిరి మహేందర్, రాజునాయక్ డిమాండ్‌చేశారు. క్రిసెంట్ ప్రిన్సిపాల్,కరస్పాండెంట్‌పై కేసు కరీంనగర్ క్రైం: విద్యార్థులనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి నిలువునా ముంచిన క్రిసెంట్ డీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై కేసు నమోదుచేశారు. మేనేజ్మెంట్ కోటాలో సుమారు 50మంది విద్యార్థులకు సీట్లు కేటాయించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది. అయితే కళాశాలకు అనుమతి రాకపోవడంతో పలువురు విద్యార్థులు రోడ్డునపడ్డారు. రెండురోజుల పాటు ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధిత విద్యార్థులు గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు క్రిసెంట్ కరస్పాండెంట్ జాహీర్ ఖలీద్, ప్రిన్సిపాల్ హమ్మదుల్లా బేగ్‌పై కేసు నమోదు చేశామని సీఐ నరేందర్ తెలిపారు. -
విద్యార్థులతో నేరుగా మాట్లాడతా..
గుంటూరు ఎడ్యుకేషన్: ‘పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేసేందుకు నేరుగా విద్యార్థులతో మాట్లాడతాను. ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలుపుకుని విద్యారంగంలో జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. టెన్త్ పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళతాం’ అని జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన శ్రీనివాసులు రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాను పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్ధానంలో నిలిపామని వివరించారు. ఇందుకు ఉపాధ్యాయులతోపాటు క్షేత్ర స్థాయిలో అధికారుల కృషి, తల్లిదండ్రులు అందించిన సహకారం తోడయ్యాయని చెప్పారు. అదనపు తరగతుల నిర్వహణ, మినిమమ్ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించామని చెప్పారు. ఇదే విధానాన్ని ఈ జిల్లాలోను అమలు చేస్తామన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లోని పాఠశాలలపై దృష్టి సారించి తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. వ్యక్తిగత విశేషాలు.. శ్రీనివాసులు రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన 2003 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.2008 డిసెంబర్లో మచిలీపట్నం ఉప విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పదోన్నతిపై 2012 ఏప్రిల్ 9న తూర్పు గోదావరి డీఈవోగా వెళ్లారు. 2013 పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 2వ స్ధానం, 2014 ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేశారు. -
ఇద్దరూ.. ఇద్దరే..
విద్యారణ్యపురి : వివాదాలు.. వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో మహబూబ్‌నగర్ డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా వస్తున్న డీఈఓపైనా వివాదాస్పద ముద్ర ఇదివరకే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారుు. హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ గత ఏడాది మే 22న విజయ్‌కుమార్ జిల్లాకు డీఈఓగా వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీలతో ఆయన ఉపాధ్యాయులను హడలెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకేసారి ఒకటి, రెండు మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేసి.. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించారు. పలువురు ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయడమే కాకుండా.. ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. దీంతో పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొన్ని సంఘాలు ఏకంగా ఆందోళన బాట పట్టగా.. మరి కొన్ని సంఘాలు విజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయ బ్యూటిఫికేషన్‌పై పెద్ద దుమారం చెలరేగింది. ఆయన పర్యవేక్షణలో ఈ పనులు జరిగారుు. డీఈఓ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అరుుతే బ్యూటిఫికేషన్ కోసం సమీకరించిన నిధుల్లో అవకతవకలక పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో డీఈఓ విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగారుు. అవకతవతకలకు సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. ఇలా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కుమార్‌పై వినూత్న కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలనూ పొందారు. జిల్లాలోని ఆత్మకూరు, గీసుకొండ, ధర్మసాగర్ మండలాలకు చెందిన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పించారు. క్యాంపులు నిర్వహించి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై సక్తి పెంపొందేలా కృషి చేశారు. ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేసేలా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. జఫర్‌గఢ్ మండలంలో కొందరు విద్యార్థులకు వంద గంటల్లో ఇంగ్లిష్ నేర్పించడం వంటి వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని సొషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లతో కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఏర్పాటు చేసి... దాని ద్వారా బాలవక్త, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈనెల 14న జిల్లాస్థాయి ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలైన ఇద్దరి విద్యార్థులకు ఓరుగల్లు సేవా ట్రస్టు నుంచి రూ. లక్ష ఇప్పిం చారు. ఓరుగల్లుసేవా ట్రస్టుకు కోశాధికారిగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యూరు. అదేవిధంగా.. దాతలపై ఆధారపడి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సృజనోత్సవాలకు ఓరుగల్లు సేవాట్రస్టు ద్వారా కలెక్టర్ కిషన్‌తో రూ.1.50 లక్షలు ఇప్పించారు. బదిలీ అరుున సోమవా రం కూడా ప్రాక్టిసింగ్ పీఎస్‌లో తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలడంతో హెచ్ఎంను సస్పెం డ్ చేయడంతోపాటు ఐదుగురు టీచర్లకు ఇంక్రిమెంట్ కట్ చేశారు. కాగా, బదిలీ అరుున డీఈఓ విజయ్‌కుమార్‌కు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. -
ఇదేం ‘ఆదర్శం’
కశింకోట: మండలంలోని తేగాడ ఆదర్శ పాఠశాల నిర్వహణ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వి. కృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని, దీనివల్ల చదువులు సరిగ్గా సాగక విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. కార్పోరేట్ కళాశాలల్లో చదివించే స్థోమత లేక, ఉన్నతమైన ఐఐటి పరీక్షలకు తయారు చేస్తారని ఆశించి తమ పిల్లలను ఇక్కడ చేర్పించామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రధాన పాఠ్యాంశాలైన రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం బోధించడానికి చాలా కాలంగా ఉపాధ్యాయులే కొరవడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల వసతి గృహాన్ని నిర్మించి ప్రారంభించినప్పటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం పట్ల దూరప్రాంత బాలికలు రోజూ పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనిఫాం ఇవ్వలేదని, ఆర్టీసీ బస్సును బయ్యవరం హెరిటేజ్ డెయిరీ వరకే పరిమితం చేయకుండా తాళ్లపాలెం వరకు నడపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల రోడ్డును మెరుగు పర్చాలన్నారు. వ్యక్తిగత కక్షతో తమ అమ్మాయిని ప్రిన్సిపాల్ అవమానిస్తున్నారని, ఇది శోచనీయమని పి.కల్యాణి ఈ సందర్భంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యా సంస్థలో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రతిష్టలకు తావు లేకుండా నడపాలన్నారు. సర్పంచ్ సిదిరెడ్డి సూర్యనారాయణ,విద్యార్థుల తల్లిదండ్రులు జి.నానాజీ,మజ్జి వెంకట రామకృష్ణ పరమహంస తదితరులు తమ అభిప్రాయాలను, పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను డీఈవో దృష్టికి తెచ్చారు. త్వరలో ఉపాధ్యాయుల కొరత నివారణ: ఈ సందర్భంగా డీఈవో కృష్ణారావు మాట్లాడుతూ 15 రోజుల్లోగా కొత్త ఉపాధ్యాయులు రానున్నారన్నారు. బాలికల వసతి గృహం తెరవడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం లేఖ రాశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సును నడపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రిన్సిపాల్ సంధ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా తల్లిదండ్రులు విడిపోయి కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో డీఈవో సమావేశమయ్యారు. అంతా సమన్వయంతో పని చేసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను కృషి చేయాలని ఆదేశించారు. -
విద్యాశాఖకు ఇన్‌చార్జిలే దిక్కు!
జిల్లా విద్యాశాఖలో ఇన్చార్జిలతో కాలం గడుపుతున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారాయి. * బోధనా లేదు.. పర్యవేక్షణా లేదు * 36 మంది ఎంఈవోలు, ఐదుగురు డీవైఈవోలు ఇన్‌చార్జిలే * 423 ఎస్జీటీ, 378 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ * డైట్లో భర్తీకాని 19 పోస్టులు నూజివీడు : జిల్లాలో విద్యాశాఖ దిక్కులేని దివాణంగా మారింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యావ్యవస్థకు గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జిలే దిక్కవుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల పనివేళలను పొడిగించినా.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ ఇన్‌చార్జిలే కావడంతో పర్యవేక్షణే లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులు ఆడిందే బడి, చెప్పిందే పాఠం అన్నచందంగా తయారైంది. వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్, చిట్‌ఫండ్ వ్యాపారం ఇలా అనేక ఇతర కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాదికి పిల్లల సంఖ్య దారుణంగా పడిపోతున్నా పాలకులు వాటిని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 3,450, ప్రాథమికోన్నత పాఠశాలలు 575, జిల్లా పరిషత్ హైస్కూళ్లు 450 వరకు ఉన్నాయి. వాటిలో విద్యనభ్యసిస్తున్న వారంతా పేద వర్గాలకు చెందిన, కాన్వెంట్లలో ఫీజులు చెల్లించే స్తోమత లేని కుటుంబాల విద్యార్థులే. ఖాళీలే ఖాళీలు... జిల్లాలో ఐదు డీవైఈవో పోస్టులు ఉండగా, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, నందిగామలలో ఈ పోస్టులుండగా అన్నిచోట్లా ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఈవో పోస్టులు 50 ఉండగా, అందులో 36 మండలాల్లో ఇన్‌చార్జిలే పనిచేస్తున్నారు. ఆయా మండలాల హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్లలో ఎంఈవోగా పనిచేయడానికి అంగీకరించినవారిని ఇన్చార్జిలుగా నియమించారు. దాదాపు దశాబ్దకాలంగా విద్యాశాఖలో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ దీనిని మార్చే ప్రయత్నం చేయడం లేదు. విస్సన్నపేట, చాట్రాయి, ఆగిరిపల్లి, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, తోట్లవల్లూరు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, వీరులపాడు, గుడివాడ, కోడూరు మండలాలకు సంబంధించి మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన మండలాలకు పనిచేస్తున్నవారంతా ఇన్‌చార్జిలే. దీంతో ఆయా మండలాల్లో పాఠశాలల పర్యవేక్షణ చాలా దారుణంగా ఉంటోంది. మరికొన్నిచోట్ల ఎంఈవో తమ కులం వాడే కాబట్టి తమను ఏమీ అనడంటూ పాఠశాలలకు వెళ్లకుండా ఉపాధ్యాయులు రోడ్ల వెంట కాలక్షేపం చేస్తున్నారు. డైట్ పరిస్థితి దారుణం అంగలూరులోని డైట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఉపాధ్యాయులను తయారుచేసే డైట్లో కూడా ఖాళీలు ఉన్నాయి. 14 లెక్చరర్ పోస్టులు, 5 సీనియర్ లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం 19 ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్‌గా పనిచేసేవారు కేవలం ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు లెక్చరర్లు కాగా, ఇద్దరు సీనియర్ లెక్చరర్లు. విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు ఏడుగురు డిప్యుటేషన్‌పై డైట్లో పనిచేస్తున్నారు. వీటికి తోడు జిల్లాలో 423 ఎస్జీటీ పోస్టులు, 378 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 169 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎనిమిదో తరగతిని ప్రవేశపెట్టినప్పటికీ ఆయా పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయలేదు. జిల్లాలో విద్యాశాఖ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య లభించడం ప్రశ్నార్థకమే. -
ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 9లోపు దరఖాస్తులు
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం నవంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆదేశించారు. విద్యార్థుల వివరాలను www.epass.cgg.gov.in వెబ్సైట్లో లాగినై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నింపాలన్నారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించి తమ దరఖాస్తులను ఆన్లైన్లో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందజేయాలన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 10వ తేదీ నాటికి సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని విజయభాస్కర్ కోరారు. ఇవీ.. జాగ్రత్తలు - ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి అన్ని మండల విద్యావనరుల కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు ఇవ్వాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు - విద్యార్థులు ముందుగా తమ పేరు లేదా తల్లిదండ్రులు లేదా ఉమ్మడిగా బ్యాంకు ఖాతా తెరిచే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి - విద్యార్థులు సంబంధిత మండలంలో మీ సేవా ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, రూ.2 లక్షలకు లోబడి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందే విధంగా హెడ్మాష్టర్లు చర్యలు తీసుకోవాలి - ఈ వివరాలతో పాటు పాఠశాల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నింపి దరఖాస్తు ప్రింట్ కాపీ, బ్యాంకు కాపీ మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, విద్యార్థి ఫొటో జతచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేయాలి - ఈ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ ప్రధానోపాధ్యాయులు సంబంధిత హాస్టల్ వార్డెన్‌కు అందజేయాలి - ప్రధానోపాధ్యాయులు సదరు విద్యార్థి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మరే ఇతర స్కాలర్షిప్ పొందడం లేదని ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి - అర్హత కలిగిన ఏ విద్యార్థీ ఉపకార వేతనం పొందలేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. - అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయలు తమ పాఠశాలల్లో చదివే షెడ్యూల్డ్ కూలాల విద్యార్థులతో ఉపకార వేతన దరఖాస్తులను ఆన్లైన్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు. -
ఆచార్య దేవో భవ
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాబోధనలో ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లా నుంచి ఎంపికైన నలుగురు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘన సన్మానం అందుకున్నారు. కాగా పాఠశాల ల్లో విద్యార్థులు గురువు పాత్రలను పోషించి సందడి చేశారు. ప్రగతినగర్ : ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజు అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఘననీయమైనదని అన్నారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురుపూజోత్స వం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఉపాధ్యాయునిగా వేషం వేసేడినని తెలిపారు. ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించడం, తోటి విద్యార్థులంతా ఉపాధ్యాయుల్లా న టించడం ఎన్నటికీ మరిచి పోలేనన్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి తన గురువులే కారణమన్నారు. ప్రతి విద్యార్థి పైకి ఎదగాలనే తపనతో విద్యాబోధన చేయడం గురువుల లక్షణమన్నారు. గురుపూజోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా గురువులను గౌరవించిన వారమవుతామన్నారు. విద్యార్థులు గురువులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ఆయన జీవితం విద్యార్థులందరికీ ఆదర్శం కావాలన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. డీఈఓ శ్రీనివాసచారి మాట్లాడు తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికే వన్నే తెచ్చారని, అదే స్ఫూర్తితో నేటితరం ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. అనంతరం కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సాక్షర భారతి డీడీ కృష్ణరావు, డైట్ ప్రిన్సిపాల్, శ్రీని వాస్, బాల్భవన్ పర్యవేక్షకులు ప్రభాకర్,డిప్యూటీ డీఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’ఫీజులపై రగడ
శాతవాహన యూనివర్సిటీ: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్య క్తమవుతున్నాయి. ఫీజుల విషయమై ఇటు విద్యార్థి సంఘాలు, అటు వి ద్యాసంస్థల యాజమాన్యాల మధ్య రగడ మొదలైంది. జీవో 42 ప్రకారం ఫీజులు తీసుకోవాలని విద్యార్థి సం ఘాలు కోరుతుంటే... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫీజులు సరిపోవని విద్యాసంస్థల యాజమాన్యాలు అంటున్నాయి. 2014-15 వి ద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఫీజుల విషయంలో లొల్లి జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ ఏ విధమై న స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. ఫీజులు నియంత్రణ, కనీస సౌకర్యాల కల్పన వి షయంలో విద్యాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని, ఈ విషయాన్ని కొలిక్కి తీసుకురావాల ని ఉద్దేశంతో భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) బు ధవారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో రగడ సద్దుమణగడానికి అధికారులు ఏ విధానాన్ని ఎంచుకుంటారో వేచిచూడాలి. జీఓ 42 ఏం చెబుతోంది? 2011లో ఫీజుల నియంత్రణ విషయమై అప్పటి ప్రభుత్వం జీఓ 42ను విడుదల చేసింది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని ప్రయివేట్ పాఠశాలల్లో ప్రైమరీ స్కూళ్లలో ఏడాదికి రూ.9వేలు, హైస్కూళ్లలో రూ.12 వేలు మా త్రమే వసూలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ స్కూళ్లలోరూ.7,800, హైస్కూళ్లలో రూ.10,800 వసూలు చేయాలని జీవో స్పష్టం చేసింది. అలాగే ఫీజు ల నియంత్రణకు జిల్లా స్థాయిలో ఓ కమిటీని వేయాల ని పేర్కొంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా ఉంటారు. జీవో జారీ అయి ఇన్నేళ్లవుతున్నా జిల్లాలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు కూడా కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శం. రూ.25వేలకు పెంచాలంటున్న యాజమాన్యాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధ్యాయుల వేతనాలు పెంచాల్సి వస్తోందని, దీనికితోడు ప్రతీ నెల డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో కూడా ఫీజులు పెంచకతప్పడం లేదని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు రూ.50 వేలకు పైన ఉంటుందని, దానిపై అడగని విద్యార్థి సంఘాలు, ప్రయివేట్ పాఠశాలల ఫీజులపై రద్దాంతం చేయడం ఎంతవరకు సబబు అంటూ ఇటీవల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు సమావేశాలు నిర్వహించాయి. ప్రభుత్వం డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్న విధంగా పాఠశాలల స్థాయిలో సగం ఫీజులు ఇచ్చినా నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యాసంస్థల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు జీవో 42 అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రయివేట్ యాజమాన్యాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ జీఓను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు స్టే ఇచ్చిందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వై.శేఖర్‌రావు అన్నారు. ఫీజులను నియంత్రణ చేసేంత వరకు ఆందోళనలు ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలి. జిల్లాలోని అనేక ప్రయివేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. అలాంటి విద్యాసంస్థలపై ఫిర్యాదులు చేసినా అధికారులు వారి కొమ్ము కాస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాం. ఫీజుల నియంత్ర, మౌలిక సదుపాయల కల్పన జరిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తాం. - బండారి శేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రభుత్వ వ్యయం కంటే తక్కువకే నాణ్యమైన విద్య ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై పెడుతున్న ఖర్చుకంటే.. ప్రయివేట్‌లో త క్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు ఉంటే విద్యార్థులు ఎందుకు ప్రయివేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తారు. జీవో 42 ప్రకారం ఫీజులు తీసుకోవాలనడం సరికాదు. పెరుగుతున్న ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాం. ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదనే విషయాన్ని అధికారులు, విద్యార్థి సంఘాలు గమనించాలి. - యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు -
గుర్తింపు లేని పాఠశాలలపై దాడులు
వైవీయూ : కడప నగరంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కోఆపరేటివ్ కాలనీ, మాసాపేటలోని ఇంగ్లీషు మీడియం హైస్కూళ్లపై జిల్లా విద్యాశాఖ అధికారులు దాడులు చేసి మూసివేయించారు. గురువారం నగరంలో గుర్తింపు లేని 4 పాఠశాలలను గుర్తించి ముందుగా రెండింటిపై దాడులు నిర్వహించి మూసివేయించారు. మరో పాఠశాల చిరునామా దొరకక అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా డీఈఓ కె.అంజయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 21 పాఠశాలలు గుర్తింపు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల విద్యాశాఖ అధికారులకు గుర్తింపులేని పాఠశాలలపై చర్యలకు ఆదేశించామన్నారు. ఇప్పటికైనా సంబంధిత యాజమాన్యాలు గుర్తింపు తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు సైతం గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కడప డిప్యూటీ డీఈఓ ఐ. ప్రసన్నాంజనేయులు, ఎంఈఓ వి. నాగమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చార్జ్ ఇవ్వకుంటే సస్పెన్షనే..
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : కేజీబీవీ ప్రత్యేకాధికారులుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్తగా నియామకమైన వారికి వెంటనే చార్జ్ ఇవ్వకుంటే సస్పెండ్ చేయాలని క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ డీఈఓ, ఆర్వీఎం పీఓకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియామకమైన ఎస్ఓలకు బాధ్యతలు అప్పగించి డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు పేరెంట్ డిపార్టుమెంట్‌కు వెళ్లాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన లెక్క చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అధికారులు చేసేది లేక గత నెల 28న 18 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి వివరణ రాకపోవడంతో మంగళవారం జరిగిన సమావేశంలో క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్వీఎం అధికారులు రిలీవ్‌కాని వారి జాబితాను జిల్లా విద్యాదికారికి బుధవారం పంపించారు. రిలీవ్‌కాని ఉపాధ్యాయులు వీరే.. పి.వకుల మల్లిక, ఎస్ఓగా భూత్పూర్ కేజీబీవీలో పనిచేస్తున్నారు, ఎం.విజయ (దామరగిద్ద ), వి.రాధిక (కోయిల్‌కొండ కేజీబీవీ), ఎ.అంజమ్మ, (ఉప్పునుంతల) లతాదేవి,(బాలనగర్ ), ఎం.పద్మ (బిజినపల్లి) సత్యవాణి (నవాబ్‌పేట ), సి.వసంతలక్ష్మి(వనపర్తి ), ఎం.పుష్పలత (ఆమనగల్లు ), ఎన్.లావణ్య (బోంరాస్‌పేట ), ఎం.విద్యావతిదేవి (హన్వాడ), జయమ్మ(మిడ్జిల్ ), ఎం.భారతి(తలకొండపల్లి ), ఎస్.పద్మ(వంగూరు ), రాజేశ్వరమ్మ(అచ్చంపేట), సుజాత(ఫరూక్నగర్ ), టి. శ్రీలత(కల్వకుర్తి ), శశిరేఖ(తిమ్మాజిపేట). జాబితా అందిన వెంటనే చర్యలు..: రిలీవ్‌కాని వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి నుంచి జవాబు ఇంకా రాలేదు. రిలీవ్‌కాని వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్వీఎం నుంచి జాబితా అందలేదు. పరిశీలించి వెంటనే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా. -చంద్రమోహన్,డీఈఓ, మహబూబ్‌నగర్ -
విద్యాశాఖ తీరు మారదా?
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: గతంలో విద్యాశాఖాధికారిగా పని చేసిన మువ్వా రామలింగం తన అడ్డగోలు నిర్ణయాలతో తీవ్ర వివాదాస్పదంగా మారి సస్పెండ్ అయినా జిల్లా విద్యాశాఖ తీరు మారలేదు. పైసలిచ్చే ఫైళ్లకు క్షణాల్లో రెక్కలొస్తున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పరిపాలనలో గత విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం కోటరీ అక్రమాలు, అవినీతికి బలైన పలువురు టీచర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. నిబంధనల ప్రకారం వీరికి ఎప్పుడో పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యాశాఖ వారి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఉపాధ్యాయులు తమ భార్యాబిడ్డలతో ఏళ్లతర బడి అర్ధాకలితో గడుపుతున్నారు. వీరి గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. క్షణాల్లో క్లియరెన్స్ అవుతున్న ఫైళ్లు.. లక్షల్లో చేతులు మారుతున్న తీరు విద్యాశాఖలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యే రోజు దగ్గర కొచ్చింది. పలువురు ప్రైవేటు పాఠశాలల యజమానులు లక్షలు కుమ్మరించి తమ ఫైళ్లు క్లియర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఓపనింగ్ పర్మిషన్, ప్రొవిజనల్ రికగ్నైజేషన్, రెన్యువల్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ఈ ఫైళ్ల క్లియరెన్స్ ద్వారా ప్రతిరోజూ విద్యాశాఖలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అక్రమ సంపాదన ఉందని, కలెక్టర్ విచారణ చేపడితే పలు అక్రమాలు బయట పడుతాయని ఉపాధ్యాయ లోకం కోడై కూస్తోంది. ఉపాధ్యాయుల సస్పెన్షన్ల ఫైళ్లకు దిక్కులేదు గత విద్యాశాఖాధికారికి వ్యతిరేకంగా జరిగిన ధర్నాల్లో పాల్గొన్నందుకు 15 మందిని, ఇతరత్రా కారణాలతో మరి కొంతమందిని అండర్ పెండింగ్ విచారణ పేరుతో సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన వారికి ఆరు నెలల తరువాత పోస్టింగ్ ఇవ్వాలి. ఏవైనా లోపాలుంటే తరువాత జరిగే విచారణలో రుజువైతే అప్పుడు ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు చేపట్టాలి. అయితే జిల్లాలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. - సర్వేపల్లిలో పని చేస్తున్న లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడిని మువ్వా కోటరీలోని ఓ ప్రధానోపాధ్యాయుడు మాటలు విని సస్పెండ్ చేశారు. - హబీబుల్లా పరిస్థితి మరీఘోరం ఈయన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట పాఠశాల్లో పనిచేస్తున్నాడు. ఈయన చేసిన నేరం యూటీఎఫ్ సంఘంలో సభ్యుడు కావడమే. మువ్వా కోటరీలో ఉన్న ఆ పాఠశాల హెచ్ఎంను పాఠశాల విషయంలో ప్రశ్నించడం ఈయన చేసిన రెండో నేరం. ఈయన కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేదు. లాంగ్ లీవులో ఉండి నెలల తరబడిగా తన బిడ్డకు హైదరాబాద్‌లో వైద్యం చేయిస్తున్నారు. ప్రసు ్తతం కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుల పాలయ్యాడు. మువ్వా తన అనుచర గణంలోని డిప్యూటీ ఈఓను ప్రయోగించి లేనిపోని నివేదిక తయారు చేయించి సస్పెండ్ చేయించారు. నిబంధనల ప్రకారం లాంగ్ లీవులో ఉన్న హబీబుల్లాను సస్పెండ్ చేయకూడదు. ఈయన సస్పెండ్ అయినప్పటి నుంచి గ్రామస్తులు హబీబుల్లాను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కలెక్టర్‌ను కలిశారు. ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ఈయన సస్పెన్షన్ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సంబంధిత సెక్షన్లో ఫైలు సిద్ధం చేశారు. అయితే డీఈఓ కార్యాలయంలో ఉన్నతాధికారులు కొందరు దీన్ని తొక్కి పెట్టారు. - సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లెలో పని చేస్తున్న ఎల్.వెంగయ్య, గంగవరం నుంచి సంజయ్వినోద్, ఇస్కదామెర్ల జెడ్పీ హెచ్ఎస్ నుంచి సత్యసాయి తదితరులతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులును కలుపుకుంటే దాదాపు 25 మంది ఉన్నారు. వీరిలో దాదాపుగా ఎక్కువ మంది మువ్వా రామలింగం కోటరీకి బలైపోయినవారే. వాస్తవాలు పరిశీలించి తమపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని పోస్టింగ్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఫైళ్లు కలెక్టరేట్ పంపుతున్నా : సంబంధిత ఫైళ్లు కలెక్టర్‌కు పంపుతున్నా. అక్కడ పరిశీలించిన తరువాత సస్పెన్షన్లను రద్దు చేస్తాం. డీఈఓ కార్యాలయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేదు. అంతా నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. -ఎన్.ఉష, ఇన్చార్జి డీఈఓ -
ఇదేం‘శిక్ష’ణ ?
ఖమ్మం, న్యూస్‌లైన్: భావి ఉపాధ్యాయులను తయారు చేసే జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డీఐఈటీ)లో బోధించే అధ్యాపకులు కరువయ్యారు. 24 మంది లెక్చరర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో సకాలంలో సిలబస్ పూర్తి కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపించిన అధికారులు ఇక్కడ కనీస బోధన జరిగేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించడంతో అధ్యాపకులతో కళకళలాడాల్సిన డైట్ నేడు వెలవెలబోతోంది. 24 మంది అధ్యాపకులకు నలుగురే.. ఎలిమెంటరీ స్థాయి విద్యాబోధనను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఒక సంవత్సరం నిర్వహించే ఉపాధ్యాయ శిక్షణ సెంటర్(టీటీసీ)ను మార్పు చేశారు. దీనిని డైట్(డిస్ట్రిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)గా మార్చి రెండు సంవత్సరాల కోర్సుగా చేశారు. ఈ కళాశాలలో వివిధ సబ్జెక్టుల మెథడాలజీతోపాటు మనోవిజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, ఇతర సామాజిక అంశాలు బోధించడం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి టీచింగ్ ప్రాక్టిస్, బోధన ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలైన పాఠశాల కార్యక్రమాలు, పాఠశాల అనుబంధ కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తారు. ఇందుకోసం 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌తోపాటు బోధనేతర సిబ్బంది 20 మంది.. మొత్తం 45 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇంతమంది ఉంటేనే విద్యార్థుల పర్యవేక్షణతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే కొంత కాలంగా డైట్లో అధ్యాపకుల నియామకం చేపట్టకపోవడం, ఇక్కడ పనిచేసేవారు ఒక్కొక్కరుగా ఉద్యోగ విరమణ పొందడం, బదిలీ కావడంతో 17 మంది లెక్చరర్లకు గాను ప్రస్తుతం ఇద్దరే మిగిలారు. ఏడుగురు సీనియర్ అధ్యాపకులకు బదులు నలుగురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు సీనియర్ లెక్చరర్లలో బస్వారావు ఖమ్మం డివిజన్ డిప్యూటీఈవోగా అదనపు బాధ్యతలతో బయటకు వచ్చారు. ఉన్న నలుగురు అధ్యాపకులలో సైకాలజీ లెక్చరర్ కమలాకర్‌రావు అనారోగ్యం కారణంగా తరుచూ సెలవులో ఉంటున్నారు. మిగిలిన మరో సీనియర్ లెక్చరర్ రాజేశ్వర్‌రావు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో బోధనకు సీనియర్లు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. 24 మంది చేయాల్సిన పని మిగిలిన ముగ్గురు లెక్చరర్లు సత్యనారాయణ, సత్యనారాయణ రాజు, సోమశేఖరశర్మపైనే పడుతుండడంతో వారు కూడా తూతూ మంత్రంగా బోధించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఏ విషయంపైనా సరైన అవగాహన రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో పూర్తికాని సిలబస్... ఎంతో కష్టపడి ప్రభుత్వ డైట్లో సీటు సాధించిన విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన తర్వాత చేదు అనుభవం ఎదురవుతోంది. బోధించేవారు సరిపడా లేక సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడం, ఉన్నవారు తూతూ మంత్రంగా పాఠాలు చెపుతుండడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాక్టికల్ మార్కులు వేసేది అధ్యాపకులే కావడంతో వారు సక్రమంగా బోధించకున్నా విద్యార్థులు మౌనంగా ఉంటున్నారు. అయితే డైట్ పూర్తయిన తర్వాత టెట్, డీఎస్సీ పరీక్షల్లో ఇక్కడ చదివిన మెథడాలజీ, టీచింగ్ అప్టిట్యూడ్, సైకాలజీ, ఇతర సబ్జెక్టుల అంశాలే కీలకం. దీంతో ఇక్కడ ఏదో విధంగా ఉత్తీర్ణత సాధించినా ఆ తర్వాత పరీక్షల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని, డైట్ సెట్లో మంచి ర్యాంకు సాధించినా ప్రైవేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. -
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
- డీఈఓ విజయభాస్కర్ ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. -
డీఈవో బదిలీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు బదిలీ అయ్యారు. మెదక్ జిల్లా విద్యాశాఖాధికారిగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజేశ్వరరావును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బదిలీ చేశారు. అయితే అక్కడి డీఈవో ఎన్నికల విధుల్లో ఉండటంతో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత బాధ్యతలు స్వీకరించాలని అక్కడి కలెక్టర్ రాజేశ్వరరావుకు సూచించారు. దీంతో ఆయన మూడు నెలలు జిల్లాలోనే పనిచేశారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడటంతో మెదక్ జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతించాలని రాజేశ్వరరావు మెదక్ కలెక్టర్‌ను కోరారు. ఆయన ఆమోదంతో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖాధికారిగా రాజేశ్వరరావు ఏడాదిపాటు పనిచేశారు. వివాదాలకు అతీతంగా..ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. ఒంగోలు ఆర్డీవో కార్యాలయ ఆవరణలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న జవహర్ బాల భవన్‌ను వినియోగంలోకి తెచ్చారు. గతంలో ఎవరూ ఈ భవనం గురించి పట్టించుకోలేదు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) కార్యాలయానికి శాశ్వత భవన వసతి కల్పించడంలో చొరవ తీసుకున్నారు. స్థానిక బండ్లమిట్టలో ఖాళీగా ఉన్న మోడల్ స్కూల్ భవనాలను కలెక్టర్ ఆమోదంతో డీసీఈబీ కార్యాలయానికి అప్పగించారు. శనివారం ఈ భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు కూడా డీఈవో భవన వసతి కల్పించారు. ఇప్పటిదాకా డీఆర్ఆర్ఎం హైస్కూల్లో డీసీఈబీ కార్యాలయం నిర్వహించిన గదిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు కేటాయించారు. దాన్ని కూడా శనివారమే ప్రారంభించారు. జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో కూడా ఆయన చొరవ చూపారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టి ఆ ఖాళీలు భర్తీ చేశారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. పదో తరగతి పరీక్షల్లో ఒక శాతం ఉత్తీర్ణత పెంపుదలకు కృషి చేశారు. జిల్లాలో డీఈవోగా పనిచేయడం తన అదృష్టమని ఈ సందర్భంగా రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాను తన సొంత జిల్లాగానే భావించి పనిచేశానని తెలిపారు. డీఈవోగా పదవీ బాధ్యతల నిర్వహణలో తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్చార్జి డీఈవోగా విజయభాస్కర్: డీఈవో రాజేశ్వరరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి డీఈవోగా పర్చూరు ఉప విద్యాధికారి బి.విజయభాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయం నుంచి విజయభాస్కర్‌కు ఎఫ్ఏసీ (పూర్తి అదనపు ఉత్తర్వులు) రావాల్సి ఉంది. -
పెద్ద సారొచ్చారు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : చదువులమ్మ ఒడిలో ఉన్న జిల్లా విద్యాశాఖకు ఎట్టకేలకు పూర్తిస్థాయి డీఈవో సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. గతంలో పూర్తిస్థాయి అధికారిగా పనిచేసిన అక్రముల్లాఖాన్ జనవరి 31న ఉ ద్యోగ విరమణ చేయడంతో సీనియర్ అధికారి రామారావును తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ నేపథ్యంలో అక్రముల్లాఖాన్ శాఖను పెద్దగా పట్టించుకోక పోవడంతోపాటు, తాత్కాలికంగా పనిచేసిన రామారావు కఠిన చర్యల వైపు అడుగు వేయకపోవడంతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఊహించని రీతిలో చివరి స్థానం రాక తప్పలేదు. కొత్త డీఈవోకు సమస్యల మాల కొత్తగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారికి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మారుమూల ప్రాంతంలో పాఠశాలలు ఎక్కువగా ఉండటంతోసమస్యలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రెండేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ నిలిచింది. సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందకపోవడంతో సమయం వృథా అవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ ఇచ్చి ఆ తరగతి విద్యార్థులకు బోధించమంటూ అదనపు భారం ఉపాధ్యాయులపై వేస్తున్నారు. జూన్‌లోనే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చినచో సకాలంలో పాఠ్యాంశాలు పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇన్‌చార్జీలే అధికం జిల్లాలో 48 మండలాలకు పీజీ హెచ్ఎంలే ఇన్చార్జి మండల విద్యాధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వీరిలో 15 మంది అధికారులు ఈ ఇన్చార్జి బాధ్యతలు తాము మోయలేమని, బాధ్యతలను తప్పించాల్సిందిగా మొరపెట్టుకుంటున్నా కనికరించడంలేదు. అదే విధంగా 38 ఉన్నత పాఠశాలలకు పీజీ హెచ్ఎంలు లేక పోవడంతో ఆ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంటులే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. వారు అటు పాఠాలు చెప్పలేక, ఇటు పాఠశాల బాధ్యతలను నిర్వర్తించలేక సతమత మవుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో 350 స్కూల్ అసిస్టెంటు పోస్టులు కోర్టు జోక్యంతో పదోన్నతులు నిలిచాయి. దీంతో ఆ పాఠశాలల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కుంటుపడుతున్న విద్య డీఎస్సీ ద్వారా భర్తీ కావాల్సిన సుమారు 1200 భర్తీ కాకపోవడంతో ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులతోపాటు ఉపాధ్యాయులకు అదనపు బారం పడుతోంది. గడిచిన విద్యాసంవత్సరంలో పదో తరగతి తరగతుల నిర్వహణతో పాటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల ప్రగతిపై ఏ ఒక్క సమీక్ష జరిగిన సందర్భం లేదని, ఈ నేపథ్యంలోనే పదో తరగతి ఫలితాలు ఆశించిన మేరకు రాలేదని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఆరంభంకు ముందుగానే విద్యాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
ఒంగోలు: జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్ష లన్నీ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 39,601 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 195 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. కాపీయింగ్ నిరోధించేందుకు పది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 14 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 11 రోజుల పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు మాత్రమే కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. పరీక్షల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఇన్విజిలేటర్లను, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్టుమెంట్ అధికారులను పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తం 25 మందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల నిర్వహణ పట్ల రాష్ట్ర పరిశీలకులు ఎం.వనజాక్షి సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకనానికి ఏర్పాట్లు: స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూలులో బుధవారం నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం మూల్యాంకనానికి నియమితులైన అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మూల్యాంకనంలో పాటించాల్సిన ప్రమాణాల గోప్యత, ఇతర వివరాలను వివరించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా మూల్యాంకనాన్ని పక్కాగా నిర్వహించాలని డీఈఓ కోరారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి జి.పుల్లారెడ్డి, ఏసీ సి.నాగప్ప, ఉపవిద్యాధికారులు కె.వెంకట్రావు, ఎస్కే చాంద్‌బేగమ్, వి.రామ్మోహనరావు, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు వై.వెంకట్రావు, ఏసీవోలు పాల్గొన్నారు. -
నవ్విపోదురుగాక..
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు అనే చందంగా జిల్లా విద్యాశాఖ తీరు తయారైంది. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, విధేయతగా ఉంటే చాలు అందలం ఎక్కిస్తామని సంబంధిత అధికారి వ్యవహరిస్తున్నారనేందుకు ఉదాహరణలున్నాయి. అన్యాయంపై ప్రశ్నిస్తే వేధించడం పరిపాటిగా మారింది. పరిపాలనను చక్కదిద్దాల్సిన జిల్లా ఉన్నతాధికారి సైతం పట్టించుకోకపోవడంతో విద్యాశాఖలో ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. విద్యాశాఖ వింతలీలల్లో ఇదో చక్కటి ఉదాహరణ. మండల కేంద్రమైన రాపూరులోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఎస్.శేషాద్రివాసు అదే గ్రామంలోని బాలికల పాఠశాలలో కూడా కొంత కాలం ఇన్చార్జ్ హెచ్ఎంగా వ్యవహరించారు. అప్పుడు ఓ ఉపాధ్యాయురాలిని వేధించారనే అరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు పడింది. ఈ మేరకు ఆర్జేడీ పార్వతి 2013, నవంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌లో ఉన్న ఈ హెచ్ఎంను డీఈఓ పదో తరగతి పరీక్షల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే కస్టోడియన్‌గా నియమించారు. ఈయనకు జీతాలు కూడా లేవు. అయినా ఘనత వహించిన మన నె ల్లూరు విద్యాశాఖ ఆయన్ను అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం ఆయన పిడతాపోలూరులోని సెల్ఫ్ సెంటర్లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనే పోలీసు స్టేషన్‌కెళ్లి పదో తరగతి ప్రశ్నాపత్రాలు తీసుకొస్తున్నారు. ఇందు కోసం ఈయనకు ప్రభుత్వం టీఏ, డీఏ చెల్లిస్తోంది. ఈయన కనుపర్తిపాడు, రాపూరుతో పాటు పనిచేసిన పలుచోట్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో పొదలకూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రశ్నాపత్రాలు లీకయ్యినపుడు మీడియాలో దుమారం రేగింది. అప్పుడు అక్కడ ఇదే హెచ్ఎం అధికారిగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఈ పెద్దమనిషికి పదో తరగతి పరీక్షల నిర్వహణలో కస్టోడియన్‌గా బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఈఓ కార్యాలయ ఉన్నతాధికారి, ఈ హెచ్ఎంకు మధ్య అవినాభావ సంబంధాలు ఉండటమే దీనికి కారణమని ఉపాధ్యాయ లోకం కోడైకూస్తోంది. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన విషయాలు: హెచ్ఎం ఎస్.శేషాద్రివాసును రీ యిన్స్టేట్ (సస్పెన్సన్ రద్దు చేసి విధుల్లోకి తీసుకోవడం) చేసే అధికారం ఆర్జేడీకి ఉందని డీఈఓ కార్యాలయం గత ఏడాది డిసెంబర్ 31న తెలిపింది. శేషాద్రివాసు హెచ్ఎంగా కొనసాగుతున్నట్టు తెలిపే సమాచారం గుంటూరు ఆర్జేడీ నుంచి రాలేదని క్లియర్‌గా తెలిపారు. ఈ వివరాలపై డీఈఓ ఇన్సియల్ కూడా ఉంది. సస్పెన్షన్ రద్దుకు నో అన్న ఆర్జేడీ ఆర్జేడీ పార్వతి హెచ్ఎం సస్పెండ్‌ను రద్దు చేసేది లేదంటూ కోర్టుకు అప్పీలుకు కూడా వెళ్లారు. ఆయనపైన బలమైన ఆరోపణలున్నాయని కోర్టుకు నివేదించారు. అంతే కాక జీతాలు ఇవ్వద్దంటూ రాపూరు ఎస్టీవో కార్యాలయానికి ఉత్తర్వులను కూడా పంపారు. హెచ్ఎం సస్పెన్షన్‌లో ఉంటూ ఏం చేశారంటే.. కావాలనే కాంప్లెక్స్ పాఠశాలలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు రాపూరు ఉన్నత పాఠశాలలో సేవా భారతి ట్రస్టు ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లిస్తుంది. అయినప్పటికీ పదో తరగతి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఆరు నెలలుగా జీతాలు తీసుకోలేదు. అయినా రెండు, మూడు రోజులకు ఒకసారి స్కూల్‌కు వెళ్లి సంతకాలు చేశారు. ఇలాంటి వ్యక్తి కోసం.. ఇలాంటి హెచ్ఎంను గతంలో ఓపెన్ స్కూల్స్‌కు సంబంధించి హైపవర్ కమిటీలోకి విద్యాశాఖ తీసుకొంది. అంతేకాడు టీఏ, డీఏలు చెల్లించింది. విద్యాశాఖకు సూటి ప్రశ్నలు: కోర్టు తీర్పు వచ్చిన చాలా రోజుల తర్వాత హెచ్ఎం సస్పెండ్‌ను రద్దు చేసినట్టు (రీయిన్స్టేట్) ఆర్జేడీ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు రాలేదని డీఈఓ కార్యాలయం సమాచార హక్కు చట్టం ప్రకారం ఎందుకు సమాధానమిచ్చింది. హెచ్ఎంగా కొనసాగుతున్నట్టు కూడా ఆర్జేడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని సమాధానం ఎందుకిచ్చారు. ఇలా సమాధానాలు ఇచ్చి కూడా పది పరీక్షల విధుల్లోకి ఎలా తీసుకున్నట్టు. పట్టించుకోని ఉన్నతాధికారి విద్యాశాఖలో గందరగోళ నిర్ణయాలు జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అందుకే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. చిన్నస్థాయి ఉద్యోగుల తప్పులపై విరుచుకుపడే ఉన్నతాధికారి రాజకీయ పలుకుబడి ఉండే వారి విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి స్పందించి విద్యాశాఖను గాడిలో పెట్టాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
‘టెన్’షన్
27 నుంచి పదో తరగతి పరీక్షలు కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఏడాది కష్టానికి ‘పరీక్ష’. భానుడు ఉగ్రరూపం దాల్చగా.. ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదో తరగతి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కుల గోల నుంచి ఉపశమనం లభించినా.. గ్రేడింగ్‌లో ముందుండాలనే తపన ప్రతి విద్యార్థిలో కనిపిస్తోంది. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెగ్యులర్‌గా 47,057.. ప్రైవేట్‌గా 6,293 మంది కలిపి 53,350 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 199, ప్రైవేట్ విద్యార్థులకు 28 మంది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మకమైనవిగా 19 కేంద్రాలను గుర్తించారు. ప్రశ్నపత్రాలను 75 పాయింట్లలో సోరేజ్ చేయగా.. 227 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. మరో 20 శాతం మందిని రిజర్వులో ఉచారు. వీరితో పాటు 2,667 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 11 మంది విద్యాధికారులు, 11 మంది ఎమ్మార్వోలు, 11 మంది ఎస్ఐలతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటైంది. ఏప్రిల్ 15 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎంచే అత్యవసర మందులను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. అయితే అధిక శాతం పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సమస్య వేధిస్తోంది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించరాదని.. ప్రతిరోజూ ఉదయం 8.45 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు హెల్ప్‌లైన్ నెంబర్ 98499 32289, 08518-277064 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్మోహన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ అంధుల పాఠశాలలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. చిన్నారుల బోధనను చూసి అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లను అందజేశారు. ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కె. వరుణ్, ఎంఈఓగా పి. సంఘవి, హెచ్ఎంగా బి. గణేష్, వ్యవహరించారు. డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు పాల్గొన్నారు. -
డీఈఓ బదిలీ!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓ రమేష్ బదిలీ అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు నియమితులైనట్టు తెలుస్తోంది. ఈ బదిలీ వెనుక ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంవత్సర కాలంగా డీఈఓను బదిలీ చేసేందుకు ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే చర్యలను విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. డీఈఓను బదిలీ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంచిగా పనిచేసే అధికారిని ఎలా బదిలీ చేస్తారో చూస్తానంటూ జోక్యం చేసుకోవడం వల్ల అప్పట్లో బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా ఎన్నికల సందర్భంగా వివిధ శాఖల అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న భాగంగా పెండింగ్‌లో ఉన్న డీఈఓ బదిలీ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సంతకం చేసినట్లు తెలిసింది. డీఈఓ రమేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించినట్టు సమాచారం. ప్రైవేటు పాఠశాలల వ్యవహారంలో డీఈఓ ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోకపోవడంతో పాటు మారుమూల పాఠశాలల పనితీరుపై ప్రత్యేక దృష్టిని సారించి పని చేయని ఉపాధ్యాయులపై వేటు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే డీఈఓకు, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ఎమ్మెల్యే సూచించిన ఏ ఒక్కటీ కూడా డీఈఓ చేయకపోవడంతోపాటు, తన పరిధిలో లేదంటూ దాట వేస్తూ రావడంతో జగ్గారెడ్డి తీవ్ర గుర్రుగా ఉన్నట్టు వినికిడి. తన సిఫార్సులను లెక్క చేయని డీఈఓను ఎలాగైనా బదిలీ చేయించాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నట్టు సమాచారం. పైగా డీఈఓ బదిలీ తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి ద్వారా బదిలీ ఉత్తర్వులపై సంతకం చేయించినట్టు సమాచారం. దూకుడుగా వెళ్లడమే కారణమా? జిల్లా విద్యాశాఖాధికారిగా 2012 ఏప్రిల్ 9న బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి దూకుడుగా వెళుతుండటంతో మింగుడుపడని ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ బదిలీకి పైరవీలు ప్రారంభించాయి. ఆయనను బదిలీ చేయిస్తే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా మీ గెలుపు కోసం పనిచేస్తారని గుర్తింపు పొందిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో వారి మద్దతు కూడగట్టుకునేందుకు డీఈఓ బదిలీ వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకుని బదిలీ తతంగాన్ని చివరివరకు ఆయనే నడిపించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీఈఓ బదిలీకి దూకుడుగా వ్యవ హరించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో డీఈఓ రమేష్ వెనుకంజ వేసేవారు కాదు. విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన వారిలో అధికంగా ఉపాధ్యాయ సంఘాల్లోని జిల్లాస్థాయి నాయకులే ఉన్నారు. ఇదిలా ఉంటే పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక తరగతులతో పాటు ప్రతి శుక్రవారం క్విజ్ పోటీలు, తదితర కార్యక్రమాలను చేపట్టారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ సైతం డీఈఓ చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అందుకు ప్రతి రోజూ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కలెక్టర్, డీఈఓ చేసిన కృషిని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పలు కారణాల చేత బదిలీ ఆగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. బదిలీ చేయడం సరికాదు సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం కృషి చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిని తన రాజకీయ పలుకుబడి కోసం బదిలీ చేయించడం సరైంది కాదని ఈ సమయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని డీఈఓ బదిలీ నిలిపి వేయాలని టీ జేఏసీ పశ్చిమ జిల్లా చైర్మన్ వై.అశోక్‌కుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కిషన్, మార్పు కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నార్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి గౌతంరెడ్డి, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. సమాజం కోసం నిజాయితీగా పనిచేసే అధికారులను తమ ఉనికి కోసం రాజకీయ నాయకులు బదిలీ చేయిం చడం సరికాదన్నారు. ఈ సంస్కృతిని ప్రజలు ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎస్పీగా పనిచేసిన అవినాష్ మహంతిని అలాగే బదిలీ చేయించారని, తాజాగా డీఈఓను మూడు సంవత్సరాలు నిలువకుండానే కొందరుస్వార్థ పరులు తమ ఉనికి కోసం బదిలీ చేయిస్తున్నారన్నారు. -
పంతుళ్ల దొడ్డిదారి
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖలో అడ్డగోలు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. 60 మందిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 33 మంది స్కూల్ అసిస్టెంట్లు, 23 మంది ఎస్జీటీలు, ముగ్గురు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఒక లాంగ్వేజ్ పండిట్ (హిందీ) ఉన్నారు. ఈ బదిలీలకు సంబంధించి కనీసం జిల్లా విద్యాశాఖను ‘రిమార్క్సు’ కోరలేదు. గుట్టుచప్పుడు కాకుండా ఈ బదిలీల ఆర్డర్లు జారీ చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు నివ్వెరపోతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే నిబంధనలకు పాతరేసి అడ్డగోలు బదిలీలు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలు ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’ అన్న చందంగా ఉన్నాయి. ఒక ఖాళీ ఉంటే ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేశారు. దీంతో అప్పుడే జాయినింగ్ ఉత్తర్వుల కోసం పైరవీలు మొదలయ్యాయి. మరోవైపు ఖాళీలు లేని, అసలు పోస్టే లేని స్కూళ్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఎంత బలంగా పని చేశాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ స్థాయిలో ఒక్కో ఆర్డర్‌కు అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే.. బదిలీకి అర్హులా.. కాదా అనే విషయాలను కూడా పట్టించుకోకుండా దరఖాస్తు చేసుకున్న అందరికీ బదిలీల ఆర్డర్లు ఇచ్చేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రధాన అనుచరుడు తనకు కావాల్సిన మహిళా ఉపాధ్యాయురాలి బదిలీ కోసం.. ఆమె దరఖాస్తు చేయకపోయినా, అతనే ఆమె తరుఫున దరఖాస్తు చేసి సదరు మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి బదిలీ చేయించినట్లు సమాచారం. బదిలీలలు రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటు బయాలజికల్ సైన్సు ఒక పోస్టు ఖాళీ ఉంది. అయితే ఇక్కడికి నలుగురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీలు లేకపోయినా.. బుక్కరాయసముద్రం, సిద్ధరాంపురం ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు, బీ. కొత్తపల్లిలో ఫిజికల్ సైన్స్ పోస్టులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేట జెడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టు ఖాళీ లేదు. ఇక్కడికి ఒక ఉపాధ్యాయురాలిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల ఇదే సబ్జెక్టుకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ‘నియర్ బై అనంతపురం’ అంటూ ముగ్గురు ఉపాధ్యాయుల ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓడీసీ మండలం ఎన్.తండా పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న ఓ మహిళను పుట్టపర్తి మండలానికి బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం భగత్‌సింగ్ నగర్ పాఠశాలలో రెండు ఖాళీలు ఉంటే నలుగురికి ఉత్తర్వులు ఇచ్చారు. తాటిచెర్లలో ఒక పోస్టుకు ఇద్దరికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక సోములదొడ్డి పాఠశాలలో ఖాళీలు లేకపోయినా ముగ్గురిని బదిలీ చేశారు. రిమార్క్సు కూడా కోరని ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడు బదిలీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే జిల్లా విద్యాశాఖను రిమార్క్సు కోరడం నిబంధన. దరఖాస్తు చేసుకున్న పాఠశాలలో ఖాళీ ఉందా లేదా.. ప్రస్తుతం పని చేస్తున్న చోటు రెండేళ్ల సర్వీసు పూర్తయిందా, లేదా.. పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల వివరాలు ఇలా సుమారు 19 అంశాలతో కూడుకున్న ప్రొఫార్మాను జిల్లా విద్యాశాఖ అధికారులు భర్తీ చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించి బదిలీకి అర్హులైతేనే పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే దరఖాస్తును తిరస్కరించాలి. ముందు వచ్చిన వారికే అవకాశం బదిలీ ఉత్వర్వు ఇచ్చిన పాఠశాలలో ఖాళీ లేకపోతే సమీప పాఠశాల, అక్కడ లేదంటే సమీప మండలంలో అవకాశం కల్పిస్తాం. ఎవరు ముందుగా వస్తారో వారికి ముందు అవకాశం ఇస్తాం. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో ఈ విషయాలు చాలా స్పష్టంగా పేర్కొంది. - మధుసూదన్‌రావు, డీఈఓ -
మా పిల్లల భవిష్యత్తు బలిచేస్తారా?
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాధికారి నిర్లక్ష్యంతో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సంఘీభావం తెలిపారు. ఈ సం దర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మెదక్ మండల విద్యాశాఖ కార్యాలయంలో నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష నిమిత్తం సుమారు 400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 74 దరఖాస్తులు ఎంఈఓ కార్యాలయంలోనే మూలన పడేశారని ఆరోపించారు. గడువు ముగిసిన నెల రోజుల తరువాత దరఖాస్తులు వర్గల్ నవోదయ విద్యాలయానికి పంపడం తో తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. మెదక్ ఎంఈఓ కార్యాలయంలో నిర్ణీత గడువులోనే అందజేసినప్పటికీ.. అప్పట్లో ఇన్చార్జ్ ఎంఈఓ సాయిబాబా అనారోగ్య పరిస్థితి వల్ల సెలవులో ఉన్నారన్నారు. దీంతో గడువు ముగిసే వరకు కూడా మెదక్ ఎంఈఓ కార్యాలయంలోనే దరఖాస్తులు పడేశారని ఆరోపించారు. కానీ ఉపాధ్యాయుల జీతాలు, మధ్యా హ్న భోజన బిల్లులు ఎలా వచ్చాయంటూ వారు ప్రశ్నించారు. ఈ విషయమై డీఈఓ రమేష్‌కు ఫోన్లో తమ గోడును విన్నవించు కోగా తాను షటిల్ ఆడుతున్నానంటూ ఫోన్ పెట్టేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిం చారు. అనారోగ్య కారణంగా ఎంఈఓ సాయిబాబా సెలవు పెట్టిన వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. ఇందుకు ప్రధాన కారకుడు డీఈఓనేనని వారు ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్‌తో ఆడుకున్న డీఈఓను వెంటనే సస్పెండ్ చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వి నతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, నాగరాజు, బంగారయ్య, సిద్దిరాంలు, అప్పారావు, కిష్టయ్య, శ్రీధర్, నర్సింలు, మల్లేశం, పోచయ్య, రాంచందర్, రమేష్, కొండల్‌రెడ్డి, భూపాల్, లక్ష్మణ్‌గౌడ్, ైశె లేంద్ర, విద్యార్థి నాయకుడు దత్తు ఉన్నారు. -
పాఠాలకు టాటా!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. అసలే ఉపాధ్యాయుల కొరత... ఆపై రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుబడుతోంది. 50 మండలాల్లో సీని యర్ ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవ హరిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పర్యవేక్షించాల్సిన హెచ్ఎంలకు ఇన్చార్జి ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో అటు పాఠశాలకు, ఇ టు ఎంఈఓ పోస్టుకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత పాఠశాలలో వారానికి కనీసం ఎనిమిది తరగతులు బోధించాలనే నిబంధన ఉంది. అయితే పని భారం పేరుతో హెచ్ఎంలు ఎవరూ ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 3,951 పాఠశాలల్లో 4,53,614 మంది విద్యార్థులు ఉన్నారు. 50 మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలుగా ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జీ)హోదాలో సీనియర్ హెచ్ఎంలు పని చేస్తున్నారు. దీనిని సాకుగా చూపి, వారిలో చాలామంది పాఠ శాలల వైపు కన్నెత్తి చూడటం లేదు. మండల విద్యాశాఖ కార్యాలయానికే పరిమితమవుతూ సమీక్షలు, తనిఖీలు, సమాచార పం పిణీ...ఇలా సాకులు చెబుతూ పాఠశాలలను మరిచిపోతున్నారు. కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ వేతనాల బిల్లులపై సంతకాలు చేసి వస్తున్నా రు. దీనింతో పాఠశాలల నిర్వహణ పూర్తిగా గాడి త ప్పింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్నా, పాఠ్యాంశాలు పూర్తి కాలేదు. మరోవై పు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులు స జావుగా సాగాలంటే ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. అయితే 50 ఉన్నత పాఠశాలల్లో స క్రమ పర్యవేక్షణ లేక పదో తరగతి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. అవకతవకలు... ఇన్చార్జ్ ఎంఈఓ బాధ్యతల వల్ల సంబంధిత పాఠశాలపై హెచ్ ఎం పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు పె రిగిపోతున్నాయి. పుస్తకాలు, దుస్తుల పంపిణీ నుంచి నిధుల వినియోగం వరకు అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయు లు ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తున్నారని, ఇన్చా ర్జి హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లకు అప్పజెప్పడం తో, మిగతా ఉపాధ్యాయులు వారి మాటలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తి కావల్సి ఉండగా, సంబంధిత పాఠశాలల్లో 60 శా తం కూడా పూర్తి చేయలేదు. పాఠశాలకు కచ్చితంగా వెళ్లాలి: డీఈఓ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు చూస్తున్న హెచ్ ఎంలు ప్రతి రోజూ తప్పనిసరిగా వారి పాఠశాలలకు వె ళ్లాలని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్ తెలిపా రు. పాఠశాలకు కనీసం గంట సమయమైనా కేటాయించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, పదో తరగతి ఉత్తీర్ణత ఏమాత్రం తగ్గినా...వారిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. -
వెబ్సైట్లో టెన్త్ ఫలితాల విశ్లేషణ
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ఉత్తీర్ణతా శాతం వచ్చిన పాఠశాలలపై మరింత దృష్టి పెట్టేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ www.deochittoor.orgలో జిల్లాలోని 602 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వచ్చిన పది ఫలితాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమీక్షించుకునే విధంగా వెబ్సైట్లో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 92.18 ఉత్తీర్ణతా శాతం ఉంది. చొరవ తీసుకున్న కలెక్టర్ కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చొరవ కారణంగానే వెబ్సైట్లో ఈ వివరాలు పెట్టారు. నెల రోజుల క్రితం ఆయన విద్యాశాఖ అధికారులతో దీనిపై మాట్లాడారు. వెబ్సైట్లో విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడిని పిలిపించి టెన్త ఫలితాలకు సంబంధించి ప్రోగ్రాం రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ సూచనల ప్రకారం 20 రోజుల పాటు కష్టపడి ప్రేమ్‌కుమార్ జిల్లా స్థాయిలో వచ్చిన ఫలితాలను, పాఠశాలలో వచ్చిన ఫలితాలతో పోలుస్తూ గ్రాఫ్‌లు రూపొందించి వెబ్సైట్లో పెట్టారు. ఇందులో మండలాల వారీగా పాఠశాలలు, గత ఏడాది అవి పది పరీక్షల్లో సాధించిన ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉంటాయి. వీటి ఆధారంగా తమ పాఠశాల విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో గమనించి దానిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఏం చేయాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. హెచ్‌ఎంలందరూ సమీక్ష జరపాలి ఇది జిల్లా కలెక్టర్ ఆలోచనల రూపం. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ www.deochittoor. org వెబ్సైట్లో పెట్టిన ఫలితాలను చూసుకొని తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్టులో ఎందుకు ఇలా జరిగిందని ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించాలి. -బి.ప్రతాప్‌రెడ్డి, డీఈవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ కార్యక్రమంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చాలాసార్లు పిలిపించి మా ట్లాడి దీనికి ఒకరూపం తెచ్చారు. ఈ పనిచేసే సమయంలో ఎప్పటికప్పుడు పని ఎంతవరకు వచ్చిందని ఆరా తీ స్తూండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తోనే ఈ వెబ్‌సైట్‌ను ఇంత త్వరగా రూపొందించాము. వచ్చే విద్యాసంవత్సరంలో టెన్తలో ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. -ప్రేమ్‌కుమార్, డీఈవో కార్యాలయం అధికారిక వెబ్సైట్ రూపకర్త