
‘ప్రైవేట్’ఫీజులపై రగడ
శాతవాహన యూనివర్సిటీ: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్య క్తమవుతున్నాయి. ఫీజుల విషయమై ఇటు విద్యార్థి సంఘాలు, అటు వి ద్యాసంస్థల యాజమాన్యాల మధ్య రగడ మొదలైంది. జీవో 42 ప్రకారం ఫీజులు తీసుకోవాలని విద్యార్థి సం ఘాలు కోరుతుంటే... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫీజులు సరిపోవని విద్యాసంస్థల యాజమాన్యాలు అంటున్నాయి.
2014-15 వి ద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఫీజుల విషయంలో లొల్లి జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ ఏ విధమై న స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. ఫీజులు నియంత్రణ, కనీస సౌకర్యాల కల్పన వి షయంలో విద్యాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని, ఈ విషయాన్ని కొలిక్కి తీసుకురావాల ని ఉద్దేశంతో భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) బు ధవారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో రగడ సద్దుమణగడానికి అధికారులు ఏ విధానాన్ని ఎంచుకుంటారో వేచిచూడాలి.
జీఓ 42 ఏం చెబుతోంది?
2011లో ఫీజుల నియంత్రణ విషయమై అప్పటి ప్రభుత్వం జీఓ 42ను విడుదల చేసింది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని ప్రయివేట్ పాఠశాలల్లో ప్రైమరీ స్కూళ్లలో ఏడాదికి రూ.9వేలు, హైస్కూళ్లలో రూ.12 వేలు మా త్రమే వసూలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ స్కూళ్లలోరూ.7,800, హైస్కూళ్లలో రూ.10,800 వసూలు చేయాలని జీవో స్పష్టం చేసింది. అలాగే ఫీజు ల నియంత్రణకు జిల్లా స్థాయిలో ఓ కమిటీని వేయాల ని పేర్కొంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా ఉంటారు. జీవో జారీ అయి ఇన్నేళ్లవుతున్నా జిల్లాలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు కూడా కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శం.
రూ.25వేలకు పెంచాలంటున్న యాజమాన్యాలు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధ్యాయుల వేతనాలు పెంచాల్సి వస్తోందని, దీనికితోడు ప్రతీ నెల డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో కూడా ఫీజులు పెంచకతప్పడం లేదని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చు రూ.50 వేలకు పైన ఉంటుందని, దానిపై అడగని విద్యార్థి సంఘాలు, ప్రయివేట్ పాఠశాలల ఫీజులపై రద్దాంతం చేయడం ఎంతవరకు సబబు అంటూ ఇటీవల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు సమావేశాలు నిర్వహించాయి. ప్రభుత్వం డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న విధంగా పాఠశాలల స్థాయిలో సగం ఫీజులు ఇచ్చినా నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యాసంస్థల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు జీవో 42 అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రయివేట్ యాజమాన్యాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ జీఓను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు స్టే ఇచ్చిందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వై.శేఖర్‌రావు అన్నారు.
ఫీజులను నియంత్రణ చేసేంత వరకు ఆందోళనలు
ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలి. జిల్లాలోని అనేక ప్రయివేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. అలాంటి విద్యాసంస్థలపై ఫిర్యాదులు చేసినా అధికారులు వారి కొమ్ము కాస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాం. ఫీజుల నియంత్ర, మౌలిక సదుపాయల కల్పన జరిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తాం.
- బండారి శేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ వ్యయం కంటే తక్కువకే నాణ్యమైన విద్య
ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై పెడుతున్న ఖర్చుకంటే.. ప్రయివేట్‌లో త క్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు ఉంటే విద్యార్థులు ఎందుకు ప్రయివేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తారు. జీవో 42 ప్రకారం ఫీజులు తీసుకోవాలనడం సరికాదు. పెరుగుతున్న ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాం. ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదనే విషయాన్ని అధికారులు, విద్యార్థి సంఘాలు గమనించాలి.
- యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు