మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖకు ఇన్‌చార్జి అధికారులే దిక్కయ్యారు. అసలే ఉపాధ్యాయుల కొరత... ఆపై రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుబడుతోంది. 50 మండలాల్లో సీని యర్ ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవ హరిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పర్యవేక్షించాల్సిన హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో అటు పాఠశాలకు, ఇ టు ఎంఈఓ పోస్టుకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇన్‌చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత పాఠశాలలో వారానికి కనీసం ఎనిమిది తరగతులు బోధించాలనే నిబంధన ఉంది. అయితే పని భారం పేరుతో హెచ్‌ఎంలు ఎవరూ ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదు.
జిల్లా వ్యాప్తంగా 3,951 పాఠశాలల్లో 4,53,614 మంది విద్యార్థులు ఉన్నారు. 50 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలుగా ఎఫ్‌ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జీ)హోదాలో సీనియర్ హెచ్‌ఎంలు పని చేస్తున్నారు. దీనిని సాకుగా చూపి, వారిలో చాలామంది పాఠ శాలల వైపు కన్నెత్తి చూడటం లేదు. మండల విద్యాశాఖ కార్యాలయానికే పరిమితమవుతూ సమీక్షలు, తనిఖీలు, సమాచార పం పిణీ...ఇలా సాకులు చెబుతూ పాఠశాలలను మరిచిపోతున్నారు. కేవలం మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ వేతనాల బిల్లులపై సంతకాలు చేసి వస్తున్నా రు.
దీనింతో పాఠశాలల నిర్వహణ పూర్తిగా గాడి త ప్పింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్నా, పాఠ్యాంశాలు పూర్తి కాలేదు. మరోవై పు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులు స జావుగా సాగాలంటే ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలి. అయితే 50 ఉన్నత పాఠశాలల్లో స క్రమ పర్యవేక్షణ లేక పదో తరగతి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
అవకతవకలు...
ఇన్‌చార్జ్ ఎంఈఓ బాధ్యతల వల్ల సంబంధిత పాఠశాలపై హెచ్ ఎం పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు పె రిగిపోతున్నాయి. పుస్తకాలు, దుస్తుల పంపిణీ నుంచి నిధుల వినియోగం వరకు అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయు లు ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తున్నారని, ఇన్‌చా ర్జి హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్‌లకు అప్పజెప్పడం తో, మిగతా ఉపాధ్యాయులు వారి మాటలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తి కావల్సి ఉండగా, సంబంధిత పాఠశాలల్లో 60 శా తం కూడా పూర్తి చేయలేదు.
పాఠశాలకు కచ్చితంగా వెళ్లాలి: డీఈఓ
ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు చూస్తున్న హెచ్ ఎంలు ప్రతి రోజూ తప్పనిసరిగా వారి పాఠశాలలకు వె ళ్లాలని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్ తెలిపా రు. పాఠశాలకు కనీసం గంట సమయమైనా కేటాయించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, పదో తరగతి ఉత్తీర్ణత ఏమాత్రం తగ్గినా...వారిదే బాధ్యత అని తేల్చిచెప్పారు.
పాఠాలకు టాటా!
Published Thu, Dec 5 2013 3:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement