రమణారెడ్డి , మక్తల్ ఆస్పత్రిలో కన్యాకుమారికి చికిత్స చేస్తున్న వైద్యులు
సాక్షి, మక్తల్ : పాఠశాలలోని తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిపై భర్త కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.. ఈ సంఘటన బుధవారం మండలంలోని ముస్లాయిపల్లిలో కలకలం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దాదన్‌పల్లికి చెందిన అంజిరెడ్డి, లక్ష్మి దంపతుల కూతురు కన్యాకుమారి(35) కి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని సాతన్‌కోటకు చెందిన రమణారెడ్డితో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఈమె ముస్లాయిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. భార్యాభర్తలు కలిసి మక్తల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడాది భార్యాభర్తల మధ్య బేదాభిప్రాయాలు వచ్చి తర చూ ఘర్షణ పడేవారు. దీంతో బంధువు లు పం చాయతీ నిర్వహించి నచ్చజెప్పేవారు.
చిన్నచూపు చూస్తోందని..
ఇటీవల డీఎస్సీ ప్రకటించడంతో రమణారెడ్డి కర్నూలులోని అవనిగడ్డలో కోచింగ్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని.. తనను చిన్నచూపు చూస్తుందని భావిస్తూ మంగళవారం ఇద్దరూ కలిసి దాదన్‌పల్లికి వచ్చారు. బుధవారం ఉదయం తన పిల్లలు జసిక, అనన్యలు రమణరెడ్డితో కలిసి ముస్లాయిపల్లి పాఠశాలకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఓ గదిలో మాట్లాడుతున్న సమయంలోనే భర్త కత్తితో భార్యను పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా ఉపాధ్యాయులు రావడంతో రమణారెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వారిని గ్రామస్తులు 104లో మక్తల్ ఆస్పత్రికి తరలించారు.
కన్యాకుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రానికి పంపించారు. విషయం తెలుకున్న జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, అనుగొండ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఘటన చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
తరచూ గొడవపడేవారు..
రమణారెడ్డి తమ ఇంటికి వస్తే చాలు తరచూ గొడవపడేవారని కన్యాకుమారి తండ్రి అంజిరెడ్డి అన్నారు. ప్రతిరోజు దాదన్‌పల్లి నుంచి ము స్లాయిపల్లికి పాఠశాలకు వెళ్లేదని, బుధవారం సై తం అలాగే వెళ్లగా ఘటన చోటుచేసుకుందన్నా రు. రమణారెడ్డి మాట్లాడుతూ తనను చిన్న చూపు చూస్తుందని, దీంతో అనుమానం పెం చుకుని కత్తితో బెదిరించే క్రమంలో ఘటన చోటు చేసుకుందన్నారు. తనకు ఏమాత్రం గౌరవం ఇ వ్వడం లేదని వాపోయారు. ఈ విషయం కుటం బ సభ్యులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment