సంగారెడ్డి మున్సిపాలిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూలు డెరైక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విభాగం ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి రోజు ఉదయం 9-30 నుంచి 12-15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 25న తెలుగు పేపర్-1, 26న పేపర్-2, 27న హిందీ, 30న ఇంగ్లీష్ పేపర్-1, 31న పేపర్-2, ఏప్రిల్ 1న గణితం పేపర్-1, 2న పేపర్-2, 4న జనరల్ సైన్స్ పేపర్-1, 6న సైన్స్ పేపర్ -2, 7న సాంఘిక శాస్త్రం పేపర్-1, 8న పేపర్-2, పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.