సాక్షి, హైదరాబాద్: బడులు తెరిచేలోగా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ సంవత్సరం దీని ఆధారంగానే స్కూళ్లకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం కూడా ఈ లెక్క ఆధారంగానే ఇవ్వనుంది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం యూనిఫైడ్ డి్రస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)ను రూపొందిస్తుంది.
ఇందులో సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లు, మౌలిక సదుపాయాలను గుర్తిస్తారు. అయితే, ఈ గణాంకాలు సరిగా ఉండట్లేదనే విమర్శలున్నాయి. కచి్చతమైన వివరాలు పంపకపోవడం వల్ల ప్రణాళికలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈసారి సరైన పర్యవేక్షణతో యూడైస్ రూపొందించాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.
50కి పైగా అంశాలు
యూడైస్ పట్టికలో 50కిపైగా అంశాలుంటాయి. ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్ని నింపాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, తరగతి గదుల వివరాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ అనుసంధానమైన ప్రొజెక్టర్లు, టీవీ, ఫరి్నచర్, కిచెన్ షెడ్, ప్రహరీ వంటి అనేక వివరాలు పొందుపర్చాలి. దీంతోపాటే డిజిటల్ క్లాస్ రూమ్‌ల వివరాలు, నెట్ సదుపాయం కూడా ప్రత్యేకంగా చేర్చారు. హెచ్‌ఎంలు ఈ డేటాను మండల విద్యాశాఖాధికారికి అందిస్తే.. అక్కడ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు ఈ వివరాలు వెళ్తాయి. వీటిని బట్టి ఈసారి మన ఊరు–మనబడి, మన బస్తీ–మనబడి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ బడులుంటే, ప్రస్తుతం 20 లక్షల మంది విద్యార్థులున్నారు. యూడైస్ లెక్కల ప్రకారమే వీరికి యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రత్యేక పర్యవేక్షణ
హెచ్‌ఎంల ద్వారా అందుతున్న డేటా ప్రకారం యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. యూడైస్‌లో కన్పించే లెక్క ఒకటైతే, వాస్తవ విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటోందని, ఫలితంగా యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వాటిలో చాలీచాలని పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. దీంతో హెచ్‌ఎంల డేటాను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, వారి నివేదికలు వచ్చాకే యూడైస్‌కు తుదిరూపం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
దీనికోసం జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. వీరితోపాటు మండల విద్యాశాఖ అధికారి నేతృత్వంలో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు వెళ్లాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతోంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
హెచ్‌ఎంలు కారణం కాదు
బడుల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియే మొదలవ్వలేదు. పాఠశాలలు తెరిచినా రెండు నెలల వరకూ విద్యార్థులు చేరుతూనే ఉంటారు. కనీసం సెపె్టంబర్, అక్టోబర్ వరకు గానీ కచి్చతమైన లెక్క తేలదు. కానీ గత ఏడాది విద్యార్థుల లెక్కను యూడైస్‌కు ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. అయితే, ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడమో, తగ్గడమో జరుగుతోంది. ఇది హెచ్‌ఎంల తప్పు కాదు. కొంత ఆలస్యమైనా ఈ ఏడాది అడ్మిషన్ల లెక్కను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంగ్లిష్ మీడియం తెస్తున్న నేపథ్యంలో ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. – పిరాజాభాను చంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment