Telangana schools
-
విద్యార్థులను భయపెడుతున్న సర్కారీ బడులు
-
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల బస్సులు పూర్తిగా దారి తప్పాయి. విద్యార్థులను భద్రంగా ఇళ్లకు చేర్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికల్లా ఫిట్నెస్ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా, ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం వాహనాలు మాత్రమే దాన్ని పూర్తిచేసుకున్నాయి. అధికారులు బస్సుల ఫిట్నెస్ పరిశీలించి అవి రోడ్డుపై నడిచేందుకు యోగ్యంగా ఉన్నదీ లేనిదీ తేలుస్తారు. ఆ మేరకు ఫిట్నెస్ రెన్యూవల్ చేస్తారు. ఇప్పుడు ఫిట్నెస్ రెన్యూవల్ లేకుండానే 80 శాతం బస్సులు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 6 వేల బస్సులు మాత్రమే ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకున్నాయని సమాచారం. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న వేళ పరిస్థితిని ముందే గుర్తించి హెచ్చరించాల్సిన రవాణాశాఖ పెద్దగా స్పందించలేదు. సోమవారంలోపు రెన్యూవల్ చేయించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలైనా జారీ చేయలేదు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతూనే రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఫిట్నెస్ రెన్యూవల్ లేని బస్సులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయటం లాంటివి చేస్తారు. విద్యాసంస్థలకు పెనాల్టీలు విధిస్తుంటారు. కానీ, ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా విద్యాసంస్థల్లో భయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్రారంభమయ్యాక పట్టుబడితే పెనాల్టీలు విధించటం వరకు సరే, అసలు ఫిట్నెస్ లేక బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శిక్షణ ఏది..? విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోపు విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్న నిబంధన ఉంది. సఫర్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి. డ్రైవింగ్ నైపుణ్యం, బస్సు నిబంధనలు, విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు.. ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. విద్యార్థులు ఆ బస్సుల్లో ఎక్కడం ప్రారంభమయ్యేలోపే ఈ శిక్షణ పూర్తి చేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎప్పటికో శిక్షణ ఇస్తే, ఈలోపు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఏంటన్నది తల్లిదండ్రు ఆందోళన. -
తగని వసతులు లేని చదువులా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్‌ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్ లేదా ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు. టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు? ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్‌ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది. అశోక్ ధనావత్, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్మెంట్ స్టడీస్ విద్యార్థి ది హేగ్, నెదర్లాండ్స్ -
చదువు వెనుక‘బడి’!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్య నాణ్యత సూచీలో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ (పీఐజీ)’ నివేదిక తేల్చింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని పేర్కొంది. మనకన్నా వెనుక ఈశాన్య రాష్ట్రాలే.. పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు పొందడం గమనార్హం. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్ (741), నాగాలాండ్ (728), ఉత్తరాఖండ్ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి. బోధన, పర్యవేక్షణ రెండూ కొరతే! రాష్ట్రంలో పీఐజీ తగ్గడానికి మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో (గురుకుల, రెసిడెన్షియల్ కాలేజీలు కలిపి) 69,15,241 మంది చదువుతున్నారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో 33,03,699, ఎయిడెడ్ 90,601, ప్రైవేటు సంస్థల్లో 35,14,380 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22గా ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నడిపించే పరిస్థితి ఉంది. 8,630 మంది భాషా పండితులు, పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ కాలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,207 పీఎస్ హెచ్ఎం పోస్టులుండగా.. 2,386 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతావి 1,821 ఖాళీలున్నాయి. కొత్తగా 5,793 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఇక పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన డీఈవోలు, ఎంఈవోలు పూర్తిస్థాయిలో లేరు. ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. దీంతో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు ఒక్కో హెచ్ఎంకు ఆరేడు మండలాలు అప్పగించారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా బోధన, పర్యవేక్షణకు ఇబ్బంది కలుగుతోంది. మౌలిక వసతుల కరువుతో.. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంకా వేగం పుంజుకోలేదని.. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో సమస్యలు కనిపిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 38వేల బడుల్లో శౌచాలయాలు ఉన్నా, వాటిలో 10వేల వరకు పనికిరాని స్థితిలో ఉన్నాయి. బాలికలు ఎక్కువగా ఉండే 5,700 స్కూళ్లలోనూ శౌచాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాలికల గైర్హాజరు పెరగడానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 20వేల స్కూళ్లలో విద్యార్థులకు లైబ్రరీ అనేదే తెలియదు. లైబ్రరీ ఉన్నా అందులో పుస్తకాలు శూన్యం. 15వేల బడుల్లో ఆటస్థలాలు లేవు. దీనివల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం నష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40,437 స్కూళ్లకు విద్యుత్ సౌకర్యమున్నా.. 38,920 స్కూల్స్‌లోనే సరిగా సరఫరా జరుగుతోంది. డిజిటల్ విద్య వైపు దేశం అడుగులేస్తున్నా.. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని స్కూళ్లు 20వేలకుపైగా ఉన్నాయి. ఇవన్నీ విద్య ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని పీఐజీ నివేదిక పేర్కొంది. కేంద్రం తీసుకున్న డేటా పాతది పీజీఐ నివేదికను పరిశీలించాం. వాళ్లు తీసుకున్న డేటా పాతది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మౌలిక వసతుల మెరుగుకు మన ఊరు–మన బడి ప్రారంభించాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తున్నాం. బోధనా ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాం. వచ్చే ఏడాది మనం మంచి ర్యాంకు సాధిస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి వచ్చే ఏడాది గ్రేడ్–1లో ఉంటాం ఈ నివేదిక మొత్తం కోవిడ్ కాలంలో జరిగిన పరిశీలనే. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో పాయింట్స్ తగ్గినా మనం గ్రేడ్–2లోనే ఉన్నాం. కోవిడ్ సమయంలో స్కూల్స్ తెరవలేదు. అందుకే బయోమెట్రిక్ హాజరు వాడలేదు. దాన్ని కొలమానంగా తీసుకోలేం. అదీగాక కోవిడ్ వల్ల రాష్ట్రంలో విద్యా వలంటీర్లను కూడా నియమించలేదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది పీఐజీలో మనం గ్రేడ్–1లో ఉండటం ఖాయం. – దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ టీచర్ల కొరత తీర్చితే నాణ్యత పెరుగుతుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే ఉపాధ్యాయ కొరత ఎలా తీరుస్తారు? ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ముందు దీన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తే పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారదర్శకత పెంచాలి ప్రైవేటు స్కూళ్లకు అనుమతి ఇచ్చే క్రమంలో ఆన్లైన్ విధానం ఉండాలి. ఈ తరహా పారదర్శకత అవసరం. డిజిటలైజేషన్ చేపట్టాలి. సకాలంలో నిధులు ఇవ్వాలి. అప్పుడే విద్యాశాఖలో నాణ్యత పెరుగుతుంది. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్, హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
తెలంగాణలో చదువుకోవాలంటే లక్షలు కట్టాలి
-
తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్‌పై మరోసారి ప్రకటన
-
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
బడులు తెరిచేలోగా పక్కా లెక్కలివ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బడులు తెరిచేలోగా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ సంవత్సరం దీని ఆధారంగానే స్కూళ్లకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం కూడా ఈ లెక్క ఆధారంగానే ఇవ్వనుంది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం యూనిఫైడ్ డి్రస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)ను రూపొందిస్తుంది. ఇందులో సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లు, మౌలిక సదుపాయాలను గుర్తిస్తారు. అయితే, ఈ గణాంకాలు సరిగా ఉండట్లేదనే విమర్శలున్నాయి. కచి్చతమైన వివరాలు పంపకపోవడం వల్ల ప్రణాళికలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈసారి సరైన పర్యవేక్షణతో యూడైస్ రూపొందించాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 50కి పైగా అంశాలు యూడైస్ పట్టికలో 50కిపైగా అంశాలుంటాయి. ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్ని నింపాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, తరగతి గదుల వివరాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ అనుసంధానమైన ప్రొజెక్టర్లు, టీవీ, ఫరి్నచర్, కిచెన్ షెడ్, ప్రహరీ వంటి అనేక వివరాలు పొందుపర్చాలి. దీంతోపాటే డిజిటల్ క్లాస్ రూమ్‌ల వివరాలు, నెట్ సదుపాయం కూడా ప్రత్యేకంగా చేర్చారు. హెచ్ఎంలు ఈ డేటాను మండల విద్యాశాఖాధికారికి అందిస్తే.. అక్కడ ఆన్లైన్లో పొందుపరుస్తారు. అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు ఈ వివరాలు వెళ్తాయి. వీటిని బట్టి ఈసారి మన ఊరు–మనబడి, మన బస్తీ–మనబడి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ బడులుంటే, ప్రస్తుతం 20 లక్షల మంది విద్యార్థులున్నారు. యూడైస్ లెక్కల ప్రకారమే వీరికి యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక పర్యవేక్షణ హెచ్ఎంల ద్వారా అందుతున్న డేటా ప్రకారం యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. యూడైస్‌లో కన్పించే లెక్క ఒకటైతే, వాస్తవ విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటోందని, ఫలితంగా యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వాటిలో చాలీచాలని పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. దీంతో హెచ్ఎంల డేటాను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, వారి నివేదికలు వచ్చాకే యూడైస్‌కు తుదిరూపం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. వీరితోపాటు మండల విద్యాశాఖ అధికారి నేతృత్వంలో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు వెళ్లాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతోంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. హెచ్ఎంలు కారణం కాదు బడుల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియే మొదలవ్వలేదు. పాఠశాలలు తెరిచినా రెండు నెలల వరకూ విద్యార్థులు చేరుతూనే ఉంటారు. కనీసం సెపె్టంబర్, అక్టోబర్ వరకు గానీ కచి్చతమైన లెక్క తేలదు. కానీ గత ఏడాది విద్యార్థుల లెక్కను యూడైస్‌కు ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. అయితే, ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడమో, తగ్గడమో జరుగుతోంది. ఇది హెచ్ఎంల తప్పు కాదు. కొంత ఆలస్యమైనా ఈ ఏడాది అడ్మిషన్ల లెక్కను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంగ్లిష్ మీడియం తెస్తున్న నేపథ్యంలో ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. – పిరాజాభాను చంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు) -
అవసరమే ఆవిష్కరణ..
బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్ టైమ్‌కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్ టైమ్ టేబుల్ బ్యాగ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్ అంబరిల్లా రూమ్‌ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేస్తా మేం తయారు చేసిన మినీ పోర్టబుల్ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. – రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్‌స్కూల్, మహబూబాబాద్ సంతోషంగా ఉంది ఎగ్జిబిట్‌ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది. – కీర్తన, 6వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్ అమ్మ తిప్పలు చూడలేక... సైన్స్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెంటర్ శివకృష్ణ సర్ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్ కోర్సు చేశాం. ఇందులో ఆన్లైన్లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా. నాన్న గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. – జి. శివాని అంధులకు సైతం ఉపయోగపడాలని... తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ కోసం మేము అబ్దుల్ కలాం అనే గ్రూప్‌గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్‌తో పంచుకున్నాను. మా సర్ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్‌లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్‌గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం. ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్‌కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. – బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
మార్కుల మాయ.. ఇష్టానుసారంగా ఇంటర్నల్ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లు టెన్త్ విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణలు రావడం, ప్రతి స్కూల్ నుంచీ ప్రతి విద్యార్థికీ గరిష్ట మార్కులు రావడంపై ఫిర్యాదులు అందడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ క్షేత్రస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలంటూ అన్ని ప్రభుత్వ స్కూళ్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు పరిశీలించాకే స్కూళ్లు పంపిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అసలేం జరిగింది? తెలంగాణలో మే 23 నుంచి టెన్త్ పరీక్షలు జరగనుండగా ప్రతి పేపర్ 80 మార్కులకే ఉండనుంది. మరో 20 మార్కులను విద్యార్థుల ప్రావీణ్యత ఆధారంగా స్కూళ్లు కేటాయించే అంతర్గత మార్కులతో పాఠశాల విద్యాశాఖ కలపాలి. ఇందుకోసం ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు ఇవ్వాల్సి ఉంది. ఇలా గుర్తించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాలి. కానీ ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం 20 మార్కులకు గరిష్టంగా 19 మార్కులు కూడా వేయడం, దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పద్ధతి కనిపించడం అనుమానాలకు కారణమైంది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారని, కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు కూడా చేశాయంటూ ఉన్నతాధికారులకు ఆరోపణలు అందినట్లు తెలియవచ్చింది. దీంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల తర్వాతే మార్కుల ఖరారు.. పాఠశాలలు పొందుపర్చిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను పరిశీలించేందుకు ప్రతి మండల పరిధిలో ఓ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి సబ్జెక్టు నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. కేటాయించిన స్కూళ్లకు ఈ బృందం వెళ్లి విద్యార్థి ఏడాదిపాటు రాసిన నోట్‌బుక్స్ (ఇందులో రాత విధానం గుర్తిస్తారు), సమాధాన పత్రాలను తనిఖీ చేయనుంది. అవసరమైతే విద్యార్థితో ముఖాముఖి మాట్లాడి మార్కులను ఖరారు చేయనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ప్రత్యేక బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఇంటర్నల్ మార్కులను పాఠశాల విద్యాశాఖ నిర్ణయించనుంది. ప్రాజెక్టు వర్క్ ఏం చేయించారు? ఎలా చేయించారు? వాటి ఫలితాలను విద్యార్థి ఎలా విశ్లేషించారనే అంశాలకు ఈ బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ పరిశీలనపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా ఇప్పుడు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలన ఎలా వీలవుతుందని, ప్రైవేటు స్కూళ్లు తనిఖీ బృందాలను మేనేజ్ చేసుకుంటే పరిస్థితి ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది టెన్త్ విద్యార్థులుండగా 3 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలోనే ఉన్నారు. అంత మంది విద్యార్థుల రికార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలించడం ఆచరణ సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడానికే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో ఎక్కడ చదివినా ఆ విద్యార్థి సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా గుర్తించగలగాలి. ఇది సాధ్యం కావాలంటే మొదట్నుంచీ పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. –పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేట్ మాయాజాలమే ప్రభుత్వ స్కూళ్లలో సామర్థ్యాన్ని బట్టే విద్యార్థులకు మార్కులొస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఇదో పెద్ద మాయాజాలం. అసెస్మెంట్ పరీక్ష పేపర్ ఇచ్చి దగ్గరుండి సమాధానాలు రాయిస్తున్నారు. పదికి పది జీపీఏ సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నారు. – చావా రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
స్కూళ్లలో వై‘రష్’.. గురుకులాలు, పాఠశాలల్లో పెరుగుతున్న కేసులు
సాక్షి నెట్వర్క్: పాఠశాలల్లో కరోనా కలకలం రేపు తోంది. గత కొన్ని రోజులుగా వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరుగు తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కలిపి 46 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, ఓ వంట మనిషికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. లక్షణాలు ఉన్న వాళ్లకు టెస్టులు చేయగా.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు జలుబు, తుమ్ములతో బాధపడుతుండగా శుక్రవా రం కరోనా పరీక్షలు చేశారు. అందరికీ వైరస్ సోకిం దని తేలింది. జిల్లాలోని మల్యాల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలం ఇంద్రేశంలోని మహత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం ముగ్గురు, గురువారం 25 మంది విద్యార్థినులకు కరోనా సోకగా శుక్రవారం మరో 19 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు, ఓ వంట మనిషికి కరోనా సోకింది. హనుమకొండ జిల్లా దామెర మం డలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయుడికి.. శాయం పేట మండలం పెద్దకోడెపాక రెవెన్యూ శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌గా తేలింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ బీసీ మెట్రిక్ హాస్టల్లో ఓ టీచర్‌కు, ఓ విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మాస్కు వేసుకోని వారికి జరిమానా కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భయపెడుతుండటంతో ప్రభుత్వం మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరికీ మాస్కు తప్పనిసరి చేసింది. పెద్దపల్లిలో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న 31 మందికి, యాద గిరిగుట్ట పట్టణంలో 10 మందికి రూ. వెయ్యి చొప్పున పోలీసులు జరిమానా విధించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. -
ఆవిష్కరణలే లక్ష్యంగా స్కూళ్లలో ప్రత్యామ్నాయ బోధన
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయిలో నిరంతరం మారుతున్న బోధన పద్ధతులతో పాఠ్యాంశాల్లో విద్యార్థులను విలీనం చేయడం ద్వారా సృజనాత్మకతకు మరింత పదును పెట్టే అవకాశం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో నవమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నవమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఎల్‌సీఈ) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సె ల్ (టీఎస్ఐసీ)తో మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా జయేశ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జయేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎల్‌సీఈ ఏర్పాటు కోసం టీఎస్ఐసీ, నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యం రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు బాటలు వేస్తుందని టీఎస్ఐసీ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ తెలిపారు. ప్రవాహ, టీఎస్ఐసీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు లో తాము భాగస్వాములు కావడం పట్ల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్పర్సన్ రామ్‌జీ రాఘవ న్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక, ఆవిష్కరణల వాతావరణంలో క్షేత్రస్థాయి నుంచి అందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ సాధించే ఫలితాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రవాహ ఫౌండేషన్ చైర్మన్ రవి కైలాస్ చెప్పారు. 15 ఎకరాల్లో ఐఎల్‌సీఈ ఏర్పాటు.. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్సహించే దిశగా టీఎస్ఐసీ ముందడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటయ్యే ‘నవమ్ ప్రాంగణం’లో ఇన్నోవేషన్ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ సంయుక్తంగా వచ్చే పదేళ్లలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 11 నుంచి 18 ఏళ్ల వయసు లోపు విద్యార్థులు, 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం ఐఎల్‌సీఈ ద్వారా అందుతుంది. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీ సైన్స్ సెంటర్లు, డోర్ టు డోర్ సైన్స్ ల్యాబ్‌లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి వనరులను అందుబాటులోకి తెస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనుకునే యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను కూడా అందజేస్తుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
11 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. -
నేటి నుంచి బడిబాట
జిల్లాలో విద్యాశాఖ అధికారులు శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బడిబయట ఉన్న చిన్నారులను బడిలో చేర్పించనున్నారు. యేటా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అధికారులు కార్యక్రమాన్ని ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. వనపర్తి టౌన్ : బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, మండల, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులందరినీ భాగస్వాములు చేసేలా విధివిధానాలను రూపొందించింది. ప్రైవేట్ పాఠశాలల ప్రవేశాలకు దీటుగా విద్యార్థులను సమకూర్చుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్య బోధనాంశాలు వివరించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేయనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈనెల 14 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమం అన్నీ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగనుంది. ప్రజలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడంతో పాటుగా బడిబయట పిల్లలను గుర్తించి, బడిఈడు పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఖర్చులకు రూ.వెయ్యి బడిబాట నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈనెల 14 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలోని 539 పాఠశాలలకుగానూ ఒక్కో పాఠశాలకు రూ.1000 ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ డబ్బులతో ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లను ఉపాధ్యాయులు సమకూర్చుకోనున్నారు. అపోహలు తొలగించే విధంగా.. సర్కార్ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం కలిగించి, వారిలోని అపోహలను తొలగించేందుకు ఉపాధ్యాయులు బడిబాట ద్వారా కృషి చేయనున్నారు. నాణ్యమైన విద్య, అందిస్తున్న తీరుతో పాటు, బడుల్లోని బోధన, సదుపాయాలు, సాధించిన ఫలితాలతో తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించనున్నారు. నేడు ప్రదర్శనలు ఈనెల 14 మనఊరు బడి పేరుతో గ్రామంలోని పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అవాస ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాలను వారికి వివరించనున్నారు. 15న బాలికలకు విద్య అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఆరోగ్య, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 17న విద్యార్థులతో సామూహికంగా అక్షరాభాస్యం చేయిస్తారు. ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 18న పాఠశాలలోని తరగతి గదులను తీర్చిదిద్దేందుకు, ఆవరణలను పరిశుభ్రపరుస్తారు. ఆవరణలో మొక్కలు నాటి స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతారు. 19న పాఠశాలల యాజమాన్య కమిటీల భాగస్వామ్యంతో ఇంటింటికీ పర్యటిస్తారు. పాఠశాలల యాజమాన్య కమిటీ, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించనున్నారు. -
బడిబాటకు సిద్ధం
బూర్గంపాడు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ నెల 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా... వేసవి సెలవుల పొడిగింపుతో వాయిదా పడింది. ఎండల తీవ్రత కారణంగా ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమైంది. దీంతో బడిబాట కార్యక్రమం కూడా ఆలస్యమైంది. నేటి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమాలను నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. కార్యక్రమ రూపకల్పన ఇలా.. నేటి నుంచి ఈనెల 19 వరకు అన్ని ఆవాస ప్రాంతాలలో బడిబాట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలను సుందరంగా అలంకరించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా బడిబాటలో భాగస్వాములు చేయాలి. బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలి. స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. 5, 6వ తరగతులు పూర్తయిన వారిని పైతరగతులలో చేర్పించాలి. ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు హెల్త్ అండ్ హైజిన్ కిట్లు పంపిణీ చేయాలి. బాలికల ఆరోగ్య పరిరక్షణపై వైద్యులతో అవగాహన కల్పించాలి. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. బడిబాట కార్యక్రమంలో ముఖ్యంగా బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పించాలి. ఇందుకు గాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, సహాయ కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించాలి. బడిబాట కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలి. పాఠశాలలను శుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. తరగతి గదులు, వంటగదులు, భోజనశాలలు, మరుగుదొడ్లు, ఆటస్థలాన్ని శుభ్రం చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించాలి. బడిలో కొత్తగా చేరిన పిల్లలకు వారి తల్లిదండ్రులను పిలిపించి అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయాలి. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలి. వాటి సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలి. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. పాఠశాలల అభివృద్ధికి స్థానికంగా ఉన్నటువంటి దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. ఎస్ఎంసీలు, ఎస్డీసీలతో సమావేశాలు నిర్వహించి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలి. అన్ని వర్గాల వారూ సహకరించాలి ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు కొనసాగనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. అన్ని వర్గాల వారు దీనికి సహకరించాలి. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు బడిబాటను వేదికగా చేసుకోవాలి. – వాసంతి, డీఈఓ బడి బాటను విజయవంతం చేయాలి ఎంఈవోల సమావేశంలో డీఈవో వాసంతి కొత్తగూడెంరూరల్: జిల్లాలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ డి. వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లాలోని ఎంఈఓలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, ఆయా మండల పరిధిలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో టీచర్ల కొరతను గుర్తించాలన్నారు. మండలంలో పని చేసే సీఆర్పీలు ఫీల్డ్ లెవల్లో స్కూల్‌కు వెళుతున్నారా, సకాలంలో నివేదికలు అందిస్తున్నారా అనే వివరాలు పరిశీలించాలని సూచించారు. విద్యా వలంటీర్లలను పాత వారినే కొనసాగించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి వి.వి. రామరావు తదితరులు పాల్గొన్నారు. -
బడికి వేళయింది..
కరీంనగర్‌ఎడ్యుకేషన్: విద్యార్థులు వేసవి సెలవులకు టాటా చెప్పి ఇక బడిబాట పట్టే వేళయింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తరగతి గదులు లేక, తాగునీరు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేరు. దీంతో ప్రధానోపాధ్యాయులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడ్డ మరో నాలుగు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంటకు ఎంఈఓ పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు సైతం ఇన్చార్జి కావడం గమనార్హం. జగిత్యాల డీఈవో బాధ్యతలతోపాటు కరీంనగర్ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ.. మధ్యాహ్న భోజన పథకం అమలు.. ఉపాధ్యాయులకు వేతనాలు.. సెలవుల మంజూరు.. మెడికల్ రీయింబర్స్మెంట్ మంజూరు.. వారి పనితీరు బేరీజు బాధ్యత ఎంఈవోలదే. ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో.. పీఎస్, యూపీఎస్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కరీంనగర్, హుజూరాబాద్ ఉప విద్యాధికారులతోపాటు జిల్లా పరిషత్ డెప్యూటీ ఈఓ, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓలంతా ఇన్‌చార్జీలే. ఉన్నత పాఠశాలల్లో 131 మంది సబ్జెక్టు టీచర్లు కొరత ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 650, కేజీబీవీలు 12, ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,40,377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో ఏటా విద్యావాలంటీటర్లను నియమించాల్సి వస్తోంది. ఈయేడు 218 మంది విద్యావాలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపినా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. టీఆర్టీ ద్వారా నియమాకమైన ఉపాధ్యాయులపై ఇంతవరకు స్పష్టత లేదు. ఇటు విద్యావాలంటీర్లను పాత వారిని కొనసాగిస్తారో లేదో స్పష్టమైన ఉత్తర్వులు లేవు. పాఠ్యపుస్తకాలు ఓకే... జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే ఎమ్మార్సీ కేంద్రాలకు 3,35,580 పుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి ఎంఈవోలకు చేరవేశారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు బుధవారమే పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏకరూప దుస్తుల పంపిణీపై నీలినీడలు.. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు పంపిణీకి ప్రభుత్వం స్కూల్ మెనేజ్మెంట్ కమిటీల ద్వారా కావాల్సిన బట్టను కొనుగోలు చేసి ఇది వరకే మహిళా ఏజెన్సీలకు అప్పగించింది. పాఠశాల పునః ప్రారంభం రోజు అందించాల్సి ఉండగా.. అందడం గగనంగా మారింది. చెట్ల కిందే చదువులు .. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో.. హాలులో.. చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. 327 తరగతి గదులకు మేజర్ మరమ్మతులు, 359 గదులు కూల్చివేయాలని సర్వాశిక్షాభియాన్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా నేటికీ ఫలితం లేదు. జిల్లాలో 206 అదనపు తరగతుల గదుల నిర్మాణాల అవసరమన్న ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు. జిల్లాలో విద్యాశాఖ వివరాల ప్రకారం బడుల్లో బాలుర మరుగుదొడ్లు 117, బాలికల మరుగుదొడ్లు 87 నిరుపయోగంగా ఉండగా.. బాలురకు 20, బాలికలకు 87 మరుగుదొడ్లు అవసరమని ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో బహిర్భూమి కోసం విద్యార్థినులు ఇళ్లకు వెళ్తున్నారు. 72 స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం లేదు. మధ్యాహ్న భోజనం వండేదెలా..? జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 1,40,377 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 3723 మంది వంట మనుషులు, హెల్పర్లు ఉన్నారు. పథకంలో భాగంగా ప్రతీ ఏజెన్సీకి ఓ కిచెన్‌షెడ్(వంటగది) నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యాసంవత్సరం తొలి విడతగా 522 షెడ్లు మంజూరు చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. ఇప్పటి వరకు 380 షెడ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో.. 919 వంటషెడ్లు మంజూరైనవి, 369 వంట గదుల నిర్మాణం జరుగుతున్నాయి. 175 వంట గదుల ప్రతిపాదనలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. మిగతా వంటగదుల నిర్మాణాలు నిర్మాణ దశలో పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. -
బడికి డి‘టెన్షన్’..!
5, 8వ తరగతుల్లో అమలుకు కేంద్రం కసరత్తు ఆ తరగతుల్లో ఉత్తీర్ణులైతేనే పైతరగతులకు.. నాణ్యమైన విద్య, బోధనా ప్రమాణాల పెంపు కోసం నిర్ణయం తగిన ఫలితాలు సాధించని టీచర్లపైనా చర్యలు! రాష్ట్రాల్లో అమలుపై ఇంకా రాని స్పష్టత డిటెన్షన్ వద్దంటూ గతంలోనే కేంద్రానికి చెప్పిన రాష్ట్రం దానివల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయంటున్న ఉపాధ్యాయులు పేదలకు చదువు దూరమవుతుందని ఆందోళన కేంద్రం కచ్చితమైన నిర్ణయం ప్రకటించే వరకు గందరగోళమే డిటెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాల భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్ పాఠశాల విద్యలో ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో 5, 8వ తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులనే పైతరగతికి పంపించాలని, లేకుంటే మరో ఏడాది అదే తరగతిలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానం అమలు కోసం విద్యాహక్కు చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. నాణ్యమైన విద్యను అందించడానికి, బోధనా ప్రమాణాలు పెంచడానికి ఇది తప్పనిసరని భావిస్తోంది. అయితే ఈ డిటెన్షన్ విధానం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రధానంగా తెలంగాణ వంటి రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని... ఇప్పటికే 37 శాతంగా ఉన్న డ్రాపౌట్ల రేటు (మధ్యలోనే బడి మానేస్తున్న వారి సంఖ్య) మరింతగా పెరిగే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరా.. ఆప్షన్ ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ విధానం అమలుపై కసరత్తు ముమ్మరం చేసినా.. ఇంకా పలు అంశాల్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనా? లేక రాష్ట్రాల ఇష్టమా? అన్నది తేలలేదు. వాస్తవానికి తెలంగాణలో నాన్ డిటెన్షన్ విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేసింది. అప్పట్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో మన రాష్ట్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలకు కూడా నాన్ డిటెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కేంద్రాన్ని కోరాయి. కేంద్రం ఆ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటుందా? డిటెన్షన్ విధానం అమల్లో రాష్ట్రాలకు ఆప్షన్ ఇస్తుందా.. లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే 37 శాతం డ్రాపౌట్స్.. రాష్ట్రంలో మధ్యలోనే బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య (డ్రాపవుట్స్) భారీగా ఉంటోంది. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల్లో పదో తరగతి వచ్చే సరికి 36.99 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. ఇది ఎస్సీల్లో 41.14 శాతం, ఎస్టీల్లో 61.33 శాతంగా ఉండడం గమనార్హం. 2006–07 విద్యా సంవత్సరంలో 8,30,606 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరగా... 2015–16లో వారు పదో తరగతికి వచ్చే సరికి 5,23,324 మందే మిగిలారు. మిగతా 36.99 శాతం మంది డ్రాపౌట్ అయ్యారు. జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్ (పాత)లో ఏకంగా 53.26 శాతం మంది తగ్గిపోయారు. ఇక 2006–07లో ఎస్సీ విద్యార్థులు 1,51,709 మంది ఒకటో తరగతిలో చేరితే.. పదో తరగతికి వచ్చే సరికి 89,295 మంది మిగిలారు. ఎస్టీ విద్యార్థులు 1,28,390 మంది చేరితే పదో తరగతికి వచ్చే సరికి 49,644 మందే మిగిలారు. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ విధానం అమల్లోకి తెస్తే రాష్ట్రంలో డ్రాపౌట్ల రేటు మరింతగా పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టీచర్లపైనా చర్యలుంటాయా? కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ విధానంతో పాటు విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనను తప్పనిసరి చేయబోతోంది. అది కూడా అమల్లోకి వస్తే... విద్యార్థులెవరైనా కనీస సామర్థ్యాలు సాధించకపోతే సంబంధిత టీచర్లపై చర్యలు చేపట్టే అవకాశం ఉండనుంది. దీంతో డిటెన్షన్ విధానం టీచర్లకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంఘాల భిన్న వాదనలు డిటెన్షన్ విధానంపై ఉపాధ్యాయ సంఘాల్లోనే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్య కోసం కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమని కొన్ని సంఘాలు పేర్కొంటుండగా.. దానివల్ల డ్రాపౌట్ల రేటు మరింతగా పెరుగుతుందని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరముందని, అందుకు డిటెన్షన్ విధానం దోహద పడుతుందని పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి పేర్కొన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. అయితే ఇప్పటికే అధిక డ్రాపౌట్ శాతం నమోదవుతున్న నేపథ్యంలో.. డిటెన్షన్‌తో మరింత ఎక్కువ మంది బడులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని ఎస్టీయూ, యూటీఎఫ్ అధ్యక్షులు భుజంగరావు, నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం డిటెన్షన్ అమలుకే మొగ్గు చూపినా.. రాష్ట్రంలో మాత్రం అమలు చేయవద్దని కోరారు. 14 ఏళ్లలోపు పిల్లలకు అంతరాయం లేకుండా చదువు అందించాల్సిన ప్రభుత్వాలు.. డిటెన్షన్ పేరుతో పేద పిల్లలను బడులకు దూరం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకటో తరగతిలో చేరి పదో తరగతి వచ్చేసరికి డ్రాపౌట్ అవుతున్నవారు 36.99% వీరిలో ఎస్సీ విద్యార్థులు.. 41.14% ఎస్టీ విద్యార్థులు 61.33% -
తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత
-
ఇకపై తెలంగాణలో ఇంగ్లీష్ ఉచిత నిర్భంద విద్య
-
9వ,10వ తరగతుల్లో ఇంటర్నల్స్ విధానం