head masters
-
బడులు తెరిచేలోగా పక్కా లెక్కలివ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: బడులు తెరిచేలోగా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ సంవత్సరం దీని ఆధారంగానే స్కూళ్లకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం కూడా ఈ లెక్క ఆధారంగానే ఇవ్వనుంది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం యూనిఫైడ్ డి్రస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)ను రూపొందిస్తుంది. ఇందులో సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లు, మౌలిక సదుపాయాలను గుర్తిస్తారు. అయితే, ఈ గణాంకాలు సరిగా ఉండట్లేదనే విమర్శలున్నాయి. కచి్చతమైన వివరాలు పంపకపోవడం వల్ల ప్రణాళికలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఈసారి సరైన పర్యవేక్షణతో యూడైస్ రూపొందించాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 50కి పైగా అంశాలు యూడైస్ పట్టికలో 50కిపైగా అంశాలుంటాయి. ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్ని నింపాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు, తరగతి గదుల వివరాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ అనుసంధానమైన ప్రొజెక్టర్లు, టీవీ, ఫరి్నచర్, కిచెన్ షెడ్, ప్రహరీ వంటి అనేక వివరాలు పొందుపర్చాలి. దీంతోపాటే డిజిటల్ క్లాస్ రూమ్‌ల వివరాలు, నెట్ సదుపాయం కూడా ప్రత్యేకంగా చేర్చారు. హెచ్ఎంలు ఈ డేటాను మండల విద్యాశాఖాధికారికి అందిస్తే.. అక్కడ ఆన్లైన్లో పొందుపరుస్తారు. అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు ఈ వివరాలు వెళ్తాయి. వీటిని బట్టి ఈసారి మన ఊరు–మనబడి, మన బస్తీ–మనబడి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ బడులుంటే, ప్రస్తుతం 20 లక్షల మంది విద్యార్థులున్నారు. యూడైస్ లెక్కల ప్రకారమే వీరికి యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక పర్యవేక్షణ హెచ్ఎంల ద్వారా అందుతున్న డేటా ప్రకారం యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. యూడైస్‌లో కన్పించే లెక్క ఒకటైతే, వాస్తవ విద్యార్థుల సంఖ్య మరోలా ఉంటోందని, ఫలితంగా యూనిఫాం, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వాటిలో చాలీచాలని పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. దీంతో హెచ్ఎంల డేటాను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, వారి నివేదికలు వచ్చాకే యూడైస్‌కు తుదిరూపం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. వీరితోపాటు మండల విద్యాశాఖ అధికారి నేతృత్వంలో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు వెళ్లాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు–మనబడి కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతోంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. హెచ్ఎంలు కారణం కాదు బడుల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియే మొదలవ్వలేదు. పాఠశాలలు తెరిచినా రెండు నెలల వరకూ విద్యార్థులు చేరుతూనే ఉంటారు. కనీసం సెపె్టంబర్, అక్టోబర్ వరకు గానీ కచి్చతమైన లెక్క తేలదు. కానీ గత ఏడాది విద్యార్థుల లెక్కను యూడైస్‌కు ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. అయితే, ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య పెరగడమో, తగ్గడమో జరుగుతోంది. ఇది హెచ్ఎంల తప్పు కాదు. కొంత ఆలస్యమైనా ఈ ఏడాది అడ్మిషన్ల లెక్కను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంగ్లిష్ మీడియం తెస్తున్న నేపథ్యంలో ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. – పిరాజాభాను చంద్రప్రకాశ్ (గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు) -
తెలంగాణ: పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు వచ్చేనా?
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు (పీఎస్ హెచ్ఎం) వస్తాయని ఎదురుచూస్తున్న టీచర్ల అశలు గల్లంతయ్యాయి. విద్యాశాఖలో పదోన్నతులు ప్రారంభిస్తే ఆ పోస్టుల్లో తమకు పదోన్నతి లభిస్తుందని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) ఎదురుచూస్తుండగా ప్రభుత్వం జారీ చేసిన హేతుబద్దీకరణ ఉత్తర్వులు వారిని నిరాశలో ముంచేశాయి. 150 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల వ్యవహారం గందగరగోళంలో పడింది. ఏం చేయాలన్న అర్థంకాని స్థితిలో అధికారులు పడ్డారు. ఆ ప్రతిపాదనలు ఏమైనట్లు? ఈ ఏడాది మార్చి నెలలో సమస్యలు, పీఆర్సీ వంటి అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ప్రాథమిక పాఠశాల్లో 10 వేల హెచ్ఎం పోస్టులను ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, వాటిల్లో ఇప్పటికే ఉన్న హెడ్మాస్టర్ పోస్టులు, ఇంకా ఎన్ని మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లోఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరైనవి ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్ 10వేల స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. చదవండి: Gandhi Hospital: అదృశ్యమైన మహిళ సురక్షితం ఆ ప్రతిపాదనలను పంపించి ఐదు నెలలు గడిచిపోయింది. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంజూరైన 4,429 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టుల్లో ప్రస్తుతం2,386 మంది పనిచేస్తున్నట్లు కూడా తేల్చింది. 5,571 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేశాక ప్రస్తుతం ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టుల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులను మినహాయించి మిగిలిన 2,043 పోస్టులు, కొత్త పోస్టులు కలుపుకొని మొత్తంగా 7,614 పోస్టుల్లో పదోన్నతులు ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న ఎల్ఎఫ్ఎల్ పోస్టులకు అదనంగా సీఎం చేప్పిన 10 వేల పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారం తేలకముందే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన హేతుబద్దీకరణ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. సీఎం హామీ మేరకు తాము కొత్త పోస్టులను సృష్టించేందుకు ఫైలు పంపిస్తే వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏం చేయాలన్న గందరగోళంలో అధికారులు పడ్డారు. -
Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్‌లో మార్పులు, గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కిందS తప్పనిసరిగా రాయాలి.► తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.►తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్ పరీక్షల్లో.. ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు.►ఏడు పేపర్లలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.► ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్–1.. 70 మార్కులకు, పేపర్–2.. 30 మార్కులకు ఉంటాయి.► లాంగ్వేజ్ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. ►ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు.► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్ పరీక్షలకు హాజరై 2019 జూన్ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్‌లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్ కావచ్చు.► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి.► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్లోడ్ చేయాలి.► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్‌లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 20 మాత్రమే. -
పెద్ద సారూ.. పాఠం చెప్పరు!
పెద్ద సార్లు పని తప్పించుకుంటున్నారు! పాఠాలు బోధించకుండా వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. పలువురు హెడ్మాస్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు పట్టట్లేదు.. పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు. వాస్తవానికి ఇతర ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు సైతం విద్యార్థులకు తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. కానీ జిల్లాలో చాలా పాఠశాలల్లో హెచ్ఎంలు బోధనకు దూరంగా ఉంటున్నారు. ఇతర వ్యాపకాల్లో బిజీగా మారడంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఫలితంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే, వివిధ పనుల ఒత్తిళ్ల కారణంగా పాఠాలు బోధించడం లేదని కొందరు హెచ్ఎంలు బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కామారెడ్డి టౌన్: హెడ్మాస్టర్లు పాఠ్యాంశాల బోధనకు మంగళం పాడేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన హెచ్ఎంలు.. ఇతర వ్యాపకాలతో గడుపుతున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది ప్రధానోపాధ్యా యులు బోధనకు దూరంగా ఉంటుండగా, కేవలం 20 శాతం మంది మాత్రమే నిజాయతీగా పాఠాలు చెబుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎనిమిది పీరియడ్లు బోధించాలి జిల్లాలో 730 ప్రాథమిక, 217 ప్రాథమికోన్నత, 314 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,916 టీచర్ పోస్టులకు గాను 4,077 మంది విధులు నిర్వహిస్తున్నారు. 819 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 307 మంది హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా వారానికి 8 పీరియడ్లు బోధించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక పీరియడ్ 45 నిమిషాల పాటు బోధించాల్సి ఉంటుంది. అయితే, స్కూల్ టైం టేబుల్లో తమకు పీరియడ్లు ఉన్నాయని చూపించుకుంటున్నారే తప్పితే చాక్‌పీస్ పట్టి పాఠాలు చెప్పింది లేదు. కొందరు ఒకటి, రెండుపీరియడ్లు బోధించి మమ అనిపిస్తుంటే, మరికొందరైతే, తరగతి గదుల ముఖమే చూడట్లేదు. 307 మంది హెచ్‌ఎంలలో 80 శాతం మంది అసలు పాఠ్యపుస్తకాలు, బ్లాక్‌బోర్డు, చాక్పీస్ను పట్టడం లేదని ఆరోపణలున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే పాఠాలు బోధిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు రానప్పుడు వారి స్థానంలో బోధిస్తూ తమ పీరియడ్లుగా బోధించినట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన పీరియడ్లును మాత్రం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర పనుల్లో..... జిల్లాలో పదికి పైగానే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో హెచ్ఎంలు సైతం పెద్ద నాయకులుగా ఉన్నారు. దీంతో సంఘాల పనుల్లో బిజీబిజీగా ఉంటున్న హెడ్మాస్టర్లు పాఠాలు ఎగ్గొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘాల పేరుతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కొందరు హెచ్ఎంలు వ్యాపారాలు, ఫైనాన్స్‌లు, రియల్ దందాలను నిర్వహిస్తున్నారు. తమ సొంత పనుల్లో బిజీగా ఉంటూ బోధనలను విస్మరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఉన్నతాధికారులనే శాసించే స్థాయికి కొందరు చేరడంతో వారి విషయంలో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అసలు హెచ్ఎంలు పాఠాలను బోధించకున్నా పట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క స్కూల్లోనూ హెచ్ఎంలు బోధించేలా చర్యలు తీసుకున్నట్లు లేదు. వాస్తవానికి విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారిస్తే హెచ్ఎంల బండారం బట్టబయలవుతుంది. కానీ, అధికారులు మాత్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎంలు తప్పనిసరిగా బోధించాలి ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు సైతం వారానికి తప్పకుండా ఎనిమిది పీరియడ్లు బోధించాలి. కొత్త జిల్లా కావడంతో వారు కాస్త పని ఒత్తిడిలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. పాఠాలు చెప్పని వారిపై చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, డీఈవో, కామారెడ్డి -
‘లక్ష్యం’ గాలికి..
హుస్నాబాద్‌రూరల్ : పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించింది. అయితే, రోజుకు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితోనే ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రధానోపాధ్యాయులు చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం. వార్షిక ఫలితాలపై ప్రభావం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలలో 15 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరికి వారం వారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మండలంలో మీర్జాపూర్, మోడల్ స్కూల్, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. మొత్తంగా హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది 87 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి ప్రతి పాఠశాల వందశాతం ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హెచ్ఎంల తీరుపై విమర్శలు సిద్దిపేట విద్యాధికారి ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు నిత్యం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ విద్యా బోధన చేశారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం 2 గంటలు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హెచ్ఎంల తీరుతో ఫలితాలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు తాగునీరు, అల్పాహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి 7 గంటలకు ఇళ్లకు చేరుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంల పనితీరు మార్చుకోవాలని అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల గ్రాంట్స్‌కు బోగస్ బిల్లులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద రూ.10 వేలు ప్రాఠశాల గ్రాంట్, రూ.15,000 నిర్వహణ ఖర్చులు, ఒక టీచర్‌కు రూ.500 టీచింగ్ గ్రాంట్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ(రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్) కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.50 వేలు అందుతాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఒక్కో 10వ తరగతి విద్యార్థికి స్నాక్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.4 అందిస్తున్నారు. కాగా, హెచ్ఎంలు గ్రామాలకు చెందిన దాతలతో అల్పాహారం ఏర్పాటుచేయిస్తూ.. నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలు, సైన్స్ పరికరాలు ఏర్పాటుచేయకుండానే గ్రాంట్స్ కాజేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కన్నపేట పాఠశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో యువజనులు గతంలో సమాచార చట్టం కింద వివరాలను సేకరిస్తే ఇలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎంలు అందుబాటులో ఉండాలి 10వ తరగతి ప్రత్యేక తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే వరకు ప్రధానోపాధ్యాయులు ఉండాల్సిందే. ఒకటి, రెండు రెండు చోట్ల హెచ్ఎంలు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవచ్చు. దీనిపై ఆరా తీస్తాం. – మారంపల్లి అర్జున్, ఎంఈఓ -
హెచ్ఎంలు, టీచర్లకు మెమోలు
అనంతçపురం ఎడ్యుకేషన్ : నగరంలో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయని ఇద్దరు హెచ్ఎంలు, వేళలు పాటించని మరో ఇద్దరు టీచర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ మంగళవారం మెమోలు జారీ చేశారు. పాతూరులోని నంబర్ 1 ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన డీఈఓ బయోమెట్రిక్ మిషన్‌ను పరిశీలించారు. పనిచేయలేదనీ దాన్ని పక్కకు పెట్టేశారు. ప్రత్యామ్నాయంగా ఐరీస్ డివైజర్ ఉన్నా అటెండెన్స్‌ను నమోదు చేయకపోవడంతో హెచ్ఎం రెడ్డప్పకు మెమో ఇచ్చారు. అక్కడి నుంచి రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ ఇదే పరిస్థితి ఉండటంతో సదరు హెచ్ఎంకు మెమో జారీ చేసేందుకు మునిసిపల్ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. తర్వాత హౌసింగ్‌బోర్డులోని సర్వేపల్లి రాధాకృష్ణన్ మునిసిపల్ ప్రాథమిక స్కూల్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకేు ఇద్దరు మహిళా టీచర్లు ఇంటికి వెళ్తూ కనిపించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలంటూ హెచ్ఎంను ఆదేశించారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయుల అడ్డు!
అడ్డుకోవద్దని విద్యాశాఖ సూచన సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు అడ్డుపడుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. తమ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే అడ్డుపడుతు న్నట్లు తేలింది. కరీంగనర్ జిల్లా గంగాధర మండలం, ఖమ్మం జిల్లాలోని ఓ మండ లంలో ఈ పరిస్థితిని అధికారులు గుర్తించా రు. పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, 78 వేల మందికి అవకాశ మున్నా, 73 వేల మంది మాత్రమే ప్రవేశా లు పొందారు. దీంతో హాస్టల్ సదు పాయమున్న కేజీబీవీల్లోకి వెళ్లేలా బాలికలను ప్రోత్సహించాలని విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. -
హెచ్ఎం అకౌంట్ టెస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు సిటీ : ప్రధానోపాధ్యాయుల అకౌంట్ టెస్ట్ రాసేందుకు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు అపరా«ద రుసుం లేకుండా నవంబర్ 7వ తేదీలోగా రూ.150 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.60 అపరాధ రుసుంతో 14వతేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. పరీక్ష డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కడప కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. -
స్కూళ్లలో ఆరోగ్య యోగం
తిరుపతి ఎడ్యుకేషన్: పాఠశా విద్యాశాఖ 2016, జూన్ 6వ తేదీ విడుదల చేసిన జీవో నంబర్ 37లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగ/ధ్యానం తరగతులు నిర్వహించాలని పేర్కొంది. ఈ జోవోను సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 80ను నాలుగు రోజులు కిందట విడుదల చేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వులో పీఈటీ/పీడీ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సూచించింది. సవరించిన తాజా ఉత్తర్వులో ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగా, బ్రహ్మకుమారీస్ సంస్థల ద్వారా శిక్షణ తీసుకోవచ్చని ఆదేశించింది. దీనికోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌ను విని యోగించుకోవాలని పేర్కొంది. ఆరో తరగతి నుంచి ఇం టర్ వరకు ఈ కార్యక్రమం తప్పనిసరి అని ఆదేశించింది. ప్రైవేటు యాజమాన్య పాఠశాలలో ఎక్కడైనా శిక్షణ పొందిన పీఈటీ/పీడీ, వీరు లేనిపక్షంలో యాజమాన్యం సొంత ఖర్చుతో యోగ, ధ్యానం తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. శిక్షణను బేసిక్, అడ్వాన్్డ్స, ప్రొఫెషనల్ అని మూడు దశలుగా విభజించారు. ఈ శిక్షణ తరగతులు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పాఠశాలలకు విడుదల చేస్తున్న నిధుల నుంచి చాపలు/పట్టలు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. తరగతులు ఇలా... తరగతులు సక్రమంగా జరుగుతున్నాయో లేదా పరిశీలించేందుకు జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమిస్తారు. పాఠశాల కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు కమిటీని ఏర్పా టు చేసుకోవాలి. ఈ కమిటీలో హెడ్మాస్టర్ లేదా ప్రిన్సిపాల్, పీఈటీ లేదా పీడీ, యోగ/మెడిటేషన్ ఇచ్చే సంస్థ సభ్యులు, పేరెంట్, టీచర్ సభ్యులుగా ఉంటారు. నోడల్ డిపార్టుమెంట్‌గా పాఠశాల విద్యా కమిటీ వ్యవహరిస్తుంది. వారంలో కనీసంగా మూడు రోజులు శిక్షణ ఇవ్వాలి. రేపటి నుంచి శిక్షణ యోగ/ధ్యానం శిక్షణ తరగతులు ఈనెల 21వ తేదీ ప్రారంభం కానున్నాయి. మొత్తం 5ఆదివారాలు, ఒక రెండవ శనివారం, మొత్తం ఆరు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రోజుల్లో రెండు సెషన్లగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఇస్తారు. ప్రతి సెషన్‌కు 50మంది చొప్పున శిక్షణ పొందాల్సి ఉం టుంది. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు జిల్లాలోని మి గతా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలి. శిక్షణ సమయంలో టీ, స్నాక్స్‌తో పాటు మంచి నీరు అందించాలి. ఈ శిక్షణకు జిల్లాకు రూ. లక్ష మంజూరు చేస్తున్నట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. పది నుంచి 15కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని మాత్రమే శిక్షణకు ఆహ్వానించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. శిక్షణ పొందే ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు మహిళా టీచర్లు తప్పనిసరి. కేబీబీవీ/మోడల్‌స్కూల్/రెసిడెన్షియల్ స్కూళ్ల లో అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ టీచర్లు సైతం శిక్షణ పొందవచ్చు. పీఈటీలు లేని పాఠశాలల్లో ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా ఈ శిక్షణ పొందవచ్చు. -
ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు
శిక్షణనివ్వాలని విద్యాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు, పాలన పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. మూడు దశల్లో 15 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో 5 రోజుల శిక్షణను హైదరాబాద్‌లోని డాన్ బాస్కో స్కూల్లో ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు శిక్షణనివ్వనుంది. ప్రతి జిల్లా నుంచి ఎంపికైన ప్రధానోపాధ్యాయులకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 5 నుంచి 9 వరకు రెండో దశ, 12 నుంచి 16 వరకు మూడో దశ శిక్షణ ఇస్తారు. -
పాఠం చెప్పాల్సిందే..!
‘నేను హెడ్మాస్టర్ను.. పాఠాలు చెప్పడం నా బాధ్యత కాదు..’ అని అనుకుంటున్నారా? అయితే ఇక కుదరదు. ‘ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా..? బడికి ఎవరు వచ్చినా.. నన్ను కలిసి వెళ్లాలి..’ అనే భావనను పక్కకు పెట్టాల్సిందే. టీచర్ల పర్యవేక్షణకు మాత్రమే పరిమితమైన ప్రధానోపాధ్యాయులు ఇక నుంచి పాఠాలు చెప్పాల్సిందే. వారి విధులపైన విద్యాశాఖ ప్రత్యేకదృష్టి సారించింది. ఇకనుంచి ప్రతిరోజు రెండు తరగతులు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేసింది. పాలమూరు: మారిన పాఠ్యప్రణాళిక, సమ గ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని అనుసరించి హెచ్ఎంలతో కూడా పాఠాలు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పర్యవేక్షణ విధులతోపాటు పలు కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. పాఠశాల యాజమాన్య క మిటీకి కన్వీనర్‌గా వ్యవహరించడంతో పాటు పాఠశాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వీరిది. పైగా వారానికి కనీసం 10తరగతులు బోధనచేసి పిల్లల సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. జిల్లాలో 565 ఉన్నత, 625 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 524 పీజీహెచ్ఎంలు, మరో 530కిపైగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పనిచేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ విద్యావిధానంలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాఠాలు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేశారు. తాజా మార్గదర్శకాలను అనుసరించి ప్రతీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా తమ సొంత పాఠశాలలో తరగతులు బోధించాలి. సీసీఈ విధానాన్ని అనుసరించి 6, 10 తరగతుల విద్యార్థులకు ప్రతీరోజు ఒక్కో తరగతి తీసుకోవాలి. అంటే ఉదయం ఒక తరగతి విద్యార్థులకు బోధిస్తే.. సాయంత్రం మరో తరగతి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. ఇలా వారానికి 14 తరగతులు తీసుకొని యూనిట్ ప్రణాళికను సిద్ధంచేయాలి. ఆ తర్వాత యూనిట్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకోవడం, అవసరమైతే పునశ్చరణ తరగతులు తీసుకోవాలని ఆదేశాల సారాంశం. అమలయ్యేనా? విద్యాశాఖ అధికారుల మార్గదర్శకాలను జిల్లాలో ఏ మేరకు అమలు చేస్తారన్నది అయోమయంగా మారింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విధులకు సక్రమంగా వెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పలువురికి ఇన్చార్జ్ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదనేది బహిరంగ రహస్యమే. వీటి నేపథ్యంలో జిల్లా అధికారవర్గాలు నిరంతర పర్యవేక్షణ చేస్తేనే ఈ నూతన విధానం సఫలీకృతమవుతోంది. -
హెచ్ఎంలు అంకితభావంతో పనిచేయాలి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రధానోపాధ్యాయులు అంకితభావం తో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య కోరారు. జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు స్ఫూర్తి పేరిట సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవ న్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహచర ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన చేయిం చాలని హెచ్ఎంలకు సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎం అటెండర్, జిల్లా విద్యాశాఖకు డీఈఓ అటెండర్, జోనల్‌కు పాఠశాల ఆర్జేడీ అటెండర్ లాంటివాడని అభివర్ణించారు. అటెండర్లు ఒక గంట ముందు పాఠశాల కు వస్తారని, అందరు వెళ్లిన తర్వాతే వెళ్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇలా గే విధులు నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలుచేయాలని, టెన్త్ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా మెరుగుపర్చుకోవాలన్నారు. మొదటి దశలో పాఠశాలలను సందర్శించి సూచనలు, సల హాలు ఇస్తానని, రెండో దశలోను ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తానని, మూడో దశలో మారకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు వేణుభగవాన్ అనేక అంశాలను ఉదాహరణలతో వివరించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థులు గీసుకొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, ఊకల్, కొమ్మాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తున్నారు. వారిని హెచ్ఎంల స్ఫూర్తి కార్యక్రమానికి తీసుకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్, ఆత్మకూరు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామని డీఈఓ తెలి పారు. ‘ఎల్టా’ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరిస్తామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, అశోక్‌దాస్, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్, రవీందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బత్తిని కొమురయ్య, రిసోర్స్పర్సన్లు దేవేందర్‌రెడ్డి, వి.లక్ష్మణ్, ఎల్.వంశీమోహన్, ఎస్.సత్యం, పి.శ్రీనివాస్, కె.రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, గీసుకొండ ఎంఈఓ ఎస్. జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఉపాధ్యాయుడు వల్స పైడి ఆధ్వర్యంలో నరేంద్రనగర్ పాఠశాల విద్యార్థుల నృత్యరూపకం ఆకట్టుకుంది. హెచ్ఎంలకు స్ఫూర్తి కార్యక్రమాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. -
హెచ్ఎం, ఎంఈఓలకు జీపీఎఫ్ మంజూరు అధికారం!
జిల్లా పరిషత్తు(జడ్పీ) స్కూళ్లలోని దాదాపు 3 లక్షల మంది టీచర్ల జీపీఎఫ్ రుణాలకు సంబంధించి పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు అధికారాన్ని జిల్లా పరిషత్తు నుంచి స్థానిక ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు పీఆర్టీయూ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయాల ద్వారా మంజూరు చేస్తున్నందున నెలల తరబడి జాప్యం జరిగి జెడ్పీ స్కూళ్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2002 మే నెలలో జారీ చేసిన జీఓ 40 ప్రకారం జీపీఎఫ్ లోన్స్/పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ మంజూరు చేసే అధికారం స్థానిక ఎంఈఓలకు, హెచ్ఎంలకు కల్పించినా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, విద్యాశాఖ, ట్రెజరీ ఉన్నతాధికారులు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమై దీనిపై చర్చించారు. జీఓ 40 అమలుకు ఉన్నతాధికారులు సానుకూలత తెలిపి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించారని పీఆర్టీయూ నేతలు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో జీపీఎఫ్ ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని, 2013 మార్చి నాటికి పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులను నాగిరెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు.