అడ్డుకోవద్దని విద్యాశాఖ సూచన
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు అడ్డుపడుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. తమ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే అడ్డుపడుతు న్నట్లు తేలింది. కరీంగనర్ జిల్లా గంగాధర మండలం, ఖమ్మం జిల్లాలోని ఓ మండ లంలో ఈ పరిస్థితిని అధికారులు గుర్తించా రు. పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, 78 వేల మందికి అవకాశ మున్నా, 73 వేల మంది మాత్రమే ప్రవేశా లు పొందారు. దీంతో హాస్టల్ సదు పాయమున్న కేజీబీవీల్లోకి వెళ్లేలా బాలికలను ప్రోత్సహించాలని విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది.
కేజీబీవీల్లో ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయుల అడ్డు!
Published Tue, Apr 11 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
Advertisement