యోగా చేస్తున్న విద్యార్థులు
స్కూళ్లలో ఆరోగ్య యోగం
Published Sat, Aug 20 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
తిరుపతి ఎడ్యుకేషన్:
పాఠశా విద్యాశాఖ 2016, జూన్ 6వ తేదీ విడుదల చేసిన జీవో నంబర్ 37లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగ/ధ్యానం తరగతులు నిర్వహించాలని పేర్కొంది. ఈ జోవోను సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 80ను నాలుగు రోజులు కిందట విడుదల చేసింది. గతంలో జారీచేసిన ఉత్తర్వులో పీఈటీ/పీడీ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సూచించింది. సవరించిన తాజా ఉత్తర్వులో ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగా, బ్రహ్మకుమారీస్ సంస్థల ద్వారా శిక్షణ తీసుకోవచ్చని ఆదేశించింది. దీనికోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన సిలబస్‌ను విని యోగించుకోవాలని పేర్కొంది. ఆరో తరగతి నుంచి ఇం టర్ వరకు ఈ కార్యక్రమం తప్పనిసరి అని ఆదేశించింది. ప్రైవేటు యాజమాన్య పాఠశాలలో ఎక్కడైనా శిక్షణ పొందిన పీఈటీ/పీడీ, వీరు లేనిపక్షంలో యాజమాన్యం సొంత ఖర్చుతో యోగ, ధ్యానం తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. శిక్షణను బేసిక్, అడ్వాన్‌్డ్స, ప్రొఫెషనల్ అని మూడు దశలుగా విభజించారు. ఈ శిక్షణ తరగతులు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పాఠశాలలకు విడుదల చేస్తున్న నిధుల నుంచి చాపలు/పట్టలు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.
తరగతులు ఇలా...
తరగతులు సక్రమంగా జరుగుతున్నాయో లేదా పరిశీలించేందుకు జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమిస్తారు. పాఠశాల కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు కమిటీని ఏర్పా టు చేసుకోవాలి. ఈ కమిటీలో హెడ్‌మాస్టర్ లేదా ప్రిన్సిపాల్, పీఈటీ లేదా పీడీ, యోగ/మెడిటేషన్ ఇచ్చే సంస్థ సభ్యులు, పేరెంట్, టీచర్ సభ్యులుగా ఉంటారు. నోడల్ డిపార్టుమెంట్‌గా పాఠశాల విద్యా కమిటీ వ్యవహరిస్తుంది. వారంలో కనీసంగా మూడు రోజులు శిక్షణ ఇవ్వాలి.
రేపటి నుంచి శిక్షణ
యోగ/ధ్యానం శిక్షణ తరగతులు ఈనెల 21వ తేదీ ప్రారంభం కానున్నాయి. మొత్తం 5ఆదివారాలు, ఒక రెండవ శనివారం, మొత్తం ఆరు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రోజుల్లో రెండు సెషన్లగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఇస్తారు. ప్రతి సెషన్‌కు 50మంది చొప్పున శిక్షణ పొందాల్సి ఉం టుంది. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు జిల్లాలోని మి గతా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలి. శిక్షణ సమయంలో టీ, స్నాక్స్‌తో పాటు మంచి నీరు అందించాలి. ఈ శిక్షణకు జిల్లాకు రూ. లక్ష మంజూరు చేస్తున్నట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. పది నుంచి 15కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని మాత్రమే శిక్షణకు ఆహ్వానించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. శిక్షణ పొందే ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు మహిళా టీచర్లు తప్పనిసరి. కేబీబీవీ/మోడల్‌స్కూల్/రెసిడెన్షియల్ స్కూళ్ల లో అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ టీచర్లు సైతం శిక్షణ పొందవచ్చు. పీఈటీలు లేని పాఠశాలల్లో ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా ఈ శిక్షణ పొందవచ్చు.
Advertisement
Advertisement