హెచ్‌ఎంలు, టీచర్లకు మెమోలు | memos of teachers and head masters | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంలు, టీచర్లకు మెమోలు

Published Tue, Jun 27 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

memos of teachers and head masters

అనంతçపురం ఎడ్యుకేషన్‌ : నగరంలో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేయని ఇద్దరు హెచ్‌ఎంలు, వేళలు పాటించని మరో ఇద్దరు టీచర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ మంగళవారం మెమోలు జారీ చేశారు. పాతూరులోని నంబర్‌ 1 ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన డీఈఓ బయోమెట్రిక్‌ మిషన్‌ను పరిశీలించారు. పనిచేయలేదనీ దాన్ని పక్కకు పెట్టేశారు. ప్రత్యామ్నాయంగా ఐరీస్‌ డివైజర్‌ ఉన్నా అటెండెన్స్‌ను నమోదు చేయకపోవడంతో హెచ్‌ఎం రెడ్డప్పకు మెమో ఇచ్చారు.

అక్కడి నుంచి రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ ఇదే పరిస్థితి ఉండటంతో సదరు హెచ్‌ఎంకు మెమో జారీ చేసేందుకు మునిసిపల్‌ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. తర్వాత హౌసింగ్‌బోర్డులోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మునిసిపల్‌ ప్రాథమిక స్కూల్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకేు ఇద్దరు మహిళా టీచర్లు ఇంటికి వెళ్తూ కనిపించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలంటూ హెచ్‌ఎంను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement