Memos
-
హౌసింగ్ అధికారులకు మెమోలు
అనంతపురం అర్బన్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ జి.వీరపాండియన్ మెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ శుక్రవారం తెలిపారు. పెనుకొండ, అనంతపురం డివిజన్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు చంద్రమౌళి, ప్రసాద్‌లతో పాటు తొమ్మిది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 30 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మెమోలు జారీ చేశారని చెప్పారు. శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అమలులో వీరంతా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో, వారి తీరుని తీవ్రంగా పరిగణిస్తూ మెమో ఇచ్చారని జేసీ–2 చెప్పారు. -
హెచ్ఎంలు, టీచర్లకు మెమోలు
అనంతçపురం ఎడ్యుకేషన్ : నగరంలో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయని ఇద్దరు హెచ్ఎంలు, వేళలు పాటించని మరో ఇద్దరు టీచర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ మంగళవారం మెమోలు జారీ చేశారు. పాతూరులోని నంబర్ 1 ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన డీఈఓ బయోమెట్రిక్ మిషన్‌ను పరిశీలించారు. పనిచేయలేదనీ దాన్ని పక్కకు పెట్టేశారు. ప్రత్యామ్నాయంగా ఐరీస్ డివైజర్ ఉన్నా అటెండెన్స్‌ను నమోదు చేయకపోవడంతో హెచ్ఎం రెడ్డప్పకు మెమో ఇచ్చారు. అక్కడి నుంచి రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ ఇదే పరిస్థితి ఉండటంతో సదరు హెచ్ఎంకు మెమో జారీ చేసేందుకు మునిసిపల్ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. తర్వాత హౌసింగ్‌బోర్డులోని సర్వేపల్లి రాధాకృష్ణన్ మునిసిపల్ ప్రాథమిక స్కూల్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకేు ఇద్దరు మహిళా టీచర్లు ఇంటికి వెళ్తూ కనిపించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలంటూ హెచ్ఎంను ఆదేశించారు. -
45 మంది సీనియర్ అసిస్టెంట్లకు మెమోలు
అనంతపురం మెడికల్ : విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు మెమోలు జారీ అయ్యాయి. మంగళవారం ఉదయం బయోమెట్రిక్ హాజరును పరిశీలించిన డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ 45 మందివి నమోదు కాకపోవడంతో ఈ మేరకు వారందరికీ మెమోలు ఇచ్చారు. -
ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు
ఉన్నవ: పాఠశాల నిర్వహణ విద్యాబోధన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో పిల్లి రమేష్ బుధవారం ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఎంఈవో పిల్లి డేవిడ్‌రత్నం తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఉన్నవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న మండల ప్రాథమిక మెయిన్ పాఠశాలను బుధవారం విద్యాశాఖాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల నైపుణ్యాన్ని వారు పరిశీలించినట్లు తెలిపారు. ఐదో తరగతి విద్యార్థులు సైతం చదవడం, రాయడం రావడం లేదని తాము గుర్తించామన్నారు. ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణ కూడా కొరవడినట్లు చెప్పారు. ఉపాధ్యాయులతో హెచ్ఎం సమీక్షలు నిర్వహించడం, బోధన సమయంలో పర్యవేక్షణ చేయడం లేనట్లు తెలిసిందన్నారు. పిల్లలకు అభినయ గేయాలను కూడా నేర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించారు. ఉపాధ్యాయుల పనితీరు బాగోలేని కారణంగా విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో రమేష్ ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం కృష్ణబాబు, ఉపాధ్యాయులు పావని, ఆదినారాయణలకు మోమోలను ఇచ్చినట్టు తెలిపారు. -
బైనామాల చెక్‌మెమోలు అప్లోడ్ చేయాలి
వీసీలో జేసీ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్ : సాదాబైనామాలకు సంబంధించి ఫీల్డ్ చెక్ మెమోలు వారం రోజుల్లో ఆప్‌లోడ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాదాబైనామాల ప్రగతి, కల్యాణలక్ష్మి, భూదాన్ల్యాండ్ల ప్రగతిపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాదాబైనామాల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ, చెక్ మెమోల ఆన్లైన్ నోటిసుల జారీని వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామాలకు వెళ్లి సాదాబైనామాల కింద అందిన దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. చెక్ మెమోలను ఆన్లైన్ చేయడంలో అలసత్వం వద్దని, నోటీస్ జనరేట్ చేసిన అనంతరం చెక్‌మెమోను ఆన్లైన్ చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపిన భూముల మ్యుటేషన్లో వారం రోజుల్లోపు ప్రగతి కనబరచాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వెళ్తున్న నిత్యావసర వస్తువులను రేషన్‌దారులు విక్రయిస్తే వారిపై 17బీ, డీలు, అట్టి వస్తువులు కొనుగోలు చేసిన వారిపై 17ఈ, 6ఏ కేసులను బుక్ చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు అక్టోబర్ నుంచి మొదలవుతుందని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘వాగ్దేవి’ భూముల వ్యవహారంలో అధికారులపై చర్యలు
ఆర్డీఓ, తహశీల్దార్‌కు మెమోలు ఆసక్తికరంగా మారిన ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ హన్మకొండ అర్బన్ : అధికారులు జీఓ నంబర్ 59లోని నిబంధనలకు విరుద్ధంగా విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవి కళాశాల)కి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసిన వ్యవహారంలో వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ తహశీల్దార్ రాజ్‌కుమార్‌ను బాధ్యులుగా గుర్తించి మెమోలు జారీ చేశారు. ఈ తతంగంపై విచారణ చేపట్టి న జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదుపరి చర్యల్లో భాగంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అయితే ఇద్దరు అధికారులకు మాత్రమే మెమోలు జారీ చేసిన ఉన్నతాధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 16.28 ఎకరాల వ్యవహారం బొల్లికుంట సమీపంలోని సర్వే నంబర్ 509లో ఉన్న 16.28 ఎకరాలు ప్రభుత్వ భూమిని జీఓ 59 ద్వారా అధికారులు వాగ్దేవి యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంలో స్థానికంగా దళి త రైతులకు అన్యాయం జరిగిందని, అధికారులు తమకు అన్యాయంచేశారని ఆరోపిస్తూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు జేసీని ఆదేశిస్తూ జిల్లా కలెక్ట ర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు అధికారులకు మెమో లు ఇచ్చిన జేసీ తదుపరి భూముల రిజి స్ట్రేషన్ రద్దు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఒకవిధం గా క్షేత్రస్థాయిలో అధికారులు తప్పు చేసినట్లు ప్రాథమికంగా ఉన్నతాధికారులు గుర్తిం చారు. అయితే కోట్ల విలువ చేసే భూమి వ్యవహారంలో ఉన్నతాధికారులు తదుపరి చేర్యలు ఏవిధంగా ఉంటాయన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిం ది. కాగా రిజిస్ట్రేషన్ రద్దుపై సంబంధిత యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా ఊరట లభించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ విశ్వం భర సొసైటీ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
వీఆర్ఓలకు మెమోలు జారీచేయాలి: ఆర్డీఓ
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో వివిధ గ్రామాలలో పనిచేస్తున్న వీఆర్ఓల పనితీరు సరిగా లేదని వారందరికీ వెంటనే మెమోలు జారీ చేయాలని ఆర్డీఓ హుసేన్ సాహెబ్, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మను గురువారం ఆదేశించారు. ఆర్డీఓ, తాహశీల్దార్ సంయుక్తంగా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ హుసేన్ మాట్లాడుతూ.. గ్రామాలలో వీఆర్ఓల పనితీరు ఏమాత్రం సక్రమంగా లేదన్నారు. కేవలం జీతాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. బుక్కరాయసముద్రం మండలంలో ఇప్పటి వరకు 48 వేల రెవెన్యూ పరమైన ఫిర్యాదులు అందాయన్నారు. వీటిలో వీఆర్ఓలు 4 వేలు మాత్రమే పరిష్కరించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. -
16 మంది ఉపాధ్యాయులకు మెమోలు
చీరాల, న్యూస్‌లైన్ : మండల విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయుల మధ్య శుక్రవారం వాగ్వాదం జరిగింది. పాఠశాల సమయానికి తెరవకపోవడంతో ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చానని ఎంఈఓ చెబుతున్నారు. కేవలం 5 నిమిషాలు ఆలస్యమైతేనే మెమోలు ఇచ్చి వేధిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. జారీ చేసిన నోటీసులు ఉపాధ్యాయులు తీసుకోకుండా తిరస్కరించారు. వివరాలు.. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఎంఈఓ డి.రత్నకుమారి చీరాల రూరల్ మండలంలోని ఈగావారిపాలెం, గవినివారిపాలెం, కొత్తపాలెం, పుల్లాయిపాలెం, లింగాపురం గ్రామాల్లోని పాఠశాలల తనిఖీకి వెళ్లారు. అయితే ఈ పాఠశాలలు ఉదయం 9 గంటల సమయంలో తెరుచుకోలే దు. ఎంఈఓ వెళ్లిన సమయంలో వాటికి తాళాలు వేసి ఉండటంతో ఆమె 16 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. మెమోలు తీసుకునేందుకు ఉపాధ్యాయులు తిరస్కరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మెమోలు ఇచ్చిన ఉపాధ్యాయులు చీరాలలోని మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకుని రూరల్ మండలంలో కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని, తామంతా ఆటోలు లేక ఇబ్బందులు పడుతూ పాఠశాలకు ప్రతిరోజూ వెళుతున్నామని, 20 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకు వెళితే దానిని కూడా తప్పుగా చూపిస్తూ మెమోలు ఇవ్వడం వేధింపుచర్యలేనని ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. ఎంఈఓ మాత్రం తాను వెళ్లిన 9గంటల సమయంలో పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో మెమోలు ఇచ్చానని చెబుతున్నారు. బస్సులు కూడా లేని గ్రామీణ ప్రాంతాలకు ఆటోల్లో వెళ్లి విధులు నిర్వహిస్తున్నామని, కేవలం 5నిమిషాలు ఆలస్యమైన ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడం మంచిదికాదని, అవసరమైతే ఒక దఫా హెచ్చరించి సమయానికి రావాలని మౌఖికంగా ఆదేశించాలేగానీ, మెమోలు ఇవ్వడం తప్పన్నారు. ఈ విషయమై ఎంఈఓ, ఉపాధ్యాయులకు గంటపాటు వాగ్వాదం జరిగింది. చివరకు ఎంఈఓ జారీ చేసిన మెమోలను ఉపాధ్యాయులు తీసుకోకుండానే వెళ్లిపోవడం గమనార్హం. -
100 మంది కమిషనర్లకు శ్రీముఖాలు
సాక్షి, హైదరాబాద్: ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచిన వంద మున్సిపాలిటీల కమిషనర్లకు మెమోలు జారీ అయ్యాయి. పన్నుల వసూళ్లకు సంబంధించి ఇస్తున్న ఆదేశాలను పట్టించుకోవడం లేదని మున్సిపల్ పరిపాలన సంచాలకులు జనార్దన్‌రెడ్డి ఈ మెమోలు జారీ చేశారు. ఆస్తిపన్ను వసూళ్లు మరీ అధ్వానంగా ఉండడంతో వారు ఎందుకు వసూళ్లలో వెనుకబడ్డారో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన కమిషనర్లపై అభియోగాలు ఎందుకు నమోదు చేయరాదో తెలపాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్లతోపాటు, సంబంధిత రీజియన్ డెరైక్టర్లు కూడా తమ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను కమిషనర్లు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఇప్పటివరకు నయాపైసా కూడా పన్ను వసూళ్లు చేయకపోవడం తీవ్రంగా పరిగణించారు. గ్రామ పంచాయతీల నుంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మారిన వాటిలో 22% కంటే తక్కువ పన్ను వసూళ్లు చేసినవే అధికంగా ఉండడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ పన్నుల వసూళ్ల వివరాలను పరిశీలించగా.. ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల గడచినా.. పన్నుల వసూళ్ళు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం క్షమించరాని అంశమని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. పన్ను వసూలు పట్టించుకోని అధికారులు ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్, రీజినల్ డెరైక్టర్లు ప్రతీవారం సమీక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా. ఆస్తిపన్ను బకాయిలు ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం. మున్సిపాలిటీల్లో 32,18,784 ఆస్తిపన్ను మదింపు(ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్) జరిగిన గృహాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిమాండ్, గతంలో బకాయిలు కలిపి మున్సిపాలిటీలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 1,029 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. కాగా ఇప్పటి వరకు వసూలు అయిన మొత్తం కేవలం రూ. 230.88 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే... ఈ పన్ను వసూళ్లు 22 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాగా మేడ్చల్, తిరువూరు, గొల్లప్రోలు, సత్తుపల్లి, నగరి, దుబ్బాక, అనపర్తి, సదాశివపేట్లలో 0 నుంచి 1.41% మాత్రమే పన్నులు వసూలు కావడం గమనార్హం.