ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు
Published Wed, Sep 7 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
ఉన్నవ: పాఠశాల నిర్వహణ విద్యాబోధన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో పిల్లి రమేష్ బుధవారం ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఎంఈవో పిల్లి డేవిడ్‌రత్నం తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఉన్నవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న మండల ప్రాథమిక మెయిన్ పాఠశాలను బుధవారం విద్యాశాఖాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల నైపుణ్యాన్ని వారు పరిశీలించినట్లు తెలిపారు.
ఐదో తరగతి విద్యార్థులు సైతం చదవడం, రాయడం రావడం లేదని తాము గుర్తించామన్నారు. ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణ కూడా కొరవడినట్లు చెప్పారు. ఉపాధ్యాయులతో హెచ్‌ఎం సమీక్షలు నిర్వహించడం, బోధన సమయంలో పర్యవేక్షణ చేయడం లేనట్లు తెలిసిందన్నారు. పిల్లలకు అభినయ గేయాలను కూడా నేర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించారు. ఉపాధ్యాయుల పనితీరు బాగోలేని కారణంగా విద్యాశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో రమేష్ ఆదేశాల మేరకు పాఠశాల హెచ్‌ఎం కృష్ణబాబు, ఉపాధ్యాయులు పావని, ఆదినారాయణలకు మోమోలను ఇచ్చినట్టు తెలిపారు.
Advertisement