- ఆర్డీఓ, తహశీల్దార్‌కు మెమోలు
- ఆసక్తికరంగా మారిన ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ
‘వాగ్దేవి’ భూముల వ్యవహారంలో అధికారులపై చర్యలు
Published Tue, Aug 23 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
హన్మకొండ అర్బన్ : అధికారులు జీఓ నంబర్ 59లోని నిబంధనలకు విరుద్ధంగా విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవి కళాశాల)కి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసిన వ్యవహారంలో వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ తహశీల్దార్ రాజ్‌కుమార్‌ను బాధ్యులుగా గుర్తించి మెమోలు జారీ చేశారు. ఈ తతంగంపై విచారణ చేపట్టి న జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదుపరి చర్యల్లో భాగంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అయితే ఇద్దరు అధికారులకు మాత్రమే మెమోలు జారీ చేసిన ఉన్నతాధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
16.28 ఎకరాల వ్యవహారం
బొల్లికుంట సమీపంలోని సర్వే నంబర్ 509లో ఉన్న 16.28 ఎకరాలు ప్రభుత్వ భూమిని జీఓ 59 ద్వారా అధికారులు వాగ్దేవి యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంలో స్థానికంగా దళి త రైతులకు అన్యాయం జరిగిందని, అధికారులు తమకు అన్యాయంచేశారని ఆరోపిస్తూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు జేసీని ఆదేశిస్తూ జిల్లా కలెక్ట ర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు అధికారులకు మెమో లు ఇచ్చిన జేసీ తదుపరి భూముల రిజి స్ట్రేషన్ రద్దు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఒకవిధం గా క్షేత్రస్థాయిలో అధికారులు తప్పు చేసినట్లు ప్రాథమికంగా ఉన్నతాధికారులు గుర్తిం చారు. అయితే కోట్ల విలువ చేసే భూమి వ్యవహారంలో ఉన్నతాధికారులు తదుపరి చేర్యలు ఏవిధంగా ఉంటాయన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిం ది. కాగా రిజిస్ట్రేషన్ రద్దుపై సంబంధిత యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా ఊరట లభించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ విశ్వం భర సొసైటీ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Advertisement