Bollikunta
-
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి
సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రల్లో వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకికి గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే విధంగా అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇక వరంగల్ జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురులో ఒకరు అల్లిపురానికి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు బబ్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. హంటర్ రోడ్‌లోని ఫ్లైఓవర్‌పై ఖమ్మం నుంచి వరంగల్ వస్తున్న కారు, వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో కారు ఢీ కొన్నాయి. ఇందులో ఖమ్మం నుంచి వస్తున కారు ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరో కారులో నలుగురు ఉండగా వారికి ఎలాంటి గాయాలవ్వలేదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. -
మృత్యువుతో పోరాడి..
మామునూరు : వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద ఉగాది పర్వదినం రోజున కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పెరుమాండ్ల శరత్(25) మృతి చెందగా బుధవారం పెరుమాండ్ల సాయితేజ్(23), అడ్డగట్ల రాహుల్(22) మృతి చెందారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన పెరుమాండ్ల ఎల్లగౌడ్ రెండో కుమారుడు శరత్, పెరుమాండ్ల శ్రీనివాస్ కుమారుడు సాయితేజ్, అడ్డగట్ల మార్కండేయ కుమారుడు రాహుల్.. ముగ్గురు మంచి మిత్రులు. వీరంతా ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం తోటి స్నేహితులను కలిసేందుకు బొల్లికుంట నుంచి ఒకే బైక్‌పై సరదాగా బయటకు వెళ్లారు. రాత్రి 8.45 గంటలకు ముగ్గురు మిత్రులు తిరిగి బైక్‌పై బొల్లికుంటకు బయల్దేరారు. ఈ క్రమంలో గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో శరత్, రాహుల్, సాయితేజ్ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పెరుమాండ్ల శరత్ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా బుధవారం ఉదయం అడ్డ గట్ల రాహుల్, పెరుమాండ్ల సాయితేజ్ కూడా తనువు చాలించారు. దీంతో గాయపడిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విశాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మృతుడు పెరుమాండ్ల సాయితేజ్ తండ్రి పెరుమాండ్ల శ్రీనివాస్ ఇటీవలే తాటిచెట్టుపై నుంచి పడి గాయాలపాలై మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితిలో చేతికి అంది వచ్చిన కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యులు, బంధు వులు గుండెలవిసేలా రోదించారు. కాగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసు నూరి దయాకర్, గన్నోజు శ్రీనివాసాచారి, ఇనుగాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నిమ్మగండ వెంకన్న, సుదర్శన్‌రెడ్డి, సారంగపాణితో పాటు పలువురు శరత్, రాహుల్, సాయితేజ్ మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘వాగ్దేవి’ భూముల వ్యవహారంలో అధికారులపై చర్యలు
ఆర్డీఓ, తహశీల్దార్‌కు మెమోలు ఆసక్తికరంగా మారిన ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ హన్మకొండ అర్బన్ : అధికారులు జీఓ నంబర్ 59లోని నిబంధనలకు విరుద్ధంగా విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవి కళాశాల)కి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసిన వ్యవహారంలో వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ తహశీల్దార్ రాజ్‌కుమార్‌ను బాధ్యులుగా గుర్తించి మెమోలు జారీ చేశారు. ఈ తతంగంపై విచారణ చేపట్టి న జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదుపరి చర్యల్లో భాగంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అయితే ఇద్దరు అధికారులకు మాత్రమే మెమోలు జారీ చేసిన ఉన్నతాధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 16.28 ఎకరాల వ్యవహారం బొల్లికుంట సమీపంలోని సర్వే నంబర్ 509లో ఉన్న 16.28 ఎకరాలు ప్రభుత్వ భూమిని జీఓ 59 ద్వారా అధికారులు వాగ్దేవి యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంలో స్థానికంగా దళి త రైతులకు అన్యాయం జరిగిందని, అధికారులు తమకు అన్యాయంచేశారని ఆరోపిస్తూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు జేసీని ఆదేశిస్తూ జిల్లా కలెక్ట ర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు అధికారులకు మెమో లు ఇచ్చిన జేసీ తదుపరి భూముల రిజి స్ట్రేషన్ రద్దు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఒకవిధం గా క్షేత్రస్థాయిలో అధికారులు తప్పు చేసినట్లు ప్రాథమికంగా ఉన్నతాధికారులు గుర్తిం చారు. అయితే కోట్ల విలువ చేసే భూమి వ్యవహారంలో ఉన్నతాధికారులు తదుపరి చేర్యలు ఏవిధంగా ఉంటాయన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిం ది. కాగా రిజిస్ట్రేషన్ రద్దుపై సంబంధిత యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా ఊరట లభించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ విశ్వం భర సొసైటీ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.