విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రధానోపాధ్యాయులు అంకితభావం తో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ బాలయ్య కోరారు. జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు స్ఫూర్తి పేరిట సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవ న్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహచర ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన చేయిం చాలని హెచ్‌ఎంలకు సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో హెచ్‌ఎంల పాత్ర కీలకమన్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్‌ఎం అటెండర్, జిల్లా విద్యాశాఖకు డీఈఓ అటెండర్, జోనల్‌కు పాఠశాల ఆర్‌జేడీ అటెండర్ లాంటివాడని అభివర్ణించారు.
అటెండర్లు ఒక గంట ముందు పాఠశాల కు వస్తారని, అందరు వెళ్లిన తర్వాతే వెళ్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇలా గే విధులు నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలుచేయాలని, టెన్త్ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా మెరుగుపర్చుకోవాలన్నారు. మొదటి దశలో పాఠశాలలను సందర్శించి సూచనలు, సల హాలు ఇస్తానని, రెండో దశలోను ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తానని, మూడో దశలో మారకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు వేణుభగవాన్ అనేక అంశాలను ఉదాహరణలతో వివరించారు.
ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థులు
గీసుకొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, ఊకల్, కొమ్మాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తున్నారు. వారిని హెచ్‌ఎంల స్ఫూర్తి కార్యక్రమానికి తీసుకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్, ఆత్మకూరు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామని డీఈఓ తెలి పారు. ‘ఎల్టా’ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరిస్తామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, అశోక్‌దాస్, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్, రవీందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బత్తిని కొమురయ్య, రిసోర్స్‌పర్సన్లు దేవేందర్‌రెడ్డి, వి.లక్ష్మణ్, ఎల్.వంశీమోహన్, ఎస్.సత్యం, పి.శ్రీనివాస్, కె.రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, గీసుకొండ ఎంఈఓ ఎస్. జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఉపాధ్యాయుడు వల్స పైడి ఆధ్వర్యంలో నరేంద్రనగర్ పాఠశాల విద్యార్థుల నృత్యరూపకం ఆకట్టుకుంది. హెచ్‌ఎంలకు స్ఫూర్తి కార్యక్రమాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి.
హెచ్‌ఎంలు అంకితభావంతో పనిచేయాలి
Published Wed, Oct 30 2013 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement