Vidyaranyapuri
-
డీఎస్సీ అభ్యర్థుల ఆశలు గల్లంతు
విద్యారణ్యపురి : పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. రేషనలైజేషన్‌లో భాగంగా 20 మంది లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, 75 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలలను మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థులను సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే టీచర్ పోస్టుల నియామకాలు పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కొత్తగా డీఎస్సీ నిర్వహించినా జిల్లాలో అతి తక్కువ పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే షెడ్యూల్ ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు ఆమోదిస్తూ జీవో నంబర్ 6ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్రక్రియను అమలు చేసేందుకు సాధికారిక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. త్వరలోనే మార్గదర్శకాలు సైతం జిల్లా విద్యాశాఖాధికారులకు రానున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు సైతం దీనిపై కసరత్తు మొదలు పెట్టారు. త్వరలోనే షెడ్యూల్‌ను సైతం ప్రకటించనున్నట్లు తెలిసింది. మార్గదర్శకాల షెడ్యూల్ అందగానే కొన్ని రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జిల్లాలో 700 నుంచి 800 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా వందలాది పాఠశాలలు మూసివేత దిశగా కొనసాగుతుండడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్దుబాటుతో సరి తెలంగాణ రాష్ర్ట నూతన ప్రభుత్వం 2014లో డీఎస్సీ నిర్వహిస్తుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టుల వేకెన్సీల వివరాలను కొన్ని రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయానికి పంపారు. అందులో ఎస్జీటీ 672, పీజీహెచ్ఎం 40, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం 44, సీఐ 55, డ్రాయింగ్ మాస్టర్లు 25, పీఈటీలు 31 వేకెన్సీలు ఉండగా, స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో ఎస్ఏ మ్యాథ్స్ 26, ఎస్ఏ ఇంగ్లిష్ 23, ఎస్ఏ తెలుగు 30, ఎస్ఏ ఉర్దూ 1, ఎస్ఏ హిందీ 18, ఎస్ఏ బయాలజికల్సైన్స్ 13, ఆర్ట్స్ 82, పీడీ 2, హిందీ పండిట్లు 39, తెలుగు పండి ట్లు 32 పోస్టులు వేకెన్సీలుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే ఎస్జీటీ పోస్టులు అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మూతపడనున్న పాఠశాలల నుంచే ఖాళీగా ఉన్న ఎస్ఏ పోస్టులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అత్యధికం ప్రాథమిక పాఠశాలలే.. రేషనలైజేషన్ ప్రక్రియతో జిల్లాలో వందలాది పాఠశాలు మూత పడే అవకాశాలు ఉన్నాయి. 20 మంది లోపు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, 75 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలలకు తాళం పడనుంది. జిల్లాలో 2,298 ప్రాథమిక పాఠశాలలు ఉండగా రేషనలైజేషన్ ప్రక్రియతో 501 వరకు మూతపడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 121 కాగా, 20లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 380 ఉన్నాయి. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1నుంచి 5తరతగతకులకు కూడా ప్రాధమిక పాఠశాలల్లోగానే 20మంది విద్యార్థులుండాల్సిందే.అంతేగాకుండా 6,7 ,8తరగతుల్లోను 20లోపు విద్యార్థులుంటే వాటిని కూడా మూసివేస్తారు. జిల్లాలో 397 ప్రాథమికోన్నత పాఠశాలలు(యూపీఎస్‌లు) ఉండగా అందులో 151 మూతపడే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు తరలించనున్నారు. జిల్లాలో 601 ఉన్నత పాఠశాలలు ఉండగా 75 మంది లోపు ఉన్నవి 18 ఉన్నాయి. వీటిని కూడా మూసివేసే అవకాశం ఉంది.సక్సెస్ ైెహ స్కూళ్ల లో ఇంగ్లిష్ మీడియంలో 75మంది విద్యార్థులు ఉండా లి. లేకుంటే ఇంగ్లిష్ మీడియం కొనసాగించబోరని సమాచారం. మరోవైపు 30 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 700 వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చైర్మన్‌గా కలెక్టర్ 2013-14 డైస్ లెక్కల ప్రకారం పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుంటారు. జిల్లా పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డీఈఓ, ఆర్వీఎం పీఓ, ఐటీడీఏ పీఓలు సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల క్రితం ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు పదిమంది లోపు ఉన్న 171 పాఠశాలలు మూతపడ్డాయి. ఈసారి రేషన్‌లైజేషన్‌లో విద్యార్థుల సంఖ్య 20గా నిర్దేశించడంతో మూతపడను న్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్గదర్శకాలు షెడ్యూల్ రాగానే డిప్యూటీ డీఈఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.విజయకుమార్ యోచిస్తున్నారు. -
నేడు ‘టెట్’
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 9-30నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు పేపర్-1 పరీక్ష 12 కేంద్రాల్లో, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 పరీక్షను 94 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్‌లు, డీఓలతో పా టు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయిందని, పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు స్క్వాడ్ బృందాలను కూడా నియమించామని డీఈఓ తెలిపారు. పీజీ హెచ్ఎంలను సీఎస్‌లుగా నియమించగా, మిగతా సిబ్బంది మొత్తం విద్యాశాఖేతర అధికారులు, ఉద్యోగులేనని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా, పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించి జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నట్లు డీఈఓ వివరించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని, అర గంట ముందు కేంద్రంలోకి అనుమతిస్తామని ఆయ న తెలిపారు. అభ్యర్థికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే కేంద్రంలోని నామినల్ రోల్, ఫొటో అటెండెన్సీ షీట్లో సరిచేయించుకోవాలని, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలని సూచించారు. పరీక్ష కేం ద్రంలోకి పేజర్, మొబైల్, క్యాలుక్యులేటర్లు తీసుకురావొద్దన్నారు. ప్రశ్నాపత్రం కోడ్‌ను ఓఎంఆర్ షీట్ సైడ్-2పై కేటాయించిన స్థలంలో రాయడమే కాకుండా సంబంధిత కోడ్‌ను షేడ్(బబుల్) చేయాలని, వైట్నర్ వాడొద్దని సూచించారు. ఆన్లైన్ నుంచి హాల్‌టికెట్ డౌనలోడ్ చేసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే గత నెలలో తీసుకున్న హాల్ టికెట్‌తో కూడా అభ్యర్థులను అనుమతిస్తామని డీఈఓ వివరించారు. -
హెచ్ఎంలు అంకితభావంతో పనిచేయాలి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రధానోపాధ్యాయులు అంకితభావం తో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య కోరారు. జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు స్ఫూర్తి పేరిట సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవ న్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహచర ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన చేయిం చాలని హెచ్ఎంలకు సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎం అటెండర్, జిల్లా విద్యాశాఖకు డీఈఓ అటెండర్, జోనల్‌కు పాఠశాల ఆర్జేడీ అటెండర్ లాంటివాడని అభివర్ణించారు. అటెండర్లు ఒక గంట ముందు పాఠశాల కు వస్తారని, అందరు వెళ్లిన తర్వాతే వెళ్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇలా గే విధులు నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలుచేయాలని, టెన్త్ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా మెరుగుపర్చుకోవాలన్నారు. మొదటి దశలో పాఠశాలలను సందర్శించి సూచనలు, సల హాలు ఇస్తానని, రెండో దశలోను ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తానని, మూడో దశలో మారకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు వేణుభగవాన్ అనేక అంశాలను ఉదాహరణలతో వివరించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థులు గీసుకొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, ఊకల్, కొమ్మాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తున్నారు. వారిని హెచ్ఎంల స్ఫూర్తి కార్యక్రమానికి తీసుకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్, ఆత్మకూరు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామని డీఈఓ తెలి పారు. ‘ఎల్టా’ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరిస్తామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, అశోక్‌దాస్, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్, రవీందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బత్తిని కొమురయ్య, రిసోర్స్పర్సన్లు దేవేందర్‌రెడ్డి, వి.లక్ష్మణ్, ఎల్.వంశీమోహన్, ఎస్.సత్యం, పి.శ్రీనివాస్, కె.రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, గీసుకొండ ఎంఈఓ ఎస్. జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఉపాధ్యాయుడు వల్స పైడి ఆధ్వర్యంలో నరేంద్రనగర్ పాఠశాల విద్యార్థుల నృత్యరూపకం ఆకట్టుకుంది. హెచ్ఎంలకు స్ఫూర్తి కార్యక్రమాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి.