
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుండటంతో డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకిలోని పీఎస్కేలు, నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో డిసెంబర్ 3వ తేదీన తత్కాల్, సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.
ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా చేసుకునేవారికి కూడా స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ ఒక్క రోజు 3,500 దరఖాస్తులను ఆయా కేంద్రాల ద్వారా సమర్పించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందులో 70 శాతం తత్కాల్, 30 శాతం సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులుంటాయని వివరించారు.
బుధవారం ఉదయం నుంచి పాస్‌పోర్టు సేవా పోర్టల్, ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా, దరఖాస్తు చేసుకున్న వారు 3వ తేదీకి ప్రీపోన్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 3న ఒక రీ షెడ్యూలింగ్, ఒక ప్రీపోన్‌కు మాత్రమే అవకాశం ఉంటుందని.. మరో తేదీ మార్చుకునే వెసులుబాటు ఉండదని గుర్తుంచుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment