Passport
-
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తనూజ రాణి
-
పాస్‌పోర్ట్‌లో.. సింగపూర్ ‘బాద్షా’
సాక్షి, హైదరాబాద్ : విదేశీ పర్యటనలు, దేశ పౌరులుగా గుర్తింపు విషయంలో పాస్‌పోర్ట్ అనేది కీలక డాక్యుమెంట్‌గా నిలుస్తోంది. దేశ సరిహద్దుల్లో ఐడెంటీ, వలసదారులను రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ముఖ్యమైన పత్రంగా మారిన విషయం తెలిసిందే. విదేశాలకు విద్య, వైద్యం, పర్యాటకం, తీర్థయాత్రలు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేందుకు, మళ్లీ స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు పాస్‌పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి. వివిధ అధికారిక లేక వ్యక్తిగత, కుటుంబపరమైన విధులు, అవసరాలకు కూడా ఇది అధికారిక గుర్తింపుగా ఉపయోగపడుతోంది. మొత్తంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ‘టికెట్ టు ద వరల్డ్’గా పరిగణిస్తున్నారు. సింగపూర్ అనే చిన్నదేశం ప్రపంచస్థాయిలో పాస్‌పోర్ట్‌ల గుర్తింపు, వాటి విలువ విషయంలో ‘బాద్షా’గా నిలుస్తోంది. ఈ దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే వీసా లేకుండానే 195 దేశాలు సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ గుర్తింపు కారణంగా సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా సింగపూర్ ప్రథమ స్థానంలో కొనసాగుతుండడం ఓ విశేషం. » పాస్‌పోర్ట్‌ల విలువ, గుర్తింపు విషయంలో ఆ తర్వాతి స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఈ దేశ పాస్ట్‌పోర్ట్ ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే వీలుంది. »ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణకొరియాల పాస్ట్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండానే 192 దేశాలు సందర్శించొచ్చు. » ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లగ్జ మ్బర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పాస్‌పోర్ట్‌లు కలిగిన వారు వీసా అవసరం లేకుండానే 191 దేశాల్లో పర్యటించొచ్చు. » బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’ఇలా... ఒకదేశ పౌరుడు స్వేచ్ఛగా ఇతర దేశాల్లో విహరించడం ఆధారంగా... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించి జాబితాను ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’విడుదల చేస్తోంది. ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు...అక్కడకు చేరుకునేలోగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే అవకాశం ప్రాతిపదికన వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లకు ఈ ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులు జరుపుతున్న పర్యటనలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఐఏటీఏ) సమకూర్చిన సమాచారం, వివరాలు, గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్‌లను ఈ సంస్థ నిర్థారిస్తోంది. వివిధ అంశాలతోపాటు, ఫలానా దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న పౌరుడు వీసా లేకుండానే ఏఏ దేశాలకు వెళ్లగలుగుతారు,ఆయా దేశాలతో ఈ పౌరుడి దేశానికున్న దౌత్యపరమైన సంబంధాలు, ఏ మేరకు అంతర్జాతీయ ఒప్పందాలు కలిగి ఉన్నాయనే దాని ప్రాతిపదికన సమగ్ర విధానాన్ని పాటించి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను సిద్ధం చేస్తున్నారు. మరింత దిగజారిన భారత్ ర్యాంకింగ్ హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్–2025 నివేదికను బట్టి చూస్తే...భారత్ ర్యాంకింగ్ మరో 5 ర్యాంకులు దిగజారి 85వ ర్యాంక్ (2024లో 80వ ర్యాంక్) వద్ద నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 103 స్థానంలో, బంగ్లాదేశ్ 100వ స్థానంలో ఉన్నాయి. అదే 2021లో ఇండియా 90వ ర్యాంక్ సాధించి మరింత అడుగున నిలిచింది. ఇదిలా ఉంటే 2006 భారత్ 71వ ర్యాంక్‌లో నిలిచి ఒకింత సత్తా చాటింది. రంగుల వారీగా చూస్తే... మొత్తంగా 84 దేశాలు నీలంరంగు (బ్లూరంగు షేడ్స్) పాస్‌పోర్ట్‌లతో అత్యధిక రంగులు ఉపయోగిస్తున్న దేశాలుగా ప్రథమస్థానంలో నిలిచాయి. 68 దేశాలు ఎరుపురంగు కలిగిన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉంటే..40 దేశాల పాస్‌పోర్ట్‌లు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి. కేవలం ఏడు దేశాల పాస్ట్పోర్ట్లే నలుపు (బ్లాక్) రంగులో ఉండడం కొసమెరుపు. -
వారంలోనే పాస్‌పోర్ట్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత వారం రోజులలోపే స్లాట్ లభించేలా చర్యలు చేపట్టామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీఓ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చే సుకొన్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని చెప్పా రు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కోవిడ్ అనంతరం పాస్‌పోర్ట్ స్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో స్లాట్ కోసం 30 నుంచి 40 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం దీనిని గరిష్టంగా 8 పని దినాలకు తగ్గించాం. 2025లో వారం రోజుల్లోనే స్లాట్ దొరికేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’అని వివరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌పోర్ట్ ఎన్వలప్ కవర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఆదిలాబాద్, కామారెడ్డిలో మరుసటి రోజే స్లాట్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ఉన్నాయని స్నేహజ తెలిపారు. పీఓపీఎస్కేల్లోనూ వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోందని చెప్పారు. ఆదిలాబాద్, కామారెడ్డి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని వెల్లడించారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత పోలీసు వెరిఫికేషన్‌కు పట్టే సమయాన్ని మినహాయించి తత్కాల్ పాస్‌పోర్టును ఒకటి నుంచి మూడు పని దినాలు, సాధారణ పాస్‌పోర్టును ఐదు నుంచి ఏడు పనిదినాల్లో జారీ చేస్తున్నాం’అని వివరించారు.సందేహాల నివృత్తికి వాట్సాప్ నంబర్దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించడానికి సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పబ్లిక్ డేలు నిర్వహిస్తున్నామని స్నేహజ తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా రావచ్చని, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నవాళ్లు సోమ, మంగళ, శుక్రవారాల్లో రావాలని సూచించారు. ఈ రెండు రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎక్స్, వాట్సాప్, ఫోన్‌కాల్స్ ద్వారానూ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ‘81214 01532’వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామని తెలిపారు. రెండేళ్లకు మించి శిక్షపడితే పాస్‌పోర్ట్ ఇవ్వం..పాస్‌పోర్ట్ పొందడానికి కనిష్ట, గరిష్ట వయో పరిమితులు లేవని స్నేహజ తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో ప్రతికూల అంశాలు తెలిసినా, దరఖాస్తుదారుడికి ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినా పాస్‌పోర్ట్ జారీ చేయబోమని చెప్పారు. అలాంటివారికి కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్ మైనర్ల విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి అనుమతి చాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.‘పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న వాళ్లు ఆ దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీని జత చేయక్కర్లేదు. మీ–సేవా కేంద్రం నుంచి తీసుకున్న ‘లాస్ట్’ సర్టీఫికెట్ ఇస్తే సరిపోతుంది. వివాహానంతరం ఇంటి పేరు మారిన మహిళలు తాజా అడ్రస్ ప్రూఫ్‌తో డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మ్యారేజ్ సర్టీఫికెట్ తప్పనిసరి కాదు’అని పేర్కొన్నారు. బ్రాంచ్ సెక్రటేరియేట్ నుంచి గత ఏడాది 1,400 సర్టీఫికెట్ల అటెస్టేషన్ లేదా అపోస్టల్ చేశామని వివరించారు.‘పాస్‌పోర్టు’ సమస్యలు..సందేహాలా?89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి.. పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ సమాధానాలిస్తారుపాస్పోర్టు కోసమే కాకుండా.. అది వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే), వెబ్సైట్ లాంటివి ఉన్నా సామాన్యుడికి ఇప్పటికీ అనేక సందేహాలు, సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలు అర్థంకాక ఇప్పటికీ పలువురు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కేవలం రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసే పాస్‌పోర్టు విషయంలోనే కాదు.. దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియెట్ అందించే అటెస్టేష¯న్ అండ్ అపోస్టల్ సేవల పైనా పలు సందేహాలు ఉంటున్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ముందుకు వచ్చింది ‘మీతో సాక్షి’. మీ వివరాలు, సమస్య, సందేహాన్ని 89777–94588 నంబర్‌కు టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌ల రూపంలో వాట్సాప్ చేయండి. ‘మీతో సాక్షి’ వీటిని రీజనల్ పాస్‌పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ దృష్టికి తీసుకెళుతుంది. మీ సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యలు, సందేహాలు వెంటనే తెలియజేయండి. -
ఈ 12 దేశాలకు వెళ్లాలంటే.. వీసా అవసరమే లేదు
కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. సంక్రాంతి సెలవులు కూడా త్వరలోనే రానున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది ఆలా.. సరదాగా విదేశాల్లో చక్కర్లు కొట్టి వచ్చేద్దాం అనుకుంటారు. అయితే వీసా (Visa) సమస్య కారణంగా మిన్నకుండిపోతారు. కానీ వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాలను చుట్టి వచ్చేయొచ్చని బహుశా కొందరికి తెలిసుండకపోవచ్చు.వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాల్లో.. కొన్ని రోజులు ఉండవచ్చు. ఇలాంటి దేశాలు 12 వరకు ఉన్నాయి. భారతీయులు (Indians) వీసాతో పనిలేకుండానే (Visa Free Countries) పర్యటించగల దేశాల జాబితా..●థాయిలాండ్●భూటాన్●నేపాల్●మారిషస్●మలేషియా●ఇరాన్●అంగోలా●డొమినికా●సీషెల్స్●హాంకాంగ్●కజఖ్‌స్థాన్●ఫిజీభారతీయులు పైన పేర్కొన్న దేశాల్లో దాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగటానికి కొన్ని దేశాలు ఈ వీసా రహిత విధానం ప్రవేశపెట్టాయి. ఇది ఆ దేశాల ఆర్ధిక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యాటకులు కూడా అనుకూలంగా ఉంటుంది. -
అమ్మకానికి అందమైన ఐలాండ్ పాస్‌పోర్ట్‌లు
అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది.ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది.ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు "స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్"గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్ఇన్టైర్ చెబుతున్నారు.ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు. -
మట్టి పలకల నుంచి... మైక్రోచిప్పుల దాకా...!
మైక్రోచిప్పులు, హోలోగ్రామ్‌లు, బయోమెట్రిక్ ఫోటోలు, బార్ కోడ్లతో నిండిన నేటి పాస్‌పోర్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అద్భుతాలు. ఇప్పుడు మనం చూస్తున్న పాస్ పోర్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తయారైంది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. కానీ దాని మూలాలు సహస్రాబ్దాల నాటివి. మానవ చరిత్ర ప్రారంభ యుగాల్లో ఎలాంటి సరిహద్దులు లేవు. స్వేచ్ఛా వలసలు ఉండేవి. తర్వాత ఉద్భవించిన నాగరికతలు భూమిని విభజించడమే గాక అన్వేషణ, పరిశోధనల సారాన్ని మార్చేశాయి. ఆ క్రమంలో సురక్షితంగా దేశాలు దాటేందుకు అధికారిక పత్రంగా పాస్‌పోర్టు పుట్టుకొచ్చింది.క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో మెసపొటేమియాలో ప్రయాణ అనుమతులకు మట్టి పలకలు వాడారు. ఒకరకంగా వీటిని అత్యంత పురాతన పాస్‌పోర్టులుగా చెప్పవచ్చు. పురాతన ఈజిప్టులో ప్రయాణికులు, వ్యాపారుల భద్రత కోసం అధికారిక లేఖలను ఉపయోగించారు. భారత ఉపఖండంలో ప్రయాణాలను మౌర్య సామ్రాజ్య కాలం నుంచి డాక్యుమెంట్ చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అవి నేటి ప్రయాణ అనుమతుల వంటివి కావు. కేవలం ప్రయాణికుల ప్రవర్తన తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలుగా మన్నన పొందేవి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుని పాలనలో ప్రయాణాలను సులభతరం చేయడానికి, రక్షణ, అధికారిక ఆమోదాన్ని తెలపడానికి శాసనాలు జారీ చేశారు.మొదటి ప్రపంచ యుద్ధంతో..యూరప్ వలసవాదులు ప్రస్తుత పాస్‌పోర్ట్ వ్యవస్థ రూపశిల్పులని చెప్పవచ్చు. అన్వేషణలో భాగంగా వారు ప్రపంచవ్యాప్తంగా కలియదిరిగి భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లారు. 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రయాణాల్లో కొన్ని పద్ధతులు వచ్చి చేరాయి. ఆరోగ్య పరీక్షలు, కొన్ని ప్రశ్నలతో సరిహద్దులు దాటనిచ్చేవారు. అప్పటికి ప్రయాణ పత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత ప్రమాణమంటూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పాస్‌పోర్ట్ నియంత్రణ స్వరూపం నాటకీయంగా మారింది. సంఘర్షణ నేపథ్యం నుంచి పుట్టిన నానాజాతి సమితి శాంతి, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రపంచ ప్రయాణానికి ప్రామాణిక వ్యవస్థను రూపొందించింది. 1921 నాటికి కఠినమైన వలస నియంత్రణలను విధించడానికి అమెరికా నాటి రాజకీయ అవకాశాలను ఉపయోగించుకుంది. ఎమర్జెన్సీ కోటా చట్టం, 1924 ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచి్చంది. ఇవి వలసల ప్రవాహాన్ని తగ్గించాయి. ఒకప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఉన్న పాస్‌పోర్టు ఆ తరువాత పాశ్చాత్య కేంద్రీకృత శక్తులు ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించే నియంత్రణ సాధనంగా మారింది.మొగలుల కాలంలో.. మధ్యయుగానికి వచ్చే నాటికి ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రగతి సాధించింది. ప్రయాణాల పర్యవేక్షణ, నియంత్రణకు భారత ఉపఖండమంతటా పలు రకాల చట్టబద్ధత, ఆమోదంతో కూడిన పత్రాలు జారీ చేసేవారు. మొగల్ చక్రవర్తులతో పాటు ప్రాంతీయ పాలకులుం కూడా ప్రయాణికులకు, వ్యాపారులకు, యాత్రికులకు, దౌత్యవేత్తలకు ‘సనద్’లు, సురక్షిత ప్రవర్తన లేఖలు జారీ చేశారు. వాణిజ్య, సాంస్కృతిక మారి్పడిని ప్రోత్సహించి వారు సురక్షితంగా ప్రయాణించేలా చూశారు. శతాబ్దాల క్రితంం వెలుగు చూసిన ‘సౌఫ్ కండిక్ట్’ (సేఫ్ కండక్ట్) పాస్‌ను ప్రాథమిక ప్రయాణ పత్రంగా చెప్పవచ్చు. అయితే ఇది ప్రధానంగా పాలకుల మధ్య లిఖితపూర్వక ప్రతిజ్ఞ. యుద్ధ భయం లేకుండా సరిహద్దులు దాటి సురక్షితంగా ప్రయాణించేలా చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం వంటిది.1920 నాటి ‘పాస్‌పోర్ట్ తీర్మానం’ అంతర్జాతీయ ప్రయాణాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూనే, అసమానతలకు పునాది వేసిందంటారు. ఎందుకంటే అప్పట్లో అమెరికాలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ ఉండేది కాదు. భర్తల పాస్పోర్టులోనే ఫుట్ నోట్సులో భార్య పేరు పేర్కొనేవారు. దాంతో వారు స్వతంత్రంగా సరిహద్దులను దాటలేకపోయారు. ఇవన్నీ నాటి సమాజ లింగ అసమానత, మహిళలపై వివక్షకు అద్దం పట్టేవే. ఇటీవలి దశాబ్దాల్లో పాస్‌పోర్ట్ ప్రపంచ రాజకీయాలు, మార్కెట్ శక్తుల ఇష్టాలకు లోబడి డిమాండ్ ఉన్న వస్తువుగా మారిపోయింది. 2016లో అమెరికాలోనే ఏకంగా 1.86 కోట్ల పాస్‌పోర్టులు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్ ఎంతటిదో అర్థమవుతోంది. ప్రపంచానికి ప్రవేశ ద్వారమైన పాస్‌పోర్ట్ కొందరికి అధికార చిహ్నం. మరికొందరికి మినహాయింపులకు సాధనం. మనం పుట్టిన దేశాన్ని బట్టి, పాస్ పోర్ట్ మనకు అత్యంత సౌలభ్యాన్ని ఇవ్వొచ్చు. లేదా విపరీతమైన బాధను కలిగించవచ్చు. -
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ బంద్!
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ తాత్కాలికంగా మూతపడింది. నిర్వహణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు పోర్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు రోజులూ దరఖాస్తుదారులకు పోర్టల్ అందుబాటులో ఉండదు. కొత్త అపాయింట్మెంట్లేవీ కేటాయించరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను సైతం రీషెడ్యూల్ చేస్తారు."సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్ అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు తెలియజేస్తాం" అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్మెంట్లను బుక్ చేయడానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను వినియోగిస్తారు. అపాయింట్మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకుని ధ్రువీకరణ కోసం తమ పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీని తరువాత, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది. -
మోస్ట్ పవర్ ఫుల్ పాస్పోర్ట్స్ లిస్ట్ : టాప్‌లో సింగపూర్, మరి ఇండియా?
ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ విడుదల చేసింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) ర్యాంకింగ్ డేటా ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు పైకి ఎగబాకింది .ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. గతంలోఈ అనుమతి 59 దేశాలకు ఉండేది. సింగపూర్ టాప్ సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ జాబితా ప్రకారం 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ , స్పెయిన్ రెండో స్థానంలో ఉన్నాయి. పాస్‌పోర్ట్ హోల్డర్లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత, ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా ,స్వీడన్లు 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్ , స్విట్జర్లాండ్లతో పాటు యునైటెడ్ కింగ్డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పోర్చుగల్ 5వ స్థానాన్ని పంచుకోగా, అమెరికా 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సెనెగెల్, తజకిస్థాన్ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు. 2024 అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల టాప్ -10 జాబితాసింగపూర్ (195 గమ్యస్థానాలు)ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192)ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190)ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)గ్రీస్, పోలాండ్ (188)కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)అమెరికా (186)ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
ప్లీజ్..ఎవరైనా సాయం చేయండి..!
-
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
‘చాలా భయంకరం, ఇలా మీరు చేయకండి’: ఇటలీలో కేరళ వైద్యుడి చేదు అనుభవం
కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు. ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు నగదుతో ఉన్న పర్సు పోయిందని గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు తరువాత భారత కాన్సులేట్‌ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను అందించారు. దేశం కాని దేశంలో పాస్‌పోర్ట్, వాలెట్ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u — Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024 -
పాస్‌పోర్ట్ గడువు ముగిసిందా.. ఎలా రెన్యువల్ చేయాలంటే..
భారత్ నుంచి ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ జారీ అయిన పదేళ్లు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాలి. పాస్‌పోర్ట్ రిన్యువల్ సులభంగా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారు ప్రభుత్వ నుంచి పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ గడువు ఐదు సంవత్సరాలు లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవాలంటే కింది పద్ధతి పాటిస్తే సరిపోతుంది. రెన్యువల్ ఇలా.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఒకవేళ వెబ్సైట్లో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకపోతే నియమాలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు. తర్వాత లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వాలి. Apply for fresh passport/Reissue of Possport ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తగిన వివరాలను నమోదు చేయాలి. Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయాలి. Print Application Receipt మీద క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంను తీసుకుని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలంటే.. ‘పాస్‌పోర్ట్ సేవ’ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతిని, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకోవాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అపాయింట్మెంట్ కోసం తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసి Pay and Book the Appointment మీద క్లిక్ చేయాలి. రెన్యువల్ కోసం అవసరమయ్యే ధ్రువపత్రాలు.. ఒరిజినల్ పాస్‌పోర్ట్ స్వీయధ్రువీకరణతో ECR/Non-ECR పేజీ ఫోటోకాపీలు. అడ్రస్ ప్రూఫ్ పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీల జిరాక్స్ కాపీలు. చెల్లుబాటు అయ్యే ఎక్స్టెన్షన్ పేజీ జిరాక్స్ కాపీ. సెల్ఫ్ అటెస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్ కాపీ. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ చాలామంది రీఇష్యూ, రెన్యువల్ రెండు ప్రక్రియలు ఒకటే అని అనుకుంటారు. కానీ రెండు ఒకటే తరహాలో ఉండే వేరువేరు ప్రక్రియలు అని గుర్తించుకోవాలి. రెండింటికి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయి. అలాగే రిన్యువల్కి దరఖాస్తు చేసుకున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో పాస్‌పోర్ట్ రిన్యువల్ జరుగుతుంది. -
పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్‌పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు. 26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు. -
ఫ్రాన్స్ పాస్‌పోర్టు చాలా పవర్ఫుల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్‌పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది! అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్‌పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్‌పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్‌పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్‌పోర్టు ర్యాంకు 58. ఈ పాస్‌పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. -
నకిలీ పాస్ పోర్ట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
-
Fake Passports: నకిలీ పాస్‌పోర్ట్ కేసులో కీలక పరిణామం
-
HYD: పాస్‌పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. -
ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ..
కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును ఇష్యూ చేస్తారు. ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..! తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు. -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
మైనర్ పాస్‌పోర్ట్ అప్లై చేయాలా.. సింపుల్ ప్రాసెస్ ఇదే!
ఆధునిక కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మైనర్ పాస్‌పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిల్లల కోసం పాస్‌పోర్ట్ పొందాలనుకునేవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది. మైనర్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్.. జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్ తల్లిదండ్రుల పాస్పోర్ట్స్ (అందుబాటులో ఉంటే) తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ (పిల్లలు భారతదేశం వెలుపల జన్మించినట్లయితే) ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి! ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా.. మైనర్ పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది. అమౌంట్ చెల్లించిన తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయాలి. మీరు అపాయింట్మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. అపాయింట్మెంట్ రోజు మీ బిడ్డను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ & డాక్యుమెంట్లను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకుంటాడు. ఆ తరువాత పాస్‌పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సిద్దమైన తరువాత మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు, లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు. -
గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, రూ.33 లక్షల వరకు డబ్బు ఆదా
దేశ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి సొంతింటి కలల్ని నిజం చేసేలా 40,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.33,04,918) వరకు డబ్బుల్ని ఆదా చేసుకునే వెసలు బాటు కల్పించింది. దీంతో పాటు విధులు నిర్వహించే వారికి వర్క్ పర్మిట్, ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో నివసిస్తున్నట్లైతే వారికి వీసా ఎలిజిబులిటీ గడువును పొడిగించింది. ఇందుకోసం అర్హులు నివాసానికి సంబంధించిన పత్రాల్ని అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కెనడాలో సొంత ఇల్లు తీసుకోవాలని ఉండి, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆగిపోయిన వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. పన్ను ప్రోత్సాహకాలు పొందడంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. దీంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్ధులు సైతం సొంతింటిని కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. వర్క్ పర్మిట్ హోల్డర్లు, ఇతర దేశాల విద్యార్థులను ఆహ్వానించి వారికి అవకాశాలు కల్పించే విషయంలో తమ నిబద్ధతను చాటి చెప్తుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారు కెనడాలో కొత్త ఇల్లు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ (ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ) అర్హతలు కెనడా ప్రభుత్వం అందించే పథకంతో లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ తప్పని సరి వీటితో పాటు తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తేనే : కెనడాలో గడిచిన ఐదేళ్లలో భార్య లేదా భర్త / భాగస్వామి పేరు మీదు ఇల్లు కొనుగోలు చేయకూడదు. కనీసం 18 సంవత్సరాలు నిండాలి : ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్‌ను ప్రారంభించిన నాటికి అర్హులైన వయస్సు 18 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వయస్సు ఉండాలి. కెనడియన్ నివాసి : కెనడియన్ రెసిడెంట్ (పౌరులు, శాశ్వత నివాసితులు, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం నివాస అవసరాలను తీర్చే కొంతమంది తాత్కాలిక నివాసితులు). వర్క్ పర్మిట్ హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు నివాసితులుగా అర్హత పొందడానికి ట్యాక్స్ ఇయర్ సంవత్సరంలో కనీసం 183 రోజులు దేశంలో నివసించాలి. ఆర్థిక సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న మూడు రకాల ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్లు డిపాజిటరీ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది నగదు, టర్మ్ డిపాజిట్లు లేదా గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్లు (జిఐసి) కలిగి ఉన్న బ్యాంకు ఖాతా. ట్రస్ట్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఈ ఖాతాను ట్రస్టీగా ట్రస్ట్ కంపెనీతో తెరవవచ్చు. నగదు, టర్మ్ డిపాజిట్లు,జీఐసీలు, ప్రభుత్వ .. కార్పొరేట్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నిర్దేశిత స్టాక్ ఎక్ఛేంజ్‌లలో లిస్ట్ అయిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అర్హతను కలిగి ఉంటుంది. ఇన్స్యూర్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది యాన్యుటీ (లైసెన్స్ పొందిన యాన్యుటీ ప్రొవైడర్) ఒప్పందం. కాగా, అర్హత కలిగిన నివాసాలలో సింగిల్-ఫ్యామిలీ గృహాలు, పాక్షికంగా విడిపోయిన గృహాలు, టౌన్ షిప్‌లు, కండోమినియం యూనిట్లు (లేదా కాండోలు), అపార్ట్మెంట్ యూనిట్లు, మొబైల్ గృహాలు ఉన్నాయి. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్‌రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా!. దీన్ని ఎక్కువగా అత్యంత ధనవంతులే కోరుకుంటారట. ఈ పాస్‌పోర్ట్‌ని పొందడమే అదృష్టంగా భావిస్తారట వారు. అసలేంటి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్. ధనవంతులకు ఆ పాస్‌పోర్ట్ అంటే ఎందుకంతా క్రేజ్!. గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం పొందే పాస్‌పోర్ట్. గణనీయమైన ఆర్థిక పెట్టుబడుల ద్వారా వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు విదేశాల్లో నివాసం ఉండగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని వీసా రహిత ప్రయాణం అనాలి. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సులవైన మార్గం కూడా. ఈ పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు.. గోల్డెన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా ఈజీగా రాకపోకలు సాగించగలరు. కొన్ని దేశాలు పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి అనూకూలమైన పన్ను విధానాలను అందించి మరీ పెట్టుబడులు పెట్టేలా చేసి మరీ ఈ వీసాలను ఇస్తాయట. ఇది కొత్త మార్కెట్లకి, పెట్టుబడి అవకాశాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కారణంగా ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలను తదితరాలను పొందుతారు. ఇలాంటి పౌరసత్వాలను అందించే దేశాలు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు డొమినికా వంటి దేశాలు ఇలాంటి ఆకర్షణీయమైన పౌరసత్వ కార్యక్రమాలను అందిస్తున్నాయి. అలాగే మాల్టా, సైప్రస్ వంటి దేశాలు ఐరోపా చుట్టి వచ్చేలా, కొన్ని కరేబియన్ దేశాలు, వనాటు వంటివి యునైటెడ్ స్టేట్స్లో ఉండేలా ఆకర్షణీయమైన వీసాలను అందిస్తున్నాయి. చుట్టుమడుతున్న వివాదాలు గమ్యాన్ని బట్టి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ వందల వేల నుంచి మిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలు, మెరగైన జీవనశైలికి ప్రధాన ఆకర్షణగా ఉన్నా.. ఆస్తుల దుర్వినియోగం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ధనవంతులకు ఇదోక అవకాశంలా.. ఆస్తులను కాపాడుకునేందుకు సులభమైన మార్గంలా ఉండే ప్రమాదం ఉంది. అలాగే భద్రత, స్వేచ్ఛ పరంగా కూడా ఈ పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. (చదవండి: అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..) -
10 రోజుల్లో పెళ్లి.. వధూవరులకు షాక్ ఇచ్చిన పెంపుడు కుక్క
ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఇప్పటివరకు సినిమాల్లో, నిజజీవితంలోనూ చూశాం. కొన్ని ప్రత్యేకమైన కారణాలు, అనుకోని ట్విస్ట్‌ల కారణంగా ఇలా జరుగుతుంటాయి. అయితే ఓ పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఆ వరుడు కుక్క చేసిన పనికి తల పట్టుకున్నాడు. ఇంతకీ ఆ పెంపుడు కుక్క ఏం చేసింది? పెళ్లి ఆగిపోయిందా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. ఈ వేడుకను కలకాలం గుర్తించుకునేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇప్పుడైతే చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అమెరికాలోని ఓ జంట కూడా తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో ఉండగానే వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదరింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తో పాటూ పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. కొన్ని పెళ్లి పనులు మిగిలి ఉండగా వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ఆగస్టు 31న ఇటలీలో తన పెళ్లి జరగనుందని, ఇలాంటి సమయంలో తన కుక్క చేసిన పనికి ఏం చేయాలో తెలియడం లేదని, ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా అభ్యర్థించాడు. లేదంటే తాను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్లిపోతారని అధికారులకు మొర పెట్టుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆగస్టు 31న జరగాల్సిన వాళ్ల వివాహం జరుగుతుందా? అధికారులు చూపించిన ఆ ప్రత్యామ్నాయం ఏంటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
Henley Passport Index 2023: సింగపూర్ పాస్‌పోర్టు పవర్ఫుల్ ..!
లండన్: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశం పాస్‌పోర్టు ఉంటే ఎలాంటి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. ఇన్నాళ్లూ నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చిన జపాన్ను తోసిరాజని సింగపూర్ మొదటి ర్యాంక్ దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2023 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిస్తే భారత్ 80వ ర్యాంక్ దక్కించుకుంది. భారత్ వీసా ఉంటే ఇండోనేసియా, రువాండా, జమైకా, శ్రీలంక వంటి దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు భారతీయులు వెళ్లాలంటే వీసా తీసుకొని తీరాలి. అమెరికా, చైనా, రష్యా, జపాన్ సహా పలు యూరోపియన్ యూనియన్ దేశాలకు వీసా తప్పకుండా తీసుకోవాలి. వీసా లేకుండా పాస్ పోర్టు సాయంతో ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఐఏటీఏ) ఇచ్చే డేటా ఆధారంగా తొలిసారిగా ఈ జాబితా రూపొందించింది. జాబితాలో అమెరికాకు ఎనిమిదో స్థానం, యూకే నాలుగో ర్యాంకులో ఉంటే అట్టడుగు స్థానంలో అఫ్గానిస్తాన్ నిలిచింది. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!
ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఇందుకోసం వీసా అనుమతి కోరుతున్నారా? మీకు సింగపూర్ పాస్ట్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా ప్రపంచంలోని 227 దేశాల్లో 192 దేశాల్ని చుట్టి రావొచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (IATA) నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, గత ఐదేళ్లుగా పవర్ఫుల్ పాస్ పోర్ట్‌ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న జపాన్ మూడవ స్థానానికి దిగజారింది. పదేళ్ల క్రితం శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. కాలక్రమేణా ఆ పాస్‌పోర్ట్ స్థానం మరింత దిగజారుతూ వచ్చింది. 2017లో ఏకంగా రెండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి పడిపోయింది. పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో సింగపూర్ తొలిస్థానంలో ఉండగా జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌కు 2వ స్థానం, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెమ్‌బర్గ్, సౌత్ కొరియా, స్వీడన్‌కు 3వ స్థానం, డెన్మార్క్,ఐర్లాండ్,నెదర్లాండ్, యూకేలు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి. పరోక్షంగా చైనానే కారణమా? చైనాలో భౌగోళిక రాజకీయ అంశాల కారంగా డ్రాగన్ కంట్రీలో ప్రైవేట్ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. దీంతో వ్యాపారస్థులు, సామాన్యులు సింగపూర్‌కు వలస వెళ్లారు. మరోవైపు ఆర్ధికంగా పుంజుకోవడం వంటి అంశాలు సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అంత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించేందుకు దోహదపడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం! -
ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్‌పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు వీరే.. ప్రపంచంలో పాస్‌పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్ కింగ్, జపాన్ కింగ్, జపాన్ క్వీన్. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన క్వీన్ ఎలిజబెత్‌కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్‌పోర్టు అవసరమవుతుంది. ప్రముఖుల విషయంలో.. ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్‌పోర్ట్ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సివుంటుంది. భారత్ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్‌పోర్టు అవసరమవుతుంది. ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ.. -
పాస్‌పోర్ట్ కష్టాలకు చెల్లుచీటి.. కొత్త విధానం అమలుపై జై శంకర్ ప్రకటన!
త్వరలో భారత్‌లో రెండవ దశ పాస్‌పోర్ట్ సేవ ప్రోగ్రామ్ (పీఎస్పీ - వెర్షన్ 2.0)ను లాంచ్ చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..దేశ పౌరుల పాస్ పోర్ట్ సేవల్ని మరింత సులభతరం చేసే అంశంలో కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్ చేయాలని పాస్ పోర్ట్‌లను జారీ చేసే అధికారులకు జై శంకర్ పిలుపునిచ్చారు. పీఎస్పీ - వెర్షన్ 2.0లో ఈ - పాస్ట్ పోర్ట్‌లను సైతం అప్‌గ్రేడ్ చేసుకోనేలా అవకాశం లభించనుంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్ పోగ్రామ్’ ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్ సేవల్ని అందించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని జై శంకర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం, EASE : E : ఎన్ హ్యాన్స్డ్ పాస్‌పోర్ట్ టూ సిటిజెన్స్, A : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వీస్ డెలివరీ, S : స్మూతర్ ఓవర్ సిస్ ట్రావెల్ యూజింగ్ చిప్ ఎనేబుల్డ్ ఈ - పాస్‌పోర్ట్, E : ఎన్హ్యాన్స్డ్ డేటా సెక్యూరిటీ విధానాన్ని సత్వరమే అమలు చేసేలా పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తద్వారా దేశ పౌరులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సలుభతరం కానున్నాయని సూచించారు. Here is a message from EAM @DrSJaishankar, as we observe the Passport Seva Divas today. #TeamMEA reaffirms its commitment to provide passport and related services to citizens in a timely, reliable, accessible, transparent and efficient manner. pic.twitter.com/k1gmaTPLKq — Arindam Bagchi (@MEAIndia) June 24, 2023 -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు. అయితే పాస్‌పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
నేడు అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్టును అధికారులకు తిరిగి ఇచ్చేశారు. ఆయనకు సాధారణ పాస్‌పోర్టును జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదంటూ శనివారం ఢిల్లీ కోర్టు తెలిపింది. ఈ మేరకు అధికారులు రాహుల్‌కు ఆదివారం ఉదయం పాస్‌పోర్టును పంపించారు. సోమవారం రాహుల్ శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్తారు. అక్కడ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ముఖ్యులను కలుసుకుంటారు. -
రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్‌పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
పాసుపోర్టులో తండ్రి పేరుపై హైకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిడ్డ జన్మించకముందే భార్యను, బిడ్డను వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ప్రత్యేక పరిస్థిత్లుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటుగా ఇంటి పేరును కూడా మార్చుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఓ తల్లి, ఆమె కొడుకు.. తండ్రి నుంచి విడిపోయి జీవిస్తున్నారు. అయితే, భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తన బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయాడని.. ఆ తర్వాత శిశువు బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి మంచి చెడ్డలు తానే చూసుకుంటున్నట్టు, పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించాలని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో తండ్రి పేరు లేకుండా కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ధర్మసనాన్ని కోరారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పు వెలువరించారు. ‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చు’ అని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
హార్ట్‌బీటే పాస్‌పోర్ట్.. ఏం కావాలన్నా క్షణాల్లో ప్రింట్ చేసుకుని తినడమే!
ఏదో పనిమీద పక్క దేశానికి వెళ్తున్నారు. చేతిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా నడిచి వెళ్లారు.అంతే చెకింగ్, ఇమిగ్రేషన్ గట్రా అన్నీ అయిపోయాయి. విమానంలో కూర్చోగానే..సీటు మీ శరీరానికి తగ్గట్టుగా మారిపోయింది. విమానం దిగి హోటల్‌కు వెళ్లగానే ఆకలేసింది.మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయగానే.. ప్రింట్ చేసి తెచ్చి ఇచ్చేశారు.. ఇదేమిటి ఏదేదో చెప్పేస్తున్నారు అనిపిస్తోందా? భవిష్యత్తులో.. అంటే 2070 నాటికిప్రయాణం ఇలానే ఉంటుందట. ఆ వివరాలేమిటో చూద్దామా.. బ్రిటన్‌కు చెందిన ‘ది ఈజీ జెట్’ సంస్థమరో 50 ఏళ్ల తర్వాత ప్రయాణాల తీరుఎలా ఉంటుంది? సెలవులను ఎలాఎంజాయ్ చేస్తామన్న అంశంపై శాస్త్రవేత్తలు,నిపుణులతో మాట్లాడి ‘ది ఈజీ జెట్ 2070 ఫ్యూచర్ ట్రావెల్’పేరిట నివేదికను విడుదల చేసింది. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిర్గిట్టె అండర్సన్, డిజైన్ సైంటిస్ట్ మెలిస్సా స్టెర్రీ, క్రాన్ఫీల్డ్ వర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం బ్రైత్వేట్లతో పాటు మరికొందరుతమ అంచనాలను వెల్లడించారు. జస్ట్ అలా నడిచివెళితే చాలు.. ప్రతి ఒక్కరి వేలిముద్ర, కంటి ఐరిస్ వేర్వేరుగా ఉన్నట్టే.. గుండె కొట్టుకునే సిగ్నేచర్ కూడా విభిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సిగ్నేచర్ డేటాను స్టోర్ చేసి.. వ్యక్తిగత గుర్తింపు, పాస్‌పోర్టుగా వాడొచ్చంటున్నారు. ఉదాహరణకు విమానాశ్రయంలోని ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లగానే.. సెన్సర్లు, కెమెరాలు, ప్రత్యేక పరికరాలు స్పందిస్తాయి. ఐరిస్ స్కాన్, ఫేషియల్ రికగ్నిషన్ (ముఖం గుర్తింపు), హార్ట్‌బీట్ సిగ్నేచర్లను గుర్తించి.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తాయి. ఇదంతా సెకన్లలోనే జరిగిపోతుంది. విమానంలో కూర్చోగానే.. ప్రయాణికులు విమానం ఎక్కి సీట్లోకూర్చోగానే.. వారి శరీరానికి తగినట్టు (సన్నగా, లావుగా, పొడవు, పొట్టి.. ఇలా) కాళ్లు గా సీటు ఆకృతి మారిపోతుంది. సీటుపై తలకు పక్కన అమర్చిన ప్రొజెక్టర్ నుంచి సరిగ్గా కళ్లకుముందు డిస్ప్లే ఏర్పడుతుంది. ఏ ఇబ్బందీ లేకుండా కావాల్సినవి వీక్షించవచ్చు. ఇల్లు–ఎయిర్పోర్ట్ టెర్మినల్– ఇల్లు ఉన్నచోటి నుంచే గాల్లోకి ఎగిరి ప్రయాణించి మళ్లీ అలాగే కిందకు దిగగలిగే (వీటీఓఎల్) ఎయిర్ ట్యాక్సీలు అంతటా అందుబాటులోకి వస్తాయి. ఇంటి దగ్గరే ఎయిర్‌ట్యాక్సీ ఎక్కి నేరుగావిమానాశ్రయం టెర్మినల్‌లో దిగడం.. ప్రయాణం చేశాక మళ్లీ టెర్మినల్ నుంచి నేరుగా ఇంటి వద్దదిగడం.. సాధారణంగా మారిపోతుంది. త్రీడీ ప్రింటెడ్ ఫుడ్.. కావాల్సినట్టు బెడ్ ♦ మనకు నచ్చిన ఆహారాన్ని కాసేపట్లోనే ఫ్రెష్‌గా ప్రింట్ చేసి ఇచ్చే ‘ఫుడ్ త్రీడీ ప్రింటింగ్’మెషీన్లు అందుబాటులోకి వస్తాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం దాకా ఏదైనా ప్రింట్ చేసుకుని తినేయడమే. ♦ హోటళ్లలో రూమ్‌లు ‘స్మార్ట్’గా మారిపోతాయి. మనం రూమ్‌కు వెళ్లే ముందే.. గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో,లోపలికి వెళ్లగానే ఏదైనా సంగీతం ప్లేకావాలో, బెడ్ ఎంత మెత్తగాఉండాలో, గీజర్‌లో నీళ్లు ఎంత వేడితో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు తగినట్టుగా అన్నీ మారిపోతాయి. ♦ మనకు కావాల్సిన మోడల్, డిజైన్, వస్త్రంతో డ్రెస్సులు కూడా త్రీడీ ప్రింటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే మనం ఇక లగేజీ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు లేనట్టే. ప్రత్యేక సూట్లతో ‘టైమ్ ట్రావెలింగ్’ హాలిడే కోసం ఏదైనా పర్యాటక ప్రాంతానికివెళ్లినప్పుడు ప్రత్యేకమైన ‘హాప్టిక్’సూట్లను వేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశాన్ని చూస్తున్న సమయంలోనే వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ ద్వారా.. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఎలా మారుతూవచ్చాయన్నది కళ్ల ముందే కనిపించే సదుపాయం వచ్చేస్తుంది. ఇతర భాషల్లో ఎవరైనా మాట్లాడుతుంటే.. అప్పటికప్పుడు మనకు కావాల్సిన భాషలోకి మార్చి వినిపించే ‘ఇన్ ఇయర్’ పరికరాలు వస్తాయి. ఎక్కడైనా,ఏ భాష వారితోనైనా సులభంగా మాట్లాడొచ్చు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
ఆ పాస్‌పోర్టుకు పవరెక్కువ
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: మన దేశం నుంచి మరోదేశం వెళ్లాలంటే.. పాస్‌పోర్టు.. వీసా.. ఈ రెండు తప్పనిసరి అని అందరికీ తెలుసు.. వీసా లేకుండా మరో దేశానికి వెళ్లే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాలు తమ విమానాశ్రయాల్లో దిగిన తర్వాత వీసా (అరైవల్ ఆన్ వీసా) మంజూరు చేస్తుంటాయి. ఇంకొన్ని సన్నిహిత, శ్రేయోభిలాష దేశాలు.. వీసా లేకపోయినా పరస్పరం తమ దేశాల ప్రజలు వచ్చిపోవడానికి అనుమతినిస్తుంటాయి. వీసాల సంగతి ఇలావుంటే.. పాస్‌పోర్టుల్లో అత్యంత శక్తివంతమైన (వెరీ పవర్ఫుల్), శక్తివంతమైన, బలహీనమైన (వీక్) పాస్‌పోర్టులు ఉండటం కొంత ఆసక్తిరేకెత్తించే అంశం. గడిచిన 20 సంవత్సరాలుగా శక్తివంతమైన పాస్‌పోర్టు అందించే దేశాల జాబితాను లండన్‌కు చెందిన అంతర్జాతీయ పౌరసత్వ, నివాస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్ట్‌నర్స్ ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే తాజా జాబితా ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో జపాన్ పాస్‌పోర్టును అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా తేల్చింది. ఈ మేరకు శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో జపాన్ ప్రథమ స్థానంలో ఉండగా, సింగపూర్, దక్షిణ కొరియాలు రెండూ రెండో స్థానంలో, జర్మనీ, స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి. ఇక అగ్రరాజ్యాలుగా పరిగణింపబడే అమెరికా, బ్రిటన్, చైనా లాంటి దేశాలు కొన్ని ఆ తర్వాతి స్థానాల్లోనే ఉండటం గమనార్హం. కాగా మనదేశం 59 దేశాలతో 85వ స్థానంలో నిలిచింది. మొత్తం 199 దేశాలు పాస్‌పోర్టులు జారీ చేస్తున్నాయి. అయితే ఒక దేశ పాస్పోర్టుతో గరిష్టంగా ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో వెళ్లొచ్చనే దానిపై ఆ పాస్ట్‌పోర్టు బలం అంటే అది ఎంత శక్తివంతమైన పాస్ట్‌పోర్టు అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్ని ఎక్కువ దేశాలకు ఇలా వెళ్లేందుకు అవకాశం ఉంటే ఆ పాస్ట్‌పోర్టు అంత శక్తివంతమైందన్న మాట. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా హెన్లీ సంస్థ పాస్‌పోర్టులకు ర్యాంకులు ప్రకటిస్తుంది. ఈసారి మొదటి స్థానంలో నిలిచిన జపాన్ పాస్పోర్టుతో గరిష్ట స్థాయిలో 193 దేశాలకు/గమ్యస్థానాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో సందర్శించేందుకు అవకాశం ఉంది. సింగపూర్, దక్షిణ కొరియా (రెండో స్థానంలో) పాస్‌పోర్టులతో 192 దేశాలు, జర్మనీ, స్పెయిన్ (మూడో స్థానంలో) పాస్‌పోర్టులతో 190 దేశాలను పై పద్ధతిలో సందర్శించే వీలుంది. ఇక ఫిన్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్ నాల్గవ స్థానంలో (189) ఉండగా, ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడెన్ (188 దేశాలు), ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే (187), బెల్జియం, చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూఎస్ఏ (186), ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్, మాల్టా (185), పోలండ్, హంగేరి (184), లుథ్వేనియా, స్లోవేకియా (183) వరసగా తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. 2014లో అమెరికా, బ్రిటన్ దేశాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాç³# ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాలు మళ్లీ ఆ స్థానాలకు చేరుకోకపోవడం గమనార్హం. కాగా 85వ ర్యాంకులో ఉన్న మన పాస్పోర్టుతో 59 దేశాలకు ఆ విధంగా వెళ్లొచ్చు. జీడీపీ తెలుస్తుంది.. జపాన్ పాస్పోర్టుతో ప్రపంచంలోని 85 శాతం దేశాలకు ఫ్రీ వీసా యాక్సెస్ ఉంది. ఈ 85 శాతం దేశాలు ప్రపంచం జీడీపీలో 98 శాతం ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. అదే నైజీరియా పాస్పోర్టుతో 46 గమ్యస్థానాలకు (20%) వీసా ఫ్రీ యాక్సెస్ ఉంటే.. వాటి ఆర్థిక సామర్థ్యం ప్రపంచ జీడీపీలో 1.5 శాతమే కావడం గమనార్హం. ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా (25 శాతం), చైనా (19 శాతం)ల వాటా ప్రపంచ జీడీపీలో 44 శాతంగా ఉంది. పెట్టుబడిదారుకు ఉపయుక్తం.. ఈ విధమైన పాస్‌పోర్టు సమాచారం అంతర్జాతీయ వ్యాపారులకు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ఈ ర్యాంకుల ఆధారంగా ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, ఇతర పరిస్థితులు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. పాస్‌పోర్టు బలానికి, ఆర్థిక శక్తి మధ్య లంకె ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. దిగువన అఫ్గానిస్తాన్.. అఫ్గానిస్తాన్ జారీ చేసే పాస్పోర్టుతో కేవలం 27 దేశాలు లేదా గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహితంగా లేదా అరైవల్ ఆన్ వీసా పద్ధతిలో వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా ఇది పాస్‌పోర్టులు జారీ చేసే 199 దేశాల్లో అట్టడుగు స్థానాన్ని ఆక్రమించింది. అఫ్గాన్‌తో పోల్చుకుంటే ఇరాక్ (29), సిరియా (30), పాకిస్తాన్ (33) కాస్త మెరుగ్గా ఉన్నాయి. -
ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
Passport Drive: డిసెంబర్ 3న ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుండటంతో డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకిలోని పీఎస్కేలు, నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో డిసెంబర్ 3వ తేదీన తత్కాల్, సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా చేసుకునేవారికి కూడా స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ ఒక్క రోజు 3,500 దరఖాస్తులను ఆయా కేంద్రాల ద్వారా సమర్పించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందులో 70 శాతం తత్కాల్, 30 శాతం సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులుంటాయని వివరించారు. బుధవారం ఉదయం నుంచి పాస్‌పోర్టు సేవా పోర్టల్, ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా, దరఖాస్తు చేసుకున్న వారు 3వ తేదీకి ప్రీపోన్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 3న ఒక రీ షెడ్యూలింగ్, ఒక ప్రీపోన్కు మాత్రమే అవకాశం ఉంటుందని.. మరో తేదీ మార్చుకునే వెసులుబాటు ఉండదని గుర్తుంచుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు. -
భారతీయులకు యూకే తీపి కబురు
-
పాస్ పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి వచ్చి ..
కాణిపాకం(చిత్తూరు): తమ పాస్‌పోర్టు సమయం అయిపోతుందని రెన్యూవల్ కోసం ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చారు. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్‌కు సమయం ఉండడంతో దైవ దర్శనానికి బయలుదేరి అనుకోని ప్రమాదంలో అత్తకోడళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మండలంలో విషాదం నింపింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన కుమారస్వామి, సుజాత భార్యాభర్తలు. వృతిరీత్యా యూ ఎస్ఏలో ఉద్యోగం చేస్తున్నారు. వారి కుమారుడు ధను. ముగ్గురి పాస్‌పోర్టులు గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఇండియాకు గత నెలలో వచ్చారు. తండ్రి, తల్లి పాస్‌పోర్టులు రెన్యూవల్ పూర్తికాగా.. కుమారుని పాస్ పోర్టు రెన్యూవల్ కాలేదు. సమయం ఉండడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, స్వర్ణలత, భార్య సుజాతతో కలసి కుమారస్వామి కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి మంగళవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. సాయంత్రం కాణిపాకం సమీపంలోని తిరువణంపల్లె సమీపంలో టైరు పేలింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ను ఢీకొంది. ఈ ప్రమాదంతో స్వర్ణలత(65), సుజాత(31)కు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ స్వర్ణలత, సుజాత మృతి చెందారు. ఎస్ఐ మనోహర్ కేసు నమోదు చేశారు. కాగా రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆర్డీఓ రేణుక పరామర్శించారు. -
మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు
మోర్తాడ్: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను తక్షణమే జారీ చేయడానికి హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల ముచ్చటగానే మిగిలాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండడంతో విచారణ, పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వారం వ్యవధిలో పీసీసీలను జారీ చేసేవారు. కరోనా భయాలు తొలగిపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. కొత్త పాస్‌పోర్టులు, రెన్యువల్‌తోపాటు పీసీసీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం పరిధిలోని ఐదు సెంటర్లలో రోజుకు ఐదు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త పాస్‌పోర్టులకు సంబంధించినవే ఉంటున్నాయి. గతంలో రోజుకు 2 వేల స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. ఈ సంఖ్యను ప్రస్తుతం ఐదు వేలకు పెంచారు. అయినా క్యూ తగ్గకపోవడంతో పీసీసీల కోసం గత నెలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆలస్యమవుతున్నాయి. పోస్టాఫీసులకు సేవలు విస్తరించినా.. గతంలో పీసీసీలు పూర్తిగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారానే జారీ చేసేవారు. తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా హెడ్ పోస్టాఫీసుల ద్వారా కొత్త పాస్‌పోర్టులకు దరఖాస్తులు స్వీకరించారు. పీసీసీలను వేగంగా జారీ చేయడం కోసం ప్రధాన తపాలా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించేందుకు సెప్టెంబర్ చివరివారంలో అవకాశం ఇచ్చారు. పోస్టాఫీసులకు సేవలను విస్తరించడం వల్ల పీసీసీల జారీ సులభతరం అవుతుందని భావించారు. అయితే ఈ కార్యాలయాల్లోనూ రద్దీ పెరిగింది. పీసీసీల స్లాట్ బుకింగ్‌కే మూడు వారాల సమయం పడుతోంది. పీసీసీల జారీకి నెల రోజులకంటే ఎక్కువ సమయం పడుతోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తి అవుతుండగా పోస్టాఫీసుల్లో కోసం దరఖాస్తు చేసుకున్నవారి విచారణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీల జారీ కోసం విదేశాంగ శాఖ వేగవంతమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (క్లిక్: ముగిసిన జోసా కౌన్సెలింగ్.. ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ) -
Telangana: పాస్‌పోర్టు కావాలా.. ఇప్పుడంత ఈజీగా రాదండోయ్!
కొత్తగా పాస్‌పోర్టు కావాలా.. అలాగైతే కనీసం నెల పదిహేను రోజులు ఓపిక పట్టాల్సిందే. గతంలో వారం పది రోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందితే, ఇప్పుడు 45 రోజుల సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నిస్తే.. కరోనా ప్రభావం అంటున్నారు ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు. ప్రస్తుతం కరోనా నుంచి అంతా తేరుకున్నా, గతంలో లాక్డౌన్లతో పాస్‌పోర్టుల జారీకి బ్రేక్ పడింది. అప్పుడు ఏర్పడిన ప్రతిష్టంభన ప్రస్తుతం పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని టోలిచౌకి, బేగంపేట్, అమీర్‌పేట్‌లతో పాటు నిజామాబాద్, కరీంనగర్‌లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు రోజుకు ఐదు వేలకు మించి పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలించడం లేదు. కొంతకాలం కిందట రోజుకు రెండున్నర వేల దరఖాస్తులనే పరిశీలించారు. ఇప్పుడు పరిశీలించే దరఖాస్తుల సంఖ్యను రెట్టింపు చేసినా అత్యవసరంగా పాస్‌పోర్టు అవసరం ఉన్నవారికి స్లాట్ బుకింగ్ చేసుకున్న నాటి నుంచి నెల వరకు దరఖాస్తుల పరిశీలనకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో పదిరోజుల్లోనే.. గతంలో ఒక రోజు స్లాట్ బుక్ చేసుకుంటే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి మరుసటిరోజు వెళ్లి సర్టిఫికెట్లను చూపించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్పెషల్ బ్రాంచి అధికారులు విచారణ పూర్తి చేసి వారం, పది రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టును పోస్టు ద్వారా ఇంటికి చేరవేసేవారు. ప్రస్తుత పరిస్థితిలో మాత్రం స్లాట్ బుకింగ్‌కు నెల రోజుల వరకు వేచిచూడాల్సి వస్తోంది. నిర్ణీత తేదీన అభ్యర్థి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్లను చూపితే పక్షం రోజుల్లో పాస్‌పోర్టును చేతికి అందిస్తున్నారు. కరోనా తర్వాత విదేశాల్లో ఉపాధి, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజుకు పదివేల మంది వరకు స్లాట్ బుకింగ్ కోసం విదేశాంగ శాఖ వెబ్సైట్లో ప్రయత్నిస్తున్నారు. కాగా, పాస్‌పోర్టుల జారీ లక్ష్యం ఐదు వేలే ఉండటంతో స్లాట్ బుకింగ్‌కు ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న రద్దీ ప్రకారం మరో నాలుగైదు నెలల పాటు పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ అధికారులు స్పందించి అత్యవసరం ఉన్నవారికి పాస్‌పోర్టుల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను పెంచాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
పాస్‌పోర్టు కోసం అప్లై చేసేవాళ్లకి సూపర్ గుడ్ న్యూస్
-
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త
పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు వారి ఇంటి అడ్రస్ ప్రకారం..స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, టెంపరరీ వీసా, పర్మినెంట్ రెసిడెన్షియల్ (పీఆర్) లేదా విదేశాలకు ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ అవసరం. ఇంతకు ముందు, విదేశాల్లో నివసించే వారి విషయంలో ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ లేదా, ఇండియన్ ఎంబసీ/హైకమిషన్ కార్యాలయంలో ఆన్లైన్లో పీసీసీ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద పీసీసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ధరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకుముందు పీసీసీ అపాయింట్మెంట్ స్లాట్ల లభ్యతను కూడా మెరుగుపరుస్తామని ప్రకటన చేయగా.. తాజాగా పీసీసీపై ప్రకటన చేయడం పట్ల పాస్‌పోర్ట్ ధర ఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 428 పీసీసీ కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖల చొరవతో పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందనున్నాయి.కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. -
పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు నిరుద్యోగ యువత రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని సూచించారు. తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని వెల్లడించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మేరకు కేఏ పాల్ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు. -
లాలు యాదవ్‌కు ఊరట....అనుకూలంగా కోర్టు ఆదేశాలు
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు వేర్వేరు కేసుల్లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కొంత ఊరట లభించింది. లాలు సెప్టంబర్13న పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని కోరతూ కోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఐతే సెంట్రల్ బ్యూర్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక కోర్టు ఆయనకు అనుకూలంగా పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడూ పాస్‌పోర్ట్ వెనక్కి తీసుకోవాలంటే యాదవ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యాదవ్ తరుఫు న్యాయవాది ప్రభాత కుమార్ అన్నారు. ఇదిలా ఉండగా సింగపూర్ వైద్యుడు సెప్టెంబర్24న లాలు యాదవ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐతే ఆయన ఆ తేదికి ముందుగానే సింగపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకు త్వరితగతిన పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాదు రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండేలా కూడా పాస్‌పోర్ట్ జారీ చేయాలని న్యాయవాది అభ్యర్థించారు. లాలు దరఖాస్తును విచారించిన కోర్టు...అతడికి పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 1996 దాణా కుంభకోణం కేసులో 900 కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనికి సంబందించి మొత్తం ఆరు కేసులు లాలుపై ఉన్నాయి. అందులో ఒక కేసులో లాలుకు 2013లో ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదిలా ఉండగా లాలు దాణా కుంభకోణానిక సంబంధించి అన్ని కేసులను విచారించాలని లాలు కోర్టుకి విజ్క్షప్తి కూడా చేసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రతికేసు విచారణను విడివిడిగా నిర్వహించాలని ఆదేశించింది. (చదవండి: మోదీకి ఇంతకు గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు) -
బ్రిటన్ పాస్‌పోర్టులు చెల్లుతాయా? ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్‌పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్‌పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కలి్పంచాలి’’అని రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు రాణి మరణం నేపథ్యంలో తమ పాస్‌పోర్టులు ఇంకా చెల్లుతాయా లేక వాటిని మార్చుకోవాలా? అని బ్రిటన్‌కు చెందిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పాస్‌పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. గడువు ముగిసిన పాస్‌పోర్టులను పునరుద్ధరించుకొనేటప్పుడు రాజు చార్లెస్–3 పేరును అందులో చేరుస్తామని అధికార వర్గాలు ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాణి ఎలిజబెత్–2కు మాత్రం పాస్‌పోర్టు లేదు. ఎందుకంటే.. తన పేరిటే పాస్‌పోర్టులు జారీ అవుతున్నందున తాను కూడా పాస్‌పోర్టు కలిగి ఉండటం అర్థరహితమని ఎలిజబెత్–2 భావించారట. అయితే ఆమె మినహా బ్రిటన్ రాజకుటుంబంలోని ప్రతి ఒక్కరికీ.. అంటే దివంగత భర్త ప్రిన్స్ ఫిలిప్ సహా అందరికీ పాస్‌పోర్టు ఉండేది. ఆమె మరణం నేపథ్యంలో పాస్‌పోర్టులనే కాదు.. దేశ కరెన్సీ, స్టాంపులపై ‘రాణి’అనే పదం బదులు రాజు అనే పదాన్ని చేర్చాల్సి ఉంది. అలాగే యూకే జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద క్వీన్’ను ‘గాడ్ సేవ్ ద కింగ్’గా మార్చాల్సి ఉంది. చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం -
పాస్‌పోర్టు వినియోగించినంత మాత్రాన జర్మనీ పౌరుడు కాలేడు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తమ దేశ పౌరుడు కాలేరని లిఖితపూర్వకంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని ఆయన తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు నివేదించారు. చెన్నమనేని నిబంధనలకు అనుగుణంగా 2009లో భారత పౌరసత్వం పొందారని, రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓటమి కావడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. చెన్నమనేని రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేములవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నమనేని తరఫున వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. భారత పౌరసత్వం ఇచ్చిన 30 రోజుల్లో అతని పౌరసత్వంపై అభ్యంతరాలు తెలిపాలని నిబంధన ఉందన్నారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత(120 రోజుల) ప్రత్యర్థి అభ్యంతరం తెలుపడం.. హోంశాఖ దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. భారత పౌరసత్వం తీసుకున్న నాటికి రమేశ్ రాజకీయాల్లో లేరని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి(ఆగస్టు 24) వాయిదా వేసింది. -
పాస్‌పోర్టు బ్లాక్.. ఫిలిప్పీన్స్‌లో హైదరాబాద్ యువతి తిప్పలు
ఫిలిప్పీన్స్‌లో నవ్య అనే తెలుగు యువతి తిప్పలు పడుతోంది. మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పాస్‌పోర్ట్ బ్లాక్ అయ్యిందని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్యదీప్తి పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ను కావాలనే బ్లాక్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనిల్లా ప్రాంతంలో నవ్య 2 ఏళ్ళుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. కోవిడ్ టైంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని..డబ్బులు కట్టనందుకు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపారు. కాగా మెడిసిన్ కోసం నవ్య మూడేళ్లేగా ఫిలిప్పీన్స్‌లో ఉంటోంది. కోవిడ్ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కపడటంతో తిరిగి ఫిలిపిన్స్‌కు బయలు దేధారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సింగపూర్ ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్న ఆమెను.. తిరిగి ఇండియా వెళ్ళేవారకు లగేజ్ ఇవ్వమని తెలిపారు. -
పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు!
ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం చాల మారిపోయింది. కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న దేశాలకు కూడా విద్య, వ్యాపారరీత్యా వెళ్లాల్సి రావడం షరా మామూలైంది. అయితే మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి(వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతరు దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది. తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ 87వ స్థానం దక్కించుకుంది. దీని ప్రకారం భారతీయులు వీసా అవసరం లేకుండా 60 దేశాలకు ప్రయాణించే వెసలుబాటు ఉంది. ఈ జాబితాలో.. జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. జపాన్ పౌరులు వీసా లేకుండా 193 దేశాలు చుట్టేయవచ్చు. రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమాచారం ఆధారంగా హెన్లీ ఆండ్ పార్టనర్స్ పరిశోధకుల బృందం ప్రతి ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
ప్రియురాలితో భర్త మాల్దీవ్ ట్రిప్.. సడెన్‌గా భార్య ఫోన్ చేయడంతో
మాల్దీవులు.. ఏంటో ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఏ జంటను చూసిన ఎంచక్కా మాల్దీవులకు చెక్కేస్తున్నారు. హాలీడే వెకేషన్ స్పాట్‌గా ఈ పేరు తెగ మార్మోగుతోంది. కరోనాతో రెండేళ్లపాటు ఇళ్లలోనే ఉండి విసుగెత్తిన ప్రజలు హాయిగా సేదతీరేందుకు మాల్దీవుల బాట పడుతున్నారు. పాపం ఇలాగే ఆలోచించి.. పెళ్లైన ఓ వ్యక్తి కూడా ఎంజాయ్మెంట్ కోసం మాల్దీవులకు వెళ్లాడు. వెళ్తే వెళ్లనీ అందులో పెద్ద విషయం ఏముంది అనుకుంటాన్నారా.. అయితే అతను వెళ్లింది తన భార్యతో కాదండీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ప్రియురాలితో. అంతేగాక తొందరపాటులో చేసిన పొరపాటు అతన్ని జైలుపాలు చేసింది. ముంబైకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన భార్య ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్లింది. దీంతో ఇదే సువర్ణావకాశంగా భావించిన వ్యక్తి తనప్రియురాలితో మాల్దివులకు వెళ్లి రిలాక్స్ అవుదామనుకున్నాడు. అనుకున్నట్లు భార్య అలా ఫారిన్ ట్రిప్ వెళ్లిందో లేదో ఇటు ఇతను తన ప్రేయసితో హాలీడ్ ట్రిప్‌కు చెక్కేశాడు. అక్కడా ఇద్దరు జాలీగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే భర్త తన కాల్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అతనిపై భార్య అనుమానం పెంచుకుంది. భర్తకు పలుమార్లు వాట్సాప్ కాల్ చేసింది. భార్య ఫోన్ చేస్తుండటంతో ఖంగుతున్న భర్త తన వెకేషన్‌కు స్వస్తీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే మాల్దీవులకు వెళ్లిన విషయం భార్యకు తెలిస్తే చంపేస్తుందని భయపడి ఓ తింగరిపని చేశాడు. చదవండి: పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి.. పాస్‌పోర్టులోని కొన్ని పేజీలను చింపేసి అక్కడి నుంచి ఇండియాకు పయనమయ్యాడు. అయితే గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగా ఇమిగ్రేషన్ అధికారులు అతని పాస్‌పోర్టును తనిఖీ చేశారు. అందులో 3-6, 31-34 పేజీలు కనిపించకపోవడాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గమనించారు. దాని గురించి ప్రశ్నించగా ఏవోవే సమాధానాలు చెప్పడంతో చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై అతన్ని అధికారులు అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తన ప్రియురాలో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని తన భార్యకు తెలియకుండా రహస్యంగా ఉంచేందుకు పాస్‌పోర్ట్ పేజీలను చింపివేశానని కూడా తెలిపాడు. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను ఏ విధంగానూ పాడు చేయడం నేరపూరిత చర్య అని పోలీసులు తెలిపారు. -
చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా!
ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్‌పోర్ట్‌ను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొని రానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పాస్ పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. 2008లో తొలిసారి కేంద్రం పాస్‌పోర్ట్ సేవల్ని ఆన్లైన్లో అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 2వ సారి టీసీఎస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ- పాస్‌పోర్ట్ సేవల్ని అందించనుంది. ఇమ్మిగ్రేషన్ అంటే? ఇమ్మిగ్రేషన్ అంటే ఉదాహరణకు భారత్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో శాస్వతంగా ఉండేందుకు,లేదంటే పౌరసత్వం పొందేందుకు ఆ దేశ అనుమతి తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అనుమతి కోసం జరిగే ప్రాసెస్‌ను ఇమ్మిగ్రేషన్ అంటారు. ఈ ఇమ్మిగ్రేషన్ కోసం కేంద్రం,టీసీఎస్‌లు సంయుక్తంగా ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌పోర్ట్‌పై టీసీఎస్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ యూనిట్ విభాగం ప్రతినిధి తేజ్ బట్లా స్పందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డిసెంబర్ నాటికే వినియోగదారులకు ఈ-పాస్‌పోర్ట్‌లను అందించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్ట్‌లను చిప్‌లతో ఆధునీకరించనున్నట్లు తేజ్బట్లా వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. పలు నివేదికల ప్రకారం..ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో జరిగే అవకతవకల్ని అరికట్టేందుకు ఇంట్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐడీఏఓ) సెక్యూర్ బయోమెట్రిక్ డేటాతో ఈ-పాస్ పోర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో దేశానికి ఒక్కో డిజిటల్ సిగ్నేచర్‌తో ఉన్న ఈ చిప్‌లలో పాస్‌పోర్ట్ వినియోగదారుల బయోగ్రఫికల్ డేటాతో పాటు డిజిటల్ సెక్యూరిటీ ఫీచర్ల డేటా ఉంటుంది. ఆ డేటా సాయంతో ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తే లోపాల్ని అరికట్టవచ్చు. సెమీకండక్టర్ చిప్ సమస్య కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సెమీకండక్టర్ చిప్ తయారీ తగ్గిపోయింది. దీంతో అన్నీ డివైజ్‌లలో ఉపయోగించే చిప్ కొరత ఆయా సంస్థల్ని తీవ్రంగా వేదిస్తోంది. కానీ ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ముందుగానే కావాల్సిన చిప్‌లను సిద్ధంగా ఉంచుకుందని తేజ్ బట్లా తెలిపారు. రెండు డేటా సెంటర్లు ఈ-పాస్‌పోర్ట్ వినియోగదారుల డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్ల అవసరం ఎక్కువగా ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న డేటా సెంటర్లను ఆదునీకరించనున్నట్లు వెల్లడించారు. టీసీఎస్ లక్ష్యం అదే ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్న టీసీఎస్ వినియోగదారులకు అందించే సేవల్ని మరింత సులభతరం చేయనుంది. చాట్ బోట్, బయోమెట్రిక్‌తో ఆటో రెస్పాన్స్ వంటి ఫీచర్లను ఈ ఈ-పాస్ పోర్ట్‌కు జత చేయనుంది. -
గంట వ్యవధిలో పాస్‌పోర్ట్!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల కల్పనలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలికకు తప్ప నిసరి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కేంద్రం అధికారులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన కార్యా లయ అధికారులు అక్కడికక్కడే దరఖాస్తును ప్రాసెస్ చేసి తదుపరి చర్యలు తీసు కుని కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం ఫలితం గానే గంటలో పాస్‌పోర్ట్ జారీ చేసి బాధితురాలికి అందించినట్లు చెప్పారు. -
పాస్‌పోర్టు.. నెలలకొద్దీ లేటు!
సాక్షి, హైదరాబాద్: ఏదో అత్యవసరమై విదేశాలకు వెళ్లాలి.. అందుకు పాస్‌పోర్టు కావాలి.. దరఖాస్తు చేసుకుందామనుకుంటే నెలా నెలన్నర దాకా స్లాట్‌కే దిక్కులేదు. స్లాట్ దొరికి పాస్‌పోర్టు కేంద్రంలో హాజరైనా.. ప్రక్రియ ముగిసి పాస్‌పోర్టు చేతికి వచ్చేదాకా మరింత ఆలస్యం. కరోనా సమయంలో ఇండియాకు తిరిగి వచ్చిన ఉద్యోగులు, విదేశాల్లో చదువుకోసం వెళ్లాల్సిన విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులను చూసుకునేందుకు వెళదామనుకున్నవారు.. ఇలా ఎందరో దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమయం చిక్కిందికదా అని విహారయాత్రకు వెళ్దామనుకునే వారికి కూడా వీసాలు దొరికినా.. పాస్‌పోర్టు కోసం స్లాట్లు దొరకని పరిస్థితి. కోవిడ్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు పాస్‌పోర్టు కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదని.. ఇప్పుడు పరిస్థితి చక్కబడటంతో భారీగా దరఖాస్తు చేసుకుంటుండటమే ఇబ్బందికి కారణమని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయవర్గాలు చెప్తున్నాయి. తత్కాల్ నెల.. సాధారణం నెలన్నర.. ఉమ్మడి రాష్ట్రంలో పాస్‌పోర్టు కోసం రెండు, మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పాటయ్యాక వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందింది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. అసలు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి, స్లాట్ కోసమే నెలా నెలన్నర రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో స్లాట్ కేటాయిస్తున్నారు. దీనివల్ల సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అనుకున్న సమయంలో వెళ్లాల్సిన ప్రదేశాలకు, హాజరుకావాల్సిన కార్యక్రమాలకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక తత్కాల్ విధానంలో, రెన్యువల్ కోటా కింద పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే.. నెల రోజుల తర్వాత స్లాట్ కేటాయిస్తున్నారు. దీనివల్ల వీసా ఉండి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సినవాళ్లు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసరంగా కావాల్సినవారు నానా ఇబ్బందులు పడి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఎంపీలు, మంత్రులు, ఇతర వీవీఐల సిఫార్సు లేఖల ద్వారా వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు స్లాట్‌ను పొందగలుతున్నారు. కరోనా ప్రభావంతోనే..! పాస్‌పోర్టు స్లాట్ కేటాయింపుల సమయం నెలన్నర వరకు ఉండటానికి ప్రధాన కారణం కరోనా ప్రభావమేనని పాస్‌పోర్టు కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. రెండేళ్ల పాటు కరోనా ప్రభావం వల్ల దరఖాస్తులు పెద్దగా రాలేదని.. రెన్యువల్ కోసమూ దరఖాస్తులు అందలేదని అంటున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా అంతా దరఖాస్తు చేసుకుంటుండటంతో రద్దీ పెరిగిందని, రోజూ వందల స్లాట్లు ఇస్తున్నా సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, విదేశాలు మళ్లీ గేట్లు ఓపెన్ చేయడంతో ఒకేసారి రద్దీ పెరిగిందని వెల్లడిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాల వారీగా ప్రతిరోజు కేటాయిస్తున్న స్లాట్లు సరిపోవడం లేదని పాస్‌పోర్టు ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా సేవా కేంద్రాల వారీగా స్లాట్ల వివరాలు పరిశీలిస్తే.. రెండు రోజుల్లో ఎస్బీ విచారణ గతంలో పాస్‌పోర్టు జారీకి సంబంధించి పోలీసుశాఖ స్పెషల్ బ్రాంచ్ విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్బీ విచారణ రెండు, మూడు రోజుల్లోనే పూర్తవుతోంది. వారం, పది రోజుల్లోగా దరఖాస్తుదారుడి చేతికి పాస్‌పోర్టు అందేది. ఇప్పుడు కూడా ఎస్బీ విచారణ త్వరగా పూర్తవుతున్నా.. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అరకొర సిబ్బందితో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను క్లియర్ చేయడం కష్టమవుతోందని, సిబ్బంది సంఖ్య పెరిగితే త్వరగా ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఫోన్లు పనిచేయడమే లేదు.. పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో సమస్యలు, కారణాలపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రతినిధులు రీజనల్ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో)ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ వెబ్సైట్లో ఉన్న రెండు ల్యాండ్ లైన్ నంబర్లలో సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆ నంబర్లు పనిచేయడం లేదని సమాధానం వచ్చింది. దరఖాస్తుదారులు కూడా ఈ తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్ కోసం నెల నుంచి ప్రయత్నిస్తున్నా.. నేను యూఎస్ వెళ్లాల్సి ఉంది. నాకు వీసా ఉంది. కానీ పాస్‌పోర్టు వ్యాలిడిటీ జూలైతో ముగుస్తోంది. ట్రావెల్ చేయాలంటే పాస్‌పోర్టు వ్యాలిడిటీ ఆరు నెలలకు తక్కువ కాకుండా ఉండాలి. రెన్యూవల్ కోసం ఏప్రిల్ తొలివారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. జూన్ñ మధ్యవారంలో స్లాట్ ఇచ్చారు. స్లాట్ కోసమే రెండున్నర నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. – మహ్మద్ అబ్దుల్, హైదరాబాద్ కరోనా సమయంలో వచ్చా.. వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. నేను కరోనా సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి వచ్చాను. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండటంతో ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్లీ వెళ్లాలి. పాస్‌పోర్టు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. తత్కాల్లో రెన్యూవల్‌కు మే మొదటి వారంలో దరఖాస్తు చేశా.. జూలై మొదటి వారంలో స్లాట్ ఇచ్చారు. నేను ఈ నెలలోనే వెళ్లాల్సి ఉంది. – సత్య, ఈసీఐఎల్, హైదరాబాద్ -
Ukraine War: ఊహించని చర్యలకు దిగిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై జరుపుతున్న మిలిటరీ చర్యలో ఊహించని చర్యలకు దిగాడు. ఇప్పటికే పశ్చిమ ప్రాంతం ఖేర్సన్, ఆగ్నేయ ప్రాతం జాపోరిజ్జియా(జేఫోరిషియ)లను రష్యా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని పౌరులకు రష్యా పౌరసత్వం కట్టబెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా పూర్తి స్వాధీనంలో ఉన్న ఖేర్సన్, కొంతభాగం మాత్రమే రష్యా బలగాల ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాలో ఉక్రెయిన్ పౌరులకు.. రష్యా పౌరసత్వం ఇచ్చేలా ఆదేశాలపై బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకాలు చేశాడు. ఇందుకోసం రష్యా సిటిజన్‌షిప్, పాస్‌పోర్ట్ చట్టాల సవరణలకు పచ్చజెండా ఊపాడు. తద్వారా మూడు నెలల లోపే దరఖాస్తుదారులకు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్టులు దక్కనున్నాయి. మరోవైపు ఆదేశాలు వెలువడ్డ కాసేపటికే.. అక్కడి ఉక్రెయిన్ పౌరులకు పౌరసత్వం ఇచ్చే చర్యలు ఆఘమేఘాల మీద మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మాస్కో, మాస్కో అనుకూల అధికారులు ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు రష్యా పరిధిలోకి వస్తాయని ప్రకటించడం గమనార్హం. అయితే కీవ్ వర్గాలు మాత్రం పుతిన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇది ఉక్రెయిన్ సరిహద్దు సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశమని వాదిస్తున్నాయి. అక్రమంగా రష్యా పౌరసత్వాన్ని, పాస్‌పోర్టులు కట్టబెట్టడాన్ని ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవత్వ చట్టాలను ఉల్లంఘించడమేనని, పాశ్చాత్య దేశాలు ఈ చర్యను ఖండించాలని పిలుపు ఇచ్చింది. ఒకవైపు ఇందులో బలవంతం ఏం లేదని ఖేర్సన్ రీజియన్ అధికారులు(రష్యా) చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. సోమవారం ఖేర్సన్,జాపోరిజ్జియా అధికారులు.. ఉక్రెయిన్ హ్రివ్నియాతో పాటు రూబుల్‌ను(రష్యా కరెన్సీ) కూడా అధికారిక కరెన్సీపై ప్రకటించారు. ఇంతకుముందు రష్యా నుంచి స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించబడ్డ ఉక్రెయిన్ డోనేత్సక్, లుగాన్స్క్ ప్రాంతాల్లోని అనేక లక్షల మంది నివాసితులు ఇప్పటికే రష్యన్ పాస్‌పోర్ట్‌లను అందుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ యుద్ధానికి మూణ్నెల్లు -
ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ?
ఎమిగ్రేషన్ యాక్టు-1983 ప్రకారం భారత ప్రభుత్వం 18 దేశాలను ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ - విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి అనుమతి అవసరమైన) క్యాటగిరీ గా నోటిఫై చేసింది. వీటిని స్పెసిఫైడ్, నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ అని కూడా అంటారు. ఆ 18 దేశాలు ఈ పద్దెనిమిది దేశాలలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కి చెందిన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అవి బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యూఏఈ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా,.మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ దేశాలున్నాయి. ఈసీఆర్ పాస్ పోర్ట్ ఎందుకు? ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ పాస్‌పోర్టునే సింపుల్‌గా ఈసీఆర్ పాస్‌పోర్టు అంటున్నారు. దీని ప్రకారం నోటిఫై చేసిన 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అంటే ఈ పాస్‌పోర్టు కింద విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి విదార్హత, సామాజిక అంశాలపై పట్టు, లోకజ్ఞానం తక్కువ ఉన్నాయని అర్థం. వీరు అమాయకులు, బలహీనులుగా ఉన్నందున ఈ 18 ఈసీఆర్ దేశాలలోని కార్మిక చట్టాలు, వివిధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని... వల్నరబుల్ (హాని పొందడానికి అవకాశం వున్న) భారత పౌరుల రక్షణ, సంక్షేమం కొరకు భారత ప్రభుత్వం ఈసీఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తక్కువ నైపుణ్యం కలిగి, శారీరిక శ్రమ చేసే విదేశాలలోని భారతీయ కార్మికులను (బ్లూ కాలర్ వర్కర్స్) రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. క్లియరెన్స్.. ప్రయోజనాలు ఈసీఆర్ పాస్ పోర్ట్ కలిగిన కార్మికులు ఈ 18 ఈసీఆర్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు... లైసెన్స్ కలిగిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని పీఓఈ (ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ - వలసదారుల సంరక్షులు) కార్యాలయం ద్వారా ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. వలస కార్మికునికి సంబంధించిన పాస్ పోర్ట్, యాజమాన్య కంపెనీ, రిక్రూటింగ్ ఏజెన్సీ, జీతం అగ్రిమెంట్ తదితర వివరాలు ఈ-మైగ్రేట్ సిస్టం లో నమోదు అవుతాయి. ఈసీఆర్ పాస్ పోర్టు కలిగినవారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీని 'మాండేటరీ' (చట్టబద్దంగా తప్పనిసరిగా) జారీ చేస్తారు. రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు. ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ అంటే... ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్. విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు.. అని అర్థం. 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా విదేశాల్లో మూడేళ్ళ అనుభవం ఉన్నవారికి లేదా ఆదాయపు పన్ను (ఐటి) చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఈసీఎన్నార్ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అనగా వీరు తెలివైనవారు, లోకజ్ఞానం కలిగినవారు, ఏదైనా కష్టం వస్తే తమను తాము రక్షించుకోగల సామర్థ్యం ఉన్నవారు అని అర్థం. వీరు కూడా ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు. వీరికి అక్కర్లేదు ఎలాంటి పాస్ పోర్ట్ కలిగిన వారయినా... విజిట్ సీసా, టూరిస్టు వీసాలపై.. ఉద్యోగానికి కాకుండా విహారయాత్రలకు, వైద్యం లాంటి ఇతర అవసరాలకు ఈ 18 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. రాను పోను విమాన ప్రయాణ టిక్కెట్టు, విజిట్, టూరిస్ట్ వీసా ఉంటే సరిపోతుంది. - మంద భీంరెడ్డి, వలస వ్యవహారాల విశ్లేషకులు (+91 98494 22622) చదవండి: వలస కార్మికుల ఆశలు ఆవిరి -
11 ఏళ్ల బాలుడు ఒంటరిగా వెయ్యి కి.మీ పయనించాడు! ఎందుకో తెలుసా
11-Year-Old Ukraine Boy Travels: రష్యా ఉక్రెయిన్‌పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. దీంతో వేలాది మంది పొరుగు దేశాలకు పారిపోయి తలదాచుకున్నవారు కొందరు. మరి కొంతమంది బంకర్లలో తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే గత వారం రష్యా దళాలు ఆగ్నేయ ఉక్రెయిన్‌లో జాపోరిజ్జియాను స్వాధీనం చేకున్నారు. అదే నగరానికి చెందిన ఒక ఉక్రెయిన్ కుటుంబం రష్యా దాడి నుంచి తప్పించుకునేందుకు తమ కొడుకుని స్లోవేకియాలోని తమ బంధువుల వద్దకు రైలులో ఒంటరిగా పంపించింది. అంతేకాదు ఆ బాలుడు తన బంధువులను చేరుకునేలా అతని తల్లి చేతిపై ఒక ఫోన్ నెంబర్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, చిన్న కాగితం ముక్క, పాస్‌పోర్ట్ ఇచ్చి పంపించింది. అయితే ఆ బాలుడు ఒంటరిగా సుమారు వెయ్యి కి.మీ పయనించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ మేరకు సరిహద్దులోని అధికారులు ఆ బాలుడు స్లోవేకియాకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఉన్న మడతపెట్టిన కాగితం ముక్కతో రాజధాని బ్రాటిస్లావాలోని అతని బంధువులను సంప్రదించి ఆ బాలుడిని అప్పగించారు. అంతేకాదు ఆ బాలుడి తల్లి అతనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు స్లోవాక్ ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం కూడా పంపింది. ఆ బాలుడు తన చిరునవ్వు, నిర్భయత, ధృఢ సంకల్పంతో అధికారుల మనసులను గెలుచుకున్నాడు. అంతేగాదు స్లోవేకియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆ బాలుడిని "ది బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్" అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. ఆ బాలుడి కుటుంబంలోని ఒక బంధువుకి అనారోగ్యంతో ఉండటంతో అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో వారు తమ కొడుకును ఒంటరిగా స్లోవేకియాకు పంపిచారు. (చదవండి: పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!) -
పాత పాస్‌పోర్ట్‌లకు కాలం చెల్లు - బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్
పాస్‌పోర్ట్ విధానంలో సరికొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పాత కాలం నాటి పేపర్ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే చిప్ ఆధారిత పాస్‌పోర్టును జారీ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాలు చిప్ ఆధారిత పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటిని క్యారీ చేయడం తేలిక అదే విధంగా ట్యాంపర్ చేయడం కష్టం. మన్నిక, భద్రత విషయంలో చిప్ పాస్‌పోర్టులు సాధారణ పాస్‌పోర్టు కంటే ఎంతో మెరుగు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
ఇక అక్రమార్కులకు చెక్.. మరింత భద్రంగా పాస్‌పోర్టు!
కొన్ని సినిమాల్లో చూపించినట్లు కొందరు అక్రమార్కుల నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి వాటిని అసాంఘీక కార్యకలాపాలకు వాడుతుంటారు. దీనివల్ల, నిజమైన పాస్‌పోర్టు గల వ్యక్తులు కొన్నిసార్లు చిక్కుల్లో చిక్కుకొని శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అయితే, ఇక అలాంటి అక్రమార్కుల ఆటలు సాగవు. భవిష్యత్‌లో నకిలీ పాస్‌పోర్టులు అనే మాట రాకుండా ఉండటానికి కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. త్వరలో భారతీయ పౌరులు చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టులను పొందనున్నారు. బయోమెట్రిక్ డేటా సురక్షితం ఈ-పాస్‌పోర్టుల అక్రమార్కుల ఆటలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్టుల వద్ద తనికి ప్రక్రియ వేగంగా జరగనుంది. ఈ-పాస్‌పోర్టులకు సంబంధించిన సమాచారాన్ని ఎంఈఏ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య జనవరి 5న ట్వీట్ వేదికగా పేర్కొన్నారు. "పౌరుల కోసం భారతదేశం త్వరలో తర్వాతి తరం ఈ-పాస్‌పోర్టులను ప్రవేశపెట్టనుంది. ఇవి బయోమెట్రిక్ డేటాను సురక్షితం చేస్తాయి. వీటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్టుల వద్ద తనికి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వీటిని నాసిక్ ఇండియా సెక్యూరిటీ ప్రెస్'లో తయారు చేస్తారు" అని భట్టాచార్య ట్వీట్ చేశారు. ఈ-పాస్‌పోర్టులు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన చెప్పారు. India 🇮🇳 to soon introduce next-gen #ePassport for citizens - secure #biometric data - smooth passage through #immigration posts globally - @icao compliant - produced at India Security Press, Nashik - #eGovernance @passportsevamea @MEAIndia #AzadiKaAmritMahotsav pic.twitter.com/tmMjhvvb9W — Sanjay Bhattacharyya (@SecySanjay) January 5, 2022 చిప్‌ను ట్యాంపర్ చేస్తే.. "పౌరులకు అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన చిప్-ఎనేబుల్డ్ ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తుంది. దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో పొందుపరుస్తారు. ఈ పాస్‌పోర్టులో ఉన్న చిప్‌లో వివరాలను నిల్వ చేస్తారు. ఒకవేళ ఎవరైనా చిప్‌ను ట్యాంపర్ చేసినట్లయితే, సదురు మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సిస్టమ్ దానిని గుర్తించగలుగుతుంది. ఫలితంగా పాస్‌పోర్టు ఉన్న ప్రయాణాల డేటా భద్రంగా ఉంటుంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది మార్చిలో రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. భారతదేశంలో ఉన్న 36 పాస్‌పోర్టు కార్యాలయాలు ఈ-పాస్‌పోర్టులను జారీ చేయనున్నాయి. (చదవండి: జియో బంపర్ ఆఫర్, ఇక యూజర్లకు పండగే!) -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్..
సాక్షి, హైదరాబద్: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల లోపు పాస్‌పోర్టు గడువు ముగిసిపోతున్నట్లయితే దాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మైనర్ పాస్‌పోర్టులు 5 ఏళ్ల గడువుకే అందిస్తామని తల్లిదండ్రులతో పాటు మైనర్లు ప్రయాణం చేస్తున్నట్లయితే వారి పాస్‌పోర్టులు ఒక సారి చూసుకోవాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు జంబో పాస్‌పోర్టు ఎంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్ను 3సార్లు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల కోసం 1800258 1800,040–277715333,040–27715115 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. చదవండి: పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే! -
పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది
తిరువనంతపురం: ఇ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ పెరిగిన తర్వాత కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. డెలివరీ వచ్చాకా దానిలో మన ఆర్డర్‌కు సంబంధం లేని వేరే ఏదో వస్తువు వస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. విమ్ సబ్బులు వచ్చిన వార్త చదివాం. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్ కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చాక అందులో ఉన్న దాన్ని చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా జడుసుకున్నంత పని చేశాడు. అంతలా భయపెట్టేది ఏముందబ్బా అంటే.. పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆవివరాలు.. (చదవండి: చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..) కేరళ వయనాడుకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి 2021, అక్టోబర్ 1న అమెజాన్‌లో పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ నవంబర్ 1న దాన్ని సదరు వ్యక్తి ఆర్డర్‌ని డెలివరీ చేశాడు. బాక్స్ ఒపెన్ చూసి చూడగా.. అతడికి అందులో పాస్‌పోర్ట్ కవర్‌తో పాటు ఒరిజనల్ పాస్‌పోర్ట్ కూడా కనిపించింది. అది చూసి అతడు షాక్ అయ్యాడు. ఇక ఆ పాస్‌పోర్ట్ కేరళ త్రిస్సూర్‌కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తికి సంబంధించింది. (చదవండి: ఓవైపు ఎల్ఎల్బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్!!) వెంటనే మిథున్ బాబు అమెజాన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి.. జరిగిన సంఘటన గురించి వివరించాడు. అంతా విన్న కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ ముందు షాక్ అయ్యి.. ఆ తర్వాత భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మిథున్ బాబుకు, నెటిజనులకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి ఒరిజనల్ పాస్‌పోర్ట్ అమెజాన్ కంపెనీ దగ్గరకు ఎలా చేరింది. దీనిపై అమెజాన్ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. ప్రస్తుతం మిథున్ బాబు పాస్‌పోర్ట్‌ని ఒరిజనల్ ఓనర్‌కి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. చదవండి: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో.. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!
ప్రపంచం దేశాల్లోని పాస్‌పోర్టుల్లో అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టుగా జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్టు నిలిచింది. జపాన్, సింగపూర్ దేశాల ప్రజలు పాస్‌పోర్టు ఉంటే చాలు వారికి వీసా లేకున్నా 192 దేశాలను చుట్టిరావచ్చు. హెన్లీ & పార్టనర్స్ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాలోలో భారతదేశం 6 స్థానాలు పడిపోయి 90కి చేరుకుంది. గత ఏడాది మన దేశ ర్యాంకు 85గా ఉంది. జపాన్, సింగపూర్ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ దేశాల వీసా రహిత స్కోరు 192తో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే, భారతదేశం వీసా రహిత స్కోరు 58గా ఉంది. అంటే భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు 58 దేశాలకు వీసా లేకున్నా ఆయా దేశాలకు ప్రయాణించవచ్చు. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ అనేది అంతర్జాతీయ వాయురవాణా అసోసియేషన్ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు) నుంచి సేకరించిన ప్రత్యేక సమాచారంతో ప్రతి ఏటా ప్రపంచ దేశాల్లోని అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టు వివరాలను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ విడుదల చేస్తుంది. కరోనా మహమ్మారి తర్వాత అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్న సమయంలో ఈ సూచిక విడుదల అయ్యింది. జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, పాకిస్తాన్, యెమెన్ దేశాలు ఈ జాబితాలో చిట్ట చివరలో ఉన్నాయి.(చదవండి: మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్ మహీంద్రా) టాప్ 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు జపాన్, సింగపూర్ (వీసా రహిత స్కోరు:192) జర్మనీ, దక్షిణ కొరియా (వీసా రహిత స్కోరు: 190) ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ (వీసా రహిత స్కోరు: 189) ఆస్ట్రియా, డెన్మార్క్ (వీసా రహిత స్కోరు: 188) ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (వీసా రహిత స్కోరు: 187) బెల్జియం, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ (వీసా రహిత స్కోరు: 186) చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ (వీసా రహిత స్కోరు: 185) ఆస్ట్రేలియా, కెనడా (వీసా రహిత స్కోరు: 184) హంగరీ (వీసా రహిత స్కోరు: 183) లిథువేనియా, పోలాండ్, స్లోవేకియా (వీసా రహిత స్కోరు: 182) -
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గుడ్‌న్యూస్!
విదేశాలకు వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు కలిగి ఉండటం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. అయితే, కొత్తగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త తెలిపింది. ఇండియా పోస్ట్ ఇప్పుడు భారతదేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇక నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ సీ) కౌంటర్లను సందర్శించాల్సి ఉంటుంది అని పేర్కొంది. పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయం గురించి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. "ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి" అని ట్వీట్ లో పేర్కొంది. పాస్‌పోర్టు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న, దరఖాస్తు చేసిన పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు ప్రింట్ రసీదు, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రం లేదా పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసుకు వెళ్ళవచ్చు. Now it’s easy to register and apply for a passport at your nearest post office CSC counter. To know more, visit the nearest post office. #AapkaDostIndiaPost — India Post (@IndiaPostOffice) July 24, 2021 ఇటీవలే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, ఇతర సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను కూడా ప్రారంభించింది. ఇంకా, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. -
పాస్‌పోర్టా.. చూద్దాంలే!
సాక్షి, అమరావతి: విదేశీ ప్రయాణ అనుమతి పత్రాల(పాస్పోర్ట్స్)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ బాగా తగ్గింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర కాలంగా పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. విదేశాల్లో ఉద్యోగావకాశాలు మందగించడంతో వివిధ దేశాలకు వెళ్లేవారు తగ్గిపోయారు. ఫలితంగా కొత్తగా పాస్‌పోర్ట్‌లు తీసుకునేవారి సంఖ్య సగానికి పడిపోయింది. గతంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం విడుదల చేసే స్లాట్లు సరిపోయేవి కాదు. ఇప్పుడు మాత్రం 50 శాతం స్లాట్లు మాత్రమే పూర్తవుతున్నాయి. ఈ స్లాట్స్‌కు హాజరవుతున్న వారిలోనూ అత్యధికులు విద్యార్థులే కావడం గమనార్హం. రోజుకు 1,500 మందే.. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రాలతోపాటు వాటి పరిధిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో కలిపి రోజుకు 2,700కి పైగా స్లాట్లు ఇచ్చినా దరఖాస్తుదారులకు సరిపోయేవి కాదు. ప్రస్తుతం అదే స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉన్నా రోజుకు 1,500 మందికి మించి పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడం లేదు. వారిలోనూ 60 శాతం వరకు విద్యార్థులే ఉంటున్నారు. జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలు రాయాలంటే విధిగా పాస్‌పోర్ట్ నంబర్ ఉండాలి. ఈ కారణంగానే ఆ మాత్రం దరఖాస్తులైనా వస్తున్నాయి. వీళ్లే కాకుండా కోవిడ్‌కు ముందు రాష్ట్రానికి వచ్చి.. పాస్‌పోర్ట్ కాల పరిమితి ముగిసిన వారు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. గతంతో పోలిస్తే పాస్‌పోర్ట్ దరఖాస్తుకు నిబంధనలు బాగా సడలించినా కోవిడ్ కారణంగా దరఖాస్తుదారులు రావడం లేదు. మారిన ట్రెండ్‌లోనూ.. గతంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు మాత్రమే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడా ట్రెండ్ మారింది. కొందరు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. పట్టణాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఇలా నెలల చిన్నారులకు సైతం దరఖాస్తు చేస్తున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వారు కూడా పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడం బాగా తగ్గింది. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గి, అంతర్జాతీయ ప్రయాణాలు మళ్లీ యథావిధిగా కొనసాగితే పాస్‌పోర్ట్‌లకు డిమాండ్ పెరుగుతుందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. కారణం చూపిస్తే స్లాట్ కంటే ముందే.. అత్యవసర పరిస్థితి ఉందీ అంటే ముందస్తుగా కూడా పాస్‌పోర్ట్ జారీ చేస్తాం. అయితే దానికి తగ్గ కారణాలు చూపించాలి. సరైన కారణాలు చూపిస్తే స్లాట్‌ను ముందుకు జరుపుతాం. దీనివల్ల దరఖాస్తుదారుడికి అనుకున్న సమయానికి పాస్‌పోర్ట్ వస్తుంది. ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా సులభమైంది. – డీఎస్ఎస్ శ్రీనివాసరావ్, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ -
అక్రమంగా దేశంలోకి చొరబాటు.. బంగ్లాదేశీయుల అరెస్ట్
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశీయులను విజయవాడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి రైలులో ప్రయాణం చేస్తున్నట్లుగా కేంద్ర నిఘా విభాగం నుంచి శుక్రవారం విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హౌరా నుంచి గోవా వెళ్తున్న 08047 నంబర్ రైలులోని ఎస్–3 బోగీలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ హాసన్ (33), హైదర్ అలీఖాన్ (37), ఇందాదల్ ఖాన్ (21), షేక్ సైఫుల్లా (25)గా పోలీసులు గుర్తించారు. వారిలో మొదటి ముగ్గురు అన్నదమ్ములు కాగా సైఫుల్లా వారికి సమీప బంధువని తేల్చారు. కొన్నేళ్ల క్రితం మహ్మద్ హాసన్, హైదర్ అలీఖాన్‌లు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడి బెంగళూరులో ఇనుప స్క్రాప్ షాపులో పనిచేస్తూ ఉండేవారు. 2019లో ఇద్దరూ తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. తిరిగి తమ సోదరుడు ఇందాదల్ ఖాన్, బంధువు సైఫుల్లాలను కలుపుకొని గత నెల 30న ఇండియా బోర్డర్‌కు చేరుకున్నారు. చీకటిపడే వరకు అక్కడే ఉండి అర్ధరాత్రి సమయంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించి హౌరా చేరుకున్నారు. ఓ వ్యక్తి సాయంతో హౌరా నుంచి వాస్కోడిగామాకు ట్రైన్ టికెట్లను ఏర్పాటు చేయించుకొని ఈనెల ఒకటో తేదీన రైలు ఎక్కి రెండో తేదీన రాత్రి 8 గంటల సమయంలో విజయవాడకు చేరుకున్నారు. అప్పటికే ప్రత్యేక తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పాస్‌పోర్టు, అనుమతులు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో వారిపై సెక్షన్ 467, 468, 120–బీ, సెక్షన్ 420, 12(1ఏ, బీ), పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు వీరంతా ఉపాధి కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించారా? లేక ఏదైనా ఉగ్ర కార్యకలాపాల్లో భాగంగా చొరబడ్డారా? అనే కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో పేలుడుకు రసాయన పదార్థాలన్నీ రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలడం, ఇప్పుడు ఈ నలుగురు బంగ్లాదేశీయులు రైలులోనే ప్రయాణిస్తూ పట్టుబడడంతో ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్, పోలీసు ప్రత్యేక విభాగాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. పశ్చిమ జోన్ లా అండ్ ఆర్డర్ డీసీపీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో నార్త్ డివిజన్ ఏసీపీ షేక్ షాను, సత్యనారాయణపురం ఇన్చార్జ్ సీఐ లక్ష్మీనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ వివరాలను సమర్పించడం ఎలా?
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన్ వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. మీరు ఆన్ లైన్ లోనే ఇంట్లో నుంచే వివరాలను నమోదు చేయవచ్చు. కోవిన్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ విదేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. "ఇప్పుడు మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో మీ పాస్ పోర్ట్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు" అని ఆరోగ్య సేతు యాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో విద్య, ఉద్యోగాలు, టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారత బృందం విదేశాలకు ప్రయాణించేటప్పుడు వారు తమ పాస్ పోర్ట్ తో లింకు అయిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను కలిగి ఉండాల్సి ఉంటుందని పేర్కొంటూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారులు తమ పాస్ పోర్ట్ వివరాలను కోవిన్ వెబ్ సైట్ (cowin.gov.in) ద్వారా జోడించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. Now you can update your Passport number in your vaccination certificate. Login to https://t.co/S3pUooMbXX. Select Raise a Issue Select the passport option Select the person from the drop down menu Enter passport number Submit You will receive the new certificate in seconds. pic.twitter.com/Ed5xIbN834 — Aarogya Setu (@SetuAarogya) June 24, 2021 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో పాస్ పోర్ట్ వివరాలను ఎలా సమర్పించాలి? కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి. "Raise a Issue" అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు "పాస్ పోర్ట్" ఆప్షన్ నొక్కి డ్రాప్ డౌన్ మెనూలో 'Person'ని ఎంచుకోండి. మీ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేసి వివరాలను సమర్పించండి. ఇప్పుడు మీరు కొత్త సర్టిఫికేట్ ని సెకండ్లలో పొందుతారు. ఒకవేళ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పేరు పాస్ పోర్ట్ పై ఉన్న పేరు సరిపోలకపోతే మీరు పేరును ఎడిట్ చేసుకోవచ్చు. కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి. ఇప్పుడు 'Raise an issue' ఆప్షన్ క్లిక్ చేసి సభ్యుడి పేరును ఎంచుకోండి. 'కరెక్షన్ ఇన్ సర్టిఫికేట్' అనే ఆప్షన్ మీద తట్టండి. మీరు ఏమి కరెక్షన్ కాయలని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు సరైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలను ఒక్కసారి మాత్రమే సవరించగలరు అనే విషయం దయచేసి గుర్తుంచుకోండి. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
యూఏఈ వెళ్లే వారికి ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు శుభవార్త. జూలై 7వ తేదీ నుంచి యూఏఈకి భారత్ నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్ 25 నుంచి మన దేశ విమానాల రాకపోకలపై యూఏఈ విధించిన నిషేధం జూలై 6వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలకు 7వ తేదీ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని షరతులను విధించింది. భారత్ నుంచి యూఏఈకి వెళ్లే వలస కార్మికులు రెండు డోస్‌ల కోవిషీల్డు టీకా తీసుకుని ఉండాలి. అలాగే ప్రయాణానికి మూడు రోజుల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్‌గా నిర్ధారించిన సర్టిఫికెట్‌ను చూపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25కు ముందు కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అనేక మందిని యూఏఈ కంపెనీలు సెలవులపై ఇంటికి పంపించాయి. మరి కొందరు సుదీర్ఘ విరామం తరువాత సెలవులపై ఇంటికి వచ్చారు. అలా వచ్చిన వారికి యూఏఈ కంపెనీలు పనిలో చేరాలని పిలుపునిచ్చాయి. మన దేశ విమానాలపై యూఏఈ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు సేవలు నగర ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడి రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయడంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాల్లో పూర్తిస్థాయిల్లో సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈ నెల10 నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. -
పాస్‌పోర్టు సేవలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేత
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ఆవరణలోనే ఉండే విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్రాంచ్ సెక్రటేరియేట్ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. లాక్డౌన్ కాలంలో నో రిజిస్ట్రేషన్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. లాక్డౌన్ మినహాయింపు కేటగిరీలో రిజిస్ట్రేషన్ల శాఖను చేర్చకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి పాస్‌లు జారీ చేయరని, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, రిజిస్ట్రేషన్లు మాత్రం జరగవని వెల్లడించారు. -
చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..
కథలాపూర్ (వేములవాడ): చేయని తప్పునకు జైలు పాలై.. పాస్‌పోర్టు లేక దుబాయ్‌లో చిక్కుకున్న జగిత్యాల జిల్లావాసికి ఊరట లభించింది. గల్ఫ్ సంక్షేమ సంఘాల చొరవతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. గతేడాది మార్చిలో కొండగట్టు పేరిట రిజిస్టర్ అయిన సిమ్‌కార్డు పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉపయోగించాడు. అతను చేసిన తప్పులకు కొండగట్టును అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 8 నెలలు జైలు జీవితం గడిపిన కొండగట్టు.. ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. కొండగట్టు వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. ఈ విషయమై గత నెల 21న ‘స్వదేశానికి రప్పించండి’శీర్షికన సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పందించారు. కొండగట్టు స్వదేశానికి వచ్చేందుకు కోర్టు అనుమతి పత్రం, ఎన్ఓసీ దుబాయ్‌లోని రాయబార కార్యాలయానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక్కడ చదవండి: శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించరూ..! ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. -
మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్ నిరాకరణ
శ్రీనగర్: కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తి మొహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్ పాస్‌పోర్టు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీస్ శాఖ ఇచ్చిన ప్రతికూల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్షన్ కూతురు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన పాస్‌పోర్టు దరఖాస్తును అధికారులు తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తల్లి, కూతురు పవిత్ర మక్కా వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) ప్రకారం జమ్మూకశ్మీర్ పోలీస్ సీఐడీ విభాగం పాస్‌పోర్ట్ దరఖాస్తును తిరస్కరించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి కార్యాలయం గుల్షన్‌కు లేఖ పంపింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ‘ఏడు పదుల వయస్సున్న నా తల్లితో దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి, ఆమెకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. వారి మాట విన లేదని భారత ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి విధానాలతో వేధించేందుకు, శిక్షించేందుకు పూనుకుంది’అని విమర్శించారు. ఎవరైనా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లడం ద్వారా దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు అధికారులు పాస్‌పోర్ట్‌ను నిరాకరించేందుకు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) సెక్షన్ అధికారం కల్పించింది. దరఖాస్తుదారుకు పాస్‌పోర్ట్ మంజూరు ప్రజాసంక్షేమం కోసం కాదని కేంద్రం భావించిన సందర్భాల్లో కూడా అనుమతి నిరాకరించవచ్చు. చదవండి: మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్ -
ముఫ్తీ పాస్‌పోర్ట్‌పై ఆదేశాలివ్వలేం
శ్రీనగర్: తనకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్‌పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్ వెరిఫికేషన్ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్‌పోర్ట్ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ అలీ మొహమ్మద్ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్ వెరిఫికేషన్ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్‌పోర్ట్ జారీ చేయలేమ’ని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్‌పోర్ట్ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్‌పోర్ట్ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్ చేశారు. -
పుట్టగొడుగుల్లా ‘పాస్‌పోర్ట్ సైట్స్’
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని టార్గెట్‌గా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను పెద్ద సంఖ్యలో రూపొందించారు. ప్రధానంగా పాస్‌పోర్టులను రెన్యువల్ చేయించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్న నగరవాసులు మోసపోతున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు రోజుకు ఒకటి చొప్పున వస్తున్నాయని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తి నకిలీ వెబ్సైట్ వల్లోపడి రూ.2999 నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాస్‌పోర్టులను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న నగరవాసులు నేరుగా రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే పాస్‌పోర్ట్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సర్వర్ ఆధారంగా పని చేస్తుండటంతో (www.passportindia.gov.in) అనే అడ్రస్‌తో పని చేస్తుంటుంది. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు (www.indianpassport.com), (www.indiapassport.ind.in), (passportindianonline.com),(onlinepassportservice.com) పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించారు. పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవే నిజమైనవిగా భావిస్తున్న నగరవాసులు వాటిలోకి ప్రవేశిస్తే... కొన్నిసార్లు ఆయా సైట్లకు వేరే వాటికి డైరెక్ట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ లోకి వెళ్తున్న బాధితులు తన పూర్తి వివరాలు పొందుపరచడంతో పాటు రుసుము చెల్లించేస్తున్నారు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కనిపించడంతో బాధితులు ఆయా సైట్స్ నకిలీవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా 40 మంది మోసపోతే ఒక్కరే ఫిర్యాదు చేస్తుంటారని అధికారులు తెలిపారు. అత్యధికులు నష్టపోయింది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా బాధితులు డబ్బు కోల్పోవడమే కాకుండా విలువైన వ్యక్తిగత డే టాను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ వెబ్సైట్ల మూలాలు కనుక్కోవడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం, రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెబ్సైట్లను పూర్తిగా సరిచూసుకున్నానే వివరాలు నింపడం, రుసుము చెల్లించడం చేయాలని సూచిస్తున్నారు. -
పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్’
సాక్షి, అమరావతి: డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్‌పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు. డిజి లాకర్ అంటే.. డిజి లాకర్ అంటే డిజిటల్ లాకర్ అని అర్థం. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విలువైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి చేయాల్సిందల్లా http://digilocker.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి అకౌంట్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన డాక్యుమెంట్లను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. వాటిని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. గెజిటెడ్ అటెస్టేషన్ కూడా అక్కర్లేదు.. డిజి లాకర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎవరూ డాక్యుమెంట్లు తీసుకురానవసరం లేదు. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదు. వారం రోజులుగా దీనిపై ట్రయల్ రన్ నిర్వహించాం. పాస్‌పోర్ట్‌ను కూడా డిజిలాకర్లోదాచుకోవచ్చు. –శ్రీనివాసరావు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ -
ప్రపంచంలో పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏది?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో ఇండియా 85వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. గతేడాది 84వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి ఒక స్థానం కిందికి జారింది. ఈ జాబితాలో ఇండియాకు 58 స్కోరు లభించింది. అంటే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్ సహాయంతో 58 దేశాలను సందర్శించవచ్చు. తజికిస్థాన్‌తో పాటు భారత్ కు ఈ ర్యాంకు లభించింది. ఓ టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. అంటే మీరు ఆ దేశంలో దిగిన తర్వాత అక్కడ వీసా తీసుకోవచ్చు. మరోసారి మొదటిస్థానంలో జపాన్: పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో 191 స్కోరుతో జపాన్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం వరుసగా మూడు సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 190 స్కోరుతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా కలిసి సంయుక్తంగా నిలిచాయి. మన పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ ఈ ఏడాది కూడా అత్యల్ప స్కోరు 26తో చివరి స్థానాన్ని పొంది ప్రపంచంలోనే చెత్త పాస్‌పోర్ట్ గా నిలిచింది. మరోవైపు, మన దాయాది పాకిస్తాన్ 32 స్కోరుతో చివరి నుంచి నాల్గవ ర్యాంకును పొందింది. ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు: 1. జపాన్: 191 2. సింగపూర్: 190 3. జర్మనీ, దక్షిణ కొరియా: 189 4. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్: 188 5. ఆస్ట్రియా, డెన్మార్క్: 187 6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్: 186 7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్: 185 8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా: 184 9. కెనడా: 183 10. హంగరీ: 182 -
ప్రపంచంలోనే తొలి కోవిడ్ పాస్‌పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నేటి పరిస్థితుల్లో ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు విమాన ప్రయాణికులు బెంబేలెత్తి పోతున్నారు. కరోనా వైరస్ ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయం కంటే పది నుంచి పక్షం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందన్నదే అసలు భయం. దీనికి క్యాథె పసిఫిక్ ఏర్లైన్స్తో కలసి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఓ తరుణోపాయాన్ని కనుగొన్నది. ‘కామన్ పాస్’ పేరిట ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఫోన్లో డౌన్లో చేసుకోవాలి. విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ముందు ప్రయాణికులు విధిగా ‘కోవిడ్–19’ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఫలితాలను ఈ ఫోన్ యాప్ ద్వారా భద్రపర్చాల్సి ఉంటుంది. ఇక ఏ విమానాశ్రయంలోనైనా సంబంధిత అధికారులు ఎవరడిగిన మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను ఓపెన్‌చేసి చూపిస్తే సరిపోతుంది. దీన్ని ఈ వారం నుంచి హీత్రూ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రభుత్వాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘కామన్స్ ప్రాజెక్ట్ ఫౌండేషన్’ వివిధ భాషల్లో ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుంది. విమానాశ్రయ సిబ్బంది, సరిహద్దు భద్రతా సిబ్బందికి ఈ కోడ్‌ను స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. లండన్, న్యూయార్క్, హాంకాంగ్, సింగపూర్ నగరాల మధ్య తిరిగే ప్రయాణికుల నుంచి వాలంటీర్లను ఎంపిక చేసి ‘కామన్ పాస్’ విధానాన్ని ప్రయోగాత్మక ప్రవేశ పెట్టి పరిశీలిస్తారు. చదవండి: కరోనాను జయించిన ఊబకాయ మహిళ -
పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రభాస్
రాంగోపాల్‌పేట్: సినీనటుడు ప్రభాస్ బుధవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. పాస్‌పోర్డు రెన్యూవల్ కోసం వచ్చిన ఆయన దరఖాస్తు సమర్పించి వెళ్లారు. కార్యాలయానికి వచ్చిన ప్రభాస్‌ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకుకార్యాలయ సిబ్బంది ఎగబడ్డారు.