చండీగఢ్ : ఎన్ఆర్ఐ పాస్ పోర్టును దొంగిలించి ఓ వ్యక్తి దేశం విడిచి వెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్(ఎమ్ హెచ్ ఏ) విచారణను ముమ్మరం చేసింది. వివరాలు.. చండీగఢ్‌లోని సెక్టర్ 41కు చెందిన హిరాసింగ్ బ్రిటన్లో స్థిరపడ్డారు. యూకే నుంచి డిసెంబర్ 4న న్యూఢిల్లీ వచ్చారు. తిరిగి యూకే వెళ్లడానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే అతని పాస్ పోర్టును ఓ దుండగుడు దొంగిలించడంతో సెక్టర్ 39 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పాస్ పోర్టును దుర్వినియోగం చేస్తున్నట్టు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో చీటింగ్, నేరపూరిత కుట్రల కింద డిసెంబర్ 17న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డిసెంబర్ 27న జనవరి 6 వరకు వ్యాలిడిటీతో ఉన్న అత్యవసర పాస్ పోర్టును హిరాసింగ్ పొందారు.
అయితే అత్యవసర పాస్ పోర్టు వెరిఫికేషన్ సమయంలో పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. చోరీకి గురైన హిరాసింగ్ పాస్ పోర్టును ఉపయోగించి ఓ వ్యక్తి డిసెంబర్ 15న ముంబై నుంచి దేశం విడిచి వెళ్లిపోయాడని విచారణలో వెల్లడైంది. దీంతో ఎస్ఐ తులసి రామ్ ఓ ప్రత్యే క రిపోర్టును తయారు చేసి ఇంటెలీజెన్స్ బ్యూరో, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు పంపారు. హిరా సింగ్ ఇమిగ్రేషన్ రికార్డులను బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ పరిశీలించింది. హిరాసింగ్ పాత పాస్ పోర్టును ప్రయాణాల కోసం ఉపయోగించిన వివరాలను గుర్తించామని ఎం హెచ్ ఏ తెలిపింది. కాగా, చివరి ప్రయాణ సమయంలో పాత పాస్ పోర్టు ఉపయోగించింది వేరే వ్యక్తి అయ్యిఉండొచ్చని ఎమ్ హెచ్ ఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment