సంబరానికి గన్ పేల్చితే.. పెళ్లి కొడుకు మృతి | NRI groom in CHANDIGARH dies in celebratory fire | Sakshi
Sakshi News home page

సంబరానికి గన్ పేల్చితే.. పెళ్లి కొడుకు మృతి

Jan 1 2018 12:19 PM | Updated on Jul 6 2019 12:42 PM

NRI groom in CHANDIGARH dies in celebratory fire - Sakshi

చండీగఢ్‌ : పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ అవ్వడంతో పెళ్లి కొడుకు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన హర్యానాలోని కైథాల్‌ జిల్లా గుల్హాలోని చీకా టౌన్ షిప్లో చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో నివసించే ఎన్నారై విక్రమ్‌జిత్ సింగ్ (36) వివాహం ఆదివారం నిశ్చయించారు. అయితే శనివారం అర్ధరాత్రి పెళ్లికి ముందు నిర్వహించిన ఓ కార్యక్రమం జాగోలో అంతా ఫుల్ జోష్గా డ్యాన్సులు వేస్తుంటే, మరో వైపు విక్రమ్ సోదరుడు సురేందర్ సింగ్ గన్తోగాల్లోకి కాల్చుతూ సంబరాన్ని చాటుకునన్నాడు. అయితే గన్ మిస్ ఫైర్ అవ్వడంతో బుల్లెట్లు నేరుగా పెళ్లికొడుకు, అతని స్నేహుతుడు నవ్ తేజ్ సింగ్ శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి. విక్రమ్ జిత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, నవ్ తేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

స్విడ్జర్లాండ్ నుంచి విక్రమ్, సురేందర్లు ఇద్దరు గతవారమే ఇండియా వచ్చారు. సురేందర్ సింగ్ లైసెన్స్ ఉన్న .312 బోర్ గన్తో కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు, బాధితుడు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ కేసు కొంత సంక్లిష్టంగా మారిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement