Noida: బాంక్వెట్‌ హాల్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి | Massive Fire At Noida Banquet Hall During Renovation, 30 Years Old Electrician Dies | Sakshi
Sakshi News home page

Noida: బాంక్వెట్‌ హాల్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి

Oct 30 2024 10:10 AM | Updated on Oct 30 2024 11:31 AM

Massive Fire At Noida Banquet Hall During Renovation,Electrician Dies

లక్నో: గ్రేటర్‌ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్-74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. 

ప్రస్తుతం పదిహేను అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పర్మీందర్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

‘బాంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. తెల్లవారుజామున 3:30 గంటలకు, నోయిడా సెక్టార్ 74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్‌లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోట్ల విలువైన బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది’ అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement