banquet
-
Noida: బాంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
లక్నో: గ్రేటర్ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్-74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పదిహేను అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పర్మీందర్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.‘బాంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. తెల్లవారుజామున 3:30 గంటలకు, నోయిడా సెక్టార్ 74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోట్ల విలువైన బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది’ అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.#WATCH | UP | Lotus Grandeur banquet hall located in Noida's sector 74 was gutted in a fire which broke out late last night. The banquet hall was currently under renovation. As per Police, one person died in the incident. pic.twitter.com/R4pEti1MdB— ANI (@ANI) October 30, 2024 -
Gayatri, Nishit Reddy: స్వీడన్లో పెళ్లి.. నిర్మల్‌లో విందు
సాక్షి, నిర్మల్: ఇప్పుడంతా ఆన్లైన్ జమానా. జూమ్‌లో మీటింగ్‌లు, వాట్సప్‌లో వీడియో కాలింగ్లే కాదు.. ఏకంగా ఆన్లైన్లో పెళ్లిళ్లు చేసుకునే రోజులొచ్చాయి. ఈ మధ్య నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి ఇలాగే జరుగగా, ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే ఇలాంటి వివాహం మరొకటి నిర్వహించారు. ఎక్కడో.. స్వీడన్లో జరుగుతున్న పెళ్లిని ఇక్కడున్న కుటుంబమంతా ఆన్లైన్లో వీక్షించారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ సాఫ్ట్వేర్లే. ఉద్యోగరీత్యా వీరిద్దరూ స్వీడన్లో ఉంటున్నారు. స్వదేశంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ పెళ్లికి సిద్ధమయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') అక్కడి స్నేహితులు, వారి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిర్మల్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో ఉండే వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్లైన్లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ పెళ్లయిన తర్వాత ఇక్కడ విందు ఆరగించారు. -
ఈ కోవిడ్ కేర్ సెంటర్లో అంతా ఉచితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసుపత్రులు కరోనా రోగులతో కిక్కిరిసిపోయాయి. దీంతో కొత్త రోగులకు ఆసుపత్రులో బెడ్లు దొరకడం గగనంగా మారింది. ఈ క్రమంలో తొలిసారిగా ఢిల్లీలోని దర్యగంజ్‌లో షెహనాయ్ బంకెట్ హాల్ కోవిడ్ కేర్ సెంటర్‌గా మారింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కరోనా ఆసుపత్రి అయిన లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్(ఎల్ఎన్జెపి)కు అనుసంధానమై ఉంటుంది. 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ బంకెట్ హాల్లో 50 మంది హెల్త్ కేర్ సిబ్బంది పని చేస్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి బుధవారం ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. (ఒక్క రోజులో 11వేల మంది డిశ్చార్జి) దీని గురించి 'డాక్టర్స్ ఫర్ యు' ఎన్జీవో వ్యవస్థాపకుడు డా.రవికాంత్ సింగ్ మాట్లాడుతూ.. "ఇక్కడ అన్ని సేవలు ఉచితమే. పేషెంట్ల ఖర్చు మేమే భరిస్తాం. ఇక్కడ పన్నెండు మంది డాక్టర్లు, 24 మంది నర్సులు, 20 మంది వార్డ్ బాయ్‌లు ఉంటారు. అత్యవసర వేళల్లో ఉపయోగించేందుకు ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి" అని తెలిపారు. కాగా మరో 80 బంకెట్ హాళ్లను సైతం కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేందుకు ఆప్ ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా అదనంగా 11వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది విడిదికి రాజధానికి విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వల్ప అనారోగ్యం కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విందుకు హాజరు కాలేకపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విందు కు హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రజాప్రతినిధులందరినీ రాష్ట్రపతి ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. కేసీఆర్‌కు జ్వరం: అధికారిక నివాసంలో విశ్రాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన అధికారిక నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. దీంతో మంగళవారం నాటి సీఎం అపాయింట్మెంట్లన్నింటినీ సీఎంవో కార్యాలయం రద్దు చేసింది. పది రోజుల విడిదికి హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలసి సోమవారం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతితో బాబు భేటీ హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లిన చంద్రబాబు సుమారు గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ.. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, సెక్షన్-8 అమలు, ఓటుకు కోట్లు కేసు పరిణామాలు, ట్యాపింగ్ తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి బుధవారం శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు స్వాగతం పలుకుతారు. ప్రణబ్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు రాజమండ్రి పర్యటనకు వెళతారు.