స్వీడన్‌లో పెళ్లి చేసుకుంటున్న గాయత్రి, నిశిత్‌రెడ్డి
సాక్షి, నిర్మల్: ఇప్పుడంతా ఆన్‌లైన్ జమానా. జూమ్‌లో మీటింగ్‌లు, వాట్సప్‌లో వీడియో కాలింగ్‌లే కాదు.. ఏకంగా ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు చేసుకునే రోజులొచ్చాయి. ఈ మధ్య నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి ఇలాగే జరుగగా, ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే ఇలాంటి వివాహం మరొకటి నిర్వహించారు. ఎక్కడో.. స్వీడన్‌లో జరుగుతున్న పెళ్లిని ఇక్కడున్న కుటుంబమంతా ఆన్‌లైన్‌లో వీక్షించారు.
చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..)
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌లే. ఉద్యోగరీత్యా వీరిద్దరూ స్వీడన్‌లో ఉంటున్నారు. స్వదేశంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ పెళ్లికి సిద్ధమయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు.
చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు')
అక్కడి స్నేహితులు, వారి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిర్మల్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉండే వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్‌లైన్‌లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ పెళ్లయిన తర్వాత ఇక్కడ విందు ఆరగించారు.
Comments
Please login to add a commentAdd a comment