Gayathri
-
రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం (ఫోటోలు)
-
డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ
టెక్సాస్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–11, 21–19తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రియాన్షు 21–18, 21–16తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై, మాళవిక 15–21, 21–19, 21–14తో తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్‌స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్‌సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్‌లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్‌ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్‌లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
గాయత్రి జోడీకి చుక్కెదురు
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 18–21, 22–20, 18–21తో ఆనీ జు–కెర్రీ జు (అమెరికా) జంట చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మరోవైపు అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జంటకు తొలి రౌండ్లో వాకోవర్ లభించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మిథున్ మంజునాథ్ (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో మిథున్ 15–21, 24–22, 21–18తో శంకర్ ముత్తుస్వామి (భారత్)పై, రెండో మ్యాచ్‌లో 21–16, 21–12తో లియావో జు ఫు (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. -
శ్రమించి నెగ్గిన గాయత్రి–ట్రెసా జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 74 నిమిషాల్లో 16–21, 21–10, 21–18తో లోక్ లోక్ లుయ్–వింగ్ యంగ్ ఎన్జీ (హాంకాంగ్) జంటపై శ్రమించి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టోలతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–17తో లింగ్ ఫాంగ్ హు–జియావో మిన్ లిన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మరోవైపు భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. -
అంతర్వేది బీచ్ వద్ద విషాదం.. నవ వధువరులిద్దరూ..
ఏలూరు: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ముచ్చటగా రెండు మాసాలు గడవలేదు. పెళ్లి పందిరి తోరణాలు కూడా వాడలేదు. అంతలోనే నవవధూవరులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నూతన జంట గల్లంతయ్యారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో వధూవరుల ఇళ్లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం గుర్వాయిపాలెం గ్రామానికి చెందిన అంబటి పరుశురామయ్య, ఉదయలక్ష్మీ మొదటి కుమార్తె గాయత్రీ (21)ని పశ్చిమగోదావరి జిల్లా జువ్వాలపాలెంకు చెందిన రేలంగి బసవలింగం, జయలక్ష్మీ కుమారుడు లక్ష్మీనారాయణ (26)తో నవంబర్ 1న కై కలూరు నియోజకవర్గం సింగరాయపాలెం గుడిలో ఘనంగా వివాహం జరిపించారు. లక్ష్మీనారాయణ బీటెక్, బీఈడీ చేసి భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో కొత్త దంపతులు లక్ష్మీనారాయణ, గాయత్రీ ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం 3 గంటలకు అంతర్వేది దేవాలయాన్ని దర్శించుకుని నాలుగు గంటలకు బీచ్‌కు వెళ్లారు. బంధువులతో కలిసి కాకుండా వాహనంపై బీచ్‌లో దూరంగా వెళ్లారు. అక్కడ వాహనం, సెల్ఫోన్లు ఉంచి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. తరువాత కొద్ది సమయానికే వీరు కనిపించలేదు. సెల్‌ఫోను ఆధారంగా బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో వరుడి తండ్రి బసవలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు, మైరెన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వారి జాడ లేదు. ఇవి కూడా చదవండి: 11మందిని పొట్టన పెట్టుకుని? -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్లో కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్‌స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
'రామ్ చరణ్ సినిమాను కూడా పైరసీ చేస్తా'
నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం 'మాయగాడు'. అడ్డా మూవీ ఫేమ్ జీ.ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా.. అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత సినిమాల్లో నటించారు. ఇటీవలే బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేశ్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు. -
ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం
ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి గాయత్రి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హోలీ వేడుకలో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె మరికొద్ది క్షణాల్లోనే జీవచ్చవంలా మారడంతో ఆమె సన్నిహితులు, సహానటినటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త తెలిసి యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్, శ్రీహాన్ సహా పలువురు సోషల్ మీడియా వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నటి సురేఖ వాణి సైతం ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాయత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ? ఈ మేరకు సురేఖ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నా. ప్లీజ్ తిరిగి రా గాయత్రి. మనం మంచి పార్టీ చేసుకుందాం. నీతో ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. తిరిగి రా తల్లి..! ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లలేవు. ఇది సరైన సయమం కాదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మిస్ యూ.. డాలీ’ అంటూ సురేఖ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సురేఖ, ఆమె కూతురు సుప్రితలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో తెలిసిందే. తరచూ రిల్స్ చేస్తూ, పార్టీలు, పబ్‌లు, టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ఈ మధ్య గాయత్రి సురేఖ, సుప్రితలతో క్లోజ్ అయ్యింది. చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం దీంతో వారితో కలిసి పార్టీలు చేసుకోవడం, రిల్స్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన గాయత్రిని ఓ నెటిజన్ సురేఖ వాణి గురించి అడగ్గా.. ‘తను నాకు సెకండ్ మదర్ లాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అదే ఫొటో పోస్ట్‌ను సురేఖ పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా గాయంత్రి శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి కారులో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీ కొట్టింది. దీంతో గాయత్రి ఆ పక్కనే రెస్టారెంట్లో గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మద్యం సేవించి కారు నడపడం, అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ?
ప్రముఖ యూట్యూబర్, నటిగా గుర్తింపు పొందిన గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న గాయత్రి, ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరిని కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారులో గాయత్రితోపాటు ఉన్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ ఘటనకు ముందు పబ్‌కు వెళ్లిన యువుకులు కొబ్బరి బొండాల్లో ఆల్కహాల్ కలుపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హోలీ పండుగకు ముందు రోజే యువకులు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. మద్యం కలుపుకున్న కొబ్బరి బొండాలతో యువకులు పబ్‌కు వెళ్లినట్లిగా గుర్తించారు. మద్యం అనుమతి లేదని కొబ్బరి బొండాల్లో మద్యం నింపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం (మార్చి 18) హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసం పబ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
రోడ్డు ప్రమాదంలో నటి మృతి, గంటల్లోనే తారుమారైన జీవితం
Actress Dolly D Cruze Aka Gayathri Died In Gachibowli Road Accident: ప్రముఖ యూట్యూబర్, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) నిన్న(శుక్రవారం)హోలీ పండగ నేపథ్యంలో గాయత్రి ఇంటికి వెళ్లి పిక్ చేసుకున్న రోహిత్ అటు నుంచి ఆమెను ప్రిసంపబ్కి తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోహిత్ కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కాగా గాయత్రి మృతిపై పలువురు టాలీవుడ్ నటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. 'ఇది చాలా అన్యాయం. నమ్మడానికి కష్టంగా ఉంది. నీతో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. షణ్నూ సైతం గాయత్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ హార్ట్ బ్రేక్ సింబల్‌ను జతచేశాడు. -
Gayatri, Nishit Reddy: స్వీడన్లో పెళ్లి.. నిర్మల్‌లో విందు
సాక్షి, నిర్మల్: ఇప్పుడంతా ఆన్లైన్ జమానా. జూమ్‌లో మీటింగ్‌లు, వాట్సప్‌లో వీడియో కాలింగ్లే కాదు.. ఏకంగా ఆన్లైన్లో పెళ్లిళ్లు చేసుకునే రోజులొచ్చాయి. ఈ మధ్య నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి ఇలాగే జరుగగా, ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే ఇలాంటి వివాహం మరొకటి నిర్వహించారు. ఎక్కడో.. స్వీడన్లో జరుగుతున్న పెళ్లిని ఇక్కడున్న కుటుంబమంతా ఆన్లైన్లో వీక్షించారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ సాఫ్ట్వేర్లే. ఉద్యోగరీత్యా వీరిద్దరూ స్వీడన్లో ఉంటున్నారు. స్వదేశంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ పెళ్లికి సిద్ధమయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') అక్కడి స్నేహితులు, వారి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిర్మల్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో ఉండే వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్లైన్లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ పెళ్లయిన తర్వాత ఇక్కడ విందు ఆరగించారు. -
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న గాయత్రి
-
దారుణం: రూ.కోటిస్తేనే కాపురం చేస్తాడట!
సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం కింద రూ.కోటి ఇస్తేనే కాపురం చేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భర్త బెదిరిస్తున్నాడని ఓ వివాహిత మెట్టినింటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తనకు కూతురు పుట్టి ఏడాది అయినా మెట్టినింటి వారు ఒక్కరు కూడా తిరిగి చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తానే కూతురుతో కలిసి వస్తే లోనికి రాకుండా తలుపులు వేసేశారని విలపించింది. తనకు భర్త కావాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన కొల్లి వెంకటరమణ, శ్రీదేవి దంపతుల కుమార్తె గాయత్రికి ధర్మవరం పట్టణం సత్యసాయినగర్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఎల్ఐసీ ఆఫీసర్ గుర్రం విజయ్‌కుమార్, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు గుర్రం దీపక్‌కుమార్‌తో 2018 డిసెంబర్ 27న వివాహమైంది. అప్పట్లో రూ.20లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు నగలను అందజేశారు. దీపక్‌కుమార్ బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ. కోటి తీసుకురాకపోతే విడాకులు ఇస్తానంటూ బెదిరించేవాడు. దీపక్‌కుమార్, గాయత్రిల పెళ్లినాటి ఫొటో భర్త, అత్త, మామలతో పాటు ఆడపడుచులు లిఖిత, రచనలు కూడా అదనపు కట్నం కోసం వేధించేవారు. గర్భం దాల్చిన గాయత్రిని ప్రసవం కోసం పుట్టింటికి పంపించారు. అనంతరం దీపక్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన వెంటనే గంజాయి వ్యాపారం చేయడం తప్పని చెబితే వినకపోగా భార్యను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడాదే భార్య డెలివరీ అయి పండంటి బిడ్డకు జన్మనిచ్చినా చూసేందుకు కూడా వెళ్లలేదు. భర్త తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని గాయత్రి కడప పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అక్కడి పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి.. చక్కగా కాపురం చేసుకోవాలని సూచించారు. భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న గాయత్రి అత్తారింటి ముందు ఆందోళన.. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా భర్త వైఖరిలో మార్పు రాలేదు. తనకు విడాకులు కావాలంటూ గాయత్రికి ఇటీవల నోటీసు పంపించాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తకు, మెట్టినింటి వారికి ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. దీంతో చేసేదిలేక గాయత్రి తన కూతురితో కలిసి ధర్మవరం వచ్చింది. అయితే అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేశారు. భర్త కూడా ఆ సమయంలో లేరు. దీంతో ఆమె ఆ ఇంటి ముందే పాపతో కలిసి ఆందోళన చేపట్టింది. తన భర్త గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, అది తప్పని చెప్పినందుకు తనను ఎలాగైనా వదిలించుకునేందుకు అదనపు కట్నం పేరిట వేధిస్తున్నారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి కౌన్సెలింగ్ ఇస్తాం అత్తారింటి ముందు కూతురుతో కలిసి గాయత్రి ఆందోళన చేస్తున్న విషయం తెలియగానే అర్బన్ పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై డీఎస్పీ రమాకాంత్, అర్బన్ సీఐ కరుణాకర్‌లు విచారణ చేశారు. విడాకులకు భర్త దరఖాస్తు చేసుకున్నందున మరోసారి దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలిసి ఉండేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు. -
పదోతరగతి విద్యార్థిని చున్నీతో..
ముషీరాబాద్: శిక్షపడితే జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాంనగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన ఎస్.మహేంద్ర(20) వాటర్‌క్యాన్ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. గత ఏడాది కృష్ణానగర్ బస్తీకి చెందిన ఓ అమ్మాయి తనను వేధిస్తున్నాడని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ట్రయల్ వచ్చే నెల ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానుంది. కేసు నిరూపణ అయితే 7 నుంచి 14 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని ప్రచారం కావడంతో ఆందోళన చెందిన మహేంద్ర శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు బస్తీ అధ్యక్షుడు కాదాసి నర్సింగ్‌రావు తెలిపారు. కేపీహెచ్‌బీకాలనీ: పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌పటేల్ నగర్‌కు చెందిన కావూరి శ్రీనివాస్ కూతురు మెహర్ గాయత్రి దేవి (14) పదోతరగతి చదువుతోంది. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తన కుమార్తె బెడ్రూంలోంచి బయటకు రాకపోవటంతో తలుపులను బలవంతంగా తెరిచి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
పాకిస్తాన్‌తో సంబంధాలా? కోర్టుకీడుస్తా..!
సాక్షి, చెన్నై: పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్‌పై కోర్టులో కేసు వేస్తానని కోలం గాయత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై బీసెంట్‌నగర్ ప్రాంతంలో సీఏఏ వద్దంటూ కోలం (ముగ్గు) వేసిన సామాజికవేత్త, న్యాయవాది గాయత్రిపై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ వద్ద విలేకరులు మాట్లాడగా గాయత్రి ఫేస్బుక్ తనిఖీ చేయగా ఆమెకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిపై గాయత్రి ప్రతిస్పందిస్తూ సీఏఏకు వ్యతిరేకంగా తాను ముగ్గు వేసినందున కేసు నమోదు కాలేదని, ముగ్గు వేస్తున్న సమయంలో 92 ఏళ్ల వృద్ధునితో తగాదాకు దిగినందుకు కేసు నమోదు చేసినట్లు కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపినట్లు వెల్లడించారు. (ముగ్గుల వెనుక పాక్ హస్తం!) అటువంటి వివాదం ఏదీ జరగలేదని, దీనిపై ఒక వీడియో విడుదల చేశారని, అందులో తగాదాకు దిగినట్లు ఆడియో మాత్రమే ఉందన్నారు. వృద్ధుని వద్ద ఫిర్యాదు తీసుకుని తమపై కేసు నమోదు చేయలేదన్నారు. శాంత భద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు, ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా నడుచుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమపై వ్యక్తిగత కక్షతో కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. (ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు) చట్టపరమైన చర్యలు తనకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ పేర్కొన్నారని, పాకిస్తాన్ సహా తొమ్మిది దేశాలలో జరిపిన పరిశీలన గురించిన రిపోర్ట్‌ను ఫేస్బుక్లో విడుదల చేసినట్లు తెలిపారు. పోలీసు కమిషనర్ ఆరోపణలు వాస్తవ విరుద్ధమన్నారు. తనపై దుష్ప్రచారం సాగించేందుకు పోలీసు కమిషనర్ విశ్వనాథన్ అలా తెలిపారని, ఆయన తన అభిప్రాయాన్ని ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. -
పేదింటి ‘కోయిల’ ప్రతిభా రాగం!
ప్రకాశం,మార్టూరు: పేదింటి ‘కోయిల’ పాటల పోటీలో ప్రతిభ చాటి ప్రశంసలందుకుంటోంది. చిన్నతనం నుంచే గేయాలాపనను సాధన చేస్తున్న బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆర్థిక స్థోమత అడ్డుగోడగా నిలవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ బాలిక. వివరాల్లోకి వెళ్తే.. మార్టూరు కిషోర్ కాలనీకి చెందిన కుందూరు వెంకటేశ్వర్లు, పెద్ద నాగేంద్రమ్మ దంపతుల కుమార్తె గాయత్రి. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబం పరుపులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి గాయత్రి. స్థానిక మద్ది సత్యనారాయణ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి పాటలు పాడటంపై ఆకర్షితురాలైన గాయత్రి.. కూనిరాగాలతో గీతాలాపాన ప్రారంభించి కొద్దికొద్దిగా పాటలు పాడటం అలవాటు చేసుకుంది. గాయత్రిలోని ప్రతిభను గమనించిన పాఠశాల యాజమాన్యం 2017లో అప్పటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో గాయత్రితో ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని..’ అనే పాటను పాడించగా సభికులు చప్పట్లతో అభినందించారు. ఈ నెలలో చిలకలూరిపేటలో నిర్వహించిన కళా ఉత్సవ్‌లో పాటలు పాడి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా వల్లూరులో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గత శనివారం విజయవాడలోని గుణదల సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్–2019లో పాల్గొన్న గాయత్రి ప్రథమ స్థానంలో నిలిచి జయకేతనం ఎగురవేసింది. ఈ నెల 30వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి కళా ఉత్సవ్–2019 పోటీల్లో గాయత్రి పాల్గొననున్నట్లు గైడ్ టీచర్‌గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాలు శారద తెలిపారు. తల్లిదండ్రులతో గాయత్రి దాతల కోసం ఎదురుచూపు గాయత్రి జాతీయ స్థాయిలో నెగ్గుకురావాలంటే సంగీత పరిజ్ఞానం నేర్చుకోవడం అవసరం. అందుకు ఆర్థికంగా సహకరించగల దాతల కోసం అన్వేషిస్తున్నట్లు శారద తెలిపారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు లేని గాయత్రికి దాతలు సహకారం అందిస్తే జాతీయ స్థాయి పాటల పోటీల్లో తన గళాన్ని వినిపించి విజేతగా నిలుస్తుందని గైడ్ టీచర్ అభిప్రాయపడ్డారు. -
మూడు నెలల అనంతరం రిజెక్ట్ చేశారు..
గచ్చిబౌలి: తన ప్రతిష్టకు భంగం కలిగించడమేగాక, లైగింక వేధింపులకు పాల్పడారని, సినీ నటి గాయత్రి గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు బిగ్‌బాస్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి ఆమె బిగ్‌బాస్ అధినేత అభిషేక్, కో–ఆర్డినేటర్ రఘుపై రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మణికొండలోని జైహింద్‌నగర్‌లో ఉంటున్న గాయత్రిగుప్తా సోమవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సినీ నటి గాయత్రీ గుప్తా ఆమె నుండి వివరాలు సేకరించిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అభిషేక్, రఘు ఆమె ఇంటికి వచ్చిన సమయంలో వారి వెంట ఎవరు ఉన్నారనే విషయంపై ఆరా తీయగా, మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా గాయత్రిగుప్తా తెలిపింది. వారిని విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని డీఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభిషేక్, రఘులకు నోటీసులు అందజేస్తామన్నారు. అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మూడు నెలల అనంతరం తనను రిజెక్ట్ చేసినట్లు ప్రకటించడంతో సినిమా అవకాశాలు కోల్పోయానని గాయత్రిగుప్తా ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్-3 షోపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-3 రియాలిటీ షోపై కేసు నమోదయింది. రాయదుర్గం పోలీసు స్టేషన్ గాయత్రి గుప్తా అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ ఫిర్యాదు చేశారు. రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు ఇటీవల తనను కలిసి బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని అడిగారని ఆమె తెలిపారు. అనంతరం వారు షో గురించి మాట్లాడుతూ.. తనతో అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌బాస్3కి సంబంధించి తనతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని, అనంతరం బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తిరిగి కొన్ని రోజుల తర్వాత షోలో అవకాశం లేదన్నారని తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
పెందుర్తి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం 69వ వార్డు వేపగుంట దరి అప్పలనర్సయ్య కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అప్పలనర్సయ్యకాలనీలో నివసిస్తున్న పూడి శ్రీనుబాబునాయుడు నేవల్ డాక్‌యార్డులో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి 72వ వార్డు శ్రీనివాసనగర్‌కు చెందిన పూడి గాయత్రి(26)తో 2010లో వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. ఇదిలా ఉండగా.. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ తరుణంలో గాయత్రి తండ్రి కర్రి పైడిరాజు మంగళవారం జరిగిన పైడితల్లి అమ్మవారి పండగకు అల్లుడిని, కూతురిని శ్రీనివాసనగర్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. మంగళవారం రాత్రి గాయత్రిని, పిల్లలను పుట్టింటిలో వదిలి శ్రీనుబాబునాయుడు చెప్పాపెట్టకుండా వెంటనే వెళ్లిపోయాడు. ఇందేంటని విషయం తెలుసుకుని పైడిరాజు అల్లుడికి పలుమార్లు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అదేరోజు రాత్రి గాయత్రి కూడా పిల్లలను తీసుకుని తిరిగి వచ్చేసింది. బుధవారం ఉదయం భర్తకు భోజనం బాక్స్ కట్టి ఇచ్చింది. పిల్లలకు స్నానం చేయించింది. అనంతరం ఒంట్లో బాగోలేదని పనిమనిషికి చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొంత సేపటికి పిల్లలు ఏడుస్తుండడంతో పనిమనిషి తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి పక్క గదిలో ఉన్న గాయత్రి మామకు విషయాన్ని చెప్పింది. ఆయన కూడా వచ్చి తలుపు తట్టాడు. తీయకపోవడతో విషయాన్ని శ్రీనుబాబుకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. భర్త వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా చున్నీతో గాయత్రి ఉరి వేసుకుని కనిపించింది. కొనఊపిరి ఉన్నట్టు భావించి వెంటనే గాయత్రి తండ్రికి ఫోన్‌చేసి రప్పించాడు. పైడిరాజు వచ్చి వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని అప్పలనర్సయ్య కాలనీకి తీసుకొచి తన కుమార్తె మృతికి కారణం భర్త, మామ, కుటుంబీకులేనని పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు శవపంచనామా జరిపి గాయత్రి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసును దర్యాపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలంలో ఇరు కుటుంబాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోస్టుమార్టం అనంతరం అప్పలనర్సయ్య కాలనీలో ఉన్న ఇంటికి మృతదేహాన్ని తీసుకురాగా ఆమె భర్తని, కుటుంబీకులను చూడనివ్వకుండా గాయత్రి బంధువులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇద్దరమ్మాయిలు
సభ్యత, సంస్కారం మరచి కామెంట్లు పోస్ట్ చేసేవారిని, ఇన్‌డీసెంట్ ప్రపోజల్స్ పంపేవారిని చట్టం పట్టుకోడానికి, శిక్షించడానికి సమయం పట్టొచ్చు. అయితే అలాంటి వ్యక్తుల మాటలకు నిశ్చేష్టులు కాకుండా మాటకు మాట ఇవ్వగలిగితే వారితో పాటు, మిగతావారినీ దారిలోకి తేవచ్చు. లేటెస్ట్గా బాలీవుడ్ నటి ఆలియాభట్ మాటకు మాటతో ఒక ‘ఎక్స్ట్రా’ను నోరు మూయించారు. రణ్‌బీర్ కపూర్‌తో ఆమె అఫైర్‌లో ఉందో లేదో తెలుసుకునేందుకు, ‘మిమ్మల్ని మేము ఆలియా కపూర్’ అని పిలవొచ్చా?’ అని ట్విట్టర్ చాట్‌లో హిమాంశు అనే వ్యక్తి చేసిన కామెంట్‌కు ‘మిమ్మల్ని.. నేను హిమాంశు భట్ అని పిలవొచ్చా?’ అని సుతిమెత్తని తిరుగు టపాల్ కొట్టారు ఆలియా. అలాగే గాయత్రి అనే టీవీ నటి స్మూత్ రిప్లయ్‌తో ఒక కుబుద్ధిని ‘ఢమాల్’ మనిపించి మళ్లీ తేరుకోకుండా చేశారు. గాయత్రి ఇచ్చిన ‘టిట్ ఫర్ టాట్’, ఈ ఏడాది ఆరంభంలో అమలాపాల్ ఇచ్చిన ‘షూట్ ఎట్ సైట్’.. సోషల్ మీడియాలో ఈ ఏడాది సంచలనం రేపాయి. గాయత్రి అరుణ్ యువ టీవీ నటి. ఏషియానెట్‌లో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘పరస్పరం’ సీరియల్లో దీప్తీ ఐపీఎస్‌గా ఆమె పోషిస్తున్న పాత్రకు కేరళలో ప్రతి ఇల్లూ పెద్ద ఫ్యాన్. అమ్మాయి కూడా ఒరిజినల్‌గా అందంగా ఉంటుంది. 2014లో ‘పరస్పరం’ సీరియల్‌తో గాయత్రి కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఏడాదే ఏషియానెట్ ‘బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు’ గెలుచుకుంది. గాయత్రికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బ్రేవ్ గర్ల్. ఈ సంగతి ఇటీవలి వరకు ఎవరికీ తెలియదు. బాగా యాక్ట్ చేస్తుంది. నవ్వు చక్కగా ఉంటుంది. ఇంతవరకే తెలుసు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. నన్ను ప్రేమించగలరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకుంటారా? అంటూ వేలకు వేలుగా ఆమెకు ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే ఈ మధ్య నేరుగా ఆమె పర్సనల్ ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ‘నాతో ఒక రాత్రి గడుపుతారా? రెండు లక్షలు ఇస్తాను. ఈ విషయం మన మధ్యే ఉంటుంది’ అన్నది ఆ మెసేజ్. ఆ వెంటనే రెండో మెసేజ్ కూడా వచ్చింది. ‘టూ లాక్స్ జస్ట్ ఫర్ వన్ అవర్’ అని! గాయత్రి షాక్ తిన్నారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తర్వాతి మాట. ముందు వాడికి బుద్ధి చెప్పాలి. ఆమెకు చాలా కోపంగా ఉంది. వెంటనే రిప్లయ్ పెట్టింది. వాడి మెసేజ్‌లను, తన రిప్లయ్‌ని కలిపి డిసెంబర్ 10న ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘ఎంత మంచి రిప్లయ్!’ అని గాయత్రికి ప్రశంసలు మొదలయ్యాయి. ‘వాడిక చచ్చినా.. ఆడవాళ్లకు ఇలాంటి మెసేజ్ పెట్టడు. అంత బాగా బుద్ధి చెప్పారు’ అని మరికొన్ని కాంప్లిమెంట్స్. అయితే గాయత్రి రిప్లయ్ పెట్టి, ‘టిట్ ఫర్ ట్యాట్’ అని మౌనంగా ఉండిపోలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఒక్క గంటకు రెండు లక్షలు ఇస్తానని గాయత్రికి మెసేస్ పెట్టినవాడి పేరు రోహన్ కురియాకోస్. ధైర్యంగా తన పేరు కూడా చెప్పుకున్నాడు. ఇంతకీ మిస్టర్ రోహన్ కురియాకోస్కి గాయత్రి ఇచ్చిన రిప్లయ్ మెసేజ్ ఏంటి? అది చివర్లో చూద్దాం. కేరళలోని అలప్పుళ గాయత్రి జన్మస్థలం. చేర్తాళ ఆమె చదువుకున్న ఊరు. చదువులో ఫస్ట్. ఆటల్లో ఫస్ట్. అభినయంలోనూ ఫస్ట్. స్టేట్ స్కూల్స్ యూత్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా వచ్చింది. డిగ్రీ అయ్యాక ‘కమ్యూనికేటివ్ ఇంగ్లిష్’లో జర్నలిజం చేసింది. తర్వాత ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో కొన్నాళ్లు పని చేసింది. ఇంకో విషయం.. గాయత్రికి పెళ్లైంది. అవును. ఆమె పేరు పక్కన ఉన్న అరుణ్.. ఆమె భర్తే. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఇంకో విషయం. ఆమెకో కూతురు కూడా ఉంది! పేరు కల్యాణి. ఊపిరి సలపనివ్వని షూటింగ్‌లు పూర్తయ్యాకక నేరుగా ఇంటికొచ్చి రిలాక్సేషన్ కోసం కూతురుతో ఆడుకుంటుంది గాయత్రి. ఇవన్నీ కేరళైట్లకు తెలియకుండా ఏమీ లేవు. అయినా అతడెవరో అలాంటి మెసేజ్‌లు పెట్టాడు. ‘ఒక్కరాత్రి నాతో ఉంటావా? ఒక్క గంటలకు రెండు లక్షలు ఇస్తాను’ అని! అందుకు గాయత్రి ఇచ్చిన రిప్లయ్ ‘నేను ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా మీ మదర్ని / సిస్టర్ని గుర్తుపెట్టుకుంటాను. వాళ్లకెలాంటి అవమానం జరగకూడదని ఆ దైవాన్ని ప్రార్థిస్తాను’. హృదయాన్ని టచ్ చేసే రిప్లయ్ ఇది. ఆ రోహన్ నిజంగా మనిషైతే కనుక ఆ రోజంతా ఇంట్లో ఒక్కడే కూర్చొని తలుపులు వేసుకుని ఏడ్చి ఉంటాడు. మరి గాయత్రిని అలా రిప్లయ్ ఇవ్వవలసిన స్థితిలోకి నెట్టిన అతడి మెసేజ్‌లు ఆమె హృదయానికి మరెంత గాయం చేసి ఉంటాయో కదా! అది ఆలోచించాలి ఎవరైనా. సినీతారలు ఒకప్పుడు స్క్రీన్ మీద మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆటోగ్రాఫ్ కావాలని అభిమానులు ఎవరైనా ఉత్తరం రాస్తే, సంతకం ఉన్న ఫొటో ఒకటి తిరుగు పోస్టులో వచ్చేది. అక్కడికే పరమానందం. ఇప్పుడీ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య ఉన్నది ఒక్క మెసేజ్ దూరమే. ఆరాధించేవాళ్లకూ, వాంఛించేవాళ్లకు ఒకే రకమైన సౌలభ్యం ఉండడంతో సెలబ్రిటీలకు మనశ్శాంతి కరువవుతోంది. అవాంఛనీయమైన మెసేజ్‌లకు ఒక చోట చెక్ పాయింట్ ఉంటే మధ్యలోనే అవి ఆగిపోతాయి. ఇక నేరుగా ‘సంప్రదించేవాళ్లకు’ ఐపీసీ సెక్షన్ల ‘గౌరవాలు’ ఎలాగూ ఉంటాయి. చాటున ఉండి ‘మాట’ వేసే వాళ్లకు ‘తిరుగు మాటే’ శిక్ష, సమాధానం. ఏదైనా..విషయమైతే బయటికి రావాలి. అప్పుడే ‘బ్యాడ్ ప్రపోజల్స్’ చేసేవాళ్లకు భయం ఉంటుంది. దీప్తీ ఐపీఎస్ లాంటి అమ్మాయే అమలాపాల్ కూడా! ఈ ఏడాది మొదట్లో అమలాపాల్ విషయంలో జరిగింది. ‘నీతో గడపాలని ఉంది’ అని డైరెక్ట్‌గా ఆమె ప్రాక్టీస్ గదిలోకే వచ్చి అడిగాడు ఒక ఆగంతకుడు. డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్ అది. ప్రాక్టీస్‌కి వెళుతుంటే వెంట పడ్డాడు. ప్రాక్టీస్ రూమ్‌లోకి వెళ్లగానే వెనకే వెళ్లాడు. ప్రాక్టీస్‌కి సంబంధం ఉన్న మనిషి అన్నట్లే ఆమెను మాట్లాడించాడు. చివరికి అన్నాడు.. ‘నాకు చాలా పలుకుబడి ఉంది. ఒక రాత్రికి నాతో గడుపుతావా?’’ అని. ఖిన్నురాలైంది అమలాపాల్. అక్కడికక్కడ ‘షూట్ ఎట్ సైట్’లా ఆమె.. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పేరు అలగేశన్. సెక్షన్ 354ఎ (లైంగిక వేధింపు), సెక్షన్ 509 (అసభ్యకరమైన సంకేతాలు ఇవ్వడం) కింద, మహిళల్ని వేధించడంపై తమిళనాడుకే ప్రత్యేకంగా నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద అతడిపై కేసులు పెట్టారు. అమలాపాల్ దక్షిణాది చిత్రాల కథానాయిక. పుట్టింది కేరళలోని కొచ్చిలో. ఉండడం ఢిల్లీలో. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలన్నిటిలో కలిపి ఇప్పటి వరకు ముప్పై ఐదుకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అవార్డులకైతే లెక్కేలేదు. వయసు ఇరౖ ఏడు. 2014లో తమిళ్ డైరెక్టర్ విజయన్ని పెళ్లి చేసుకున్నారు. 2016లో ఏవో మనస్పర్థలతో విడిపోయారు. ‘పరస్పరం’ సీరియల్లో దీప్తీ ఐపీఎస్లా.. అమలాపాల్ నిజ జీవితంలో తన కుటుంబంలోని పరిస్థితులతో నెగ్గుకు వస్తున్నారు. మధ్యమధ్య.. ఇదిగో ఇలాంటి చికాకులు. -
డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి.. వివరణ
పెరంబూరు: అలాంటి ప్రచారానికి భయపడేది లేదని నటి గాయత్రి రఘురాం అంటున్నారు. ఈమె శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ అడయారులో పోలీసులకు పట్టుబడి వారితో వాగ్వాదానికి దిగిన విషయం కలకలం సృష్టించింది. రూ.3,500 జరిమానా కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై గాయత్రి రఘురాం సోమవారం ట్విటర్లో వివరణ ఇచ్చారు. అందులో ఏదో ఉన్నట్టుగా నాపై అసత్య ప్రసారం చేస్తున్నారు. వాటికంటే నాకు నా ఆత్మాభిమానం, జీవితం ముఖ్యం. నిజానికి జరిగిందేమిటంటే శనివారం రాత్రి షూటింగ్ ముగించుకుని సహ నటీనటులను వారి ఇంటికి చేర్చాను. తరువాత ఒంటరిగా కారులో మా ఇంటికి వెళ్లుతుండగా ట్రాఫిక్ పోలీసులు సాధారణ సోదాలు జరిపారు. అయితే నా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు వేరు జేబులో ఉండిపోవడంతో వాటిని పోలీసులకు చూపలేకపోయాను. అయినా నేను కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే మద్యం మత్తులో ఉంటే పోలీసులు ఎలా కారు నడపడానికి అనుమతిస్తారు? నా గురించి ఎలాంటి ప్రచారం జరిగినా భయపడేది లేదని ఆమె పేర్కొంది. -
‘అసెంబ్లీ వేదికగా బయటపడ్డ టీడీపీ మోసం’
విజయవాడ: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం అసెంబ్లీ వేదికగా బయటపడిందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సి.గాయత్రి ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత మహిళలకు రుణమాఫీ చేయలేదని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని వెల్లడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి..వడ్డీలతో కలిపి డ్వాక్రా రుణాలు రూ.16 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. చంద్రబాబు మాటలను నమ్మి మహిళలు డ్వాక్రా రుణాలు కట్టడం మానేశారని , ప్రస్తుతం బ్యాంక్‌లు మహిళలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని వ్యాక్యానించారు. బాబు మాటలు నమ్మి రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ మోసపోయారని చెప్పారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలను కోరారు. -
ప్రేమలో సరికొత్త కోణం
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సక్సెస్ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు రాజ్‌తరుణ్. వరుస హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘లవర్’. గాయత్రి కథానాయిక. ‘అలా ఎలా?’ వంటి హిట్ అందుకున్న అనీశ్ కృష్ణ దర్శకుడు. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై రెండో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: అంకిత్ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్ బాగ్చి, సాయికార్తీక్, నేపథ్య సంగీతం: జె.బి.