టీజర్‌ చూసి షాకయ్యా – తమ్మారెడ్డి భరద్వాజ | Kiss Kiss Bang Bang Movies Teaser Launch | Sakshi
Sakshi News home page

టీజర్‌ చూసి షాకయ్యా – తమ్మారెడ్డి భరద్వాజ

Nov 10 2017 12:36 AM | Updated on Nov 10 2017 12:36 AM

Kiss Kiss Bang Bang Movies Teaser Launch - Sakshi

‘‘ఏడాది క్రితం కార్తీక్, సుజన్‌ సినిమా తీద్దామని మా ఆఫీసుకి వచ్చారు. వీళ్లు ఏం తీస్తారులే అనుకున్నాను. సడన్‌గా వచ్చి సినిమా కంప్లీట్‌ అయ్యిందని చెప్పి కొన్ని సీన్స్‌తోపాటు, టీజర్‌ చూపించారు. చూడగానే షాక్‌ అయ్యాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.  కార్తీక్‌ మేడికొండ కార్తీక్‌ దర్శకత్వంలో కిరణ్, హర్షద కులకర్ణి, మహేశ్‌ కత్తి, గాయత్రి గుప్తా ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌’. ధృవ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సుజన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

‘‘టైటిల్‌ గమ్మత్తుగా ఉంది. కొత్త తరహా సబ్జెక్ట్‌ ఇది. కచ్చితంగా మంచి సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు భరద్వాజ. ‘‘కార్తీక్‌కి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్‌ ఉంది. సుజన్‌ నిర్మాతగా సక్సెస్‌ అవ్వాలి ’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి. ‘‘నా మీద నమ్మకంతో కథ వినకుండా సినిమా తీయడానికి ముందుకొచ్చిన సుజన్‌కి థ్యాంక్స్‌. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. జీవీ మంచి పాటలిచ్చారు’’ అన్నారు కార్తీక్‌.  ‘‘డిఫరెంట్‌ జోనర్‌లో రియలిస్టిక్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో సక్సెస్‌ అవుతామన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుజన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement