Harshad
-
టీజర్ చూసి షాకయ్యా – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘ఏడాది క్రితం కార్తీక్, సుజన్ సినిమా తీద్దామని మా ఆఫీసుకి వచ్చారు. వీళ్లు ఏం తీస్తారులే అనుకున్నాను. సడన్‌గా వచ్చి సినిమా కంప్లీట్ అయ్యిందని చెప్పి కొన్ని సీన్స్‌తోపాటు, టీజర్ చూపించారు. చూడగానే షాక్ అయ్యాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కార్తీక్ మేడికొండ కార్తీక్ దర్శకత్వంలో కిరణ్, హర్షద కులకర్ణి, మహేశ్ కత్తి, గాయత్రి గుప్తా ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ధృవ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుజన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘‘టైటిల్ గమ్మత్తుగా ఉంది. కొత్త తరహా సబ్జెక్ట్ ఇది. కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది’’ అన్నారు భరద్వాజ. ‘‘కార్తీక్‌కి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది. సుజన్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలి ’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘నా మీద నమ్మకంతో కథ వినకుండా సినిమా తీయడానికి ముందుకొచ్చిన సుజన్‌కి థ్యాంక్స్. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. జీవీ మంచి పాటలిచ్చారు’’ అన్నారు కార్తీక్. ‘‘డిఫరెంట్ జోనర్లో రియలిస్టిక్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో సక్సెస్ అవుతామన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుజన్. -
పరీక్ష రాసి 100కి 100 మార్కులు వేసుకున్నాడు
అహ్మదాబాద్: గుజరాత్లో పన్నెండో తరగతి చదువుతున్న హర్షద్ విద్యార్థి తానే పరీక్ష రాసి.. తానే మార్కులు వేసుకున్నాడు. అది కూడా ఏకంగా 100కు వంద మార్కులు. అచ్చం పరీక్ష పేపర్ దిద్దేవాళ్లలాగానే పేపర్ ఎర్రపెన్నుతో దిద్ది వందకు వంద మార్కులు వేసుకొని పరీక్ష పూర్తయ్యాక సూపర్ వైజర్‌కు ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థిపై గుజరాత్ సెకండరీ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ డోర్డు (జీఎస్ హెచ్ఎస్ఈబీ) అతడిపై కాపీయింగ్ కేసు పెట్టింది. ఈ విద్యార్థి జాగ్రఫీ, అర్థశాస్త్రం పేపర్లకు తానే పేపర్ దిద్దుకున్నాడని బోర్డు తెలిపింది. అయితే, తెలివిగా ఈ విద్యార్థి పరీక్ష పేపర్లను దిద్దుకొని మార్కుల మొత్తాన్ని మాత్రం మొదటి పేజీలో వేయకుండా ఏ ప్రశ్నకు సంబంధించిన మార్కులు ఆ సమాధానం వద్దే వేసుకున్నాడు. ఈ విషయం తొలుత గుర్తించని టీచర్లు ఆ విద్యార్థికి మొత్తం 100కు 100 వచ్చినట్లు గణించారు. అయితే, విద్యార్థి రాసిన సమాధాన పత్రానికి ఏడుగురు ఉపాధ్యాయులు ఆమోదం తెలిపే క్రమంలో అతడు చేసిన తప్పును గుర్తించారు. అతడు రాసిన పరీక్ష పత్రాల ప్రకారం వచ్చిన మార్కులు వరుసగా ఎకానిమిక్స్ లో 100/100, గుజరాతీలో 13/100, ఇంగ్లిష్ 12/100, సంస్కృతం 4/100, సోషియాలజీ 20/100, సైకాలజీ 5/100, జాగ్రఫీ 35/100. -
పిచ్చి కుక్కల దాడి..
ఎనిమిది మందికి గాయూలు ఎంజీఎం : పిచ్చి కుక్కలు దాడిలో ఐదుగురి చిన్నారుల తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయూలైన సంఘటన నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని ప్రగతినగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. చిన్నారులు ఆడుకుంటుండగా వారిపైకి వీధి కుక్కలు దాడికి పాల్పడ్డారుు. పక్కనే ఉన్న నాగేంద్రనగర్‌లో మరో ముగ్గురిపై దాడికి దిగారుు. క్షతగాత్రులను స్థానికులతో పాటు 29 డివిజన్ నాయకులు సమ్మద్ ఆటోలో ఎంజీఎంకు తరలించారు. చిన్నారి సమీనా బేగంకు(10) తీవ్ర గాయాలై ఎంజీఎంలో అడ్మిట్ అయి చికిత్స పొందుతోంది. హర్షద్(5), మరో ఇద్దరు చిన్నారులు శాన్, తాళ్లపల్లి వినీత్‌కుమార్, యువకుడు మహ్మద్ ముజాహిద్(19), మహ్మద్ అబ్దుల్లా హక్ గాయూలపాలయ్యూరు. నగరం లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి దాడులకు తెగబడుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.