పిచ్చి కుక్కలు దాడిలో ఐదుగురి చిన్నారుల తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయూలైన సంఘటన నగరంలోని కలెక్టరేట్
ఎనిమిది మందికి గాయూలు
ఎంజీఎం : పిచ్చి కుక్కలు దాడిలో ఐదుగురి చిన్నారుల తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయూలైన సంఘటన నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని ప్రగతినగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. చిన్నారులు ఆడుకుంటుండగా వారిపైకి వీధి కుక్కలు దాడికి పాల్పడ్డారుు. పక్కనే ఉన్న నాగేంద్రనగర్‌లో మరో ముగ్గురిపై దాడికి దిగారుు.
క్షతగాత్రులను స్థానికులతో పాటు 29 డివిజన్ నాయకులు సమ్మద్ ఆటోలో ఎంజీఎంకు తరలించారు. చిన్నారి సమీనా బేగంకు(10) తీవ్ర గాయాలై ఎంజీఎంలో అడ్మిట్ అయి చికిత్స పొందుతోంది. హర్షద్(5), మరో ఇద్దరు చిన్నారులు శాన్, తాళ్లపల్లి వినీత్‌కుమార్, యువకుడు మహ్మద్ ముజాహిద్(19), మహ్మద్ అబ్దుల్లా హక్ గాయూలపాలయ్యూరు. నగరం లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి దాడులకు తెగబడుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.