Mad dogs
-
పిచ్చికుక్కల స్వైర విహారం..15 మందికి గాయాలు
కర్నూలు జిల్లా : నగర శివారులోని గోకులపాడులో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనపడిన ప్రతీ వ్యక్తిని కండలూడేలా కరిచాయి. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్దులే అధికంగా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కుల గురించి అధికారులకు తెలియజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రామంలో తిరగాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిచ్చికుక్కల దాడిలో 15 మందికి గాయాలు
రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఆదివారం చోటుచే సుకుంది. మండల పరిధిలోని మర్రిపాడు, పెద్దబుగ్గ గ్రామాల్లో సంచరిస్తున్న పిచ్చికుక్కలు బాటసారులపై దాడి చేశాయి. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు కుక్కలను హతమార్చడానికి యత్నిస్తున్నారు. -
బాబోయ్.. కుక్కలు!
ఇద్దరు చిన్నారులపై దాడి.. తీవ్ర గాయాలు హైదరాబాద్: రాజధాని నగరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు రెచ్చిపోయి మీద పడుతున్నాయి. గురువారం ఆరేళ్ల చిన్నారితోపాటు ఓ హాస్టల్ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మహబూబ్‌నగర్ జిల్లా జాతరపల్లికి చెందిన శ్రీకాంత్ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో నీరు లేకపోవడంతో సాయంత్రం దగ్గర్లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌పై పిచ్చికుక్క దాడి చేసి నుదురు, కంటిరెప్పపై కరిచింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ఘటన రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. ధృతి అనే ఆరేళ్ల చిన్నారి ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు తయారై ఇంటి ముందు గేట్ వద్ద నిల్చుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క ధృతిపై దాడి చేసింది. చిన్నారి కుడి కన్నుపై తీవ్రంగా గాయపర్చింది. తల్లిదండ్రులు చికిత్స కోసం పాపను ఆసుపత్రిలో చేర్చారు. -
పిచ్చి కుక్కల దాడి..
ఎనిమిది మందికి గాయూలు ఎంజీఎం : పిచ్చి కుక్కలు దాడిలో ఐదుగురి చిన్నారుల తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయూలైన సంఘటన నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని ప్రగతినగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. చిన్నారులు ఆడుకుంటుండగా వారిపైకి వీధి కుక్కలు దాడికి పాల్పడ్డారుు. పక్కనే ఉన్న నాగేంద్రనగర్‌లో మరో ముగ్గురిపై దాడికి దిగారుు. క్షతగాత్రులను స్థానికులతో పాటు 29 డివిజన్ నాయకులు సమ్మద్ ఆటోలో ఎంజీఎంకు తరలించారు. చిన్నారి సమీనా బేగంకు(10) తీవ్ర గాయాలై ఎంజీఎంలో అడ్మిట్ అయి చికిత్స పొందుతోంది. హర్షద్(5), మరో ఇద్దరు చిన్నారులు శాన్, తాళ్లపల్లి వినీత్‌కుమార్, యువకుడు మహ్మద్ ముజాహిద్(19), మహ్మద్ అబ్దుల్లా హక్ గాయూలపాలయ్యూరు. నగరం లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి దాడులకు తెగబడుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శునకం.. భయానకం
కుక్కకాటుతో జనం విలవిల్లాడుతున్నారు. రాత్రిళ్లే కాదు.. పగటి పూట కూడా కుక్క కనిపిస్తే జడుసుకుంటున్నారు. గత మార్చి నెలలో 1,463 మంది కుక్క కాటుకు గురయ్యారంటే తీవ్రతకు అద్దం పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వీధి కుక్కలకు కు.ని.ఆపరేషన్ చేయాలని, పిచ్చికుక్కలను చంపేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 1463 గత మార్చిలో కుక్కకాటు బాధితులు 10 ఈ నెల 16న గూడూరులో పిచ్చికుక్కలు కరిచిన వారి సంఖ్య కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆసుపత్రులు 40.. నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరుల్లో ఏరియా ఆసుపత్రులు, కర్నూలులో బోధనాసుపత్రి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఈ ఆసుపత్రులన్నింటి లో కుక్కకాటుకు యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రతి పీహెచ్సీలో నీసం నాలుగు వ్యాక్సిన్లైనా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఆయా ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. 2012-13లో 32వేలు, 2013-14లో 30వేలు, 2014-15లో 28వేల డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను కుక్కకాటు బాధితులకు అందజేశారు. ప్రస్తుతం డ్రగ్‌స్టోర్‌లో 9,650 డోసులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2,448 డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మార్చిలో 1463 మందికి కుక్కకాటు జిల్లాలోని 53 పీహెచ్‌సీల పరిధిలో 1463 మంది కుక్కకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అధికంగా కోసిగిలో 54, బేతంచర్లలో 43, గూడూరులో 45, పగిడ్యాలలో 50, జూపాడుబంగ్లాలో 44, తిమ్మాపురంలో 35, మద్దికెరలో 33, మద్దూరులో 42, కలుదేవకుంట్లలో 116, గోనెగండ్లలో 162, మిడుతూరులో 48, ఆస్పరిలో 34, తుగ్గలిలో 30, హుసేనాపురంలో 31 మంది కుక్కకాట్లకు గురయ్యారు. మొ త్తం 1,463 మందిలో 897 మంది పు రుషులు, 566 మంది స్త్రీలు ఉన్నారు. పెద్దాసుపత్రిపైనే భారం కుక్క కరిచిందంటే చాలు కర్నూలు నగరం నుంచే గాక చుట్టుపక్క గ్రామాల ప్రజలు సైతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఇక్కడ కుక్కకాటుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. రోజూ కొత్తవారు 25 నుంచి 30, పాతవారు 30 నుంచి 40 మంది చికిత్స కోసం వస్తున్నారు. మొత్తంగా నెలకు 1300 మందికి పైగా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి సైతం ఏపీఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ నుంచి యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. కుక్కకాటు బాధితులు పెరిగితే మాత్రం ఆసుపత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి వస్తోంది. కుక్క కరిచిన వారికి అభయారబు వ్యాక్సిన్‌ను మొదటిరోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 28వ రోజు వేయించాలి. ముందుజాగ్రత్తగా అయితే మొదటి, ఏడు, 28వ రోజు వ్యాక్సిన్ తప్పనిసరి. గ్రామాల్లో బహిర్బూమికి వెళ్లిన పెద్దలు, చిన్నపిల్లలు ఎక్కువగా కుక్కకాటుకు గురవుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని.. లేకపోతే కర్రలు పట్టుకుని బహిర్బూమికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. శునకాల నియంత్రణకు చర్యలేవీ.. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వీధికుక్కల నియంత్రణకు చర్యలు కరువయ్యాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో వీధికుక్కలు గుంపులు రావడం చూసి జనం బెంబేలెత్తుతున్నారు. వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం.. లేదా ఇతర పద్ధతుల ద్వారా నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేశారు. తాజాగా రాష్ట్రంలో మూడు, నాలుగు చోట్ల తీవ్రస్థాయిలో కుక్కకాటు బాధితులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. గ్రామపంచాయతీలకు ఆదేశాలు కుక్కలను నియంత్రించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయాలకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలను పంపించారు. 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల్లో లెసైన్స్‌లేని వీధి కుక్కలను పట్టుకుని ఎన్జీవోలకు అప్పగించాలి. తప్పదనిపిస్తే పిచ్చికుక్కలను చంపేయాలి. మటన్, చికెన్ షాపుల వద్ద పారేస్తున్న వ్యర్థాల వల్ల కుక్కలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు లెసైన్స్‌లేని మాంసపు విక్రయ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆడ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో పశు సంవర్ధక శాఖకు సహకరించాలని పంచాయతీలను ఆదేశించారు. మాంసపు దుకాణాలు వ్యర్థాలకు ప్రత్యేక డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే కర్నూలు మినహా ఇతర ప్రాంతాల్లో నామమాత్రంగానూ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కుక్క కరిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... ⇒ కుక్క కరిచిన చోట దారగా పారే కుళాయి నీటిని పది నిమిషాల పాటు వదలాలి. ⇒ డెటాల్, బెటాడిన్ యాంటిసెప్టిక్ లోషన్ పూయవచ్చు. ⇒ పసుపు మంచిదే. కానీ కొమ్మ నుంచి పసుపుపొడిగా మారే సమయంలో కలుషితమై ఉంటే దాని వల్ల గాయంపై ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి ధనుర్వాతం వ్యాధి వస్తుంది. ⇒ సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. వైద్యులు సూచించిన మేర మందులు వాడాలి. ⇒ కుక్కలు పెంచే వారు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేయిస్తే మంచిది. వ్యాక్సిన్ వేయించిన కుక్క మనిషిని కరిస్తే తప్పక యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. ⇒ కుక్క కరిచినా యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారిలో 80 శాతం మందికి రేబిస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వస్తుంది. 10 నుంచి 20 శాతం మందికి అసిండింగ్ ఫెరాలసిస్ వ్యాధి వస్తుంది. -
కుక్కలు బాబోయ్ కుక్కలు
-
సెంట్రల్ వర్సిటీలో కుక్కల వీరంగం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిచ్చికుక్కులు శనివారం స్వైర విహారం చేశాయి. కుక్కలు దాదాపు 30 మంది విద్యార్థులను కరిచాయి. ఆ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో యూనివర్శిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. కుక్కల వీరంగంపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు యూనివర్శిటీలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని యూనివర్శిటీలోకి వెళ్లనీయకుండా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు యూనివర్శిటీ ప్రవేశ ద్వారం వద్ద నిరనసకు దిగారు. -
పిచ్చి కుక్కల పంజా!
రాజాం రూరల్, న్యూస్‌లైన్:పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పాలకొండ, రాజాం మండలాల్లో దాడులు చేసి.41 మందిని గాయపరిచాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. గురవాంలో 19 మందికి గాయాలు రాజాం మండలం గురవాం గ్రామంలో ఆది వారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి..19 మందిని గాయపరిచింది. ఓ ఆవు, దూడ, మరో గేదెను సైతం కరిచింది. బాధితులంతా నిద్ర లేచి..బయటకు వస్తుండగా..పిచ్చికుక్క..ఆకస్మికంగా దాడికి పాల్పడింది. చిన్నారులతో పాటు పశువులను సైతం వీడలేదు. అనంతరం కుక్కను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా..తప్పించుకు పారిపోయింది. గ్రామానికి చెందిన కుప్పిలి రూతి, లావేటి సింహాచలం, మజ్జి గం గమ్మ, రాంపురపు వెంకటరావు, ఎస్.లక్ష్మి, ఎస్.జోగినాయుడు, వి.రాము, ఎం.రాములమ్మ, వై.రమణ, ఎల్.లక్ష్మి, ఎన్.అప్పమ్మ, బి.గణేష్, బి.గురుమూర్తి, వి. సత్యవతి, బి.చంద్రరావు, వై.సన్యాసమ్మ, ఎమ్.సింహాచలంతో పాటు చిన్నారులు అడ్డు ధరణి, తోలాపి ఈశ్వరరావు గాయపడిన వారిలో ఉన్నారు. అలాగే బలగ రామకృష్ణ అనే రైతుకు చెందిన ఆవు,దూడతో పాటు మరో రైతుకు చెందిన గేదెను గాయపర్చింది. క్షతగాత్రులం తా రాజాం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొం దారు. వైద్యుడు కరణం హరిబాబు అందరికీ ఏఆర్వీ ఇంజెక్షన్లు ఇచ్చారు. పాలకొండలో 15 మందికి.. పాలకొండ రూరల్: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పిచ్చి కుక్క 15మందిని గాయపరిచింది. మూడు కుక్కలపై కూ డా దాడికి తెగబడింది. ఎన్.కె.రాజపురం, ఏలాం, ఏరియా ఆస్పత్రి సమీపంలో బి.రమేష్, కె.అప్పారావు, డి.గౌరమ్మ, సీహెచ్ రాజు, ఎ.అరవింద్, సీహెచ్ మాధురి, ఎన్.మహేం ద్ర, పుణ్యవతి, ప్రవీణ్, అవినాష్, గాయత్రితోపాటు మరో నలుగురు చిన్నారులు కూడా గాయపడ్డారు. వీరిని వెం టనే తల్లిదండ్రులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి సూపరిం టెం డెంట్ జె.రవీంద్రకుమార్, డాక్టర్ దుప్పల వెం కట శ్రీనివాస్ తదితరులు వైద్య సేవలందిం చారు. చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. రేగిడి మండలంలో 17 మందికి.. రేగిడి: ఉణుకూరు, పోరాం గ్రామాల్లో పిచ్చికుక్క పలువురిని గాయపరిచింది. ఉణుకూరుకు చెందిన గేదెల సీతారాం, తెంటు రామచంద్రుడు, పేకేటి సురేష్‌తో పాటు మరో ఏడుగురు, కొన్ని పశువులను గాయపరిచింది. దీం తో గ్రామస్తులు తరిమారు. దీంతో పోరాం వెళ్లిపోయింది. అక్కడ ఏడుగురిని గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా..108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి వెళ్లి.చికిత్స పొందుతున్నారు. కుక్కల బారినుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.