కర్నూలు జిల్లా : నగర శివారులోని గోకులపాడులో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనపడిన ప్రతీ వ్యక్తిని కండలూడేలా కరిచాయి. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్దులే అధికంగా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కుల గురించి అధికారులకు తెలియజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రామంలో తిరగాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment