రాజాం రూరల్, న్యూస్‌లైన్:పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పాలకొండ, రాజాం మండలాల్లో దాడులు చేసి.41 మందిని గాయపరిచాయి.
పిచ్చి కుక్కల పంజా!
Published Mon, Jan 6 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
రాజాం రూరల్, న్యూస్‌లైన్:పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పాలకొండ, రాజాం మండలాల్లో దాడులు చేసి.41 మందిని గాయపరిచాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు.
గురవాంలో 19 మందికి గాయాలు
రాజాం మండలం గురవాం గ్రామంలో ఆది వారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి..19 మందిని గాయపరిచింది. ఓ ఆవు, దూడ, మరో గేదెను సైతం కరిచింది. బాధితులంతా నిద్ర లేచి..బయటకు వస్తుండగా..పిచ్చికుక్క..ఆకస్మికంగా దాడికి పాల్పడింది. చిన్నారులతో పాటు పశువులను సైతం వీడలేదు. అనంతరం కుక్కను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా..తప్పించుకు పారిపోయింది. గ్రామానికి చెందిన కుప్పిలి రూతి, లావేటి సింహాచలం, మజ్జి గం గమ్మ, రాంపురపు వెంకటరావు, ఎస్.లక్ష్మి, ఎస్.జోగినాయుడు, వి.రాము, ఎం.రాములమ్మ, వై.రమణ, ఎల్.లక్ష్మి, ఎన్.అప్పమ్మ, బి.గణేష్, బి.గురుమూర్తి, వి. సత్యవతి, బి.చంద్రరావు, వై.సన్యాసమ్మ, ఎమ్.సింహాచలంతో పాటు చిన్నారులు అడ్డు ధరణి, తోలాపి ఈశ్వరరావు గాయపడిన వారిలో ఉన్నారు. అలాగే బలగ రామకృష్ణ అనే రైతుకు చెందిన ఆవు,దూడతో పాటు మరో రైతుకు చెందిన గేదెను గాయపర్చింది. క్షతగాత్రులం తా రాజాం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొం దారు. వైద్యుడు కరణం హరిబాబు అందరికీ ఏఆర్‌వీ ఇంజెక్షన్లు ఇచ్చారు.
పాలకొండలో 15 మందికి..
పాలకొండ రూరల్: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పిచ్చి కుక్క 15మందిని గాయపరిచింది. మూడు కుక్కలపై కూ డా దాడికి తెగబడింది. ఎన్.కె.రాజపురం, ఏలాం, ఏరియా ఆస్పత్రి సమీపంలో బి.రమేష్, కె.అప్పారావు, డి.గౌరమ్మ, సీహెచ్ రాజు, ఎ.అరవింద్, సీహెచ్ మాధురి, ఎన్.మహేం ద్ర, పుణ్యవతి, ప్రవీణ్, అవినాష్, గాయత్రితోపాటు మరో నలుగురు చిన్నారులు కూడా గాయపడ్డారు. వీరిని వెం టనే తల్లిదండ్రులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి సూపరిం టెం డెంట్ జె.రవీంద్రకుమార్, డాక్టర్ దుప్పల వెం కట శ్రీనివాస్ తదితరులు వైద్య సేవలందిం చారు. చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు.
రేగిడి మండలంలో 17 మందికి..
రేగిడి: ఉణుకూరు, పోరాం గ్రామాల్లో పిచ్చికుక్క పలువురిని గాయపరిచింది. ఉణుకూరుకు చెందిన గేదెల సీతారాం, తెంటు రామచంద్రుడు, పేకేటి సురేష్‌తో పాటు మరో ఏడుగురు, కొన్ని పశువులను గాయపరిచింది. దీం తో గ్రామస్తులు తరిమారు. దీంతో పోరాం వెళ్లిపోయింది. అక్కడ ఏడుగురిని గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా..108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి వెళ్లి.చికిత్స పొందుతున్నారు. కుక్కల బారినుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement