
మన్యం, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీశ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

పాలకొండ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలుత విశాఖపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కాసేపు జగన్ చర్చించారు.

పాలసవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. వైఎస్సార్‌తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు. ఆపై వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.

Comments
Please login to add a commentAdd a comment