పిచ్చికుక్కల దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఆదివారం చోటుచే సుకుంది. మండల పరిధిలోని మర్రిపాడు, పెద్దబుగ్గ గ్రామాల్లో సంచరిస్తున్న పిచ్చికుక్కలు బాటసారులపై దాడి చేశాయి. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు కుక్కలను హతమార్చడానికి యత్నిస్తున్నారు.