అదుపు తప్పిన బొలెరో.. | bolero accident in srikakulam district | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన బొలెరో..

Published Wed, Nov 18 2015 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

bolero accident in srikakulam district

శ్రీకాకుళం: అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ బొలెరో వాహనం స్థానికుల్ని భయాందోళనకు గురిచేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి వైజాగ్ వైపు వెళుతున్న ఓ బొలెరో వాహనం లావేరు మండలం బుదుమూరు వద్ద అదుపుతప్పింది.

దీంతో బొలెరో ఓ మహిళతో పాటు, పశువులను ఢీకొట్టింది. వాహనం మీదకు వస్తుండడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఓ ఆవు మృత్యువాత పడింది. మరో మూడు ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బొలెరోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement