injuries
-
రాహుల్ సభలో తొక్కిసలాట
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభావేదిక వద్ద తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఫూల్పూర్ నియోజకవర్గం పరిధిలోని పడిలా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారసభ ఈ ఘటనకు వేదికైంది. ప్రచారసభకు రాహుల్, అఖిలేశ్ వస్తున్నారని తెల్సి ఇరుపార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కిక్కిరిసన జనంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.ప్రసంగించేందుకు అఖిలేశ్ సభావేదిక మీదకు రాగానే జనం వేదికపైపు హఠాత్తుగా ముందుకొచ్చారు. బారికేడ్లు, అడ్డుగా ఏర్పాటుచేసిన కర్రలను తొలగించి మరీ దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి తొ క్కిసలాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. వెనక్కి వెళ్లండి అని వేదికపై నుంచి అగ్రనేతలు హెచ్చరించినా కార్యకర్తలు ఎవ్వరూ వినిపించుకోలేదు. ఓటర్ల శాంతించాలని విన్నవించినా పట్టించుకోలేదు. చాలా మంది రాహుల్, అఖిలేశ్ దాకా వచ్చి వారితో షేక్‌హ్యాండ్ కోసం స్టేజీ వద్ద ఎగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో, భారీగా పోగైన కార్యకర్తలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ భద్రతకు ముప్పుందని అక్కడి భద్రతా, పోలీసు సిబ్బంది అగ్రనేతలు రాహుల్, అఖిలేశ్‌లను అప్రమత్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రసంగించాలా వద్దా అని రాహుల్, అఖిలేశ్ కొద్దిసేపు మాట్లాడు కున్నారు. తర్వాత ప్రసంగించకుండానే ఇద్ద రు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా ముగిపోయింది. తర్వాత అక్కడి సమీపంలోని ముంగారీ ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ కూడా దాదాపు ఇదే మాదిరిగా కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని ముందుకు రాబోయారు. యూపీలో బీజేపీకి దక్కేది ఒక్కటే సీటు: రాహుల్ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యంచెప్పారు. ఆదివారం ఆయన ‘ఇండియా’ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ తరఫున రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో కలిసి ప్రచారం చేశారు. జపాన్‌లోని సుందరనగరం క్యోటోలాగా వారణాసిని తీర్చిదిద్దుతానని మోదీ గతంలో ఇచ్చిన హామీని రాహుల్ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ‘‘ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్యోటో సీటును మాత్రమే మోదీ గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్‌కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చేందుకు తెగబడింది’’ అని అన్నారు. -
IND vs ENG: టీమిండియాకు సంకటం!
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌లను తీసుకోగా... తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..! ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్‌కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు. -
ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఏం చెప్పింది?
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్‌లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి. పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. 2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ. మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ. రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది. ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!
గాయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి అవే ప్రాణాంతకంగా మారవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. దెబ్బల తగిలిన వెంటనే సత్వరమే తగిన చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు అంటున్నారు. దెబ్బల రకాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితరాలు నవీన్ మాటల్లోనే చూద్దాం!. మనిషికి గాయాలు రెండు రకాలుగా జరుగుతాయి. అవి 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు. మానసిక గాయాలు : మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానుతుంది. అదే మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము మర్చిపోలేం. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియంగా మాట్లాడుట చేతకనివారు మౌనం వహించుట ముఖ్యము. అని మన పెద్దలు చెబుతుంటారు శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుంచి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయం అంటాం. ఒకవేళ గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును. గాయమైనచోట ఇన్ఫెక్షన్కి గురయ్యి 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి. చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్, పౌడర్ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. శారీరక గాయాల రకాలు : బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గడ్డకట్టి గీక్కు పోయేలా ఉండే గాయము . గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును . బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము. బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట. ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. అలాంటి సమయంలో ఆయా వ్యక్తులకు ఉపశమనం పొందేలా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు. కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి. ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి. బెణిగిన లేదా నలిగిన గాయలకు ప్రథమ చికిత్స.. ►నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి. ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి. మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ►తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమచికిత్స ►తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి. ►గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి. ►పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు. ►గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి ►గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి. ►ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ►గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి. వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి. నొప్పినివారణ మందులు : నొప్పి తగ్గించడానికి అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4 నుంచి 5 రోజులు వాడాలి. యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు. పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే, పైన పేర్కొన్న మందతుల మీకు తగిలన గాయం తీవ్రత, మీకు అంతకుముందున్న వ్యాధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యుని పర్యవేక్షణలోనే ఆయా మందులు వాడాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే దుష్ప్రభావాలు తప్పవు) -
ఐఫోన్ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న యువతి వద్ద నుంచి ఐఫోన్ చోరీ చేసేందుకు ఇద్దరు కేడీలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఫోన్‌ను కాపాడుకునే క్రమంలో ఆటోలో నుంచి కొందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యోవికా చౌదరి తన ఐఫోన్ కోసం ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్‌ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైంది. అయితే, యోవికా చౌదరి ఢిల్లీలో సాకేత్ గ్యాన్ భారతీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళ్తోంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. ఇదే సమయంలో దొంగలు కూడా ఆ ఫోన్‌ను వదలక పోవటంతో ఫోన్‌తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే రోడ్డుపై పడిపోయి దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె చేయి జారవిడవడంతో ఫోన్‌ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో యోవికా తీవ్రంగా గాయపడింది. దీంతో, స్థానికులు, ఇతర వాహనదారులు ఆమెను మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. A woman teacher was left with a fractured nose and injuries to other parts of her body after she fell from an auto-rickshaw while allegedly trying to save her mobile phone from motorcycle-borne snatchers in south Delhi’s Saket on Friday.#delhipolice #friday #delhicrime pic.twitter.com/NarXHUs4DP — NewsNowNation (@NewsNowNation) August 14, 2023 ఇది కూడా చదవండి: విలువైన ప్రాణాలకై.. 'ఈ ఒక్క క్షణం మీకోసం'.. -
దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా..?
దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్‌పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!. ధనుర్వాతం.. టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే? శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు. కాలిన గాయాల నుంచి జరగొచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. ►వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. ►ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ►ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. ►తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి. ►గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. చికిత్స విధానం: ⇒ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు. ⇒వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ⇒ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ⇒ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి. నివారణ: ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం. అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది. అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. టీటీ ఇంజెక్షన్‌పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే... దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్‌పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్‌కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్‌కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్‌కి గాయం ఐదు కేజీల డంబెల్‌ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్‌కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్‌ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్‌ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్‌కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్‌కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
లిగమెంట్ ఇంజురీ అంటే ఏమిటి..?
-
షోల్డర్ డిస్లొకేషన్... భుజం నొప్పికి కారణాలు
-
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. ఏం చేయాలో అర్థం కాలేదు: జయా బచ్చన్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో బిగ్ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్‌లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్ జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. అసలేం జరిగిందంటే... అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో నటుడు పునీత్ ఇస్సార్‌తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్‌పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి) -
లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సరన్‌లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష) కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్‌కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. (ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) స్పందించిన పోలీసులు.. నిషా ఉపాధ్యాయ్‌పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. -
లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు. చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు. నిందితుడి లోంగుబాటు ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్పందించిన సీఎం జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేతో వివాదం గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు. -
జగిత్యాల: బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరి నదిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్తపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. -
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
IPL 2023- Mumbai Indians: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్సన్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే రిచర్డ్సన్ భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 2023 సీజన్లో అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. కాగా ఇప్పటికే ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అంశంపై సందేహం నెలకొనగా.. ఇపుడు రిచర్డ్సన్ రూపంలో మరో పేసర్ సేవలను కోల్పోయింది. దీంతో ఐపీఎల్-2023 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా గతేడాది ఐపీఎల్లో రిచర్డ్సన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. రిచర్డ్సన్ 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్‌కు దూరమైన రిచర్డ్సన్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాటికి కూడా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. చదవండి: దక్షిణాఫ్రికా ఘన విజయం -
యజమాని జంట పైశాచిక ఆనందం.. బాలికను చిత్ర హింసలు పెడతూ...
ఇంట్లో పని నిమిత్తం చేరిన ఓ మైనర్ బాలికను దంపతులైన యజమానులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాలికకు అన్నం పెట్టకుండా పస్తులుంచి ఆమెను శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు బాధితురాలిని వేధించిన రాక్షస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఉద్యోగస్తులైన ఓ దంపతుల ఇంట్లో పని మనిషిగా చేరింది. కాగా బాలికపై దంపతులు గత కొంత కాలంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని, ఇంట్లోని వస్తువులను దొంగిలించిందనే నిందలు వేస్తూ కర్రలు, ఇనుప వస్తువులను వేడి చేసి ఆమెపై దాడికి పాల్పడుతున్నారు. ముఖం, చేతులపై కొడుతూ దారుణంగా గాయపరిచారు. రోజులపాటు ఆమెకు అన్నం పెట్టకుండా హింసిస్తూ రాక్షస ఆనందం పొందారు. దీంతో ఆకలికి అలమటించి యజమానులు తిని చెత్తబుట్టలో పడేసిన ఆహారాన్ని బాలిక తినేది. అయితే దీపక్ నారాయణ అనే యాక్టివిస్ట్ బాలిక ఘోర పరిస్థితిని తెలుసుకొని ఆమె ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బాలిక ముఖం, పెదాలు, చెంపలు, చేతులపై కాలిపోయిన గాయాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. దీనిపై స్పందించిన గురుగ్రామ్‌కు చెందిన ఓ స్వంచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక యజమానుల బారి నుంచి మంగళవారం సాయంత్రం బాలికను రక్షించారు. గత కొన్ని నెలలుగా ఆమెను భయంకరంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను రక్షించే సమయంలో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఏడాది కిత్రం ఓ ఏజెన్సీ ద్వారా తమ మూడు నెలల పాపను సంరక్షణ కోసం బాలికను నియమించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సంబంధింత సెక్షన్ల ప్రకరం కేసు నమోదు చేశారు. అయితే దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అరెస్ట్ అయిన మహిళను ఆమె పనిచేస్తున్న సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. -
విమానానికి భారీ కుదుపులు..
హొనొలులు: సెలవుల్లో సరదాగా గడపాలని బయలుదేరిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు లోనై 36 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్ నుంచి హవాయిలోని హొనొలులుకు బయల్దేరిన హవాయి ఎయిర్‌లైన్స్ విమానం అరగంటలో ల్యాండవుతుందనగా భారీ కుదుపులకు లోనైంది. ఆ తాకిడికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. పైనున్న లగేజీ క్యాబిన్‌కు గుద్దుకున్నారు. వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
మృత్యుఘాతం
న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు. -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి
టోరంటో: కెనడాలోని అంటారియా ప్రావిన్స్‌లో కాల్పుల కలకలం జరిగింది. ఈ ఘటనలో 28 ఏళ్ల భారతీయ విద్యార్థి, పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మరోక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ విద్యార్థిని సత్వీందర్ సింగ్‌గా గుర్తించారు. అతను ఈ కాల్పుల సమయంలో ఆటో రిపేర్స్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతను కెనడాలోని కోనెస్టాగా కాలేజీ విద్యార్థి అని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాంగ్, ఆటో రిపేర్స్ యజమాని, మెకానిక్ షకీల్ అష్రఫ్ అక్కడికక్కడే మరణించారని చెప్పారు. ఐతే సత్వీందర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 40 ఏళ్ల సీన్ పెట్రీగా గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితుడు ఒక అధికారి కోసం వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: పుట్టిన రోజు నాడే విషాదం.. స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..)