
►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం (రన్నింగ్ వాటర్) కింద కడగాలి. అంటే... మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్‌తో వీలైనంత శుభ్రంగా కడగాలి.
►కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్‌గానే ఉంచాలి.
►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి.
►గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ నిర్ణయిస్తారు.
►గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment