First aid
-
హవ్వ.. అవ్వ
-
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్‌డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
డాక్టర్‌గా మారొద్దు.. మందులు రాయొద్దు
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ అయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం, మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఆర్ఎంపీలకు సూచనలివీ... ఆర్ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు. రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్) రాయకూడదు. రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు. ఇన్–పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్‌లను నిర్వహించరాదు. అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్ చికిత్సలు చేయరాదు. రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు. -
వరల్డ్ ట్రామా డే.. ప్రతి ఏడాది 10 లక్షల మంది చనిపోతున్నారు
జీవితం అనిశ్చితం. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా ఏదో రోడ్డు ప్రమాదానికో గురై గాయాలు కావచ్చు. అనుకోకుండా మంటలు చెలరేగి చర్మం కాలవచ్చు. హఠాత్తుగా వర్క్ప్లేస్లోనో లేదా పెద్దవయసువారు బాత్రూమ్లోనో పడిపోయి, గాయం కావచ్చు. ఇలా అనుకోకుండా ప్రమాదం జరగడం, యాక్సిడెంటల్‌గా బాధలకు గురికావడాన్ని వైద్య పరిభాషలో ‘ట్రామా’ కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రమాదాలప్పుడు అనుసరించాల్సిన మార్గ్గదర్శకాలపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ అక్టోబరు 17వ తేదీని ‘వరల్డ్ ట్రామా డే’గా నిర్వహిస్తుంటారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, అందించాల్సిన ప్రథమ చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లోనే ట్రామా కేసులెక్కువ. దీనివల్ల తలకు గాయాలు, ఎముకలు విరగడాలు వంటివి జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డం వల్ల ఏటా 50 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రతి ఆరు సెకండ్లకు మరణం సంభవిస్తోంది. ఇలా మన దేశంలో ఏటా 10 లక్షల మంది మృతిచెందడంతో పాటు రెండు కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. యువతలో సంభవించే మరణాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందేవారూ, అందునా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారే ఎక్కువ. యాక్సిడెంట్లలో లేదా పెద్ద వయసు కారణంగా తలకు గాయాలు, ఎముకలు విరగడాలు రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాల్లో తలకు గాయం కావడం మామూలే. పెద్దవయసు వారిలో మజిల్‌మాస్ తగ్గడం, కాళ్లలో స్పర్శజ్ఞానం మందగించడం, అకస్మాత్తుగా స్పృహ తప్పడం, అకస్మాత్తుగా బీపీ తగ్గిపోవడం, కొందరిలో పక్షవాతం, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి కారణాలతో పడిపోతే తలకు గాయాలు, ఎముకలు... ప్రధానంగా తుంటి ఎముక వంటివి విరగడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు. ముందుగా పరిశీలించాల్సిన లక్షణాలు... స్పృహ కోల్పోవడం ,ఫిట్స్ రావడం రెండు, అంతకన్నా ఎక్కువ వాంతులు కావడం ∙చెవి, ముక్కులోంచి రక్తం రావడం. ప్రమాదానికి ముందు మొదలుకొని 30 నిమిషాల లోపు జరిగిన సంఘటనలు గుర్తులేకపోవడం. తలకు గాయాలు తక్షణ సాయాలు ముందుగా అంబులెన్స్ ద్వారా పారామెడికల్ లేదా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి సహాయం అందాలి. ఆసుపత్రికి తీసుకొచ్చాక ఎమర్జెన్సీలోనే చికిత్స ప్రారంభం కావాలి. ఎందుకంటే మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం కష్టం కాబట్టి చికిత్స వీలైనంత త్వరగా అందాలి. రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపాలి. రోడ్డు ప్రమాదాలూ.. ప్రథమ చికిత్స సహాయం కోసం పిలవడం (కాల్ ఫర్ హెల్స్) : దీనివల్ల సమీప హాస్పిటల్‌కు బాధితుల్ని వీలైనంత త్వరగా తరలించడానికి వీలవుతుంది. దగ్గర్లోని ఆసుపత్రి వివరాలను, అంతకంటే ప్రధానంగా ఆంబులెన్స్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ∙సీన్ సేఫ్టీ : బాధితులను పక్కన చేర్చే సమయంలో అక్కడ సురక్షితంగా ఉందా అన్నది చూసుకోవాలి. ఉదా: ప్రమాద బాధితుల్ని రోడ్డు మధ్యన ఉంచడం కంటే ఓ పక్కగా తీసుకురావడం సురక్షితం. ∙తలను కదల్చకుండా ఉంచడం (హెడ్ ఇమ్మొబిలైజేషన్): తలను కదల్చకుండా ఉంచాలి. ఎందుకంటే... తలకు గాయాలైన సందర్భాల్లో మెడకూ, వెన్నుపూసకూ గాయాలైనప్పుడు, తలను కదల్చకుండా ఉంచడం వల్ల వెన్నుపూసలకు సంబంధించిన అనర్థాలను నివారించినట్లు అవుతుంది. ∙రక్తస్రావాన్ని అరికట్టడం : రక్తస్రావం జరగడం... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయాలకు దారితీసే ప్రధాన అంశం. అందుకే రక్తస్రావాన్ని అరికట్టడం... రోడ్డు ప్రమాద చికిత్సలో చాలా కీలకమైన అంశం. అందుకోసం చేయాల్సినవి... ∙రక్తస్రావానికి కారణమైన గాయం ఏదైనా ఉందేమో పరిశీలించాలి. గాయం కనిపిస్తే, దానిపై తగినంత ఒత్తిడితో రక్తస్రావం ఆగేలా చేయాలి. శుభ్రమైన గుడ్డ లేదా గాజుగుడ్డను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. గాయంపై శుభ్రమైన గుడ్డతో రెండు చేతులతో ఒత్తిడి కలిగిస్తూ పదినిమిషాలు అలాగే ఉంచాలి. టార్నికేట్ : ఒకవేళ పైన చెప్పినట్టు పదినిమిషాల పాటు ఒత్తిపట్టినా రక్తం ఆగకపోతే ఏదైనా గుడ్డతో గాయంపై రక్తం ఆగేందుకు గట్టిగా కట్టుకట్టి, అలా ఎంతసేపు కట్టి ఉంచారో వైద్య బృందాలకు తెలపాలి. అయితే ఇలా గట్టిగా ఒత్తిపట్టి ఉంచడమన్నది కాళ్లూ లేదా చేతుల విషయంలోనే జరగాలి తప్ప శరీర భాగాల్లోని మిగతా చోట్ల చేయకూడదు. కంటి గాయాలు కంటికి అనేక రకాలుగా గాయాలయ్యే అవకాశముంది. రైతులు పొలాల్లో, డొంకల్లో నడిచేప్పుడు ముళ్ల చెట్లు, తుప్పలు కంటికి కొట్టుకోవడం, ఇటుక, ఇసకలారీల్లోంచి పార్టికిల్స్ వచ్చి కళ్లలో పడటం, రాత్రి ప్రయాణాల్లో పురుగులు కళ్లకు కొట్టుకోవడం, వంటి ప్రమాదాలు జరిగి, కళ్లు గాయపడవచ్చు. ఇక పిల్లల విషయంలో బంతి / షటిల్‌కాక్ వేగంగా ఎగిరొచ్చి కంటికి ఢీకొనవచ్చు. పరిశీలించాల్సిన లక్షణాలు... ►కన్నునొప్పి, కంటివాపు ► కంట్లో ఏదైనా పడినట్లు (ఫారిన్ బాడీ) అనిపించడం ►మసగ్గా కనిపించడం,ఏమీ కనిపించకపోవడం అందించాల్సిన ప్రథమ చికిత్సలు పొలాల్లో మందు పిచికారి చేస్తున్నప్పుడు కంట్లో పడితే, దాని ప్రభావం తగ్గించడం కోసం నీళ్లతో కంటిని కడగాలి. ∙రోడ్డు ప్రమాణంలో ఫుల్ ఫేస్ హెల్మెట్ వాడాలి. ∙బంతి/షటిల్‌కాక్ కళ్లకు తగలగానే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ∙ఒక గ్లాసు నీళ్లు తీసుకుని, కన్ను ముంచి, రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కొద్ది కొద్దిసేపటికి ఈ నీళ్లను మారుస్తూ ఉండాలి. ∙కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు కంటిని ఎట్టిపరిస్థితుల్లో నలపకూడదు. కాలిన గాయాలు... తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► గాయం కాగానే... కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. అలా కనీసం 10 నిమిషాల పాటు, మంట తగ్గేవరకు కడగాలి. ► కాలినప్పుడు బట్ట చర్మానికి అంటుకుంటే దాన్ని తీయకూడదు. డాక్టర్ మాత్రమే దాన్ని తొలగిస్తారు. ∙కాలిన గాయలపై ‘క్లింగ్ ర్యాప్’ (తినే పదార్థాలపై కప్పే ట్రాన్స్పరెంట్ షీట్)తో చుట్టడం గానీ లేదా కప్పడం గానీ చేయాలి. ► గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న నీళ్లనే వాడాలి. ఐస్ వాటర్ వద్దు. ∙కాలిన గాయం మందం... మన అరచేయి మందంలో సగానికంటే ఎక్కువగా ఉన్నప్పుడూ లేదా రసాయనాల వల్ల కాలిన గాయమైతే బాధితుల్ని వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలి. ∙గాయాన్ని ఎప్పుడూ రుద్దకూడదు. ∙గాయాలపై పసుపు, పేస్టు, నెయ్యి వంటివి రాయకూడదు. డా.రాహుల్ కట్టా, ట్రామా కేర్ స్పెషలిస్ట్ -
ఫస్ట్ ఎయిడ్‌తో వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు
ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె. రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్రూమ్లోనుంచి ధబ్మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని. పిల్లల డాక్టర్ డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె. మలుపు తిప్పిన ఘటన ‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని. పసిపిల్లలకు ‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్లైన్లో సెషన్స్ నిర్వహిస్తారు. ‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది. -
రైళ్లలో అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రయాణీకుల రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. చదవండి: పాత బడ్జెట్ చదివిన సీఎం అశోక్ గెహ్లాట్..! ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. బీఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న బీఐఎస్ మార్క్ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు కలిగిస్తున్నవో ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బీఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించేందుకు ఏపీ సర్కార్ కార్యాచరణ
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించాయి. ప్రధానంగా ప్రమాదం సంభవించిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్సను వెంటనే అందించేలా పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, కాలేజీ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ప్రణాళికను ఆమోదించాయి. త్వరలో పైలట్ ప్రాజెక్టును అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. మృతుల సంఖ్య సగానికి తగ్గింపే లక్ష్యం 2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2020తో పోలిస్తే ఇది 18.8% అధికం. అలాగే, 2021లో జరిగిన ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 38 మంది మరణించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, వాటిల్లో మృతుల సంఖ్య తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. 2024నాటికి మృతుల సంఖ్యను కనీసం 50 శాతం తగ్గించడం, 2030 నాటికి ఎవరూ మృతిచెందకుండా చూడటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు.. రోడ్డు ప్రమాదం సంభవించిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకు వారికి వైద్య సహాయం అందడంలేదన్నది వాస్తవం. ఎందుకంటే.. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రయత్నించేవారు కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం వారిని వేధిస్తోంది.. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ విధానాన్ని తీసుకొచ్చింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే వారిని ప్రోత్సహించి నగదు బహుమతులు ప్రకటించింది. పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలోగా ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్స అందించడం మరో కీలక అంశం. అందుకే వివిధ వర్గాలకు ఈ చికిత్స అందించడంలో శిక్షణనివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. శిక్షణ కార్యక్రమం ఇలా.. ►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులతోపాటు ఆసక్తి ఉన్న వారికి కూడా శిక్షణనిస్తారు. ►ప్రథమ/అత్యవసర చికిత్సకు సంబంధించిన అంశాల్లో ఆఫ్‌లైన్, ఆన్లైన్లలో శిక్షణనివ్వాలని నిర్ణయించారు. ►శిక్షణ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిమ్యులేటర్లను నెలకొల్పుతుంది. ►అందులో క్షతగాత్రుల గుండె కొట్టుకునేలా చేసేందుకు కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) అందించడంతోపాటు వైద్యులు నిర్దేశించిన ఇతర విధానాలపై శిక్షణనిస్తారు. ►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులకు బ్యాచుల వారీగా తర్ఫీదునిస్తారు. ►గాయాలను పరిశీలించడం, ఊపిరి ఆడుతోందీ లేనిదీ పరీక్షించడం, గొంతు, నోటిలో ఏమైనా అడ్డంపడ్డాయేమోనని పరిశీలించడం, మెడ/వెన్నెముక గాయాలైతే క్షతగాత్రులను కదపకుండా చూడటం, క్షతగాత్రుల శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించడం, క్షతగాత్రులకు వెంటనే తాగునీరుగానీ ఆహారంగానీ అందించకుండా చూడటం, గాయాలకు ప్రథమ చికిత్స అందించడం, రక్తస్రావాన్ని నిరోధించడం, ఇతరుల సహాయంతో ఆసుపత్రికి ఎలా తరలించాలి.. మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు. ►ఒక్కో బ్యాచ్‌కు మూడ్రోజులపాటు శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. అనంతరం సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ►అనంతరం ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తారు. -
వర్షాకాలంలో పాముల బెడద.. అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి బుధవారం పొలం పనికి వెళ్లాడు. కాలుకి ఏదో విష పురుగు కరిచిందని గుర్తించాడు. నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిమిషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనకు కరిచింది విషపురుగు కాదని, చంద్రపొడి (రెసెల్స్‌వైపర్) జాతికి చెందిన విష సర్పం కాటువేసిందని గమనించి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. కేవలం అవగాహన లోపంవల్ల రైతు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ మంగళవారం పొలంపని నిమిత్తం తన పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన తక్షణమే ఎటువంటి భయానికి గురికాకుండా తన దగ్గరలోవున్న పీహెచ్‌సీకి వెళ్లి స్నేక్‌యాంటీ వీనం వ్యాక్సిన్‌ను చేయించుకున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండేళ్లలో 493 మంది పాముకాటుకు గురయ్యారు. చాలామంది సకాలంలో ఆస్పత్రికి చేరడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే మృతిచెందారు. అవగాహన ఉంటే పాముకరిచినా ప్రమాదం కాదని, సకాలంలో వైద్యసేవలు అందితే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తతే ప్రధానం.. వర్షా కాలం ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకో వటానికి అనేక ప్రాంతాలను నివాస స్థలాలుగా ఎంపిక చేసుకొంటాయి. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతోపాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకుంటాయి. కావున అప్రమత్తంగా ఉండి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచుకోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవటం చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు. విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాము కాటు లక్షణాలు, చికిత్స.. ► పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావడంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. ► పాము కాటుకు గురైన వ్యక్తిని కంగారుపెట్టరాదు. ఆందోళనకు గురయితే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తిచెందే అవకాశంఉంటుంది. ► పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి. ► వేగంగా యాంటీ వీనమ్‌ను అందించగల ఆరోగ్య కేంద్రానికి వ్యక్తిని తీసుకెళ్లాలి. ► కాటుకు దగ్గరగా గుడ్డను/వస్త్రాన్ని గట్టిగా కట్టరాదు, ఇది ప్రసరణను తగ్గిస్తుంది. ► గాయం కడగరాదు. గాయం మీద ఐస్‌ను పెట్టరాదు. ► గాయం నుంచి విషాన్ని బయటకు పీల్చడానికి ప్రత్నించరాదు. మెరుగైన వైద్యం పాముకాటు బారిన పడి న వ్యక్తికి పీహెచ్సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు సిద్ధం చేశాం. పాముకాటుకు గురైన వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవాలి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్‌వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రధానంగా భయపడకుండా నిర్భయంగా ఉండాలి. – డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం -
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన ఓ వ్యక్తికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స చేశారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ఓ వ్యక్తికి ఛాతీ నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన విమాన సిబ్బంది ఫ్లైట్‌లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళిసై వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. కోలుకున్న ప్రయాణికుడు సరైన సమయంలో స్పందించిన గవర్నర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. అదే విధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తమిళిసైకి అభినందనలు తెలిపారు. అయితే విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించి కిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. ఎంబీబీఎస్, ఎండీ డీజీఓ లాంటి వైద్య విద కోర్సులు చేసిన విషయం విదితమే. -
మొలల నివారణా అదే... ప్రాథమిక చికిత్సా అదే!!
తాజా ఆకుకూరలతో పాటు ఆహార ధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అవే మొలలకు నివారణగానూ, తొలి (ప్రాథమిక) చికిత్సగానూ ఉపయోగపడతాయని వైద్యులు, ఆహారనిపుణులు పేర్కొంటున్నారు. మలద్వారం వద్ద రక్తనాళాలు బుడిపెల్లాగా ఉబ్బి, అక్కడేదో ఉన్నట్లుగానూ, ఒక్కోసారి స్పర్శకు తెలుస్తుండటాన్ని మొలలుగా చెబుతారు. ఈ సమస్యను మూలశంక అని కూడా అంటుంటారు. ఒక్కసారిగా ఒరుసుకుపోవడంతో కొందరిలో రక్తస్రావం కావడం, బట్టలకు అంటుకుని నలుగురిలో ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. మరికొందరిలో మలద్వారం వద్ద దురద, నొప్పితో బాధిస్తుంటాయి. మూలశంక సమస్య తొలిదశల్లోనే ఉన్నవారు... ముదురాకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆయా సీజన్లలో దొరికే తాజాపండ్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పాలిష్ చేయని ధాన్యాలు, చిరుధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ద్రవాహారాలు తీసుకోవడం చేయాలి. దీనికి తోడు దేహ కదలికలకు తోడ్పడే వ్యాయామాలూ చేయాలి. చదవండి: (Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..) ఈ అంశాలన్నీ కలగలసి మలాన్ని సాఫ్ట్‌గా చేస్తాయి. దాంతో మలద్వారం వద్ద ఎలాంటి ఆటంకమూ లేకుండా మృదువుగా విసర్జితమవుతుంది. ఈ అంశమే మొలలు రానివారికి ఓ నివారణగానూ, అప్పటికే మొలలు ఉన్నవారికి ప్రాథమిక చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్)లాగా చేస్తుంది. మొలల్లో గ్రేడ్లు ఉంటాయి. వాటి తీవ్రత ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు కొన్ని అడ్వాన్స్డ్ చికిత్సలతో పాటు, శస్త్రచికిత్స వరకూ అవసరం పడవచ్చు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా ఉండాలంటే... మొలల సమస్యను కేవలం కేవలం డయటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామాలతోనే నివారించవచ్చు. -
పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
గుండెపోటు వస్తే.. ఇలా ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసాఫీసర్.. డ్యూటీలో ఉంటాడు.. తనపై ఏదో విష ప్రయోగం జరుగుతుంది.. ఛాతీలో నొప్పి మొదలై గుండెపోటు వస్తుంది. అది గుర్తించిన ఆయన మెల్లగా కారు దగ్గరికి వెళ్తాడు.. అందులో ఉన్న ఓ పరికరంతో ఛాతీపై షాక్ ఇచ్చుకుంటాడు. గుండెపోటు నుంచి బయటపడతాడు.. ఇదంతా ‘కాసినో రాయల్’జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ సీన్. అందులో షాక్ ఇచ్చుకున్న పరికరం ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’. ఇదేదో సినిమా అని కాదు. నిజంగా పనిచేసే పరికరం. గుండెపోటు వచ్చినవారి ప్రాణాలను కాపాడే పరికరం. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. పెద్ద బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిద్ధంగా ఉంచుతారు. కానీ మన దగ్గర మాత్రం ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో కూడా ఈ పరికరాలు లేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ ప్రభావంతో గుండె సమస్యలు పెరిగి.. కరోనా మొదలైనప్పటి నుంచీ.. వైరస్ ప్రభావంతోపాటు పలు ఇతర కారణాలతో గుండె సమస్యలు పెరిగాయి. 25 ఏళ్లవారి నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారినపడుతున్నారు. ఆకస్మికంగా వచ్చే ఈ సమస్యకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించకుంటే పరిస్థితి చేయిదాటుతుంది. ఎవరైనా గుండెపోటుకు గురైతే ఐదారు నిమిషాల్లోగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేస్తూ, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ (ఏఈడీ) పరికరంతో షాక్ ఇస్తే.. ప్రాణాపాయం నుంచి 70–80 శాతం వరకు కాపాడొచ్చు. కానీ మన దేశంలో ఇటువంటి వాటిపై తగిన అవగాహన లేదు. పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. అమెరికా, పలు యూరప్ దేశాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏఈడీలు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందుతుంది. ఈ పరికరం ధర లక్ష రూపాయలలోపే ఉంటుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పరికరాన్ని మన దగ్గర సీఎం కాన్వాయ్‌లలోనూ పెట్టడం లేదని.. అంటే ఈ విషయంగా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మన దేశంలో కేవలం 2 శాతం మందికే సీపీఆర్ తదితర అంశాలపై అవగాహన, చైతన్యం ఉందని చెప్తున్నారు. ప్రాణాలు కాపాడొచ్చు.. గుండెపోటుకు గురైనవారికి ఆస్పత్రికి తరలించే లోపు ప్రాథమిక చికిత్స అందించే ప్రక్రియను ‘బేసిక్ లైఫ్ సపోర్ట్ లేదా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)’అంటారు. ఛాతీపై తగిన విధంగా అదుముతూ ఉండటం, నోటిద్వారా ఊపిరి అందించడం వంటి పలు ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి. డాక్టర్లు, నర్సులు వంటి వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తే.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చు. గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతీ నిమిషం ఆలస్యానికి ఏడెనిమిది శాతం ప్రాణాపాయం పెరుగుతుంది. ఎంత త్వరగా సీపీఆర్ చేస్తే.. అంతగా కాపాడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మన దేశంలోనూ గుండె జబ్బులతో చనిపోయేవారిలో 60 శాతం మంది సడన్ కార్డియాక్ షాక్ ద్వారానే మరణిస్తున్నారు. ఇందులో చాలా వరకు ఇళ్లలో, బయట ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నవేనని.. సీపీఆర్ శిక్షణ, ఏఈడీ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలా మందిని రక్షించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా స్పందించి సీపీఆర్, ఏఈడీలతో ప్రాథమిక చికిత్స చేస్తే అంత బాగా ఫలితం ఉంటుంది. కోవిడ్‌తో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోట్లు పెరుగుతున్నాయి. అందువల్ల సీపీఆర్, ఏఈడీ తదితర అంశాల్లో ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాలి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కొన్ని నగరాల్లో సామాన్య ప్రజానీకానికి ఏఈడీ అందుబాటులో ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో మాల్స్, మల్టీప్లెక్సులు, ఎయిర్‌పోర్టుల్లో అందుబాటులో ఉంటాయి. – డాక్టర్ విజయ్‌రావు, ఎండీ (యూఎస్), రిససియేషన్ మెడిసిన్, హైదరాబాద్ -
కరెంట్‌షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స ఇలా...
►కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతున్న వైర్‌నుంచి వేరు చేయాలి. ►షాక్‌కు గురైన వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉంటే స్థిమితపడేందుకు అవసరమైన ధైర్యం చెప్పాలి. ►ఒకవేళ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉంటే పల్స్ చూడాలి. పల్స్ అందకుండా ఉంటే సీపీఆర్ చేయాలి. అంటే... శ్వాస ఆగిపోతే నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి. గుండె స్పందనలు ఆగిపోతే కనీసం రెండు అంగుళాలలోతుగా ప్రభావం పడేట్లుగా ఛాతీపైన చేతులు ఉంచి ప్రెషర్ ఇవ్వాలి. ఈ రెండూ చేస్తూ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి. ►ఎలక్ట్రిక్ షాక్ వల్ల కాలిన గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. వాటిని ఎలక్ట్రిక్ బర్న్ అంటారు. వాటికి ఆయింట్‌మెంట్స్‌గాని, పూతమందులు గాని రాయకూడదు. ►విద్యుద్ఘాతానికి గురైన వారు సాధారణంగా ఎత్తునుంచి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అకస్మాత్తుగా కదిలించకూడదు. గాయాలను బట్టి ప్రథమ చికిత్స చేయాలి. ►షాక్‌కు గురైన వారి గుండె స్పందనల్లో తేడా రావచ్చు. దాన్ని వెంట్రిక్యులార్ అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించగలం కాబట్టి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలి. -
కుక్క కాటుకు గురైతే... ఇదీ ప్రథమ చికిత్స
►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం (రన్నింగ్ వాటర్) కింద కడగాలి. అంటే... మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్‌తో వీలైనంత శుభ్రంగా కడగాలి. ►కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్‌గానే ఉంచాలి. ►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి. ►గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ నిర్ణయిస్తారు. ►గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను ఇస్తారు. -
గాయపడిన కానిస్టేబుల్ కు సింధియా ప్రధమ చికిత్స
-
కోమాలోకి వెళ్తే ఏం చేయాలంటే..
కోమా అనేది మరణం వంటి కండిషన్. అందుకు కోమాలోకి వెళ్తే వెనక్కి రారనేది చాలామంది అపోహ. కానీ అది వాస్తవం కాదు. కోమాలోంచి వెనక్కి వచ్చిన కేసులూ చాలా ఎక్కువే. కాకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే రోగి కోమాలోకి వెళ్తే కొన్ని ప్రథమ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ, బీ, సీ అంటూ సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ... ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకునే మార్గంలో అంటే ముక్కు / నోరు దారుల్లో తెమడ / గల్ల వంటిది ఏదైనా ఉంటే దాన్ని గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. బీ – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా చూడాలి. రోగికి ఊపిరి బాగా అందేలా జాగ్రత్తతీసుకోవాలి. సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలి. ఈ మూడు అంశాలతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే... అది కట్టుబడేలా మరీ ఒత్తిడి పడకుండా చూస్తూనే గట్టిగా పట్టుకుని రక్తస్రావం ఆగేలా చూడాలి. కోమాలోకి వెళ్లిన రోగిని గాలి ధారాళంగా వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం చేయవద్దు. ఈ చర్య ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రోగి మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఆల్కహాల్‌తోనూ ‘కోమా’లోకి... మద్యపానం మితిమీరితే కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. అందుకే ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఒక్కోసారి ఆల్కహాల్ వల్ల వచ్చే ఫిట్స్‌తో కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల కొన్ని సార్లు కొన్ని విటమిన్లు (ప్రధానంగా థయామిన్) లోపించడం వల్ల కోమాలోకి వెళ్తారు. ఈ కండిషన్‌ను ‘వెర్నిక్స్ ఎన్‌కెఫలోపతి’ అంటారు. వీరికి కేవలం థయామిన్ ఇస్తే చాలు కోమా నుంచి బయటకు వచ్చేస్తారు. ఆల్కహాల్ తాగాక తూలి పడిపోయి తలకు దెబ్బ తగలడం, దాని వల్ల రక్తస్రావం కావడం లేదా రక్తం గడ్డకట్టి కూడా కోమాలోకి వెళ్లవచ్చు. ఇలా కోమాలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఆల్కహాల్ కావడం వల్ల దాన్ని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. -
ఫస్ట్‌ఎయిడ్ ఏబీసీడీలు
చాలా సందర్భాల్లో ఫస్ట్ ఎయిడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఎన్నో ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ మీద మనమందరమూ అవగాహన కలిగి ఉండటం ఎంతో మంచిది. అందుకు ఉపకరించేదే ఈ కథనం. ఏదైనా ఓ అనుకోని సంఘటనతోనో, అకస్మాత్తుగా రుగ్మతతోనో రోగికి చికిత్స అవసరమైనప్పుడు వైద్య శిక్షణ అంతగా లేని మామూలు వ్యక్తులు చేసే తొలి ఆరోగ్య సేవను ప్రథవు చికిత్సగా చెబుతారు. ఆ క్షణాన అవసరమైన సేవ అందించడం ద్వారా రోగి పరిస్థితి వురింత విషమించకుండా చేయడం ఇందులో సాధ్యమవుతుంది. అలాగే ఆ సమయానికి అందించిన ఆ తొలి చికిత్సే ప్రాణాలు కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రథవు చికిత్స ఏబీసీడీలు... ఏదైనా ప్రక్రియలో ఏబీసీడీలు అంటే... ప్రాథమిక అంశాలని అర్థం. కాని ఫస్ట్ ఎయిడ్‌లో ఏ,బీ,సీ,డీలను గుర్తుంచుకుంటే చికిత్స చాలా సులువవుతుంది. తద్వారా మామూలు వ్యక్తులు కూడా చికిత్స ప్రాధాన్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. అలాగే దాన్ని అందించడమూ సులువవుతుంది. ఇక్కడి ఏ, బీ, సీ లు ప్రథమ చికిత్సలోని కొన్ని ఇంగ్లిషు మాటలకు సంక్షిప్త రూపాలు. అవి... ►ఏ అంటే... ఎయిర్ వే గాలి పీల్చే వూర్గంలో అవాంతరం లేకుండా చూడటం ►బీ అంటే... బ్రీతింగ్... శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం ►సీ అంటే... సర్క్యులేషన్... అంటే రక్తస్రావం అవ#తుంటే ఆపి... రక్త ప్రవాహ వ్యవస్థ (సర్క్యులేషన్) సక్రవుంగా సరిగ్గా జరిగేలా చూడటం. డీ అంటే ..డెడ్లీ బ్లీడింగ్ / డీఫైబ్రిలేషన్ ఉదాహరణకు... ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్లు అనిపించింది. సాధారణంగా స్పృహ తప్పిన వ్యక్తుల నాలుక వెనక్కువెళ్లవచ్చు. దాంతో అది శ్వాసతీసుకునే వూర్గాన్ని అడ్డుకుంటుంది. అందుకే పడుకున్న భంగివులోనే ఉన్న రోగి గదవును ఎత్తుగా ఉండేలా... తలను కాస్తంత పైకెత్తినట్లుగా పడుకోబెడితే శ్వాస తీసుకునే వూర్గానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది. ఇదే... మొదటి ఏ. అంటే ఎయిర్వేలో అంతరాయం లేకుండా చూడటం. అలా చేశాక... రోగికి శ్వాస అందేట్లు చేయడం, తగినంత గాలి ఆడేలా చూడటం ప్రధానం. దీన్ని బ్రీతింగ్లోని మొదటి అక్షరం ‘బి’తో సూచిస్తారు. ఇక రక్తస్రావం అవతుంటే ఆపడం... అంటే సర్క్యులేషన్ సక్రవుంగా జరిగేలా చూడటం ఆ తర్వాతి ప్రాధాన్య అంశం. దీన్నే ఇంగ్లిష్ అక్షరమైన ‘సి’తో సూచిస్తారు. ఇక వురికొందరు ‘డి’ అనే అక్షరాన్ని కూడా చేర్చి– డెడ్లీ బ్లీడింగ్ లేదా డీఫైబ్రిలేషన్ అని కూడా అంటారు. అయితే వురికొందరు ఏబీసీలు చాలనీ... డి అనే ఆ వూట ‘సి’– సర్క్యులేషన్లోనే భాగవుని అంటారు. ఇంకొందరు ప్రథవు చికిత్స ప్రిన్సిపుల్స్ చెబుతూ ఈ ప్రక్రియలో వుూడు ‘బి’లపై దృష్టినిలపాలని చెబుతుంటారు. అవి... బ్రీతింగ్ (శ్వాస), బ్లీడింగ్ (రక్తస్రావం), బోన్స్ (ఎవుుకలు). అంటే... శ్వాసక్రియ చక్కగా జరిగేలా చూడటం, రక్తస్రావాన్ని అరికట్టడం, ఎవుుకలకు ఏదైనా ప్రవూదం జరిగిందేమో చూడటం... ఈ మూడూ ∙ప్రథవు చికిత్సలోని ప్రాథమిక ప్రాణరక్షణ (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంశాలని చెబుతారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవచ్చు/చేయవచ్చు... ►కాళ్లు వుడతపడటం/మెలికపడటం వల వాస్తే... వాచిన చోట ఐస్ పెట్టాలి. స్ప్రెయిన్ అయిన కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్ ఇవ్వాలి. ►ముక్కు నుంచి రక్తస్రావం అవ#తుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయంతో వుుక్కుపై కాస్తంత ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవాలి. దీని వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. ►చెవిలో ఏదైనా దూరితే... చెవిలోకి టార్చిలైట్ వేయాలి. కాంతికి ఆకర్షితం కావడం కీటకాలకు ఉండే సహజమైన ఇన్స్టింక్ట్. అలా అది ఆ వెలుగుకు ఆకర్షితమై బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే చెవిని శుభ్రమైన నీటితో (ప్లెయిన్వాటర్తో) కడగాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెవిలో కొబ్బరినూనె వంటి జిడ్డుగా ఉండే పదార్థాలు వూత్రం అస్సలు వేయకూడదు. అది చెవి ఇన్ఫెక్షన్కు దారితీసి, మరింత ప్రమాదం తెచ్చిపెడుతుంది. ►వాంతులు, విరేచనాలు అవ#తుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియకు బదులు మెడికల్ షాపుల్లో దొరికే ఓఆర్ఎస్నే వాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం ఉప్పు, పంచదార కలిపిన నీళ్లలో ఏవైనా కాలుష్యాలు ఉంటే అది రోగిని మరింత దిగజార్చే అవకాశాలుంటాయి కాబట్టి రెడీమేడ్‌గా దొరికే ఓఆర్ఎస్నే వాడటం మంచిది. ►యాక్సిడెంట్ రోగులైతే... ప్రవూదం వల్ల అవ#తున్న రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం. రక్తం పోకుండా చూడటం వుుఖ్యం. ►కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయాన్ని కడగాలి. ►కాలిన గాయాలైతే... వాటిపైనుంచి నీళ్లు ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వెళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు) వురింతగా చెడకుండా ఉంటాయి. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు. ►జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డతో అద్దుతూ ఉండాలి. ఒంట్లోని ఉష్ణోగ్రతను గ్రహించి, ఆ తడిగుడ్డలోని నీరు ఆవిరవుతూ ఉండటం వల్ల దేహ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గేందుకు అవకాశం ఉంది. ►పాము కరచిన సందర్భంలో రోగికి తొలిసాయంగా ఆత్మస్థైర్యం కలిగించడం వుుఖ్యం. ఇక పావుు కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం వుుఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం వుుఖ్యం. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. అంతేతప్ప సినిమాల్లో చూపినట్లుగా పాముకరచిన చోట గాటుపెట్టి రక్తం బయటకు పీల్చి ఉమ్మేయడం వంటి టెక్నిక్లను అనుసరించకూడదు. ఇక గుండెపోటు వచ్చి గుండె ఆగిన సందర్భాల్లో కార్డియో పల్మునరీ రీసుసీయేషన్ (సీపీఆర్) అనే ప్రథమచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దీనికి కొద్దిపాటి శిక్షణ అవసరమవుతుంది. అలాంటి శిక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే రోగికి సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించాలి. లేదా అంబులెన్స్‌లో పీసీఆర్ చేస్తూనే ఆసుపత్రికి తీసుకురావాలి. ఇలా సీపీఆర్‌తో కూడా చాలా ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ కాబట్టి ఆసక్తి ఉన్నవారు కొద్దిపాటి శిక్షణతో దీన్ని చేయవచ్చు. అన్ని చోట్లా ఫస్ట్ ఎయిడ్ పనిచేయదు... ఏదైనా ప్రవూదమో, అత్యవసర పరిస్థితో ఏర్పడినప్పుడు మెుదటి అరగంటను ప్లాటినం క్షణాలనీ, రెండో అరగంటను బంగారు క్షణాలనీ (గోల్డెన్ మెుమెంట్స్), ఆ తర్వాతి గంటను (సిల్వర్ మొమెంట్స్) అని అంటారు. అంతే... రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే దాన్ని బట్టే అతడు కోలుకునే సవుయంలో వచ్చే (రికవరీ) సవుస్యలు అంతగా తగ్గుతాయి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు అది గ్యాస్ వల్ల కావచ్చు అనుకొని నిర్లక్ష్యం చేసి సవుయం దాటిపోయాక ఆసుపత్రికి తీసుకొస్తే పరిస్థితి వురింత జటిలం కావచ్చు. అందుకే అది గ్యాస్ వల్ల వచ్చిన సవుస్యా లేక నిజంగానే హార్ట్ ప్రాబ్లవూ అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. ఇది డాక్టర్ మాత్రమే తీసుకునే నిర్ణయమని గుర్తుంచుకోవాలి. అదే పక్షవాతం (స్ట్రోక్) విషయంలో కూడా వర్తిస్తుంది. ఓ నిర్ణీతమైన సవుయంలోనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే ఇంజెక్షన్ ఇస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది. అందుకే అలాంటి సంక్లిష్టసవుయాల్లో అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులకు వెళ్లడం వుంచిది. అదే సౌకర్యాలు లేని చోటికి వెళ్తే... ఒక డాక్టర్ నుంచి వురో డాక్టర్ వద్దకూ ఓ ఆసుపత్రి నుంచి వురో ఆసుపత్రికీ తిరుగుతూ విలువైన ఆ సవుయాన్ని కాస్తా అలా తిరగడంలోనే వృథా చేస్తే అవుూల్యమైన కాలం కాస్తా గడిచిపోయి పరిస్థితి వురింత విషమించే అవకాశం ఉంటుంది. డా. శివనారాయణరెడ్డి వెన్నపూస సీనియర్ పీడియాట్రీషియన్ అండ్ నియోనేటాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
డాక్టర్.. ఎంపీ
నకిరేకల్: తాను అటుగా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రథమ చికిత్స చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై తమ ముందు ఉన్న వాహనాన్ని వారి బైక్ ఢీకొనడంతో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన కారును ఆపి గాయపడ్డ నాగమణికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన 108ను పిలిపించి నకిరేకల్ ఆసుపత్రికి ఆమెను పంపించారు. దీంతో స్థానికులు ఎంపీపై ప్రశంసలు కురిపించారు. -
108కు సుస్తీ..
ఆత్మకూరు(పరకాల): ఆపద సమయంలో ఆదుకునే ఆపద్భందు 108కు సుస్తీ చేసింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగితే రోగిని అత్యవసరంగా వాహనంలో చేర్చి ప్రథమ చికిత్స అందజేసి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడేది 108. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గొప్ప మనసుతో ప్రవేశపెట్టిన ఈ సేవలకు ఇప్పుడు అంతరాయం కలుగుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదిలో ఎన్నో సార్లు సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 16 అంతంతమాత్రమే..మండల కేంద్రాల్లో 108 వాహనం ఉండాల్సి ఉన్నప్పటికీ ఆ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు.8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పరకాల, ఆత్మకూరు, నల్లబెల్లి, పర్వతగిరి, నర్సంపేట, సంగెం, గీసుకొండ, నెక్కొండ మండలకేంద్రాల్లో ఉండగా ఒక్కో వాహనం రెండు మండలాల్లో సేవలందిస్తోంది. ఒకటే సమయంలో రెండు మండలాల్లో అత్యవసరం ఏర్పడితే ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీల్లో రాత్రివేళ అత్యవసర సేవలు మృగ్యమయ్యాయి. దీనికి తోడు 108 వాహనాలు ప్రతి మండలకేంద్రానికి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాలుగోసారి.. ఈ ఏడాది కాలంలో డీజిల్ లేక వాహనాలు నిలిచిపోయిన సందర్భం ఇది నాలుగోసారి. 2018లో ఆగస్టు, డిసెంబర్లలో ఇదే పరిస్థితి. మూడు సార్లు నిలిచిపోగా తాజాగా ఇప్పుడు నాలుగురోజులుగా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. నాలుగురోజులుగా డీజిల్‌కు డబ్బులు లేక వాహనాలు కదలడం లేదు. డబ్బులు ఎప్పుడొస్తయో అని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. కనీసం డీజిల్‌కు డబ్బులు అందచేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండడంపై రోగులు దుమ్మెత్తిపోస్తున్నారు. పైలెట్లు, ఈఎంటీల కొరత.. జిల్లాలో 108 సర్వీసుల్లో సేవలందించాల్సిన పైలెట్లు, ఈఎంటీ(ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్)ల కొరత ఉంది. ఒక వాహనానికి ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇప్పుడు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో అక్కడక్కడ వాహనాలు కదలడం లేదు. మానిటరింగ్ వ్యవస్థ సరిగాలేదు. సమ్మెచేసినా..తీరని డిమాండ్లు.. ఇటీవల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె చేసినప్పటికి వీరి డిమాండ్లు నెరవేరలేదు. వేరే వారిని తీసుకుంటున్న ఆందోళనతో విధుల్లో చేరారు. వీరికి కనీస కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. హైకోర్టు 8 గంటల సమయం పనిచేయాలని ఆదేశించినప్పటికీ 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సిబ్బంది సరిపడా లేకపోవడంతో అధనపు పనిభారంతో ఒత్తిడి, నిరాశలో సిబ్బంది ఉంటున్నారు. కుదరని జీవీకే ఒప్పందం.. ప్రభుత్వంతో 108 సేవలకు సంబంధించి జీవీకే కంపెనీతో ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం 108 సర్వీసులపై నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాయం కలుగకుండా చూస్తాం.. 108 సర్వీసులో అంతరాయం కలుగకుండా చూస్తాం. డీజిల్ నిధులు వచ్చాయి. వాహనాలు నడిపిస్తాం. వాహనాలను నిలుపకుండా చూస్తాం.సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –శ్రీనివాస్, 108 జిల్లా కో ఆర్డినేటర్ -
జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించిన డాక్టర్ స్వాతి ఆవేదన!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తనపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఎయిడ్ నిర్వహించిన అపోలో మెడికల్ సెంటర్ డాక్టర్ కె.లలితాస్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్‌పై అటాక్ చేశారు.. వెంటనే రావాలని ఎవరో యువకులు పరుగుపరుగున రావటంతో స్టెతస్కోపు, బీపీ మెషీన్ పట్టుకుని వెంటనే అక్కడికి వెళ్లా. జగన్ ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తసిక్తం కావడంతో భయపడ్డా.. ఆయన ఓపిగ్గా జాగ్రత్త తల్లీ.. అని చెప్పారు. నేను సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి ఫస్ట్ ఎయిడ్ లోషన్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు. సుమారుగా 0.5 సెంటీమీటర్ మేర కత్తి దిగిందని రిపోర్టులో ఇచ్చా. గాయం లోతు అంతకన్నా ఎక్కువ ఉండవచ్చనే భావించా. రిపోర్టు కూడా పోలీసులు వచ్చి వెంటనే కావాలని ఒత్తిడి చేస్తే హడావుడిలో రాసిచ్చేశా. కానీ ఆ రిపోర్ట్‌ను పట్టుకుని కొన్ని చానెళ్లు, నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారు’ అని డాక్టర్ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాను ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను కూడా రికార్డ్ చేసి చానెళ్లలో తమకు అనుకూలంగా చూపించారని స్వాతి పేర్కొన్నారు. 0.5 సెం.మీ.పైన కత్తి గాయమైనప్పటికీ.. ఆ కత్తికి విష రసాయనాలు ఏమైనా ఉన్నాయేమోనని మరింత లోతు చేసి కుట్లు వేస్తారు. హైదరాబాద్‌లో డాక్టర్లు అదే చేశారు. కానీ నేనేదో పక్కాగా 0.5 సెంటీమీటర్ మాత్రమే గాయమైందని ధృవీకరించినట్టుగా వక్రీకరించారు..’అని స్వాతి వాపోయారు. -
ఏమన్న ధైర్యమా..!
పామును చూస్తేనే మనలో చాలా మంది జంకుతారు. అదే కరిస్తే.. ఖతం ఆ భయానికే సగం ప్రాణాలు పోతాయి. పాము కరిస్తే ప్రథమ చికిత్స చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మనం పాఠాల్లో విన్నవే. కానీ ఆచరణలోకి వస్తే మనం అలా చేయగలమా.. పాము కరిచినప్పుడు మనకు అంత ధైర్యం ఉంటుందా? అయితే చైనాలోని ఓ యువతి మాత్రం తనకు పాము కరిచిందని భయపడలేదు.. కంగారుపడలేదు.. ఎంతో ధైర్యంగా ఉంది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతికి పాము కరిచింది. దీంతో వెంటనే ఆ పామును ఎడమచేతిలో పట్టుకుని పరుగు పరుగున దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లింది. అంతేకాదు అక్కడ దరఖాస్తులో తన వివరాలను కూడా రాసింది. దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవైన ఆ పాము ఆమె చేతి చుట్టూ చుట్టుకుంది. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎలాంటి భయం లేకుండా ఆస్పత్రికి వెళ్లిన ఆ యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. -
పాము కరవగానే..ఇలా చేయకూడదు
పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్లే అన్నది అపోహ. అసలు పాము గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. వాస్తవానికి విష సర్పాల కన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది. తొలకరి వర్షాలతో భూమిలోని విష పురుగులు బయటకు వస్తుంటాయి. ఎక్కువగా రైతులు, కూలీలు పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అవగాహనే మంత్రంగా.. వైద్యమే సూత్రంగా ప్రత్యేక కథనం. కర్నూలు (హాస్పిటల్): జిల్లాలో ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు పలకరించాయి. తొలకరి వర్షాలకు భూమిలో దాగున్న విష సర్పాలు, పురుగులు బయటకు వస్తున్నాయి. ఆదమరిచి ఉన్న వారిని ఇవి కాటేస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో పాముకాట్లు, విష పురుగుల కాట్లకు గురై ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారం రోజుల్లోనే కర్నూలు పెద్దాసుపత్రిలో ఐదు విషపురుగు కాటు కేసులు నమోదయ్యాయి. ఇటీవల తరచూ వర్షాలు కరుస్తుండటం, ఈ కారణంగా ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు పెరగడంతో విషపురుగుల సంచారం అధికమైంది. ఒక్కోసారి అవి ఇళ్లల్లోకి రావడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొంత మంది విష పురుగులు కాటు వేయగానే నాటు మందును ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నేరుగా సమీపంలోని ఆసుపత్రికి వెళ్తే మెరుగైన చికిత్స అందుకునే వీలుంది. విష సర్పం కాటు – లక్షణాలు పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు పాము, కట్ల పాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. విష సర్పాలు వేర్వేరుగా ఉన్నట్లే వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది. సాధారణ తాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లతాచు (కింగ్‌కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. ♦ కాటు ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. ♦ నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ♦ పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, చొంగ కారవచ్చు. ♦ కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. మనిషికి పాము శత్రువు కాదు పాము మనిషికి శత్రువు కాదు. తన ఆత్మరక్షణ కోసం, విధిలేని పరిస్థితుల్లో మాత్రమే కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాము కరవగానే.. ♦ పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి. ♦ పక్కనున్న వారు ఆ పాము విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందజేయవచ్చు. ♦ నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి. ♦ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించి సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందజేసే వీలుంది. ఇలా చేయకూడదు ♦ ముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం. ♦ మరికొందరు సినిమా హీరోలా పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాముకాటు వేయగానే విషం రక్తంలో ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు. వైద్యంతో ప్రాణాలు కాపాడవచ్చు ♦ విషం విరుగుడు ఇంజక్షన్ రూపంలో త్వరగా పని చేస్తుంది. ♦ బాధితునికి ఆందోళన, షాక్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారింవచ్చు. ♦ సెలైన్ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్స మరింత మెరుగై అందించవచ్చు. ♦ పాముకాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు. ♦ చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్భంధు పథకం కింద పరిహారం లభించవచ్చు. పాములెక్కడెక్కడ ఉంటాయి ♦ ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే ఎలుకలను, తడిగా ఉండే చోట కప్పలను తినేందుకు పాములు వస్తాయి. =దుంగలు, కట్టెలు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది. ♦ పిడకల మధ్య విష పురుగులు చేరతాయి. ♦ చేలగట్ల వెంబడి నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులతో పాము కాటు ప్రమాదం తప్పుతుంది. =ముఖ్యంగా రాత్రిపూట మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి. -
డాక్టర్‌గా మారిన ట్రాఫిక్ పోలీస్
టీ.నగర్: ప్రమాదంలో గాయపడి స్పృహతప్పిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక చికిత్స చేసి కాపాడారు. ఎగ్మూర్ ఆదిత్యనార్ రౌంటానా సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనంలో అతి వేగంగా వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అక్కడ ఉన్న కాల్ ట్యాక్సీని ఢీకొన్నాడు. దీంతో ఆ వ్యక్తి కింద పడి స్పృహ తప్పాడు. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రజలు గుమికూడి ఏమి జరిగిందా అని తెలియని స్థితిలో అక్కడకు వచ్చిన ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు చొరవతీసుకుని స్పృహతప్పిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. తర్వాత సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చూసి స్థానికులు ట్రాఫిక్ పోలీసును అభినందించారు. -
‘గురుకులం’లో వైరల్ ఫీవర్
నిజాంసాగర్(జుక్కల్): ఇంటర్ విద్యార్థిని కృప మరణం మరవకముందే పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి పలువురికి జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన 8 మందికి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో పీహెచ్సీలో వైద్య చికిత్సలు చేయించారు. వీరిలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న జ్యోతి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి ఏఎన్ఎం సవిత ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో తరుచూ విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా, పాఠశాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. పెద్దకొడప్‌గల్‌లోని బాలికల గురుకులాన్ని గురువారం గ్రామ సర్పంచ్ మౌనికసాయిరెడ్డి, తహసీల్దార్ గణేశ్ తనిఖీలు చేశారు. పాఠశాలలోని డార్మెట్ రూమ్‌ల్లోని మంచాలపై విద్యార్థినులు పడుకొని ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం నుంచి జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పడంతో వారు అవాక్కయారు. వెంటనే పీహెచ్సీ వైద్యుడు శ్రీనివాస్ గుప్తను గురుకులానికి రప్పించారు. వైరల్ ఫీవర్‌తో బాధతున్న విద్యార్థినులకు పరీక్షలు చేయించారు. ఎనిమిది మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సర్పంచ్, తహసీల్దార్ గురుకులంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల డార్మెట్ రూమ్‌ల్లో దోమల బెడదతోపాటు నీటిసదుపాయం లేక విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురువుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థినులకు అందిస్తున్న పండ్లు కుళ్లడంతో సిబ్బందిపై తహసీల్దార్ మండిపడ్డారు. ఆయన ఈ విషయాన్ని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను వివరించారు. -
గుండెపోటు అని తెలియగానే ఏం చేయాలి?
కార్డియాలజీ కౌన్సెలింగ్ గుండెపోటు వచ్చినప్పుడు పెద్దాసుపత్రులకు వెళ్లే లోపు రోగికి ఎలాంటి ప్రథమ చికిత్స ఇవ్వాలో తెలియజేయండి. - ఎన్. నాగార్జున, సదాశివపేట రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్-300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల... వెంటనే ఒంటిలో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండె దడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు. నా వయసు 28 ఏళ్లు. నేను ఇటీవలే రొటీన్ చెకప్ చేయించగా... నా రక్తంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ పాళ్లు చాలా అధికంగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. నేను పూర్తిగా శాకాహారిని. వేరే ఏ విధమైన దురలవాట్లూ లేవు. పైగా ఇంత చిన్న వయసులోనే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే నమ్మకం కుదరడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - విశ్వేశ్వర రావు, చిత్తూరు మీరు తినే ఆహారం వల్లగాక... వంశపారంపర్యంగానే మీలో కొలెస్ట్రాల్ పాళ్లూ, ట్రైగ్లిజరైడ్ పాళ్లు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏ వ్యక్తి అయినా ఎలాంటి కొవ్వు పదార్థాలు తీసుకోనప్పటికీ, శరీరానికి సంక్రమించిన జన్యువులను బట్టి కొవ్వుపదార్థాల తయారీ, అవి పెరగడం వంటివి సంభవిస్తాయి. దాంతో రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ‘లిపిడ్ ప్రొఫైల్’ పరీక్ష చేయించుకోండి. కొవ్వులను అదుపులో పెట్టేందుకు వాటిని సమర్థంగా తగ్గించే మందులు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీరు డాక్టర్ల సలహా తీసుకొని, ఆ మందులను మీకు తగిన మోతాదులో వాడుకుంటూ, గుండె సంబంధమైన వ్యాధులను నివారించుకొని హాయిగా జీవితం గడపవచ్చు. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఆస్టియో పోరోసిస్‌కు పరిష్కారం ఉందా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. రుతుస్రావం ఆగిపోయింది. కండరాలు, ఎముకల నొప్పులు వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. ఆస్టియో పోరోసిస్ ఉందని అన్నారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? - సునీతా దేవి, విజయనగరం ఆస్టియో పోరోసిస్ అనేది ఎముకల సాంద్రత తగ్గించి, పగుళ్లు లేదా విరిగే అవకాశాలను పెంచే వ్యాధి. పాత కణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ ఎముకల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసు బారిపోయే ఆస్టియో పోరోసిస్ వ్యాధి మొదలువుతుంది. వీరిలో అతి చిన్న దెబ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా పగుళ్లు బారవచ్చు. ఈ పెళుసుదనం, పగుళ్లు సాధారణంగా వెన్నెముక, పక్కటెముక, తుంటి ఎముక, మణికట్ల వంటి స్థానాల్లో ఏర్పడతాయి. ఎముకల నిర్మాణంలో క్యాల్షియమ్ గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. ఆస్టియో పోరోసిస్ సమస్యను నివారించడంలో డి-విటమిన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఆస్టియో పోరోసిస్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు. కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి. కారణాలు: దీర్ఘకాలికంగా మందులు వాడటం నూనె, మసాలా పదార్థాలు వాడటం శారీరక శ్రమ లేకపోవడం వయసు పైబడిన కారణంగా సన్నబడిపోవడం సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల లక్షణాలు: ఎత్తు తగ్గి నడుము, ఇతర అవయవాలు ఒంగిపోతాయి నడుమునొప్పి అలసట ఎముకల్లో నొప్పి, ఎముకలు త్వరగా విరిగిపోవడం ఎముకల సాంద్రత తగ్గిపోవడం వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు ఎక్స్-రే డీఎక్స్ (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్-రే అబ్జార్ష్షియోమెట్రీ చికిత్స ఆస్టియో పోరోసిస్కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. ఆస్టియో పోరోసిస్కి హోమియోలో కాల్కేరియా ఫాస్ఫారికా, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
ప్రాణరక్షణలో ప్రథమ చికిత్స కీలకం
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరావు గుంటూరు మెడికల్: ప్రథమ చికిత్స ప్రాణరక్షణలో ఎంతో కీలకమని, ప్రమాదం జరిగిన మొదటి పది నిమిషాలు గోల్డెన్ పీరియడ్‌గా, ఆ సమయం రోగి ప్రాణం నిలపటంలో ఎంతో దోహదపడుతుందని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. నాలుగురోజులుగా గుంటూరు జిల్లా పరిషత్ కాంపౌండ్‌లోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రథమ చికిత్స, ప్రథమ స్పందన శిక్షణ శిబిరం ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు ఓర్పుతో, సహనంతో సేవలందించాలని కోరారు. గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి మాట్లాడుతూ నవ్యాంధ్రలో రెడ్‌క్రాస్ సేవలు ఇంకా విస్తృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీవైఎన్ బాబు, తెనాలి కార్యదర్శి భానుమతి, వినుకొండ కార్యదర్శి ప్రసాద్, కో–ఆర్డినేటర్ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తరచూ రక్తస్రావం..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. మలద్వారం దగ్గర ఒక్కోసారి చీము రక్తం కనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి. - సురేశ్ కుమార్, జగ్గయ్యపేట మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మలబద్దకం సమస్యలకు ముఖ్యకారణం పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఇటీవల ప్రతి ఐదుగురిలో ఒకరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. ఫిస్టులా అంటే రెండు వైపులా రంధ్రం ఉన్న నాళం వంటిది అని అర్థం. ఇందులో ఫిస్టులా కూడా ఒకటి. మలవిసర్జన మార్గంలో ఏర్పడే ఫిస్టులాలు బయటి వైపునకు ఒక చిన్న కురుపులా కనిపిస్తుంటాయి. కానీ లోపలి నుంచి ఒక నాళం పెరుగుతూపోయి లోపలి పేగుకు ఒక రంధ్రం ఏర్పడుతుంది. దీన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. పిరుదల మధ్య మలద్వారానికి పక్కగా ఏర్పడుతుంది. ఫిస్టులా అనేది మానవ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా ఏర్పడే ఫిస్టులాలలో ‘యానల్ ఫిస్టులా’ ఒకటి. ఇది మలద్వారంలోకి తెరచుకోవడం వల్ల అందులో నుంచి మలం రావడాన్ని ‘ఫిస్టులా ఇన్ యానో’ అంటారు. ఫిస్టులా సంవత్సరాలకొద్దీ నొప్పితో బాధిస్తుంది. వారి బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకున్నా మరల తిరగబెట్టడం వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. వారికి హోమియో వైద్యం ఒక వరం లాంటిది. కారణాలు : ఇన్ఫెక్షన్ వల్ల మలద్వారం వద్ద ఉన్న యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ కావడం, మలద్వారం వద్ద సరైన శుభ్రత పాటించకపోవడం. ఊబకాయం, గంటల తరబడి కదలిక లేకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో కనిపిస్తుంది. దురద, మంట, నొప్పి ఉండటం దుర్వాసన కలగడం మలవిసర్జన మార్గం నుంచి చీము, రక్తస్రావం కావడం. వ్యాధి నిర్ధారణ : సిబీపీ, ఈఎస్ఆర్, ఫిస్టులోగ్రామ్ చికిత్స : ఫిస్టులాకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. దీనికి హోమియోపతి వైద్యం వరం లాంటిది. ఇది పూర్తిగా మూలానికి చికిత్స చేస్తూ, ఆపరేషన్ అవసరం లేకుండా చాలావరకు నయం చేస్తుంది. దీనికి కాస్టికమ్, నైట్రిక్ యాసిడ్, కాంథరిస్ వంటి మందులు ఉపయోగించవచ్చు. అయితే రోగి లక్షణాల ఆధారంగా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వీటిని వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ చీదినప్పుడల్లా సమస్య..! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఎనిమిదేళ్లు. టూ వీలర్ మీద వెళ్లే సమయంలో వర్షంలో తడిసింది. అప్పుడు జలుబు చేసింది. ముక్కు చీదినప్పుడు రక్తం బయటకు వచ్చింది. తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే జలుబు చేసిన సమయంలో గట్టిగా చీదడం వల్ల రక్తం వచ్చిందని చెప్పారు. మందులు ఇచ్చారు. వాడాం. అయితే మళ్లీ ఒకసారి పాప ముక్కు నుంచి రక్తం వచ్చింది. మాకు చాలా భయంగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - గౌతమి, ఖమ్మం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎపిస్టాక్సిస్ అంటారు. పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం కావడం చాలా తరచుగా చూస్తుంటాం. ఇది చాలా సాధారణం. మూడు నుంచి పదేళ్ల పిల్లల్లో మరీ సాధారణం. నిజానికి మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా ముక్కునుంచి రక్తస్రావం అవుతుండటం చూస్తూనే ఉంటాం. తీవ్రతను బట్టి ఈ సమస్యను మైల్డ్ అండ్ సివియర్ అని వర్గీకరించవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మైల్డ్ అండ్ రికరెంట్ ఎపిస్టాక్సిస్ అని చెప్పవచ్చు. పిల్లల్లో ఎటోపిక్ రైనైటిస్, అడినాయిడ్స్, నేసల్ డిఫ్తీరియా, ఫారిన్‌బాడీ ఇన్ నోస్, ముక్కుకు దెబ్బతగలడం, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు, ముక్కు క్యాన్సర్ వంటి అనేక సందర్భాల్లో రక్తస్రావం అవుతుంది. అయితే మనం రొటీన్‌గా చూసే ఎపిస్టాక్సిక్ని ప్రేరేపించే కారణాలలో... వేడిగా, పొడిగా ఉండే వాతావరణం, చల్లటి వాతావరణం, గట్టిగా చీదడం, ముక్కులో వేళ్లు పెట్టి లాగడం వంటివి కొన్ని. ఇలాంటి పిల్లలకు ఎక్స్-రేస్ ఆఫ్ ప్యారానేసల్ సైనసెస్, సీబీపీ, క్లాటింగ్ అండ్ బ్లీడింగ్ టైమ్, ప్లేట్లెట్ కౌంట్ అండ్ కోయాగ్యులేషన్ స్టడీస్‌తో పాటు సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించాలి. వీటి వల్ల బ్లీడింగ్‌కు కారణాలు, నిర్దిష్టంగా ఎక్కడినుంచి రక్తస్రావం అవుతోంది అన్న విషయాలు తెలుసుకోడానికి వీలవుతుంది. ప్రథమ చికిత్స : 1) పిల్లల్లో ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆందోళన చెందకూడదు. పిల్లలకు ధైర్యం చెప్పి, సౌకర్యంగా ఉండేలా వాళ్లను కూర్చోబెట్టాలి. 2) ముందుకు ఒంగేలా చూసి, నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. 3) ముక్కుచివరి భాగాన్ని (ముక్కు రంధ్రాలపైన) బొటనవేలు, చూపుడువేలు సాయంతో కాసేపు నొక్కి పట్టి ఉంచాలి. 4) ముక్కుపైన ఐస్‌ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. పైన చెప్పిన చిన్నపాటి చర్యలతో రక్తస్రావం ఆగిపోతుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అవుతూనే ఉంటే తక్షణం ఈఎన్టీ నిపుణులను కలవడం తప్పనిసరి. నివారణ : 1) ముక్కు రంధ్రాల లోపలి భాగంలో వ్యాసలైన్ రాయాలి. 2) అలర్జీ ఉన్నవారికి క్రమం తప్పకుండా నేసల్ సెలైన్ డ్రాప్స్ వేయాలి. 3) పిల్లలకు గోళ్లు కత్తిరిస్తూ ఉండాలి. వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. 4) వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. ఇక మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది అలర్జీకి సంబంధించిన సమస్యగా అనిపిస్తోంది. కాబట్టి పైన పేర్కొన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూనే మీరొకసారి ఈఎన్టీ నిపుణులను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
‘ప్రథమ’ శిక్షణేది..!
ఆచరణకు నోచుకోని ప్రభుత్వ హామీ అనుభవ వైద్యుల్లో నిరాశ బెల్లంపల్లి : జ్వరమొచ్చినా.. జలుబు చేసినా.. కడుపు నొప్పయినా.. మరే రోగమైనా సరే పేదలు, గ్రామీణులు ముందుగా అనుభవ వైద్యుల(ఆర్ఎంపీ, పీఎంపీ)నే సంప్రదిస్తుంటారు. ఈ క్రమంలో ప్రథమ చికిత్సపై అనుభవ వైద్యులకు శిక్షణ అందించి రోగుల ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో చేపట్టిన శిక్షణ కార్యక్రమం అటకెక్కింది. ఏళ్లు గడుస్తున్నా శిక్షణ ఇప్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ హామీ ఆచరణలో అమలుకు నోచుకోకపోవడం.. ఎప్పటికప్పుడు దాటవేస్తుండడంపై వైద్యుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి అనుభవ వైద్యుల(ఆర్ఎంపీ, పీఎంపీ)కు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ ఇప్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఆ మేరకు 2009 అక్టోబర్ 1న జిల్లాలోని అనుభవ వైద్యులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఒక్కో మండలం నుంచి ఇద్దరు చొప్పున బ్యాచ్‌కు గరిష్టంగా 52 మందితో శిక్షణ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ), హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(హెచ్ఎంఆర్ఐ), డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(పారామెడికల్ బోర్డు) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణకు నిర్ణరుుంచారు. తొలి విడతగా జిల్లాలోని 2,027 మంది అనుభవ వైద్యులను శిక్షణకు ఎంపిక చేశారు. మరో 2 వేల మందికిపైగా మలి విడతలో శిక్షణ ఇవ్వాలని భావించారు. మొత్తంగా జిల్లాలోని సుమారు ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలనేది ప్రణాళిక. శిక్షణ కాలం మూడు నెలలుగా నిర్దేశించి తొలి బ్యాచ్‌కు పారామెడిక్స్ శిక్షణ దిగ్విజయంగా ముగించారు. వీరికి అర్హత పరీక్షలు నిర్విహ ంచి, మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చే క్రమంలోనే అనూహ్యంగా వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించారు. దీంతో అనుభవ వైద్యుల శిక్షణకు 2011లో బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనుభవ వైద్యుల శిక్షణపై పట్టించుకునే వారే కరువయ్యారు. శిక్షణ ఎందుకంటే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గల్లీకొకరు చొప్పున అనుభవ వైద్యులు పని చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీరి ద్వారా రోగులకు ప్రాథమిక వైద్యం అందుతోంది. జ్వరం, జలుబు, కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలపై అనుభవ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. సరైన అవగాహన లేక, తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉంటాయి(ఆ తీరుగా చికిత్స చేయడం వల్ల కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి). ప్రథమ చికిత్స అందించడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదముంది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో రోగికి అత్యవసర చికిత్స చేసి, వెంటనే ప్రధాన ఆస్పత్రికి రెఫర్ చేసి ప్రాణాలు కాపాడడంలో తోడ్పడతారనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వం సంకల్పించింది. ప్రాథమిక అంశాల్లో.. అనుభవ వైద్యులకు వైద్యరంగంలోని ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. పాముకాటు, తేలుకాటు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసరంగా ప్రథమ చికిత్స చేయడం వంటి అంశాల్లో ప్రయోగాత్మకంగా, థియరీతో సహా శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ వల్ల అనుభవ వైద్యులకు ప్రథమ చికిత్స చేసే తీరుపై, రోగి ప్రాణాలు కాపాడడంలో అవగాహన ఏర్పడింది. ఆశలు రేపి.. అనుభవ వైద్యులకు కమ్యూనిటీ పారామెడిక్స్‌లో శిక్షణ ఇప్పించి సేవలను వినియోగించుకుంటామని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఆ అంశాన్ని ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చింది. శిక్షణ కోసం రూ.33 లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం. కాని ఇంత వరకు అనుభవ వైద్యులకు రాష్ట్రంలో ఎక్కడా శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు శిక్షణ ప్రారంభిస్తారో కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం అనుభవ వైద్యులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల క్రితం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుభవ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి శిక్షణ కోసం విన్నవించగా సానుకూలంగా స్పందించారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. శిక్షణ ఇవ్వడం ఆలస్యమవుతోంది.. అనుభవ వైద్యులకు శిక్షణ ఇస్తారనే ఆశతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించడం మాలో ఆశలు రేపింది. ఇప్పటికే తీవ్ర ఆలస్యమైంది. మరే మాత్రం జాప్యం చేయకుండా శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్లు అందజేయాలి. - జి.శంకరయ్య, టీఎస్ అనుభవ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించాలి శిక్షణ ఇప్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఇన్నాళ్లుగా మాకంటూ గుర్తింపు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాం. శిక్షణ ఇస్తే మాకు మరింత భరోసా కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవాలి. - బత్తుల రవి, టీఎస్ అనుభవ వైద్యుల సంఘం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు -
స్కూల్ బస్సు బోల్తా..
ఇద్దరు బాలికలకు గాయాలు * సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ, ఎస్సై కాపుసోంపురం (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు కాపుసోంపురం గ్రామం వద్ద ఎస్.కోట పట్టణంలోని ఓ స్కూల్‌కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్కేజీ చదువుతున్న టి.మౌనిక (రాజీపేట), ఎస్.ప్రణీత (కొత్తపాలెం) విద్యార్థినులు గాయపడగా, మిగిలిన ఎనిమిది మంది సురక్షింతంగా బయటపడ్డారు. గాయపడిన బాలికలను ఎస్.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ప్రమాదానికి సంబంధించి ఎస్సై కె.రవికుమార్, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదఖండేపల్లిలో శుక్రవారం ఉదయం బయలుదేరిన స్కూల్ బస్సులో పెదఖండేపల్లి, కొత్తపాలెం, కాపుసోంపురం గ్రామాలకు చెందిన పది మంది స్కూల్ విద్యార్థులు ఎక్కారు. చిరుజల్లులు కురవడంతో కాపుసోంపురం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఎస్సై కే. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమానే డ్రైవర్ బస్సు డ్రైవర్ శ్రీను సెలవు పెట్టడంతో స్కూల్ యజమాని రంభ ఈశ్వరరావు బస్సును నడుపుతున్నాడు. అతనికి కేవలం లెర్నింగ్ లెసైన్స్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సంఘటన విషయంలో టీవీల్లో స్క్రోలింగ్ ద్వారా తెలుసుకున్న రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘరావు డీటీసీ భువనగిరి కృష్ణవేణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ కృష్ణవేణి, ఏంఎవీఐ అప్పన్న, ఎస్.కోట ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ, సంబంధిత పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 22 బస్సులు జిల్లా వ్యాప్తంగా 604 స్కూల్, కళాశాలల బస్సులుండగా ఇప్పటి వరకు 422 బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసినట్లు రవాణా శాఖ జిల్లా కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి తెలిపారు. కాపుసోంపురంలో ఆమె మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 22 బస్సులకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు హెవీ లెసైన్స్‌తో ఐదేళ్ల అనుభవం ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, వాహన నిబంధనలపై త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
ఓ వైపు చికిత్స... మరో వైపు పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన విద్యార్థిని.. భీమారం: వరంగల్ నగర పరిధి ఎర్రగట్టు గుట్టలోని కిట్స్ కళాశాలలో ఆదివారం ఓ విద్యార్థిని చికిత్స పొందుతూనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసింది. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం చల్లకొండ గ్రామానికి చెందిన నన్నం మౌనిక ఆదివారం ఉదయం పరీక్ష రాయడానికి తండ్రి రాజేందర్‌తో కలిసి కిట్స్ కళాశాలకు వచ్చింది. అప్పటికే ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్ష కేంద్రంలోకి రాగానే కడుపునొప్పి తీవ్రం కావడంతో హెల్త్ సూపర్వైజర్ నీలకంఠం ప్రథమ చికిత్స చేసి, గ్లూకోస్ ఎక్కించారు. ఉదయం 9 గంటల వరకు ప్రథమ చికిత్స జరిగింది. పరీక్ష ప్రారంభం కాగానే ఆమెను హాల్లోకి అనుమతించారు. గంట తర్వాత ఆమె అస్వస్థతకు గురికావడంతో నీలకంఠం మళ్లీ హాల్లోకి వెళ్లి ఆమెను పరీక్షించగా.. నొప్పి భరిస్తూనే పరీక్ష రాసి, ముగిశాక ఆస్పత్రికి వెళ్లింది. -
ఆదివారం.. తెగిన అనుబంధం
► రోడ్డు ప్రమాదాల్లో ► ముగ్గురి దుర్మరణం ► మరో పది మందికి గాయాలు విధి బలీయమైందంటారు. నిజమే. అది ఆడే వింత నాటకంలో బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోవాల్సిందే. బిడ్డలతో కలసి బైక్‌లో బయలుదేరిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, భార్యతో కలసి ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురై మరో భర్త ప్రాణం పోగొట్టుకున్నాడు. తమ ఇంటి దేవుడ్ని దర్శించుకునేందు కు రెండు కుటుంబాల వారు కలసి ఆనందంగా ప్రయాణిస్తున్న కారు మరి కాసేపట్లో ఆలయానికి చేరుకునేలోపే.. అదుపు తప్పి బోల్తాపడి ఓ కుటుంబ యజమానిని కాటికి పంపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పై సంఘటనల్లో మరో పది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం అందరినీ విషాదంలోకి నెట్టింది. యాడికి : యాడికి మండలం రాయలచెరువు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించగా, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఎస్ఐ కత్తి శ్రీనివాసులు కథనం ప్రకారం... మండలంలోని లక్ష్ముంపల్లికి చెందిన కొండారెడ్డి(40) తన కుమార్తె నవ్య, కుమారుడు సాయికృష్ణారెడ్డితో క లసి బైక్‌లో తాడిపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయలచెరువు సమీపంలోని ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే విపరీతమైన వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది రంగంలోకి గాయపడ్డ వారిని వెంటనే తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురినీ అనంతపురం తరలిస్తుండగా కొండారెడ్డి మార్గమధ్యంలో మరణించారు. నవ్య, సాయికృష్ణారెడ్డి అనంతపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. ఆటో బోల్తా పడి మరొకరు.. నార్పల : మండల పరిధిలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.... శింగనమల మండలంలోని పెరవలికి చెందిన గౌస్‌మోద్దీన్ భార్య ఇమాంబీతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం తాడిపత్రికి ఆటోలో వెళ్తుండగా మద్దలపల్లి సమీపంలోని కనుమవద్ద వాహనం టైర్ పగిలి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గౌస్ మోదీన్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న పెద్దిరాజు, ఆయన భార్యతో పాటు అంజనమ్మ అనే మహిళ గాయపడ్డారు. మృతుని భార్య ఇమాంబీ ఫిర్యాదు మేరకు నార్పల ఎస్ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దైవ దర్శనానికి వెళ్తుండగా.. తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం దావణగేరికి చెందిన రాఘవేంద్రరావు(40) మరణించగా, అదే గ్రామానికి చెందిన సరోజమ్మ(68), ప్రజ్వల్(16), హాంజీ(35), రామచంద్ర(30), కృష్ణమూర్తి(50) గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దావణగేరికి చెందిన కృష్ణమూర్తి, రాఘవేంద్రరావు తోడళ్లుల్లు. రెండు కుటుంబాల వారు కలసి శివమొగ్గ నుంచి మారుతీ వ్యాన్‌లో కర్నూలు జిల్లా అహోబిలంలోని నరసింహస్వామి ఆలయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎర్రగంటపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా వ్యాన్ టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడరును ఢీకొని బోల్తాపడటంతో ఈ సంఘటన జరిగింది. గాయపడిన వారందరినీ అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మరణించారు. సరోజమ్మ, ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు అనంతపురం ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాల సేకరించారు. -
హోల్డాన్.. హోల్డాన్.. ఈ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేదండీ!
సిటీ, పల్లెవెలుగు, లగ్జరీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేదు ప్రయాణికుల భద్రత పట్టించుకోని సంస్థ లబ్బీపేట : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖ వంతం అనేది నినాదానికే పరిమితమైంది. బస్సుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రథమ చికిత్సా పరికరాలనైనా ఏర్పాటు చేయడం లేదు. దీంతో అకస్మాత్తుగా వేసే బస్సు బ్రేకులతో ప్రమాణికులు ముందుకు పడి చిన్న చిన్న రక్త గాయాలకు గురైన సమయంలో ప్రథమ చికిత్స కూడా చేయలేని దయనీయ స్థితి నెలకొంది. సిటీలో తిరిగే బస్సుల్లోనే కాదు...గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు.. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్ల ఏర్పాటును గాలికొదిలేసారు. పండిట్ నెహ్రూ బస్టేషన్లో శనివారం ‘సాక్షి’ పలు బస్సులను పరిశీలించగా ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 50 శాతం బస్సుల్లో కిట్లే లేవు బస్టాండ్‌లో వేర్వేరు డిపోలకు చెందిన 30 బస్సులను పరిశీలించగా వాటిలో సగం బస్సులకు అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లే కనిపించలేదు. ఆర్టీసీతో పాటు పలు అద్దె బస్సులదీ అదే పరిస్థితి. కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను ఏర్పాటు చేయడమే సంస్థ మరిచిందంటే ప్రయాణికుల రక్షణకు ఏ మాత్రం చర్యలు తీసుకుంటుందో అర్ధమవుతుంది. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసి, దానిలో కాటన్, గాజుగుడ్డతో పాటు, టించర్, సిజర్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్కబస్సులోనూ కూడా వైద్యానికి సంబంధించి సామగ్రి కాదుకదా. 50 శాతం బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా లేవు బాక్స్లున్నా..కిట్లు లేవు బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నా అవి అలంకార ప్రాయంగానే వేలాడుతున్నాయి. వాటిలో ఒక్కదానిలో వైద్య సామగ్రి లేదు. వి జయవాడ-గుంటూరు ఏసీ నాన్‌స్టాప్ బస్సు ను పరిశీలించగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో నామ మాత్రంగా కాటన్‌ను ఉంచారు. అంతే ఏదో ఒకటి ఉంచాలని మొక్కుబడిగా వుంచినట్లు తెలుస్తోంది. గుడివాడ- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా, ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఉంది కాని ఫస్ట్ ఎయిడ్ సామగ్రి లేదు.మచిలీపట్నం.- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా పాడైన బ్యాండెడ్ లు మాత్రమే దర్శనమిచ్చారు. ఇతర సామగ్రి ఏమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో కనిపించలేదు. నాగాయలంక తిరిగే పల్లెవెలుగు బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బ్యాక్స్‌లో గ్రీజు ప్యాకెట్లు..ఇతర సావమగ్రి ఉన్నాయి. ఇలా ఏ బస్సు చూసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్న దాఖలాలు లేవు. అంటే ప్రయాణికుల రక్షణను ఆర్టీసీ గాలికొదిలేసిందనే వెల్లడవుతోంది. పైకి మాత్రం సురక్షిత ప్రయాణం అంటూ ఊదరగొట్టే ప్రచారం చేస్తున్న ఆర్టీసీ సంస్థ ..ప్రథమ చికిత్స కిట్లనే విస్మరించడం పలు విమర్శలకు తావిస్తోంది. హసన్‌కా హుకూం...తెరుచుకో శశీ ఆర్టీసీ బస్సులోని ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు నెలల తరబడి తెరుచుకోవడంలేదని ప్రయాణికులు అంటు న్నారు. ఇందుకు అవి దుమ్ముకొట్టుకుపోయి ఉండడమే అని అంటున్నారు. బాక్స్లయితే ఉన్నాయి కాని, అందులో ఫస్ట్ ఎయిడ్ ఉందో లేదో తెలియదని చెబుతున్నారు. తెరుచుకోని ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లును చూసి మూడు దశాబ్దాలనాటి ఆలీబాబా 40దొంగలు సినిమాలోని అప్పటి ప్రేక్షకుల నాలుకపై నాట్యం చేసిన డైలాగ్‌ను గుర్తుచేసు కుంటున్నారు. ‘హసన్‌కా హుకూం.. ఖుదాకీ కసం...తెరుచుకో శశీ’ అని అంటే కూడా బస్సుల్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు తెరుచుకోవని చలోక్తి విసురుతున్నారు. -
ఫస్ట్ ఎయిడ్ కిట్.. అడ్రస్ నిల్!
జిల్లాలో అత్యధిక శాతం ఆర్టీసీ బస్సుల్లో ఖాళీగా బాక్సులు కిట్ల జాడే లేదు ప్రయాణికులకు తక్షణ వైద్యం లేనట్టే జిల్లాలో అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి కొత్త బస్సులకే కిట్లు పరిమితం ‘సాక్షి’ విజిట్‌లో వాస్తవాలు వెలుగులోకి కోట్లు కుమ్మరించి బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరిస్తోంది. అమరావతి రాజధానికి కొత్త బస్సుల మంజూరు, విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆధునిక వసతుల పేరుతో సినిమా థియేటర్ల నిర్మాణం, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, సీటింగ్ సౌకర్యాలు, ఏసీ లాంజ్‌ల నిర్మాణానికి కోట్లు కుమ్మరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా బస్సుల్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మాత్రం పట్టించుకోవటం లేదు. బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లు భూతద్దం పెట్టి వెతికినా బస్సుల్లో కనిపించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు 60 శాతం బస్సుల్లో ఈ పరిస్థితి నెలకొనటం ఆర్టీసీ పనితీరుకు నిదర్శనం. జిల్లాలో శనివారం సాక్షి విజిట్ నిర్వహించగా ఈ విషయం తేటతెల్లమైంది. విజయవాడ : ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలో జిల్లాలో 14 బస్ డిపోలు, 36 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లకు పైగా ఆదాయంతో ఆర్టీసీ బస్టాండ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1349 బస్సులు ఉన్నాయి. వాటిలో 250 అద్దె ప్రాతిపదికన నడుస్తుండగా.. మిగిలినవి సొంత బస్సులు. వాటిలో 59 ఏసీ సర్వీసులు, 154 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా నిత్యం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు, రాయలసీమకు, బెంగళూరుకు వెళ్లే బస్సులు అన్ని కలుపుకొని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిత్యం 3,200 వరకు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ‘తెలుగు వెలుగు’ పాసింజర్ బస్సులు ఉన్నాయి. జిల్లాలో 5 నుంచి 10 శాతం గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున 75 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తున్నాయి. టిక్కెట్లపై సెస్ రూపంలో విజయవాడ రీజియన్‌కు ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. కిట్ల జాడేదీ? జిల్లాలో 60 శాతం బస్సుల్లో కిట్ల జాడే కనిపించటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 300 వరకు బస్సుల్లో మాత్రం బాక్సులు ఉన్నాయి. వాటిలోనూ ఈ ఏడాది సుమారు 270 బస్సుల్ని పలు దఫాలుగా కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏసీ బస్సుల్లో మాత్రమే కిట్లు అందుబాటులో ఉన్నాయి. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో మాత్రమే ఈ విషయం పట్టించుకుంటున్న రవాణా శాఖ ఆ తర్వాత విస్మరిస్తోంది. నిర్వహణ చూడాల్సిన ఆర్టీసీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లను ఏర్పాటుచేసే బాక్సులు అలంకారప్రాయంగా మారాయి. కిట్‌లో ఇవి ఉండాలి... రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటుచేయాలి. కిట్‌లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే వూండ్ క్లాత్, చిన్నపాటి గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్లు ఉండాలి. అవన్నీ కాలం చెల్లని మందులై ఉండటం తప్పనిసరి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్‌లోని మందుల్ని మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. భద్రత ఏదీ? వేసవి తీవ్రత పెరిగింది. జిల్లాలో సగటున 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో జిల్లాలోని అన్ని డిపోల్లో కలిపి సుమారు 350 సర్వీసులు నడుస్తున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బస్సులో ప్రయాణిస్తున్న తిరుపతయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగిలి బస్సులోనే మృతి చెందాడు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. మే నెలలో 48 డిగ్రీలకూ చేరవచ్చు. ఇలాంటి తరుణంలో కనీసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కొద్దిపాటి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆవైపు ఆర్టీసీ సంస్థ దృష్టి సారించాలి. -
ప్రేమించి పెళ్లి చేసుకోలేదని యువకుడిపై దాడి
ఎమ్మిగనూరు రూరల్: తన చెల్లెలను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆ యువతి అన్న స్నేహితులతో యువకుడిపై దాడి చేశాడు. శనివారం రాత్రి ఎమిగ్మనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ కాలనీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న లక్ష్మన్న శివన్న నగర్‌కు చెందిన అరుణ లు ప్రేమించుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటంతో రెండు సంవత్సరాల క్రితం ఆయువకుడిపై పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో ప్రస్తుతం నడుస్తుంది. అరుణ సోదరుడు మహేష్ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి లక్మన్న ఇంటి దగ్గరకు వెళ్లి తన చెల్లెలును పెళ్లి చేసుకోవాలని వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో మహేష్, అతని స్నేహితులు ఇద్దరు, అరుణ, తల్లి లక్ష్మి లక్ష్మన్నపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడంలో అతడిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండ టంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ శంకరయ్య విలేకరులకు వెల్లడించారు. -
‘ప్రాథమిక’మే ప్రథమం!
ఇదీ ఏడు చేపల కథే. కాకపోతే ఇవన్నీ రాజకుమారులు వేటాడేసి.. ఎండలో పెట్టిన చిన్న చేపలు కావు. దేన్నయినా అమాంతం మింగేసే షార్క్‌లు! ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి మొదలుపెడితే... ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మా కంపెనీలు, నియంత్రణ వ్యవస్థలు, బీమా కంపెనీలూ అన్నీ షార్క్‌లే. తినటానికి అలవాటుపడ్డవే. ఎండకపోవటానికి చిన్నచేపలు సాకులు చెబితే.. ఇవి మాత్రం మా నోటి దగ్గరకు వస్తే తినకుండా వదిలిపెడతామా? అని ఎదురు ప్రశ్నిస్తాయి. మరి వీటి రోగం కుదిరేదెలా? వాణిజ్య కేంద్రాలుగా మారిపోయిన వైద్యాలయాల్ని మార్చటమెలా? ఈ వైద్య విధ్వంసాన్ని ఆపటమెలా? ఐదు రోజులుగా ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు వచ్చిన స్పందన అనూహ్యం. పలువురు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల ధనదాహాన్ని కళ్లకు కట్టారు. కొందరు సూచనలూ చేశారు. స్థలాభావం వల్ల అన్నిటినీ ప్రచురించటం అసాధ్యం. అందుకే అత్యధికుల సూచనల ఉమ్మడి సారాంశం ప్రచురిస్తున్నాం. - సాక్షి ప్రత్యేక బృందం * ‘వైద్య విధ్వంసం’కు ఇదే ప్రథమ చికిత్స * ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన * అన్ని వర్గాల నుంచి సూచనల వెల్లువ పీహెచ్‌సీలే కీలకం ఈ విధ్వంసానికి ప్రథమ చికిత్స చేయాలంటే తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పటిష్టం చేయాలన్నది నిష్ఠుర సత్యం. దగ్గర్లో చక్కని వసతులు, వైద్యుడు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమైపోతాయి. కానీ ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని చూస్తే... ఎక్కడా కనీస మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండటమూ కష్టమే. ఇక పరికరాల ఊసెత్తకపోతేనే మంచిది. అందుకే ఏ చిన్న జ్వరం, దగ్గు, జలుబుకైనా పెద్దాసుపత్రికో, డబ్బులుంటే ప్రైవేటు ఆసుపత్రికో పరుగెత్తాల్సిన దుస్థితి. దీనికితోడు ఇటీవల బాగా పెరిగినజాఢ్యం ఏమిటంటే నేరుగా స్పెషలిస్టుల్ని సంప్రతించటం. చిన్నచిన్న నొప్పులొచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా మొద ట సంప్రతించాల్సింది జనరల్ ఫిజీషియన్‌నే. కొన్ని జ్వరాలు, చిన్నచిన్న నలతలు వచ్చి నిర్ణీత కాలంలో తగ్గిపోతాయి. ఇది గ్రహించేది ఫిజీషియన్ మాత్రమే. అప్పటికీ తగ్గకుంటే సదరు ఫిజీషియనే ఏ స్పెషలిస్ట్‌ను సంప్రతించాలో రిఫర్ చేస్తాడు. కానీ చెయ్యి నొప్పి వస్తోందంటే నేరుగా ఆర్థోపెడిక్నో, న్యూరాలజిస్ట్నో, ఛాతీలో కాస్తా నొప్పిగా అనిపిస్తే నేరుగా కార్డియాక్ విభాగానికి వెళ్లడం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌ను సంప్రతించినప్పుడు... తనకు పెట్టిన టార్గెట్ మేరకు ఆ ఫిజీషియన్ వారిని అవసరం లేకపోయినా స్పెషలిస్ట్‌ల దగ్గరకు పంపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కాకపోతే ఇలా జరిగేది తక్కువసార్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టంగా ఉంటే... అక్కడి ఫిజీషియన్ల చేతుల్లోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది చాలామంది వ్యక్తంచేసిన అభిప్రాయం. అందరికీ బీమా ధీమా ఉండాలి... ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద... ప్రభుత్వ హెల్త్ కార్డుల కింద బీమా పొందినవారు... ప్రైవేటు బీమా కంపెనీల నుంచి నేరుగా బీమా తీసుకున్నవారు... తాము ఉద్యోగం చేసే ఆఫీసుల ద్వారా బీమా పొందినవారు.. ఇలా అందరినీ కలిపినా ఇంకా చాలామంది బీమా లేనివారు ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే నామమాత్రపు ప్రీమియంతో ప్రజలందరికీ సామాజిక బీమాను తప్పనిసరి చేయాలన్నది మరో సూచన. డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బీమా పరిధిలో ఉండేలా ప్రభుత్వమే చొరవచూపాలి. అప్పుడు ప్రతి ఒక్కరికీ తనకేం జరిగినా బీమా ఉందనే భరోసా ఉంటుంది. ప్రభుత్వం తరఫున చికిత్స అందుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ బీమా సరిపోదనుకునే వారు, కాస్త స్థితిమంతులు వేరే బీమా చేయించుకోవచ్చు. అలా చేస్తే ఈ సామాజిక బీమాలో క్లెయిముల సంఖ్య తక్కువే ఉంటుంది. ఫలితంగా బీమా కంపెనీలు తిరస్కరించటం, ఆసుపత్రులు కూడా అనుచిత విధానాలకు పాల్పడటం వంటివి కూడా తక్కువే ఉంటాయి. డాక్టర్లు అందరిలాంటి వారేనా? డాక్టర్లూ అందరిలాంటి వారేనని, ఇక్కడ కూడా మిగతా రంగాల మాదిరిగా కొందరు తప్పులు చేయొచ్చని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కొందరు వైద్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో సామాన్యులు ఏకీభవించలేదు. ‘‘ఒక ఐటీ ఉద్యోగితో డాక్టర్లను పోల్చలేం. ఎందుకంటే ఐటీ ఉద్యోగి పడే కష్టం ఎక్కడో జీడీపీలో కనిపిస్తుంది. కానీ డాక్టరు కష్టం రోగుల మొహాల్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని కోయటానికి ఎవరికైనా అనుమతిస్తాడంటే... అది డాక్టరుకే. అలాంటి డాక్టరు తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి’’ అనేది మెజారిటీ మాట! వైద్యుడి హిస్టరీ కనిపించదేం? మనం డాక్టర్ల దగ్గరకు వెళ్లేటపుడు వారినో, వీరినో అడిగో లేదా వారికున్న మంచిపేరు చూసో వెళ్తుంటాం. కానీ వాస్తవంగా ఆ డాక్టరు అప్పటిదాకా చేసిన ఆపరేషన్లెన్ని? అందులో విజయవంతమైనవెన్ని? పేషెంట్లు సదరు డాక్టరు విషయంలో ఏం చెప్పారు? ఇలాంటి హిస్టరీ ఎక్కడా కనిపించదు. ఏ ఆసుపత్రీ చెప్పదు కూడా. రూ.100 పెట్టి సినిమా చూసినప్పుడో, ఓ రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడో అది బాగుందో లేదో తెలుసుకునే అవకాశం ఉన్నపుడు... తన ప్రాణాన్ని అప్పగించే రోగికి తనకు వైద్యం చేసే వైద్యుడి వృత్తిగత చరిత్ర తెలియజేస్తే తప్పా? ఇందుకు రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, దాన్ని నిజాయితీగా ప్రదర్శించటం వంటివి ఆసుపత్రులు చేసి తీరాలన్నది పలువురి లేఖల్లో వ్యక్తమైంది. ఇక ఎన్నికల ముందు అన్ని అంశాలనూ చర్చించే రాజకీయ పార్టీలు... వైద్యంపై తమ విధానాన్ని ప్రకటించాలన్నది మరికొందరి భావన. వాణిజ్య శక్తులపై గట్టి నియంత్రణ! మొత్తంగా వైద్యంపై పటిష్ఠమైన నియంత్రణ ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నియంత్రణ వ్యవస్థలది ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే.. ఎలుకల కోసం నిఘా వేసే స్థాయి. రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణ కోసం 2007లో ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను తెచ్చినా... ఇది కేవలం ఆస్పత్రుల ఏర్పాటు, లెసైన్సులు, రెన్యువల్ వంటి అంశాలకే పరిమితమవుతోంది. బాధిత రోగులకు అన్యాయం జరిగినప్పుడు ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏ చట్టంలోనూ లేదు. అలోపతిక్ ఆస్పత్రులను మాత్రమే కవర్ చేసే ఈ చట్టం పరిధిలో... ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలున్నా వీటికెలాంటి అధికారాలూ లేవు. ఇక ఆసుపత్రులపై ఫిర్యాదుల్ని చూసేది జిల్లా వైద్యాధికారి. అప్పిలేట్ అథారిటీ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటున్నారు. ప్రతి ఆసుపత్రీ... ఏ చికిత్సకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నోటీసు బోర్డులో విధిగా చూపించాలన్నది ఈ చట్టం పెట్టిన నియమం. కానీ దీన్ని పాటిస్తున్న ఆసుపత్రులు ఒక్కటీ ఉండదు. ఒకవేళ దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా... దిగ్గజాల్లాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ఆయన చర్యలు తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! పరిహారం ఉండాలి.. నిషేధించాలి.. ‘కాసు’పత్రుల నియంత్రణకు జిల్లా స్థాయిల్లో బలమైన నియంత్రణ వ్యవస్థలుండాలని, ఒకవేళ వాటివల్ల జరిగిన పొరపాటు రుజువైతే సదరు ఆసుపత్రి భారీ పరిహారాలు చెల్లించటంతో పాటు మళ్లీ సేవ లందించకుండా నిషేధించాలనేది కొందరి సూచన. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన సంఘటన చూస్తే... వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. అది వైద్యుడి నిర్లక్ష్యమేనని తేల్చిన రాష్ట్ర వైద్య మండలి... తనను మందలించి వదిలిపెట్టింది. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీ లు చేస్తే... అది ఆ డాక్టరును కొన్నాళ్లు వైద్యం చేయకుండా నిషేధించింది. ఇలా మందలించి వదిలిపెట్టే స్థాయిలో శిక్షలుంటే ఏ డాక్టరు భయపడతాడన్నది సమాధానం లేని ప్రశ్నే. ఈ పోరు కొనసాగిద్దాం.. ‘వైద్య విధ్వంసం’పై ఈ-మెయిల్స్, లేఖల రూపంలో అసంఖ్యాకంగా స్పందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు. స్థలాభావం వల్ల కొన్నిటినే ఇక్కడ ప్రచురించినా... మిగిలిన వాటిని కూడా సందర్భానుసారం ప్రచురించే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారాల సూచనలతో తగు వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అందజేస్తాం. వైద్యానికి సంబంధించి ఏ సంఘటననైనా, ఏ అభిప్రాయాన్నయినా sakshihealth15@gmail.com ద్వారా మీరు ఎప్పుడైనా మా దృష్టికి తేవొచ్చు. వాటిని తగు వేదికపై ప్రస్తావిస్తాం. - ఎడిటర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు, రోగికి కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వారికి సమీపంలోనే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులలో జరిపే ప్రతి టెస్ట్‌కూ ప్రభుత్వమే ఫీజు నిర్ణయించాలి. - బి.శివప్రసాదం, పరకాల(వరంగల్) హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ఉచితంగా కాకున్నా ప్రజలు- ప్రభుత్వం కలిసి 50-50 భాగస్వామ్యంతో దీన్ని కొనసాగించాలి. అప్పుడు సామాన్యులకు వైద్యమనేది భారం కాకుండా ఉంటుంది. - రమేష్, ఖమ్మం ప్రజారోగ్య సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి ‘వైద్య విధ్వంసం’పై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు అక్షర సత్యాలు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోని వైద్యం గురించి చెప్పుకోవడం.. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంటుంది. అది బాధాకరమైనా సత్యం! కార్పొరేట్ ఆసుపత్రుల్లో సమర్థులైన వైద్యులతో అధునాతన చికిత్స అందుతుందని భావిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం.. ప్రతి ఒక్కరినీ అలాంటి చికిత్సకు అర్హుడిగా చేయడానికి వేసిన ఒక అడుగు. అయితే ఆ పథకాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ఆసుపత్రులు తమ లాభార్జనకు వాడుకున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ పథకాన్ని లోపాలు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పౌరసమాజ కమిటీలను నియమించాలి. నైతిక వర్తనతో ఉండే రిటైరైన ఉద్యోగులు, విశ్రాంత విద్యావంతులను, చదువుకున్న గృహిణులు, కొంత సమయం వెచ్చించగలిగే యువతీయువకులను అందులో భాగం చేయాలి. వీళ్లతో ‘ప్రజారోగ్య సంరక్షణ కమిటీ’లు ఏర్పాటు చేసి, వాటికి కొంత సాధికారిత కల్పిస్తే ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుంది. - డాక్టర్ ఏపీ విఠల్, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా అత్యవసర చికిత్స చేసే వైద్యులు ఎక్కడ? కోట్లు పెట్టి ఆసుపత్రులు పెట్టేవారు.. అత్యవసర సమయాల్లో చేసే చికిత్సలను పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయినప్పుడు.. రోగి ఊపిరితిత్తుల్లోనికి రెండు నిమిషాల్లోనే గొట్టం (ఎండోట్రాకియల్ ట్యూబ్) వేయగలిగే డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. డ్యూటీ నర్సుకు గానీ, డ్యూటీ డాక్టరుకు గానీ, స్పెషలిస్టు డాక్టర్లకుగానీ ఈ చికిత్స విధానాన్ని నేర్పరెందుకు? అన్ని ఆసుపత్రులు ఈ ట్యూబ్‌ను అమర్చగల నిపుణులనూ, ట్యూబ్‌నూ అందుబాటులో ఉంచుకోవాలి. ఏ వైద్య విధానానికి సంబంధించిన కోర్సు అయినా.. అది పూర్తయ్యేనాటికి ‘బేసిక్ లైఫ్ సపోర్టు’ (బీఎల్ఎస్), అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్ఎస్) అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. రోగులు సైతం.. అత్యవసర చికిత్స అందించగల నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలను అడగాలి. - డాక్టర్ బ్రహ్మారెడ్డి, సూపరింటెండెంట్, ప్రజావైద్యశాల, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు, కర్నూలు అవి నిరూపితమయ్యే తప్పులు కావు అనవసరంగా పరీక్షలు రాయడం, రోగిని పిండుకోవడం వంటివి చెప్పుకోవడానికేగానీ వాటిని నిరూపించలేరు. ఆ టెస్టు ఎందుకు చేశారని అడిగితే... ‘ఆ పరీక్ష ద్వారా నే జబ్బు కనుక్కోవచ్చని అనుకున్నా’ అని వైద్యుడు అంటా డు. ఇది తప్పు అని చెప్పలేం. అయినా ప్రొసీజర్ ప్రొటోకాల్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ వంటివి అమలు చేయకపోవడంతో ప్రశ్నించలేక పోతున్నాం. రోగి అవగాహన పెంచుకుని డాక్టరును ఎంపిక చేసుకోవాలి. అయినా హోటళ్లకు, హాస్పిటల్లకూ పెద్దగా తేడా ఉందని నేననుకోవడం లేదు. - డా.కె.వెంకటేష్, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ఎంసీఐ మాజీ సభ్యుడు టార్గెట్లు ఉంటే నమ్మకమైన వైద్యం దొరకదు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టెంట్లు, ఇంప్లాంట్స్ వంటివాటితో రోగిని పీల్చేస్తున్నారు. ఇక్కడే రోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు వీటిపై తక్షణమే వ్యయ నియంత్రణ (కాస్ట్ రెగ్యులేటరీ) చేయాలి. కార్పొరేట్ ఆస్పత్రులు విధించే బిజినెస్ టార్గెట్లతో రోగికి-వైద్యుడికి మధ్య నమ్మకమైన వైద్యం సాగడం సాధ్యం కాని పని. - డా.కె.రమేశ్‌రెడ్డి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎంసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ సభ్యుడు -
108 సేవలు మమ
- అద్దె డ్రైవర్లపైనే భారం - వేధిస్తున్నటెక్నీషియన్ల కొరత - 108 సిబ్బంది సమ్మె ఎఫెక్ట్ ములుగు : ఆపదలో ఆదుకునే అపర సంజీవని 108 వాహనం. ఇంత కీలకమైన సేవలు ప్రస్తుతం తూతూమంత్రంగానే అందుతున్నాయి. వారం రోజులుగా సిబ్బంది సమ్మె చేస్తుండడం సేవలపై ప్రభావం చూపిస్తోంది. యూజమాన్యం తాత్కాలికంగా ట్రాక్టర్, వ్యాన్ డ్రైవర్లను రోజువారీ వేతనంతో నియమించుకుంటోంది. రోగులకు మార్గమధ్యలో ప్రథమ చికిత్స చేయడానికి టెక్నీషియల్లు కూడా కరువయ్యూరు. పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయూంలో108 సేవలను ప్రారంభించారు. జిల్లాలోని 51 మండలాల్లో 40వాహనాలు రోగులకు సేవలు అందించాయి. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014లో ఉద్యోగులంతా సమ్మె చేపట్టారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన యాజమాన్యం అప్పుడు కొంత మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారిని నియమించుకుంది. మరో దఫా ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం 40వాహనాలు నడుస్తుండగా 185 మంది డైవర్లు, ఈఎమ్‌టీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లు) పనిచేస్తున్నారు. వారంతా సేవలు అందించడానికి నిరాకరించడంతో యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగులపై ఆధారపడుతోంది. శిక్షణ నాలుగు రోజులే..! 108లో ఉద్యోగులకు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చాకే విధుల్లోకి తీసుకున్నారు. కానీ ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగులకు నాలుగు రోజులే శిక్షణ మమ అన్పించి నియూమకాలు చేసేస్తున్నారని సమాచారం. సంస్థ నుంచి కాల్ రాగానే డ్రైవర్లు మాత్రమే ఘటనాస్థలానికి వెళ్లి రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో పరిస్థితిని సమీక్షించే టెక్నిషియన్లు అందుబాటులో లేరు. అయితే తాత్కాలిక డ్రైవర్లను చిన్నచిన్న సమస్యలకు మాత్రమే వాడుతున్నారని తెలిసింది. దీనికి గాను వీరికి రోజువారిగా రూ.300 చెల్లిస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు.. కనీస వేతనంగా రూ.20వేలు అందించాలి. 2014 సమ్మె సందర్భంగా ఉద్యోగాలు కోల్పోరుున వారిని విధుల్లోకి తీసుకోవాలి. 108లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. రోజు వారీగా 8గంటల పని దినాలు మాత్రమే ఉండాలి. -
దేవుడే దిక్కు!
వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం స్వామివారి దర్శనం కోసం వచ్చిన రంజిత్‌కుమార్(22) అనే యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ లేదు. చివరికి కుటుంబసభ్యులు 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే ఊపిరి ఆగిపోయింది. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. వేములవాడ అర్బన్: ఎములాడ రాజన్న భక్తులకు అత్యవసర వేళ్లలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. భక్తుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా ఆలయ యంత్రాగం ఆలోచించడం లేదు. కూలైన్లలో స్పృహతప్పి పడిపోయినా, ఆలయంలో కోడెలు దాడి చేసినా, మరేదైనా కారణంగా గాయాలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ఉత్సవాల సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు వైద్య సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కోడెల దాడి, క్యూలైన్లలో స్పృహతప్పి పడిపోవడం, ఆలయ ఆవరణలోనే గుండెపోటు రావడం లాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నా అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రథమ చికిత్సకు నోచుకోని భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేంకు ప్రతిరోజు కనీసం ఐదువేల మంది భక్తులు వస్తుంటారు. ఆది, సోమ, శుక్ర, శని వారాలతో పాటు పండగలు, ప్రత్యేక రోజుల్లో సుమారు ముప్పైవేల మంది తరలివస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. దీంతో నిత్యం ఈ క్షేత్రంలో భక్తుల సందడి కనిపిస్తూంటుంది. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కనీసం ఒకరోజైనా ఇక్కడే నిద్ర చేయాలనే ఆనవాయితీ కొనసాగుతోంది. గదులు లభించని భక్తులంతా ఆలయ ఆవరణలోనే సేదతీరుతారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరమైన సమస్య తలెత్తితే వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితే నెలకొని ఉంది. దీంతోపాటు ఉపవాస దీక్షతో రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇందులో పిల్లలు, వృద్ధులు, వికలాంగలు ఉంటారు. ఈ క్రమంలో వయోభారంతో బాధపడే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడేవారు, వృద్ధులు క్యూలైన్లలో అలసిపోయి స్పృహతప్పి పడిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న ఆలయ యంత్రాంగం కనీసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూశారు. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు ఉదయం పూటనే ధర్మగుండంలో స్నానాలాచరించి ఉపవాసంతోనే స్వామి వారిని దర్శించుకోవడం శ్రేష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న కొంతమంది కిందపడిపోవడం, ధర్మగుండం వద్ద జారిపేడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇదంతా చూస్తున్న ఆలయ అధికార యంత్రాంగం భక్తులకు వైద్య సేవలందించేందుకు కనీస చర్యలకు పూనుకోవడం లేదు. భక్తుల రద్దీ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇక ఆ రాజన్నే దిక్కంటూ భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. అనాథలు, యాచకుల పరిస్థితి దయనీయం: రాజన్నను నమ్ముకొని అనేక మంది అనాథలు, యాచకులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కుటుంబసభ్యులకు ఆదరణకు దూరమైన పలువురు వృద్ధులు స్వామివారిపైనే భారం వేసి ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాచకులు సైతం భక్తులు చేసే దానధర్మాలపైనే బతుకీడుస్తున్నారు. వీరంతా వయోభారం, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ఇలాంటికి వారికి ఆలయం తరఫున వైద్యం అందించే పరిస్థితి లేకపోగా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇప్పటికే పలువురు వృద్ధులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. అందుబాటులో లేని అంబులెన్స్ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా దేవాదాయశాఖ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు భక్తులకు ఏదైనా జరిగితే వారి సంబంధీకులే స్వయంగా ఎత్తుకెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచాలని భక్తజనం కోరుకుంటున్నారు. హోమియో వైద్యశాల మూతబడి మూడేళ్లు రాజన్న ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించబడిన హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారిందని భావించిన ఆలయ అధికారులు ఆ వైద్యశాలను మూడేళ్ల క్రితమే ఎత్తివేశారు. హోమియో వైద్యశాలతో ఆర్థిక భారం పడుతుందని దానిని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోమియో వైద్యశాల ఉన్నన్నాళ్లు ఓ డాక్డర్, ఓ కాంపౌండర్ అందుబాటులో ఉంటూ కనీసం ప్రథమ చికిత్సనైనా అందించేవారు. ఆ వైద్యశాలను మూసేసిన అధికారులు మరో సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో రెండుసార్లు జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో దీని ఊసెత్తకపోవడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి నిన్న రంజిత్‌కుమార్ అనే 22 ఏళ్ల యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. అంబులెన్స్ లేనేలేదు. చివరికి 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యసిబ్బందినైనా అందుబాటులో ఉంచాలి. - నాగుల విష్ణుప్రసాద్, స్థానిక నాయకుడు రద్దీ సమయంలో వైద్యం అందిస్తాం ఆలయం పక్షాన ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమ, శుక్రవారాలు వైద్యులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యశాఖ సిబ్బందిని ఇక్కడ డిప్యూట్ చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. భక్తులకు అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
ఎముక విరిగితే...
ప్రథమ చికిత్స ప్రమాదవశాత్తూ జారిపడడం, వాహనాల ప్రమాదాలలో ఎముక విరగడం లేదా చిట్లడాన్ని చూస్తుంటాం. దీనినే ఫ్రాక్చర్ అంటాం. గాయమైన చోట చేతితో తాకినప్పుడు పేషెంటు భరించలేనంత నొప్పితో బాధపడుతున్నా, గుచ్చినట్లు నొప్పి ఉందని చెప్పినా అది ఫ్రాక్చరైందనడానికి సంకేతం. ఫ్రాక్చరైనప్పుడు కొన్నిసార్లు రక్తస్రావమవుతుంది. కొన్నిసార్లు దెబ్బ బయటకు కనిపించకుండా లోపల ఎముకకు మాత్రమే తగిలినప్పుడు మాత్రం రక్తస్రావం ఉండదు. ఫ్రాక్చర్ అయిన పేషెంటుని చాలా జాగ్రత్తగా లేవదీసి గట్టిగా, సమతలంగా ఉన్న బల్ల మీద పడుకోబెట్టాలి. పేషెంటుని కదిలించినప్పుడు ఎముకలు ఒకదానికొకటి ఒరుసుకుని ‘కరకర’ శబ్దం వచ్చిందంటే అదే ఎముక విరిగిన ప్రదేశం. ఎముక విరిగిన చోట మళ్లీ మళ్లీ రాపిడికి లోను కాకుండా ఉండడానికి దేహాన్ని సమస్థితిలో వెల్లకిలా పడుకోబెట్టాలి. గాయమైన చోట దుస్తులను తొలగించాలి. గాయానికి ఒత్తిడి కలగకుండా తీయడం సాధ్యం కాకపోతే ఆ మేరకు కత్తిరించి తొలగించాలి. గాయంతోపాటు రక్తస్రావమవుతుంటే వస్త్రాన్ని ఒత్తుగా మడత పెట్టి గాయం మీద అదిమి (ఎముకపై ఒత్తిడి పడకుండా ఒక మోస్తరుగా) పట్టుకోవాలి. ఫ్రాక్చరైనప్పుడు గాయాన్ని నీటితో కడిగే యత్నం చేయరాదు. రక్తస్రావం తగ్గిన తర్వాత గాయానికి బ్యాండేజ్ క్లాత్, అందుబాటులోని శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టి హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎముక విరిగిన చోట ఒత్తుగా వస్త్రాన్ని పెట్టి దానిపై మరో వస్త్రంతో కట్టుకట్టాలి. గాయమైన ప్రదేశాన్ని బట్టి సాధారణ వాహనంలో, లేదా అంబులెన్స్‌లో తీసుకెళ్లాలి. ఉదాహరణకు చేతి ఎముక ఫ్రాక్చర్ అయితే ప్రథమ చికిత్స తర్వాత సాధారణ వాహనంలో తీసుకెళ్లవచ్చు. కానీ, కాలు, వెన్నెముక, మెడ వంటి చోట్ల ఎముక విరిగినా, చిట్లినా అంబులెన్స్‌లో తీసుకెళ్లడమే శ్రేయస్కరం. -
నేడు 108 పెలైట్స్ డే
కోటపల్లి, న్యూస్‌లైన్ : అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మెరు పు వేగంతో సంఘటన స్థలానికి నవ సంజీవనీని తీసుకెళ్తారు. విధి నిర్వహణలో ముందుండి ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ అతి త్వరగా ఆస్పత్రుల్లో చేర్చుతారు. వారికి ఏమీ కాకూడదని కోరుకుంటారు. సోమవారం ‘108 పెలైట్స్ డే’ సందర్భంగా పైలట్స్ అంది స్తున్న సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. సేవలకు గుర్తింపుగా పెలైట్స్ డే.. 108 అంబులెన్స్‌కు మొదటి ప్రాణం ఈఎంటీ ఐతే రెండో ప్రాణం పెలైట్. ఎలాంటి విపత్తు ఎ దురైనా ఈఎంటీ తక్షణమే స్పందిస్తారు. ప్రమా ద బాధితులకు వైద్య చికిత్స అందించి వారిని కాపాడేందుకు కృషి చేస్తారు. క్షణ కాలాన్ని కూ డా వృథా కానివ్వకుండా అత్యవసర సర్వీసైన 108 అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లడం పెలైట్ బాధ్యత. అందుకే వీరిరువురు 108కు రెండు కళ్లలాంటివారిగా ఆ విభాగం ఉ న్నతాధికారులు బావిస్తుంటారు. అలాంటి వారి సేవలకు గుర్తింపునిచ్చేందుకు ప్రతీ సంవత్సరం మే26న 108 పెలైట్స్ డే జరుపుతుంటారు. బాధితులకు ఆప్తులుగా.. 108 అంబులెన్స్ సమయానికి సంఘటన స్థలానికి చేరడం, అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లడంలో ప్రతీ క్షణం విలువైందే. ప్రతీ క్షణానికి విలువని స్తూ 108 అంబులెన్స్ సేవలను ప్రతీ ఒక్కరికి తె లియపరుస్తున్న సిబ్బంది ప్రతీ ఒక్కరికి ఆప్తులే. పెలైట్ ఆపద సమయంలో వేగంతో వెళ్తున్నపు డు అంబులెన్స్‌లో ఉన్నవారితో పాటు రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఆపద కలగకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం ని ర్లక్ష్యం ప్రదర్శించినా ఇద్దరి ప్రాణాలకు అపాయ మే. అంతేకాకుండా అత్యవసర సమయంలో ఈఎంటీలకు సహాయం చేసేందుకు పెలైట్లకు ప్రథమ చికిత్స నిర్వహించే విధానంపై కూడా శి క్షణ ఇస్తారు. దీంతో ఈఎంటీలకు ప్రథమ చికి త్స సమయంలో పెలైట్లు చేదోడువాదోడుగా ఉంటారు. పెలైట్ల సేవల గుర్తింపు కోసం వారికి ఒక రోజును కేటాయించి ప్రతిభ కనబరిచిన పెలైట్లను 108 అధికారులు సత్కరిస్తుంటారు. -
గాయాలకు చికిత్స
పిల్లలు ఆటల్లో దెబ్బలు తగిలించుకోవడం సహజం. పిల్లలున్న ఇంట్లో ప్రథమచికిత్స సాధనాలు ఉంచుకోవడం ఎంత అవసరమో, చికిత్స చేసే విధానం తెలిసి ఉండడమూ అంతే అవసరం. గాయం నుంచి రక్తం కారుతుంటే శుభ్రమైన వస్త్రాన్ని లేదా గాజ్ క్లాత్‌ని ఒత్తుగా గాయం మీద పెట్టి అదిమి ఉంచాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి క్లాత్ తడిసిపోతే దానిని తీయకుండానే పైన మరికొంత క్లాత్‌ని ఉంచాలి. గాయం అయిన భాగం గుండె కంటే ఎత్తులో ఉండేటట్లు ఉంచాలి.రక్తస్రావం తగ్గిన తర్వాత గాయాన్ని సున్నితంగా వేడి నీటితో శుభ్రంచేయాలి. అవసరమైతే సబ్బు వాడవచ్చు, అయితే సబ్బు పూర్తిగా పోయే వరకు కడగాలి. హైడ్రోజెన్ పెరాక్సైడ్, అయోడిన్ వంటి వాటిని గాయం లోపలికి తగలనివ్వకుండా దూదితో గాయం చుట్టూ అద్దినట్లు తుడవాలి. గాయం మీద పసుపు లేదా యాంటీబయాటిక్ క్రీమ్ లేదా యాంటీబయాటిక్ పౌడర్ వేసి బ్యాండేజ్ క్లాత్‌తో కట్టు కట్టాలి. రోజూ కట్టు విప్పి గాయాన్ని తుడిచి కొత్త కట్టు వేయాలి. గాయం పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.అన్నింటికంటే ముఖ్యంగా ప్రథమ చికిత్స చేసే వ్యక్తి చేతులను శుభ్రంగా కడుక్కుని చికిత్స ప్రారంభించాలి. డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే... గాయం లోతుగా తగిలి, చర్మం దానంతట అది కలుసుకోక, గాయం అంచుల్లో చర్మం దూరంగా జరుగుతున్నప్పుడు (కుట్లు వేయాల్సి ఉంటుంది) ముఖం మీద గాయం తగిలినప్పుడు దుమ్ము, ధూళితో గాయం మూసుకుపోయినప్పుడు గుచ్చుకున్న వస్తువుని తొలగించడం కష్టం అయినప్పుడు గాయం నుంచి వాపు, నొప్పి, చీముకారడం, వంద డిగ్రీలకు పైగా జ్వరం రావడం వంటి ఇన్ఫెక్షన్ సోకుతున్న లక్షణాలు కనిపించినప్పుడు గాయం చుట్టూ చర్మం వాపుతో ఎర్రబారడం టెటనస్ ఇంజక్షన్ తీసుకుని ఆరు నెలలు దాటినప్పుడు -
మీరులేక.. మమ్మలి పట్టించుకోక...
అయ్యా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు. నేను మీ మానసపుత్రికను. నాకు 2008లో ‘108’ అని నామకరణం చేసింది మీరే. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు ‘108’అనే నంబర్‌కు డయల్ చేస్తే, అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ వాహనాన్ని క్షణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మండలాల విస్తీర్ణం, గ్రామాలు, జనాభా తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకుని అంబులెన్స్‌లను కేటాయించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్, గ్లూకోజ్ బాటిళ్లు, ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అంబులెన్స్ వాహనాన్ని వేగంగా నడపడానికి మంచి శిక్షణ పొందిన వారిని పైలట్లుగా నియమించారు. ప్రథమ చికిత్స అందించడానికి శిక్షణ పొందిన వారిని టెక్నీషియన్లుగా నియమించారు. మీరు ఉన్నప్పుడు... మీరు బతికి ఉన్నప్పుడు 108 అంబులెన్స్‌లకు ఎలాంటి అవసరం ఉన్నా నిధులు వెంటనే కేటాయించారు. మీరు నన్ను ప్రవేశపెట్టిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మరే ఇతర ప్రమాదాల్లో ఉన్నవారి పరిస్థితి విషమించక ముందే వారిని సకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి బతికి బట్టకట్టేలా చేశారు. పెద్ద పెద్ద కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారు వాటిని ఎలా సంరక్షించుకుంటారో మీరు మా అంబులెన్స్ వాహనాలను అలాగే చూసుకున్నారు. 108కి ఎలాంటి ఇబ్బంది, సమస్య లేకుండా కష్టం, నష్టం జరగకుండా మమ్మల్ని కన్నబిడ్డల వలే చూసుకున్నారు. మీరు చేసిన ఈ మంచి పనితో మాకు ‘సంజీవని’ అని పేరును ప్రజలు పెట్టారు. గర్భిణులు ప్రసవ వేదనతో ఉంటే వారిని సురక్షితంగా అంబులెన్స్లలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆస్పత్రులకు అద్దె వాహనాలు, అద్దె అంబులెన్స్‌లను ఉపయోగించుకునే అవసరం లేకుండా చేశారు. మీ మరణంతో మాకు కష్టాలు చాలు... అయితే మీ మరణంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మీరు ఎంతో సహృదయంతో ప్రవేశపెట్టిన వైద్య సేవలను మీ తర్వాత రోశయ్య, కిరణ్ సర్కార్లు తొక్కి పడేశాయి. అంబులెన్స్‌లకు వినియోగిస్తున్న వాహనాలు 3 లక్షల కిలోమీటర్లు దాటితే వాటిని మార్చి కొత్త వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐదేళ్ల కింద మీరు ఇచ్చిన వాహనాలే అనేకం ఉన్నాయి. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏడాదికి ఒకసారి వాహనాలను మార్చివేస్తున్నారు. మార్కెట్లో కొత్త మోడళ్లు వస్తే నిన్న, మొన్న కొన్న వాహనాలను మార్చివేసిన ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అయితే నేను ఆపదలో ఉన్నవారిని చికిత్స అందిస్తూ తరలిస్తాను. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండే నాకు సుస్తి చేస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాహనాల లైఫ్ టైం అయిపోయినా మరమ్మతులు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వాహనాలను మార్చడానికి నిధులు ఉంటాయి. కాని అపర సంజీవనిగా పేరుపొందిన అంబులెన్స్‌లను మార్చడానికి ఎవరికి దయరాదు. వాహనం పాతబడటంతో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదు. మేమే బాగుంటే మహబూబ్ బతికేవాడేమో... మొన్న మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద చెట్టుపై నుంచి కిందపడిన మహబూబ్‌ను ఆస్పత్రికి తరలించడానికి నేను అక్కడికి వెళ్లాను. అయితే నా డోర్ తెరుచుకోలేదు. చాలాసేపు మా అంబులెన్స్ సిబ్బంది కష్టపడి డోర్ తెరిచారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించే సమయంలో మళ్లీ డోర్ ఊడిపోయింది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించడానికి నేను చాలా కష్టపడ్డాను. కాని విధి వక్రీకరించింది. క్షతగాత్రుడిని సకాలంలో నేను ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే బతికి బట్టకట్టేవాడేమో? నా నిర్లక్ష్యం ఇందులో లేకపోయినా.. ప్రభుత్వం నన్ను మార్చక పోవడం మాత్రం నిజం. మీరే బతికి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? మమ్మల్ని మార్చేవారు కాదా? మమ్మల్ని మార్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేవారు. మీరులేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే మీరు మన్నించాలని మనస్పూర్థితో కోరుకుంటూ.... ఇట్లు మీ మానసపుత్రిక ‘108’ అంబులెన్స్