ఏమన్న ధైర్యమా..! | Young China woman boldness | Sakshi
Sakshi News home page

ఏమన్న ధైర్యమా..!

Published Sun, Aug 5 2018 1:15 AM | Last Updated on Sun, Aug 5 2018 1:15 AM

Young China woman boldness - Sakshi

పామును చూస్తేనే మనలో చాలా మంది జంకుతారు. అదే కరిస్తే.. ఖతం ఆ భయానికే సగం ప్రాణాలు పోతాయి. పాము కరిస్తే ప్రథమ చికిత్స చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మనం పాఠాల్లో విన్నవే. కానీ ఆచరణలోకి వస్తే మనం అలా చేయగలమా.. పాము కరిచినప్పుడు మనకు అంత ధైర్యం ఉంటుందా? అయితే చైనాలోని ఓ యువతి మాత్రం తనకు పాము కరిచిందని భయపడలేదు.. కంగారుపడలేదు.. ఎంతో ధైర్యంగా ఉంది.

చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతికి పాము కరిచింది. దీంతో వెంటనే ఆ పామును ఎడమచేతిలో పట్టుకుని పరుగు పరుగున దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లింది. అంతేకాదు అక్కడ దరఖాస్తులో తన వివరాలను కూడా రాసింది. దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవైన ఆ పాము ఆమె చేతి చుట్టూ చుట్టుకుంది. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎలాంటి భయం లేకుండా ఆస్పత్రికి వెళ్లిన ఆ యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement