పాము నిద్ర లేస్తే? | Big Snake King to release worldwide in March | Sakshi
Sakshi News home page

పాము నిద్ర లేస్తే?

Published Mon, Feb 13 2023 2:10 AM | Last Updated on Mon, Feb 13 2023 2:10 AM

Big Snake King to release worldwide in March  - Sakshi

లిక్వెన్‌ లుఓ, వాంగ్‌ జియోలాంగ్, వెంకీ జాఓ, గాఓ షెంగ్వు కీలక పా త్రల్లో గుఓ మింగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’. గత ఏడాది మే 11న చైనాలో విడుదలైన ఈ చిత్రం మార్చి 3న ఇండియాలో విడుదలకానుంది. తెలుగులో యేలూరు  సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్‌ పతాకంపై రిలీజ్‌  చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని  మంగళవారం విడుదల చేస్తున్నారు. ‘‘చైనాలోని ఒక గ్రామానికి చెందిన లీ అనే వ్యక్తి అక్రమ తవ్వకాల కోసం కొంతమందిని ఓ గుహ వద్దకు తీసుకెళతాడు. వారి కారణంగా ఆ గుహలో నిద్రపో తున్న అతిపెద్దపా ము నిద్ర లే స్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథ  ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు యేలూరు సురేంద్ర రెడ్డి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement