Surendra Reddy
-
బిగ్ స్నేక్ రెడీ
చైనాలో ఘన విజయం సాధించిన ‘బిగ్ స్నేక్ కింగ్’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లిక్వెన్ లుఓ, వాంగ్ జియోలాంగ్, వెంకీ జాఓ, గాఓ షెంగ్వు కీలక పాత్రల్లో గుఓ మింగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిగ్ స్నేక్ కింగ్’. గత ఏడాది మే 11న చైనాలో విడుదలైన ఈ చిత్రం మార్చి 3న ఇండియాలో విడుదల కానుంది. బుద్ధ భగవాన్ పతాకంపై యేలూరు సురేంద్ర రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘బిగ్ స్నేక్ కింగ్’ సిరీస్‌లో చైనా వాళ్లు దాదాపు 10 సినిమాలు చేశారు.. వాటిని కూడా నెలకి ఒకటి చొప్పున తెలుగులో రిలీజ్ చేస్తాను’’ అన్నారు. -
పాము నిద్ర లేస్తే?
లిక్వెన్ లుఓ, వాంగ్ జియోలాంగ్, వెంకీ జాఓ, గాఓ షెంగ్వు కీలక పా త్రల్లో గుఓ మింగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిగ్ స్నేక్ కింగ్’. గత ఏడాది మే 11న చైనాలో విడుదలైన ఈ చిత్రం మార్చి 3న ఇండియాలో విడుదలకానుంది. తెలుగులో యేలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ పతాకంపై రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని మంగళవారం విడుదల చేస్తున్నారు. ‘‘చైనాలోని ఒక గ్రామానికి చెందిన లీ అనే వ్యక్తి అక్రమ తవ్వకాల కోసం కొంతమందిని ఓ గుహ వద్దకు తీసుకెళతాడు. వారి కారణంగా ఆ గుహలో నిద్రపో తున్న అతిపెద్దపా ము నిద్ర లే స్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథ ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు యేలూరు సురేంద్ర రెడ్డి. -
చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు మంజూరు
పీలేరురూరల్ : మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ని యోజకవర్గాల్లో 12 చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు నిధులు మంజూరైనట్లు మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతలచెరువు అభివృద్ధి పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ పీలేరు నియో జకవర్గంలో పీలేరు మండలం చింతలచెరువుకు రూ.22 లక్షలు, కేవీపల్లె మండలం అమ్మగారిచెరువు కు రూ. 29 లక్షలు, కలకడ మండలం కదిరాయుని చెరువుకు రూ. 24 లక్షలు నిధులు మంజూరు అ య్యాయని చెప్పారు. అలాగే కలికిరి మండలంలో పెద్ద ఒడ్డు, మల్లిసముద్రం, దిగువ చెరువుకు రూ. 57.50 లక్షలు, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం పెద్దచెరువుకు రూ. 22 లక్షలు, బి.కొత్తకోట మండలం పెద్దచెరువుకు రూ. 33 లక్ష లు, పీటీఎం మండలం పెద్దచెరువుకు రూ. 49 లక్ష లు, తంబళ్లపల్లె మండలం రాతిచెరువుకు రూ. 47 లక్షలు, పెద్దమండ్యం మండలంలో మర్రికుంట చెరువు, పొట్టివానికుంట, ముసలికుంటకు రూ. 43 లక్షలు, మదనపల్లె మండలం సీటీఎం పెద్దచెరువుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ డీఈ ప్రసన్నకుమారి, ఏఈ ఎత్తిరాజులు పాల్గొన్నారు. -
హోదా కోసం బాబు బ్లాక్ డే పాటిస్తాననడం విడ్డూరం
-
నిరాహార దీక్షను మళ్లీ ప్రారంభిస్తా
నెల్లూరు(సెంట్రల్) ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరిగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపకులు పెళ్లకూరు సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కొండాయపాళెం గేటు వద్ద ఉన్న ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల 7 రోజుల పాటు దీక్ష చేశానన్నారు. బలవంతంగా నా చేత దీక్షను విరమింప చేశారన్నారు. హోదా సాధించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. నెల రోజుల తరువాత హోదాపై స్పష్టత ఇవ్వకుంటే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సమితి నాయకులు సీహెచ్ తిరుపతి యాదవ్, ఆర్ పాపారావు, కె జయకుమార్మిశ్రా పాల్గొన్నారు. -
తిరుపతికి సురేంద్రరెడ్డి తరలింపు
నెల్లూరు(అర్బన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పెద్దాసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న ఏపీ ప్రజాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డిని పోలీసులు ఆదివారం తిరుపతికి తరలించారు. సురేంద్రరెడ్డి హోదా కోసం నెల్లూరులోని కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న తన ఇంటిలో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఐదు రోజులు గడిచేసరికి ఆరోగ్యం క్షీణించిందని ఆయన దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసి పెద్దాసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ కూడా తన దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం సురేంద్రరెడ్డిని పెద్దాసుపత్రిలో డాక్టర్లు పరిశీలించారు. గుండెకి సంబంధించి ఈసీజీలో మార్పులు వచ్చాయని, బీపీ సమస్య కూడా ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. గుంటూరు లేదా తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు రెఫర్ చేశారు. దీక్ష కొనసాగిస్తా.. ఫిజిషియన్ శ్రీచందన్ సూచన మేరకు పోలీసులు తిరుపతికి తీసుకెళ్లేందుకు సురేంద్రరెడ్డి వద్దకు వెళ్లారు. ఆయన తిరుపతికి వెళ్లేందుకు అంగీకరించలేదు. తాను ఇదే ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తానని పట్టుపట్టారు. ఐదో నగర పోలీసులు ఎస్సై జగత్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన్ను బలవంతంగా తిరుపతికి తరలించబోగా అక్కడున్న కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పిస్తాం అంటూ నినదించారు. పోలీసులు బలవంతంగా 108 వాహనంలో ఎక్కించి తిరుపతికి తరలించారు. ఈసందర్భంగా సురేంద్రరెడ్డి మాట్లాడుతూ తాను తిరుపతిలో కూడా దీక్ష కొనసాగిస్తానన్నారు. ఆయన వెంట సమితి జిల్లా అధ్యక్షుడు సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి తిరుపతి యాదవ్ ఉన్నారు.