నిరాహార దీక్షను మళ్లీ ప్రారంభిస్తా
నెల్లూరు(సెంట్రల్)
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తిరిగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపకులు పెళ్లకూరు సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కొండాయపాళెం గేటు వద్ద ఉన్న ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల 7 రోజుల పాటు దీక్ష చేశానన్నారు. బలవంతంగా నా చేత దీక్షను విరమింప చేశారన్నారు. హోదా సాధించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. నెల రోజుల తరువాత హోదాపై స్పష్టత ఇవ్వకుంటే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సమితి నాయకులు సీహెచ్ తిరుపతి యాదవ్, ఆర్ పాపారావు, కె జయకుమార్‌మిశ్రా పాల్గొన్నారు.