సాక్షి,విజయవాడ: 108 సిబ్బంది నేటి అర్థరాత్రి నుంచి తలపెట్టన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. 108 సమ్మె ప్రకటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. 108 ఉద్యోగుల డిమాండ్ల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులను ఆహ్వానించింది. ప్రభుత్వం పిలుపు మేరకు నేటి అర్థరాత్రి నుండి తలపెట్టనున్న సమ్మెను యూనియన్ నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్ణయం ప్రకటిస్తామాని 108 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు.
మరోవైపు 108 ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్దమయ్యారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఉద్యోగు భద్రతతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో 108 సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ.. ‘మా డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందించాం. సాయంత్రం వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతాం’ అని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం 108 యూనియన్ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. దీంతో నేటి అర్థరాత్రి నుంచి జరగాల్సిన సమ్మె వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment