108 ambulance
-
‘భవ్యం'గా టెండరు!
సాక్షి, అమరావతి : వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్నది సామెత. ప్రభుత్వంలోనూ ఇలాంటి కీలక వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటే ఇంక తిరుగే ఉండదు.. అనుకున్న పనులు అనుకున్నట్లు చకచకా జరిగిపోతాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోంది. 108, 104 వాహనాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ టెండర్లలో ఓ అస్మదీయ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ముఖ్యనేతల డైరెక్షన్లో ‘భవ్య’మైన స్కెచ్ వేశారు. ఆ ప్రణాళిక కథాకమామిషు ఇదిగో ఇదే.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంపేద, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా గత ప్రభుత్వంలో అమలైన డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) స్కీంలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించింది. కూటమి పార్టీ నేతల జేబులు నింపే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) కార్యక్రమాలనే పక్కాగా అమలుచేస్తోంది. అస్మదీయ సంస్థలకు పనులను కట్టబెట్టడం ద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగు లు వేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలోని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు కట్టబెట్టడానికి ఓ ‘భవ్య’మైన ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. పై మూడింటికీ కలిపి ఏపీఎంఎస్ఐడీసీ ఒకే టెండరును పిలిచింది. ఈ టెండరు నిబంధనలను చూసి ‘నిబంధనలన్నీ ప్రభుత్వ పెద్దలు నిశ్చయించుకున్న సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టేలా ఉన్నాయి. ఆ సంస్థ పేరొక్కటే టెండరు డాక్యుమెంట్లో పొందుపరచలేదు’.. అని వైద్యశాఖలో ఇప్పుడీ అంశాన్ని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నిజానికి.. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో బాధితులకు సత్వర వైద్యసాయం అందజేత, ప్రివెంటివ్ కేర్‌లో 108, 104 సేవలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ పూర్వ అనుభవం, సామర్థ్యం ఎంతో కీలకం. వీలైనన్ని ఎక్కువ సంస్థలు ఈ టెండరులో పాల్గొనే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. కానీ, పెద్దఎత్తున అంబులెన్స్‌లు, ఎంఎంయూలు నిర్వహించిన, అనుభవం, సామర్థ్యంలేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం ఇష్టమొచ్చినట్లు నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఒకే తరహా సేవలకు వేర్వేరు నిబంధనలు.. రాష్ట్రవ్యాప్తంగా 1,700 అంబులెన్స్‌లు, ఎంఎంయూలు ఐదేళ్లపాటు నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.రెండు వేల కోట్ల అంచనాతో టెండరు రూపొందించారు. ఇంత విలువైన కాంట్రాక్టులను ఓ చిన్న సంస్థకు కట్టబెట్టడం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. సీవీసీ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయంలో మూడు ఆర్థిక సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ కనీసం 30 శాతం ఉండాలి. అయితే, ప్రస్తుత టెండరులో వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో 122 ఫీడర్ అంబులెన్స్ నిర్వహణ కోసం ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. ఇందులో సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు, కనీసం 33 శాతం (40) ఫీడర్ అంబులెన్సులను గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు. కానీ, 108, 104 టెండరులో మాత్రం బిడ్ దాఖలుచేసే నాటికి 100 వరకూ అంబులెన్స్‌లు/ఎంఎయూ/వెటర్నరీ యూనిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్వహించి ఉంటే చాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకే తరహా సేవలకు సంబంధించిన టెండర్లలో వేర్వేరు నిబంధనలు విధించడం ఇక్కడ గమనార్హం. ఫీడర్ అంబులెన్స్‌ల తరహాలో 33 శాతం నిబంధన పెడితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుందని 104, 108 టెండరులో మెలికపెట్టినట్లు తెలిసింది. సదరు సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో వెటర్నరీ అంబులెన్స్‌లు నిర్వహిస్తుండడంతో ప్రస్తుత టెండర్లలో వెటర్నరీ అంశాన్ని చేర్చినట్లు సమాచారం. మరోవైపు.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈహెచ్‌ఆర్) సృష్టిలో అనుభవం ఆధారంగా ఐదు మార్కులు కేటాయిస్తామని టెండరులో పేర్కొన్నారు. ఇక సదరు అస్మదీయ సంస్థ పలు రాష్ట్రాల్లో ఈహెచ్‌ఆర్ ప్రాజెక్టులు చేసిన క్రమంలో దాని ఆధారంగా మార్కులిచ్చి మేలు చేయడానికే ఈ నిబంధన కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు హెల్త్‌కేర్ ప్రాజెక్టుల్లో ఈ సంస్థ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకు 1.5 చొప్పున 15 మార్కుల వరకూ బోనస్ ఇచ్చేలా నిబంధన పెట్టారు.ఒకే బిడ్ వచ్చినా ఆమోదించేలా.. ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పనులకు టెండర్లు పిలిచినప్పుడు ఒకే సంస్థ బిడ్ వేస్తే ఆ టెండర్‌ను రద్దుచేసి, మరోసారి పిలవడం ఆనవాయితీ. కానీ, ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం పూర్వ అనుభవం, సామర్థ్యం కలిగిన సంస్థలు పోటీలో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘భవ్య’మైన ప్రణాళికను రచించింది.ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా షరతు విధించింది. దీంతో.. ఒకే సంస్థ పోటీలో ఉండేలా నిబంధనలు పొందుపరిచి, ఆ మేరకు బిడ్ ఆమోదించే వెసులుబాటు కల్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో టెండర్లు పిలిచినప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కావని, ఇప్పుడే చేర్చారని ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తిరుపతి: భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే, 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
చిన్నారిని చిదిమేసిన సర్కారు నిర్లక్ష్యం
కొత్తపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి బలైంది. 108 అంబులెన్సుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న అనవసర రాజకీయాలు ఈ దారుణానికి పరోక్ష కారణం. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో జరిగిన జాప్యంవల్ల సకాలంలో సరైన చికిత్స అందక తమ కుమార్తె మరణించిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ప్రముఖ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్ కుమార్తె రత్నప్రకాశకు పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన జోగి షారోన్కుమార్తో వివాహమైంది. వీరు ప్రస్తుతం కృష్టా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకు గ్రామంలో ఉంటున్నారు. వీరి కుమార్తె బెట్సీ జయకీర్తన (3) కొద్దిరోజులుగా ఉప్పాడలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద తల్లితో కలిసి ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు సమీపించడంతో శనివారం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేడపై ఉన్న పాత చెక్క బీరువాను కిందకు దింపి, పైన గదులు శుభ్రపరుస్తున్నారు. కింద ఆడుకుంటున్న జయకీర్తన చెక్క బీరువా గెడను పట్టుకుని వేలాడింది. అంతే.. ఒక్కసారిగా బీరువా ఆమె మీద పడింది. చిన్నారి ఏడుపు విని పరుగున వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకుతీసి కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. అయితే, అది అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 108 రాకపోవడంతో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులో కాకినాడకు తరలించారు. మార్గంమధ్యలోనే జయకీర్తన ప్రాణాలు విడిచింది. అప్పటివరకూ ఆడుకుంటూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనందంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో పండంటి బిడ్డను పోగొట్టుకున్నామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని వీరంకిలాకులకు తరలించారు. సకాలంలో 108 అంబులెన్సు వచ్చి ఉంటే తమ పాప బతికేదని తల్లి రత్నప్రకాశ విలపించింది. -
108 ఉద్యోగుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: 108 ఉద్యోగులు బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం పలు డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్ వెల్లడించారు.సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వైద్య సేవా ట్రస్ట్ సీఈవో డాక్టర్ మంజుల చర్చలు జరిపినట్టు వివరించారు. ఈ సందర్భంగా 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సాధ్యపడదని వారు తేల్చి చెప్పారన్నారు. జీవో 49ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కొత్త సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయడానికి ఆర్ఎఫ్పీ రూపొందించే సమయంలో ఉద్యోగుల సలహాలు, సూచనలను తీసుకుని వాటిని అందులో పొందుపరుస్తామని హామీ ఇచ్చారన్నారు. చర్చల్లో ఆమోదించిన మినిట్స్‌ను రాతపూర్వకంగా అందించారని చెప్పారు. -
108 ఉద్యోగుల నిరసన
-
విజయవాడలో 108 సిబ్బంది ఆందోళన
-
ఉద్యోగుల డెడ్‌లైన్.. దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: 108 సిబ్బంది నేటి అర్థరాత్రి నుంచి తలపెట్టన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. 108 సమ్మె ప్రకటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. 108 ఉద్యోగుల డిమాండ్ల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులను ఆహ్వానించింది. ప్రభుత్వం పిలుపు మేరకు నేటి అర్థరాత్రి నుండి తలపెట్టనున్న సమ్మెను యూనియన్ నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్ణయం ప్రకటిస్తామాని 108 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. మరోవైపు 108 ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్దమయ్యారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఉద్యోగు భద్రతతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో 108 సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ.. ‘మా డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందించాం. సాయంత్రం వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతాం’ అని స్పష్టం చేశారు. ఈ తరుణంలో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం 108 యూనియన్ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. దీంతో నేటి అర్థరాత్రి నుంచి జరగాల్సిన సమ్మె వాయిదా పడింది. -
అత్యవసర సేవకుల సమ్మెబాట
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. 108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్లు ఇచ్చారు. -
ఆపద్భాంధవులకే ఆపద.. సమ్మె బాటలో 108 ఉద్యోగులు
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు. జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా?
సాక్షి, అమరావతి: పేద ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రోడ్ యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు సంభవించిన ఆపద సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్ వ్యవస్థ పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాల్లోని పేదలకు వైద్య సేవలందించే 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)పైనా చిన్న చూపు చూస్తోంది. 2014–19 మధ్య ఈ రెండు వ్యవస్థలను అంపశయ్య ఎక్కించిన బాబు.. మరోసారి అదే పంధాను అనుసరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి నిర్వహణ సంస్థ అరబిందోకు పైసా విదల్చక పోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో 108, 104 సేవలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి . రూ.140 కోట్లపైనే బకాయి.. సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కాగా, ఏప్రిల్, మే, జూన్ నెలల బిల్లులను జూలై నెలలో చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కనీసం బిల్లులను వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయలేదని తెలిసింది. మరోవైపు జూలై, ఆగస్టు, సెపె్టంబర్ నెలల బిల్లులు వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పరిశీలించినట్లైతే ఆరు నెలల బిల్లులు బకాయి పడినట్లవుతోంది. మొత్తంగా రూ.140 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. నిలిచిపోయిన ఆగస్టు నెల వేతనాలు.. ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో నిర్వహణ సంస్థ 104, 108 వాహనాల డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈఎంటీలకు వేతనాలు సరిగా చెల్లించడం లేదు. సెప్టెంబర్ నెల ముగస్తున్నా.. ఆగస్టు నెల వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలల వేతనాలను సైతం సంస్థ ఆలస్యంగా చెల్లించిందని చెబుతున్నారు. 2019కు ముందు రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు 336 మాత్రమే ఉండేవి. వీటిని 768కి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెంచారు. అదే విధంగా 104 ఎంఎంయూలను 936 ప్రవేశపెట్టారు. డ్రైవర్లు, ఈఎంటీలకు వేతనాలను సైతం పెంచి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. -
మందు బాబు యాక్షన్.. అవాక్కైన 108 సిబ్బంది
బోధన్ టౌన్ (బోధన్): అత్యవసర వైద్య సేవలకు వినియోగించాల్సిన 108 అంబులెన్స్‌ను ఓ ప్రబుద్ధుడు మద్యం కొనుగోలు కోసం దుర్వినియోగం చేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన శంకర్ మంగళవారం రాత్రి తన ఆరోగ్యం బాగా లేదని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శంకర్ పేరు నమోదు చేసుకొని కొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు.. కూర్చోమని చెప్పారు. అయితే ఈలోగా శంకర్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి కొద్ది దూరంలో ఉన్న మద్యం దుకాణానికి చేరుకొని మద్యం కొనుగోలు చేస్తుండగా గమనించిన 108 సిబ్బంది శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు!
వరంగల్: 108.. ఈ నంబర్ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొదటి నుండి ఇలా.. దివంగత నేత వైఎస్సార్ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్‌పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్‌లో చికిత్స పొందింది. అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది. ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్ హెల్త్ సర్వీస్’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు. సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు! -
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
తండ్రి స్వప్నాన్ని నిజం చేసిన తనయుడు
వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ఒక బృహత్తరమైన కలకంటూ అది పూర్తిగా నెరవేరక ముందే అర్ధంతరంగా నిష్క్రమించారు. దాన్ని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సామాన్య ప్రజలకోసం ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో ఒక బృహత్తర కార్యక్రమానికి రూప కల్పన చేశారు. సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పో రేట్ స్థాయి వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చిన పథకమే ఆరోగ్య శ్రీ. అందులో భాగంగానే అత్యవసర సమయాల్లో, పిలుపు అందగానే రయ్యిమని వచ్చి ప్రమాదాల్లో చిక్కు కున్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి ఉద్దేశించిన ‘108 అంబులెన్స్ సర్వీసు’, ప్రజల వద్దకే వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అక్కడికక్కడే ఉచితంగా ఇచ్చే ‘104 సర్వీసు’లు. వీటిని వైఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ... ఈ పథకాల ద్వారా ఎలాంటి పరిపూర్ణ ఫలితాలు రాబట్టాలని కల కన్నారో, ఆ స్వప్నం సాకారం కాకుండానే హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన కన్న కలను నిజం చేసే మహత్తర అవకాశం, వైఎస్ మరణించిన పదేళ్ల తర్వాత 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి లభించింది. ముందు వైఎస్ కన్న కల ఎలాంటిదో చెప్పుకుందాం. రోడ్లు విశాలంగా ఆధునికంగా తయారవుతున్నప్పుడు వాటిపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదా లకు గురయి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతూ, అమృత ఘడియల్లో (వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్స్) అవసరమైన వైద్యసాయానికి నోచుకోకుండా ఏటా వందల వేల సంఖ్యలో, కలిగినవారు లేనివారు అనే తేడాలేకుండా మృత్యువాత పడు తున్నారు. ఇలాంటి వారికి ప్రాణభిక్ష పెట్టేదే 108 అంబులెన్స్ సర్వీసు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు మైళ్ళదూరంలో నివసించే పేదవారికి కార్పొరేట్ వైద్యం సంగతి సరే, సాధారణ వైద్యం కూడా అందని మావే. షుగర్, బీపీ వంటి రోగాలు వారి శరీరంలో దూరిన సంగతి కూడా వారికి తెలి యదు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఎన్నడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఎరుగరు కాబట్టి. అవి ముదిరి పక్ష వాతం, గుండెజబ్బులకు దారితీసినప్పుడు కానీ పరిస్థితి తమ చేయిదాటి పోయిందనే ఎరుక వారికి కలగదు. ఈ నేపథ్యంలో కలిగిన ఆలోచన 104 సర్వీసు. జబ్బులు, రోగాలు చెప్పిరావు. వచ్చిపడిన తరువాత తల తాకట్టు పెట్టయినా వైద్యం చేయించాల్సిన పరిస్థితి. చాలీ చాలని ఆదాయాలతో రోజులు గడిపేవారికి ఆసుపత్రులు, ఖరీ దైన వైద్యం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్, ఆరోగ్య శ్రీ అనే పథకానికి రూపకల్పన చేసి అమల్లో పెట్టారు. గుండె జబ్బుల వంటి పెద్ద జబ్బులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలిగే అద్భుత అవకాశం పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంతటితో సరిపోలేదని వైఎస్ మరిన్ని ఆలోచనలను జత చేస్తూ ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరచి, విస్తరించాలని తలపోశారు. 104 వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్టమైన రోజు ప్రతి గ్రామానికీ వెళ్లి బాలింతలు, చూలింతలు, వృద్ధులు, బాల బాలికలకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇస్తుంది. వారి ఆరోగ్య రికార్డులను కంప్యూటర్లలో భద్రపరచి, ఇతర ప్రదేశా లకు వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డుల ద్వారా వైద్య సాయం, చికిత్స పొందడానికి వీలైన ఏర్పాట్లు ఈ పథకంలో పొందుపరచారు. గర్భిణులకు క్రమబద్ధంగా పరీక్షలు చేసి, గర్భస్థ శిశువు పెరుగుదల గమనించి, తదనుగుణంగా వారికి పోషకా హారం అందించడమే కాకుండా, పురుడు వచ్చే రోజును నిర్ధా రించి, 108 అంబులెన్స్‌కు కబురుచేసి, వారికి సకాలంలో ఆసుపత్రులలో పురుడుపోసుకునే వీలు కల్పించాలని అను కున్నారు. అలాగే ప్రసవానంతరం ఆ తల్లీ బిడ్డలను క్షేమంగా ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలనేది కూడా వైఎస్ తలంపు. వైఎస్ కన్న కలలో పూర్తికాని, అమలుకు నోచుకోని ఆయన ఆలోచనలకు వైఎస్ జగన్ తన హయాంలో పూర్తి స్వరూపం కల్పించారని ఆరోగ్య శ్రీ గురించి ఆయన మొన్న చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. వైఎస్ స్వప్నం నేరవేర్చ డానికి ఆయన ప్రస్తుతం లభ్యం అవుతున్న అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షణీయం. విశాలమైన రహదారులూ, రమ్య హర్మ్యాలూ అభివృద్ధికి కొలమానాలు కావచ్చు. అయితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కూడా కళ్ళకు కనిపించని పురోగతే. తోక టపా: సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి తన అనుభవం గురించి ఓసారి చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే: ‘రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టారు. చాలామంది డబ్బున్నోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. అప్పుడు ఓ సారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. ఆయన నాకు రెండు ఉదాహరణలు చెప్పారు. 1. వరద వచ్చినప్పుడు ముందుగా చెత్తా చెదారం వస్తుంది. మంచినీళ్ళు ఆ తర్వాతే వస్తాయి. ఈ స్కీం ఇప్పుడే పెట్టాం కాబట్టి చెత్తా చెదారం ఉంటుంది. 2. నేను పేదలకు అన్నదానం అని ప్రకటించా. ఓ పెద్దాయన ప్లేట్ పట్టుకుని వరసలో నుంచుంటే, ఆ ప్లేట్లో అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను!?’ భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్‌లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్‌లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
ప్రాణదాతలు 108 అంబులెన్స్‌లు గర్భిణులకు, దీర్ఘకాలిక రోగులకు 108 అంబులెన్సులు వరంగా మారాయి
-
నిరుపేదలకు వరం
-
108కు కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తోంది. తెలంగాణ వైద్యశాఖకు కొత్తగా మరో 466 వాహనాలను ప్రభుత్వం కేటాయింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు(102), 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు -
ఆంధ్రప్రదేశ్‌లో 146 కొత్త అంబులెన్సులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మరింత సేవకు..
సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా 146 కొత్త 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం బయట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ఆయన అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించారు. ఇందులో ఉండే వసతుల గురించి వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. అనారోగ్య బాధితులను ఏ విధంగా అంబులెన్స్‌లోకి ఎక్కిస్తారో సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. తర్వాత జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్య్రకమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ నందిగం సురేశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా రూ.34.79 కోట్లతో 146 కొత్త అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉన్నాయి. కాగా, వీటిలో మరమ్మతులకు గురైన వాహనాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు. -
AP: 108 అంబులెన్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది. సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్ -
108 అంబులెన్స్‌ల సేవలు ఏపీలో మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది. సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్నవారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు. -
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి /విశాఖపట్నం/కొరాపుట్ / సాక్షి నెట్వర్క్: ఒడిశా రాష్ట్రంలో సంభవించిన ఘోర రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పాలుపంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే మన రాష్ట్రంలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు ఘటన స్థలానికి తరలించారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైలులో ప్రయాణించిన మన రాష్ట్ర ప్రయాణికుల వివరాల ఆధారంగా కో ఆర్డినేట్ చేసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లాల డీఎంహెచ్ఒలను ఆదేశించారు. అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు: మంత్రి అమర్నాథ్ రైలు ప్రమాద బాధితులకు అత్యవసర సాయం అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు వినియెగించుకోవాలని సీఎం ఆదేశించారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా రైలులో ప్రయాణించి, ఫోన్‌కి స్పందించకపోతే వారిని గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖరగ్‌పూర్ నుంచి చాలా మంది తెలుగు వారు ఇదే రైలులో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. ఒక క్షతగాత్రుడి అభ్యర్థన మేరకు విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. కటక్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక అధికారుల బృందం, ప్రభావిత ప్రాంతంలోని ప్రతి ఆస్పత్రిలో ఆంధ్రా అధికారులు సేవల్లో ఉంటారని తెలియజేశారు. సహాయక చర్యలు ముమ్మరం: మంత్రి రజిని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 20 అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ అంబులెన్సులు, 21 మహాప్రస్థానం వాహనాలను పంపామన్నారు. ఈ వాహనాలను సమన్వయం చేసుకునేందుకు వైద్యం, రవాణా, పోలీసుశాఖల నుంచి ముగ్గురు అధికారులను నియమించామని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం కేజీహెచ్, విజయనగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 0891–2590100, 0891 2590102, 9154405292 (వాట్సాప్ నంబర్) తాడేపల్లిలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101, 8333905022 (వాట్సప్) -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్
కీసర: నెలలు పూర్తిగా నిండకుండా.. గుండె చప్పుడు లేకుండా అప్పుడే పుట్టిన మగబిడ్డకు సీపీఆర్ చేసి కీసర 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. వివరాలివి. కుందన్‌పల్లిలోని కోళ్లఫాంలో పనిచేసే ఆర్తికుమారి పురిటినొప్పులతో కీసరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నెలలు పూర్తిగా నిండకపోవడం.. పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనందున గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గర్భిణిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈఎంటీ చిత్రం రవి వాహనంలోనే ఆమె సుఖప్రసవం చేశారు. పుట్టిన మగబిడ్డ బరువు తక్కువగా ఉండి నాడి, శ్వాస గుండెచప్పుడు లేకపోవడం గమనించి ఈఆర్సీపీ వైద్యుడు మహీద్‌ను ఫోన్లో సంప్రదించారు. ఆయన సూచన మేరకు బిడ్డకు సీపీఆర్ చేసి అంబు బ్యాగ్‌తో శ్వాస అందిస్తూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని పేర్కొని 108 సిబ్బందిని అభినందించారు. -
23 రోజుల పాపకు సీపీఆర్.. ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
చిన్నకోడూరు(సిద్దిపేట): పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. 108 సిబ్బంది సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత దంపతులు పనిచేస్తున్నారు. వీరికి 23 రోజుల వయసున్న బేబీ సుబ్బలక్ష్మి ఉంది. అయితే, ఆ పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగింది. దీంతో శ్వాస ఆగిపోయింది. వెంటనే గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల, ఆశావర్కర్ సుగుణ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ అక్కడకు చేరుకుని పరీక్షించి.. బేబీ గుండె, నాడీ కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి విషయం చెప్పి, ఆయన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స (సీపీఆర్) చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేబీ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐 అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻 CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj — Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023 -
ఆగిందా.. గురువిందా!
సాక్షి, అమరావతి: గతంతో పోలిస్తే 108 అంబులెన్స్‌ల సేవలు ఎంతో బాగున్నట్లు చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఈనాడుకు మాత్రం 108లు ఆపదలో ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డొక్కు వాహనాలతో 108 సేవలు మొరాయించినా రామోజీకి అంతా సవ్యంగానే కనిపించింది. నాడు అంబులెన్స్‌లు రాక ప్రాణాలు గాల్లో కలిసినా ఆ పెద్ద మనిషికి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం 60 వేల జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలి. దేశవ్యాప్తంగా సగటున లక్షకు పైగా జనాభాకు ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 74 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 అంబులెన్స్‌లు ఉన్నాయి. 16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు.. సెల్ఫ్ మోటర్, వైరింగ్ సమస్యతో ఓ అంబులెన్స్ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆగిపోవడంతో మెకానిక్ షెడ్డుకు తరలిస్తున్న ఫోటోను ఈనాడు కథనంలో ప్రచురించింది. నంబులపూలకుంట మండలానికి చెందిన ఈ వాహనం ఈ నెల 13వతేదీన 01 : 23 గంటలకు నిలిచిపోయింది. అంబులెన్స్ నిలిచిపోవడానికి ముందు వరకు కూడా 3 కేసుల్లో సేవలు అందించింది. మరమ్మతుల అనంతరం మరుసటి రోజు 4 : 52 గంటల నుంచి అంబులెన్స్ తిరిగి విధుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్క రోజు మాత్రమే నిలిచిపోయింది. మిగిలిన 16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు అందించింది. కొత్త వాహనాల కొనుగోలు 2020 జూలై ఒకటో తేదీ నుంచి 768 వాహనాలతో సీఎం జగన్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను బలోపేతం చేసింది. 432 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. 336 వాహనాలకు మరమ్మతులు నిర్వహించి సేవలు అందిస్తోంది. నంబులపూలకుంట అంబులెన్స్ చాలా పాత వాహనం. 2.5 లక్షల కి.మీ పైగా తిరిగిన వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంలో భాగంగా 146 అంబులెన్స్‌ల కొనుగోలుకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. వీటి కొనుగోలుకు ప్రభుత్వం రూ.41 కోట్ల మేర ఖర్చు చేయనుంది. నిబంధనలకు లోబడే స్పందన నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవాలన్నది నిబంధన. అయితే 14.50 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలకు గాను 16.55 నిమిషాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 22.12 నిమిషాల్లోనే వస్తున్నాయి. త్వరలోనే ట్రాకింగ్ సదుపాయం.. కాల్ సెంటర్ నుంచి అన్ని అంబులెన్స్‌లను ట్రాక్ చేస్తుంటాం. ఎక్కడైనా వాహనం అందుబాటులో లేకపోయినా, నిలిచిపోయినా వెంటనే తెలిసిపోతుంది. జిల్లాల వారీగా డ్యాష్ బోర్డును కో–ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తుంటారు. మరో 20 రోజుల్లో కాల్ చేసిన వారు తమ మొబైల్ నుంచి అంబులెన్స్ లొకేషన్‌ను ట్రాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అప్లికేషన్ ఇప్పటికే సిద్ధమైంది. అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం తనిఖీ చేయడానికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగించనున్నాం. 15 రోజుల్లో ఈ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది. – ఎం.ఎన్. హరేందిరప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
AP: ప్రాణదాతలపై అసత్య ప్రచారాలు
సాక్షి, గుంటూరు: టీడీపీ అనుకూల మీడియా దేన్ని వదలడం లేదు. సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని సంక్షేమ ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుంది యెల్లో మీడియా. అందునా చంద్రబాబు-రామోజీల ఈనాడు మరీ దారుణం. అందుకే లేనిది ఉన్నట్లు కథనాలు అల్లేసుకుని.. వాటిని తమ మీడియాలో ప్రచురించుకుని ఆనందం పొందుతున్నారు. అయితే వాస్తవాలు వెలుగు చూస్తుండడంతో.. నాలుక కర్చుకోవడం ఈనాడు వంతు అవుతోంది. తాజాగా ‘ఆపదలో ఆంబులెన్స్’ అంటూ ప్రభుత్వ ఆంబులెన్స్ సర్వీసులపై ఈనాడు ఓ కథనం ప్రచురించింది. పైగా ఆంబులెన్స్‌లు టైంకి రావడం లేదంటూ, మూలనపడ్డాయంటూ అందులో లేనిపోని పైత్యాన్ని ప్రదర్శించింది. అయితే.. వాస్తవం ఏంటంటే.. 108 సర్వీస్ ద్వారా నెలకు లక్ష దాకా ప్రాణాలు కాపాడగలుగుతోంది ప్రభుత్వం. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. 108సర్వీస్‌కు సంబంధించిన ఆంబులెన్స్‌లు 768 ఉన్నాయి. వీటిలో ప్రస్తుత ప్రభుత్వం 432 ఆంబులెన్స్‌లను కొత్తగా కేటాయించినవే ఉన్నాయి. వీటి సేవల్లోనూ ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో.. నిబంధనల ప్రకారం అయితే 20 నిమిషాల్లో, అర్బన్ ఏరియాల్లో 15, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో 108 సేవలు అందుబాటులో ఉండాలి. కానీ, తాజా లెక్కలను పరిశీలిస్తే.. కేవలం 16, 14, 22 నిమిషాల్లో సేవలను అందించేందుకు అందుబాటులో ఉంటోంది 108 సర్వీసెస్. గమ్యస్థానం మరీ దూరంగా ఉండడం, ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ఈ వాహనాలు త్వరగతినే సేవలను అందిస్తున్నాయి. నాడు-నేడు గత ప్రభుత్వంలో.. 440కి గానూ 336 ఆంబులెన్స్‌లు మాత్రమే రోడ్డెక్కేవి. లక్షా ఇరవై వేల జనాభాకు ఒక ఆంబులెన్స్ సేవలు అందిచేది. 86 ఆంబులెన్స్‌ల్లో మాత్రమే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ ఉండేది. అందులో అడ్వాన్స్డ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్(AVLS),మొబైల్ డాటా టర్మినెల్ కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పటి ప్రభుత్వ హయాంలో.. 768 ఆంబులెన్స్‌లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో స్టాండర్డ్స్‌కు దగ్గరగా జనాభాకు తగ్గ రీతిలో ఆంబులెన్స్ 74 వేలమందికి ఒకటి అందుబాటులో ఉంటోంది. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఆంబులెన్స్‌లు 216 ఉండగా, అందులో 130 కొత్తవి. అన్ని ఆంబులెన్స్‌లో మొబైల్ డాటా టర్మినెల్ ఉంది. అడ్వాన్సడ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్ ఆంబులెన్స్‌ల సంఖ్య దాదాపుగా అన్ని ఆంబులెన్స్‌ల్లో ఉంది. పాత ఆంబులెన్స్‌లు విషయంలో.. 2019నాటికి ఉన్న 108 సర్వీసు ఆంబులెన్స్‌ల సంఖ్య 440గా ఉండగా, 2022 నాటికి 768కి చేరింది. వీటిల్లో 2020లో 412 కొత్త ఆంబులెన్స్‌లను రోడ్డెక్కించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కిందటి ఏడాదిలో 20 కొత్త ఆంబులెన్స్‌లను గిరిజన ప్రాంతాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పుడున్న 108 ఆంబులెన్స్‌ల్లో.. 336 పాత ఆంబులెన్స్‌లు(గత ప్రభుత్వ ఘనకార్యమే) ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. జనవరి 11 2023వ తేదీన ఆరోగ్య, కుటుం సంక్షేమ శాఖ జీవో విడుదల అయ్యింది కూడా. ఈ మేరకు 146 ఆంబులెన్స్‌ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది కూడా. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఈనాడు కథనం ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ16టీహెచ్9940 నంబులపూలకుంటకు చెందిన ఆంబులెన్స్ ఆగిపోయిందని వెల్లడించింది. అయితే.. తాజాగా ప్రభుత్వం రీప్లేస్మెంట్ కోసం ఇచ్చిన 146 ఆంబులెన్స్‌ల్లో ఇది కూడా ఒకటి ఉంది. అప్పటికే 4,86,599 కిలోమీటర్లు తిరిగిన ఆ వాహనం.. మోటార్ ఇష్యూతో ఆగిపోయింది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి ఆ మరుసటి రోజు సాయంత్రం దాకా అది అలాగే ఉండిపోయింది. రీప్లేస్ అయిన వెంటనే కొత్త వాహనం ఆ ప్రాంతంలో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. ఇక 104 ఎంఎంయూ సేవల విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 292 104ఎంఎంయూ వాహనాలు ఉండగా.. ప్రస్తుతం హయాంలో ఆ సంఖ్య 656గా ఉంది. నెలలో 26 రోజుల పాటు సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నాయి ఇవి. ఇక త్వరలో ప్రారంభించనున్న ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా.. అన్ని పీహెచ్‌సీల డాక్టర్లు 104ఎంఎంయూ ద్వారానే సేవలు అందించనున్నారు. ఇందు కోసం 260 కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. విషయం ఏంటంటే.. 2022 అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలులో ఉంది కూడా. త్వరలో పూర్తి స్థాయిలో అమలు కాబోయే ఈ పథకం గురించి కూడా ఈనాడుకు ఏమాత్రం అవగాహన లేన్నట్లుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఎంఎన్ హరేంధిర ప్రసాద్(ఐఏఎస్) ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
ప్రాణదాతలు.. 108 ఉద్యోగులు
రాంబిల్లి: సముద్ర కెరటాల ధాటికి నీటిలో మునిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 అంబులెన్స్ సిబ్బంది రక్షించారు. వారు సకాలంలో స్పందించి ఆక్సిజన్ అందించడంతో బాధితుడి ప్రాణం నిలిచింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి శివారు వాడపాలెం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. యలమంచిలికి చెందిన సీహెచ్ లక్ష్మణ (35), అతని నలుగురు స్నేహితులు శనివారం రాత్రి వాడపాలెం వచ్చారు. అక్కడ రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయం బీచ్‌లో స్నానానికి దిగారు. కెరటాల ధాటికి లక్ష్మణ కొట్టుకుపోతుండగా, పక్కనే ఉన్న స్నేహితులు అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అప్పటికే లక్ష్మణ స్పృహ కోల్పోగా... స్నేహితులు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహనం టెక్నీషియన్ యడ్ల అప్పలనాయుడు, పైలట్ ఎస్.చంద్రశేఖర్‌రాజు హుటాహుటిన బీచ్‌కు చేరుకున్నారు. బీచ్‌కు సుమారు కిలో మీటరు దూరంలో ఇసుక మాత్రమే ఉండటంతో వాహనం వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మణను స్ట్రెచర్‌పై ఉంచి స్థానికుల సాయంతో 108 సిబ్బంది అంబులెన్స్ వద్దకు మోసుకొచ్చారు. వెంటనే అతనికి 108లో ఆక్సిజన్ పెట్టారు. సెలైన్ పెట్టి ఎక్కించి మందులు ఇచ్చారు. తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ కోలుకోవడంతో సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. సకాలంలో స్పందించి కిలోమీటరు మేర స్ట్రెచర్‌పై లక్ష్మణను మోసి ఆక్సిజన్, వైద్య సేవలందించి ప్రాణం కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు
సాక్షి, అమరావతి: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌చేసిన నిమిషాల్లో కుయ్.. కుయ్‌మంటూ వచ్చి బాధితులను ఆస్పత్రులకు చేరుస్తూ ‘108’ అంబులెన్స్‌లు ఆపద్బాంధవిలా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త వాహనాల కొనుగోలుకు చర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ‘108’ సేవలకు సీఎం వైఎస్ జగన్ ఊపిరిలూదిన విషయం తెలిసిందే. ఫలితంగా 2020 జూలై నుంచి ఇప్పటివరకూ ఈ అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసుల్లో ప్రజలను ఆస్పత్రులకు చేర్చాయి. ఫోన్‌చేసిన వెంటనే అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గింది. రూ.46 కోట్లతో 146 వాహనాలు టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లతో ఏపీలో 108 సేవలు అంతంతమాత్రంగా ఉండేవి. సీఎం వైఎస్ జగన్ వచ్చాక 768 అంబులెన్స్‌లతో వాటి సేవలను విస్తరించారు. తాజాగా.. రూ.46 కోట్లతో మరో 146 కొత్త వాహనాల కొనుగోలుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకోసం రూ.107 కోట్లతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు ఒక్కో గ్రామాన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)తోపాటు విలేజ్ క్లినిక్‌లను సందర్శించాలి. ఇప్పటికే ఉన్న 656 ‘104 ఎంఎంయూ’ వాహనాలతో 7,166 విలేజ్ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. మిగిలిన విలేజ్ క్లినిక్‌లలోనూ నెలలో రెండుసార్లు సందర్శించడానికి 260 నూతన 104 వాహనాలు కొనుగోలు చేస్తే సరిపోతుందని వైద్యశాఖ నిర్ణయించింది. ఇదీ చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్ -
10 లక్షల ప్రాణాలను కాపాడిన 108 అంబులెన్స్ లు
-
పది లక్షల ప్రాణాలను కాపాడాయ్!
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్ అంటూ పరుగులు తీసే అంబులెన్స్‌లను చూస్తే గుర్తొచ్చేది నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్. గత సర్కారు హయాంలో 108 వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రాణాపాయంలో ఉన్నవారు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదని, డ్రైవర్లు లేరనే సమాధానం వచ్చేది. ఒక్కోసారి అసలు స్పందించే నాథుడే ఉండడు. అలాంటి వ్యవస్థను సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే తిరిగి గాడిలో పెట్టారు. మండలానికి కచ్చితంగా ఒకటి అందుబాటులోకి తెచ్చి నిరంతరం సేవలందించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు పది లక్షలకు పైగా ప్రాణాలను 108 అంబులెన్స్‌లు కాపాడగలిగాయి. ఏజెన్సీలో అరగంట లోపే.. గత జనవరి నుంచి నవంబర్ 25వ తేదీ వరకు 10,10,383 ఎమర్జెన్సీ కేసులను 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. గిరిజన ప్రాంతాల్లో కాల్ చేసిన అరగంట లోపే చేరుకుంటున్నాయి. 108 అంబులెన్స్‌ల వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈమేరకు నివేదిక రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు 108 అంబులెన్స్‌లు చేరుకోవాలనే నిబంధన విధించగా 18 – 19 నిమిషాల్లోనే వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల గడువు విధించగా ట్రాఫిక్ తదితర సమస్యల కారణంగా 15 నుంచి 18 నిమిషాల సమయం పడుతోంది. అత్యధికంగా 19 శాతం ఎమర్జెన్సీ కేసుల్లో గర్భిణులను 108 అంబులెన్స్‌లు ప్రసవం కోసం అస్పత్రులకు తరలిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 432 కొత్తగా 108 అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. ఇందులో బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, నవజాత శిశువుల అంబులెన్స్‌లు తదితరాలున్నాయి. -
మా నాన్నను కాపాడండి.. రోగి ప్రాణం తీసిన 108.. ఎలాగో తెలుసా?
ఆపదలో మనుషుల ప్రాణాల కాపాడే 108 వాహనమే ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ధనాపూర్ ప్రాంతానికి చెందిన తెజియా(40) పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో, ఆందోళన చెందిన తెజియా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ తజియాను తీసుకుని సమీప ఆసుపత్రికి బయలుదేరింది. కాగా, కొంత దూరం వెళ్లాక రత్లం రోడ్ టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా సడెన్‌గా అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో, అంబులెన్స్ ఎందుకు ఆగిపోయిందని తజియా కుటుంబ సభ్యులు ఆగడంతో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. ఈ క్రమంలో తజియా ప్రాణాలు కాపాడేందకు రోగి కుమార్తె, అల్లుడు అంబులెన్స్‌ను ఒక కిలోమీటరు దూరం నెట్టారు. పెట్రోల్ బంక్ రాగానే బాధితులు అంబులెన్స్‌లో రూ.500 కొట్టించినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబులెన్స్ స్టార్ట్ కాకపోవడంతో మరో అంబులెన్స్‌కు ఫోన్ చేయగా గంట తర్వాత వచ్చిందనన్నారు. దీంతో, హుటాహుటిన తజియాను ఆసుపత్రికి తరలించగా.. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో తజియా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంబులెన్స్ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో వైద్యశాఖ అధికారులు చర్యలకు దిగారు. ఈ ఘటనపై సీఎంహెచ్వో స్పందిస్తూ.. విచారణ ప్రారంభించాము. తాము బాధితుడి బంధువులను కలవనున్నట్టు తెలిపారు. 108ని ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యత వారిదే. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. #WATCH #Ambulance ran out of #diesel in #Banswara, patient died on the road. ◆ Daughter-son-in-law pushed the ambulance for 1 KM to save #life. #Rajasthan #Banswara #Ambulance #RajasthanNews #NewsUpdates #Rajasthan #Banswara #Jaipur pic.twitter.com/17lJ3LEuoN — Harish Deshmukh (@DeshmukhHarish9) November 26, 2022 -
సిరప్లు తాగి కిడ్నీ సమస్యలతో చిన్నారులు మృతి.. టానిక్లపై బ్యాన్!
ఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్ సయారిల్ మన్సూర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ఇండోనేషియాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. The Indonesian government has announced a ban on all syrup and liquid medicine prescription and over-the-counter sales, after the deaths of nearly 100 children from acute kidney injury this year https://t.co/0rVL5yYGwg — RTÉ News (@rtenews) October 19, 2022 -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
AP: వైద్య సేవల్లో సువర్ణాధ్యాయం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన 53 ఏళ్ల సేనాపతి శ్రీనివాసరావుది నిరుపేద కుటుంబం. ఇతను 15 ఏళ్ల క్రితం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో 2020లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సేవలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఆధునికీకరించడం శ్రీనివాసరావుకు వరంగా మారింది. నెలనెలా ఆ ఊరికి 104 వెళ్తోంది. అందులోని వైద్యుడు, వైద్య సిబ్బంది శ్రీనివాసరావు ఇంటికే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మందులు అందిస్తున్నారు. శ్రీనివాసరావు ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు శ్రీనివాసరావు సంతోషంగా ఉన్నాడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన 63 ఏళ్ల వై. కాంతం ఎడమ కాలికి గాయమైంది. రోజూ డ్రెస్సింగ్‌కు ఆస్పత్రికి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలో తన పరిస్థితిని స్థానిక ఏఎన్ఎంకు వివరించింది. దీంతో గత నాలుగు నెలలుగా గ్రామ సందర్శనకు వచ్చినప్పుడు 104 వైద్యుడు, సిబ్బంది నెలనెలా కాంతం ఇంటికి వెళ్తున్నారు. గాయానికి డ్రెస్సింగ్ చేసి, మందులు అందిస్తున్నారు. సాక్షి, అమరావతి: గ్రామాల్లో వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికి పరిమితమైన వారికి, గర్భిణులు, మధుమేహం, రక్తపోటు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి 104 సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 104, 108 అంబులెన్స్ సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధునీకరించి సువర్ణాధ్యాయం సృష్టించింది. అత్యవసర వైద్య సేవలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా మండలానికొక 104, 108 వాహనాన్ని 2020 జులై 1న అందుబాటులోకి తెచ్చారు. సేవలకు పునరుజ్జీవం పోసి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. 1.49 కోట్ల మందికి వైద్యం ఈ రెండేళ్ల కాలంలో 104 వాహనాలు గ్రామీణ ప్రజలకు విశేష సేవలు అందించాయి. ఇప్పటివరకూ వీటిలో 1,49,27,186 ఓపీలు నమోదయ్యాయి. 20 రకాల వైద్య సేవలు వీటిద్వారా అందుతున్నాయి. ఎనిమిది రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. టీడీపీ హయాంలో రోజుకు 2 గ్రామాల చొప్పున.. ఒక్కో గ్రామంలో రెండు గంటలసేపు మాత్రమే వాహన సేవలు అందేవి. ఇప్పుడు 104 వాహనం రోజంతా ఒకే గ్రామంలో ఉంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 40వేల మందికిపైగా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం వరకూ ఓపీలు నిర్వహించి, మధ్యాహ్నం నుంచి వృద్ధులు, వికలాంగులు, మంచానికి పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ 13,32,408 హోమ్ విజిట్స్‌ను వైద్యులు నిర్వహించారు. నాడు దైన్యం.. – టీడీపీ హయాంలో 104 వాహనాలు 292 ఉండేవి. – 81,381 జనాభాకు ఒక 104 వాహనం.. – అందుబాటులో ఉండే మందులు 52 మాత్రమే – అందే వైద్య సేవలు.. రక్తపోటు, మధుమేహం, జనరల్ ఓపీ – వైద్యులు, మందుల కొరత ఉండేది. – రోజుకు 20వేల లోపు జనాభాకు అరకొరగా వైద్య సేవలు – పీహెచ్‌సీలతో సమన్వయం ఉండేది కాదు. నేడు ధైర్యం.. – వైఎస్సార్సీపీ హయాంలో 656 వాహనాలున్నాయి. – 44,452 జనాభా ఒక 104 వాహనం – అందుబాటులో ఉండే మందులు 74 – 20 రకాల వైద్య సేవలు – వైద్యులు, మందుల కొరతకు తావులేదు. – రోజుకు 40,560 మందికి వైద్య సేవలు – పీహెచ్‌సీలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతో సమన్వయం ఉంటోంది. రెండేళ్లలో 104 వైద్య సేవలు ఇలా.. – రక్తపోటు ఓపీలు : 24,73,681 – మధుమేహం ఓపీలు : 29,17,667 – ఏఎన్సీ : 3,87,628 – హోమ్ విజిట్స్ : 13,32,408 – ఇతర ఓపీలు : 81,48,210 – పంపిణీ చేసిన మందులు : 64,39,32,777 ఫోన్ చేసిన నిమిషాల్లో కుయ్..కుయ్.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే 108 అంబులెన్స్‌లు చాలా వేగంగా స్పందిస్తున్నాయి. – పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 18.03 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19.21 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 24.50 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 27:23 నిమిషాల్లో అంబులెన్స్‌లు ఘటన స్థలికి చేరుకుంటున్నాయి. – రెండేళ్లలో 20,16,297 అత్యవసర సేవలను ‘108’ అందించాయి. – నిజానికి టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లు ఉండేవి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని 748కు పెంచింది. దీంతో అప్పట్లో 1,19,595 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండగా, ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది. – ఇక రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 3,294 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఆసుపత్రులకు తరలిస్తున్నాయి ఫోన్‌చేసిన 20 నిమిషాల్లో.. నా కుమార్తె పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108కు ఫోన్చేశాం. 20 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటికి వచ్చింది. సరైన సమయంలో ఆసుపత్రికి చేరాం. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. 108 సకాలంలో రావడంవల్లే ఇది సాధ్యమైంది. పైసా ఖర్చు లేకుండా ఆస్పత్రిలో చేర్చారు. – కర్రి అప్పలనాయుడు, రాకోడు గ్రామం, విజయనగరం జిల్లా 108లోనే ఇబ్బందిలేకుండా ప్రసవం నాకు పురిటి నొప్పులు రావడంతో మా వాళ్లు 108కు ఫోన్‌చేశారు. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. వాహనం ఎక్కి కొంతదూరం వెళ్లగానే నాకు బీపీ పెరిగింది. వెంటనే అప్రమత్తమైన ఈఎంటీ శ్రీనివాసులు ఫోన్ ద్వారా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ వాహనంలోనే ఇబ్బందిలేకుండా కాన్పు చేశారు. – సీహెచ్ రాజేశ్వరి, దేవరపాళెం, నెల్లూరుత్వరలో మరో 432 వాహనాలు 104 ఎంఎంయూ వైద్య సేవలను మరింత విస్తరిండం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ క్రమంలో కొత్తగా మరో 432 వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. ఈ వాహనాలన్నీ అందుబాటులోకొస్తే ప్రతీ గ్రామానికి నెలలో రెండుసార్లు ‘104’ వెళ్తుంది. దీంతో ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయి. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
108, 104 ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 108 అంబులెన్సులు , 104 మొబైల్ మెడికల్ యూనిట్ సర్వీసుల్లో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపును ప్రారంభించినట్టు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ సంపత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల దృష్ట్యా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సకాలంలో వేతనాలను విడుదల చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు రావటంతో 2 నెలల వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు వివరించారు. -
కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్
కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలోనే 108 అంబులెన్స్ రావడంతో దానికి దారిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకులకు హాజరయ్యే క్రమంలో కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఒక అంబులెన్స్ వెనకాలే వచ్చింది. అంబులెన్స్ సైరన్ వినగానే దానికి దారివ్వలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. దాంతో అధికారులు కాన్వాయ్‌ను ఒక పక్కకు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. ఆపై సీఎం జగన్ ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రాముని కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. -
సీఎం కాన్వాయ్‌లో 108 రయ్ రయ్..
గన్నవరం: తన పర్యటన సందర్భంగా ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. సరిగ్గా సీఎం కాన్వాయ్ గన్నవరం వద్ద జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై సీఎం కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌ను ముందుకు పంపించారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది. అక్కడ సీఎంను కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తదితరులు ఉన్నారు. -
మగువా.. గొప్పదమ్మా నీ తెగువ!
కైకలూరు: కరోనా బారినపడిన నిండు గర్భిణికి 108 సిబ్బంది ఆ అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. వివరాల్లోకి వెళితే.. కైకలూరుకు చెందిన గర్భిణి కె.శ్రావణి ప్రసవ నొప్పులతో కైకలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి శనివారం వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా.. ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో శ్రావణిని తీసుకుని 108 వాహనంలో ఈఎంటీ రజనీదేవి పీపీఈ కిట్ ధరించి, పైలట్ బోయిన రావుతో కలసి మచిలీపట్నం బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత శ్రావణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రజనీదేవి తెగువతో చాకచక్యంగా సుఖ ప్రసవం అయ్యేవిధంగా చేశారు. ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించిన ఈఎంటీని 108 వాహన జిల్లా అధికారి సురేష్‌కుమార్, డివిజనల్ అధికారి ప్రశాంత్ అభినందించారు. -
108లో ఇద్దరు గర్భిణులకు ప్రసవం
కొయ్యూరు/దేవరాపల్లి: అత్యవసర వైద్య సేవలందిస్తూ 108 అంబులెన్స్‌లు అపర సంజీవినిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులకు మరో జన్మ అందించడమే కాక పండంటి బిడ్డను చేతిలో పెడుతున్నాయి. విశాఖ జిల్లాలో ఆదివారం ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి చెందిన గిరిజన మహిళ తాంబేలు లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108లో రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఇక్కడ నుంచి నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. 108 సిబ్బంది లక్ష్మిని నర్సీపట్నం తీసుకెళ్తుండగా కృష్ణాదేవిపేట దాటిన తరువాత నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న గొలుగొండ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ కె.వరప్రసాద్‌లను అందరూ అభినందించారు. అలాగే దేవరాపల్లి మండలం మామిడిపల్లికి చెందిన నెక్కెళ్ల రామలక్ష్మి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. ఆమెకు ఆదివారం తెల్లవారుజాము 5 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. కె.కోటపాడుకు చెందిన 108 సిబ్బంది మామిడిపల్లి కి చేరుకొని కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ కాన్పు చేశారు. రామలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ప్రథమ చికిత్స అనంతరం తల్లీబిడ్డను కె.కోటపాడు సీహెచ్‌సీలో చేర్చారు. -
108 సిబ్బందికి కమిషనర్ అభినందన
సాక్షి, అమరావతి: అంబులెన్స్ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్ఎం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు. -
గర్భిణులకు దన్నుగా 108
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 అంబులెన్సుల ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. గతంలో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్సు ఉంటే.. రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2020 జులై నుంచి ప్రతి 74,609 మందికీ ఒక అంబులెన్సు నడుస్తోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 జులై నుంచి 2021 ఆగస్టు వరకూ అంటే 14 నెలల్లో 10.77 లక్షల మంది ‘108’ ద్వారా లబ్ధిపొందారు. వీరిలో కోవిడ్ బాధితులు, గర్భిణులే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త అంబులెన్సులు రాకమునుపు ఏడాదికి సగటున 6.33 లక్షల ఎమర్జెన్సీ సర్వీసులు నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య 10.77 లక్షలకు పెరిగింది. వీరిలో 54 శాతం మంది పురుషులు కాగా, 46 శాతం మంది మహిళలున్నారు. అలాగే, 1.10 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాద బాధితులు అంబులెన్సుల్లో ఆస్పత్రులకు వెళ్లారు. 6.62 లక్షల మందికి ఆక్సిజన్ ఇక 108 అంబులెన్సులో వెళ్తున్నారంటేనే ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుందని ఒక భావన. అలా గడిచిన 14 నెలల్లో 6.62 లక్షల మంది ఆక్సిజన్ సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 72 వేల మందికి పైగా ఈ సౌకర్యం పొందారు. అనంతపురం జిల్లాలో 67 వేల మందికి పైగా ఆక్సిజన్ సాయంతో ‘108’లో ఆస్పత్రులకు వెళ్లారు. లబ్ధిదారుల్లో గర్భిణులే ఎక్కువ మొత్తం 10.77 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు మహిళలకు బిడ్డలు కనే వయసు కాబట్టి ఎక్కువమంది గర్భిణులు 108 వాహనాలను వినియోగించుకున్నారు. ఒక్క 21 నుంచి 30 ఏళ్లలోపు కేటగిరీలోనే 2.43 లక్షల మంది మహిళలు ‘108’లో వచ్చినట్లు వెల్లడైంది. అంబులెన్సుల్లో లబ్ధిపొందిన వారిలో 21.7 శాతం మంది అంటే 2.34 లక్షల మంది గర్భిణులే ఉన్నారు. అత్యధికంగా 22.4 శాతం మంది (2.41 లక్షలు) కోవిడ్ బాధితులున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అలాగే, 1.10 లక్షల మంది ప్రమాద బాధితులు, 32 వేల మందికి పైగా హృద్రోగులు, 63వేల మందికి పైగా పక్షవాతం బాధితులు తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) ఆస్పత్రులకు వెళ్లగలిగారు. -
TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల
నల్లగొండ: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మానవత్వం చాటుకున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో తన క్యాంపు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన షర్మిల స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేశారు. చదవండి:టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే అయితే సమయానికి అంబులెన్స్ ఘటన స్థలానికి రాకపోవడంతో షర్మిల తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ ఆలస్యంపై షర్మిల స్పందిస్తూ.. 108 సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే 108 వాహన సేవలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -
ఐదు నిముషాల్లో.. రెండు వైపుల నుంచి రెండు అంబులెన్స్‌లు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ లు ఎలా పని చేస్తున్నాయన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వాళ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. రాజం దాటాకా పాలకొండ లైన్ సెర్లాం జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎదురెదురుగా వస్తోన్న రెండు బళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఇందులో విజయనగరం జిల్లా ఎర్రవానిపాలెంకు చెందిన పార్ధు (35) పాపారావు (32) గాయపడ్డారు. ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు.. వెంటనే 108కి కాల్ చేశారు. సరిగ్గా అయిదు నిమిషాల్లోనే రెండు వైపుల నుంచి రెండు వేర్వేరు అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు వేగంగా ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు 108 సిబ్బంది. -
సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన ‘108’ కాంట్రాక్ట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపడంపై 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. శుక్రవారం అరబిందో యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని యూనియన్ ప్రెసిడెంట్ బి.కిరణ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్ జిల్లాల బదిలీలు, జీతాల శ్లాబుల్లో మార్పులు, జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
కీలకంగా వ్యవహరిస్తున్న అరబిందో మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్
-
‘108 అంబులెన్సులు ఎక్కడికి పోయాయి’: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎవరైనా ఆపద ఉందని ఫోన్ కాల్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే108 అంబులెన్సులు ఇప్పుడు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్‌ను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కరోనా మృతదేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ వాళ్లు నాలుగు రెట్లు అడ్డగోలుగా దోచుకుంటున్నది మీకు కన్పించట్లేదా అని బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. -
రియల్ వారియర్స్: మా కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యం
చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడు 108కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది ఆక్సిజన్ సాయంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో ఓ వృద్ధురాలికి వైరస్ సోకింది. ఆస్పత్రికి నడిచి వెళ్లలేని పరిస్థితి. తోడు లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయింది. శ్వాస సమస్య ఎదురవ్వడంతో 108కు సమాచారం అందించింది. అడ్రస్ వెతుక్కుంటూ నిమిషాల్లో సిబ్బంది బాధితురాలి ఇంటిముందు వాలిపోయారు. వెంటనే రోగిని రుయాకు తరలించి ప్రాణాలు నిలబెట్టారు. పుత్తూరుకు చెందిన నిండు గర్భిణికి అర్ధరాత్రి వేళ పురుటి నొప్పులు వచ్చాయి. భర్త లారీ డ్రైవర్. అదే రోజు డ్యూటీకి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో 108కు ఫోన్ చేసి అడ్రస్ చెప్పింది.వెంటనే సిబ్బంది ఆమెను స్థానికప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి రావడం వల్ల తల్లీబిడ్డకు ప్రాణాపాయం తప్పింది. .. ఇవి మచ్చుకు మూడు మాత్రమే. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలు. 108 సిబ్బంది రియల్ వారియర్స్‌గా నిలుస్తున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. కొందరు సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగుల సేవలో తలమునకలవుతున్నారు. బాధితుల ప్రాణాలు కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 108 సేవల్లో మొదటి స్థానం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 సిబ్బంది, వారి సేవలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎదుటి వ్యక్తితో దగ్గర నుంచి మాట్లాడాలంటేనే హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ అంటే తెలిసిన వారు సైతం మొహం చాటేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది మేమున్నామంటూ.. ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో పేద రోగులకు అండగా నిలుస్తున్నారు. కరోనాకు ఎదురొడ్డి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఖర్చుకు వెనుకాడకుండా పేదల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా 108 రూపురేఖలు మార్చేసింది. సిబ్బంది నుంచి వాహనంలో వసతుల వరకు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దింది. రోగి ఏ స్థాయిలో ఉన్నా ప్రాణాలతో ఆస్పత్రికి తరలించే విధంగా వసతులు సమకూర్చింది. బాధితులు ఫోన్ చేసిన వెంటనే స్పందించేలా సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే పేదలకు 108 అపరసంజీవినిగా కనిపిస్తోంది. అవసరాన్ని బట్టి వాహనాల వినియోగం జిల్లాలో మొత్తం 108 వాహనాలు 75 వరకు ఉన్నాయి. ఇందులో 14 వాహనాలను కరోనా తరలింపునకు వినియోగిస్తున్నారు. ఒక్కో అంబులెన్స్‌లో ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్), పైలెట్(డ్రైవర్) ఉంటున్నారు. వీరు రోజుకు 12 గంటల చొప్పున షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కోవిడ్ రోగుల తరలింపులో బిజీగా ఉంటే మిగిలిన వాహనాలను వినియోగిస్తున్నారు. వసతులు లేని హోం ఐసోలేషన్ రోగులను సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లకు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వారిని ఆక్సిజన్ వెంటిలేటర్ సదుపాయంతో కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో.. కోవిడ్ బాధితులను ఇంటి నుంచి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం బయట ప్రాంతాతాలకు తీసుకెళ్లడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తూచాతప్పక పాటిస్తున్నారు. రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్, ఈఎన్టీ శానిటైజర్, మాస్క్, పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అత్యవసర సమయంలో బాధితులకు శ్వాస సమస్య ఏర్పడితే ఈఆర్సీపీ (ఎమర్జెన్సీ రెస్పాన్డ్ సెంటర్ ఫిజీషియన్) సలహాలతో ఆక్సిజన్ పెడుతున్నారు. ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. జిల్లాలో ఇప్పటివరకు వైద్యుల సూచనల మేరకు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలిస్తూ ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్‌లు, సిబ్బంది విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్, నాన్ కోవిడ్ సేవలకు అంతరాయం లేకుండా వేర్వేరు వాహనాలను ఏర్పాటు చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. స్టే హోం – స్టే సేఫ్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తున్నారు. ► మొత్తం అంబులెన్స్‌లు– 75 ► కోవిడ్ కేసులను తరలించే వాహనాలు– 14 ► గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తరలించిన ► కోవిడ్ బాధితులు– 16,601 మంది ► ఒక్క ఏప్రిల్‌లోనే తరలించిన కేసులు– 2,554 ► ఇప్పటివరకు తీసుకెళ్లిన అన్ని రకాల కేసులు– 68,253 ► జిల్లాలో మొత్తం 108 సిబ్బంది 320 మంది చిత్తూరు నుంచి కోవిడ్ రోగిని చికిత్స కోసం 108లో తిరుపతికి తరలిస్తున్న సిబ్బంది -
కరోనా ఉన్నా కాన్పు చేశారు
గద్వాల రూరల్: ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణికి 108 సిబ్బంది కాన్పు చేసి మానవత్వం చాటారు. జోగుళాంబ గద్వాల ధరూరు మండలం వామన్‌పల్లికి చెందిన నర్సమ్మకు ఈ నెల 1న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నర్సమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఉప్పేరు పీహెచ్సీ ఏఎన్ఎం హైమావతికి సమాచారం అందించారు. దీంతో, ఆమె 108 వాహనంలో నర్సమ్మను గద్వాలలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే నర్సమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది మార్గమధ్యలోనే కాన్పు చేశారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. సుఖ ప్రసవం చేసిన సిబ్బందిని ఉప్పేరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయరాజు అభినందించారు. చదవండి: కరోనాపై వైద్యారోగ్య సిబ్బంది అలుపెరుగని యుద్ధం -
108, 104 Ambulance: ఊపిరి పోస్తున్నాయ్
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ అంబులెన్సులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న ఈ తరుణంలో బాధితులకు ఈ కుయ్..కుయ్ శబ్దం కొండంత భరోసానిస్తోంది. కాల్ అందుకున్న నిమిషాల్లో 108, లేదా 104 అంబులెన్స్ ప్రత్యక్షమౌతోంది. పైసా ఖర్చులేకుండా క్షణాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది ఒకేసారి 1,088 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ప్రతిమండలంలోనూ 108 అంబులెన్సులు, 104 వాహనాలు అందుబాటులో ఉండడంతో మండలంలోని ఊళ్లన్నిటికీ ఉపయోగంగా ఉంది. ఉచితంగా లభిస్తున్న ఈ 104, 108 అంబులెన్సు సర్వీసు కోవిడ్ రోగులకు పెద్ద ఊరటనిస్తోంది. గతంలో నిర్వహణా ఖర్చులు ఇవ్వక, రిపేర్లు జరక్క, డీజిల్‌కు దిక్కులేక, డ్రైవర్లకు జీతాల్లేక పూర్తిగా మూలన పడ్డ అంబులెన్స్ వ్యవస్థను జగన్ రాగానే సమూలంగా ప్రక్షాళన చేశారు. సమస్యలన్నీ తీర్చడంతో పాటు డ్రైవర్లకు జీతాలూ పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇపుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులే అపర సంజీవనిలా మారాయి. కరోనా రోగులను వేగంగా తరలిస్తూ సకాలంలో వైద్యం అందడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 86,754 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారంటే అంబులెన్సులెంతగా ఉపయోగపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మారుమూల పల్లెలకు వెళ్లి రోగులకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందించేందుకు 104 వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ఇదీ లెక్క.. ► మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌ల్లో 15,242 మంది కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించారు. అలాగే, 71,512 మంది సాధారణ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. అంటే మొత్తం 86,754 మంది రోగులను తరలించారన్నమాట. కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌లు 124 ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 6,640 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రులకు తరలించారు. ► ఈ అంబులెన్స్‌లు బిజీగా వున్న పరిస్థితుల్లో నాన్ కోవిడ్ పేషంట్లకు వినియోగించే 108 అంబులెన్స్‌లను కూడా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా 8,602 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. కరోనా తొలివేవ్లోనే అంబులెన్సుల కొనుగోలు 2020 మార్చి 10వ తేదీన తొలికరోనా కేసు నమోదైంది. అప్పటికి రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జులైలో కొత్తగా 108 అంబులెన్సులు 412 , 104 వాహనాలు 656 కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు 748 వున్నాయి. ఇందులో 731 వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నాయి. హైకోర్టు, సచివాలయం, గవర్నర్ (వీఐపీ లొకేషన్స్)బంగళా వద్ద మొత్తం మూడు ఉన్నాయి. మరో 14 వాహనాలు బ్యాకప్..అంటే ఏవైనా మరమ్మతులకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. గతేడాది ఈ వాహనాలు కొనుగోలు చేయకపోయినా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. ఇపుడు చాలా సమస్య ఎదుర్కోవలసి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన అంబులెన్సులను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో హైపోక్లోరైట్ సొల్యూషన్‌తో శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ధ్రువీకరించిన తరువాతే వాటిని మళ్లీ సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు. అలాగే పేషెంట్‌కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్‌తో శుభ్రపరుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీ మెడికల్ టీంలకు, అంబులెన్స్ పైలెట్‌కు అవసరమైన శిక్షణ ఇచ్చారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్‌ల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్, డెఫ్రిబులేటర్లు అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. 104తో ఇంటి ముంగిటకే వైద్యం గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గత నెల (ఏప్రిల్) 1 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో 104 వాహనాల ద్వారా 6,64,108 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. వీరిలో 6,30,513 మందికి అవసరమైన మందులు పంపిణీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆ గ్రామంలోనే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అలాగే మంచానికే పరిమితమైన 77,396 మంది పేషంట్లకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి చికిత్స అందించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ పేషెంట్లకు ఇంటివద్దకే వెళ్లి మందులు ఇస్తున్నారు అవసరమైతే మరిన్ని కోవిడ్‌కు కోవిడ్ పేషెంట్ల రవాణా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. అవసరమైతే మరిన్ని పెంచుకోవాలని చెప్పాం. ఇవికూడా సరిపోకపోతే ప్రైవేటు అంబులెన్సులనైనా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. దేశంలోనే అంబులెన్సుల నిర్వహణలో మనం ముందంజలో ఉన్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ఆపదలో కుయ్ కుయ్‌మంటూ వచ్చే వాహనాలేవి?
సాక్షి ,నాగిరెడ్డిపేట: ఆపత్కాలంలో కుయ్ కుయ్‌మంటూ వచ్చి ఆదుకోవాల్సిన అంబులెన్స్‌లు జిల్లాలో అంతంతమాత్రంగానే సేవలందిస్తున్నాయి. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్ అవసరం ఉండగా ప్రస్తుతం జిల్లాలోని చాలా మండలాల్లో అంబులెన్స్‌లే లేవు. జిల్లాలో 22 మండలాలుండగా 13 అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నారు. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పది మండలాల్లో ఇబ్బందులు.. జిల్లాలోని బాన్సువాడలో రెండు, కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, పిట్లం, బిచ్కుంద, జుక్కల్, బీర్కూర్ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, దోమకొండ, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్, మద్నూర్, తాడ్వాయి, బీబీపేట మండలాల్లో 108 అంబులెన్స్‌లు లేవు. ఆయా మండలాల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, అత్యవసరంగా ఎవరినైనా ఆస్పత్రికి తరలించాల్సి వస్తే పక్క మండలాల్లోని అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పొరుగు మండలంనుంచి అంబులెన్స్ వచ్చేంత వరకు బాధితులు నరక యాతన అనుభవించాల్సిందే.. అంతేకాకుండా ఆ సమయంలో పక్క మండలం అంబులెన్స్ వేరే ఇతర రోగులను తరలించే పనిలో ఉంటే ఇక్కడున్న వారి పరిస్థితి మరీ దారుణం. దీంతో అంబులెన్స్‌లు లేనిప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దాదాపు ప్రైవేట్ వాహనాల్లోనే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆటోలు, కార్లలో తరలించే సమయంలో క్షతగాత్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. కోవిడ్ బాధితుల వ్యథలు.. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. అయితే వారిని ఆస్పత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకినవారిని ఆస్పత్రులకు తరలించడానికి ప్రైవేట్ వాహనదారులెవరూ ముందుకు రావడంలేదు. అంబులెన్స్‌లు అందుబాటులోలేక, ప్రైవేట్ వాహనదారులు ముందుకురాకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ వాహనాల యజమానులు ముందుకు రాకపోవడం వల్ల వారిని కుటుంబ సభ్యులే తీసుకెళ్లాల్సి వస్తోంది. నాగిరెడ్డిపేట మండలంలో 108 అంబులెన్స్ లేదు. శనివారం ఓ కోవిడ్ పేషెంట్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఎల్లారెడ్డి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ బిజీగా ఉండడంతో రాలేమని సమాధానం వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు బైక్‌పై ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ( చదవండి: తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు ) -
104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స ఫీజులు, చార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలి. బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు తెలిసేలా అన్ని వివరాలు ఉండాలి. ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల రేట్లు కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఎక్కడైనా అధిక ఫీజులు, చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 104 కాల్ సెంటర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని, ఎవరికైనా ఉచితంగా కోవిడ్ చికిత్స, బెడ్ కావాలంటే ఈ కాల్ సెంటర్ ద్వారా సేవలందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్ సెంటర్‌కు రోగి ఫోన్ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ సమకూర్చాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోం ఐసొలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలని చెప్పారు. అవసరమైతే అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిని కూడా ఫాలో అప్ చేయాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా దృష్టి సారించడంతోపాటు, కోవిడ్ చికిత్స ఫీజులను రోగులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి ఒక్కరికీ అభినందనలు.. నిన్న (బుధవారం) అత్యధికంగా 6.28 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఇది ఒక రికార్డు. ఇందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. మీరంతా ఎంతో చొరవ చూపి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వ్యాక్సిన్లు లేవు. కాబట్టి వాటి కోసం కేంద్రానికి లేఖ రాయండి. అవసరం అనుకుంటే నేను కూడా లేఖ రాస్తాను. గ్రీవెన్సుల కోసం 1902 నంబర్ గ్రీవెన్సుల కోసం 1902 నంబరు కేటాయించండి. ఇక 104 నంబరు కోవిడ్ సేవల కోసం పని చేస్తుంది. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్ వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి. కోవిడ్ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా కూడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి. ఆ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ ఆస్పత్రిలో సేవలు, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్ మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది చాలా ముఖ్యం. అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలి. అందుకోసం వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలి. టెస్టింగ్ ముఖ్యం టెస్టింగ్ చాలా ముఖ్యం. కోవిడ్ పేషెంట్ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో కూడా పరీక్షలు చేయాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. 104కు ఎవరైనా ఫోన్ చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్ చేయాలి. అందువల్ల పీహెచ్సీ, సబ్ సెంటర్ లేదా విలేజ్ క్లినిక్.. ఎక్కడైనా సరే పరీక్ష చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. వ్యాక్సినేషన్‌పై ఫోకస్ వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలి. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా చేయాలి. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలి. ఒక్కరు కూడా మిగలకూడదు. మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా, కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు రోజుకు 6 లక్షల వాక్సిన్లు వేయాలి. హోం క్వారంటైన్ హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్ చేయాలి. అందుకు తగిన ప్రొటోకాల్ రూపొందించుకోండి. తరుచూ సందర్శించడం వంటివి చేయాలి. అదే విధంగా వారికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సల్స్‌తో కూడిన కోవిడ్ కిట్ తప్పనిసరిగా అందించాలి. ఆక్సిజన్ సరఫరా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలో ప్రొడక్షన్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలి. కోవిడ్ చికిత్స అందిస్తున్న 108 ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడండి. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా చూడాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.03 శాతం ఉందని సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో ఇప్పుడు 4,889 బెడ్లను పేషంట్లకు కేటాయించామన్నారు.1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం నాటికి 22,637 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని వివరించారు. -
కొన ప్రాణంతో ఉన్న వృద్ధుడికి ఊపిరి
నెల్లూరు(అర్బన్): ఏమైందో ఏమోగానీ వారం రోజులుగా ఆ వృద్ధుడు ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు చనిపోయాడనుకుని భావిస్తున్న తరుణంలో 108 సిబ్బంది ప్రాణం పోశారు. సాహసంతో వైద్యం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బతికించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన 108 సేవల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. కాశిం అనే వృద్ధుడు వాచ్‌మేన్‌గా పనిచేస్తూ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వారం రోజులుగా ఆ వృద్ధుడి ఇంటి తలుపు మూసే ఉంది. బయట తాళం వేయలేదు. స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి పక్కింటి వారికి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి తలుపు తడితే తీయలేదు. లోపల గడియ వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ (ఎమర్జెన్సీ టెక్నీష్ యన్) శ్రీనివాస్, పైలట్ రమేష్ తో కలిసి వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. తలుపులు పగుల గొట్టారు. వృద్ధుడు మరణించి ఉంటాడని స్థానికులు భావించారు. ఈఎంటీ శ్రీనివాస్ ఆ వృద్ధుడిని పరీక్షించాడు. నాడీ కూడా అందడం లేదు. బీపీ రికార్డు కాలేదు. కొన ఊపిరి ఉందని గ్రహించి ఆస్పత్రి వరకూ వెళ్లకుండా వెంటనే 108 వాహనంలోకి తీసుకెళ్లి వైద్యం చేశాడు. సెలైన్లు ఎక్కించడంతో పాటు, అత్యవసర ఇంజెక్షన్లు చేశాడు. దీంతో కాస్త నాడీ దొరకడంతో వెంటనే పెద్దాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి క్రమేపీ మెరుగవుతోంది. 108 సిబ్బంది వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన విషయం తెలుసుకున్న 108 జిల్లా మేనేజర్ పవన్‌కుమార్, నెల్లూరు డివిజన్ సూపర్వైజర్ రఫీ.. ఈఎంటీ శ్రీనివాస్‌ను, పైలట్ రమేష్ ను అభినందించారు. -
వారియర్స్‌కు వ్యాక్సిన్; చాలా బాధగా ఉంది..
కామారెడ్డి టౌన్: కరోనాపై పోరులో ఎంతో మంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వైరస్ వ్యాపిస్తున్నా భయపడకుండా విధులు నిర్వహించారు. అలాంటి వారిలో 108 సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా సోకిన రోగులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలకు సేవలందించారు. అయితే, వారిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు ఇచ్చిన ప్రభుత్వం.. 108 సిబ్బందిని మాత్రం మరిచింది. వెలకట్టలేని సేవలు.. కరోనా వైరస్ నియంత్రణలో వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు తదితర శాఖలు కీలకంగా వ్యవహరించాయి. ఆశలు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు ఇచ్చా రు. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న సాధారణ పౌరులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, కరోనా సమయంలో ముందుండి సేవలందించిన 108 సిబ్బందికి మాత్రం టీకాలు ఇవ్వక పోవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ఫోన్ రాగానే ఆగమేఘాల మీద ప్రజలకు సేవలందింన తమను గుర్తించలేక పోయారని మనోవేదన చెందుతున్నారు. కరోనా నియంత్రణకు పాటు పడిన నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. పట్టించుకోని యంత్రాంగం జిల్లాలో 108 అంబులెన్సులు 12 ఉన్నాయి. డ్రైవర్లు, పైలెట్, సిబ్బంది కలిపి మొత్తం 60 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కామారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మిగతా వారిని మాత్రం మరిచారు. ఆన్లైన్లో కూడా వీరి వివరాలను నమోదు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు తమను గుర్తించాలని 108 సిబ్బంది వేడుకుంటున్నారు. చాలా బాధగా ఉంది అత్యవసర సమయాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్నాం. కరోనా సోకిన వారిని ఆస్పత్రులకు తరలించాం. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందిస్తున్న మమ్మల్ని గుర్తించక పోవడం బాధగా ఉంది. సాధారణ పౌరులకు టీకా ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా సేవలను గుర్తించాలి. – విజయ్, 108, అంబులెన్స్ డ్రైవర్, కామారెడ్డి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు నేను జిల్లాకు ఇటీవలే బదిలీపై వచ్చాను. 108 సిబ్బంది టీకాలు ఇవ్వాలని ఇప్పటి వరకు ఆదేశాలు రాలేవు. అందుకే మేము కూడా స్పందించ లేకపోయాం. రెండు రోజుల క్రితమే సిబ్బంది డేటాను సేకరించాం. వారికి టీకా ఇచ్చే విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – అనిరుధ్, 108 జిల్లా కో–ఆర్టినేటర్, కామారెడ్డి -
అయ్యో తల్లి.. నీకెంతటి కష్టం వచ్చింది
కొణిజర్ల(ఏన్కూరు)/ఖమ్మం: గొత్తికోయ మహిళకు సకాలంలో వైద్యం అందక ప్రసవం జరిగి శిశువు మృతి చెందిన సంఘటన ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తమేడేపల్లికి చెందిన హేమ్లా నిర్మల అనే గర్భిణికి మంగళవారం నొప్పులు వస్తున్నాయని ఏన్కూరు పీహెచ్‌సీకి రాగా ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌చేశారు. అక్కిడికి తీసుకెళ్లగా సాధారణ వాతపు నొప్పులని, కాన్పు రావడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని చెప్పి వెనక్కి పంపించేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆమెకు తీవ్రమైన నొప్పులు రావడంతో బంధువులు మూడు కిలోవీుటర్ల దూరం ఆమెను మంచంపై మోసుకొచ్చి 108 ద్వారా ఖమ్మం తరలిస్తుండగా ప్రసవం జరిగి ఆడ∙శిశువు మృతి చెందింది. విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం నేత మద్దిశెట్టి సామేలు, నవీన్, మురళి , శ్రీనివాసరావు, ప్రసాద్, అనిల్, తిమోతి తదితరులు కొత్త మేడేపల్లి వెళ్లి పరామర్శించారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే సదరు మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతికి ఫోన్లో వివరించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఏన్కూరు పీహెచ్సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా 8వ నెలలోనే బిడ్డ పుట్టడం వల్ల చనిపోయి ఉంటుందన్నారు. చదవండి: నర్సాపూర్ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి -
ట్రాఫిక్‌లో కుయ్ కుయ్.. దారివ్వని వాహనదారులు!
సాక్షి, సిటీబ్యూరో: ఆపద సమయంలో ఫోన్ చేస్తే కుయ్.. కుయ్‌మంటూ పరుగెత్తుకువచ్చే 108 సహా ఇతర అంబులెన్స్ సర్వీసులకు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఇరుకు రహదారులకు తోడు అత్యవసర సర్వీసులకు దారి ఇవ్వాలనే స్పృహ ప్రయాణికుల్లో లేకపోవడంతో నిర్దేశిత సమయానికి ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ట్రాఫిక్ రద్దీని దాటుకుని ఘటనా స్థలికి చేరుకునేలోపే ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరుకోలేక కొంత మంది క్షతగాత్రులు మృతిచెందుతున్నారు. మరికొందరు దారి మధ్యలో అంబులెన్స్‌ల్లోనే కన్నుమూస్తున్నారు. బాధితుల బలహీనతే.. వారికి బలం.. గ్రేటర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న 108 సర్వీసులు 74 ఉన్నాయి. ప్రైవేటుగా మరో వెయ్యి సర్వీసుల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల నుంచి రోజుకు 250 నుంచి 300 ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. వీటిలో సగం కాల్స్‌కు మాత్రమే సర్వీసులు అందుతున్నాయి. 108 ఇతర అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని తెలిసి కూడా చాలా మంది వాహనదారులు పక్కకు జరగడం లేదు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ 40 నిమిషాలైనా రావడం లేదు. బాధితుల బంధువులు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బాధితుల్లో ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ చిక్కుల్లో సర్వీసులు.. ►గర్భిణులను ప్లేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రులకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ఉస్మానియా, నిమ్స్‌లకు ఎక్కువగా తరలిస్తుంటారు. నెలలు నిండకుముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువులను నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుంటారు. ఎల్బీనగర్, బడంగ్పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట నుంచి వచ్చే అంబులెన్స్‌లకు మలక్‌పేట్, చాదర్‌ఘాట్ వంతెనపై ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ►ఘట్కేసర్, నారపల్లి, చర్లపల్లి తదితర శివారు ప్రాంతాల నుంచి వచ్చే బాధితులను గాం«దీకి ఎక్కువగా తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి వాహనాలకు బోడుప్పల్ వద్ద ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఇక్కడ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. ►ఉప్పల్ నుంచి వచ్చే వాహనాలకు అంబర్‌పేట, చే నంబర్ వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకైన ఈ రోడ్డుపై ఉన్న భారీగా నిలిచిన ట్రాఫిక్ రద్దీని దాటుకుని ఆస్పత్రులకు వెళ్లడం అంబులెన్స్‌లకు పెద్ద సమస్యగా మారింది. ►కూకట్పల్లి నుంచి వచ్చే వాహనాలకు అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలో నిలిచిపోతున్నాయి. కుయ్ కుయ్ అంటూ ఎంత మొత్తుకున్నా.. ముందు ఉన్న వాహనాలు ఎటూ కదలని దుస్థితి నెలకొంది. ►మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలకు జేన్టీయూహెచ్ వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ►రోడ్డుపై ఉన్న వాహన దారుల్లో చాలా మందికి అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలనే స్పృహ కూడా ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. అప్పటికే ఇరుకు రోడ్డుపై ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలు ఉంటాయి. ఫలితంగా సరీ్వసులు బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నాయి. గ్రేటర్లో 108 సర్వీసులు ఇలా ►జిల్లా అంబులెన్సులు ►హైదరాబాద్ 24 ►రంగారెడ్డి 27 ►మేడ్చల్ 21 ఏ నెలలో ఎన్ని కేసులు తరలించారు ► నవంబర్ 2700 ►డిసెంబర్ 2767 ►జనవరి 2830 -
వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ మూడోరోజే ఒకరు మృతి చెందడంతో రాష్ట్రం యావత్తూ ఉలిక్కిపడింది. నిర్మల్ జిల్లాలో ‘108’అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ వేసుకున్న రోజు (మంగళవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నట్లుండి చనిపోవడంతో వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన మొదలైంది. అనారోగ్యం కారణంగానే ఆయన చనిపోయారా? మరేదైనా పరిస్థితులు మరణానికి దారితీశాయా? అనే కోణంలో లోతుగా విచారణ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్ ఉదయం వ్యాక్సిన్ వేసుకున్నా... రోజంతా బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతను చనిపోయాడని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్‌కు, అతను చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అనారోగ్యం వల్లే అతను చనిపోయాడా? లేదా మానవ తప్పిదంతో ఏమైనా జరిగిందా అన్న కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్నాక చనిపోయిన సంఘటనలు ఒక్కొక్కటి చొప్పున జరిగాయని, తెలంగాణలో మూడో సంఘటన అని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వ్యాక్సిన్ అనంతరం చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్మల్ సంఘటనపై ఆరా తీసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మూడు రోజుల్లో 77 మందికి సైడ్ ఎఫెక్ట్స్ రాగా, అందులో నలుగురు ఆసుపత్రిలో చేరారు. చదవండి: (ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!) మానవ తప్పిదం ఏమైనా ఉందా? ఒకవేళ వ్యాక్సిన్‌లో లోపాలుంటే ఒకే బ్యాచ్‌కు చెందిన టీకా వేసుకున్న వారందరికీ సైడ్ఎఫెక్ట్స్ రావాల్సి ఉంది. ఒక వయల్‌తో 10 మందికి టీకా వేయవచ్చు. కాబట్టి వయల్ నిర్వహణ, నిల్వలో తేడాలుంటే మరికొందరికి కూడా రియాక్షన్లు వస్తాయి. కానీ నిర్మల్ సంఘటనలో అలాంటిది ఏమీ జరగలేదు. చనిపోయిన వ్యక్తి ఉదయం 11.30 గంటలకు వ్యాక్సిన్ వేసుకుంటే, ఆ రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి వరకు అతను సాధారణంగానే ఉన్నాడు. ఒకవేళ వ్యాక్సిన్ సైడ్ఎఫెక్ట్స్ ఇస్తే దాని ప్రభావం వెంటనే ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా వ్యాక్సిన్లలో లోపాలుంటే వికటిస్తాయి. కానీ మన వ్యాక్సిన్లు ఎంతో భద్రతా ప్రమాణాలు ఉన్నవన్నారు. ఇక కొన్నిసార్లు మానవ తప్పిదంతో మూడు రకాలుగా వ్యాక్సిన్లు వికటిస్తుంటాయని డాక్టర్ శ్రీనివాసరావు విశ్లేషించారు. ఒకటి వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోవడం వల్ల దాన్ని వేసుకున్న వారికి రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రెండోది అవసరం లేకపోయినా ఒక్కోసారి ఫ్రీజర్ల నుంచి ఎక్కువ వ్యాక్సిన్లు తీసి బయట పెడుతుంటారు. అప్పుడూ వ్యాక్సిన్ వికటించే అవకాశం ఉంది. ఇక మూడోది వ్యాక్సిన్‌ను కండరానికి కాకుండా ఇంకోచోట పొరపాటున వేయడం వల్ల కూడా ఒక్కోసారి వికటిస్తుందని ఆయన తెలిపారు. ఈ మూడు కోణాల్లోనూ నిర్మల్ ఘటనను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత కూడా కొన్ని విషయాలు తమకు అవగతమవుతాయని తెలిపారు. సైడ్ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్ జిల్లా టీంలో 15 మంది నిపుణులు ఉండగా, గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో ఒక కార్డియాలజిస్ట్‌ను కూడా ఆ బృందంలో చేర్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతికూల ప్రభావంపై ఆందోళన ‘సహజంగా ఈ సంఘటన టీకాల కార్యక్రమంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఇతర సార్వత్రిక టీకాల విషయంలోనూ ఇలాంటివి చూశా’మని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే వ్యాక్సిన్‌కు, ప్రస్తుతం జరిగిన మృతి సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని విరివిగా ప్రచారం చేస్తామని తెలిపారు. వేలు, లక్షల్లో వ్యాక్సిన్లు వేసినప్పుడు యాదృచ్ఛికంగా ఒకటీ అరా ప్రతికూల సంఘటనలు జరుగుతుంటాయి. అంతమాత్రాన దాన్ని వ్యాక్సిన్‌కు ముడిపెట్టడం సరికాదు. ప్రస్తుతం టీకా వేసుకుంటున్న వైద్య సిబ్బంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డాక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
'ఆయన మృతికి వ్యాక్సిన్ కారణం కాదు'
సాక్షి, ఆదిలాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మృతిపై నిర్మల్ జిల్లా కలెక్టర్ పారూఖీ అలీ స్పందించారు. అతనికి ఇదివరకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, ఈ కారణంగానే అతడు చనిపోయాడని భావిస్తున్నట్లు వివరించారు. అయినప్పటికీ విఠల్ రావు మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. పోస్టుమార్టం పూర్తయిందని, మృతుడి శరీర భాగాలను ఎప్ఎస్ఎల్కు పంపించామని, రిపోర్ట్ రాగానే అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. టీకాతో ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదని, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14 రకాలు ) అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు మృతిపై ప్రజా డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు. కాగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. (నిర్మల్: కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి మృతి) -
వ్యాక్సిన్ తీసుకున్న 108 డ్రైవర్ మృతి
సాక్షి, నిర్మల్/ కుంటాల: కరోనా టీకా తీసుకున్న మర్నాడే... ఓ 108 అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందడం కలకలం రేపింది. గుండెపోటుతో ఈ మరణం సంభవించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించినా... ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలట్ విఠల్‌రావు బుధవారం ఛాతీలో నొప్పితో మృతిచెందారు. వ్యాక్సినేషన్ అనంతరం సంభవించిన మరణం కావడంతో... అది ఎలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి వైద్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ బృం దంతో పోస్టుమార్టం చేయించారు. ఇందుకోసం నిజామాబాద్, ఆదిలా బాద్ మెడికల్ కళాశాలల నుంచి ఇద్దరేసి చొప్పున నలుగురు ఫోరెన్సిక్ వైద్యులు, నిజామాబాద్ నుంచి ముగ్గురు పాథాలజీ విభాగం వైద్యులు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆస్పత్రి నుంచి మరో వైద్యుడిని రప్పించారు. భౌతికకాయం నుంచి సేకరించిన శాంపిళ్లను పుణే, హైదరాబాద్ పరీక్ష కేంద్రాలకు పంపించారు. సెలవులో ఉన్నా.. వ్యాక్సిన్‌కు వెళ్లాడు కుంటాలలో భార్యాపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్న విఠల్‌రావు (42).. ఇదే మండలంలోని కల్లూరులో 108 అంబులెన్స్ పైలట్ (డ్రైవర్)గా పని చేస్తున్నాడు. భార్య రుక్మిణి బీడీలు చుడుతుంది. కూతురు నవనిక పదో తరగతి, కుమారుడు మణికంఠ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత నెల 6న సారంగాపూర్ మండలం కంకెట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో విఠల్‌రావు గాయపడ్డాడు. చికిత్సలో భాగంగా కుడికాలు బొటనవేలిని తొలగించారు. అప్పటి నుంచి సెలవులోనే ఉన్నాడు. కుంటాల పీహెచ్సీలో మంగళవారం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తుండటంతో విఠల్‌రావు కూడా వెళ్లి తీసుకున్నాడు. కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉండి ఇంటికి వెళ్లాడు. రాత్రి పడుకునే ముందు కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో సహచర 108 సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారు అంబులెన్స్ తీసుకుని వెంటనే కుంటాలకు వచ్చి, అక్కడి నుంచి నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే విఠల్‌రావు మృతిచెందాడు. కుటుంబానికి రూ.10 లక్షల వరకు బీమా సొమ్ము మా సంస్థలో ఉద్యోగులకు రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. ఒక్కో పాలసీలో రూ. 5 లక్షల చొప్పున మొత్తంగా రూ.10 లక్షల వరకూ బీమా సొమ్ము వచ్చే అవకాశం ఉంది. మృతుడు విఠల్ రావుకు కుటుంబానికీ నిబంధనల మేరకు రూ.10 లక్షల వరకూ బీమా సొమ్ము చెల్లిస్తాం. భార్యకు విద్యార్హతలను బట్టి సంస్థలో ఉద్యోగం ఇస్తాం. – జీవీకే–ఈఎంఆర్ఎ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బ్రహ్మానందరావు ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్సీలో విఠల్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇక రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్ మృతి చెందాడు. అయితే విఠల్ మృతిపై ప్రజా డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు. మరణంపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుదవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
వాగు మధ్యలో ప్రసవం..
కేవీబీపురం: ఆ గ్రామం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో వాగు దాటాల్సిందే. వర్షాలు వస్తే సుమారు 20 అడుగుల వరకు వాగు పారుతుంది. కొద్దిరోజుల వరకు బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. -
‘108’లో మహిళ ప్రసవం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘108 అంబులెన్స్‌లో ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి పల్లె గ్రామానికి చెందిన దివ్యలక్ష్మికి శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో ‘108’కు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుంది. మధ్యమార్గంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో సిబ్బంది.. అంబులెన్స్‌లోనే చికిత్స చేసి మగబిడ్డకు పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించామని ‘108’ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ప్రజలు ‘108’ సేవలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కోరారు. -
ఆనందంగా సచ్చిపోతా!
-
హహహ.. ఆనందంగా సచ్చిపోతా!
సాక్షి, ప్రకాశం: ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు తరలించగా పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు నిప్పంటించాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి. అయినప్పటికీ నిందితుడు సురేష్ వింతగా నవ్వుతూ వాహనం నుంచి దిగడానికి మొండికేశాడు. ‘నే సచ్చిపోతా.. ఆనందంగా సచ్చిపోతా’ అంటూ పిచ్చిగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని బలవంతంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. అయితే, వారి కళ్లుగప్పి సురేష్ పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కోవిడ్ అనుమాతుడిగా భావిస్తున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా, మంటల ధాటికి అంబులెన్స్ పూర్తిగా కాలి బూడిదైంది. (చదవండి: శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు) -
మేమున్నామని.. మీకేం కాదని
పాలకొండ రూరల్/సీతంపేట: వైద్యం లేక అల్లాడిపోతున్న గిరిజన ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఊపిరి అందించారు. అపర సంజీవనిగా పేరుగాంచిన 108, 104 సేవలను ఏజెన్సీలో విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు నియోజకవర్గాలైన పాలకొండ, పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట పరిధిలో 24 గంటలు వైద్య సేవలను అందించే 27 పీహెచ్‌సీలున్నాయి. అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లు 11 అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో ఏజెన్సీ మండలాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందేవి. దీనికి తోడు అప్పట్లో 108, 104 వాహనాలకు డీజిల్ లేక అవి మూలనపడ్డాయి. సిబ్బందికి అరకొర జీతాలతో వారూ ది గాలుగా ఉండేవారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మా ర్చివేసింది. ముఖ్యంగా ఏజెన్సీ సబ్‌ప్లాన్ పరిధిలో మెరుగైన వైద్య సేవలకు శ్రీకా రం చుట్టింది. ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా సీతంపేట, పాలకొండ మండల కేంద్రాల్లో అ త్యాధునిక హంగులతో ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణాలకు సంబంధించి నిధులు సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. తాజాగా 104, 108 వాహనాలను కూడా సమకూర్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వాహనాలు 5 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణాలు కొనసాగించటంతో నిబంధనల మేరకు ఆ వాహనాలు జీర్ణించుకుపోయాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలను కలుపుకుని ఉన్న సమీప మండలాలైన పాలకొండ, మందస, పాతపట్నం, కొత్తూరు, సీతంపేట, మెళియాపుట్టి, ఎల్.ఎన్ పేట, సావరకోట, హిరమండలం మండలాలకు ప్రత్యేకంగా సరికొత్త వాహనాలను తొలివిడతలోనే అందించారు. వీటికి తోడు మరో 15 ఫీడర్ అంబులెన్స్‌లు గిరిగ్రామాల్లో చక్కర్లు కొడుతూ సేవలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ కోవలో భామిని, వీరఘట్టం మండలాలకు త్వరలో నూతన వాహనాలు సమకూరనున్నాయి. అత్యాధునిక వైద్య సేవలు నూతన అంబులెన్స్‌లో ప్రభుత్వం అధునాతన వైద్య సేవలకు సంబంధించిన పరికరాలను అమర్చింది. పల్స్‌ఆక్సీ మీటర్, ఫోల్టబుల్ స్ట్రెక్చర్స్, ట్రాన్స్‌పోర్టు వెంటిలేటర్, సాక్షన్ ఆపరేటర్, మల్టీ పారామీటర్, కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్(ఎండీటీ) ప్రతి పౌరునికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్ట్స్ నమోదు వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 20 నిమిషాల్లోనే 108 వాహనం రానుంది. ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)కి అనుసంధానం చేశారు. మొబై ల్ మెడికల్ యూనిట్లలో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్త ఉంటారు. సాధారణ సమస్యలతోపాటు ప్రస్తుతం కరో నా వైరస్ బారిన పడుతున్న వారికి సేవలందించటంలో కూడా 108 తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 వాహనాల్లో 20 వాహనాలు కోవిడ్ బాధితుల సేవలకు కేటాయించారు. రెట్టించిన ఉత్సాహంతో.. ఇక సిబ్బంది విషయానికి వస్తే 108, 104 వాహన పైలెట్స్‌కు రూ.18 వేల నుంచి రూ.28 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కు(ఈఎంటీలు) గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20వేలు నుంచి రూ.30 వేలకు జీతాలు పెంచారు. జీతాల పెంపు పై 108, 104 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో విధులు చేపడుతుండటం విశేషం. ఉత్సాహంగా పనిచేస్తాం ముఖ్యమంత్రి 108, 104 వాహన సేవలకు కొత్త ఊపిరి అందించారు. గతంలో కనీసం డీజిల్ లేక నెలల తరబడి వాహనాలు మూలనపడ్డాయి. దీంతో అనేక మందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. ఆక్సిజన్ సిలెండర్లు కూడా ఉండేవి కావు. నేడు ఆధునాతన వాహనాలతోపాట ఆధునిక వైద్య పరికరాలు అందించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభు త్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అలాగే సిబ్బంది జీతాలు పెంచారు. రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తాం. – డి.ముకుందరావు, పైలెట్, పాలకొండ. సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది పాదయాత్రగా వచ్చినప్పుడు జగనన్నకి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఆయన అధికారంలోకి రాగానే మాకు జీతాలు పెంచి మాలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఏజెన్సీలో గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. కనీస వసతులు లేని వాహనాలతో ఇబ్బందులు పడేవారం. ఇప్పుడు వాహనాలు అత్యాధునికం. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలం చేరుకోగలం. బాధితులను మరింత తక్కువ సమయంలో ఆస్పత్రికి చేర్చగలుగుతున్నాం. ప్రజల్లో మళ్లీ 104, 108 సేవలపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. – గిరి గణపతి, ఈఎంటీ, పాలకొండ -
కరోనా బాధితుల కోసం 216 అంబులెన్సులు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు 108 అంబులెన్సులే పెద్ద దిక్కు అయ్యాయి. ఓ వైపు ఎమర్జెన్సీ సేవలను కొనసాగిస్తూనే.. మరోవైపు కోవిడ్ బాధితుల కోసం పనిచేస్తున్నాయి. రమారమి 216 అంబులెన్సులు రాష్ట్రంలో కోవిడ్ సేవలకు వినియోగిస్తున్నారు. కోవిడ్ లక్షణాలున్న వారిని, పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఆస్పత్రులకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం 731 వాహనాలుండగా.. 216 అంబులెన్సులు ప్రత్యేకించి కోవిడ్ సేవలకు వినియోగిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కలెక్టర్లు ఆ జిల్లాలో ఉన్న అంబున్సులను కోవిడ్ సేవలకు సర్దుబాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ 75 వేల మందికి పైగా కరోనా బాధితులను ఆస్పత్రులకు, క్వారంటైన్ కేంద్రాలకు 108 అంబులెన్సుల ద్వారానే చేర్చారు. అవసరమైతే మరికొన్ని అంబులెన్సులను కోవిడ్‌కు వాడుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంబులెన్సులు కోవిడ్కే.. – ప్రస్తుతం పనిచేస్తున్న 216 అంబులెన్సులు కేవలం కోవిడ్ సేవలకు మాత్రమే పనిచేస్తాయి. – పాజిటివ్ రోగులను నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది కాబట్టి ఈ వాహనాలు ఈ సేవలకే పరిమితం చేశారు. – మిగతా 515 వాహనాలను ఎమర్జెన్సీ సేవలకు వినియోగిస్తున్నారు. పాజిటివ్ కేసులు ముందే నిర్ణయించినవి కాబట్టి చిరునామాను బట్టి అంబులెన్సులు వెళతాయి – మిగతా సేవలకు మాత్రమే 108కు కాల్ చేస్తే వస్తాయి. త్వరలోనే మరో 100 పాత 104 వాహనాలను కోవిడ్ కోసమే అందుబాటులోకి తేనున్నారు – కోవిడ్‌తో మృతిచెందిన వారి కోసం మహాప్రస్థానం వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రైవేటు అంబులెన్సులను నియంత్రించేందుకే.. కరోనా సమయంలో ప్రైవేటు అంబులెన్సు యజమానులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అందువల్లే 200కు పైగా అంబులెన్సులను కోవిడ్ సేవలకే వినియోగిస్తున్నాం. – రాజశేఖర్‌రెడ్డి, అదనపు సీఈఓ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏ ఒక్క బాధితుడూ ఇబ్బంది పడకుండా.. ఏ ఒక్క బాధితుడూ 108 రాలేదనే ఇబ్బంది పడకుండా పకడ్బందీగా నిర్వహణ చేస్తున్నాం. ప్రతి కాల్‌నూ స్వీకరించి సకాలంలో వాహనం వెళ్లేలా చూస్తున్నాం. మొత్తం 731 వాహనాలు రన్నింగ్‌లో ఉన్నాయి. – స్వరూప్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, 108 నిర్వహణా సంస్థ అవసరాన్ని బట్టి వాహనాలు కోవిడ్‌తో మృతి చెందినా లేదా కోవిడ్ లక్షణాలతో మృతి చెందినా అలాంటి మృతదేహాలను తీసుకెళ్లడానికి మహాప్రస్థానం వాహనాలను పంపిస్తున్నాం. ప్రస్తుతం 53 వాహనాలు పనిచేస్తున్నాయి. –డాక్టర్ శశికాంత్, సీఈఓ, మహాప్రస్థానం -
కొత్తగా వంద ‘108’ అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుం డటం, అనేక కేసులు సీరియస్‌గా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘108’అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత విస్తరించింది. కొత్తగా మరో వంద వాహనాలను కొనుగోలు చేసింది. అవి నేడో రేపో రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతము న్న వాహనాల్లో 90 అంబులెన్సులు కరోనా బాధితుల నిమిత్తం వినియోగిస్తుండగా మిగిలిన వాటిని ఇతర అత్యవసర సేవలకు వాడుతున్నారు. దీంతో అంబులెన్సుల కొరత ఏర్పడి కొన్నిచోట్ల సాధారణమైన వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. వా టిల్లో ఎలాంటి ఆక్సిజన్ సదుపాయాలు కూడా ఉం డటంలేదు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద టెం డర్లు పిలిచి వంద కొత్త ‘108’అంబులెన్స్ వాహనా లు కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. క్రిటికల్ కేర్ ఏర్పాట్లు కొత్తగా వచ్చే వంద ‘108’అంబులెన్సుల్లో ఆక్సిజన్ సదుపాయం ఉంటుంది. కరోనా కేసులు సీరియస్ అయినప్పుడు అవసరమైన అత్యాధునిక వసతుల తో వీటిని తయారు చేయించినట్లు వైద్య, ఆరోగ్యశా ఖ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల క్రిటికల్ కేర్ ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. కేసులు అత్యధికంగా నమోదవుతున్న హైదరాబాద్ సహా ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఈ కొత్త అంబులెన్సులకు అవసరమైన డ్రైవర్లను, ఇతర పారామెడికల్ సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
బాబోయ్! అంబులెన్స్.. విమానం మోత!
సాక్షి, సిటీబ్యూరో: జేబులో రూ.10 వేలు ఉంటే ఏకంగా విమానంలో హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లొచ్చు. బ్యాంకాక్ పోవచ్చు. ఢిల్లీకి వెళ్లి తిరిగి రావచ్చు. కానీ ఇప్పుడు నగరంలో కోవిడ్ రోగిని తీసుకొని అంబులెన్స్‌లో పట్టుమని 10కి.మీటర్లు కూడా వెళ్లలేం. నిజమే. ఆపదలో ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్ సదుపాయం ఉన్నఅంబులెన్స్లో 5 కి.మీ తీసుకెళ్లాలంటే ఏకంగా రూ.10 వేలుచెల్లించాల్సిందే. అర్ధరాత్రి, అపరాత్రి అయితే ధరలు మరింత భగ్గుమంటాయి. ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించకతప్పడం లేదు. వారం రోజుల క్రితం ఓ కరోనా బాధితుణ్ని సనత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు తీసుకెళ్లేందుకు రూ.7500 డిమాండ్ చేసినట్లు అతని బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ నుంచి మలక్‌పేట్ వరకు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్సులు అరకొరగా ఉండడం, సకాలంలో ఆదుకోకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ అంబులెన్స్‌ల నిర్వాహకులు, డ్రైవర్లు రోగులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వైద్యం పేరిట రూ.లక్షలు దండుకుంటున్న ‘కాసు’పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా అంబులెన్స్‌ల దోపిడీ కొనసాగుతోంది. దీంతో కరోనా రోగులకు వైద్యమే కాదు, అంబులెన్స్ సేవలు కూడా భారంగానే మారాయి. చాలా చోట్ల 108 వాహనాలు చేతులెత్తేయడంతో ఈ దుస్థితి నెలకొంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు చనిపోతే అంబులెన్స్‌ల బేరానికి అడ్డూ అదుపూ అందడంలేదు. ఇటీవల హైటెక్ సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్‌తో చనిపోయిన రోగి మృతదేహాన్ని ఈఎస్ఐ శ్మశానవాటికకు తరలించేందుకు రూ.25 వేలు వసూలు చేశారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే ప్రభుత్వమే ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలిస్తుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చనిపోతే మాత్రం చాలా దారుణంగా ఉంది. అప్పటికే ఆ కుటుంబం ఐసోలేషన్‌లో ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే’ అని సాఫ్ట్వేర్ నిపుణుడు సాయితేజ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్ సోకిన వ్యక్తి బతికి ఉన్నా, చనిపోయినా అంబులెన్స్‌ల దోపిడీ మాత్రం భయంకరంగానే ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 108 వాహనాలు గ్రేటర్ హైదరాబాద్‌లో 45 మాత్రమే ఉన్నాయి. కానీ కరోనా దృష్ట్యా మరికొన్నింటిని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అయినా ఈ వాహనాలు సకాలంలో బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చాలామంది తమ వాహనాల్లో అప్పటికప్పుడు మార్పులు చేసి ‘అంబులెన్స్’లుగా డెస్టినేషన్ బోర్డులు తగిలిస్తున్నారు. ‘సైరన్’లో బిగిస్తున్నారు. ఇలా ఏ ప్రభుత్వ విభాగం అనుమతి లేని అంబులెన్స్‌లు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా వాహనాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా ఆర్టీఏ అనుమతి తప్పనిసరి. ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించేందుకు తూనికలు– కొలతలు శాఖ నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ కరోనా ఆపత్కాలాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొంతమంది వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. మారుతీ ఓమ్ని, మెటాడోర్, వింగ్లర్ వంటి వాహనాల్లో పడకలను, ఆక్సిజన్ సిలిండర్లు, సైరన్లు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ఈ తరహా అంబులెన్స్‌లు కలిసి తమ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. డిశ్చార్జి పేషెంట్లను కూడా వదలకుండా దోచుకుంటున్నాయి. ఏ ప్రభుత్వ విభాగం కూడా అంబులెన్స్‌ల దోపిడీని అరికట్టలేకపోవడం గమనార్హం. రవాణా శాఖ పూర్తిగా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అంబులెన్స్ అంటేనే భయమేస్తోంది.. సాధారణంగా అంబులెన్స్ అంటే ప్రాణాలు కాపాడుతుందనే భావన ఉంటుంది. ఆపదలో ఉన్నవాళ్లకు ఊపిరి పోస్తుంది. రోడ్డు మీద అంబులెన్స్ కనిపిస్తే తప్పనిసరిగా దారి ఇస్తాం. కానీ ఇప్పుడు అంబులెన్స్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. సిటీలో కనీసం 5 కి.మీ దూరం వెళ్లాలంటే రూ.10 వేలు ఉండాల్సిందే.– సాయితేజ, హైటెక్ సిటీ -
మానవత్వం మరిచారు..!
సాక్షి, భూపాలపల్లి : ఆపదలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చాల్సిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని చెప్పడం, అప్పటిదాకా ఆమెను తరలించిన ఆటో డ్రైవర్ నిజంగానే చనిపోయిందేమోనని మార్గ మధ్యంలోనే వదిలేసి వెళ్లడం, కరోనా భయంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమయానికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ (45) మొక్కు తీర్చుకోవడానికి మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాళ్లగూడెంలో ఉండే తన చెల్లి ఇంటికి మంగళవారం వచ్చింది. అక్కడ ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ పడిపోయింది. నోటి నుంచి నురుగులు, ముక్కు నుంచి రక్తం రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అది రావడం ఆలస్యమవడంతో ఆమెను ఆటోలో తీసుకుని బయల్దేరారు. జైపూర్ మండలం వెలిశాల సమీపంలోకి రాగానే 108 వాహనం వారికి ఎదురైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ సైతం మహిళను రోడ్డుపైనే దింపి వెళ్లిపోగా, ఆ కుటుంబం సహాయం కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. దానిలో మంచిర్యాలకు తరలిస్తుండగానే శంకరమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా వైద్యసాయం అందాల్సినవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
ఒక్క కాల్... నిమిషాల్లో 108
-
ఏదీ మానవత్వం?
-
మానవత్వం మాయం
కుషాయిగూడ (హైదరాబాద్): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి.. మనుషుల్లో మానవత్వాన్ని కూడా మాయం చేస్తోంది. తోటి మనిషి ఎంత ఆపదలో ఉన్నా.. అతడికి సాయం చేద్దామనే ఆలోచన మచ్చుకైనా కనిపించని పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. వారికి సాయపడితే ఆ మాయలమారి తమకు ఎక్కడ సోకుతుందో అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఎదుటి మనిషి ప్రాణం పోతున్నా కూడా మనకెందుకులే అని దూరం నుంచే తప్పుకుంటున్నారు తప్ప.. దగ్గరకెళ్లి సాయం చేసి అతడి ప్రాణం నిలబెట్టాలనే భావన కొంచెం కూడా ఎవరి మదిలోనూ మెదలడంలేదు. సాయం కోసం అర్థిస్తూ కళ్ల ముందే కుప్పకూలినా సరే కరోనా భయం వారిని అడుగు ముందుకు వేయనీయడంలేదు. ఈ నేపథ్యంలో మానవత్వం కూడా అంతరించిపోయేవాటి జాబితాలో చేరిపోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోగా.. ఏ ఒక్కరూ సాయం చేయడానికి సాహసించలేదు. అతడి పరిస్థితి చూసి, అయ్యో పాపం అన్నారే తప్ప.. మేమున్నాం అంటూ ముందుకు రాలేదు. ఆటో ఎక్కుతూ... హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని బీజేఆర్ కాలనీకి చెందిన పృథ్వీరాజ్ (35) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు అతడిని పరీక్షించి పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిమ్స్‌కు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటోలోకి ఎక్కబోతూ ఒక్కసారిగా పృథ్వీరాజ్ కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఎంతగా కదిపినా చలనం కనిపించలేదు. అతడు కింద పడిపోవడం.. కుటుంబ సభ్యులు ఆందోళనతో రోదించడాన్ని అక్కడ ఉన్న జనం అలా చూస్తూ ఉన్నారే తప్ప.. ఏ ఒక్కరూ కూడా వారికి సాయం చేసేందుకు వెళ్లలేదు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. పృథ్వీ కుటుంబ సభ్యులు వెంటనే 108కి కాల్ చేయగా.. నిమిషాల్లోనే ఆ అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. అయితే, 108 సిబ్బంది అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, పృథ్వీ మృతదేహాన్ని 108 వాహనంలోకి ఎక్కించేందుకు కూడా ఎవరూ సాయం చేయకపోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా కారణంగా సాయం కూడా చేయలేకపోతున్నామని మాట్లాడుకోవడం తప్ప.. సాహసించి ఎవరూ ముందుకు వెళ్లలేదు. దీంతో 108 సిబ్బంది, పృథ్వీ కుటుంబ సభ్యులే అతడి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. -
నడిరోడ్డుపై యువకుడి మృతి
-
చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడి మృతి
సాక్షి, హైదరాబాద్: ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. యువకుడు అప్పటికే మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి వెంటే ఉన్న అతని తల్లి, చెల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు. మృతుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్‌గా తెలిసింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని స్థానికంగా ఉండే జీనియా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జీనియా ఆస్పత్రి సిబ్బంది వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో గత్యంతరం లేక యువకుడిని తీసుకుని కుటుంబ సభ్యులు బయటికొచ్చారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్దామని ఆటో కోసం చూస్తున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. యువకుడు అనూహ్యంగా కిందపడి మృత్యువాత పడ్డాడు. పృథ్వీరాజ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయాలతో సాటిమనిషిని పట్టించుకోవడం మానేశారని వాపోయారు. (చదవండి: కరోనా బిల్లులతో కన్నీటిపర్యంతమైన డాక్టర్) -
108 వాహానాన్ని అలవోకగా డ్రైవ్ చేసిన రోజా
-
108 వాహనాన్ని స్వయంగా నడిపిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి : నగరి పుత్తూరు పున్నమి సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
వేయి గొంతుకల విప్లవ శంఖం!
సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం బాగుంటుంది. అది నిత్య నూతనం, ఉత్తేజపూరితం. చూడగలిగితే విప్లవం ప్రభవిస్తున్న దృశ్యం కూడా చాలా బాగుంటుంది. అది నవోన్మేష సత్యం. మహోత్తేజపూరితం. దృశ్యం ఏదైనా కావచ్చు. ఆ దృశ్యంతో చుట్టరికం కలిగిన పరిణామాలు, ఆ పరిణామాల చుట్టూ అల్లుకున్న ఒక తాత్విక చింతన అనతికాలంలోనే ఆ రంగాన్ని ఆమూలాగ్రం సంస్కరించబోతున్నాయని గ్రహించగలిగే చైతన్యం ఉంటే, విప్లవ జనన దృశ్యాన్ని ఎవరైనా చూడవచ్చు. అలాంటి ఒక దృశ్యమే మొన్న విజయవాడ వీధుల్లో కనువిందు చేసింది. అంగడి సరుకుగా మారిపోతున్న వైద్యరంగంలో పెను మార్పులకు దండోరా వేస్తూ ప్రజారోగ్య రథయాత్ర మాదిరిగా 1088 అంబులెన్స్‌ల సేవా యాత్ర మొదలైంది. సంక్షుభిత ప్రజారోగ్య రంగంలో అదొక వేయి గొంతుకల విప్లవ శంఖం. ఈ దేశంలో వ్యవసాయరంగం తర్వాత, అదేస్థాయిలో తీవ్ర సంక్షోభంలో కూరుకొనిపోయిన రంగం ఏదంటే ముందుగా చెప్పవలసింది ప్రజారోగ్య రంగం గురించే. ఆ తర్వాతనే విద్యారంగం. బ్రిటిష్ కాలంలో భారతీయ వైద్యవిధానం నిర్లక్ష్యానికి గురైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దానికి ప్రోత్సాహం లభించలేదు. పైగా నాటువైద్యంగా ఈసడింపుల పాలైంది. వేల సంవత్సరాల పాటు భారతీయ సమాజపు ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలిచింది ఆ వైద్య విధానమేనన్న సంగతి మరచిపోరాదు. అటువంటి వైద్యుడు లేని ఊరిలో నివసించకూడదు సుమా అని సుమతీ శతకకారుడు హెచ్చరించాడు కూడా. పాతతరం ప్రజలందరికీ ఆ పద్యం కంఠో పాఠం. శతాబ్దాలపాటు ఎటువంటి పరిశోధనలు లేకుండా, అధ్యయనాలు లేకుండా వదిలేసిన ఫలితంగా మారుతున్న సమాజంతో పరుగెత్తలేక, దేశీయ సంప్రదాయ వైద్యవిధానం చతికిలబడిపోయింది. కానీ, శాస్త్రీయ అల్లోపతి వైద్యవిధానం ప్రాథమిక స్థాయిలో ఆ స్థానాన్ని ఇప్పటికీ భర్తీ చేయలేక పోయింది. దాని ఫలితమే వైద్యరంగ సంక్షోభం. స్వాతంత్య్రం వచ్చిన 34 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2000 సంవత్సరం నాటికి పౌరులందరికీ ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తేవడమే విధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కాలంలోనే తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అనే పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ పాట సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్ష కుల ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. మొదటి ఆరోగ్య విధానం (1983–2003) సాధించిన విజయాలకు ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఉండబోదు. కొన్ని మార్పు చేర్పులతో 2003లో రెండో ఆరోగ్య విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో మూడంచెల ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంది. ఆ పైస్థాయి వాటిని రెఫరల్ ఆస్ప త్రులుగా పరిగణిస్తారు. తొలిదశలో రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఆరోగ్య ఉపకేంద్రం ఉంటుంది. ఉప కేంద్రంలో ఏఎన్ఎమ్తోపాటు ఆశ వర్కర్లు ఉంటారు. ఆపై దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇవి కొంచెం అటూఇటుగా మండలానికి రెండు చొప్పున ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిబంధనల ప్రకారం ప్రాథమిక కేంద్రాల్లో వైద్యాధికారితోపాటు 14 మంది సిబ్బంది ఉండాలి. వీటి పైస్థాయిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటాయి. వీటి సంఖ్య మన రాష్ట్రాల్లో ఇంచుమించు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ కేంద్రాల్లో ఒక సర్జన్, ఒక ఫిజీషియన్, గైనకాలజిస్టు, పిల్లల వైద్యనిపుణులు, 21 మంది పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. 30 పడకల వసతి, ఆపరేషన్ థియేటర్, ఎక్స్–రే, ప్రసూతి గది, లేబొరేటరీ తదితర సౌకర్యాలు ఉండాలి. నిబంధనలు ఎలా ఉన్నా ఆచరణలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సిబ్బంది లేక, సౌకర్యాలు లేక అధానస్థితికి చేరుకుని, వెళ్లాలంటేనే ప్రజలు భయ పడి పోయే పరిస్థితి ఏర్పడింది. తొలిసారి జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించినప్పుడు ప్రాథమిక వైద్యంలో ప్రైవేట్ సంస్థల పాత్ర పరిమితంగానే ఉండాలన్న సూచనను చేర్చారు. కానీ ప్రభుత్వాసుపత్రుల వైఫల్యం కారణంగా ప్రాథమిక వైద్యం లోనూ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది. ప్రజారోగ్య రంగంలో ప్రైవేట్ ఆస్పత్రులు కూడా తొలి రోజుల్లో ప్రశంసనీయమైన పాత్రనే పోషించాయి. 1980 తర్వాతనే మెజారిటీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాపార ధోరణి ప్రబలింది. తెలుగు రాష్ట్రాల్లోని తొలితరం డాక్టర్లలో స్వాతం త్య్రోద్యమ ప్రభావం, కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం బలంగా ఉండేవి. ఎంతోమంది డాక్టర్లు ఉన్నతాశయాలతోనే ఆస్పత్రులు ప్రారంభించారు. కేవలం రూపాయి, రెండు రూపాయల కన్సల్టేషన్ ఫీజుతోనే రోగులకు చికిత్స చేసిన డాక్టర్లు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేకమంది ఉండేవారు. రాజకీయ రంగప్రవేశం చేయకముందు వైద్యసేవలు అందించిన డాక్టర్ రాజశేఖరరెడ్డికి రూపాయి డాక్టర్ అని జనంలో పేరుం డేదని ఇప్పటికీ చెప్పుకుంటారు. నెల్లూరులో డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి స్థాపించిన ప్రజావైద్యశాలలో శిక్షణ పొందిన అనేకమంది డాక్టర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రులు నెలకొల్పి అదేతరహా సేవలను అందించారు. ఆర్ఎమ్పీ, పీఎమ్పీల పేర్లతో గ్రామాల్లో పనిచేస్తున్న వారికి ఈ ఆదర్శ డాక్టర్లు పునశ్చరణ తరగతులు నిర్వహించి వారి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టేవారు. ఆవిధంగా పల్లెసీమల్లో అంతర్ధానమవుతున్న సంప్రదాయ వైద్యుల స్థానాన్ని శిక్షణ పొందిన ఆర్ఎమ్పీ, పీఎమ్పీలతో భర్తీ చేసే ప్రయత్నాన్ని తొలితరం డాక్టర్లు చేయగలిగారు. వైద్యుల తరం మారడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల ఫలితాలు వైద్యరంగం మీద కూడా ప్రభావం చూపాయి. వ్యాపార సంస్కృతి క్రమంగా వేళ్లూనుకోవడం ప్రారంభమై అచిర కాలంలోనే వటవృక్షంలా మారిపోయింది. కార్పొరేట్ ఆస్ప త్రులు విస్తరించాయి. గ్రామీణ వైద్యులకు ‘రెఫరల్ ఫీజు’ను ఎరగా వేశాయి. ఊళ్లో వైద్యం చేస్తే పేషెంట్లు తమకిచ్చే ఫీజుకన్నా కార్పొరేట్ ఆస్పత్రులు ఇచ్చే ‘రెఫరల్ ఫీజు’ ఎక్కువగా ఉన్నందువల్ల పేషెంట్లను పెద్దాసుపత్రులకు పంపించే వ్యాప కాన్ని మెజారిటీ గ్రామీణ వైద్యులు అలవాటు చేసుకున్నారు. సంప్రదాయ వైద్యం అదృశ్యమైంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ‘నేను రాను బిడ్డో’ అనే విధంగా తయారయ్యాయి. ఆర్ఎంపీ, పీఎమ్పీ వైద్య సేవలు చాలాచోట్ల గాడి తప్పాయి. ఫలితంగా ప్రాథమిక వైద్యం పూర్తిగా పడకేసింది. ఈ పరిణామం కార్పొ రేట్ ఆస్పత్రులకు బాగా నచ్చింది. ప్రాథమిక వైద్యం అందు బాటులో ఉన్నట్లయితే భవిష్యత్తులో బ్రహ్మరాక్షసిగా పరిణ మించే అవకాశాలున్న అనేక జబ్బులను మొగ్గలోనే తుంచేయ వచ్చు. జబ్బును ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్సను అందజేస్తే అది దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించకుండా ఉంటుం దని వైద్య నిపుణులు చెబుతారు. ప్రాథమిక వైద్య సౌకర్యాల లేమి ఫలితంగా లక్షలాది మంది గ్రామీణ ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారినపడి ఆర్థికంగా దివాలా తీశారు. కార్పొరేట్ ఆస్పత్రులు కొత్తకాంతులు పులుముకున్నాయి. ఈ పరిణా మాన్ని గమనించిన నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీర్ఘవ్యాధుల బారిన పడిన పేద ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వుండేందుకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలను ఆదుకున్న ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. కానీ, ప్రజారోగ్య సంక్షో భాన్ని తొలగించడానికి ఇంకా పూర్తి చేయవలసిన ప్రధాన లక్ష్యం మిగిలే ఉన్నది. అదే, నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తొలివారం నుంచే ముఖ్యమంత్రి వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసి నూతన జవసత్వాలను సమకూర్చబోతున్నట్టు అప్పుడే ఆయన విధాన ప్రకటన చేశారు. అందుకోసం నాడు – నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. 671 కోట్ల రూపాయల కేటాయింపును కూడా వెంటనే చేసి వేగంగా పనులు ప్రారంభమయ్యేలా చూశారు. 2,153 మంది వైద్యులతో సహా దాదాపు పదివేల మంది నూతన వైద్య సిబ్బంది నియామకానికి సింగిల్ నోటిఫికేషన్ జారీ చేయించారు. బహుశా, ఈ నెలాఖరుకల్లా వారంతా విధుల్లో చేరిపోతారు. 16 కొత్త వైద్యశాలలను ప్రకటించారు. వాటికి స్థల సేకరణ, డిజైన్ల ఎంపిక సిద్ధమైంది. 2023 నాటికి ఇవి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 16 మెడికల్ కాలేజీలను ఈ రకంగా ప్రారంభించిన దాఖలా లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలకు ఇవి అదనం. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. ప్రజారోగ్య రంగాన్ని కీలక మలుపు తిప్పే నిర్ణయం ఇది. ప్రతి పౌరునికీ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టే లెక్క. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల ప్రజలు దోమకాటు జ్వరాలతో వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోయే దారుణాన్ని ప్రభుత్వాలు ప్రతియేటా ప్రేక్షక పాత్రలో వీక్షించే సంప్రదాయానికి తెరదించారు. 23 లక్షల దోమ తెరలను ఇప్పటికే పంపిణీ చేశారు. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. దోమకాటు వ్యాధులపై టాస్క్‌ఫోర్స్ ఏర్పా టైంది. మెదడువాపు వ్యాధి నియంత్రణకు విశాఖ, విజయ నగరం జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఏఎన్ఎమ్లు, ఆశ వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు కలిసి దోమకాటు వ్యాధుల నియం త్రణ పద్ధతులపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 108 సర్వీసులకోసం 412 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనా లున్నాయి. మరికొన్ని పాత వాహనాలతో కలిపి 705 వాహ నాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. 104 సర్వీసుల కోసం ఒక్కసారే 676 కొత్త వాహనాలను తెప్పించారు. ఇందులో డాక్టర్, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఇందులో 74 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ప్రతి గ్రామాన్ని నెలకోసారి ఈ మొబైల్ క్లినిక్ సందర్శిస్తుంది. ఈ రెండు సర్వీసులకూ కలిపి 1,088 కొత్త వాహనాలను గత బుధవారం నాడు ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ రథయాత్రను టీవీలో చూసి యావద్దేశం పులకించిపోయింది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ తదితర భారతీయ భాషల మీడియా ప్రముఖ వార్తగా ఈ ఘట్టాన్ని చూపెట్టాయి. సువర్ణ టీవీ అనే కన్నడ చానల్ యాంకర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి మాక్కూడా అని పదేపదే ఆ యాంకర్ వ్యాఖ్యానించాడు. తమిళ చానళ్లదీ ఇదే వరస. కానీ, ఒకే ఒక్కరు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రతిపక్ష నేత మాత్రం ఓస్, ఇంతేనా అన్నారు. ఈ మాత్రం దానికే ఇంత షో చేయాలా అని పెదవి విరిచారు. వాహనాల కొనుగోలుకు 211 కోట్లు ఖర్చయింది. ఇందులో మూడు వందల కోట్లు అవినీతి జరిగిందని ఆయన అనుయాయులు లెక్క తేల్చారు. బేరీజు వేసి చూస్తే... వైద్య రంగాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం వైఎస్ జగన్ ఒక్క సంవత్సరంలో చేసిన కృషిలో కనీసం పదో వంతు కూడా చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో చేసి ఉండరు. ఏ నిష్పాక్షిక బృందాన్ని అంచనాకోసం నియమించినా ఇదే విషయం రుజువవుతుంది. బెలూన్‌లో భూగోళాన్ని చుట్టివచ్చిన స్విస్ సాహసికుడు బెట్రండ్ పికార్డ్ ఒక మాట అన్నారు. ‘ఉరిమే ఉత్సాహం అవసరమే, కానీ ఆ ఉత్సాహం అంతరిక్షాన్ని గెలవడానికో, గ్రహాలను గెలవడానికో కాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం అన్నిటికన్నా ముఖ్యం’. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్య క్రమం అదే. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘బాబు 104, 108లను నిర్వీర్యం చేశాడు’
సాక్షి, విజయవాడ: 104, 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో 104, 108లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 108, 104 వాహనాల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనవసరపు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో దేశం మొత్తం ఆంద్రప్రదేశ్ వైపు చూస్తోందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 108లు మూలన పడ్డాయని, అవి సరిగ్గా పని చేయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 108, 104 వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహారించిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుజాతరావు కమిటీ సిఫార్సుల మేరకు 108,104 వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 2019 జూన్‌లో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) చంద్రబాబు హయాంలో కాలయాపన కమిటీలు చాలా చూశామని కానీ, సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కమిటీ ఏర్పాటు చేశారని ఆళ్ల నాని చెప్పారు. 676 మండలాల్లో 108, 104 నూతన వాహనాలు తీసుకువచ్చారని చెప్పారు. గతంలో 108 వాహనాలు చిన్నపాటి రిపేర్లు వచ్చినా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 332 పాత 108 వాహనాలు ఉన్నాయని అదనంగా 432 నూతన వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. అదే విధంగా 676 కొత్త 104 వాహనాలు తీసుకున్నామని తెలిపారు. సర్వీసు ప్రొవైడర్ విషయంలో అరబిందో ఫౌండేషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి నెలలో రివర్స్ టెండరింగ్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు దక్కిందని రూ. 2,04 074 కోట్ చేశారని తెలిపారు. 28 వాహనాలకు రూ.1,78,072 ఆదా చేశామని తెలిపారు. రివర్స్ టెండర్ ద్వారా మొత్తం రూ.180 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. (‘చంద్రబాబు జీవితంలో మారడు’) నవంబర్ 21 నాడు టెండర్లు పిలిచామని ఎంకేపీ, అరబిందో ఫార్మా సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. బీవీజీ కంపెనీ సమయంలో 1068 మంది పైలెట్లు ఉండేవారని పైలెట్‌కు 10 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకు 12 వేలు జీతం ఇచ్చారని చెప్పారు. పాత వాహనాల్లో రూ.10 వేలు నుంచి రూ.28వేలు వరకు 1690 మంది పైలెట్లకు జీతాలు పెంచామని తెలిపారు. పాత వాహనాల్లో టెక్నిషియన్లకు రూ.12వేలు నుంచి రూ. 30వేలకు పెంచామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవరించిందని తెలిపారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత రూ.9 పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పారు. 1800 వాహనాలు కొనుగోలు చేశామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఉన్నత ఆశయంతో సీఎం వైఎస్ ప్రభుత్వం 16 మెడికల్ ఆస్పత్రులను తీసుకురాబోతోందని తెలిపారు. మహాప్రస్థానం పేరుతో సేవలందిస్తున్న వాహనాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. -
‘ఇక పేదవాళ్ల ఆరోగ్యానికి ఢోకా లేదు’
-
దేశమంతా ఏపీ వైపు చూసేలా..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య విప్లవం తీసుకొచ్చారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం జిల్లాకు కేటాయించిన 61 108,104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ పేదవానికి కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి) కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా వెయ్యికిపైగా 108, 104 వాహనాలు ప్రారంభించడం అభినందనీయమని అవంతి అన్నారు. ఇక పేదవాడి ఆరోగ్యానికి డోకా లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాడు వైఎస్సార్ ప్రవేశపట్టిన పధకాలకి నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పునర్జీవం పోశారని కొనియాడారు. (ప్రజారోగ్య రథయాత్ర) ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలకి ఉపయోగపడేలా వెయ్యికి పైగా అంబులెన్స్ వాహనాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా విప్లవాత్మకమైన పధకాలతో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక వైద్యురాలిగా సీఎం వైఎస్ జగన్ పధకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇంటి వద్దకే డాక్టర్లు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.(దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్) పాడేరు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. 108,104 వాహనాల ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజారోగ్యంపై ఆయన ఎంతశ్రద్ధ కనబరుస్తున్నారో అర్ధమవుతోందని తెలిపారు. గిరిజనులకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. గిరిజనులకి వైద్య విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ పాడేరులో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ వల్ల వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 108,104 వాహనాలు షెడ్లో ఉన్నాయని తెలిపారు. బాబు తన పాలనలో ఒక్కరోజు కూడా వాటి గురించి పట్డించుకోకుండా ఇపుడు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2023లో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని విమర్సించారు. ఇంత పెద్ద స్ధాయిలో 108,104 వాహనాలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన ముఖ్యమంత్రి కాబట్టే తన పాలనతో తొలి ఏడాదిలోనే దేశంలోనే నాలుగో స్ధానంలో నిలిచారని కొనియాడారు. నాడు వైఎస్సార్ వైద్య, విద్యా రంగాలకి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన కీర్తి దేశ విదేశాల్లో మారుమోగిందని తెలిపారు. ఆయన తనయుడిగా తండ్రిని మించిన స్ధాయిలో పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్య లక్ష్మి, జేసీ అరుణ్ బాబు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, వైద్య ఆరోగ్యా శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
‘పిల్లల కోసం కూడా అంబులెన్స్’
-
పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి
సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని భూములిస్తే పదేళ్లయినా పట్టించుకోనందుకే అమరరాజా ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చిన 253 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి గురువారం పేర్కొన్నారు. అమరరాజా భూములను వెనక్కు తీసుకోవడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ఎలా అంటారని ప్రశ్నించారు. (అమరరాజా ఇన్ఫ్రా టెక్ నుంచి 253.61 ఎకరాలు వెనక్కి) ‘253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని సర్కారు వెనక్కు తీసుకుంది. పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపట’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. (బెజవాడలో లాక్డౌన్ ప్రభావం..) నాన్న ఒక్క అడుగు.. తనయుడు రెండడుగులు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించి ఒక్క అడుగు ముందుకేస్తే, వాటికి అత్యాధునిక సౌకర్యాలు చేర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ‘నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108, 104 వాహనాలను ప్రారంభించిన మన యువ ముఖ్యమంత్రి జగన్’ అని పేర్కొన్నారు. -
108 సిబ్బందికి సీఎం జగన్ వరం
-
అత్యవసర వైద్య సేవల కల్పనలో సువర్ణాధ్యాయం
-
ప్రజారోగ్య రథయాత్ర
ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో గొప్పగా చెప్పుకోదగ్గ రోజు. ఎందుకంటే.. 1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించాము. అవి రోడ్డుపై పోతూ ఉంటే.. మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతున్న వాహనాలను చూసి ఎంతో సంతోషం కలిగింది. ఇది ఒక రికార్డు. ఇన్ని అధునాతన అంబులెన్స్‌లను ఒకేరోజు ప్రారంభించడం, జిల్లాలకు పంపించడం అనేది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అది విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్.. బుధవారం ఉదయం సరిగ్గా 9 గంటలా 25 నిమిషాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరునవ్వుతో కాన్వాయ్‌లో నుంచి కిందకు దిగారు.. అప్పటికే బారులు తీరి సేవల రంగంలోకి ఉరికేందుకు 108, 104 వాహనాలు కనుచూపు మేర సిద్ధంగా ఉన్నాయి.. సీఎం వైఎస్ జగన్ జెండా ఊపగానే ఒక్కసారిగా కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ పరుగులు తీశాయి. కనీ వినీ ఎరుగుని రీతిలో వాహన శ్రేణి ఒక్కసారిగా చూడముచ్చటగా ముందుకు సాగిపోతుంటే కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు. ప్రాంగణాన్ని దాటుకుని వెళుతున్న ప్రతి వాహనానికి రెండు చేతులూ జోడించి ముఖ్యమంత్రి నమస్కరిస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్లు ప్రతి నమస్కారం చేస్తూ వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు వాహన శ్రేణి కదులుతూన్నంత సేపూ వేదిక మీద నిల్చొని ముఖ్యమంత్రి అభివాదం చేసిన దృశ్యం అంబులెన్స్ సిబ్బందికే కాదు.. రాష్ట్ర ప్రజలందరినీ ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అంబులెన్స్‌ల వ్యవస్థపై చూపిన శ్రద్ధ ఇప్పుడు ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ చూపిస్తున్నారని అక్కడున్న పలువురు చర్చించుకోవడం కనిపించింది. మంత్రులు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బారులు తీరిన అంబులెన్స్‌లు ► రెండు మాసాలుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయా వాహనాలన్నీ ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకున్నాయి. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించగానే 412 కొత్త 108 వాహనాలు, 676 కొత్త 104 వాహనాలు సైరన్ మోగిస్తూ.. కేటాయించిన జిల్లాలకు బయలుదేరాయి. ► సీఎం ప్రతి ఒక్క వాహన చోదకుడికీ అభివాదం చేశారు. దీంతో డ్రైవర్లు, టెక్నీషియన్ల ముఖంలో ఆనందం కనిపించింది. ► బెంజి సర్కిల్ నుంచి కొన్ని వాహనాలు రామవరప్పాడు వైపు, మరికొన్ని వారధి వైపు వెళ్లాయి. రూ.203 కోట్లు వ్యయం చేసి ఇంత పెద్ద స్థాయిలో వాహనాలు కొనుగోలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని అక్కడకు వచ్చిన వారు చర్చించుకున్నారు. డీజిల్ లేదు.. టైర్లు పోయాయన్న మాటే లేకుండా.. ► గతంలో డీజిల్ లేక, టైర్లు దెబ్బతిని అంబులెన్స్‌లు ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అది గతం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వాహనాలను ఏర్పాటు చేసింది. ► మండలానికి కేటాయించిన అంబులెన్స్‌ను ఈఆర్సీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్)కు అనుసంధానించింది. ఫోన్ చేయగానే 15 నిమిషాల్లో ఘటనా స్థలికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన నియోనేటల్ అంబులెన్స్‌లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సమూల మార్పులతో 104 వాహనాలు ► 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్న 104 వాహనాలే మొన్నటి వరకూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ కొత్తవి కొనలేదు. మెజారిటీ వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ► అందుకే ఒక్కటంటే ఒక్క పాత వాహనాన్ని తీసుకోకుండా మండలానికి ఒకటి లెక్కన 676 వాహనాలూ కొత్తగా కొన్నారు. ► ఈ వాహనాలు ప్రతి పల్లెనూ నెలలో ఒకసారి తాకి రావాల్సిందే. ఆ ఊళ్లో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిందే. గతంలో 52 రకాల మందులు.. ఇప్పుడు 74 రకాల మందులు. రక్త పరీక్షలు అక్కడికక్కడే చేస్తారు. ► ప్రతి వాహనమూ ప్రాథమిక కేంద్రానికి అనుసంధానమై ఉంటుంది. రోగుల వివరాలతో పాటు సమస్త సమాచారాన్ని క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ కార్డులో నిక్షిప్తం చేస్తారు. దీంతో జబ్బుల ఉనికిని త్వరగా కనుక్కుని ముందస్తు చర్యలు తీసుకునే వీలుంటుంది. ► వైద్య సేవలే కాకుండా మాతా శిశు మరణాలు అరికట్టడం, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం, పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి సేవలు అందించడం, సీజన్‌ను బట్టి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ ఇకపై 104 వాహనాల ద్వారానే చేస్తారు. -
దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్
గుంటూరులోని కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా మెడికల్, సర్జికల్ ఆంకాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏఇఆర్బీ (ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్) అనుమతి ఉన్న మొట్టమొదటి యూనిట్ ఇది. ఇటువంటిదే కర్నూలులో నిర్మిస్తున్నాం. మరో ఏడాదిలో అది కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. 104 ద్వారా ఐదు లేదా ఏడు గ్రామాల ప్రజల ఆరోగ్య బాధ్యతను ఒక డాక్టర్‌కు అప్పగిస్తున్నాం. తద్వారా విదేశాలలో మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్ అనే భావనను ఆయా కుటుంబాలకు కలిగిస్తాం. ఒక్కోసారి సకాలంలో వైద్యం అందక పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్లడం బాధాకరం. ఆ పరిస్థితి రాకుండా పసిపిల్లల కోసం నియోనేటల్ అంబులెన్స్‌లను జిల్లాకు రెండు చొప్పున కేటాయించాం. ఇది మనసుకు ఆనందం కలిగించే అంశం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణ అధ్యాయం.. మార్పు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం.. గతానికి ఇప్పటికీ తేడాను ప్రజలందరూ ఒకసారి గమనించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకేరోజు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించడం ద్వారా దేశంలోనే కొత్త రికార్డును సృష్టించామని స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన.. ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించాలి ► వైద్య రంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించి ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏమిటీ అనేది అందరూ గమనించాలి. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే.. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతున్నారనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. సెల్ ఫోన్ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే కథనాలు చూశాం. ► గతంలో పేరుకే 104 ఉండేది. 108 అంబులెన్స్‌లు అరకొరగా నడిచేవి. 108 అంబులెన్సులు నడిచే కండిషన్ లో వున్నవి 336 మాత్రమే. అంత దారుణంగా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను చేతల్లో చూపించాను. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండేలా తీర్చి దిద్దుతున్నామని గర్వంగా చెబుతున్నా. ► విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలు ఉండేలా రూపురేఖలు మారుస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో 16 టీచింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ► ఆగస్టు 15న వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో 7 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నాం. క్యాన్సర్, కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రలను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి పౌరుడికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ► ప్రతి మండలానికి రెండు పీహెచ్సీ సెంటర్లను నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ప్రతి మండలానికి కేటాయించిన 104 వాహనంలో మరో డాక్టర్ ఉంటారు. ► ప్రతి మండలంలో కనీసం 30 ఊళ్లు వుంటాయని అనుకుంటే.. వాటిని ఈ రెండు పీహెచ్‌సీలు సమానంగా పంచుకుంటాయి. ఒక డాక్టర్ 104లో కూర్చుని కనీసంగా 5 నుంచి 7 గ్రామాల బాధ్యత తీసుకుంటారు. ఆ డాక్టర్ ప్రతినెలా కచ్చితంగా ఒకరోజు తన పరిధిలోని గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ► ఆ గ్రామాల్లోని రోగుల వైద్య సంబంధ వివరాలను, పరీక్షలను, ఇచ్చిన మందులను ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్‌లో నమోదు చేస్తారు. ► రాష్ట్రంలో మొట్టమొదటి సారి పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ రికార్డులను చెక్ చేయవచ్చు. ► ప్రతి పేషెంట్‌కు సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రికల్ డేటా రికార్డ్స్‌ను 104, పీహెచ్‌సీలు, రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తాం. సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకం కలిగించాం ► రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు 1,088 కొత్త వాహనాలు ప్రారంభించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో 412.. 108 అంబులెన్స్‌లు, 676 కొత్త 104 వాహనాలు ఉన్నాయి. ► ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫోన్ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకాన్ని కలిగించాం. ► పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 వాహనం వస్తుందని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. గత ప్రభుత్వ హయాంలో లైఫ్ సపోర్ట్ ఉన్న వాహనాలు కేవలం 86 మాత్రమే. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. 432 అంబులెన్స్‌లలో 300 పై చిలుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. 104 వాహనాలన్నింటిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. వీటితో పాటు 26 నియోనేటల్ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్నాం. ► ఈ అంబులెన్సుల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశాం. మల్టీప్యార మానిటర్, అత్యాధునిక వెంటిలేటర్లు, నియోనేటల్లో మొట్ట మొదటిసారిగా ఇంక్యుబేటర్లతో కూడిన వెంటిలేటర్ల వంటి పరికరాలను అమర్చాం. ► మొదటిసారిగా అంబులెన్స్‌ల్లో కెమెరాలు కనిపిస్తున్నాయి. పేషెంట్ 108 వాహనంలో ఎక్కిన వెంటనే రోగి పరిస్థితిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో ఉన్న వైద్యులు ఈ కెమెరా ద్వారా పరిశీలిస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. అడ్వాన్స్డ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్, టువే కనెక్టివిటీ, జీపీఎస్ వంటి సదుపాయాలు కూడా కల్పించాం. తద్వారా ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి, వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించే పరిస్థితి తీసుకువచ్చాం. 108 సర్వీసుల సిబ్బందికి జీతాల పెంపు ► గతంలో 108 వాహనం డ్రైవర్లకు రూ.10 వేలు జీతం ఉండేది. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.18 వేల నుంచి రూ.28 వేల వరకు పెంపు. ► ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌కు గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. ఇది ఈ రోజు (బుధవారం) నుంచే అమలులోకి వస్తుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం ► రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్యం అందించిన మూడు వారాల్లో బిల్లులు చెల్లిస్తున్నాం. దీనివల్ల ఆరోగ్య శ్రీ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తులకు అక్కడ సిబ్బంది చిరునవ్వుతో వైద్యం అందిస్తున్నారు. పేదవాడికి వైద్యం ఎలా అందించాలన్న ఆరాటంతో ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తున్నాం. ► ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంతో పాటు ఆ తర్వాత విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నాం. ► ఈ నెల 8వ తేదీన ఆరు జిల్లాల్లో 2059 ప్రోసీజర్లకు (వ్యాధులు) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నవంబర్ 14 నాటికి దీనిని అన్ని జిల్లాలకు విస్తరింప చేస్తాం. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులు చెల్లిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లోని 130 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఖరీదైన క్యాన్సర్ చికిత్స ఉచితం ► గుంటూరు లోని కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ కోసం నిధులను అందించడం పట్ల నాట్కో ట్రస్ట్ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి, ఇతర ట్రస్ట్ ప్రతినిధులకు అభినందనలు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్ ఈ రకంగా ముందుకు రావడం సంతోషం. ► ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన క్యాన్సర్ చికిత్సను అందించడానికి వీలు పడుతుంది. ఈ సెంటర్ కారణంగా రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియాలజిస్ట్ పోస్టులు కూడా రావడం మరింత సంతోషం కలిగిస్తోంది. మీరు చల్లగా ఉండాలయ్యా అయ్యా మాది మచిలీపట్నం. నేను గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్నాను. ప్రభు త్వమే ఉచితంగా చికిత్స అంది స్తుండటంతో పాటు మందులు సమకూరు స్తోంది. నాలా గా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంతో మంది కోసం మీరు (సీఎం) అధునాతన ప్రమాణాలతో ఆసుపత్రి నిర్మించారు. ఇలాంటి ఆసుపత్రి ఎంతో అవసరం. మాలాంటోళ్లను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. నిత్యావసరాలు అందజేస్తు న్నారు. నా భర్తకు పింఛన్ ఇస్తున్నారు. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. – వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో లక్ష్మి అంబులెన్స్ వ్యవస్థకు జీవం పోశారు ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 108 అంబులెన్స్ వ్యవస్థ నీరుగారి పోయింది. ఏ ప్రభుత్వమొచ్చినా పట్టించుకోలేదు. చివరకు మాకు వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశాక.. మాకు, ఈ పథకానికి జీవం పోశారు. కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. మాకు వేతనాలు రెట్టింపు చేశారు. బాధితులకు ఎలా భరోసా ఇచ్చారో మా జీవితాల్లోనూ అలాగే సంతోషం నింపారు’ అని 108 అంబులెన్స్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. నిర్వీర్యమైన వ్యవస్థను బతికించారు వాహనాలు మూలనపడ్డాయి. బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం. అలాంటి వ్యవస్థను ముఖ్యమంత్రి బతికించారు. ఇక రోగులకు, క్షతగాత్రులకు సకాలంలో సేవలందుతాయి. –బి.కిరణ్‌కుమార్, అధ్యక్షుడు, 108 ఉద్యోగుల సంఘం ప్రజలకు భరోసా ఇచ్చారు ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందో రాదోనన్న అనుమానం లేదు. ఏ సమయంలో ఫోన్ చేసినా అంబులెన్సు వస్తుందన్న భరోసా ఇ చ్చారు. పైగా ఎన్నో అధునాతన సదుపాయాలు కల్పించడం గొప్ప విషయం. – కేవీవీ నరసింహారావు, పైలట్, తూర్పుగోదావరి నేను విన్నాను అన్నది నిజమైంది పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మీ అందరికీ అండగా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి ధైర్యాన్నిచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవస్థలో మార్పు చేశారు. –ఎం.శ్రీనివాసరావు, పైలట్, విశాఖపట్నం అంబులెన్స్‌లకు స్వర్ణయుగం చెదలు పట్టిన అంబులెన్స్ వ్యవస్థకు స్వర్ణయుగం వచ్చింది. బాధి తులకు భరోసా ఇవ్వడమే కాదు, వేతనాలు పెంచి మాకూ అండగా నిలిచారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అందరం పని చేస్తాం. – ఎన్. మహేష్, పైలట్, గుంటూరు -
రంగంలోకి ‘ప్రాణదాతలు’
సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపర సంజీవనులుగా కీర్తి ప్రతిష్టలు పొందిన 108, 104 అంబులెన్సులను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది బుధవారం ప్రారంభించారు. మొత్తం 1,088 వాహనాలు ఒకే రోజు తమ తమ గమ్యస్థానాలకు ‘కుయ్...కుయ్’మంటూ వెళ్లాయి. ఈ రెండు అంబులెన్సులూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు. వీటికి విశిష్ట చరిత్ర వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జన సంక్షేమానికి వైఎస్ రూపొందించిన పథకాల పరంపరలో ఇవి కూడా భాగం. వైద్యుడిగా పేద రోగులకు నామమాత్రపు ఫీజుతో చికిత్సనందించిన అను భవంతో ఈ అత్యవసర సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో 70 అంబు లెన్సులతో, 50 పట్టణాల్లో ప్రారంభించిన ఈ సేవలు అచిరకాలంలోనే రాష్ట్రమంతటా విస్తరించి ఆపత్సమయాల్లో లక్షలాదిమందికి ప్రాణదానం చేశాయి. ఈ సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా వైఎస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో జాతీయ ఆరోగ్య మిషన్ 108 సిబ్బంది అందించిన సేవలను అధ్యయనం చేసి ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలనుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చాయి. ఈ నమూనానే స్వీకరించి తమ తమ రాష్ట్రాల్లో అంబులెన్సు సర్వీసులు ప్రారంభించాయి. దురదృష్టమేమంటే ఆయన కనుమరు గయ్యాక అధికారంలోకొచ్చినవారు ఈ సేవలను నిర్వీర్యం చేశారు. నామమాత్రంగా మిగిల్చారు. సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించక, ఆ వాహనలకు అవసరమైన మరమ్మతులు చేయించక, కనీసం డీజిల్ కూడా ఇవ్వక భ్రష్టుపట్టించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొచ్చిన చంద్రబాబు అన్నిటితోపాటు ఈ సర్వీసులను కూడా విస్మరించారు. ఇందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కీలకమైన ఈ అంబులెన్సు సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారు. వాటి రూపురేఖల్ని సమూలంగా మార్చి అవి మరింత మెరుగైన సేవలం దించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ వాటిల్లో పొందుపరిచేలా చేశారు. అన్నివిధాలా ఆరోగ్యవంతంగా వుండే పౌరులే ఏ దేశానికైనా నిజమైన సంపద అని బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో అన్నారు. కీలకమైన ఈ అంశాన్ని ప్రభు త్వాలన్నీ విస్మరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో వుండే పౌరులు ఉత్పాదకతలో పాలుపంచు కుంటారు. అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అవి రెండూ అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. అలాంటి పౌరులుండే సమాజం సుఖసంతోషాలతో వుంటుంది. కానీ ఎవరికీ ఇది పట్టలేదు. చంద్రబాబు తొలిసారి తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులు అందించే నాసిరకం సేవలకు సైతం యూజర్ చార్జీలు పెట్టి జనాన్ని వేధించుకుతిన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ప్రజారోగ్యాన్ని అటకెక్కించారు. ప్రభుత్వాసుపత్రులను చికిత్సాలయాలుగా కాక... రోగిష్టి కేంద్రాలుగా దిగజార్చారు. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు వాటిని నామమాత్రం చేశారు. ఆ వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన జీతాలుండేవి కాదు. అవి కూడా సకాలంలో వచ్చేవి కాదు. అంబులెన్సుల్లో అధిక భాగం ఎప్పుడూ షెడ్లలో పడివుండేవి. కను కనే నిరుపేద వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఆయన పాలనలో విలవిలలాడాయి. ఆంధ్ర ప్రదేశ్ పౌరులకు ఇక ఆ చింత లేదు. ఇప్పుడు రూపొందించిన సర్వీసుల్లో అమరివున్న అత్యాధునిక సదుపాయాలు ఆపదలో చిక్కుకున్నవారికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తాయి. ఇంతక్రితం జనా భాలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్సు వుంటే, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్సు అందుబాటులో వుండబోతోంది. అలాగే లోగడ ఏటా 6,33,600 మందికి సేవలందించే అంబులెన్సులు ఇకపై ఆ సేవల్ని ఏటా 12 లక్షలమందికి అందిస్తాయి. అనారోగ్యానికో, అనుకోని ప్రమాదానికో లోనయినవారిని ఆసుపత్రు లకు చేర్చేలోగానే మెరుగైన సేవలందించి ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమి షాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో అంబు లెన్సులు చేరతాయి. కనుక మారుమూల ప్రాంతాల్లో వున్నవారికి సైతం సకాలంలో వైద్య సేవలు అందుతాయి. ఇప్పుడున్న 108 అంబులెన్సులు 336తోపాటు కొత్తగా మరో 412 రంగంలోకి దిగబోతున్నాయి. 108, 104 సర్వీసులు ప్రతి మండలానికీ ఒక్కొక్కటి చొప్పున వుండేలా చూడటం, చిన్నారుల కోసం ప్రత్యేకించి 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో వుంచడం జగన్ మోహన్‌రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యంపై వున్న శ్రద్ధాసక్తులను తెలియజేస్తుంది. మృత్యుముఖంలో వున్న మార్కండేయుడు స్మరించిన మరుక్షణమే అతడిని కాపాడిన ముక్కంటి వైనం పురాణాల్లో చదివాం. ఇప్పుడు జగన్ చేతుల్లో పునరుజ్జీవం పొందిన ఈ అంబులెన్సులు కూడా అటువంటి పాత్రే నిర్వహించబోతున్నాయి. సాధారణ సమయాల్లో అందరూ నాయకుల్లానే చలా మణి అవుతారు. సంక్షోభాలే అలాంటివారిలో సమర్థులెవరో, కానివారెవరో నిగ్గుదేలుస్తాయి. కరోనా వైరస్ సంక్షోభం చుట్టుముట్టాక దేశంలో ఏ రాష్ట్రమూ చేయనివిధంగా లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వ హించడం, అవసరమైన వారిని చికిత్సకు తరలించడం, వారు త్వరగా కోలుకొనేలా పౌష్టికాహారాన్ని అందించడంవంటి చర్యలు అమల్లోపెట్టి జగన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపారు. ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. బుధవారం సరికొత్తగా మొదలైన ఈ అంబులెన్సు సర్వీసులు వాటికి కొనసాగింపే. ఇవి మళ్లీ ప్రాణదాతలుగా, ఆపద్బాంధవుల్లా అందరి ప్రశంసలూ పొందుతాయని ఆశించాలి. -
ఏపీ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం
-
ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు
సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 1,088 అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశవ్యాప్తంగా అనేకమంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టిన ఏపీ ప్రభుత్వ చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘1088 అంబులెన్స్‌లను ప్రారంభించడం స్వాగతించాల్సిన విషయం. ఏపీకి గొప్ప చరిత్ర ఉంది. వైద్యుల పరిరక్షణ కోసం బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటిని పరీక్షించడం, రోగుల వైద్య చరిత్రను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఐఎంఏ సిద్దంగా ఉందని’ తెలిపారు. పబ్లిక్ హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలని, అవసరమైతే ఈ విషయంలో ప్రైవేట్ సెక్టార్‌తో కలిసి పనిచేయాలని డాక్టర్ రాజన్ శర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. (కంగ్రాట్స్ సీఎం సార్) -
కంగ్రాట్స్ సీఎం సార్
సాక్షి, అమరావతి: వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసు పాలు పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్, లీడ్ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా, యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. (గొప్ప పాలసీని తీసుకొస్తున్నాం : మంత్రి మేకపాటి) -
108 సిబ్బందికి భారీగా జీతాలు పెంపు
-
ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ గొప్పగా ఆలోచించారు
-
108 సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త
సాక్షి, అమరావతి : ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 28 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 108 సిబ్బంది జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు. (చదవండి : ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం) ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 28వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్ టెక్నీయన్ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్ చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్ ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి. ప్రతి మండలానికి కొత్తగా 104, 108 వాహనాలు కేటాయించారు. -
108,104 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
అపర సంజీవినిలుగా రూపుదిద్దారు
-
రోజంతా అందుబాటులో వైద్యులు
-
నాడు వైఎస్ఆర్-నేడు వైఎస్ జగన్
-
నేడు అందుబాటలో 705 అంబులెన్సులు
-
ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం
-
ఏపీ: ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంలో బుధవారం సువర్ణాధ్యాయం లిఖించబడింది. ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. 108 సర్వీసుల్లో మార్పులు ► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. ► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)గా తీర్చిదిద్దారు. ► మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎన్నో సదుపాయాలు ► బీఎల్ఎస్ అంబులెన్స్‌లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి ► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు ► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. ► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. ► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది. వేగంగా సేవలు ► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ► ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ► ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
హెల్త్ ఎక్స్‌ప్రెస్
-
కుయ్.. కుయ్.. ఇక కొత్తగా
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 108 సర్వీసుల్లో మార్పులు ► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. ► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)గా తీర్చిదిద్దారు. ► మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎన్నో సదుపాయాలు ► బీఎల్ఎస్ అంబులెన్స్‌లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి ► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో 104,108 వాహనాలు ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు ► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. ► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. ► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది. వేగంగా సేవలు ► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ► ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ► ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎంఎంయూల్లో 20 రకాల సేవలు ► మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. ► అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1,088 వాహనాలను సీఎం జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్‌లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది. 104 సర్వీసుల్లో మార్పులు.. కొత్తగా 676 వాహనాలు ► మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 676 సర్వీసులను సిద్ధం చేశారు. గతానికి ఇప్పటికీ మార్పు ► రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్స్‌లు 440కి గాను ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. ► మండలానికి ఒకటి చొప్పున ఉండే 104 వాహనాలు నెలలో ఒక రోజు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇవ్వనున్నాయి. ► రోజుకు ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించడంతో పాటు రోజంతా ఆ గ్రామంలో డాక్టర్లు ఉంటారు. గ్రామంలోని ఇళ్లను, అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను కూడా సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో ఒకే డాక్టర్ ద్వారా వైద్య సేవలు కల్పించడం ద్వారా విదేశాల తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌గా మంచి సేవలు అందించడానికి వీలుంటుంది. ► గతంలో 104 అంబులెన్స్‌లు (ఎంఎంయూ) 292 మాత్రమే (మూడు మండలాలకు ఒకటి) ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలతో పాటు 74 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 ఔషధాలు మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు హైపర్ టెన్షన్ (బీపీ), మధుమేహం (సుగర్), సాధారణ అవుట్ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు మలేరియా, టీబీ, లెప్రసీ, మాతా శిశు సంరక్షణ, తదితర 20 రకాల వైద్య సేవలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ► సీజనల్ వ్యాధులతో సహా 29 పరికరాలతో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ అంబులెన్స్‌లలో కేవలం వైద్యులు మాత్రమే అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. ► ప్రస్తుతం 104 సర్వీసుల్లో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. వీటిని డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందనున్నాయి. ► గతంలో 292 వాహనాలతో రోజుకు కేవలం 20 వేల మంది రోగులకు సేవలందించగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 676 సర్వీసుల ద్వారా రోజూ 40,560 మందికి సేవలందుతాయి. నేడు సువర్ణ అధ్యాయానికి నాంది ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయానికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1088 కొత్త 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సీఎం ప్రారంభించనున్నారని వెల్లడించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఈ సేవలను చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రతకు 108 సర్వీస్ లింక్ ► 108 అంబులెన్స్ సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. ► రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. -
1068 వాహనాలను రేపు సీఎం జగన్ ప్రారంభిస్తారు
-
ఏపీ వ్యాప్తంగా 412 నూతన 108 వాహనాలు
-
ఏపీలో సరికొత్తగా 108, 104 వాహనాలు
-
జులై 1న కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదల చెంతకే వైద్యం అందబోతోందని, మరోసారి ఆంధ్రప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. (పక్కాగా పోలవరం లెక్కలు) ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ తపనకు కార్యరూపంగా సరికొత్త హంగులతో 108, 104 వాహనాలు బుధవారం (జులై 1) నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. 203 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, మొబైల్ క్లినిక్స్‌లో వెంటీలేటర్లు, ఈసీజీ, లైఫ్ సపోర్టు వ్యవస్థలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.(రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్) వైఎస్ జగన్ రాష్ట్రంలో సర్కారీ వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని మరో ట్వీట్లో విజయసాయి రెడ్డి కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని వివరించారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రులు ప్రైవేటును మాత్రమే ప్రోత్సహించారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దాయన కలలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త కొత్తగా కుయ్..కుయ్
కర్నూలు(హాస్పిటల్): ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ఓ అంబులెన్స్ వచ్చి ప్రథమ చికిత్స చేస్తూ ఆసుపత్రికి తరలించడం 15 ఏళ్ల క్రితం వరకు మనం చూడలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కలను నిజం చేశారు. ప్రజలకు 108 అంబులెన్స్ సేవల ద్వారా అత్యవసర వైద్యాన్ని అందిస్తూ ఎన్నో నిండుప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ అంబులెన్స్‌కు మరింత మెరుగులు దిద్ది ఆధునిక హంగులు అద్ది ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్యసేవలు అందించేలా తీర్చిదిద్దారు. జులై ఒకటో తేదీ నుంచి వీటిని రోడ్డుపైకి తీసుకొచ్చి అమలు చేయనున్నారు. జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల ద్వారా అత్యవసర సేవలు 2005లో ప్రారంభమయ్యాయి. మొదట్లో నాలుగు వాహనాలు(కర్నూలు, ఆదోని, నంద్యాల, శ్రీశైలం) ప్రారంభించారు. అనంతరం 2006లో మరో 28 వాహనాలు వీటికి జతచేరాయి. ఆధునికత రంగరించుకుని రయ్ రయ్ మంటూ... వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తన తండ్రి ప్రారంభించిన పథకమైన 108 అంబులెన్స్ సేవలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. గతంలో 32 వాహనాలు ఉండగా ఇప్పుడు ప్రతి మండలానికి ఒకటితో పాటు కర్నూలులో నాలుగు వాహనాలు, రెండు నియోనేటల్ వాహనాలను కలిపి మొత్తం జిల్లాకు 60 వాహనాలు కేటాయించారు. ప్రతి వాహనానికి ఒక పైలెట్, ఒక ఎంఎల్టితో పాటు ప్రతి వాహనాలకు రిలీవర్స్‌గా ఒక్కొక్కరు చొప్పున మొత్తం 180 మంది ఉద్యోగుల నియమించారు. 108 అంబులెన్స్ ప్రత్యేకతలు ఇవీ.. ♦ ఆదోని, నంద్యాలలకు ఒక్కోటి చొప్పున నియోనేటల్ అంబులెన్స్‌లు ♦ 13 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్), 42 బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్) వాహనాలు ♦ నడిచే ఐసీయు తరహాలో ఏఎల్ఎస్ సౌకర్యం ఉన్న వాహనంలో వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సిరంజి పంప్స్ ఏర్పాటు ♦ ప్రతి అంబులెన్స్‌లో ఆక్సీజన్, సక్షన్ ఆపరేటర్స్, మల్టీ పారా మానిటర్స్ ♦ ప్రతి వాహనంలో నియోనేటల్ వార్మింగ్ బ్లాంకెట్స్ ♦ అత్యవసర మందులన్నీ అందుబాటులో... -
కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైప్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్(రక్తంలో ఆక్సిజన్ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగించేందుకు సమాయత్తం చేస్తున్నారు. (కరోనాపై పోరు; మరో మైలురాయి) గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది. ఇందుకుగాను రూ.3.84 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్ గమ్ షూ, యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్ పంపిణీ చేయనుంది. ఒక్కొక్క రక్షణ కిట్ కోసం గరిష్టంగా రూ. 3 వేల చొప్పున ఖర్చు చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. (వీరంతా సచివాలయానికి రావాల్సిందే) -
కరోనా: అంబులెన్స్ సిబ్బందిపై వివక్ష
తిరువనంతపురం: మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర చికిత్స అవసరమైనా ఫోన్ కొట్టగానే క్షణాల్లో ముందుకొస్తుంది అంబులెన్స్. అందులో పని చేసే సిబ్బంది ఎలాంటి ఆపత్కర పరిస్థితిలోనైనా మేమున్నామంటూ ముందుకొచ్చి సాయం చేస్తుంటారు. దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని చేధించుకుని ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తారు. అయితే అలాంటి అంబులెన్స్ సిబ్బందికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారట జనాలు. వారిని దగ్గరకు కూడా రానీయకుండా వివక్ష చూపుతున్నారట. ఈ దయనీయ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో పనిచేసే సిబ్బంది, సాంకేతిక నిపుణులు వారి పరిస్థితి గురించి మాట్లాడుతూ.. తినుబండారాలు, దుకాణాల దగ్గర తమ నీడ కూడా పడనివ్వట్లేదని, కనీసం మంచినీళ్ల బాటిల్స్ కూడా అమ్మట్లేదని వాపోయారు. (అక్కడ పరిస్థితి సీరియస్) వ్యాధిగ్రస్తులను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లే మాకు కూడా జబ్బులు అంటుకుంటాయన్న భ్రమతోనే తమని దూరం పెడుతూ వివక్ష చూపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కరోనా కాలంలోనూ నిరంతరాయంగా సేవలందిస్తున్న తమకు దుకాణదారులు నీళ్లబాటిళ్లు అమ్మడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు. తినడానికి రెస్టారెంట్‌కు వెళితే అక్కడ నుంచి మమ్మల్ని తరిమేశారని ఘోర అనుభవాలను వెల్లడించారు. టీ స్టాల్‌కు వెళితే అక్కడున్న పెద్ద మనిషి టీ అయిపోయిందంటూ అబద్ధం చెప్తూనే మరోవైపు ఇతరులకు టీ అందించాడని, అది చూశాక తాము అక్కడ నుంచి నిష్క్రమించామని చెప్పుకొచ్చారు. ఇక కరోనా విలయ తాండవం నుంచి రక్షించుకునేందుకు ప్రభుత్వం తమకు పీపీఈ కిట్లను అందించిందని పేర్కొన్నారు. గత వారం ఇంటికి వెళ్లేందుకు ఒకసారే అవకాశం దొరికిందని, కానీ ఇంటి బయట గేటు దగ్గరే నిల్చుని టీ తాగి, చుట్టుపక్కల వారు చూడకముందే అక్కడ నుంచి నిష్ర్కమించానని అంబులెన్స్‌లో పనిచేసే ఓ ఉద్యోగి చెప్పుకొచ్చారు. కాగా అంబులెన్స్‌లో ఒక డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. వీరికి రోజుకు 12 గంటల డ్యూటీ ఉంటుంది. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా) -
ప్రాణాలను పణంగా పెట్టి...
-
108 రాకపోవడంతో రోడ్డుపైనే ప్రసవం..
సాక్షి, నల్గొండ: జిల్లాలో దారుణం చోటు జరిగింది. పురిటి నోప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించడానికి సరైన సమయానికి 108 వాహనం రాకపోవడంతో సదరు మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన సూర్యపేటలో బుధవారం అర్థరాత్రి చేసుకుంది. బాధిత మహిళ అర్వపల్లి మండలం రామన్న గూడెంకు చెందిన దండకొండ వెంకన్న భార్య రేష్మ. ఆమె గర్భవతి కావడంతో నిన్న అర్థరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమయానికి రాలేదు. దీంతో బాధిత మహిళ భర్త వెంకన్న తన ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా సూర్యపేట పాతబస్టాండ్ వద్దకు రాగానే ఆమె దారిలోనే ప్రసవించింది. ఇంతలో పేన్ పహాడ్ నుంచి వస్తున్న 108 వాహనంలో ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఆమె భర్త వెంకన్న తెలిపాడు. కాగా లాక్డౌన్ కారణంగా అంతటా భారీకేడ్లు ఏర్పాటు చేశారని, అంబులెన్స్ కూడా రాకపోవడం వలన సమయం మించిపోవడంతో తన భార్య రోడ్డు మీదనే ప్రసవించిందని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఇక ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంటును మీడియా వివరణ కోరగా వారు దురుసుగా ప్రవర్తిస్తూ.. సమాధానం ఇచ్చి విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. -
కరోనా పరుగులు!
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కలకలంతో అంబులెన్సులను ఆశ్రయించి ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి లాంటి లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా 108 అంబులెన్సులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడంతో కరోనా అనుమానంతో మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,614 మంది అంబులెన్సులను ఆశ్రయించారు. ఫోన్ చేసిన 20 నిముషాల్లోపే బాధితుడి ఇంటివద్దకు 108 చేరుకుంటున్నట్లు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ► మార్చిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 492 మంది కరోనా అనుమానంతో అంబులెన్స్ కోసం ఫోన్లు చేశారు. ► రోజుకు సగటున 120 మంది చొప్పున వైరస్ లక్షణాలతో అంబులెన్సులను ఆశ్రయించారు. ► అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18 మంది మాత్రమే ఫోన్లు చేశారు. ► 108 పైలెట్లకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్లు అందచేశారు. 108 అంబులెన్స్‌ల సేవలపై ప్రశంసలు -
లాక్డౌన్ మరింత కఠినతరం?
చార్మినార్: పాతబస్తీలో లాక్డౌన్ ప్రభావం కనిపించడం లేదు. రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఏదో కారణంతో వీధుల్లో కనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను స్థానిక ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్‌గా గుర్తించింది. ఇందులో పాతబస్తీ కూడా ఉంది. ఇక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిత్యావసర వస్తువుల పేరుతో వీధుల్లోకి వస్తున్న వారందరిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి పోలీసు అధికారులు హాట్‌స్పాట్ ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. మటన్ షాపులు, చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? రోజుకు ఎన్ని పని చేస్తున్నాయి? అత్యధిక సంఖ్యలో ఏ దుకాణానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది? మార్కెట్లకు రోజుకెంత మంది వస్తున్నారు? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం పాతబస్తీని జల్లెడ పట్టనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ తర్జనభర్జన పడుతున్నారు. నిత్యావసరాల కోసం రోజంతా కాకుండా ఉదయం, సాయంత్రం ఏదో ఒక సమయాన్ని కేటాయిస్తే.. ఎలా ఉంటుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రోజుకు ఏదో ఒక సమయంలో రెండు గంటలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కేటాయిస్తే ఫలితాలుంటాయని ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 124 మంది గుర్తింపు.. గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి పాతబస్తీలోని మలక్‌పేట్ సర్కిల్– 6 నుంచి 21 మంది, సంతోష్‌నగర్ సర్కిల్– 7 నుంచి 20, చాంద్రాయణగుట్ట సర్కిల్– 8 నుంచి 25, చార్మినార్ సర్కిల్– 9 నుంచి 21, ఫలక్‌నుమా సర్కిల్–10 నుంచి 37, రాజేంద్రనగర్ సర్కిల్–11 నుంచి నలుగురు వెళ్లి వచ్చారు. మొత్తం పాతబస్తీ నుంచి ఢిల్లీ సభలకు హాజరైన 124 మందిని సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు గుర్తించారు. ఇందులో ఇంకా కొంత మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు అంటున్నారు. 108 వస్తే జనం బెంబేలు.. 108 వాహనం ఎక్కడైనా కనిపిస్తే చాలు.. స్థానికుల్లో భయాందోళన మొదలవుతోంది. దూరం నుంచి కూడా ప్రజలు వచ్చి ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది.. కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నాడా.. ఏ ఇంట్లో ఉన్నాడు.. ఎంత మంది ఉన్నారు.. ఢిల్లీకి వెళ్లి వచ్చారా.. విదేశాల నుంచి వచ్చారా? అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇంటికి దూరంగా ఉండాలంటూ వారికి వారే సామాజిక దూరం మెయింటెన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒకే బస్తీలో కలిసిమెలిసి జీవనం చేసిన స్థానికులు.. 108 వచ్చి ఆగి.. ఎవరినైనా వైద్య పరీక్షలకు తీసుకెళ్లే చాలు.. రోజుల తరబడి వారి గురించే ఆలోచనలు, మంతనాలు. ఎవరైనా అనుమానితులుంటే.. తమ బస్తీని పూర్తిగా శానిటైజ్ చేయాలంటూ సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌తో ఇద్దరు పాతబస్తీ నివాసితులు మరణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. తమ ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించాలని కోరుతున్నారు. యునానీ ఆస్పత్రిలో.. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిని గుర్తించి గాంధీ ఆస్పత్రితో పాటు ఫీవర్ ఆస్పత్రి, బేగంపేట్ నేచర్ క్యూర్లతో పాటు చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. యునానీ ఆస్పత్రిలో కేవలం తబ్లీగ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన 119 మందిని చేర్చి పరిశీలనలో ఉంచారు. వీరందరికి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. ఇంకొంత మందిని సంబందిత అధికారులు,సిబ్బంది గృహ నిర్బంధం చేశారు. వీరే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి కోవిడ్ వైరస్ ప్రభావం వీరిపై ఉందా.. లేదా అనే వివరాలను సేకరిస్తున్నారు. విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. ఎన్ని రోజులున్నారు.. ఎప్పుడు తిరిగి వచ్చారు.. ఆరోగ్యం పరిస్థితి ఏమిటి.. ఇప్పటి వరకు ఏవైనా వైద్య పరీక్షలు చేయించుకున్నారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏమాత్రం వ్యాధి లక్షణాలున్నా.. వెంటనే సంబంధిత ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కనిపించని లాక్డౌన్ ప్రభావం.. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొంత మంది ఇష్టానుసారంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. వీరిని దక్షిణ మండలం పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ కొంత మంది వినడంలేదు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలుగడం లేదు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం లేదు. ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా దుకాణాల వద్దకు చేరుతున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది పాతబస్తీలోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే చార్మినార్, మక్కా మసీదు, గుల్జార్ హౌస్, యునానీ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. -
ఎంతసేపు పిలిచినా రాదే..!
హిమాయత్‌నగర్: ఓ పక్క ‘కరోనా’ లక్షణాలు ఉన్న యువతి అందరి మధ్యలో తిరుగుతుందనే అనుమానాలు. మరో పక్క ఆ యువతిని హాస్పిటల్‌కు తరలించేందుకు ఎంతసేపు ప్రయత్నించినా రాని 108, 104లు. ఇదీ.. బుధవారం హైదర్‌గూడలోని ఓల్డ్ సీడీఆర్ పక్కన ఉన్న ఆర్కేఎస్ అపార్ట్మెంట్లో జరిగిన తంతు. తురకిస్థాన్ యువతిని ఫీవర్ హాస్పిటల్‌కు ప్రైవేటు హాస్పిటల్ వారు రెఫర్ చేయడంతో..మెడికల్ స్టాఫ్ మంగమ్మ 108కి సమాచారం ఇచ్చారు. తొలుత పది నిమిషాల పాటు ఎంగేజ్ రాగా లైన్ కలవగానే విషయం చెప్పారు. మాకు కాదు 104 వాళ్లకు సమాచారం ఇవ్వడంటూ 108 వాళ్లు చెప్పారు. సరేనంటూ 104కు సమాచారం ఇవ్వగా..వారు కూడా వివరాలన్నీ సేకరించి 108కి చెప్పమన్నారు. ఇలా ఇద్దరికీ చెప్పి సుమారు 45 నిమిషాల పాటు వేచి చూసినా ఫలితం శూన్యమైంది. పైగా 108, 104 వాళ్లు విరివిగా కాల్ చేసిన మంగమ్మను హోల్డ్‌లో పెట్టారు. ఇదిలా ఉండగా..అపార్ట్మెంట్ వాళ్లంతా ఆందోళన చేస్తుండడటంతో విసిగెత్తి నారాయణగూడ ఎస్సై నవీన్‌కుమార్ పోలీసు వాహనంలో యువతిని కోరంటి ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. అతవ్యవసర పరిస్థితుల్లో స్పందించకుంటే ఎలా? 108 అంటేనే అత్యవసర వాహనం. అటువంటి వాహనం అత్యవసర సమయంలో స్పందించకుంటే ఎలా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మా ఎదుటే స్వయాన మెడికల్ స్టాఫ్ కాల్ చేసినా 108, 104 రాకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాల్లో 108, 104లు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి సమయానికి రాకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒకవేళ అదే తురకిస్థాన్ యువతికి కరోనా ఉండి ఉంటే..అంబులెన్స్ రాకపోతే పరిస్థితి ఏంటంటూ అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు. -
విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు
హైదరాబాద్: వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్ర యంలో ప్రతిరోజు 2వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపిం చిన వారితో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తు న్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మిగతా వారిని వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. విమానాలు భారీగా రద్దు.. కొన్ని రోజులుగా ఆయా దేశాల ఆంక్షలతో పాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తో పా టు, దేశీయ ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీ య విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి. -
కరోనా అనుమానితుల కోసం 108 వాహనాలు
-
108 వాహనానికి దారివ్వని టీడీపీ
-
108కి దారివ్వని టీడీపీ కార్యకర్తలు
మార్టూరు: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునే 108 వాహనం కనిపిస్తే ఎవరైనా మానవత్వంతో దారి ఇస్తారు. రోగి ప్రాణాలను రక్షించాలంటే ప్రతి నిమిషమూ ఎంతో విలువైనదే. ప్రతిపక్ష నేత చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో తొలిరోజు మార్టూరులో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ గాయపడ్డ ఓ కార్మికుడిని ఆస్పత్రికి తరలించేందుకు వెళ్తున్న 108ని అడ్డుకోవడంతోపాటు తిరుగు ప్రయాణంలో సైతం క్షతగాత్రుడితో ఉన్న వాహనానికి కూడా టీడీపీ కార్యకర్తలు దారి ఇవ్వకపోవడం గమనార్హం. ఫలితంగా 6 కి.మీ మాత్రమే ప్రయాణించాల్సిన 108 వాహనం 15 కి.మీ దూరం తిరగాల్సి వచ్చింది. అరగంటకుపైగా సమయం వృథా అయింది. ఏం జరిగిందంటే...? జొన్నతాళి సమీపంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో గ్రానైట్ శ్లాబులు లారీకి లోడ్ చేస్తుండగా బిహార్‌కు చెందిన కార్మికుడు సూరజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్తుండగా స్టేట్ బ్యాంకు సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు యాత్ర ఉన్నందున ఇటు నుంచి వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో 108 సిబ్బంది గత్యంతరం లేక సర్వీస్ రోడ్డులో చుట్టూ తిరిగి ఇసుక దర్శి మీదుగా జొన్నతాళి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలోనూ క్షతగాత్రుడిని వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బందిని తిరుగు ప్రయాణంలోనూ మార్టూరులో టీడీపీ కార్యకర్తలు మరోసారి అడ్డగించారు. చంద్రబాబు మీటింగ్ పూర్తి కాలేదంటూ వాహనానికి దారి ఇచ్చేందుకు నిరాకరించారు. రోగి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించిన 108 సిబ్బందిని దూషిస్తూ మిమ్మల్ని వైఎస్సార్ సీపీ నాయకులు పంపించారా? అంటూ ప్రశ్నించారు. తమకు రాజకీయాలతో నిమిత్తం లేదని, బాధితులను ఆస్పత్రికి తరలించి ఆదుకోవటమే తమ బాధ్యతని చెప్పినా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక 108 వాహనంలో తిరిగి జొన్నతాళి మీదుగా ఇసుక దర్శి అండర్‌పాస్ కింద నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని బాధితుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
108, 104 ఉద్యోగులకు శుభవార్త
-
108, 104 ఉద్యోగుల వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసి వేతనాలు పెంచాలని విన్నవించారు. వారి వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాన్ని గుర్తించి వేతనాల పెంపుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా పనిచేస్తున్నారని, వీరిలో పైలెట్(డ్రైవర్)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచేందుకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. తాము సర్వీస్ ప్రొవైడర్ కింద పని చేయలేమని విన్నవించగా.. అందర్నీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని సీఎం చెప్పారని వారు తెలిపారు. మా కష్టాన్ని గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు.. మేం గత 14 సంవత్సరాలుగా 108 వాహనాల్లో పనిచేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. మా సమస్యల పట్ల ఇంతటి సానుకూలంగా వ్యవహరించిన జగన్‌కు సదా కృతజ్ఞులమై ఉంటాం. 108 వాహనాల ద్వారా మరింత మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తాం. – 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్ జగన్ మేలును జన్మలో మర్చిపోం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా వేతనాలు పెంచాలన్న మా విన్నపాన్ని మన్నించడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన మేలును జన్మలో మరువబోము. – 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం -
సీఎం జగన్‌ను కలిసిన 108, 104 ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం 108, 104 అంబులెన్స్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉద్యోగ భదత్ర కల్పిస్తానని సీఎం స్పందించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘108’ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ..108లలో పనిచేసే టెక్నిషియన్లకు రూ.30వేలు, పైలెట్లకు రూ.28వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘104’లో పనిచేసే ఉద్యోగులకు రూ.28వేలు, డ్రైవర్లకు 26వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ‘104’ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఫణి, సింహాచలం వెల్లడించారు. ‘104’ వైద్యులకు సర్వీస్ వెయిటేజీ ఇచ్చి రాబోయే నియామకాల్లో లబ్ధి చేస్తామని సీఎం తెలిపారన్నారు. -
108 సేవలకు 432 కొత్త వాహనాలు
-
మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది!
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నడిరోడ్డు మీద పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 వాహనంలో పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనాలు.. ఆపదలో ఉన్న ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. అలాంటి 108 వాహనాలను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆపదలో ఉండి ఎవరైనా 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని, టైర్లలో గాలి లేదని సమాధానం వచ్చేది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం 108 వాహనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ప్రమాదంలో ఉన్నవారికి క్షణాల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ మహిళ నడిరోడ్డు మీద ప్రసవ వేదన పడటం చూసిన స్థానికులు 108కు కాల్ చేశారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది మహిళ పరిస్థితిని చూసి మానవత్వంతో తమ అంబులెన్స్ వాహనంలోనే పురుడుపోశారు. ఉంగుటూరు మండలం కొయ్యగూరప్పాడుకు చెందిన ఇట్ల సంధ్య నిండు గర్భిణి. పొలాల్లో కూలి పనులు చేసుకునే ఆమెకు సోమవారం రాత్రి భర్త ఇంట్లోలేని సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆటో ఎక్కి గన్నవరం సినిమా హాల్ సెంటర్లో దిగి ప్రభుత్వ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఇది గమనించి స్థానికులు 108కు కాల్ చేయగా.. 108 సిబ్బంది నాయుడు, సాయిబాబు సకాలంలో అక్కడకు చేరుకున్నారు. పురిటినొప్పులు ఎక్కువకావడంతో తమ అంబులెన్స్ వాహనంలోనే ఆమెకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 108 సిబ్బంది సకాలంలో వచ్చి తల్లీబిడ్డలను రక్షించడంతో 108 సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. -
అంబులెన్స్..ఫిట్‘లెస్’!
సాక్షి, సిటీబ్యూరో: అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ అప్రమత్తమవుతారు. ఎవరికి ఏ ఆపద ముంచుకొచ్చిందో తెలియదు. ఎక్కడో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారో తెలియదు. అలా రోడ్డుపైన అంబులెన్స్ కనిపిస్తే ఏ మానవతా హృదయమైనా స్పందిస్తుంది. కాలంతో పోటీ పడి పరుగులు తీసే అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడతాయి. ఆపదలో ఉన్నవారికి ప్రాణ దాతల్లా నిలుస్తాయి. అలాంటి అంబులెన్స్‌లు మార్గమధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది. గుండెపోటుతో బాధపడుతున్న ఆనంద్ అనే ఎంఎంటీఎస్ ప్రయాణికుడు ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉంటుంది. ప్రమాదాలు జరిగిన సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేకపోవడం వల్ల ఎంతోమంది క్షతగాత్రులు అసువులు బాస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా వరకు అంబులెన్స్‌ల పరిస్థితి ఇలాగే ఉంది. ఫిట్నెస్ లేనివి, కాలం చెల్లినవే ఎక్కువ శాతం ప్రాణాలు నిలిపే వాహనాలుగా కనిపిస్తున్నాయి. ఒక్క 108 అంబులెన్స్‌లే కాకుండా ఆసుపత్రుల నిర్వహణలో ఉన్నవి, ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా నడిపించుకొనేవి కూడా చాలా వరకు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు కార్పొరేట్ ఆసుపత్రులు మినహా అనేక ఆసుపత్రుల్లో ఇలాంటి వాహనాలే ప్రాణప్రదాతలుగా దర్శనమిస్తున్నాయి. వేగం కంటే కూతే ఎక్కువ అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు కాకుండా చాలా వరకు మారుతీ ఓమ్నిలను అంబులెన్స్‌లుగా మార్చేస్తున్నారు. పేషెంట్ కోసం ఒక స్ట్రెచర్ పట్టేంత స్థలం, ఇద్దరు అటెండర్స్ కూర్చొనే వెసులు బాటు ఉంటే చాలు సైరన్ అమర్చేస్తున్నారు. ఇలాంటి వాహనాల వేగం కంటే సైరన్ మోతలే ఎక్కువ. అంబులెన్స్ ఎంతో సమీపంలో ఉన్నట్లుగా సైరన్ వినిపిస్తుంది. కానీ వాహనం మాత్రం అల్లంత దూరంలో కనిపిస్తుంది. నిర్వహణ లోపం వల్లనే ఇలా నత్తనడక నడిచే వాహనాలు అంబులెన్స్‌లుగా రోడ్డెక్కుతున్నట్లు రవాణా నిపుణులు భా విస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్‌లు సకాలంలో సంఘటనా స్థలానికి అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకోలేకపోతున్నాయి. కానీ ఆ సమస్యతో పాటు ఫిట్నెస్ లేకపోవడం కూడా మరో ప్రధానమైన అంశమే. రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి వాటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. కానీ అంబులెన్స్‌లకు మాత్రం సకాలంలో ఫిట్నెస్ పరీక్షలు జరగడం లేదు. ఒకవైపు అధికారులు నిర్లక్ష్యం, మరోవైపు ఆసుపత్రులు, వాహన యజమానుల నిర్లక్ష్యం వల్ల ఫిట్నెస్ లేని బండ్లే రోడ్డెక్కుతున్నాయి. అంబులెన్స్‌లా అయితే ఓకే గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 50 కి పైగా 108 వాహనాలు ఉన్నాయి. 2009 నుంచి అంటే గత పదేళ్లుగా ఇవి సేవలందజేస్తున్నాయి. వీటిలో చాలా వరకు డొక్కు వాహనాలుగా మారాయి. ఆసుపత్రులు, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో మరో 2500కు పైగా ఉన్నట్లు అంచనా. చాలావాటికి సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల నాణ్యత దెబ్బతింటుంది. లక్షలకొద్దీ కిలోమీటర్లు తిరిగిన వాహనాలను కూడా అంబులెన్స్‌లుగా వినియోగిస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన రోజు నుంచి 8 ఏళ్ల వరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్నెస్ పరీక్షలు చేయాలి. తర్వాత క్రమం తప్పకుండా ఏటా పరీక్షలు జరగాలి. ఇంజన్ సామర్ధ్యంతో పాటు బాడీ, బ్రేక్‌లు, డోర్లు, తదితర అన్ని భాగాలను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత మాత్రమే వాటి సమర్ధతను నిర్ధారించవలసి ఉంటుంది. కానీ ఆర్టీఏ అధికారులు అంబులెన్స్‌ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్ లేని వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు పరీక్షలకు వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించకుండానే వదిలేస్తున్నారు. ‘అంబులెన్స్‌లే కదా బాగానే ఉంటాయిలే అనుకోవడం వల్లనే ఫిట్నెస్ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటుంద’ని ప్రాంతీయ రవాణా అధికారి ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ వాహనాల సమర్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. -
అంబులెన్స్ డోర్ ఎంతపని చేసింది!
సాక్షి, హైదరాబాద్ : అంబులెన్స్ డోర్ తెరుచుకోవటం ఆలస్యమవటంతో ఓ గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ప్రాణం పోసే అంబులెన్స్ పనితీరు కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అల్మాస్ గూడకు చెందిన ఆనంద్ (50) బేగంపేటలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. బేగంపేట నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్‌లో వెళ్తున్న సమయంలో మలక్‌పేట స్టేషన్ వద్ద ఆనంద్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వద్దకు ఆనంద్‌ను తీసుకెళ్లగా అబులెన్స్ డోర్ లాక్‌పడి ఉండటంతో అది ఓపెన్ కాలేదు. అబులెన్స్ అద్దాలు పగుల గొట్టేందుకు 20 నిముషాల సమయం పట్టింది. ఈ లోపు ఆనంద్ చనిపోయాడు. దీనిపై తోటి ప్రయాణికుడు మజర్ మాట్లాడుతూ.. అతన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నించాం. కాళ్లు, చేతులు రుద్దుతూ సపర్యలు చేశాము. అంబులెన్స్ సిబ్బంది కూడా ఎంతో సహాయం చేశారు. సమయానికి డోర్ తెరుకోక ఇంజక్షన్ ఇవ్వలేకపోయారు. చివరకు ఆనంద్ మృత్యువాత పడ్డాడు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
ముఖ్యమంత్రితో 108 ఉద్యోగుల చర్చలు సఫలం
సాక్షి, అమరావతి : మూడు రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగిన 108 ఉద్యోగులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘ఇది నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం.. పాదయాత్రలో పదే పదే నన్ను కలిసినప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. అవన్నీ మర్చిపోయానని అనుకుంటున్నారా? మీరు సంతోషంగా పనిచేస్తేనే అంబులెన్సులు బాగా తిరుగుతాయి..’ అంటూ వారికి భరోసానిచ్చారు. ‘పథకం ఇంకా మెరుగ్గా ఉండాలనే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నాం.. బడ్జెట్లో నిధులు పెంచాం..’ అని చెప్పారు. సుమారు పదినిమిషాల పాటు వారితో చర్చలు జరిపిన సీఎం.. ‘మీరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని చెప్పడంతో ఉద్యోగ సంఘం ప్రతినిధులు అక్కడికక్కడే విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తాము గడిచిన ఐదేళ్లలో చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా అవకాశం రాలేదని.. కనీసం సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం రాలేదని.. చివరకు సమ్మె చేయడం మినహా తమకు మరో దారి కనిపించలేదన్నారు. కానీ సీఎం భరోసానిచ్చారని.. ఉద్యోగ సంఘం ప్రతినిధులు చర్చల అనంతరం మీడియాతో చెప్పారు. 108 ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డిని తమ ముందే సీఎం ఆదేశించారని, దీంతో బయటకు రాగానే అన్ని జిల్లాలకు ఫోన్‌చేసి రాత్రి 8 గంటల్లోగా అందరూ విధుల్లోకి రావాలని చెప్పినట్టు వారు ‘సాక్షి’తో చెప్పారు. సీఎంతో జరిగిన చర్చల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, నోడల్ అధికారి రాజేంద్రప్రసాద్, ఉద్యోగ సంఘం ప్రతినిధులు కిరణ్‌కుమార్, నర్సింగరావులున్నారు. -
ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగుల చేస్తున్న సమ్మెను విరమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు 108 సిబ్బంది ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిబ్బంది తమ సమస్యలను వివరించారు. 108ను ప్రభుత్వమే నిర్వహించడమే సహా అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎంకు విన్నవించుకున్నారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక పాలసీ రూపొందించి త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గురువారం రాత్రి నుంచే 108 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. -
ప్రతి మండలంలోనూ అందుబాటులోకి 108 వాహనాలు
-
పరమపద.. గిదేం వ్యథ
సాక్షి, సిటీబ్యూరో: భువనగిరికి చెందిన శివప్రసాద్(39) కేబుల్ టీవీ ఆపరేటర్ వద్ద పని చేసేవాడు. ఈ నెల 18న కనెక్షన్ ఇచ్చేందుకు ఓ ఇంటిపైకి వెళ్లగా ప్రమాదవశాత్తు పైనున్న 33కేవీ విద్యుత్ లైన్ వైర్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 22న మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు బంధువులు ఆస్పత్రిలోని అధికారులను కలిశారు. ‘హెర్సే’ పరమపద పార్థివదేహాల తరలింపు వాహనాన్ని సమకూర్చాలని కోరారు. ఆస్పత్రిలో వాహనాలు లేకపోవడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. గత్యంతరం లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్‌కు రూ.2,600 చెల్లించిమృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇది ఒక్క శివప్రసాద్ బంధువులకు ఎదురైన అనుభవమే కాదు... నగర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న అనేక మంది బాధితుల బంధువుల వ్యథ. 2016లో ప్రారంభం.. ప్రస్తుతం నగరంలో సుమారు కోటి మందికి పైగా ఉంటారు. జిల్లాల నుంచి వివిధ పనులపై రోజుకు సగటున లక్ష మందికి పైగా వచ్చిపోతుంటారు. వీరిలో అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇక హత్యలు, ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన వారితో పాటు వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారు ఉంటారు. ఇలా చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ మార్చురీలకు తరలిస్తుంటారు. ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 10–15 శవాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి 15 వరకు వస్తుంటాయి. ఇక నీలోఫర్‌లో రోజుకు 12 మంది శిశువులు చనిపోతుండగా... నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో వారానికి ఒకరిద్దరు మృత్యువాతపడుతుంటారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తుంటారు. పేదరికానికి తోడు అప్పటికే వైద్య ఖర్చుల పేరుతో భారీగా నష్టపోవడం, ప్రైవేటు అంబులెన్సులు ఇందుకు భారీగా ఛార్జీ చేస్తుండటంతో ఆయా మృతదేహాల తరలింపు వారి బంధువులకు భారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 2016 నవంబర్ 18న 50 ఉచిత హెర్సే పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 10 చొప్పున... నిమ్స్‌కు 2, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి 2, నిలోఫర్ ఆస్పత్రికి 2, ఇతర ఆస్పత్రులకు ఒక్కో వాహనాన్ని సమకూర్చింది. ఏడాది క్రితం వరకు ఇవి బాగానే పని చేశాయి. రోజుకు సగటున 25 మృతదేహాల చొప్పున సొంతూళ్లకు చేర్చేవి. ఈ ఉచిత సర్వీసులకు మంచి ఆదరణ లభించింది. నిర్వహణ లోపం వల్ల ఒక్కో వాహనం షెడ్డుకు చేరడంతో సమస్య మొదటికి వచ్చింది. పాతవాటికే రంగులు.. నిజానికి ఏదైనా సర్వీసులు ప్రారంభించే ముందు కొత్తవాహనాలు కొనుగోలు చేయాలి. మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. నిర్వహణ కోసం అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలి. కానీ ఇందుకు భిన్నంగా కొత్త వాహనాలకు బదులుగా అప్పటికే నిర్వహణ లోపంతో షెడ్డుకు చేరిన 108 అంబులెన్స్‌లకు కొత్తగా రంగులు వేసి.. హడావుడీగా ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటికే వాటి సర్వీసు ముగియడం, నిర్వహణ లోపం వల్ల ప్రారంభించిన కొద్ది కాలానికే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా సగానికిపైగా వాహనాలు షెడ్డుకు చేరాయి. ఎలాగైనా వీటిని వదిలించుకోవాలని భావించిన అధికారులు వాటిలో ఇప్పటికే చాలా సర్వీసులను స్క్రాబ్‌కు తరలించారు. వాటి స్థానంలో కొత్త వాహనాలు ఏర్పాటు చేయకపోవడం, ఉన్నవి కూడా తరచూ మొరాయిస్తుండటం వల్ల మృతదేహాలను తరలించలేని దుస్థితి నెలకొంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రెండు మూడు వాహనాలు పని చేస్తున్నా.. అవి కూడా తరచూ మొరాయిస్తున్నాయి. మృతుల నిష్పత్తికి తగినన్ని వాహనాలు లేకపోవడంతో ఒకే వాహనంలో ఒకే రూట్‌కు సంబంధించిన శవాలను ఒకేసారి తరలించాల్సి వస్తోంది. దీంతో శవాల తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. చనిపోయిన తర్వాత శవం కుళ్లిపోయి దుర్వాసన వెద జల్లే ప్రమాదం ఉండడంతో ఆర్థికంగా భారమైనప్పటికీ... బంధువులు వాటిని ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. మృతుల బంధువుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు దూరాన్ని, తరలింపు సమయాన్ని బట్టి చార్జీలు నిర్ణయిస్తున్నారు. చేసేదేమీ లేక బాధితులు వారు అడిగినంత చెల్లించి మృతదేహాలను తీసుకెళ్తున్నారు. ఆ స్తోమత లేనివారు అనాథ శవాల జాబితాలో చేర్చి.. దహన సంస్కారాల కోసం జీహెచ్ఎంసీకి అప్పగిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే స్క్రాబ్‌కు చేరిన వాహనాల స్థానంలో ఇప్పటికే పలు కొత్త వాహనాలు సమకూర్చామని, మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో సమకూర్చుతామని హెర్సే పరమపద వాహనాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
సీఎం ప్రకటనతో సంజీవనికి ప్రాణం
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికైన 108కు మంచిరోజులొచ్చాయి.. పదేళ్లపాటు పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ సంజీవినికి మళ్లీ ప్రాణమొచ్చింది. ఈ వాహనాలు కుయ్..కుయ్..కుయ్ మంటూ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో రయ్..రయ్..రయ్ మంటూ ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. జీవితానికి, మరణానికి మధ్య ఓ అడ్డుగోడలా నిలుస్తున్న ‘108’కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవం పోశారు. అన్ని జిల్లాల్లో కొత్త వాహనాల కొనుగోలుకు ఆదేశాలిచ్చామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రకటన పేదల బతుకుల్లో ఆశలు రేకిత్తిస్తోంది. సాక్షి, నెల్లూరు(బారకాసు): మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన 108 అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందక అనేక మంది మరణిస్తున్న తరుణంలో, సకాలంలో వైద్య సేవలందాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ 108ను ప్రవేశపెట్టారు. దీని వల్ల మరణాల రేటు గణనీయంగా తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాలనలో ఒక వెలుగు వెలిగిన 108 టీడీపీ పాలనలో నిర్వీర్యమయ్యాయి. గడిచిన ఐదేళ్లలో 108 అంబులెన్స్‌ల నిర్వాహణను పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలంచెల్లిన వాహనాలతోనే నెట్టుకొచ్చారు. ఫలితంగా ఫోన్ చేసిన గంటకు కూడా వాహనం రాని పరిస్థితి. ఇందుకు కారణం ఆ అంబులెన్స్‌లో డీజల్ లేకనో లేక టైర్లు సరిగ్గా లేకపోవడమో తదితర కారణాలతో పార్కింగ్‌లో ఉన్న చోటు నుంచి కదిలే పరిస్థితి లేదు. కండిషన్లో ఉన్న వాహనం మరో పార్కింగ్ ప్లేస్‌లో ఉంటుంది. ఆ వాహనం వచ్చే సరికి గంటకు పైగా పట్టేది. దీంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తి వాహనం వచ్చే లోపే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు లేకపోలేదు. సీఎం జగన్ మరో అడుగు ముందుకు.. తన తండ్రి ఆశయాలను నేరవేర్చడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేస్తున్నారు. 108 సేవలను మరింత మెరుగు పరచనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 108 వాహనాల సంఖ్యను పెంచడం, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఇందుకోసం ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 108 వాహనాలు ఎన్ని ఉన్నాయని, వీటిలో కాలం చెల్లిన వాహనాలు ఎన్ని ఉన్నాయనే విషయాలను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం సేకరించి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నారు. జిల్లాకు 46 వాహనాలు మండలానికి ఒక 108 వాహనం చొప్పున జిల్లాలోని 46 మండలాలకు గాను 46 వాహనాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం 108 అంబులెన్స్‌లు జిల్లాలో 33 ఉన్నాయి. ఇందులో 12 వాహనాలు కాలం చెల్లినవిగా ఉన్నాయి. అంటే 13 వాహనాలు అదనంగా పెరగడంతోపాటు మరో 12 వాహనాల స్థానంలో కొత్తవి రానున్నాయి. దీంతో జిల్లాకు 25 కొత్త 108 అంబులెన్స్‌లు రానున్నాయి. ఇకపై ఫోన్ చేసిన 15 నిమిషాలకే ప్రమాదంలో ఉన్న వ్యక్తి వద్దకు ప్రత్యక్షమై అత్యవసర వైద్య సేవలందించడం జరగనుంది. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 108 వాహనాలకు సంబంధించిన పలు విషయాలను పరిశీలించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మండలానికి ఒక వాహనం చొప్పున మొత్తం 46 మండలాలకు 46 వాహనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 33 వాహనాలు ఉన్నాయి. ఇందులో కాలం చెల్లిన వాహనాలు కూడా ఉన్నాయి. అదనంగా 13 వాహనాలతోపాటు కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ -
కుయ్.. కుయ్ సేవలు నై..
పేదల సంజీవనికి పెద్ద తిప్పలొచ్చింది. డీజిల్, ఇతరత్రా సమస్యలతో 108 వాహనాల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. జిల్లాలో వారం రోజులుగా వాహనాలు రోడ్డెక్కకపోవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, అత్యవసర వైద్యం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కో దశలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూసే పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి కుయ్.. కుయ్‌మంటూ శబ్దం చేస్తూ పేదల ముంగిట్లో్ల వాలే 108 సేవలకు డీజిల్ కష్టాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఖమ్మంవైద్యవిభాగం: ప్రాణాపాయ స్థితిలో తక్షణ వైద్య సేవలు అందించే 108 వాహనాల సేవలు డీజిల్ కారణంగా వారం రోజులుగా నిలిచిపోయాయి. బంక్ యజమానులకు రూ.లక్షల్లో బకాయిలు ఉండడంతో వారు 108 వాహనాలకు డీజిల్ పోయడం నిలిపివేశారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తుండగా.. అందులో 11 వాహనాలు పూర్తిగా షెడ్లకే పరిమితమయ్యాయి. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కల్లూరు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని బంక్ యజమానులకు నచ్చజెప్పి అక్కడి వాహనాలను పైటెట్లు నెట్టుకొస్తున్నారు. వారంలోపు వాటి బకాయిలు చెల్లించని పక్షంలో అవి కూడా షెడ్లకే పరిమితమవుతాయని అక్కడి వాహనాల పైలెట్లు చెబుతున్నారు. రూ.12లక్షల బకాయిలు సాధారణంగా 108 వాహనాలకు సంబంధించి అధికారులు బంక్ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. మధిర, సత్తుపల్లి, కల్లూరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వాహనాలకు ఆయా ప్రాంతాల్లో బంక్ యజమానులతో ఒప్పందం ఉంటుంది. ప్రతి నెల వాహనాల్లో పోయించిన డీజిల్‌కు అయ్యే ఖర్చు బంక్ యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే జిల్లాలోని 14 వాహనాలకు సంబంధించి మూడు, నాలుగు నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షల బకాయిలు బంక్ యజమానులకు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో బంక్ యజమానులు క్రమక్రమంగా డీజిల్ పోయడం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. రేపో మాపో అవి కూడా మూలనపడనున్నాయి. 108 వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారు 108 వాహనాలు లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది. మొబైల్ సేవలు ఎప్పుడో? రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్ ద్వారా 108 సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకుగాను జిల్లాకు రెండు 108 మొబైల్ వాహనాలను సమకూర్చింది. అయితే అవి జిల్లాకు చేరి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సేవలు ప్రారంభించలేదు. 108 వాహనం కంటే అతి త్వరగా మారుమూల ప్రాంతాలకు అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అందుబాటులోకి తెస్తే కొంతమేర సేవలు విస్తృతమవుతాయి. ఒకపక్క ఉన్న వాహనాలు మూలనపడి ఉండగా.. వచ్చిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడంతో అత్యవసర సేవలు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. 108 వాహనాలతోపాటు ఉన్న మొబైల్ వాహనాలు వినియోగంలోకి తెచ్చి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పరిష్కారమవుతుంది.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. బకాయిలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డీజిల్ సమస్య తీరనుంది. ప్రస్తుతం బంక్ యజమానులను ఒప్పించి డీజిల్ పోయించే ఏర్పాట్లు చేస్తున్నాం. మొబైల్ వాహనాలు కూడా ఈ వారంలోనే రోడ్డెక్కుతాయి. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – లక్ష్మణ్, 108 జిల్లా కోఆర్డినేటర్ వైఎస్ ప్రవేశపెట్టిన సేవలకు ఈ దుస్థితి దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2008లో రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలను ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు 108 వాహనంలో తరలించడంతో వారు తమ బిడ్డతో సహా క్షేమంగా ఇంటికెళ్లేవారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సైతం ఫోన్ చేసిన 5 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని.. వారికి ప్రథమ చికిత్స చేసి.. ప్రాణాపాయం నుంచి కాపాడడం నుంచి గుండెనొప్పి, పురుగు మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారికి ప్రాణదానం చేస్తోంది 108 వాహనం. కొన్నేళ్లుగా 108 సేవల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలంతా మహానేత ప్రవేశపెట్టిన 108 పథకానికి జేజేలు పలికారు. కానీ.. నేడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. డీజిల్ కష్టాలతో సేవలు నిలిచిపోవడంతో క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్ సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కుయ్..కుయ్ రయ్..రయ్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన అతికొద్ది రోజులకే కీలకమైన వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాలపై దృష్టిసారించారు. ఆ మేరకు 108అంబులెన్స్‌లను గాడిలో పెట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఫలితంగా గత తెలుగుదేశంపార్టీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన108 విభాగంలో సమూల మార్పులుజరగనున్నాయి. కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 30 వాహనాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో అనుసరించిన విధానాల కారణంగా 108 అంబులెన్స్‌ల వ్యవస్థ ప్రమాదంలో పడింది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ కారణంగా అధికారులు ‘108’కు మరమ్మతులు ప్రారంభించారు. జిల్లాలో ఇదీ పరిస్ధితి: గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన 108 వ్యవస్థ జీవీకే నుంచి యూకేఎస్‌ఏఎస్, బీవీజీ సంయుక్త ఆధ్వర్యంలోకి వచ్చింది. అంతకుముందు అరకొరగా ఉన్న సమస్యలు సంస్థ మార్పుతో మరింతగా ఎక్కువయ్యాయి. కాగా ఈ వాహనాలు తిరగాలంటే కండీషన్లో ఉండాలి. ప్రధానంగా డీజల్ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు ఆ వాహనాలను పట్టి పీడిస్తున్నాయి. ఒక వాహనానికి నెలకు డీజల్, మరమ్మతులు, సిబ్బంది వేతనాలకు రూ 1.10 లక్షలు రావాలి. అయితే ఈ నిధులు సక్రమంగా అందడంలేదు. దీంతో చాలా వాహనాలకు కొత్త టైర్లను మార్చలేని పరిస్థితి నెలకొంది. అలాగే వాహనాలు కండీషన్లో లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. ఆ ప్రకారం మొత్తం 30 వాహనాలకు గాను చాలా బండ్లు కండీషన్లో లేవు. అలాగే వాహనాలకు ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేకపోవడం దారుణం. ఇక తిరుగుతున్న వాహనాల్లో చాలా వరకు టైర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఆ వాహనాల టైర్లు ఎక్కడ పడితే అక్కడ పేలిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు టైర్లు పంక్చర్ అవుతున్నాయి. దీంతో బాధితులు మార్గ మధ్యంలోనే వేరే వాహనాల్లో వెళుతున్నారు. ఇబ్బందుల్లో సిబ్బంది: రెండు వాహనాలకు సగటున 5 మంది టెక్నీషియన్స్, 5 మంది పైలెట్లు ( డ్రైవర్లు) షిప్టుల ప్రకారం విధులను చేపడతారు. ఆ ప్రకారం ఒక వాహనానికి ఒక రోజుకు (24 గంటల్లో) దాదాపు 15 కేసులు వస్తాయి. అందులోను రాత్రి పూట వచ్చే కేసులు అధికంగా ఉంటాయి. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. పైలెట్లు, టెక్నీషియన్స్ మొత్తం 136 మంది ఉండాలి. అయితే 122 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరంతా 12 గంటల పాటు విధులను చేపడుతున్నారు. సాధారణంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అలా అయితే సిబ్బంది సంఖ్యను అందుకు అనుగుణంగా పెంచాలి. యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించడంలేదు. కాగా ప్రస్తుతానికి సిబ్బందికి రెండు నెలల వేతనం అందాల్సి ఉంది. 2007లో వైఎస్ తెచ్చిన ‘108’ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పలు ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆ ప్రకారం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అందులో భాగంగా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి నడుం బిగించారు. ఆ మేరకు 2007లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ వాహనాల రాకతో నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో 108 వాహనాలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఈ వాహనాలు కష్టాల నడుమ ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టడంతో ‘108’ వ్యవస్థ గాడిలో పడనుంది. -
అంపశయ్యపై.. అపర సంజీవని
రోడ్డు ప్రమాదమైనా.. అస్వస్థతకు గురైనా.. పురిటి నొప్పులు పడుతున్నా.. కళ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో వాలిపోయి.. పోతున్న ప్రాణాలను పట్టి జీవితాలను నిలబెట్టిన ప్రాణదాత ఈ వాహనం. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 108 సేవలు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, నిర్వాకంతో పూర్తిస్థాయిలో అందని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆపన్నులు విగతజీవులుగా మారిపోతున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మొన్న పిఠాపురంలో ఒకరు మృతి చెందితే.. వాహనం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోక నాలుగు నెలల క్రితం పిఠాపురం సమీపంలోని చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదంలో ఏడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రాణదాత అంపశయ్య పైకి చేరి.. సేవలు నిర్వీర్యమవుతున్న వేళ.. సకాలంలో వైద్యం అందక జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మండపేట/ కాకినాడ సిటీ: సంఘటన జరిగినా పెద్దల నుంచి చిన్నారుల వరకూ వెంటనే 108కు ఫోన్ చేసేంతగా అనతికాలంలోనే ప్రజల్లోకి ఈ సేవలు చొచ్చుకుపోయాయి. వైఎస్సార్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆయన హఠాన్మరణానంతరం వచ్చిన పాలకులు 108 సేవలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. దీంతో అంతంతమాత్రంగా మారిన ఈ సేవలు ఐదేళ్లుగా పట్టిన ‘చంద్ర’గ్రహణంతో మరింతగా క్షీణించాయి. వైఎస్ గురుతులను చెరిపేయాలన్న లక్ష్యంతో 108 సేవల్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తూ వచ్చింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్సను సహితం అందించలేని దుస్థితికి 108 సేవలు చేరుకున్నాయి. 108 సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల ముందు జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, కరప, తాళ్లరేవు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున కొత్త వాహనాలను అందించింది. అయినప్పటికీ ఇతర సమస్యలు అలాగే ఉండడంతో 108 సేవలు సకాలంలో అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవీ సమస్యలు జిల్లాలో 42 వాహనాలకు గాను అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. వాస్తవానికి దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా పాడై షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. చాలా 108 అంబులెన్సులలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రతి అంబులెన్స్‌కు ఇద్దరు పైలట్లను, ఇద్దరు టెక్నీషియన్లను నియమించారు. చాలా అంబులెన్సులలో నిన్నమొన్నటి వరకూ టెక్నీషియన్లు కూడా లేక ప్రథమ చికిత్స కూడా అందేది కాదు. కొన్ని వాహనాలు ఒక్క పైలట్‌తోనే నడుస్తున్నాయి. సిబ్బంది ఉన్న చాలా వాహనాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన పరికరాలు కూడా లేవు. దీంతో ప్రమాద బాధితులు, అపాయంలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. దీనినిబట్టి ఈ సేవలపై ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. అధిక శాతం వాహనాలు మైనర్ రిపేర్లతో నడుస్తున్నాయి. ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం, బ్రేకులు పని చేయకపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకమవుతున్నాయి. సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్సులను మార్చాల్సి ఉండగా.. జిల్లాలో అధిక శాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగినవి కావడం గమనార్హం. దీంతో అత్యవసర సమయాల్లో ఇవి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి తీవ్ర జాప్యం జరుగుతూండటంతో ప్రాణనష్టం జరిగిపోతోంది. ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా మరమ్మతులు చేయించక పాత వాహనాలు షెడ్లలోనే మూలుగుతున్నాయి. వైఎస్ హయాంలో అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్సులలో 120 రకాల మందులు అందజేస్తే ప్రస్తుత ప్రభుత్వం 100కు తగ్గించేసి, వాటిని కూడా అరకొరగానే అందిస్తోంది. ఆక్సిజన్ లేక పోతున్న ఆయువు అత్యవసర కేసుల్లో క్షతగాత్రులకు, రోగికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరి. ఆస్పత్రికి తరలించేంత వరకూ రోగి ప్రాణాలు నిలపడంలో ఆక్సిజన్ కీలకం. కాగా జిల్లాలో కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉండడం గమనార్హం. మిగిలిన వాహనాల్లో సిలిండర్లు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక్కో వాహనంలో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్ అయిపోయిందని చెప్పినా నిర్వాహకులు ఆక్సిజన్ సమకూర్చడం లేదని పలువురు 108 సిబ్బంది చెబుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో బాధ పడుతున్న పిఠాపురం ఇందిరా కాలనీ వాసి కూరపాటి చినగంగరాజు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అంబులెన్సులో ఆక్సిజన్ లేక మార్గంమధ్యలోనే మృతి చెందడం ‘అపర సంజీవని’ సేవలు నిర్వీర్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఇంధనమూ కష్టమే 108 వాహనాలకు డీజిల్ నింపడం కూడా కష్టంగా మారింది. రోజూ డీజిల్ నింపుకొనేందుకు ఆయా ప్రాంతాల్లో 108 వాహనాలకు కొన్ని బంకులు కేటాయించారు. ఇదివరకు ఆన్లైన్ బిల్లింగ్ పేరుతో ఫుల్ట్యాంక్ కొట్టేవారు. అయితే ఇప్పటికే లక్షల రూపాయల మేర డీజిల్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బంకు యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలి 108 అనేది అత్యవసర సేవ. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత 108కు ఉంది. కొత్త వాహనాలను ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలి. ప్రసూతి కోసం ఇదే వాహనాలను ఉపయోగించడంతో ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వాహనాలు అందడం లేదు. ప్రసూతి కోసం గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిధులు కేటాయించి, డీజిల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. – అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్‌కుమార్, జిల్లా ప్రయాణికుల సంఘం కార్యదర్శి, డీఆర్‌యూసీసీ మెంబర్, కాకినాడ -
అరణ్యరోదన..
తూర్పుగోదావరి ,రంపచోడవరం: గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు, ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. కనీస వైద్య సేవలు అందక గిరిజనం మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికీ నాటు వైద్యం, చెక్క మందులు తమను రక్షిస్తాయని ఆదివాసీలు నమ్ముతున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రుల దారుణ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యుల కొరత, మందులు అందుబాటులో లేకపోవడం, లేబొరేటరీలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో గిరిజనం రోగాలతో అల్లాడుతోంది. కాళ్లవాపు, తదితర వ్యాధులతో అనేక మంది ఆదివాసీలు ప్రాణాలు వదులుతున్నా టీడీపీ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏరియా ఆసుపత్రిలో అందని వైద్య సేవలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి రోగులకు వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్‌లకు రిఫర్ చేస్తున్నారు.అక్కడికి వెళ్లినా వారిని పట్టించుకునే నాథుడే లేరు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు లేకపోవడంతో అత్యవసర వైద్యం అందడం లేదు. ప్రసూతి వైద్య సేవలు అసలు అందుబాటులోనే లేవు. ఇందుకు ఆదివారం చోటు చేసుకున్న సంఘటనే నిదర్శనం. రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన దబ్బా మాధురి రెండో కాన్పు కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి రక్తం తక్కువ ఉందని రక్తం ఎక్కించారు. ఆదివారం రాత్రి నొప్పులు రావడంతో ఏరియా ఆసుపత్రిలో కాన్పు కష్టమవుతోందని రాజమహేంద్రవరం రిఫర్ చేశారు. స్థానికంగా 108 అందుబాటులో లేకపోవడంతో మారేడుమిల్లి నుంచి 108 వాహనం వచ్చిన తరువాత ఆ వాహనంలో తరలించారు. మార్గం మధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో సీఎంటీ అబ్దుల్ హమీద్, ఫైలట్ ప్రసాద్ సహాయంతో సుఖప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. మాతాశిశు మరణాల సంఖ్య పెరిగిపోతున్నా ప్రసూతి సేవలు మెరుగుపర్చలేదు. ఏజెన్సీ 11 మండలాలకు చెందిన గిరిజనులు అత్యవసర వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వస్తారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు కొరత ఏళ్ల తరబడి వేధిస్తోంది. పేరుకు మాత్రం వంద పడకల ఆసుపత్రైనా అందుకు తగిన వసతులును మాత్రం ఏర్పాటు చేయలేదు. అందుబాటులో లేని అంబులెన్స్‌లు రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది చోట్ల అంబులెన్స్ సదుపాయం ఉంది. మిగిలిన చోట్ల పీహెచ్‌సీకి వచ్చిన అత్యవసర కేసులను ఏరియా ఆసుపత్రికి పంపేందుకు 108పై ఆధారపడాల్సి ఉంది. ఏజెన్సీలో రంపచోడవరంలో మినహా అన్ని చోట్ల 108 అంబులెన్స్‌లు తిరిగే పరిస్థితి లేదు. నాలుగు లక్షలు కిలోమీటర్లు పైబడి తిరగడంతో మరమ్మతులకు గురయ్యాయి. ఏడాది కాలం నుంచి 108 అంబులెన్స్‌లో కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండడం లేదు. రంపచోడవరం ఐటీడీఏలో రెండు అంబులెన్స్‌లకు ఒకటి మాత్రమే పనిచేస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితిలో వైద్య సేవలను మెరుగుపరచాలనే ఆలోచనలో అటు అధికారుల్లో, ఇటు పాలకుల్లో లేకపోవడం విచారకరం. పీహెచ్‌సీలకు ఆయిల్ ఖర్చు కోసం నెలకు రూ.10వేలు కేటాయించారు. నెలలో మూడు నుంచి నాలుగు కేసులను తరలించేందుకే సరిపోతుంది. తరువాత వచ్చిన కేసులను ఏరియా ఆసుపత్రికి పంపే పరిస్థితి కష్టమవుతోంది. పేరుకే పెద్దాసుపత్రి చింతూరు ఏరియా ఆసుపత్రి పేరుకే పెద్దాసుపత్రి అన్నట్టుగా తయారైంది. కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి నిర్మించినా పూర్తి స్థాయిలో వైద్యసిబ్బందిని నియమించలేదు. వైద్యం కోసం గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేసులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ తరలిస్తున్నారు. వైద్యం అందేలోపే ప్రాణాలు పోతున్నాయి.– సోడె బాయమ్మ, ఎంపీటీసీ,చింతూరు డయాలసిస్ సెంటర్ ఊసే లేదు విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా అందుకు గల కారణాలను తెలుసుకోలేకపోయారు. కాళ్లవాపు వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ అవసరమని చింతూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నేటికీ చింతూరు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. -
చంద్రబాబు జమానా... 108కు మాయ రోగం
సాక్షి, అమరావతి : ఆపదలో ప్రాణాలు నిలిపే 108... ఊహించని వ్యాధి బారినపడితే అండగా నిలిచే ఆరోగ్య శ్రీ... మారుమూల ప్రాంత వృద్ధులు, బాలింతలకు మందులిచ్చే 104 పథకాలు చంద్రబాబు హయాంలో తిరోగమనంలో ఉన్నాయి. పేదలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడేసే గొప్ప ఉద్దేశంలో మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకాలు... ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ అసమర్థతతో నీరుగారాయి. వైఎస్ పాలనలో విలువైన సేవలతో, పలు రాష్ట్రాల్లో అమలుకు ఆదర్శంగా నిలిచిన వాటికి... చంద్రబాబు జమానాలో నిధుల విడుదల జాప్యం, అమలులో రకరకాల ఆంక్షలతో పురిటి గడ్డపైనే నూకలు చెల్లుతున్నాయి. 2010 నుంచి పతనం ప్రారంభం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకానికి మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో కష్టాలు దాపురించాయి. 2010 నాటికి 938 వ్యాధులు ఆరోగ్య శ్రీలో ఉన్నాయి. తర్వాతి ప్రభుత్వం వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని, ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయాలని నిబంధన విధించింది. ఒకవేళ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేకపోతే రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాలి. మరోవైపు తొలినాళ్లలో పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు 12 ఏళ్ల వరకు వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత దీన్ని రెండేళ్ల వయసుకు పరిమితం చేశారు. దీంతో లక్షలమంది చిన్నారులు వైద్యానికి అనర్హులయ్యారు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 1,600 మంది ఆరోగ్యమిత్రలను తొలగించింది. కాంక్లియర్ ఇంప్లాంట్స్ చేసే ఆస్పత్రులకు నెలకు ఒకటి మాత్రమే కొత్త కేసు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే, మన రాష్ట్రంలో ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం సరిగా లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల్లో గాయపడినవారికి చికిత్స అందించేందుకు చాలా ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అదేమంటే ప్యాకేజీ రేట్లు చాలడం లేదంటున్నాయి. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యానికి చాలాచోట్ల ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అన్నిటికి మించి వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుంటే వారిని ఆరోగ్య శ్రీ నుంచి టీడీపీ ప్రభుత్వం తొలగించింది. మంత్రి గారికేమో సింగపూర్ వైద్యం సామాన్యులు ఆరోగ్య శ్రీ కింద ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అనుమతించని ప్రభుత్వం... మంత్రి విషయంలో మాత్రం ఎంతో ఔదార్యం ప్రదర్శించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు సింగపూర్ వెళ్లి దంత చికిత్స చేయించుకోవడానికి ఏకంగా రూ.2,88,823 మంజూరు చేసింది. రూ.15 వేలు కూడా వ్యయం కాని రూట్ కెనాల్ చికిత్సకు ఇంత మొత్తం ఖర్చేమిటని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆరోగ్య శ్రీకి రూ.500 కోట్ల బకాయిలు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించే 650 పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆరు నెలలుగా ప్రభుత్వం రూ.500 కోట్లపైగా బకాయి పడింది. దీంతో తమవల్ల కాదంటూ ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి చెప్పేశాయి. ఇప్పటికే కొన్ని కేసులను తిప్పి పంపుతున్నాయి. చిన్నచిన్న నర్సింగ్ హోంలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో స్వీకరిస్తున్నాయి. ఈ జాప్యం కారణంగా చాలామంది మృత్యువుకు చేరువవుతున్నారు. ‘బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం నిధులు లేవంటోంది. ఇక మేమేం చేయాలంటూ’ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 2014 తర్వాత ఆరోగ్యశ్రీ - ఆరోగ్యశ్రీ భారంగా ఉందని నిధుల కేటాయింపు భారీగా తగ్గించారు. - కాంక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్సకు నిబంధనలు విధించి సర్జరీలకు కోతపెట్టారు. - ఆరోగ్యశ్రీ చికిత్సల కంటే అదనంగా వ్యయమైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం వర్తించదని మెలిక పెట్టారు. - హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని కొర్రీ విధించారు. - రోగులకు రవాణా చార్జీలు ఇవ్వడం లేదు - ఇన్‌పేషెంట్‌గా చేరకముందు అయ్యే వైద్య పరీక్షలకు సొంతంగా ఖర్చు పెట్టుకోమన్నారు. - తాజాగా... డైట్ కింద ఇచ్చే రూ.100కు కోత పెడుతూ అందరిలాగే సాధారణ డైట్ పెట్టాలని ఆదేశాలిచ్చారు. - డైట్‌తో మిగిలిన మొత్తం రోగుల ఖాతాలో వేస్తున్నామంటున్నా జమ కావడం లేదు. 104 వాహనాల సొమ్ము కార్పొరేట్ జేబుల్లోకి ఎక్కడైనా పదిమంది పేదలకు మేలు జరుగుతుంటే అక్కడి సర్కారు కూడా ముందుకొచ్చి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం 104 పథకం అమలులో కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేయడానికే మొగ్గుచూపింది. ఇలా కోట్లాది పేదలను గాలికొదిలేసి తమ జేబులు నింపుకోవడం ఏ రాష్ట్రంలోనూ ఉండదేమోనని అధికారుల్లో చర్చ జరుగుతోంది. పిరమల్‌కు అప్పగించి.. రాష్ట్రంలో 104 వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమల్ స్వాస్థ్య సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ దేశంలో అత్యంత ప్రముఖుడికి చెందినది. దీంతో రాష్ట్రంలో పిరమల్‌కు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఈ సంస్థ 2016లో వక్ర మార్గంలో టెండరు దక్కించుకున్న నాటి నుంచి రూ.కోట్లు బిల్లులు చేసుకోవడమే గాని, పేదలకు నాలుగు రకాల మందులు పంచిన దాఖలాలు తక్కువ. వాహనాలు, మందులు సమకూరుస్తూ.. డీజిల్, సిబ్బంది జీతభత్యాలకు నెలకు వాహనానికి రూ.2.44 లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇందులో సంస్థ నుంచి రూ.లక్ష కూడా ఖర్చు చేయించలేకపోయింది. అప్పుడు రూ.1.04 లక్షలు ఇప్పుడు రూ.2.44 లక్షలు 2014కు ముందు 104 వాహనాల నిర్వహణ జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో సాగేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించి పిరమల్ స్వాస్థ్య సంస్థకు కట్టబెట్టారు. అప్పటివరకు ఒక్కో వాహనానికి నెలకు రూ.1.04 లక్షలు ఇచ్చేవారు. కానీ, పిరమల్ స్వాస్థ్య సంస్థకు వచ్చేసరికి దానిని రూ.2.44 లక్షలకు పెంచి మూడేళ్లలో రూ.240 కోట్ల పైగా చెల్లించారు. 104 వాహనాల్లో పరిస్థితిది - మొత్తం 292లో మెజారిటీ వాహనాలకు ఫిట్నెస్ లేదు. - ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయాయి. - నెలలో 15,432 గ్రామాలకు వెళ్లి మందులివ్వాల్సి ఉండగా ఇందులో సగం కూడా వెళ్లడం లేదు - ఏపీ09టీఏ2732 వాహనం 2010 ఏప్రిల్ 23న ప్రమాదానికి గురై షెడ్డులో ఉంది. ఐనా తిరుగుతున్నట్టు చూపి నెలకు రూ.2.44 లక్షలు తీసుకుంటున్నారు - 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి రవాణా భత్యం, డిసెంబరు నుంచి దినసరి భత్యం చెల్లించడం లేదు - 60 రకాల మందులకు 27 కూడా లేవు గర్భిణులు, మధుమేహ రోగులకు రక్త పరీక్షలు చేసేందుకు కొన్ని నెలలుగా రసాయనాలు లేవు. - మధుమేహం, మూర్ఛ సంబంధిత జబ్బులకు ప్రధాన మందులు లేవు. - 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు. -
సరిగ్గా ఎలక్షన్ కోడ్కురెండు రోజుల ముందు...
రావులపాలెం నుంచి యానాంకు ఏటిగట్టు రోడ్డులో బైక్‌పై వెళ్తున్నాం. దారిపొడవునా ఓవైపు పచ్చని పంటపొలాలు, మరోవైపు గౌతమి గోదావరి నది ఉండటంతో ప్రయాణం ఆహ్లాదంగా సాగుతోంది. మావారు డ్రైవింగ్ చేస్తుండగా మా పాప, నేను కబుర్లు చెప్పుకొంటున్నాం.ఈ రహదారిలో రద్దీ చాలా తక్కువ. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న కోటిపల్లి గ్రామం దాటాం. కొట గ్రామం సమీపిస్తుండగా ఓ సంఘటన మమ్మల్ని కదిలించింది. మర్చిపోగలమా? ప్రాణదాతను ఇంతకీ మాకు కనిపించిన ఘటన ఏంటంటే...! ఢీకొని ఎంత సేపయిందో కానీ, రెండు బైక్‌లు బాగా దెబ్బతిని పడి ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు, ఇంకో పాప, మరో బాబు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ కదల్లేకుండా ఉన్నారు. పరిసరాల్లోనూ ఎవరూ లేరు. మాకు ఒక్కసారిగా మతి పోయింది. దగ్గర్లో ఏ గ్రామముందో, హాస్పిటల్ ఎక్కడుందో తెలియదు. వారిని తీసుకెళ్దామంటే మా బైక్‌పై సాధ్యమవదు. ఏదైనా వాహనం వచ్చినా వాళ్లు ఎక్కించుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్తారా? ఇలా ఎన్నో ఆలోచనలు. ఈలోగా నా చెయ్యి మొబైల్ మీదకు వెళ్లింది. 108 నంబరుకు డయల్ చేయబోయా. అప్పుడే అనిపించింది...! ఇలాంటి సర్వీసు ఎంత మంచిదో కదా అని! ఏ సమయంలో ఎక్కడ ప్రమాదం జరిగినా దారినపోయే వాళ్లు సైతం సమాచారం అందించి ప్రాణాలు నిలపడం అనే భావన నన్ను కదిలించింది. ఇంతటి మంచి పథకాన్ని రాన్రాను ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో? అనుకున్నా. చివరగా ఓ విషయం... ‘అసలు ఈ పథకానికి రూపకల్పన చేసిన ఆ మహనీయుడిని మర్చిపోగలమా? అది జన్మ జన్మలకైనా...?’ అని...! పంపిన వారు: జాస్మిన్ కప్పల; తూర్పుగోదావరి.‘సాక్షి... మీరూ రాయొచ్చు’ శీర్షికకు స్పందనగా -
హైటెక్ ప్రచారం.. లోటెక్ వైద్యం
అనారోగ్యంతో ధర్మాసుపత్రికి పోతే ప్రాణాలు పోతాయి.. కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్తే ఆస్తులు కరుగుతాయి అన్నట్లుగా రోజులు మారిన నేపథ్యంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం భారమవుతోంది. పేదలందరికీ ఆధునిక వైద్యం.. అందరికీ ఆరోగ్యం.. ఉచితంగానే అన్నీ పరీక్షలు.. ఇలా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించి ఆచరణలో చేతెలెత్తేశారు. ఐదేళ్ల పాలనలో పేదల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. కుయ్ కుయ్ మనే 108 వాహనాలు కుయ్యో మొర్రో అంటున్నాయి. సంచార చికిత్స వాహనాలు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మురికివాడల్లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నామమాత్ర వైద్య సేవలే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు అధిక శాతం బోగస్‌గా నమోదవుతున్నాయి. బడిపిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తామని చెప్పిన బాలసురక్ష వాహనాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్) సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో గాకుండా 133 రకాల శస్త్ర చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ప్రైవేటుకు మించి ఖర్చు అవుతోంది. అత్యవసరం పేరుతో అధిక శాతం మందులను బయటి నుంచి రోగులతో కొనిపిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వర్తించినా సదరు రోగి కుటుంబీకులు డిశ్చార్జ్ అయ్యేలోగా రూ.4 వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే నెలల తరబడి తిప్పుకుని వెనక్కి ఇస్తున్నారు. ఇలా తిరగలేక చాలా మంది ఆ మొత్తాన్ని కూడా వదిలేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా వచ్చిన క్లెయిమ్ నిధుల నుంచి వాటా రూపేణా అధికారులు, వైద్యులు, పారా మెడికల్, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పంచుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఉన్నా తగిన ప్యాకేజి మొత్తం లేకపోవడంతో చాలా ఆసుపత్రులు రోగుల నుంచి ప్యాకేజికి మించిన మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు మా వల్ల కాదంటూ వెనక్కి పంపిస్తున్నాయి. ఆపద్బాంధవుడికి అష్టకష్టాలు జిల్లాలో ప్రస్తుతం 108 అత్యవసర అంబులెన్స్‌లు 32 ఉన్నాయి. వీటిలో అధిక శాతం వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. అయినా నిర్వహణ పనులు చేపట్టకుండా వాటిని అలాగే తిప్పుతున్నారు. ఏ బండి ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు(పైలెట్లు) తీవ్ర ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనానికి రూ.2,500 విలువ జేసే డీజిల్ కార్డు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంధనం చాలక షెడ్డుకే వాహనాలు పరిమితం చేయాల్సి వస్తోంది. ఇందులో పనిచేసే 64 మంది పైలెట్లు, టెక్నీషియన్లకు సైతం రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. అడిగితే టెర్మినేట్ చేస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడికి రాని బాలసురక్ష జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేందుకు బాల సురక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని కూడా ధనుష్ అనే సంస్థకు అప్పగించింది. ఇందుకు గాను జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి. అయితే ఈ పథకం ప్రారంభమైన ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టలేదని, ఇటీవలే కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా స్థాయి అధికారులు సైతం చెబుతున్నారు. ఈ కార్యక్రమం సైతం సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపించారు. సంచార వాహనాల్లో మందుల కొరత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాల్లో సేవలు అందించిన 104 సంచార వాహనాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ చంద్రన్న సంచార చికిత్సగా నామకరణం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కిలో మీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు వాహనాన్ని తీసుకెళ్లి గ్రామీణులకు చికిత్స అందిస్తోంది. అయితే ఇలా వెళ్లిన వాహనాల్లో సిబ్బంది సరిగ్గా ఉండటం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్ మందులు కూడా తగినంత ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత తేదీల్లోనూ ఈ వాహనాలు ఆయా గ్రామాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో బోగస్ పరీక్షలు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డయా గ్నోస్టిక్ పరీక్షలు (రక్త, మూత్ర పరీక్షలు)ను, ఎక్స్‌రే తీసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. కొన్ని చోట్ల వైద్యుల సహాయంతో ముందుగానే సంతకాలు చేయించి అవసరం లేకపోయినా రోగులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో కొన్ని మాత్రమే చేసి, మిగిలిన వాటికి నార్మల్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇలా ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో 20 నుంచి 30 శాతం మంది రోగులకు పరీక్షలు చేశామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల సంతకాలు లేకపోయినా రోగులకు పరీక్షలు చేసినట్లు రాసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు ఆదరణ కరువు పట్టణాల్లోని మురికివాడల్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అర్బన్‌హెల్త్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అపోలో సంస్థకు అప్పగించింది. వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా నామకరణం చేసింది. రెగ్యులర్‌గా అందే సేవలతో పాటు టెలి మెడిసిన్‌ను కూడా రోగులకు అందిస్తామని ఆ సంస్థ చెప్పింది. అయితే ఈ సంస్థ వచ్చిన తర్వాత ఏఎన్ఎంలు క్షేత్రస్థాయికి వెళ్లి చికిత్సలు చేయడం లేదు. రోగులే కేంద్రానికి వచ్చి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. టెలి మెడిసిన్ సైతం అందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గర్భిణిలు, పిల్లలకు సైతం సరైన వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.40 వేల మందులు బయట కొన్నా నాకు ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడు యూనుస్(5)కు అపెండిక్స్ వచ్చింది. మూడు వారాల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగంలో చేర్పించాము. వెంటనే డాక్టర్లు స్పందించి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో మళ్లీ గత సోమవారం ఆపరేషన్ చేశారు. అయితే బాబు కోలుకోలేక 9వ తేదీన మరణించాడు. మూడు వారాల సమయంలో మాకు రూ.40 వేల దాకా మందులు, ఇతర ఖర్చులు అయ్యాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేస్తున్నామని చెప్పినా ఇంత స్థాయిలో ఖర్చు అయ్యింది. – యూసుఫ్, తిరుమిల్ల గ్రామం, కంభం మండలం, ప్రకాశం జిల్లా 108కు ఫోన్ చేస్తే బిజీ అని చెబుతున్నారు రెండు వారాల క్రితం నా ఫ్రెండ్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే 108కు ఫోన్ చేశాము. ఆ నెంబర్ రింగ్ అవుతోంది గానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. కొంత సేపటికి నా మరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు. అయితే వాహనాలన్నీ బిజీగా ఉన్నాయి...కాస్త ఆలస్యం అవుతుందని, వేచి ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్లోనే రోగి స్థితిగతులను అడిగి తెలుసుకుని, ఇలా చేయండి...అలా చేయండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆలస్యం అవుతుందని చెప్పి మేమే ఆటోలో ఆసుపత్రికి తరలించాము. – బషీర్, కల్లూరు డాక్టర్లు ఉండటం లేదు కర్నూలులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉండటం లేదు. టెలిమెడిసిన్ ద్వారా చికిత్స అందిస్తామంటున్నారు గానీ రోగులను వేచి ఉండాలని చెబుతున్నారు. గంటల తరబడి రోగులు అక్కడ కూర్చోలేక వెనక్కిపోతున్నారు. మాది స్వచ్ఛంద సంస్థ. పేదలకు సేవ చేయాలన్న భావనతో ఆరోగ్య కేంద్రాలకు రోగులను తీసుకెళ్తుంటాము. కానీ అక్కడ సరైన వైద్యసేవలు అందకపోవడంతో రోగులు నిరాశ చెందుతున్నారు. – ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, కర్నూలు -
సకాలంలో చేరని 108.. చికిత్స అందక గర్భిణి మృతి
మల్కాజిగిరి: సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా సకాలంలో అంబులెన్స్ చేరలేకపోవడంతో ఎనిమిది నెలల గర్భిణి చికిత్స అందక మృతి చెందింది.ఈ విషాత సంఘటన గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వీరిది మెదక్ జిల్లా గరిగట్ల పల్లి గ్రామానికి చెందిన శేఖర్ –మాధవి దంపతులు నగరానికి వలసవచ్చి ఇందిరానెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం వీరికి వివాహం జరిగింది. శేఖర్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండగా, మాధవి ఇంట్లోనే ఉండేది. 8 నెలల గర్భంతో ఉన్న మాధవికి గురువారం రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేశారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇందిరానెహ్రూనగర్‌కు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సికింద్రాబాద్ తుకారాం గేట్ మీదుగా 108 వాహనం అక్కడికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో సకాలంలో చికిత్స అందక మాధవి మృతి చెందింది. -
బాలింత, పసికందును మధ్యలో దించేసిన వైనం
విశాఖపట్నం, పెదబయలు (అరకులోయ): ఏ వేళలో ఫోన్ చేసినా సకాలంలో వచ్చి.. బాధితులను ఆస్పత్రులకు చేర్చి.. అపర సంజీవనిగా పేరు తెచ్చుకున్న 108 వాహనాలు ఇప్పుడు ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి. సకాలంలో రాకపోవడంతోపాటు.. కొంతమంది సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 టెక్నీషియన్, పైలట్ ఓ ఆదివాసీ బాలింత, పసికందు పట్ల స్పందించిన తీరు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలివి.. మండలంలోని అరడకోట గ్రామానికి చెందిన కొర్రా బాలయ్య భార్య సుందరమ్మ వారం రోజుల క్రితం ప్రసవించిన బిడ్డకు వాంతులు, విరోచనాలు అవుతుండడంతో పెదబయలు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ స్టాఫ్ నర్స్ పరిశీలించి, పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో వస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు. పెదబయలులోనే ఉండి తీరిగ్గా రాత్రి 9.30 గంటలకు వచ్చారు. అంతవరకు ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు ‘ఇంత ఆలస్యం అయితే ఎలా సార్.. పరిస్థితి విషమంగా ఉంది కదా’ అని 108 సిబ్బందిని ప్రశ్నించారు. దానికి వారు స్పందించి తీరు దారుణంగా ఉంది. ‘ప్రాణాలు పోతే పోనీయండి.. మేము భోజనం చేసి రావడంతో జాప్యం జరిగింది.. మీరు ఇలా అడిగితే ఎందుకు పాడేరు తీసుకుని వెళ్లాల’ని వారు దురుసుగా మాట్లాడారు. వాహనంలో ఎక్కించుకుని పీహెచ్సీ నుంచి మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్లి దించేశారు. దీంతో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులకు బాధితులు సమాచారం అందించారు. వారు వెంటనే పాడేరు ఐటీడీఏ పీవోతో మాట్లాడి పీహెచ్సీ అంబులెన్స్‌కు పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న పసికందును వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి ఉన్నా ఉన్న పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు నాగేంద్ర, సింగ్, పూర్ణయ్య కోరారు. పైలెట్ మద్యం సేవించి ఉన్నాడని బాధితులు ఆరోపించారు. -
108కు సుస్తీ..
ఆత్మకూరు(పరకాల): ఆపద సమయంలో ఆదుకునే ఆపద్భందు 108కు సుస్తీ చేసింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగితే రోగిని అత్యవసరంగా వాహనంలో చేర్చి ప్రథమ చికిత్స అందజేసి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడేది 108. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గొప్ప మనసుతో ప్రవేశపెట్టిన ఈ సేవలకు ఇప్పుడు అంతరాయం కలుగుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదిలో ఎన్నో సార్లు సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 16 అంతంతమాత్రమే..మండల కేంద్రాల్లో 108 వాహనం ఉండాల్సి ఉన్నప్పటికీ ఆ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు.8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పరకాల, ఆత్మకూరు, నల్లబెల్లి, పర్వతగిరి, నర్సంపేట, సంగెం, గీసుకొండ, నెక్కొండ మండలకేంద్రాల్లో ఉండగా ఒక్కో వాహనం రెండు మండలాల్లో సేవలందిస్తోంది. ఒకటే సమయంలో రెండు మండలాల్లో అత్యవసరం ఏర్పడితే ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీల్లో రాత్రివేళ అత్యవసర సేవలు మృగ్యమయ్యాయి. దీనికి తోడు 108 వాహనాలు ప్రతి మండలకేంద్రానికి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాలుగోసారి.. ఈ ఏడాది కాలంలో డీజిల్ లేక వాహనాలు నిలిచిపోయిన సందర్భం ఇది నాలుగోసారి. 2018లో ఆగస్టు, డిసెంబర్లలో ఇదే పరిస్థితి. మూడు సార్లు నిలిచిపోగా తాజాగా ఇప్పుడు నాలుగురోజులుగా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. నాలుగురోజులుగా డీజిల్‌కు డబ్బులు లేక వాహనాలు కదలడం లేదు. డబ్బులు ఎప్పుడొస్తయో అని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. కనీసం డీజిల్‌కు డబ్బులు అందచేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండడంపై రోగులు దుమ్మెత్తిపోస్తున్నారు. పైలెట్లు, ఈఎంటీల కొరత.. జిల్లాలో 108 సర్వీసుల్లో సేవలందించాల్సిన పైలెట్లు, ఈఎంటీ(ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్)ల కొరత ఉంది. ఒక వాహనానికి ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇప్పుడు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో అక్కడక్కడ వాహనాలు కదలడం లేదు. మానిటరింగ్ వ్యవస్థ సరిగాలేదు. సమ్మెచేసినా..తీరని డిమాండ్లు.. ఇటీవల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె చేసినప్పటికి వీరి డిమాండ్లు నెరవేరలేదు. వేరే వారిని తీసుకుంటున్న ఆందోళనతో విధుల్లో చేరారు. వీరికి కనీస కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. హైకోర్టు 8 గంటల సమయం పనిచేయాలని ఆదేశించినప్పటికీ 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సిబ్బంది సరిపడా లేకపోవడంతో అధనపు పనిభారంతో ఒత్తిడి, నిరాశలో సిబ్బంది ఉంటున్నారు. కుదరని జీవీకే ఒప్పందం.. ప్రభుత్వంతో 108 సేవలకు సంబంధించి జీవీకే కంపెనీతో ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం 108 సర్వీసులపై నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాయం కలుగకుండా చూస్తాం.. 108 సర్వీసులో అంతరాయం కలుగకుండా చూస్తాం. డీజిల్ నిధులు వచ్చాయి. వాహనాలు నడిపిస్తాం. వాహనాలను నిలుపకుండా చూస్తాం.సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –శ్రీనివాస్, 108 జిల్లా కో ఆర్డినేటర్ -
ఊపిరి ఆపేస్తున్నారు..!
ప్రమాదంలో ఉన్న వారికి తక్షణం సేవలు అందించి వారిని ఆస్పత్రికి చేర్చే అపర సంజీవనిగా పేరుగాంచిన 108 వాహనాలు ప్రాణాపాయంలో పడ్డాయి. ఒకనాడు అన్ని వసతులు, మందులు, ఆక్సిజన్, ఇతర టెక్నాలజీతో క్షణాల్లో రోగులను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఈ వాహనాలు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా వీటిని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాడైన వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం, నిర్వహణ ఖర్చులు సకాలంలో చెల్లించక కుర్రో, మొర్రో మంటున్నాయి. ఇంతలోనే మరో ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరా గత పది రోజులుగా నిలిచిపోయింది. వీటిని సరఫరా చేసే సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం అర్బన్/కాశీబుగ్గ: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన 108 వాహనాలు నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి. వీటి ఆలన పాలన చూసే నాథుడే లేకుండా పోయాడు. చంద్రబాబు సర్కార్ వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి. గత పది రోజులుగా వాహనాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినా పట్టించుకోలేదంటే సర్కార్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో 108 వాహనం వస్తే ఎంత బాధలో ఉన్నవారికైనా ప్రమాదం తప్పిందనే భరోసా రోజురోజుకూ లేకుండా పోయింది. ప్రమాదంలో ఉన్నవారికి ఆక్సిజన్ ఎంతో అవసరం. అత్యవసరంలో ఉన్నవారికి ఇది అందుబాటులో లేకుంటే వారి పరిస్థితి ఊహించలేం. కానీ పది రోజులుగా జిల్లాలోని 108 వాహనాల్లో ఆక్సిజన్ నిండుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు లేకుండానే వాహనాలను నడిపేస్తున్నారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 108 వాహనాలు ప్రజలకువిశేష సేవలు అందించాయి. ఎవరైనా ఆపదలో ఉన్నట్టు సమాచారం వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణదానం చేసేవి. అలాంటి వాహనాలు నేడు నిరాదరణకు గురవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వీటి సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పది రోజులుగా 108 వాహనాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదాలకు గురైన వారు, ఇతర అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయం బయటకు రానీయకుండా సంబంధిత శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. సమాచారం ఎవరికీ చెప్పవద్దని హుకం సైతం జారీ చేసినట్టు తెలిసింది. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, కొత్తూరు (ఐటీడీఏ), లావేరు, పాలకొండ(ఐటీడీఏ), పొందూరు, రాజాం, రణస్థలం, రేగిడి, సంతకవిటి, సీతంపేట(ఐటీడీఏ), శ్రీకాకుళం–02, వీరఘట్టం, కవిటి, సొంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నరసన్నపేట, గార, జలుమూరు, పాతపట్నం, హిరమండలం, ఇచ్ఛాపురంలో మొత్తం 28 వాహనాలు ఉన్నాయి. వీటిలో పాత వాహనాలు ఎనిమిది ఉన్నాయి. అలాగే ఏడాదిన్నర క్రితం వచ్చినవి 16 వాహనాలు వచ్చాయి. మూడు నెలల క్రితం 4 కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి పరిధిలో 133 మంది సిబ్బంది రెండు షిఫ్ట్‌లలో విధులను నిర్వహిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోవడమే కారణం 108 వాహనాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏకైక ఏజెన్సీ శ్రీకాకుళంలోని సత్యసాయి గ్యాస్ ఏజెన్సీ. ఈ సంస్థ 2017 డిసెంబరు 13వ తేదీ నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహన నిర్వహణ సంస్థ అయిన భారత్ వికాస్ గ్రూప్ గ్యాస్ ఏజెన్సీకి రూ.40 వేలు నగదు బకాయి పడింది. దీంతో 108 వాహనాలకు గత పది రోజులుగా గ్యాస్ ఏజెన్సీ వారు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. సాధారణంగా వాహనానికి ఒకటి, రెండు ట్యాంకర్లు ఉంటాయి. వాడుకను బట్టి ఆక్సిజన్ సిలిండర్ 30 నుంచి 45 రోజులు వస్తుంది. ప్రస్తుతం ఆక్సిజన్ లేకుండానే 108 వాహనాలను నడుపుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. కొద్ది రోజులుగా సరఫరా నిలిచింది 108 వాహనాలకు ఆక్సిజన్ సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. సిలిండర్ సరఫరా చేసే ఏజెన్సీ అధికారులు అందుబాటులో లేరు. అలాగే ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీకి బకాయిలు ఉన్నమాట వాస్తవమే. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే వారికి చెల్లిస్తాం. అవసరమైన వాహనాలకు ఆక్సిజన్ కావాలని సరఫరా సంస్థను కోరుతున్నాం. – అఖిల్, 108 జిల్లా మేనేజర్ -
అంబులెన్స్ రాకపోవడంతో నిండుప్రాణం బలి
విజయనగరం, గరివిడి: సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో నిండుప్రాణం పోయింది. అత్యవసర సమయంలో రోగికి వైద్యం అందించడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం 108 వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృత్యువాత పడిన సంఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కొండదాడి గ్రామానికి చెందిన ముదునూరు అప్పలరాజు (37) ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గరివిడి నుంచి గర్భాం మీదుగా రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం వస్తుండగా గుర్ల మండలంలో పెదబంటుపల్లి గ్రామంలో వచ్చేసరికి తనకు ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో వాహనాన్ని పక్కనే నిలిపివేశాడు. అయన వెంటున్న చిన్న అనే కుర్రాడు ఆ సెంటర్లో ఉన్న స్థానికులకు విషయం చెప్పి అనంతరం 108కు ఫోన్ చేశాడు. అయితే కాల్‌సెంటర్ వాళ్లు ఎన్నిసార్లు చేసినా వాహనాల వారి ఫోన్లు అవ్వడం లేదని...ఇంకో వాహనం నంబర్ మోగుతున్నా స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన 108 వాహనాలు ఖాళీగానే ఉన్నాయి. రాత్రి సమయం కావడంతో ప్రైవేట్ వాహనాలు లేవు. దీంతో అప్పలరాజు సుమారు రెండు గంటల పాటు అక్కడే కొట్టుమిట్టాడి ప్రాణం వదిలాడు. 108 వాహనం వచ్చి ఉంటే అప్పలరాజు బతికేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
రాజధానిలో ప్రమాదం జరిగితే అంతేనా!
గుంటూరు, తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రాజధానిలో పేదవాడికి చోటులేదు సరికదా.. జరగరానిది ఏదైనా జరిగితే కనీస అత్యవసర వైద్యం అందించేందుకు 108 వాహనం కూడా అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు. తాడికొండ శివారు గొడుగు కంపెనీ వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ కుటుంబ సభ్యులకు హఠాత్తుగా గేదె అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి మహిళ పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో స్పృహ తప్పిన ఆమెను 108 వాహనంలో పంపించాలనే ఆత్రుతతో పలువురు ఫోన్ చేసినా స్పందన కరువైంది. చివరకు ఆరాతీయగా తాడికొండ మండలానికి చెందిన 108 వాహనం ఐనవోలులో సీఎం సభకు వెళ్లడంతో అందుబాటులో లేదని తెలిసింది. స్పందించిన స్థానికులు అటుగా వెళుతున్న కారును ఆపి, బతిమాలి స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఆటోలో గుంటూరుకు తరలించారు. చిన్నారులతో ప్రయాణం చేస్తూ ప్రమాదం పాలైన ఆ జంటకు ఆపద సమయంలో 108 వాహనం రాకపోవడంతో ‘రాజధానిలో ఇదేం ఖర్మ!’ అంటూ పలువురు ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చీవాట్లు పెట్టారు. పెరిగిన ప్రమాదాలు రాజధాని నేపథ్యంలో పెరిగిన వాహనాల రాకపోకల దెబ్బకు ప్రమాదాలు కూడా అదే రీతిలో పెరిగాయి. 108 వాహనాన్ని రాజధానికి ప్రత్యేకంగా కేటాయించాలని ప్రజలు పలుమార్లు రాజధాని వాసులు ఎమ్మెల్యేలను కోరినా స్పందించిన నాథుడు లేడు. దీంతో తాడికొండ, తుళ్లూరు మండలాలకు చెందిన పలువురు ఆపద సమయంలో నానా అగచాట్లు పడుతున్నారు. ప్రపంచ గొప్ప రాజధాని నిర్మాణం అంటూ పదేపదే ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వ పెద్దలకు రాజధానిలో కనీస అత్యవసర సదుపాయమైన 108 వాహనాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆపదలో 108
సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురానికి చెందిన భానుప్రసాద్, సుధీర్, టీచర్ సుబ్బయ్యతో పాటు మరో ఇద్దరు బుధవారం కారులో కళ్యాణదుర్గం మండలం గొళ్ల ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కాలువపల్లి దాటగానే ఆత్మకూరుకు వచ్చే దారిలో కారు అదుపు తప్పి .. బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 కు ఫోన్ చేశారు. అరగంట దాటినా వాహనం రాలేదు. మరోవైపు క్షత్రగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో స్థానికులు కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి చేరేలోపు క్షతగాత్రుల బాధ వర్ణించేందుకు వీలు లేకుండా పోయింది. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు సుంకన్న. ఉరవకొండలోని శివరామిరెడ్డి కాలనీ. తన భార్య రెండ్రోజుల క్రితం ఉరవకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. పసికందుకు కామెర్లు వచ్చాయనీ, వెంటనే జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రి సిబ్బందే 108కు ఫోన్ చేయగా...సరైన సమాధానం రాలేదు. దీంతో సుంకన్న బుధవారం ఓ స్వచ్చంధ సంస్థకు చెందిన అంబులెన్స్‌ను మాట్లాడుకుని డీజిల్ ఖర్చు కింద రూ 900 చెల్లించి శిశువును అనంతపురం తీసుకువచ్చాడు. పది రోజుల కూలి ఒక్కసారిగా అయిపోయిందని సుంకన్న ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం న్యూసిటీ: ఆపదలో ఆదుకునే 108కు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. గతంలో ఫోన్ చెయ్యగానే క్షణాల్లోనే కుయ్...కుయ్.. అంటూ వచ్చే వాహనం... ఇప్పుడు పత్తా లేకుండాపోతోంది. క్షతగాత్రులు, బాలింతలు, గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చి ప్రాణం పోసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 108 వాహన సేవలు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోక పోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యçస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. జిల్లాలో పేరుకు 37 వాహనాలున్నా..పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. అందుకే జనం ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. సేవలు అధ్వానం ‘108’ వాహనాలు జిల్లాలో 37 అందుబాటులో ఉన్నాయని వాటి నిర్వహణ చూస్తున్న భారత్ వికాస్ గ్రూపు చెబుతోంది. ఈ వాహనాలు జిల్లాలోని 63 మండలాలకు అందుబాటులో ఉండాలి. రెండు మండలాలకు ఓ వాహనం ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూడేరు,ఆత్మకూరు, ఉరవకొండ, కణేకల్లు, తనకల్లు ప్రాంతాల్లో వాహనాలు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. ఆత్మకూరు వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ లేక మూలనపడింది. మరో ఐదు వాహనాలు 4 లక్షల కిలోమీటర్లకు పైబడి తిరిగాయి. వాటిని స్క్రాబ్‌కు పంపించాల్సి ఉంది. కానీ అదే వాహనాలతో నెట్టుకొస్తున్నారు. ఒకప్పుడు మెరుగైన సేవలతో ఎన్నోప్రాణాలు కాపాడిన 108 ఇపుడు ..సేవలందించలేక ఆపసోపాలు పడుతోంది. పేదల జేబులకు చిల్లు గతంలో ఎలాంటి ఆపద వచ్చినా నిరుపేదలకు వెంటనే 108 డయల్ చేసే వారు. రానురాను వాటి సేవలు సకాలంలో అందకపోవడం...అసలు సమాధానమే కరువు కావడంతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వారు ఎక్కువ మంది ప్రైవేట్ అంబులెన్స్‌ల్లోనే వస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ప్రజల అవసరాన్ని బట్టి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పేద ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ప్రజలకు ఇబ్బంది లేదు అందుబాటులో ఉన్న వాహనాలతో ప్రజలకు సేవలందిస్తున్నాం. కొన్ని మండలాల్లో సర్వీసులు లేని విషయం వాస్తవమే. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆస్పత్రులకు తీసుకెళ్తున్నాం. త్వరలో కొత్త వాహనాలు రానున్నాయి. ఇటీవల వచ్చిన వాహనాలను శింగనమల, పుట్టపర్తికి ఏర్పాటు చేశాం. మున్ముందు సేవలు మరింత విస్తృతం చేస్తాం. – మోహన్, భారత్ వికాస్గ్రూప్ మేనేజర్ -
108 అంబులెన్సులు నిర్వీర్యం
ఈమె పేరు.. ఆర్.శ్రావణి, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె స్వగ్రామం వంగర మండలంలోని నీలయ్యవలస. రాజాం పట్టణానికి ఈ గ్రామం 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమెకు డిసెంబర్ 31న పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు 108కి ఫోన్ చేశారు. కాల్ రిసీవర్ వివరాలు తెలుసుకుని వంగర మండలానికి 108 వాహనం లేదని చెప్పారు. అప్పటికే చాలా సమయం దాటడంతో కుటుంబీకులు ఆందోళన చెంది ప్రైవేట్ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఈయన పేరు దేవదాసు. ఊరు చిత్తూరు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ చేయగానే కుయ్.. కుయ్.. మంటూ కొద్ది నిమిషాల్లోనే 108 అంబులెన్స్ వచ్చేదని అంటున్నాడు. ఇప్పుడు ఆ శబ్దం కూడా కరువైందని, ఆపదల్లో 108కు ఫోన్ చేస్తే బండి అందుబాటులో లేదనే సమాధానం వస్తోందని వాపోతున్నాడు. 108 సౌకర్యం లేక చాలా అవస్థలు పడుతున్నామని, ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోందని చెబుతున్నాడు. పేదవాడికి అపర సంజీవని లాంటి 108 పథకాన్ని సర్కారే గొంతు నులుముతోంది. గతంలో అర్ధరాత్రి, అపరాత్రి భేదం లేకుండా ఫోన్ చేసిన అతికొద్ది నిమిషాల్లోనే రోగి దగ్గరకు వచ్చివాలిపోయిన 108 అంబులెన్సులు నేడు మొరాయిస్తున్నాయి. నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం, సకాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం, డీజిల్‌కు నిధులివ్వకపోవడం వంటి కారణాలతో 108 పథకం అస్తవ్యస్తమైంది. ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి, 108 వాహనాలు తిరగకపోయినా ఆ సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. దీంతో 108 పథకం పూర్తిగా కుప్పకూలే దిశగా సాగుతోంది. సాక్షి, అమరావతి: ఆరోగ్యశాఖలో పీపీపీ (పబ్లిక్–ప్రైవేటు పార్ట్నర్షిప్) పేరుతో కార్పొరేట్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. పేదవాడిని కాపాడే 108 అంబులెన్సులు గుర్తుకు రావడం లేదు. టైర్లు అరిగిపోయాయని, డీజిల్ లేదని, వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగులు రోజూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తన బాధ్యతలను నిర్వర్తించకుండా నెపాన్ని నిర్వహణ సంస్థపైకి నెట్టేస్తోంది. దీంతో ఎక్కడకక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. కొత్త అంబులెన్సుల కొనుగోలు మాట కూడా ప్రభుత్వం నుంచి వినిపించడం లేదు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన 108 పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అమలవుతోంది. రాష్ట్రంలో మాత్రం పుట్టెడు కష్టాల్లో కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా కష్టాల్లోనే.. 108కు బాధితులు ఫోన్ చేస్తుంటే వాహనాలు ఘటనా స్థలానికి రావడం లేదు. టైర్లు అరిగిపోయి కొన్ని, డీజిల్ లేక మరికొన్ని, ఇంజన్ మరమ్మతులకు వచ్చి ఇంకొన్ని ఆగిపోతున్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేసి బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. సమస్య తలెత్తిన వెంటనే 108 వాహనాలను రోడ్డు మీద తిప్పాల్సిన ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి నెలల తరబడి ఆలస్యం చేసింది. కొనుగోలు చేసిన వాటికి కూడా 100 శాతం అధికంగా చెల్లించి కమీషన్లు కొట్టేసిన తీరు చూస్తుంటే ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆపదలో ఉన్న రోగులను కాపాడాల్సిన 108 వాహనాల కొనుగోలును కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. అవినీతికి పరాకాష్టగా పథకాన్ని మార్చడం, సరిగా నిధులు కేటాయించకపోవడం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, చివరకు నిర్వహణ సంస్థపై తప్పులు నెట్టేయడం ప్రభుత్వ అసమర్థ పనితీరుకు అద్దం పడుతున్నాయని ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకూ మండిపడుతున్నారు. సకాలంలో రాని అంబులెన్సులు ఎక్కడైనా ప్రమాదం జరిగి 108 అంబులెన్సుకు ఫోన్ చేస్తే ఎంతకీ రావడం లేదు. ఇటీవల విజయవాడ నడిబొడ్డున బెంజి సర్కిల్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో యనమలకుదురులో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సుకు ఫోన్ చేస్తే ఎంతకీ రాలేదు. దీంతో క్షతగాత్రులను ప్రైవేటు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు విజయవాడలో రాఘవయ్య పార్కు సమీపంలో వారం క్రితం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. 108కు ఫోన్ చేస్తే అరగంట దాటినా రాలేదు. దీంతో గాయపడిన వ్యక్తిని ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డునే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం 108 వాహనాల దుస్థితి ఇలా.. - సమయానికి ఇంజన్ ఆయిల్ మార్చకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. - హెడ్లైట్సు లేకపోవడంతో రాత్రిపూట కొన్ని వాహనాలు తిరగలేకపోతున్నాయి.. ప్రమాదానికి కూడా గురవుతున్నాయి. - అతిముఖ్యమైన సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్ పనిచేయకుండానే వాహనాలు తిరుగుతున్నాయి. - టైర్లు పూర్తిగా అరిగిపోవడంతో ఎప్పుడు ఆగిపోతాయో తెలియడం లేదు. - స్టెఫ్నీ టైర్లు లేకపోవడంతో వాహనాలు ఆగిపోతే ఇబ్బంది కలుగుతోంది. - స్టీరింగ్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, డిఫ్రన్షియల్ ఆయిల్, హబ్ గ్రీసింగ్ చేయడం లేదు. - బ్రేక్ప్యాడ్స్, బ్రేక్ బూస్టర్లు, బ్రేక్ లైనింగ్స్, బ్రేక్ ఆయిల్‌ను మార్చకపోవడం వల్ల బ్రేకులు పనిచేయడం లేదు. - వర్షం పడితే అంబులెన్సులోకి నీరు కారడంతో పేషెంట్లు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. - వాహనాల్లో వైద్య పరికరాల చార్జింగ్కు అవసరమైన చార్జింగ్ పాయింట్లు పనిచేయడం లేదు. - పేషెంట్ కేబిన్‌లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. - చాలా వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేవు. - వాహనాల్లో మల్టీచానెల్ మానిటర్, సెక్షన్ ఆపరేటర్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్స్, పల్సాక్సీ మీటర్లు సరిగా పనిచేయడం లేదు. - బీపీ ఆపరేటర్స్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్లు మరమ్మతులకు గురయితే బాగు చేయడం లేదు. - చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదు. - షుగర్ పరీక్షలకు అవసరమైన గ్లూకోస్ట్రిప్స్, లాన్సెట్లు అందుబాటులో లేవు. - క్షతగాత్రులకు అవసరమైన డ్రెస్సింగ్ ప్యాడ్స్, స్టెరిలైజ్డ్ దూది, అయోడిన్లు కూడా కరువవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో.. - తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పథకాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2007, నవంబర్ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలను పథకం కోసం సమకూర్చారు. - 2009 నాటికే ఈ పథకంపై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు. - 108 అంబులెన్సులు రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న కొన్ని వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరేసేవి. - పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయించేవారు. - 70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులపైనే ఆధారపడేవారు. - ఫోన్ చేసిన అతి కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకునేవి. - 108 వాహనాల్లో అత్యవసర పరికరాలతోపాటు మందులకు, సిబ్బందికి లోటు ఉండేది కాదు. 108 పథకాన్ని నిర్వీర్యం చేశారు 2014 తర్వాత 108 అంబులెన్సుల పథకం నిర్వీర్యమైంది. పూర్తిగా ప్రైవేటు సంస్థల అజమాయిషీలోకి వెళ్లింది. ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. చివరకు పథకాన్ని ఏ దశకు తెచ్చారంటే ఏకంగా ప్రైవేటు అంబులెన్సులను తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేఖ ఇస్తే.. అంబులెన్సులు పెరుగుతాయి కదా అని అంటున్నారు. ప్రైవేటు అంబులెన్సులను తెరమీదకు తెచ్చి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని మరుగునపడేసేందుకు ఈ జీవోను తెచ్చారు. రాష్ట్రంలో 108 అంబులెన్సుల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. –కిరణ్‌కుమార్, అధ్యక్షుడు, 108 ఉద్యోగుల సంఘం గతంలో కంటే పరిస్థితి మెరుగైంది గతంతో పోల్చితే అంబులెన్సుల పరిస్థితి బాగా మెరుగైంది. కొత్తగా 32 అంబులెన్సులను కొనుగోలు చేశాం. మరో 12 వాహనాలు కొత్తవి వస్తాయి. పాత వాటిని తీసేసి వీటి సేవలను అందుబాటులోకి తెస్తాం. అంతేకాకుండా ప్రైవేటు అంబులెన్సులతో ఎంవోయూ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ 100 వరకు ప్రైవేటు అంబులెన్సులు ఎంవోయూ చేసుకున్నాయి. ఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకునే నేపథ్యంలో ఒక అంబులెన్సు నుంచి మరో అంబులెన్సుకు కాల్ డైవర్ట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. –డా.రాజేంద్రప్రసాద్, నోడల్ అధికారి, 108 పథకం తిరగకపోయినా తిరిగినట్టు.. రాష్ట్రం మొత్తం మీద 108 వాహనాలు 439 ఉన్నాయి. అందులో రోజూ రోడ్డు మీద తిరుగుతున్నవి తక్కువగా ఉంటున్నాయి. వివిధ కారణాలతో సగటున రోజూ 70 నుంచి 80 వాహనాలు నిలిచిపోతున్నాయి. కానీ సీఎం కోర్ డ్యాష్ బోర్డులో 96 శాతం వాహనాలు తిరుగుతున్నట్టు చూపిస్తున్నారు. కోర్ డ్యాష్ బోర్డులో ఉన్న లెక్కల ప్రకారమే వాహనాలకు బిల్లుల చెల్లింపు కూడా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే.. రోజుకు 80కి పైగా వాహనాలు మూలన పడి ఉన్నా వాటిని తిరిగినట్టు చూపించి బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలింది. ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం మా మనవరాలు తిరుపతమ్మకి నొప్పులొస్తుంటే 108కు ఫోన్ చేశాం. చాలాసేపు వేచిచూసినా రాకపోయేసరికి ఏమిచేయాలో పాలుపోక నొప్పులతో అల్లాడుతున్న నా మనవరాలిని ఆటోలో ప్రత్తిపాడుకు తీసుకెళ్లాం. – నల్లబోతుల ఏసమ్మ, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా నా చేతుల్లోనే ప్రాణం విడిచారు.. చిత్తూరులో మేము అద్దెకుంటున్న ఇంటి యజమాని గోపాల్ గుండెపోటు వచ్చి బాత్రూమ్లో పడిపోయారు. వెంటనే 108కు ఫోన్ చేశాను. అర్ధ గంటపాటు వేచిచూసినా రాలేదు. దీంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాను. అయినా ఫలితం దక్కలేదు. నా చేతుల్లోనే ఆయన ప్రాణం విడిచారు. 10 నిముషాల ముందు వచ్చి ఉంటే ఆయన బతికుండేవారని డాక్టర్లు చెప్పారు. ఇలాగైతే 108పై నమ్మకం ఎలా ఉంటుంది? – ప్రభు, చిత్తూరు నగరం వైఫల్యాలను ప్రైవేటు సంస్థపై నెట్టేసి.. ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టింది ప్రభుత్వమే. ఇప్పుడు తన వైఫల్యాలను ప్రైవేటు సంస్థపై నెట్టేస్తోంది. బీవీజీ సంస్థ 108 నిర్వహణా బాధ్యతలు చూస్తోంది. ఈ సంస్థ 108 పథకాన్ని సరిగా నిర్వహించడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు వివిధ కారణాలతో వాహనాలు ఆగిపోతున్నాయని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీవీజీ సంస్థ వాపోతోంది. మరోవైపు ఉద్యోగులేమో 108 వాహనం బాధితుడిని తీసుకురావడానికి ఘటనా స్థలికి వెళ్లేవరకూ అనుమానమేనని చెబుతున్నారు. సకాలంలో పథకానికి నిధులు చెల్లించకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాహనాలకు మరమ్మతులు చేయించకపోవడంతో రోజూ కనీసం వంద వాహనాలు మూలనే పడి ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రైవేటుకు అంబులెన్సులు పథకం దారుణంగా నిర్వీర్యమవడంతో తాజాగా ప్రైవేటు అంబులెన్సులకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018, నవంబర్ 20న దీనికోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 108 అంబులెన్సులు కొనసాగించడానికి ఆసక్తి ఉంటే ప్రైవేటు అంబులెన్సులకు కూడా అవకాశం కల్పిస్తారు. డిజిటల్ పూల్ పేరుతో ప్రైవేటు అంబులెన్సులకు ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇకపై కొత్త 108 అంబులెన్సులను కొనుగోలు చేయకుండా ఇలా ప్రైవేటు అంబులెన్సులకు అవకాశం కల్పిస్తున్నారని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక విధంగా ప్రైవేటుకు సేవలు ఇవ్వడమంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని అంటున్నాయి. -
108 నిర్లక్ష్యంతో మహిళ మృతి
మదనపల్లె టౌన్: 108కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఓ పేద మహిళ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులో నివాసం ఉంటున్న బి.రేణుక(35) కుటుంబ కలహాల కారణంగా భర్త ప్రసాద్ నుంచి విడిపోయింది. కొత్తిమీర విక్రయించుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. 108కు ఫోన్ చేశారు. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రేణుక వద్ద ఆటోలో వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో స్థానికులు కొత్తిమీర అమ్ముకునేందుకు వినియోగించే తోపుడు బండిపైనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. -
బిల్డింగ్ పైకి ఎక్కిన 108 ఉద్యోగి
-
క్షమించండి.. 108 లేదు!
శ్రీకాకుళం, రాజాం: మంగళవారం సాయంత్రం 5.30 గంటలు.. రాజాంలోని బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలుపరస్పరం ఢీకొన్నాయి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు..ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనచోదకులు స్పందించి క్షతగాత్రులను పక్కకు తీసి 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. 108 వాహనం అందుబాటులో లేదని, ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించాలని ఉచిత సలహా చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. మరోవ్యక్తి ఫోన్ చేసినా అదే సమాధానం రావడం గమనార్హం. ఇదీ రాజాం పట్టణానికి కిలోమీటరున్నర దూరంలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటన వద్ద చోటుచేసుకున్న పరిస్థితి. బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో సాలూరు వైపు ద్విచక్రవాహనంతో వెళ్తున్న భార్యాభర్తలు, అటునుంచి రాజాం వస్తున్న మల్లికార్జున కాలనీకి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనాలతో పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో మల్లికార్జున కాలనీకి చెందిన యువకుడితో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 రాకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజాం పోలీసులు కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.