ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ | AP CM Promises To 108 Employees Strike Retirement | Sakshi
Sakshi News home page

ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ

Published Thu, Jul 25 2019 9:42 PM | Last Updated on Fri, Jul 26 2019 8:28 AM

AP CM Promises To 108 Employees Strike Retirement - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగుల చేస్తున్న సమ్మెను విరమించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు 108 సిబ్బంది ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సిబ్బంది తమ సమస్యలను వివరించారు. 108ను ప్రభుత్వమే నిర్వహించడమే సహా అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎంకు విన్నవించుకున్నారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక పాలసీ రూపొందించి త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గురువారం రాత్రి నుంచే 108 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement