తిరువనంతపురం: మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర చికిత్స అవసరమైనా ఫోన్ కొట్టగానే క్షణాల్లో ముందుకొస్తుంది అంబులెన్స్. అందులో పని చేసే సిబ్బంది ఎలాంటి ఆపత్కర పరిస్థితిలోనైనా మేమున్నామంటూ ముందుకొచ్చి సాయం చేస్తుంటారు. దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని చేధించుకుని ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తారు. అయితే అలాంటి అంబులెన్స్ సిబ్బందికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారట జనాలు. వారిని దగ్గరకు కూడా రానీయకుండా వివక్ష చూపుతున్నారట. ఈ దయనీయ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో పనిచేసే సిబ్బంది, సాంకేతిక నిపుణులు వారి పరిస్థితి గురించి మాట్లాడుతూ.. తినుబండారాలు, దుకాణాల దగ్గర తమ నీడ కూడా పడనివ్వట్లేదని, కనీసం మంచినీళ్ల బాటిల్స్ కూడా అమ్మట్లేదని వాపోయారు. (అక్కడ పరిస్థితి సీరియస్)
వ్యాధిగ్రస్తులను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లే మాకు కూడా జబ్బులు అంటుకుంటాయన్న భ్రమతోనే తమని దూరం పెడుతూ వివక్ష చూపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కరోనా కాలంలోనూ నిరంతరాయంగా సేవలందిస్తున్న తమకు దుకాణదారులు నీళ్లబాటిళ్లు అమ్మడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు. తినడానికి రెస్టారెంట్‌కు వెళితే అక్కడ నుంచి మమ్మల్ని తరిమేశారని ఘోర అనుభవాలను వెల్లడించారు. టీ స్టాల్‌కు వెళితే అక్కడున్న పెద్ద మనిషి టీ అయిపోయిందంటూ అబద్ధం చెప్తూనే మరోవైపు ఇతరులకు టీ అందించాడని, అది చూశాక తాము అక్కడ నుంచి నిష్క్రమించామని చెప్పుకొచ్చారు. ఇక కరోనా విలయ తాండవం నుంచి రక్షించుకునేందుకు ప్రభుత్వం తమకు పీపీఈ కిట్లను అందించిందని పేర్కొన్నారు. గత వారం ఇంటికి వెళ్లేందుకు ఒకసారే అవకాశం దొరికిందని, కానీ ఇంటి బయట గేటు దగ్గరే నిల్చుని టీ తాగి, చుట్టుపక్కల వారు చూడకముందే అక్కడ నుంచి నిష్ర్కమించానని అంబులెన్స్‌లో పనిచేసే ఓ ఉద్యోగి చెప్పుకొచ్చారు. కాగా అంబులెన్స్‌లో ఒక డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. వీరికి రోజుకు 12 గంటల డ్యూటీ ఉంటుంది. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా)
Comments
Please login to add a commentAdd a comment