ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment