108 సిబ్బందికి కమిషనర్‌ అభినందన | Katamaneni Bhaskar especially appreciated to 108 staff | Sakshi
Sakshi News home page

108 సిబ్బందికి కమిషనర్‌ అభినందన

Nov 10 2021 5:15 AM | Updated on Nov 10 2021 5:15 AM

Katamaneni Bhaskar especially appreciated to 108 staff - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: అంబులెన్స్‌ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్‌ఎం, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్‌సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్‌ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement