సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా(30) ఈ నెల 12న మగ శిశువు కు జన్మనిచ్చింది. మొదటి కాన్పు కావటంతో కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సిజరియన్ చేసిన తర్వాత ఐసియుసిలో ఉంచారు.
వాస్తవానికి ఏడు రోజులకు డిశ్చార్జ్ చేయవలసి ఉండగా సర్జరీ వల్ల కుట్లు మానకపోవటంతో వైద్యులు మరోసారి కుట్లు వేస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో మరోసారి సర్జరీ, కుట్లు అతుక్కోపోవడంతో మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు.
చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది
Comments
Please login to add a commentAdd a comment