doctor negligence
-
వీడియో: వైద్యుడి రీల్స్ పిచ్చి.. ఆసుపత్రిలో మహిళ మృతి
లక్నో: ఓ వైద్యుడి రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలను తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను రక్షించాల్సిన వైద్యులు సోషల్ మీడియా చూస్తూ బిజీగా ఉండటంతో సదరు మహిళ చనిపోయింది. సరైన సమయంలో వైద్యుడు స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోకి మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి(60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్ ఆదర్శ్ సెంగార్ డ్యూటీలో ఉన్నారు. దీంతో, బాధితులు ఆదర్శ్‌ను సంప్రదించారు. దీంతో, ఓ నర్సును బాధితురాలి వద్దకు పంపి.. డాక్టర్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.ప్రవేశ్ కుమారి మృతి చెందడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఆస్పత్రికి సిబ్బందికి, వారికి మధ్య వివాదం నెలకొంది. వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్ రీల్స్ చూస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ తల్లికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.At the #Mainpuri district hospital in #UttarPradesh, a 60-year-old woman, #PraveshKumari, died of a heart attack while the doctor on duty, #DrAdarshSanger, allegedly watched reels on his mobile phone.The woman's family claims that crucial time was lost due to the doctor's… pic.twitter.com/ZGLcD5ZExg— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2025 -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
సంతాన ‘వైఫల్య చికిత్స’?
తుమకూరు: ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఒక మహిళ హఠాత్తుగా మరణించగా వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల క్రితం అరుణ్ అనే వ్యక్తితో మానస (30)కు వివాహం జరిగింది. ఆమె తుమకూరులోని విశ్వవిద్యాలయంలో గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. సంతానం కలగకపోవడంతో మానస తుమకూరు మహాలక్ష్మినగరలో చిన్మయ నర్సింగ్ హోంలోని ఫెర్టిలిటీ సెంటర్లో నెలన్నర రోజులుగా చికిత్స పొందుతోంది. గర్భాశయంలో 3 గ్రాముల గడ్డ ఉందని, దాన్ని ఆపరేషన్ చేసి తీయాలని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈనెల 1న ఆపరేషన్ చేయించేందుకు ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2వ తేదీన బెంగళూరుకు చెందిన డాక్టర్ శశికళ ఆపరేషన్ చేస్తుండగా మానస మృతి చెందింది. మానస చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తుమకూరు కొత్తలేఔట్ పోలీసు స్టేషన్లో మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. -
నా భార్య.. బిడ్డ కావాలంటోంది
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ‘‘నా భార్య బిడ్డ కావాలంటొంది.. మాకు ఏడేళ్ల తర్వాత బిడ్డ పుడుతుందనుకుంటే కడుపులోనే చంపేసి చేతికిచ్చారు’’ అని బుధవారం కామారెడ్డి ఆస్పత్రిలో మృతి చెందిన శిశువు తండ్రి రమేష్ వైద్యులు, పోలీసులు ఎదుట వాపోయాడు. ఆస్పత్రిలో బుధవారం రాత్రి శిశువు మృతి చెందిన సంఘటనలో గురువారం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ప్రసవం గది ముందు ఆందోళన చేశారు. అక్కడే నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి బయట ధర్నా చేశారు. పోలీసులు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. గైనిక్ వైద్యురాలు పట్టించుకోకపోవడం, నర్సులు నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంవో కాళ్లు మొక్కి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చదవండి: శుభకార్యానికి వచ్చి .. భర్తకు పూటుగా మద్యం తాగించి.. ఆతర్వాత -
బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా(30) ఈ నెల 12న మగ శిశువు కు జన్మనిచ్చింది. మొదటి కాన్పు కావటంతో కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సిజరియన్ చేసిన తర్వాత ఐసియుసిలో ఉంచారు. వాస్తవానికి ఏడు రోజులకు డిశ్చార్జ్ చేయవలసి ఉండగా సర్జరీ వల్ల కుట్లు మానకపోవటంతో వైద్యులు మరోసారి కుట్లు వేస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో మరోసారి సర్జరీ, కుట్లు అతుక్కోపోవడంతో మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
సిబ్బంది నిర్వాకం.. చెకప్‌కు వస్తే పొట్టకోసి ఓ బిడ్డను చంపేశారు.. మరో బిడ్డేమో...
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడాది జూన్ 21న ఒకరికి చేయాల్సిన శస్త్రచికిత్స మరొకరికి చేసిన ఘటనకు సంబంధించి మంగళవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులు విచారణ జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణి కేస్‌షీట్ ఆధారంగా సాధారణ చికిత్స కోసం వచ్చిన వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన 7 నెలల గర్భిణి మాలతి పొట్ట కోసిన విషయం విధితమే. బాధితురాలి కడుపులో కవలలు ఉండగా, ఒక శిశువు బాగాలేదని తెలిసి వైద్యం కోసం వచ్చింది. సర్వీస్ స్టిచెస్ వేస్తే ఇబ్బంది ఉండదని చెప్పిన వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డెలివరీకి వచ్చిన గర్భిణికి సంబంధించిన కేస్‌షీట్ ఆధారంగా మాలతికి సర్జరీ చేసేందుకు పొట్ట కోశారు. అప్పటికే మాలతి అరుస్తూ తాను డెలివరీ కోసం రాలేదని, సర్వీస్ స్టిచెస్ కోసం వచ్చానని చెప్పడంతో తప్పును తెలుసుకొని, తిరిగి కుట్లు వేశారు. దీంతో మాలతి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు పోలీసులను ఆశ్రయించారు.కలెక్టర్ ఆదేశాలతో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల స్థానిక వైద్యులచే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు బాధ్యురాలిగా స్టాఫ్‌నర్సు మాధవిని తేల్చి, సస్పెండ్ చేశారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాబును కోల్పోయామని మరో బాబు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండటం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను వదిలి నర్సుపై చేపట్టిన చర్యలపట్ల సంతృప్తి చెందని బాధితురాలి బంధువులు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ను, హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చదవండి: కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి వారి ఫిర్యాదుతో జిల్లా ఆస్పత్రికి చేరుకున్న కమిషనర్ కార్యాలయ అధికారులు జరిగిన ఘటనపై డాక్టర్లు, నర్సులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అయితే అసలు దోషులకు శిక్షపడేలా చూడాలని మాలతి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
విషాదం: పురుడు పోశారు.. ప్రాణం తీశారు..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి పరిశీలించి సాధారణ ప్రసవం అవుతుందని వేచిచూశారు. రాత్రి 11గంటల వరకు వేచి చూసినా ప్రసవం జరగకపోవడం.. పురిటి నొప్పులు తీవ్రం కావడం.. అనూష కన్నీరు పెట్టడంతో కుటుంబసభ్యులు ఆపరేషన్ చేయాలని వైద్య సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో వైద్యులు 11 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సిజేరియన్ చేసి పండంటి బాబుకు పురుడుపోశారు. బాలింతను పట్టని వైద్య సిబ్బంది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే అనూష పాలిట శాపంగా మారింది. పురుడు పోసిన వైద్యులు.. అనంతరం పట్టించుకోకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. తీవ్ర రక్తస్రావం అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. తీరా అర్ధరాత్రి దాటాక గమనించే సరికి అనూష పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులకు తెలపకుండానే వైద్య సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు గమనించి నిలదీయగా.. జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. అందరూ కలిసి అనూషను కరీంనగర్‌కు తీసుకెళ్లేసరికి అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మృతదేహంతో పెద్దపల్లి ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనూష చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను సస్పెండ్ చేయాలంటూ.. విషయం తెలుసుకున్న అనూష బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అనూషకు ఆపరేషన్ చేసి నిర్లక్ష్యం చేసిన వైద్యులు రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి, స్టాఫ్‌నర్స్ నిర్మలతను సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కుమార్ గౌడ్, స్వామి వివేక్ పటేల్, శ్రావణ్ దిలీప్, అశోక్, కృష్ణ, పెద్దబొంకూర్ సర్పంచ్ మానస, ముత్తారం సర్పంచ్ కుమారస్వామి, మిట్టపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు రాజేష్, మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూష మృతిపై చేపట్టిన విచారణ ప్రాథమిక నివేదికను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవ రెడ్డి కలెక్టర్ సంగీతకు అందించారు. అయితే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వైద్యుడిని నియమించారు. అనూషకు భర్త శ్రీకాంత్, కూతురు ఉంది. మృతురాలి అత్త స్వరూప ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. చదవండి: Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..? -
చిన్నారి ప్రాణం విలువ రూ.60వేలు?
మహబూబ్‌నగర్, నారాయణపేట: జ్వరం భారిన పడి వైద్యం కోసం వస్త వైద్యుడి నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణం పోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా.. రూ.60వేలు అందిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఆన్పూర్కు చెందిన సాబెన్న మూడేళ్ల కుమార్తె భూమిక మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్వరం, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి ఆ చిన్నారి కదలకపోవడంతో వైద్య సిబ్బందిని సంప్రదించారు. వారు వెంటనే వైద్యుడికి సమాచారం ఇవ్వగా, ఆయన వచ్చి పరీక్షించి బాలిక పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలిన సూచించారు. 4 నుంచి 5 గంటల మధ్యలో అంబులెన్స్‌లో హైదరాబాద్ బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లాక మార్గమధ్యలోనే చిన్నారి మృతిచెందింది. దీంతో వెనుదిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రాణం ఖరీదు రూ. 60 వేలు?! వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబీకులు రెండుగంటల పాటు వైద్యుడితో వాదనకు దిగారు. వారి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిదాటే సమయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇరువురిని సముదాయించారు. ఆటు వైద్యుడితో.. ఇటు చిన్నారి తండ్రితో పాటు బంధువులను కూర్చోబెట్టి శాంతింపజేశారు. వైద్యుడి అందించిన చికిత్సలపై వారు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టుబట్టారు. అయితే, తనవల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, మీరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుపెట్టుకోవచ్చని, ఏదైనా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులు తెలుస్తుందని వైద్యుడు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించి తండ్రి హన్మంతుతో పాటు మరో వ్యక్తిని వైద్యుడి వద్దకు పంపించారు. చివరకు వైద్యుడు రూ.60 వేలు చెల్లిస్తానని ఒప్పుకోవడంతో మా పాప ప్రాణామే పొయింది.. నా బిడ్డ ప్రాణం ఖరీదు రూ.60వేలా అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నారి మృతదేహాన్ని తీసుకొని కర్ణాటకలోని అన్పూర్కు వెనుదిరిగి వెళ్లిపోయారు. మా నిర్లక్ష్యం ఏమీ లేదు చిన్నారి మృతి చెందడంలో తమ ఆస్పత్రి నిర్లక్ష్యం ఏమీ లేదు. రాత్రి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా బాగానే ఉంది. తెల్లవారుజామున కదలడంలేదని చెప్పడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించా. మధ్యలోనే మృతిచెందడంతో ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. తమ తప్పులేదని చెప్పాం. అయినా న్యాయం చేయాలని కోరారు. అడ్మిట్, అంబులెన్స్ ఖర్చులు ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకున్నాం. – డాక్టర్ రంజిత్‌కుమార్,చిన్నపిల్లల వైద్యుడు, నారాయణపేట ఆందోళన...వైద్యుడితో వాదన ఉదయం 6గంటలకు చిన్నారి మృతదేహంతో సదరు ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణం పోయిందంటూ వైద్యుడితో వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగిన వారిని శాంతిపజేశారు. -
బతికున్న మనిషిని చంపేశారు.. కానీ
రాంచీ : కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోహర్దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్‌కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ తర్వాత అతడికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. -
తల్లి గర్భంలో చిక్కుకున్న శిశువు తల
కర్నూలు,బొమ్మలసత్రం: ఏడు నెలల మృత శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో శరీర భాగాలు రెండుగా విడిపోయాయి. తల భాగం తల్లి గర్భంలోనే చిక్కుకుపోయింది. ఈ ఘటన మంగళవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి, ఏసురాజు దంపతులు. శ్రీలక్ష్మికి మొదటి కాన్పులో ఆరు నెలలకే ప్రసవం జరిగి శిశువును కోల్పోయింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మంగళవారం ఉదయం కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గడివేముల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఉమ్ము నీరు పోయి శిశువు కాళ్లు బయటకు రావడాన్ని వైద్యులు గమనించి.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇక్కడి వైద్యులు శిశువును గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో తల భాగం లోపల చిక్కుకుపోయింది. పరిస్థితి విషమించటంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది.. శరీరం పాచిపోవటం వల్ల విడిపోయి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కాగా..తాము ఆసుపత్రికి వచ్చే వరకు శిశువు బతికే ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
పసికందు ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం!
బొమ్మలసత్రం: వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణం తీసింది. తల్లికి కడుపుకోత మిగిల్చింది.అలస్యంగా వెలుగుచూసిన ఈ విషాద సంఘటన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల వివరాల మేరకు.. గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి ఖాజాహుస్సేన్‌కు గతేడాది ఏప్రిల్‌లో శిరివెళ్ల మండలం వనికిన్‌దిన్నె గ్రామానికి చెందిన షేక్ సోనితో వివాహమైంది. ఈయన మిలటరీలో ఎ సీసీ ఆఫీసర్ కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యకు నెలలు నిండటంతో ఇటీవల పుట్టింటికి పంపాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో తల్లిదండ్రులు స్థానిక శిరివెళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. కడుపులో బిడ్డ 3 కేజీలకు పైగా ఉండటంతో సాధారణ కాన్పుకు ఇబ్బందిగా మారింది. సమస్య తీవ్రతను బట్టి వెంటనే సిజెరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన వైద్యులు తాత్సారం చేశారు. శనివారం ఉదయం 12 గంటలకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఉమ్మునీరు తాగటంతో బిడ్డ పరిస్థితి కాస్త విషమంగా ఉందని మొదట చెప్పిన వైద్యులు.. సాయంత్రం 4 గంటల సమయంలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చేర్పించినప్పుడే వైద్యులు స్పందించి కాన్పు చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని..దీనికి వారి నిర్లక్ష్యమే కారణమని ఖాజాహుస్సేన్ ఆరోపిస్తూ ఆదివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని సోని బంధువులు ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. సంఘటనపై విచారణ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందాడని ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆర్ఎంఓ శేషారత్నం వెల్లడించారు.–శేషారత్నం, ఆర్ఎంఓ -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, వైఎస్సార్: కడప నగరంలోని వంశీ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ఆదివారం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వారి బంధువులు డాక్టరు నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే చిన్నారి మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం కాస్త పెద్దది కావడంతో డాక్టర్ వంశీధర్ ఆసుపత్రికి తాళాలు వేసి పరారయ్యాడు. -
ఆ చిన్నారుల మృతికి అతను కారణం కాదు
లక్నో: విధుల్లో నిర్లక్ష్యం వహించి 60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారనే నెపంతో జైలు శిక్ష అనుభవించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునికి భారీ ఊరట లభించింది. రెండేళ్ల అనంతరం అందులో ఆ వైద్యుని తప్పేమీ లేదని విచారణ కమిటీ తేల్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బీఆర్డీ కాలేజ్‌లో 2017 ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో 60 మందికి పైగా చిన్నారులు మరణించారు. అయితే ఇందుకు చిల్ట్రన్స్ డాక్టర్ కఫీల్ ఖాన్ నిర్లక్ష్యమే కారణమని భావించి అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తొమ్మిది నెలల పాటు జైలులో గడిపిన అనంతరం కఫీల్ ఖాన్‌కు ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. కఫీల్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనలో అతని నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని తెలిపింది. అతనిపై ఉన్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ హిమాన్ష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కఫీల్ స్పందిస్తూ.. తను హంతకుడనే ముద్ర తొలగిపోయిందని అన్నారు. ఆక్సిజన్ అందక మరణించిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం వేచిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. Those parents who lost their infants are still waiting for the justice.I demand that government should apologize and give compensation to the victim families.@PTI_News @TimesNow @myogiadityanath @narendramodi @ndtv @ravishndtv @abhisar_sharma @yadavakhilesh @RahulGandhi @UN pic.twitter.com/WaTwQSCUuZ — Dr kafeel khan (@drkafeelkhan) September 27, 2019 -
ప్రగతి భవన్... కుక్క... ఓ కేసు
సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల హస్కీ పరిస్థితి విషమించడంతో ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ ఆసిఫ్ అలీఖాన్ గురువారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే వైద్యుడు ట్రీట్మెంట్ చేస్తుండగానే కుక్క మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే కుక్క మృతి చెందిందని ఆసిఫ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్: సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. కుక్కపిల్ల మృతికి కారణమైన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిర్లక్ష్యం వహించిన వెటర్నరీ వైద్యుడిపై కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు... బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్ అలీఖాన్ ఐదేళ్లుగా ప్రగతి భవన్ డాగ్ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10న 11 నెలల హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యమందించారు. కుక్క కొద్దిగా కోలుకుంది. సాయంత్రం 6గంటలకు మళ్లీ కుక్క అనారోగ్యానికి గురై తిండి మానేసింది. ఈ నెల 11న ఉదయం 7గంటలకు పాలు కూడా తాగకుండా తీవ్ర అస్వస్ధతకు గురైంది. వెంటనే ఆయన రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు అక్కడకు వచ్చిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా కుక్క 101 టెంపరేచర్ జ్వరంతో బాధపడుతుండడంతో లివర్ టానిక్ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్ధితి మరింత విషమించింది. దీంతో రాత్రి 9గంటలకు రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్ రంజిత్‌కు చూపించాడు. ఆయన ట్రీట్మెంట్ ఇస్తుండగానే కుక్క చనిపోయింది. డాక్టర్ రంజిత్ నిర్లక్ష్యంతోనే కుక్క చనిపోయిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అలీఖాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా అభం..శుభం.. తెలియని ఆరేళ్ల బాలిక శాశ్వత వికలాంగురాలిగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ప్రతాప్ నాయక్ అనే ఓ వైద్యుడు బోథ్ సివిల్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ ఇచ్చోడలో ప్రైవేట్ క్లీనిక్ నడుపుతున్నాడు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కళ్యాణ్కర్ బాబు కూతురు సారిక నాలుగునెలల క్రితం ఇంట్లో ఆడుకుంటూ పడిపోయింది. దీంతో చేయి వా పురావడంతో మండల కేంద్రంలో ఉన్న ప్రతాప్ నాయక్ క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. సారికకు ఎక్స్‌రే తీయించి చేతికి ఉన్న బొక్క విరిగిపోయిందని, సిమెంట్ పట్టి కట్టి పంపించాడు. నాలుగైదు రోజుల తర్వాత బాలిక చేయి వాచిపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. సిమెంట్ పట్టి తొలగించి చూస్తే చేయి పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో బాధితులు డాక్టర్‌ను నిలదీశారు. వైద్యఖర్చులు తానే ఇస్తానని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అయినా చేయి నయం కాకపోగా మరింత ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో హైదరాబాద్‌కు పంపించి అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారంరోజుల పాటు చికిత్స చేయించాడు. అక్కడి వైద్యులు చేయి నయం కాదని, తిరిగి వెళ్లిపోవాలని తిప్పిపంపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రతాప్ నాయక్‌ను మరోసారి నిలదీశారు. దీంతో సదరు వైద్యుడు జరిగిన పరిణామానికి పూర్తి బాధ్యత వహిస్తూ పాప కోలుకునేంత వరకు తానే ఖర్చులు భరిస్తానని ఒప్పంద పత్రం రాసిచ్చాడు. రోజురోజు కు పాప చేయి క్షీణించిపోయి వంకర్లు తిరుగుతుండడంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు రిమ్స్ వైద్యులను సంప్రదించారు. అప్పటికే 60 శాతం మేర చేయి పనికిరాకుండా పోయిందని, భవిష్యత్‌లో చేయి కొట్టివేసే పరిస్థితి కూడా రావచ్చని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు డాక్టర్ ప్రతా ప్ నాయక్‌ను మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నిలదీయడానికి ప్రయత్నించారు. అతని అనుచరుడు డాక్టర్‌ను కలవకుండా చేసి దిక్కున్నచోట చెప్పుకొమ్మని వారిని ఆసుపత్రి నుంచి గెంటివేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వైద్యుడు ప్రతాప్‌నాయక్, అతని అనుచరుడు గణేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. తమ కూతురుకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. -
చికిత్స పొందుతూ బాలుడి మృతి
మెదక్, జహీరాబాద్ టౌన్: చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు, బీజేపీ నాయకులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. బాలుడికి వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్యనగర్‌కు చెందిన విజయ్ (ఆటో డ్రైవర్) తన 11 నెల బాబు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ హనీఫ్ బాలుడికి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమించి కొద్ది సేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు, బీజేపీ నాయకులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. డాక్టర్ హనీఫ్ బాబుకు సరైన వైద్యం అందిచనందున మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో మతాలు, కులాల పరంగా వైద్యం సేవలు అందిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ ఉద్ధేశ పూర్వకంగా బాబుకు సరైన చికిత్స అందిచకపోవడంతో చనిపోయాడని బీజేపీ నాయకుడు పూల సంతోష్ ఆరోపించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కూడా లేవని, సీరియస్ పేషంట్లకు వైద్యం అందించకుండా హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారని వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ గణపతి జాదవ్, జహీరాబాద్ టౌన్ సీఐ. సైదేశ్వర్, ఎస్ఐ. వెంకటేశం ఆస్పత్రిని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఘటనపై డీఎస్పీ గణపతి జాదవ్ మాట్లాడుతూ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడం బాధకరమైన విషయమన్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు దర్యాప్తు చేస్తామన్నారు. ఇలా ఉండగా బాలుడికి వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని డాక్టర్ హనీఫ్ పేర్కొన్నారు. బాలుడు ఆస్పత్రికి వచ్చేసరికి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన సేవలను అందించామన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
-
రిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. రోగికి గడువు ముగిసిన సెలైన్
ఒంగోలు సెంట్రల్: స్థానిక రిమ్స్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి గడువు ముగిసిన సెలైన్‌ను రోగికి ఎక్కించారు. రోగి తరుపు వారు ఈ విషయాన్ని గుర్తించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు దానిని మార్చివేశారు. ఈతముక్కలకు చెందిన జి. శ్రీను అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన కడుపునొప్పితో బాధపడుతూ రిమ్స్‌లో వైద్య చికిత్స నిమిత్తం చేరాడు. పరీక్షించిన వైద్యులు రోగిని చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేర్చారు. అయితే వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ ఇంజెక్షన్‌ను రోగికి ఎక్కిస్తున్నారు. బుధవారం రోగి తరఫు వారు ఈ విషయాన్ని గమనించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. దీంతో వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్‌ను తీసిశారు. పక్క వారికి కూడా ఇదే ఇంజెక్షన్లను ఇస్తుండటంతో ఈ విషయాన్ని కూడా వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. -
టీడీపీ అభ్యర్థిపై కేసు.. ఆయనే మా అమ్మ ప్రాణం తీశాడు!
నరసరావుపేట టౌన్ : నిర్లక్ష్యంగా వైద్యంచేసి వృద్ధురాలి మృతికి కారణమైన నరసరావుపేట అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై కేసు నమోదైంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం టూటౌన్ పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు కోరారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన పంపనాతి చిన్నయోగమ్మ (77) గతేడాది నవంబరు 6న ఇంట్లో జారిపడటంతో ఆమె ఎడమకాలు విరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను నరసరావుపేటలో డాక్టర్ అరవిందబాబు నిర్వహిస్తున్న అమూల్య నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అరవిందబాబు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన రెండోరోజే కాలు నలుపుగా మారటంతో తిరిగి ఆస్పత్రికి వచ్చి చూపించారు. అయితే, భయపడాల్సిందేమీలేదని, క్రమంగా తగ్గుతుందని చెప్పి ఇంటికి పంపారు. కాలుకు స్పర్శ లేకపోవటంతో డాక్టర్ కోర్సు చదువుతున్న చిన్నయోగమ్మ మనవడు ఇది గమనించి వైద్యుడిని కలిసి నిర్లక్ష్యంపై ప్రశ్నించగా డాక్టర్ అరవిందబాబు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అతడిపై రెండు నెలల క్రితమే టూటౌన్ పోలీసుస్టేషన్లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే, అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అనంతరం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కాలు తొలగిస్తేనే యోగమ్మ బతుకుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే మృతికి కారణం డాక్టర్ అరవిందబాబు నిర్లక్ష్యంవల్లే తన తల్లి మృతిచెందిందని ఆమె తనయుడు పంపనాతి వెంకటేశ్వర్లు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బి.ఆదినారాయణ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు వైద్యశాలలోని ఎముకల విభాగ వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ అరవిందబాబుకు ఉన్న రాజకీయ పలుకుబడితో చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని బాధితులు వాపోయారు. కాగా, దీనిపై సీఐ ఆదినారాయణ మాట్లాడుతూ.. మృతురాలి కుమారుడు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం..2నెలల చిన్నారి మృతి
-
వెంటిలేటర్ మీరే తెచ్చుకోండి!
సాగర్: కాలిన గాయాలతో వచ్చిన చిన్నారికి సకాలంలో చికిత్స అందించకపోగా, వెంటిలేటర్‌ను ఆమె తల్లిదండ్రులే ఏర్పాటు చేసుకోవాలని సూచించిన వైద్యురాలు సస్పెన్షన్‌కు గురైంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యురాలి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం అన్షికా అహిర్వార్ అనే ఏడాదిన్నర చిన్నారి వేడి నీటి తొట్టిలో పడిపోవడంతో 70 శాతం శరీరానికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను తల్లిదండ్రులు బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. మధ్యాహ్నం సమయంలో అటుగా వచ్చిన డాక్టర్ జ్యోతి రౌత్.. చిన్నారిని వెంటిలేటర్లో ఉంచాలని, ఆసుపత్రిలో ఆ సదుపాయం లేదని తెలిపింది. వారే సొంతంగా వెంటిలేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో చికిత్స జరగకపోవడంతో ఆ చిన్నారి చనిపోయింది. అయితే ఐసీయూ వార్డులో వెంటిలేటర్ ఉందని, చిన్నారిని అక్కడికి తరలించి చికిత్స అందించాల్సిందని డీన్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రౌత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
మారేడుపల్లి : ఛాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. ఈ సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అడ్డగుట్ట వడ్డెర బస్తీకి చెందిన శివకుమార్ (33) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు చైత్ర (6), రితిక్‌సాయి (4) ఉన్నారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పితో పాటు కడుపులో మంటగా ఉందని వెస్ట్ మారేడుపల్లిలోని చెందిన గీతా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి (గీతానర్సింగ్‌హోమ్)కు వచ్చాడు. శివకుమార్‌ను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ స్రవంతి ఈసీజీ పరీక్షల అనంతరం ఇంజక్షన్ ఇచ్చింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే శివకుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రికి తరలివచ్చి వైద్యుల నిర్లక్ష్యంతోనే శివకుమార్ మృతిచెందాడని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్ యాదవ్, మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు, డీఐ పద్మలు మృతుని బంధువులతో చర్చించారు. మృతునికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మృతుని బంధువులతో పాటు స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంజు సుధా ఆస్పత్రిలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నెలల నిండు గర్భిణి మృతి చెందింది. వివరాలు.. హయత్ నగర్‌కు చెందిన గర్భిణి వసంత కడుపు నొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం మంజు సుధా ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ రాంగోపాల్ ఏం ఫరవాలేదు.. అంతా బాగానే ఉందని చెప్పాడు. అప్పటికే కడుపులో ఉన్న శిశువు మృతి చెంది మూడు రోజులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ గుర్తించకపోవడంతో వసంత ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన రాంగోపాల్.. పేషంట్ కండిషన్ క్రిటికల్‌గా ఉందనీ, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడని బంధువులు తెలిపారు. కాగా, ఆస్పత్రి నుంచి జారుకున్న డాక్టర్ స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. రాంగోపాల్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయనీ, ఓ రోగికి హెచ్ఐవీ ఇంజక్షన్ చేసిన నేరంలో ఆయన నిందితుడిగా ఉన్నాడని తెలిసింది. ఇదిలాఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వసంత బంధువులు హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. -
108 వాహనం రాకనే ఆగిన ప్రాణం
శ్రీకాకుళం, కొత్తూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహన సేవలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయకపోగా, పాత వాహనాలతో నెట్టుకు రావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఫలితంగా సకాలంలో సేవలందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మండలంలోని దిమిలి పంచాయతీ పరిధి అమ్మన్నగూడకు చెందిన కందుల ఆఫీస్ (54) శనివారం రాత్రి ఆకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. వెంటనే 108కు ఫోన్ చేయగా, వాహనం మరమ్మతుల్లో ఉందని సమాధానం వచ్చింది. అయినప్పటికీ మరలా పలు దఫాలుగా ఫోన్ చేసినా కాల్ సెంటర్ సిబ్బంది స్పందించ లేదు. చివరకు వైఎస్సార్సీపీ నేత గోళ రామకృష్ణ మరోసారి కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కనీసం ఆల్తి గిరిజన గ్రామంలో ఫీడర్ అంబులెన్స్(టూవీలర్ అంబులెన్స్) పంపించాలని కోరారు. చివరకు మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు ఫీడర్ అంబులెన్స్ పంపించారు. ఇందులో ఆఫీస్‌ను కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆస్పత్రికి చేర్చిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఆస్పత్రి తలుపులు సకాలంలో తీయకపోవడంతోనూ, 108 సిబ్బంది నిర్లక్ష్యంతోనూ మృతి చెందినట్లు అతడి బంధువులు ఆందోళన చేశారు. మృతుడి భార్య నీలమ్మ అనారోగ్యంతో రెణ్నెళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి కుమారులు చిరంజీవి, శేషగిరి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి 108 వాహనాల నిర్వాహణపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతోనే సకాలంలో సేవలందకపోవడంతో ప్రజలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన ఆఫీస్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐటీడీఏ పీవో విచారణ చేపట్టాలని కోరారు. -
చికిత్స కరువు..!
విజయనగరం ఫోర్ట్ : సీతానగరం మండలం చల్లవానివలస గ్రామానికి చెందిన చందాన కృష్ణ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరంతో కేంద్రాస్పత్రిలో చేరాడు. ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో డెంగీ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఈ మూడు రోజుల్లో ఒకసారి మాత్రమే వైద్యులు రోగిని పరీక్షించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వైపు డెంగీ జ్వరం, మరోవైపు వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగి ఆందోళన చెందుతున్నాడు. మూడు రోజులు క్రితం విజయనగరం పట్టణానికి చెందిన తిలారి వేదశ్రీ అనే 6 ఏళ్ల బాలిక జ్వరంతో బాధపడుతూ కేంద్రాస్పత్రికి వస్తే వైద్యులు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇంటికి పంపించేశారు. మరుసటి రోజు జ్వరం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ బాలికను కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు. బాలికను ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికి మృతి చెందింది.ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరికే దాపురించ లేదు. జిల్లా నలుమూలల నుంచి కేంద్రాస్పత్రికి వస్తున్న చాలా మంది రోగులకు ఎదురవుతుంది. జిల్లాలో పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో నలుమూలల నుంచి ఇక్కడికి రోగులు వస్తారు. కానీ ఇక్కడ రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిక్సిత చేయకుండా తప్పించుకోవడానికి, రిఫర్ చేయడానికే వైద్యులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. వీటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జ్వర పీడితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేంద్రాస్పత్రిలో వైద్యులు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సకాలంలో అందని వైద్య సేవలు.. జ్వరాలు రావడం, వైద్యులు పట్టించుకోకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాస్పత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ఓ వైపు వైద్యాధికారులు గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో సంఘటన జరిగినప్పుడు తప్ప పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగం వచ్చి చికిత్స కోసం వచ్చిన వారిలో చాలా మందికి చికిత్స చేసే అవకాశం ఉన్నప్పటికీ రిఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా, ఉన్నతాధికారులు స్పందించడం లేదని వినికిడి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు.. కేంద్రాస్పత్రిలో సకాలంలో వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడే చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వదులుతాయని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రుల యజమాన్యాలు ప్లేట్లెట్లు తగ్గాయని చెబుతూ రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్పించి, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యశాఖ, వైద్యులు అంతగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారిస్తాం.. జ్వర పీడితులకు చికిత్స అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. – కె.సీతారామరాజు, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్. -
గర్భంలోనే పిండం మృతి
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్‌బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్‌కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
‘ఆపరేషన్ పేరుతో మా అమ్మను చంపేశారు’
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : కంటి ఆపరేషన్ చేస్తామని తీసుకెళ్లి మా అమ్మను చంపేశారని, చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కుమారుడు సాయిలు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మృతురాలి కొడుకు సాయిలు మాట్లాడుతూ... కంటివెలుగు పథకంలో భాగంగా దత్తాయపల్లి గ్రామంలో ఈనెల 17న వైద్య శిబిరం నిర్వహించారని, తన తల్లి చెన్నమ్మ పరీక్షల నిమిత్తం శిబిరానికి వెళ్లినట్లు తెలిపారు. కంటి పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయాలంటూ చెప్పి ప్రభుత్వ వాహనంలో కొత్తూరులోని కంటి ఆస్పత్రికి తరలించారని, ఆమెతో పాటు గ్రామంలోని మరికొందరు కూడా వెళ్లినట్లు చెప్పారు. సాయంత్రం అయినా ఆపరేషన్ కోసం వెళ్లి నర్సమ్మ ఇంటికి తిరిగి రాలేదన్నారు. మరుసటిరోజు కొత్తూరు ఆసుపత్రి నుంచి మా ఇంటికి ఇద్దరు వ్యక్తులు చెన్నమ్మ పరిస్థితి విషమంగా ఉందని, షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారన్నారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళితే అప్పటికే చెన్నమ్మ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారని కన్నీరుపెట్టుకున్నాడు. చెన్నమ్మ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చెన్నమ్మ మృతి చెందిందని వాపోయారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘమేశ్వర్, భీమయ్య, సురేష్, జంగయ్య, యాదయ్య ఉన్నారు. -
ప్రాణంతీసిన నిర్లక్ష్య వైద్యం
కొత్తగూడెంరూరల్ : వైద్యం వికటించి న్యాయవాద గుమస్తా మృతి చెందగా..ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇటు లాయర్లు, అటు రాజకీయ నాయకులు ఆందోళనకు దిగడంతో కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాల్వంచ మండలం మంచికంటినగర్‌కు చెందిన అన్నపు సమ్మయ్య (38) కొత్తగూడెంలోని ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయనకు ఆయాసం రావడంతో ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. దీంతో నర్స్ డాక్టర్‌కు ఫోన్లో విషయాన్ని తెలపగా..డాక్టర్ వెంకన్న హెడ్ నర్స్ భారతికి తిరిగి ఫోన్ చేసి డెరిఫ్లిన్, డెకడ్రాన్ ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పారు. అయితే ఒక నర్సింగ్ హోమ్‌లో మేల్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్ శిక్షణ నిమిత్తం ఆస్పత్రికి రాగా..ఆయనను ఇంజెక్షన్ చేయమని హెడ్‌నర్సు సూచించడంతో అతను రెండు ఇంజెక్షన్లు వేశాడు. కాసేపటికే సమ్మయ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ విషయాన్ని సమ్మయ్య భార్య చంద్రకళ తన బంధువులకు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణకు తెలపడంతో..ప్రధాన కార్యదర్శి తోట మల్లేశ్వరరావు, లాయర్లు ఉపేందర్, సునీల్, రాజేష్, అడపాల పార్వతి, సాదిక్‌పాష, మునిగడప వెంకన్న, ఉషారాణి, జియా ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యుడు వెంకన్నతో ఘర్షణ పడ్డారు. ఇంజెక్షన్ చేసిన వినోద్‌ను పిలిపించాలలని పట్టుబట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ జనార్దన్ అక్కడికి వచ్చి లాయర్లు, బాధితులకు సర్దిచెప్పారు. డీఎస్పీ అలీ, సీఐ షుకూర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని..సంబంధిత డాక్టర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. వేర్వేరు చోట్ల ఆందోళన.. లాయర్లు, బంధువులు, మృతుడి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆస్పత్రి వద్ద గంటపాటు ఆందోళన చేశారు. ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలు ఇవ్వాలని, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా..సూపర్‌బజార్ సెంటర్లోకి వచ్చి రోడ్‌పై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్‌పాషాలు కూడా అక్కడే కూర్చుని మద్దతుగా నిలిచారు. అనంతరం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేత వనమా రాఘవ, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, సీపీఎం నేత అన్నవరపు సత్యనారాయణ అక్కడికి చేరుకుని..మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ షుకూర్, టూటౌన్ సీఐ శ్రీనివాసరావులు ఆందోళన విరమించాలని కోరారు. మృతుడి భార్య చంద్రకళకు ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పిస్తామని సూపరింటెండెంట్ జనార్దన్ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కాసుల వెంకట్, అన్వర్‌పాషా, సీపీఐ నాయకులు జమలయ్య, శ్రీనివాసరెడ్డి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈసం రమాదేవి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సందకూరి లక్ష్మి తదితర సీపీఐ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, టూటౌన్ సీఐ సుధాకర్ పాల్గొన్నారు. -
పురిటి నొప్పులతోనే పంపించేస్తున్నారు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పురిటి నొప్పులతో వస్తున్న నిండు గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు లేరని, సరైనా పరీక్షలు లేవని, సీరియస్‌గా ఉందని సాకులు చూపుతూ బలవంతంగా నిజామాబాద్ జిల్లాకు సిఫారసు చేస్తున్నారు. దీంతో అరచేతిలో తల్లి శిశువుల ప్రాణాలు పట్టుకుని అంబులెన్స్‌లలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇటీవల చాలా మంది గర్భిణులు ప్రసవాలైన సంఘటనలు ఉన్నాయి. ఇలా కామారెడ్డి జిల్లా కేంద్ర ఏరియా ఆస్పత్రిలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే బుధవారం రోజున ముగ్గురు గర్భిణులను గెంటేశారు. ఒక్క మంగళవారం రోజే ఏడుగురు గర్భిణులను గెంటేశారు. దీంతో గర్భిణులు, వారి బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేవనే సాకుతో.. బుధవారం రోజున ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన సవిత పురిటి నొప్పులతో ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఇక్కడ సౌక ర్యాలు లేవని, శిశువు బాగా లేదని, నిజామాబాద్‌కు వెళ్లాలని రిఫర్ చేశారు. ఇదే రోజు కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన బోయ సంధ్య అత్తగారైనా సిర్నాపల్లిలో రెగ్యులర్‌గా చూపించుకుంటూ తల్లిగారు ఇక్కడే కావడంతో పురిటి నొప్పులతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడ రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోలేదని మీ ప్రాంత ఆస్పత్రిలో చూపించుకోవాలని రిఫర్ చేసారని సంధ్య తండ్రి భిక్షపతి వాపోయాడు. భిక్కనూరుకు చెందిన ఓ నిండు గర్భిణిని రిఫర్ చేశారు. మంగళవారం రోజున గుర్జాల్తండాకు చెందిన కవిత, అమర్లబండకు చెందిన స్వప్న, యాచారం తండాకు చెందిన అనితతోపాటు మ రో నలుగురు గర్భిణులను బలవంతంగా నిజా మాబాద్‌కు రిఫర్ చేశారు. మంగళవారం గైనిక్ డాక్టర్ విజయలక్ష్మి విధుల్లో లేక రిఫర్లు చేసా మని సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇలా రెండు రోజుల్లోనే 10 మంది గర్భిణులను అకారణంగా వైద్యు లు లేరని, రక్త పరీక్షలు లేవని, రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకోలేరని, ఇక్కడ సౌకర్యాలు లేవనే వివిధ రకాల కారణాలతో వీరందరిని రిఫర్ చేసారని తెలిసింది. జులైలో చాలామంది గర్భిణులను ముఖ్యంగా రాత్రివేళల్లో వస్తున్న వారందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లితండాకు చెందిన వనిత అనే గర్భిణిని రిఫర్ చేయడంతో కామారెడ్డి దాటగానే అంబులెన్స్‌లో సాధారణ ప్రసవమైంది. గత నెల 9న రామారెడ్డి మండలం కన్నాపూర్‌కు చెందిన సవిత అనే గర్భిణిని సైతం వైద్యులు లేరని రిఫర్ చేయడంతో మార్గమధ్యలో అంబులెన్స్‌లో ప్రసవమైంది. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. వైద్యులుంట లేరు... కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్ వైద్యురాలు విజయలక్ష్మి మాత్రమే ఉన్నారు. సర్జన్లు ఇద్దరు ఉన్నారు. ప్రసవాలను డాక్టర్ విజయలక్ష్మి చూసుకుంటారు. ఆపరేషన్ అవసరమైతే ఈ ముగ్గురు వైద్యులు చేస్తున్నారు. రోజంతా విధులు నిర్వహిస్తున్న వీరు రాత్రిపూట ఉండక గైనిక్ వైద్యులు లేరని గర్భిణులను పంపించేస్తున్నారు. సాధారణ కాన్పులు కాకపోతే ఆపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటే డాక్టర్లు లేరని ఎమర్జెన్సీగా రిఫర్లు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం గర్భిణులు వస్తే మాత్రం సిబ్బంది చూస్తున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్ర ఆస్పత్రులో వైద్యులు లేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఇతర ఆస్పత్రుల నుంచి వైద్యులను డిప్యూటేషన్ వేసి మరిచిపోతున్నారు. వారు వెళ్లి పోగానే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. నూత నంగా వస్తున్న మహిళా వైద్యులు ప్రసవాలు, సీజరియన్లు చేయడం లేదు. కేవలం ఓపీ చూస్తున్నారు. దీంతో పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులు నరకం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ సౌకర్యాలు లేవంటున్నరు నేను పురిటి నొప్పులతో వస్తే గంటసేపు పరీక్ష చేసి ఇక్కడ సౌకర్యాలు లేవు అని పంపిచేశారు. లోపల దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే తిడుతున్నారు. మేం రెగ్యులర్‌గా ఎల్లారెడ్డిలో చూపించుకున్నామని ఇక్కడ చెకప్‌లు లేదని పంపిచేస్తున్నారు. -బోయ సంధ్య, గర్భిణి -
ఆస్పత్రుల ఎదుట ఆందోళన
నార్కట్‌పల్లి(నకిరేకల్) : ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌లో చోటుచేసుకున్నాయి. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వర్రె లక్ష్మి పార్వతమ్మ రెండో కాన్పు పురిటినొప్పులు వస్తుండడంతో సోమవారం భర్త వర్రె సత్తీష్, బంధువులు స్థానిక కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి తల్లికి బ్లీడింగ్ అవుతుందని, అందుకు ఆపరేషన్ చేయాలని చెప్పి రెండుసార్లు ఆపరేషన్ చేశారు. తల్లి కన్నుమూసింది. వైద్యులు సక్రమంగా చికిత్స అందించకపోవడం మూలంగానే తమ భార్య మృత్యువాతపడిందని భర్త ఆరోపించారు. లక్ష్మిపార్వతిని చూసేందుకు వచ్చిన బంధువులు దాదాపు గంట సేపు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎస్ఐ గోవర్ధన్, సీఐ క్యాస్ట్రోరెడ్డిలు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందినట్లు మృతురాలి భర్త ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నకిరేకల్‌లో చిన్నారి.. నకిరేకల్ : ఆస్పత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మూడు నెలల పసిపాప మృతి చెందిందని నకిరేకల్‌లో మంగళవారం ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆస్పత్రి ఎదు ట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని తాటికల్రోడ్డుకు చెందిన చినేని జానయ్య, శైలజకు చెందిన రమ్య(3నెలలు)కు సోమవారం వాంతులు విరేచనాలతో పాటు జ్వరం రావడంతో నకిరేకల్‌లోని సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాలకు తీసుకువచ్చారు. సదరు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి పంపించారు. చిన్నారి రమ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం ఉదయం అదే ఆస్పత్రికి తీసుకురాగా సదరు వైద్యశాల డాక్టర్ పాప పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుంబీకులు సదరు డాక్టర్‌మీద ఆందోళన వ్యక్తం చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా మృతి చెందినట్లు చెప్పడంతో రమ్య తల్లిదండ్రులు, కుటుంబీకులు సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా చిన్నారి మృతి చెందిందని వాపోయారు. ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి నకిరేకల్ సీఐ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీ సులు చేరుకుని చిన్నారి రమ్య తల్లిదండ్రులను, కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై సదరు డాక్టర్ నాంపల్లి శ్రీనివాస్‌ను వివరణ కోరగా చిన్నారి మృతికి సంబంధించి వైద్యం విషయంలో తన తప్పేమి లేదన్నారు. మూడు నెలల చిన్నారుల విషయంలో ఒక్కొక్కరికి శ్వాసకు సంబంధించిన ప్రభావాలు రావడంతో చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. -
కడుపులోనే చనిపోయిన పుట్టబోయే బిడ్డ
-
రవితేజ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి
మాచర్ల: వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందిన ఘటన మాచర్ల పట్టణంలోని రామా టాకీస్‌కి వెళ్లే రహదారిలో రవితేజ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దుర్గి మండలం ఆత్మకూరుకు చెందిన పేరువాల రాణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త సాగర్, బంధువులు ఆమెను మాచర్లలోని రవితేజ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆపరేషన్ చేశారు. అయితే, రాణి ఆపరేషన్ కాగానే మృతి చెందింది. ఆసుపత్రి నిర్వాహకులు 10.30గంటల వరకూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు వ్యవహరించారు. రక్తహీనత వల్ల తల్లి రాణి చనిపోయిందని, బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేదని తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంపై రాణి భర్త, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల రంగప్రవేశం ఆ తరువాత ఆస్పత్రి నిర్వాహకులు అధికార పార్టీ నాయకులను పిలిపించుకొని మంతనాలు జరపడం మొదలుపెట్టారు. నష్టపరిహారం చెల్లిస్తామని నచ్చచెప్పబోయారు. ఈ సమయంలో కొంత మంది ఎస్సీ నాయకులు ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ప్రాణాలు పోయినా బేరాలు చేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అర్బన్ సీఐ సాంబశివరావు, పట్టణ ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బందితో ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని, శాంతిభద్రతలు దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబాన్ని బతిమాలుకుని కేసు పెట్టకుండా లక్ష రూపాయలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చేసేదేమి లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బాధిత కుటుంబం నగదు తీసుకొని వెనుతిరిగి వెళ్లినట్లు సమాచారం. గతంలోనూ పలు ఆరోపణలు ఇదే వైద్యురాలు గతంలో ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ మరణానికి కారణమై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సెలవుపై వెళ్లిపోయింది. ఆమె పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తూ మరో మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ఫోన్లో సూచనలతో సిబ్బంది వైద్యం ..గర్భిణి మృతి
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిగా పక్క జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి నర్సింగ్‌హోంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణిని చిదిమేసింది. అనుభవజ్ఞులైన వైద్యులు లేనప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న సదరు అధికారి ఫోన్లో ఇచ్చిన సూచనలు గర్భిణి పాలిట మృత్యుపాశమైంది. వివరాలిలా.. ఏడు నెలల గర్భంతో ఉన్న బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన పద్మమ్మ కడుపునొప్పితో బాధపడుతుండగా భర్త శివశంకర్ వైద్యం కోసం పట్టణంలోని సత్యసాయి నర్సింగ్ హోంకు బుధవారం రాత్రి తీసుకువచ్చారు. ఆమెకు వైద్యాన్ని ప్రారంభించిన ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విపరీతమైన వాంతులు అయ్యాయి. ఇంజెక్షన్ వికటించిందంటూ గుర్తించిన బాధితులు అక్కడి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం, అనుభవజ్ఞులైన డాక్టర్లెవరూ మహిళను చూడకపోవడంతో ఆ రోజు అక్కడే కాలం గడిపారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఆందోళన గర్భిణి మృతితో ఆగ్రహించిన బంధువులు శుక్రవారం ఉదయం సత్యసాయి నర్సింగ్ హోం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో దిగి వచ్చిన నర్సింగ్‌హోం యాజమాన్యం తమపై కేసు నమోదు చేయకుండా చూసుకున్నారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం అందించేందుకు ఒప్పుకుని రాజీపడ్డారు. గతంలోనూ ఇక్కడ నిర్లక్ష్యంగా వైద్యం నిర్వహించారంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరగా ఇందులో తమ తప్పేమీ లేదన్నారు. రోగికి రక్తం తక్కువగా ఉండటం వల్లే అనుకోకుండా ప్రాణం మీదకి వచ్చిందన్నారు. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఇక మీదట జరగకుండా చూసుకుంటామని వారు పేర్కొన్నారు. -
ఎంజీఎంలో జూనియర్ డాక్టర్ వీరంగం
ఎంజీఎం : వరంగల్ మహాత్మాగాంధీ మోమోరియల్ ఆస్పత్రిలో పరిపాలనాధికారుల కొరత.. పట్టింపు లేని తనంతో పాలన రోజురోజు దిగజారుతుంది. రోగులు తమ సమస్యల ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. ఏకంగా ఓ జూనియర్ వైద్యురాలు రోగి బంధువుపై మండిపడుతూ నేను వైద్యం అందించనూ... ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో అని అక్కడ ఉన్న బాటిల్‌ను విసిరేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతటితో ఆగక మీపైన ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరించడంతో సదురు రోగి భయపడి ఆస్పత్రి నుంచి పారిపోయిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆ ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరి ఫోన్‌ను లాక్కుని జూనియర్ వైద్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.. చివరకు ఈ ఘటన సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు రోగుల బంధుమిత్రులకు అండగా నిలిచి మట్టెవాడ పోలీస్‌స్టేషన్ వైద్యురాలిపై ఫిర్యాదు చేశారు. వీరంగం ఇలా.. వరంగల్ లేబర్ కాలనీ చెందిన నమిండ్ల సాగర్ క్రిమిసంహారక మందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 22న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటైన సాగర్ మొదట ఏఎంసీలో చికిత్స అందించిన వైద్యులు అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుకు తరలించారు. క్రిమిసంహారక మందు తాగిన సమయంలో రోగి మానసిక పరిస్థితి సక్రమంగా ఉండని పక్షంలో రోగి వద్ద వారి బంధుమిత్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోగి వద్ద బంధుమిత్రులు ఉండడాన్ని సహించని వైద్యురాలు వారిపై దురుసుగా ప్రవర్తించడంతో వైద్యురాలికి, బంధుమిత్రుల మధ్య వివాదం నెలకొంది. ఎంజీఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళ రోగికి బంధుమిత్రులు కావడంతో ఆమె వైద్యురాలిని ప్రశ్నించింది.ఈ క్రమంలో వివాదం మరింత ముదిరింది. నీ ఫై ఫిర్యాదు చేస్తా.. నాకు హక్కు ఉందంటూ వైద్యురాలు ఊగిపోతూ నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అని స్వీపర్‌పై ఎంజీఎం పరిపాలనాధికారులకు ఫిర్యాదు చేసింది. అంతటి ఆగకుండా మీపై కూడా కేసులు పెడుతామని రోగి బంధుమిత్రులను భయబ్రాంతులకు గురిచేసింది. పారిపోయిన రోగి.. వైద్యం అందించే విషయంలో జూనియర్ వైద్యురాలికి, రోగి బంధుమిత్రులకు జరుగుతన్న విషయాన్ని గమనించిన సదరు రోగి భయబ్రాంతులకు గురయ్యాడు. తనకున్న సమస్యలతో సతమతమవుతుంటే.. మరో సారి వైద్యురాలు తమపై కేసు పెడతాననడంతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాత్రూమ్ వెళ్ళివస్తానని చెప్పి కనబడకుండా పారిపోయాడు . ఈ ఘటనతో రోగి బంధుమిత్రులు ఒక్కసారిగా మానసిక వేదను గురై రోదిస్తూ మట్టెవాడ పోలీసులను ఆశ్రయించారు. విలేకరి ఫోన్ లాక్కున్న వైద్యులు.. తమపై ఎంజీఎంలోని వైద్యులు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారనే సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అక్కడికి వెళ్లి జరిగిన ఘటనపై రోగి బంధ«మిత్రుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ వైద్యులు అక్కడికి చేరుకుని మీరు ఎంజీఎం ఆస్పత్రిలో మా ఘటనలను ఏలా చిత్రీకరిస్తున్నావు అంటూ దౌర్జన్యానికి దిగుతూ విలేకరి ఫోన్‌ను లాక్కున్నారు. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు, రోగిబంధుమిత్రులు జూనియర్ డాక్టర్ల తీరుపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మట్టెవాడ పోలీసుల సమక్షంలో ఫోన్ లాక్కోవడం తప్పేనని ఒప్పుకుంటూ ఫోన్‌ను అప్పగించారు. జూనియర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి ఎంజీఎం ఆస్పత్రిలో నమిండ్ల సాగర్‌పై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ డాక్టర్‌పై చట్టపరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు జన్ను భాస్కర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్, ఎమ్మార్పీఎస్ తూర్పు ఇంచార్జీ ఈర్లకుమార్ మాదిగలు డిమాండ్ చేశారు. వైద్యం అందించాలన్నందుకు ఉద్యోగం తీసేశారు... మా అల్లుడు సరైన వైద్యం అందించాలని వైద్యురాలిని అడిగినందుకు నాపై మండిపడడంతో పాటు నా ఉద్యోగం తీసేశారని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వీపర్ రజిత రోదిస్తూ పేర్కొంది. రెక్కాడితే కాని డొక్కడాని తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు వైద్యురాలు తమపై పరిపాలనాధికారులు ఫిర్యాదు చేసిందన్నారు.దీంతో ఎంజీఎం కాంట్రాక్టర్ ఖాజా తనను విధులకు రావొద్దంటూ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పారిపోయిన తన అల్లుడిని తమ వద్దకు చేర్చాలని పోలీసులను వేడుకుంది. –రజిత, ఆస్పత్రి స్వీపర్మట్టెవాడ -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేసిన వైద్యులు
షాద్‌నగర్‌టౌన్ : ప్రసవం కోసం ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది... వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఆపరేషన్ సమయంలో ఆమె కడుపుకోసి కాటన్‌తో మూసేసి కుట్టేశారు. ప్రస్తుతం బాధిత మహిళ హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. 2017 అక్టోబర్ 3న కుటుంబ సభ్యులు ఆమెను ప్రసవం కోసం షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో బస్టాండ్ ఎదురుగా ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేశారు. హరిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం హరిత స్వగ్రామానికి వెళ్లింది. ఆపరేషన్ నిర్వహించిన రోజు నుంచి హరిత ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో దిగులు చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు. కాటన్ పేగులకు చుట్టుకుని అస్వస్థత.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు హరితకు స్కానింగ్ నిర్వహించారు. కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించి బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. ప్రసవం కోసం వచ్చినప్పుడు ఆపరేషన్ నిర్వహించి కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేయడమే అస్వస్థతకు కారణమని వైద్యులు నిర్ధారించారు. హరిత కడుపులో ఉన్న కాటన్ పేగులకు చుట్టుకొని పోవడంతో ఉస్మానియా వైద్యులు హరితకు మరోసారి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుప్రతిలో చేర్చగా అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతోంది. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరిత ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు హరిత కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి సోదరుడు పి.రవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్‌లోని విజయ ఆసుపత్రి వైద్యులు హరితకు ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి హరిత కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారిందని రవి తెలిపారు. దీనికి కారకులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రవి పేర్కొన్నారు. ఆపరేషన్ మా ఆసుపత్రిలో జరగలేదు హరితకు విజయ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయ లేదు. కేవలం ఆమెకు ఓపీని మాత్రమే చూశాం. హరితను పరీక్షించిన అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాలని సూచించాం. పట్టణంలోని సేవాలాల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. హరిత అనారోగ్యం పాలవడానికి మా ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు. – డాక్డర్ చందులాల్‌రాథోడ్, విజయ ఆసుపత్రి వైద్యుడు కేసు నమోదు చేశాం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హరిత అనారోగ్యానికి గురైందని వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. హరితకు ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించి ఆమె కడుపులో కాటన్ ఉంచి కుట్లు వేశారని బాధితురాలి సోదరుడు రవి విజయ ఆసుపత్రి వైద్యులు విజయ, చందూలాల్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం. – అశోక్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్ -
పురిటిలోనే పసికందు మృతి
చీపురుపల్లి: ప్రసవం కోసం వస్తే పట్టించుకోలేదు....ఆస్పత్రిలో చేరితే కనీసం వైద్య పరీక్షలు చేయలేదు...ప్రసూతి వార్డు వైపు సిబ్బంది కన్నెత్తి చూడలేదు....సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు నూరేళ్లు బతకాల్సిన తమ బిడ్డ పురిటిలోనే లోకాన్ని విడచివెళ్లిపోయాడని కొత్తపేట గ్రామానికి చెందిన బాలింత పొదిలాపు స్వాతి, ఆమె భర్త రాంబాబు, తదితరులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన పొదిలాపు స్వాతికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో పది గంటలు సమయంలో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ గదిలో ఓ వైద్యురాలు పరీక్షలు నిర్వహించి అప్పుడే ప్రసవం రాదని చెప్పి అంతవరకు ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దీంతో వారు గర్భిణిని ప్రసూతి వార్డులో చేర్పించారు. ఆ తర్వాత గర్భిణిని ఎవ్వరూ పట్టించుకోలే దు. మధ్యాహ్న సమయంలో స్వాతి బాత్రూమ్కు వెళ్లగా అక్కడ ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో దిగువస్థాయి సిబ్బంది వచ్చి ఆమెను బెడ్‌పై వేశారు. అప్పటికే ఆమె మగబిడ్డను ప్రసవించింది. అప్పటికీ వైద్యులు హాజరవ్వకపోవడంతో కాసేపట్లో బిడ్డ మృతి చెందింది. వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడమని చెబితే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయేవారమని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. -
ఫాంహౌస్‌లో బయటపడ్డ ఆరు మృతదేహాలు
-
కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ మృతి
-
పురిట్లోనే శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయిందని బంధువుల ఆరోపణ మృతశిశువుతో ఆస్పత్రి ఎదుట ధర్నా తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయిందంటున్న వైద్యులు పరకాల : అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగిన బిడ్డ.. గర్భం నుంచి బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే ప్రాణాలు విడిచింది. కనులు తెరవక ముందే కన్నుమూసింది. డ్యూటీ డాక్టర్ సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హన్మకొండ రాము–లావణ్య(సవిత)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాము పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో హమాలీ పనిచేస్తుండగా లావణ్య కూలీ పని చేస్తోంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం లావణ్య మూడోసారి గర్భం దాల్చింది. హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నరీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఏఎన్ఎం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో మంచి సదుపాయాలున్నాయని చెప్పి నిండు గర్భిణి అయిన లావణ్యను ఇక్కడికి తీసుకొచ్చింది. శుక్రవారం లావణ్యతోపాటు భర్త రాము కూడా వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు లావణ్యను ఇంటికి తీసుకెళ్లండని, నొప్పులు వస్తే తీసుకురావాలని చెప్పారు. దీంతో కామారెడ్డిపల్లికి లావణ్యను తీసుకెళ్లారు. శనివారం ఉదయం నొప్పులు రావడంతో రాము ఆమెను సివిల్ ఆస్పత్రికి తరలించాడు. అయితే డాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం రాము డ్యూటీ డాక్టర్‌కు తన భార్య విషయం చెప్పాడు. దీంతో డ్యూటీ డాక్టర్ పద్మజ వచ్చి లావణ్యను డెలివరీ కోసం గదిలోకి తీసుకెళ్లారు. సాధారణ డెలివరీతో లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు బాగానే ఉన్న శిశువుకు ఆక్సిజన్ అందించడంలో డాక్టర్లు పట్టించుకోలేదు. శిశువును ప్రైవేటు ఆస్పత్రిలో చూపించడం కోసం తీసుకుపోతుండగా మృతిచెందింది. మృతశిశువుతో ధర్నా.. ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే శిశువు చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతశిశువును చేతుల్లో పట్టుకొని ఆస్పత్రిలోకి వెళ్లకుండా బైఠాయించారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. ఎస్సై దీపక్ అక్కడకు చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతశిశివునే బయటకు తీశాం : డ్యూటీ డాక్టర్ పద్మజ ఆస్పత్రిలో చేరిన లావణ్యను పరిశీలిస్తూనే ఉన్నాం. చనిపోయిన శిశువు పూర్తిగా బయటకు వచ్చింది. అందులో మా తప్పు లేదు. డెలివరీ చేయకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం జరిగేది. విచారణ చేస్తున్నాం: డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఇన్చార్జీ సూపరింటెండెంట్ ఆస్పత్రిలో చనిపోయిన శిశువు ఘటనపై విచారణ చేస్తున్నాం. డ్యూటీ డాక్టర్ పద్మజ, ఏఎన్ఎంలు స్వరూప, వాణి ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నిర్లక్ష్యం ఉన్నట్లు తెలితే చర్యలు తీసుకుంటాం. -
వైద్యుల నిర్లక్ష్యానికి తల్లిబిడ్డా మృతి
-
వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరు మృతి
-
చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన
-
చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యుమోనియాతో ఆరు నెలల పసికందు చనిపోయాడు. అయితే, వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేశారు. బాధితుని కథనం ప్రకారం... పోరుమామిళ్ల మండలం టేకులపేటకు చెందిన ప్రసన్నకుమార్, మరియమ్మ దంపతులకు తమ ఆరునెలల కుమారుడు ఉన్నాడు. న్యుమోనియా సోకటంతో ఈ నెల 27వ తేదీన కడపలోని శివయోగి చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ పర్యవేక్షణలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. చిన్నారి కోలుకోకపోవటంతో బుధవారం రాత్రి డాక్టర్‌ను సంప్రదించారు. అయితే, బాబు బాగానే ఉన్నాడని, మీకేమైనా అయితే పరీక్షలు చేయించుకోండంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. ఇంతలోనే తెల్లవారు జామున మూడు గంటలకు పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు. దీనిపై తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. తాము ఆస్పత్రికి వచ్చిన నాటి నుంచి సిబ్బంది సరిగా స్పందించటం లేదని ఆరోపించారు. తమ చిన్నారి మృతికి వైద్యుడే కారణమని పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డాక్టర్ నిర్లక్ష్యానికి రూ.3 లక్షల జరిమానా!
మెదక్ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు సంగారెడ్డి క్రైం: రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేసిన డాక్టర్ తీరును తప్పుపడుతూ బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని వినియోగదారుల ఫోరం చైర్మన్ పాటిల్ విఠల్‌రావు ఆదేశించారు. ఈ వివరాలను సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అందోల్ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన చాకలి కమలమ్మ 2011 నవంబర్ 14వ తేదీన ఇంట్లో జారిపడగా కుడి కాలు విరిగింది. దీంతో అదేరోజు చికిత్స నిమిత్తం గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ ఆనంద్‌నాయక్ ఆధ్వర్యంలో కమలమ్మకు ఆపరేషన్ చేసి కాలులో రాడ్ వేశారు. కొన్ని రోజుల తర్వాత కాలు నొప్పి రావడంతో ఆస్పత్రికి రాగా 2012 ఫిబ్రవరి 17వ తేదీన మళ్లీ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో కమలమ్మ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని, అనేక ఇబ్బందులు పడాల్సివచ్చిందని పేర్కొంటూ కమలమ్మ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఫోరం కమలమ్మకు రూ.3 లక్షల పరిహారం, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. -
వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి
పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.... స్థానికంగా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చెరుకూరి రామారావు(40) కడుపులో మంటగా ఉండడంతో ప్రసాద్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యుడు ప్రసాద్.. రామారావుకు ఇంజెక్షన్ ఇచ్చి, మందులు రాసిచ్చారు. అయితే ఆ తర్వాత 10 నిముషాలకే రామారావు ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. అతడు మృతి చెందినట్టు వైద్యుడు ధ్రువీకరించారు. కాగా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రామారావు మృతి చెందినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వైద్యుని నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
వైద్యుని నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి రమేష్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుని నిర్లక్ష్యమే కారణమని మృతుని తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మృతదేహంతో ఆస్పత్రి వద్ద బంధువులు ధర్నాకు దిగారు. దాంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. -
న్యాయం చేయండి
గర్భసంచి శుద్ధి పేరుతో చేసిన వైద్యం వికటించడంతో వివాహిత మృ తి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతిచెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన యువతి బంధువులు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన మరిసెల్వం నాలుగవ కుమార్త్తె సుజితకు అదే ప్రాం తానికి చెందిన మునీంద్రకు 2012 ఆగష్టులో వివాహం జరిగింది. వారికి సం తానం లేకపోవడంతో తిరువళ్లూరులోని స్త్రీల వైద్య నిపుణురాలు విజయలక్ష్మీ వద్ద చికిత్స చేరుుంచుకున్నారు. పలు చికిత్సలు చేసిన విజయలక్ష్మి గర్భసంచిని శుద్ధి చేయూలని, అందుకు తమ వద్ద సౌకర్యాలు లేవని పేర్కొంటూ ఆవడిలోని గ్రేస్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిం చారు. వారు ఆవడిలోని గ్రేస్ మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో డాక్టర్ లలిత వద్ద 2014 ఫిబ్రవరి 26 నుంచి చికిత్స చేరుుంచుకున్నారు. కొంతకాలం మం దులు వాడిన తర్వాత పోరూర్‌లోని రామచంద్ర ఆస్పత్రికి వెళ్లాలని లలిత వారికి సూచించారు. దీంతో వారు 2014 మార్చి 10న రామచంద్ర వైద్యశాలకు వెళ్లారు. మూడు రోజులు చికిత్స అనంతరం 13న గర్భసంచి శుద్ధి చేసేం దుకు సుజితను తీసుకెళ్లారు. 14వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు సుజిత మరణించింది. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని, ముగ్గురు వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయూలని కోరుతూ సోమవారం కలెక్టర్ వీరరాఘవరావుకు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఆర్డీవో విచారణ చేపట్టాలని సుజిత తండ్రి మరిసెల్వం కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.