పోలీసులతో వాగ్వాదం చేస్తున్న బాధితులు
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ‘‘నా భార్య బిడ్డ కావాలంటొంది.. మాకు ఏడేళ్ల తర్వాత బిడ్డ పుడుతుందనుకుంటే కడుపులోనే చంపేసి చేతికిచ్చారు’’ అని బుధవారం కామారెడ్డి ఆస్పత్రిలో మృతి చెందిన శిశువు తండ్రి రమేష్ వైద్యులు, పోలీసులు ఎదుట వాపోయాడు. ఆస్పత్రిలో బుధవారం రాత్రి శిశువు మృతి చెందిన సంఘటనలో గురువారం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ప్రసవం గది ముందు ఆందోళన చేశారు.
అక్కడే నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి బయట ధర్నా చేశారు. పోలీసులు, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. గైనిక్ వైద్యురాలు పట్టించుకోకపోవడం, నర్సులు నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంవో కాళ్లు మొక్కి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
చదవండి: శుభకార్యానికి వచ్చి .. భర్తకు పూటుగా మద్యం తాగించి.. ఆతర్వాత
Comments
Please login to add a commentAdd a comment